తెనాలి రామకృష్ణకవి చరిత్రము/కుంకుమభొట్లు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

‘ఆ సందేహమేదో చెప్పండి.”

'సర్కార్ ! నైజాముల్ముల్కు గారిని, వారి సోదరులను కౌరవులుగా వర్ణించితిమి. తాము పాండవులని వ్రాసితిమి. పాండవులైదుగురు సోదరులు. ఆయైదుగురకు భార్య ద్రౌపది. తాము ధర్మరాజని వ్రాసితిమి. తమ జనానా వారిని ద్రౌపదిగా వ్రాసినాము అయితే తమ జనానావారికి భీమార్జున నకులసహదేవులనెడి మిగత నలుగురు భర్తలుగ నెవరిని వ్రాయవలయునో తోచకున్నది. ఈ విషయమై తమరెట్లు సెలవిచ్చిన నట్లు వ్రాయుదుము.'

ఏదులశాహి నాపాదమస్తకము క్రోధమనలముభంగి దహించెను. 'ఛీ తూ! అరే ఏం భారతంబే మీది, ఒక్క ఆడదాన్కి అయిదుగురు మొగుళ్ళు, మాజనానాకింకా నల్గురు మొగుళ్ళు కావాలీ హైతో మీభారతం అంకితమువద్దు కంకితమువద్దు వెంటనే తగులబెట్టు'డను సరికి రామకృష్ణుడు 'చిత్తము సర్కార్ ! అట్లే చేయించెద'నని యా వేయిబండ్ల తాటియాకును నిశ్శేషముగఁ దగులఁ బెట్టించెను. అంతయు భస్మీభూత మయినపిదప నేదుల శాహికడ కతడేగి 'సర్కార్ ! తమ యాజ్ఞానుసారము తగులబెట్టించితిని అనెను. ఏదులశాహి పరమానందము నొంది, యాపండితులకు శ్రమయిచ్చి నందులకు నొచ్చుకొని పెక్కు బహుమానములిచ్చి వీడ్కొలిపెను. రాయ లిదియంతయుఁ దెలిసికొని కడుపు చెక్కలగు నట్లు నవ్వెను,


10 కుంకుమబొట్లు

చేర దేశమునుండి కుంకుమబొట్లు అనుజగదేకవిఖ్యాతినార్జించిన పండితుఁడు రాయల యాస్థానమందలి యష్టదిగ్గజములను జయించు తలంపుతో నేతెంచెను. అతఁడు రాయలను సందర్శించి యాస్థాన విద్వాంసులతోడి వివాదమునకుఁ దన కవకాశమిమ్మని కోరగా, రాయలు సరేయని యొకదినము నిర్ణయించెను. వివిధబిరుదవిరాజితుండగు కుంకుమబొట్లు తమ్ము గెలచినయెడల రాయలు తమ్ము గౌరవించుట మానునని భయముఁజెంది. పెద్దనాదికవులు రామకృష్ణునిఁ జేరి 'వికట కవిశిరోమణీ! ఈ కుంకుమబొట్లు మనల గెలువజాలని యుపాయ మూహించి, మన గౌరవము కాపాడుమా' యనిరి.

రామకృష్ణుఁడట్లేయని, యానాటి సాయంకాలము నౌకరువలె మాఱువేషము ధరించి, కుంకుమబొట్లు బసచేసియున్న యింటి యరుగుపై గూర్చుండెను. కుంకుమబొట్లిటునటు పచారు చేయుచుండఁగా, నాతండు వినునట్లు రామకృష్ణు డీపద్యమును చదివెను-

శా. సమర్ధక్షమ ! ధీనిబంధన విధాసంక్రందనాచార్య శూ
    రమ్మన్యాచల వజ్రపాత ! జగవీరక్షాంబుజాక్షా ! శర
    ధ్యమ్మార్గస్థ దశాశ్యరాజ్యనమసహ్వత్ప్రోద్భవాతీరభా
    గుమ్మత్తూరి శివంసముద్ర పురవప్రోన్మూలనాడంబరా!'

