తెనాలి రామకృష్ణకవి చరిత్రము/దొంగలచే నీరు తోడించుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

జరుగదు అని చెప్పిరి. సరేయని రామకృష్ణుడు తగిన యదనుకై నిరీక్షించుచుండెను,

రాయలొక నాఁడు కొలువుకూటమున నున్న కవుల నందరను దిలకించి యిట్లు సమస్యనిచ్చి పూరించుమనెను.

'చ. స్తుతమలియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గెనో
     యతులిత మాధురీమహిమ........

రామకృష్ణకవి లేచి యిట్లు పద్యములోని మిగిలిన భాగము పూర్తిచేసెను.

     ......హా తెలిసెన్ ! భువనైక మోహనో
     ద్ధతకుమారవార వనితాజనతా ఘనతాపహారిసం
     తతమధురాధరోదితసుధారసధారలఁ గ్రోలగాజుమీ!

వారాంగనపాన మొనరించుటచేతచే ధూర్జటి కవిత్వ మంత రసవంతమై యున్నదను భావము నలుగురకు బోధపడుటనే ధూర్జటి సిగ్గుపడి వికటకవి నేమియు ననఁజాలక యూరకుండెను. రాయలు ధూర్జటిని కొన్నిరోజులలైనపిదప నంతఃపురమునకుఁ బిలిపించి, వేశ్వ సహవాసము మానుమని మందలించెను.

5 దొంగలచే నీరు తోడించుట

శ్రీకృష్ణదేవరాయ లొకప్పుడు కైదీలను బరీక్షించుటకై కారాగృహమున కేగెను. అపరాధులందరును దమతమ యపరాధములను రాయల కెరింగించుచుఁ దమకు నిర్బంధవిమోచనముఁ గలిగింపుమని ప్రార్థించుచుండిరి. ఇరువురు దొంగలు రాయలు తమ్ము “మీరు చేసిన యపరాధములఁ దెలుపు' డనినంత నే యిట్లు చెప్పిరి. మహారాజా! మాకు చౌర్యమున నద్భుతము ననుపమానము నగు నేర్పు కలదు. మేము గజదొంగలము. ఈవృత్తిని మానుదుము మమ్ము క్షమించి విడిచిపుచ్చుడు. తమరు మాకు చౌర్యమున గల గౌశలమును బరీక్షింపవచ్చును.

రాయలు 'సరే' మీరు నేఁటిరాత్రి రామకృష్ణకవి యింట నెవరికిని బ్రమాదము గలుగకుండ నేదైన యపహరించి గొనితెండు పట్టుబడినచో మీకు విముక్తి యింతలో లేదుగాని జయప్రదముగ చౌర్యమొనరించినచో మీకు విమోచనము గల్గింతును' అనెను. వల్లెయని యాచోరాగ్రేసరులు రాత్రి బాగుగా చీకటిపడిన పిదప రామకృష్ణకవి యింటిప్రహరీగోడ దాటి లోనబ్రవేశించి, చిక్కుడు పాదుక్రింద దాగొనియుండిరి.

రామకృష్ణకవి భోజనము చేయుటకు ముందు పాదప్రణాళనార్థము దొడ్డిలోనికి వెళ్ళి చిక్కుడుపాదుక్రింద నక్కియున్నదొంగలనుజూచి, లోనికివచ్చి భార్యనగలన్నింటిని భద్రముగ దాచి, భోజనానంతరము తిరిగి దొడ్డిలోనికి వెళ్ళి చేయి కడుగుకొనుచు బిగ్గరగా 'నేమే దొంగలు మనయూరునిండ నిండియున్నారు. నీనగలనుమూటగట్టి యిమ్ము. నూతిలో బారవేసినచో చోరులకు శక్యముకాదు" అని యొకటి రెండు పెద్దరాళ్ళను మూఁటగట్టి నూతిలో పడవైచి, తలుపువేసికొని, కొంతసేపైనతరువాత మరొక మార్గమున దొడ్డిలో, బ్రవేశించి, చోరులచేష్టల గనిపెట్టుచుండెను.

ఒకరు నూతికడ నిలువబడియుండగా, నింకొకడు బావిలోనికి దిగి చాలసేపు వెదకి యానగలమూటను కనుగొనజాలక పైకివచ్చి “ఓరన్నా! బావిలో జల మధికముగా యున్నది. కొంతయైన నీరు తోడివైచినగానిమూటకనబడుటదుర్లభము' అనెను, ఇరువురునుకలసి, ఏతముతోడుట కారంభించిరి. ఎంతతోడినను నీరు తరిగినట్లు గాన్పించకుండెను, రామకృష్ణుఁ డెట్టియలుకుడును జేయక మడులుత్రవ్వి యా దొంగలు తోడిననీరు పూలమొక్క లన్నింటిని దడుపునట్లు చేసెను. తెలతెలవారుచుండెను. ఒక దొంగ మఱల బావిలోనికిదిగి వెదకివెదకి మూటను పైకిదీసివిప్పెను. అందు రాళ్ళు కన్పింపగానే దొంగలు నిస్పృహచెంది. రామకృష్ణకవి తమకు తగిన ప్రాయశ్చిత్తమొనరించె నని వెడలిపోవునంతలో రామకృష్ణుడు ఓరీ! చోరులారా! మీ పుణ్యమా యని ఒకటిరెండు మొక్కలుదప్ప పూలమొక్కలన్నియుఁ దడిసినవి. మీధర్మమాయని యారెండు మొక్కలనుగూడ నను నంతలో దొంగలు గోడదుమికి పాఱిపోఁబోయిరి. సరిగా నావేళకామార్గముననే బోవుచున్న రక్షకభటులు చోరులను బంధించి మఱల కారాగారమునద్రోసిరి. రామకృష్ణు డీవృత్తాంతమును రాయలకు దెలిపి, యానందము కలిగించెనట.

6 నూరు తప్పులకు ఫర్మానా

రాయలు కొలఁదిపరివారము వెంటరా, కవిబృందముతోఁ గలసి వాహ్యాళికై భద్రానదినిదాఁటి చాలదూరమరిగెను. కనిగిరి పరిపాలకుఁడైన వీరభద్రగజపతి సేనానియగుపసరము గోవిందరాజను దండనాథుఁడు రాయలను బంధించుట కిదియే తగిన యదననియెంచి. ససైన్యముగ రాయల నెదుర్కొనెను. రాయల ననుసరించియున్న కొలఁదిమంది సైనికులును గోవిందరాజు ప్రతాపాగ్ని కోపఁజాలక పలాయన మవలంబించిరి. రాయలు ధైర్యముతో కవులవంకఁ జూచి ' కవీంద్రులారా ! ఈ విషమసమయమున వెనుకంజవేయరాదు. మీరు నాకు విజయము ప్రాప్తించునట్లాశీర్వదింపున, క్షణకాలములో గోవిందరాజును కృతాంతమందిరమున కతిథిగా నొనరించివత్తును' అని పలికి శత్రురంగమునకురికి యెచ్చట జూచినఁ దానెయై మెలం


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2020, prior to 1 January 1960) after the death of the author.


This work is also in the public domain in the U.S.A. because it was in the public domain in India in 1996, and no copyright was registered in the U.S.A. (This is the combined effect of India's joining the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.)