తెనాలి రామకృష్ణకవి చరిత్రము/చిన్నాదేవి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

లీయఁబోవ నీవందరకును వాతలిడు టేమి?' అనగా రామకృష్ణుఁడు 'మహారాజా! నేను చెప్పునది సావధానచిత్తులరై యాలకింపుడు. మాతల్లి వాతరోగపీడితయై చనిపోవుచు వాతలు, వాతలు అని కలవరించుచు మృతినొందెను. ఆమె ఆత్మసంతృప్తికై యింతమంది బ్రాహ్మణులు మఱల నొకచోట కలియరని యెంచి, యాఫలము నాకు దక్కుటకై వాతల బెట్టించితిని' అని వాక్రుచ్చెను.

తాతాచార్యుల సలహా ననుసరించి, తానొనరింపఁ బూనిన దకృత్యమని బోధింపఁజేయుటకై రామకృష్ణుడు పన్నిన పన్నుగడ యని గ్రహించి రాయ లా దానమును జేయుటమానెను.


30 చిన్నా దేవి

రాయలు భార్యలందఱిలో జిన్నా దేవియెడ నత్యంతానురాగ యుక్తుడై యుండును. చిన్నా దేవి నందఱివలెగాక ప్రత్యేకానురాగముతో జూచునని యెల్లరకును దెలియును. రామకృష్ణునితో గూడ రాయలు చాలసార్లు 'కవిచంద్రమా ! ఇందఱు సతులలో నాకొక్క చిన్నా దేవియెడలనే యంత యనురాగమేల యుండవలయును? నిజముగా నిది పూర్వజన్మ ఋణానుబంధమైయుండు ననెడివాడు. రామకృష్ణు డొకటిరెండుసార్లట్లు విని 'రాజేంద్రా ! నాకొకసందేహము భయము కలుగుచున్నది. 'అతి సర్వత్రవర్జయేత్తను సూత్రానుసారము, అధికానురాగము, అపరిమితప్రేమ తుదకు వైరముగాఁ బరిణమించుట సహజము'అనెను. రాయలు 'వెఱ్ఱివాడా! చిన్నాదేవియెడ నాకీజీవితములో భేదాభిప్రాయ మెన్నడును కలుగదు అనెను.

కొన్నాళ్ళకు రాయ లొకనాడు చిన్నాదేవితో గలిసి సౌధము పైయంతస్తున గూర్చుండి మలయమారుత సౌఖ్యము ననుభవించుచు నేవోకొన్ని ప్రశ్నలడిగెను, చిన్నాదేవి తన పుట్టినింటివారిం గూర్చి యేదో యాలోచించుకొనుచుండుటచే నాప్రశ్నలకు సమాధానము బలుకదాయెను. 'ఏమాపరధ్యాన' మని రాయలు హెచ్చరింపగా నామె పక్కున పెద్దగానవ్వెను. రాయల కానవ్వు సంతసము కల్గించుటకు మాఱస్యహము కలిగించెను. కోపోద్దీపితు డయ్యును రాయలామె నేమియు ననక యటనుండి వెడలిపోయెను. దినములు, వారములు, మాసములు గడచెను. రాయలు చిన్నాదేవి యతఃపురమున కరుగడాయెను.

చిన్నా దేవి దయార్ద్రహృదయఁయగుట నందఱిగౌరవమునకుఁ బాత్రురాలాయెను. ఆకారణమున రాయ లిట్లకారణముగ నామెతో మాట్లాడుట మానెనని వినిన వారందఱును వర్ణనాతీతమగు ఖేదము నొందిరి. రామకృష్ణునకు జిన్నా దేవియెడలగల గౌరవమునకు బరిమితిలేదు. ఆతఁ డామె యంతఃపురమునకుఁబోయి, జరిగినదంతయు దెలిసికొని 'అమ్మా! రాయలు నీయెడ ప్రసన్నుడగుటకు చక్కని యుపాయముం బన్నెదను. కొలది దినములు వేచియుండు' మని ధైర్యము చెప్పి రాయలుకడ కరిగి 'మహా ప్రభూ! నాకు జిరకాలమునుండి కాశీ రామేశ్వరయాత్రల జేసి రావలయునని యున్నది. మఱల నొక మాసములో వత్తు'నని పలికి, కొంతధనము దీసికొనెను. అతడు వారణాసికిఁ బోవక రహస్యముగా నింటనేయుండి బంగారముతో వడ్లగింజల జేయించి, యొకనాడు అర్ధ రాత్రివేళ నూరి వెలుపలనున్న సత్రములోనికేగి, తెల్లవారినపిదప తాను వారణాసినుండి తిరిగివచ్చితినని కబురంపెను. రాయలు మంగళతూర్యారావములు భోరుకలంగ, రామకృష్ణకవి నూరేగించి, తన సౌధములోనికి గొనిపోయి 'రామకృష్ణకవీ ! విశేషములేమి?' యని పశ్నింప నాతఁడు మహారాజా! కాశీలో సదానందసాధువను గొప్పసన్యాసి నాశ్రయించి, బంగారు వడ్లగింజల గొనివచ్చినాను. బంగారపు ధాన్యము పండును' అనెను, ఆ వడ్లగింజల బాతిపెట్టింపదలంచి 'ఱేపే శుభదినము. ఱేపు బాతిపెట్టుదమా?' యనెను. సరేయని రామకృష్ణుడు పలికి, మఱునాటి సాయంకాలము రాయలు, ఆవడ్లు మొలిపించుటకు దున్నించిన స్థలము కడకు వెళ్ళెను. ఆవింత చూచుటకు బెక్కుమంది పౌరులు, కవులు నరిగిరి. రాయలు 'ఇక నవశిష్టమే'మని యడుగ రామకృష్ణుడు ‘మహాప్రభూ ! ఒక స్వల్పవిషయమును దమతోఁ జెప్పమఱచినాను, పెద్దగా నవ్వనివారే యీవడ్లగింజలను బాతిపెట్టుట కర్హులు' అనెను, 'ఎవరు గట్టిగా నవ్వనివారుందురు? అందరును యెప్పుడో యొకప్పుడు గట్టిగా నవ్వితీరుదురు' అని రాయలనగా రామకృష్ణుడు 'ప్రభువువారు గట్టిగ నవ్వినజాడ కానరారుగదా. తాము చల్లవచ్చును' అనెను. అబ్బే! నేను జూలసార్లు గట్టిగ నవ్వియుంటిని' అని రాయలునుడివెను.

'తమ సతియగు చిన్నా దేవిగారు నవ్వరేమో?'

'ఆమెకూడ నవ్వును. అందఱును నవ్వుదురు గట్టిగా నవ్వనట్టి వారీప్రపంచములో నెవ్వరుండరు. -

'ఆవిషయ మెరిగి తామెట్లు చిన్నాదేవిగారితో మాట్లాడుట యంతఃపురమునకు బోవుట మానినారు?' అని రామకృష్ణుడు ప్రశ్నించి నంతనే రాయలు సిగ్గుపడి కారణమ, లేకయే ప్రేమానురాగమూర్తి యగు నామెను బరిత్యజించి, మహాఘ మొనర్చితినని గ్రహించి 'రామకృష్ణకవీ! నాకు జక్కగా బుద్ధిచెప్పినావని పశ్చాత్తాపము నొంది చిన్నాదేవి నెప్పటియట్ల గౌరవింపసాగెను. రామకృష్ణకవి యొనరించిన మహోపకారమునకు గృతజ్ఞతాపూర్వకముగ జాల ధనమిచ్చి సత్కరించెను.