రేకు: 0336-01 నాదరామక్రియ సం: 04-208 వైరాగ్య చింత
పల్లవి : |
ఏమని విన్నవించేను యెన్నెని కాచేవు నీవు
శ్రీమాధవుడ నీకుఁ జేతికి లోనయ్య
|
|
చ. 1: |
పుట్టినదె వొకతప్పు భువిమీఁద నటమీఁద
నెట్టన సంసారినౌటే నిజము రెండోతప్పు
రట్టుకెక్కి దొరనౌటే నెట్టన మూఁడోతప్పు
యిట్టె కావు కావకుండు మిదివో నాతప్పు
|
|
చ. 2: |
అన్నపానములు గోరినదియే మొదలి బందె
యెన్నఁగఁ గాంతలఁ గూడుటిదివో రాతిటిబందె
కన్నవారి వేఁడేది కడతొడుకుబందె
కొన్నిట నేమి గొనేవు కొనవయ్య బందె
|
|
చ. 3: |
కొనఁ బుణ్యపాపాలే గొడియకట్లు రెండు
కొనిరి నీదాసులే కోరిన తప్పుదండము
వినవయ్య యిదివో శ్రీ వేంకటేశ నామనవి
మనుఁగాఁపుఁ జేసితివి మన్నించవయ్య
|
|
- రేకు: 0336-02 కేదారగౌళ సం: 04-209 వైరాగ్య చింత
పల్లవి : |
{{Telugu poem|type=చ. 1:|lines=<poem>
|
|
పల్లవి : |
ఇందిరానాథుఁడవు యిందరికి నేలికవు
చిందరవందరలైన చింతలు మరేలా
|
|
చ. 1: |
వుండుమంటే నుండవీ వూరకే బ్రహ్మాండాలు
నిండుమంటే నిండినవి నీరధులెల్లా
మెండగుప్రతాపమిదె మించి నీ వినోదమిదె
వొండుదైవాలఁ గొలువ నూరకే మరేలా
|
|
చ. 2: |
పుట్టుమంటేఁ బుట్టిరి పూఁచినదేవతలెల్ల
అట్టే యణఁగిరిగా అసురలెల్ల
పట్టిన నీచల మిదె బహళ స్వతంత్ర మిదె
వెట్టిదైవాలపనులు వేరే మరేలా
|
|
చ. 3: |
కమ్మంటే నాయను కైవల్యపదవులు
రమ్మంటే వచ్చె వేదరాసులెల్లను
కమ్మిన శ్రీవేంకటాద్రి కడపరాయఁడ నీకు
యిమ్ముల నీమహి మిదె యితరములేలా
|
|
రేకు: 0336-03 బౌళిరామక్రియ సం: 04-210 విష్ణు కీర్తనం
పల్లవి : |
పలికేటివేదమే ప్రమాణము
తలఁచిన వారికి తత్వము సుండీ
|
|
చ. 1: |
నరహరి యజాండనాయకుడు
సురలితనినే సంస్తుతించిరి
పురుషోత్తముఁ డిదె భూమికి - యీ
హరిఁ గొలువనివా రసురలు సుండీ
|
|
చ. 2: |
కమలారమణుఁడె ఘనుఁడు
అమరులె మ్రొక్కుదు రాతనికి
విమతులఁ దునిమె విష్ణుఁడు
తమిఁ బూజించక తగు గతి లేదు
|
|
చ. 3: |
భావజజనకుఁడు బ్రహ్మము
సోవగఁ గొలిచిరి శుకాదులు
శ్రీవేంకటపతి చెలువుఁడు
దైవశిఖామణిఁ దలఁచరో బుధులు
|
|
రేకు: 0336-04 పళవంజరం సం: 04-211 నామ సంకీర్తన
పల్లవి : |
ఒక్కమాఁటలోనివే వొగి బంధమోక్షాలు
చిక్కినందాఁకా దేహి చింతఁ బొందీఁగాని
|
|
చ. 1: |
హరి యని నుడిగి రెండక్షరాలఁ బాపేటి-
దురితాలు భూవిలోనఁ దొల్లె లేవు
పురిగొని యందుమీఁద పొంచి విశ్వాసములేక
పెరగఁగఁ బెరుగఁగ పెచ్చు రేగీఁగాని
|
|
చ. 2: |
మతిలో గోవింద యన్న మాత్రమున నంటేటి
అతిపుణ్యాలిలమీద నన్ని గలవా
కతగా నట్టె మహిమగానలేక వుండగాను
బతిమాలఁగానే యింత బయలాయఁగాని
|
|
చ. 3: |
శ్రీవేంకటేశ నిన్ను సేవించితే నిచ్చేటి-
యేవల వరాలు లెక్క నెంచవసమా
భావించి తెలిసి చేపట్టెడి యరుదింత
దైవము నా కియ్యఁగాను దక్కె నింతేకాని
|
|
రేకు:0336-05 కన్నడగౌళ సం: 04-212గురు వందన, నృసింహ
పల్లవి : |
తలరో లోకాంతపరులు తడవము పుణ్యపాపమును
వలె నని శ్రీవైష్ణవులకు వందనమే సేసెడివాఁడ
|
|
చ. 1: |
తపసిఁ గాను ధర్మిఁ గాను
కృపగల శ్రీపతి కింకరుఁడ
జపితఁ గాను శాస్త్రిఁగాను
వుపదేశపు గురువూళిగకాఁడ
|
|
చ. 1: |
భయము లేదు భక్తి లేదు
జయభాగవతుల దయవాఁడ
ప్రియము న్నెరఁగను పెరిమ న్నెరఁగను
ద్వయాధికారముఁ దగిలినవాఁడ
|
|
చ. 1: |
జ్ఞానము లేదు మానము లేదు
పూని శ్రీవేంకట పురుషుఁడిదె
నానాటఁ దెలిపి నను మన్నించెను
సానఁదేరి తన శరణమువాఁడ
|
|
రేకు: 0336-06 సామంతం 04-213 శరణాగతి
పల్లవి : |
చలువకు వేఁడికి సరికి సరి
కలదిక హరి నీ కరుణే మాకు
|
|
చ. 1: |
కాయము గలిగినఁ గలుగుఁ దోడనే
పాయపుమదములు పైపైనే
రోయదు తనుఁ గని రుచులే వెదకును
యేయెడ హరి నిను నెరుఁగుట యెపుడో
|
|
చ. 2: |
కడుపు నిండితే ఘనమై నిండును
బడిఁ బంచేంద్రియపదిలములు
విడువ వాసలును వెలయు బంధములు
కడగని మోక్షము గైకొనుటెపుడో
|
|
చ. 3: |
పెక్కులు చదివిన పెనఁగుఁ దోడనే
తెక్కుల పలు సందేహములు
యెక్కువ శ్రీవేంకటేశ నీవె మా-
నిక్కపు వేల్పవు నీచిత్త మిఁకను
|
|