తెనాలి రామకృష్ణకవి చరిత్రము/మామిడిపండ్లు

వికీసోర్స్ నుండి

దను, చాలునా?' యనెను. రామకృష్ణుడు మిక్కిలి సంతసించి వెడలిపోయెను.

వారమురోజులు కడచెను. రామకృష్ణుడు తన బందుగుల జూచుటకయి కలుబరిగె నగరమునకు బోయెను. వెళ్ళిన నాలుగు రోజులకు ఆ బంధువునికడనుండి పెద్దన్న , పింగళిసూరన్న మున్నగు కవుల యింటికి రామకృష్ణుడు జ్వరపీడితుడై మరణించెనని లేఖలు వచ్చెను. నగరమంతయు క్షణములో నావార్త వ్యాపించెను. అట్టి హాస్యగాడు దొరకడని వర్తకులనిరి. 'మంచిస్నేహితుని, కవిని, గోల్పోయితి' నని రాయలు కన్నీ రువిడిచి వెంటనే అయిదువేల దీనారములను రామకృష్ణుని భార్యకంపెను. పదునైదు దినములు గడచెను. రామకృష్ణకవి కలబరిగె నగరమునుండి తిరిగివచ్చి, యాస్థానమునకు జనెను. రాయలు, తక్కుంగల వారు 'ఇదియేమిచిత్రము? నీవు మృతినొందితివని లేఖవచ్చెగదా?' యనిరి. రామకృష్ణుడు 'అవును, నేను మృతినొందినమాట వాస్తవమే కాని యమధర్మ రాజు 'ఇది యేమి! వీనికింకను గొంతకాలము గడువున్నదని 'ఓరీ! మీ రాయలవారు నీ భార్య కయిదువేల దీనారములంపినారు. ఆ ధనమును సుఖముగా ననుభవించిర 'మ్మనగా దిగిగివచ్చితిని' అనెను.

'ఆహా! అటులనా! ఈఅయిదువేల దీనారముల బొందుట కెత్తిన గొప్పయెత్తు'అని రాయలు మందహాస మొనరించెను.


29 మామిడి పండ్లు

రాయలతల్లి నాగాంబ మరణించుటకు బూర్వము రాయలను బిలిచి 'నాయనా! నాకు మామిడిపండ్లు తినవలయునని యున్నది.' అనెను. వెనువెంటనే రాయలు ఎంతఖరీదైనను సరే ఎచ్చటనున్నను సరే ఎన్నిదొరికిన నన్ని మామిడిపండ్లను గొనిరండు' అని భటులను నల్దెసలకంపెను. తిరిగి తిరిగి భటులు ఫలముల గొనివచ్చునంతలో నాగాంబ యసువుల బాసెను. తనతల్లి యవసానదశలో గోరినకోరిక తీర్చజాలక పోయితిగదా' యని రాయలు పరిమితిలేని విచారము నొందెను.

విషణ్ణవదనులైయున్న రాయలనుగాంచి, తాతాచార్యులవా రిట్లనిరి – 'ప్రభూ! మీరు గతించినదానికై వగచిన బ్రయోజన మేమియును లేదు. బంగారు మామిడిపండ్లను జేయించి, బ్రాహ్మణులకు దానమిచ్చినయెడల నామె కోరకయుదీఱును. మీ మనస్తాపముం దీరును' అనెను. ఆమాటలు నచ్చగా రాయలట్లేయని బంగారు మామిడిపండ్లనుజేయించెను. లెక్క లేనంతమంది భూసురులు గుంపులు గుంపులుగా రాసాగిరి. ప్రతిసంవత్సరమును గొన్నివేల దీనారము లిందుకు వ్యయమైపోవుచుండుటచే బెద్దనాది కవులు భీతచేతస్కులై రామకృష్ణకవిని హెచ్చరించిరి.