ఆపద్యము నాలకించి, కుంకుమబొట్లు ' ఈతడెవ్వడు? వేషమును బట్టి సేవకునివలెఁ గాన్పించుచున్నాఁడు. అయినను మాట్లాడించి, చూచెదగాక , యని 'ఓరీ! నీ వెవ్వడవు? అని యడుగ నాతడిట్లు సమాధాన మిచ్చెను -

'అయ్యా! నేను తెనాలి రామకృష్ణకవిగారి సేవకుడను'

'ఓహో! అటులనా? నీవు రామకృష్ణకవిగారి పరిచారకుడవా? బాగుబాగు నీ యజమానికూడ ఆస్థానమందలి యష్టదిగ్గజములలోని వాఁడేనటకదా?'

'అవును, ఆయనకడనే నేను కవిత్వము చెప్పుట 'నేర్చుకొంటిని'

'సరే ఏదీ మఱియొక పద్యము జదువుము.'

మాయవేషముననున్న రామకృష్ణుఁ డీపద్యమును జదివెను.

క. నరసింహ కృష్ణరాయని
   కరమరుదగు కీర్తికాంత కరిభిద్గిరిభి

త్కరి గరిభిద్గిరిగిరభి
త్కరి బిద్గిరిభిత్తురంగ కమనీయంబే.”

కుంకుమబొట్లు 'ఓరీ! ఆపద్యమున కర్థము చెప్పగలవా? యని ప్రశ్నింప, రామకృష్ణుఁ డిట్లుఁ జెప్పెను. "

టీ. నరసింహ=సాళువ నరసింహారాయల, కృష్ణరాయ= అతని కుమారుడైన శ్రీకృష్ణ దేవరాయల, కీర్తి= ప్రసిద్ధి, కరభిత్ =గజాసురుని వధించిన శివునివలెను, గిరిభత్కరి=పర్వతముల పెకలించిన యింద్రుని యేనుగయగుయైరావతమువలెను, కరిభిద్గిరి=సాంబశివుడు నివాసముండు కైలాసశైలమువలెను. దిరిభిత్కరిభిత్తురంగ = యింద్రుని యొక్కయు, నీశ్వరునియొక్కయు వాహనములైన యుచ్చైశ్రవము గోవృషభములవలెను తెల్లనికాంతి గల్గియున్నది.

'రామకృష్ణుని పరిచారకుడే యిట్టి యసాధారణ పాండితీప్రకర్ష గలిగియుండగా, రామకృష్ణకవి యెట్టి ప్రజ్ఞాధురంధరుండో, యష్టదిగ్గజములం దగ్రగణ్యుం డై యొప్పు పెద్దనముందు నే నసలు నిలువబడ గలనా' యని తలంచి యధైర్యమునొంది, యారాత్రి యేరికిని దెలియకుండ నెటకో వెడలిపోయెను.

మఱునా డాస్థానమున రాయలుకూర్చుండి, కుంకుమబొట్లు నాహ్వానించుటకై భటులనంపగా వారు తిరిగివచ్చి 'మహారాజా ! ఆ పండితుడు గతరాత్రముననే నగరమువిడిచి వెడలిపోయెనట' యని చెప్పిరి. రామకృష్ణుడు తానొనరించినదంతయు నెరింగింపగా రాయలు మిక్కిలి సంతోషించి సన్మానించెను. తమ యాందోళనము బాపినందులకు పెద్దనాదులెల్లరును రామకృష్ణకవిని విశేషముగా నభినందించిరి,


11 ప్రెగడరాజు నరసరాజు

ప్రెగడరాజు నరసరాజనుకవి యొకప్పుడు కృష్ణదేవరాయల భూస్థానమున కేగి 'మహారాజా! తమ యాస్థానముననున్న పెద్దన్న '


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.