సరేయని రామకృష్ణుడు దేశదేశములనుండి దురాశాపరులై , వచ్చిన బ్రాహ్మణులున్న భవనముకడ కరిగి, 'బ్రాహ్మణోత్తములారా! మీకందఱకును మామిడిపండ్లనిచ్చుటకు ముందు రాయలవా రొక పద్దతిని దెలియజేయమనినారు. ఒక్కొక్కపండు కావలసినవారు ఒక్కొక్కవాత పొందవలయును. రెండుపండ్లు కావలసినవారు రెండువాతలను బొందవలయు' నని పలుక, నా బ్రాహ్మణులు విశ్వసించి, ఒక్కొక్కవాతను బొందిరి. కొంతమంది రెండేసి వాతలను మెందిరి. తరువాత రాయలువచ్చి బ్రాహ్మణులందఱకును మామిడి పండ్లీయఁబోయెను. రెండువాతలు పొందిన ద్విజుఁ డొకఁడు 'అయ్యా! నేను రెండ వాతలు వేయించుకొన్నాను. నాకు రెండు పండ్లీయవలెను' అనెను.

'వాత లేమిటి' అని రాయలు నాశ్చర్యముగాఁ బలుక నా బాహ్మణులందఱును దమవాతలఁ చూపించిరి. రాయలు ముక్కుపై వ్రేలిడుకొని నిర్విణ్ణుడయ్యెను. రామకృష్ణునకు వెంటనే కబురంపి, “నీకు మతిపోయినదా? నేను సంతోషముగా సువర్ణచూతఫలము లీయఁబోవ నీవందరకును వాతలిడు టేమి?' అనగా రామకృష్ణుఁడు 'మహారాజా! నేను చెప్పునది సావధానచిత్తులరై యాలకింపుడు. మాతల్లి వాతరోగపీడితయై చనిపోవుచు వాతలు, వాతలు అని కలవరించుచు మృతినొందెను. ఆమె ఆత్మసంతృప్తికై యింతమంది బ్రాహ్మణులు మఱల నొకచోట కలియరని యెంచి, యాఫలము నాకు దక్కుటకై వాతల బెట్టించితిని' అని వాక్రుచ్చెను.

తాతాచార్యుల సలహా ననుసరించి, తానొనరింపఁ బూనిన దకృత్యమని బోధింపఁజేయుటకై రామకృష్ణుడు పన్నిన పన్నుగడ యని గ్రహించి రాయ లా దానమును జేయుటమానెను.


30 చిన్నా దేవి

రాయలు భార్యలందఱిలో జిన్నా దేవియెడ నత్యంతానురాగ యుక్తుడై యుండును. చిన్నా దేవి నందఱివలెగాక ప్రత్యేకానురాగముతో జూచునని యెల్లరకును దెలియును. రామకృష్ణునితో గూడ రాయలు చాలసార్లు 'కవిచంద్రమా ! ఇందఱు సతులలో నాకొక్క చిన్నా దేవియెడలనే యంత యనురాగమేల యుండవలయును? నిజముగా నిది పూర్వజన్మ ఋణానుబంధమైయుండు ననెడివాడు. రామకృష్ణు డొకటిరెండుసార్లట్లు విని 'రాజేంద్రా ! నాకొకసందేహము భయము కలుగుచున్నది. 'అతి సర్వత్రవర్జయేత్తను సూత్రానుసారము, అధికానురాగము, అపరిమితప్రేమ తుదకు వైరముగాఁ బరిణమించుట సహజము'అనెను. రాయలు 'వెఱ్ఱివాడా! చిన్నాదేవియెడ నాకీజీవితములో భేదాభిప్రాయ మెన్నడును కలుగదు అనెను.

కొన్నాళ్ళకు రాయ లొకనాడు చిన్నాదేవితో గలిసి సౌధము పైయంతస్తున గూర్చుండి మలయమారుత సౌఖ్యము ననుభవించుచు నేవోకొన్ని ప్రశ్నలడిగెను, చిన్నాదేవి తన పుట్టినింటివారిం గూర్చి