ఢిల్లీ దర్బారు/రెండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

రెండవ ప్రకరణము..

.

పస్తుతపు ఢిల్లీ.

ఢిల్లీ నగరము పంజాబు పరగణాలో యమునానది యొడ్డున నున్నది. ఇది కలక త్తానుండి 956 మైళ్లు, బొంబాయినుండి 982 మైళ్లు, చెన్న పట్టణమునుండి 1100 మైళ్లు. ఇందుగలజన సంఖ్య 1901 సంవత్సరపు జనాభాననుసరించి 208, 575;ప్రస్తుతము 282, 859. ఈపురమున ననేకములగు యంత్రశాలలేర్పడి యుండుటవలన నానాటికీని జనసంఖ్య యెక్కుడగుచున్నది. మన జార్జిచక్రవర్తిగారి అభీష్టము ననుసరించి యిఁక ముందిదియె భరతఖండమునకు రాజధానియగుటంబట్టి మళ్ల నిది తన పూర్వోన్నత్యమును పొంది మరలఁ 'బురోత్తమ” మనిపించుకొనుననుటకు సందియము లేదు.

ప రి శ్రమ లు.

ఢిల్లీ జనుల ముఖ్య వృత్తు లనేకములు. అచ్చట చేతిపనులును మెండు. ఆభరణములుచేయుట, వెండిపని, రాగియిత్తడులయుప యోగము, దంతము పై చెక్కుట, కుమ్మరపని, గుడ్డల నేత, వెండి బంగారు జరీలతో బుటేదారుపని, చిత్ర లేఖనము, వర్ణ లే

పనము, మొదలగునవి ఢిల్లీకి సామాన్యములు. శతశతాబ్దములుగ ఢిల్లీ యాభరణములనిన ప్రపంచమంతయు గనులెత్తి చూచుచు వచ్చుచున్నది. అయిన నిక్కాలమం దచ్చట సిద్ధమగు భూష ణములు మొగలాయి యుగము నందలి నానియంతటి యపూ ర్వమయినవని చెప్పనొప్పదు. దంతము పై చెక్కిటపుఁబని యొకటి రెండు కుటుంబముల వారు మాత్రము చేయుచున్నారు. ఇటీవల నీవ స్తువుతో జిత్రమగు బహుమాన పేటిక లు (Caskets) మున్నగునవి చేయఁబడినవి. అత్యద్భుత సంపూర్ణ తాశక్తి (Power of finishing) చే నమర్పఁబడిన "రేఖానృత విశాల రూపము లే (Open-twork Geometric pattern) వీనియం దలి విశేషాంశము. కుమ్మరిపని యింకను నవీనము. ఇప్పుడిప్పుడే యొక రిద్దఱు పని వారలు నాణ్యతయంతగ లేని సింగాణీ సొమా నులఁ జేయుచున్నారు. వెండి బంగారు జరీతో జరుగుబుటేదారు పనిమాత్రము గొంచెమెక్కుడు ప్రాముఖ్యతగలది. ఇది చాందిని చౌకులో విశేషము నడుచుచున్నది. పాశ్చాత్య సంబంధ మచ్చటచ్చటఁ గొనుపించుచున్నను మొత్తముమీఁద దీని యందలి పౌరవాత్య కళాకౌశల్యమింకను దలయెత్తికొని యే యున్నది. ఈ పని కొఱకువలయు జరీ సిద్ధపఱుచుటలో నక్షకులకు జీవనము దొరకుచున్నది. వీరు మాత్రము గ్రామరక్షక సంఘము నకు (Municipality) సంవత్సరమునకు 25, 000 రూప్యముల

పన్ను నిచ్చుచున్నారు. సంఘము వారు ప్రత్యుపకృతిగ ముఖ్య
చాందినీచౌ కు.

కార్యస్థాన మొక్కటి నేర్పఱచి యచ్చట జరీకిగాను కఱగఁబడు సువర్ణ రజతములను బరీక్షించి జరీని నాణ్యము సెడకుండం జేయుచున్నారు. దానివలన నే భరతవర్షమున నెచ్చటను ఢిల్లీ జరీకిఁ బేరు పెట్టువారు లేరు. నవీనయంత్రాలయ నిర్మాణము ఢిల్లీయందు బాగుగ వృద్ధియగుచున్నది. దూదివడుకు యంత్ర శాలలును గుడ్డలు నేయు యంత్రశాలలును నాలుగుగలవు. పిండి చేయు యంత్రశాలలు 3 గలవు. చెఱకునాడు యంత్రశా లలు మూఁడు గలవు. అచ్చుయంత్రశాలలును, బిస్కత్తులు చేయు యంత్రశాలలును, ఇనుము ఇత్తడిమున్నగు లోహము లతోబని సేయు యంత్రశాలలును గలవు.


రాజవుత్ర స్థానమునకును కలకత్తా బొంబాయిలకును వ్యాపారమంతయు ఢిల్లీ మార్గమున నడచుచున్నది. కావున నిది వాణిజ్యమున నెం తేని వన్నె కెక్కియున్నది.


ఢిల్లీ కోటయందు కొంత ఆంగ్లేయ సైన్యము నిలుపఁబడి యున్నది. తోపుఖానా (ఫిరంగులుండు ప్రదేశము) యొకటియు, స్వల్ప సంఖ్యాకులగు సైనికులును గలరు. సిపాయీల కాల్బల మును ఆశ్విక సైన్యమును మఱియొక చోట గలవు. ప్రాచీన ఢిల్లీ ప్రదేశమున నొక్కెడ నిప్పటి ఢిల్లీకిఁ బదు నొకండు మైళ్లదూరమునఁ బ్రతివర్షర్తు వందును గొప్పసంత జరుగును. బహుదూరమునుండి వేలకొలది జనులాస్థలమునఁ జేరుదురు.

లోకము నందలి యద్భతములలో ముఖ్యము లేడు గల వని పాశ్చాత్యులలో ఒక వాడుకగలదు. ఆ యేడింటిలో నొక్కటియగు కుతుబ్ మినారను జయ స్తంభము. ఢిల్లీ నగర మున నున్నది. విశ్వకర్మ స్తుతి యీ కట్టడమునఁ గానవచ్చుట బట్టియు దీని స్వరూపము హైందవ శిల్పి కాపద్ధతిని స్పష్టముగం గనుపఱచుచుండుట వలనను నిది పృధివీరాజు వలనఁ బ్రారం భింపఁ బడెనువారి వాదమునకు సమ్మతింప వలసి యున్నది- క్రీ! శ. 1191 లో మహమ్మదీయుల నోడించి వారి పైఁ దా నందిన విజయమును సూచింప నీతఁ డీమినారును బ్రారంభించెనని , కొందఱును, నితని పుత్రిక యమునానదిని ప్రతిదినమును దర్శించి నభిలాషగల దగుటచే నాయమ ప్రీత్యర్ధమై యిది ప్రారంభింపఁ బడెనని మణికొందఱును జెప్పుచున్నారు. ఏది యెట్లన్నను శిల్పి కాపద్ధతిని బట్టి యిది హైందవనిస్త్రాణమని నిశ్చయింపక తీరదు. పృధివీ రాజున కనంతరము కుతుబుద్దీను దీనిని దనయవ సరములకుఁ దగురీతిని మార్చి యుపయోగించి యుండును. అతని కిది రెండువిధములఁ బనికి వచ్చెను. హైందన రాజుల నోడించి వేయించిన జయ స్తంభముగను దన మతస్థులగు నాచార్యులు సాయంసమయముల భక్తులను దైవ ప్రార్థనకుఁ బిలువ నుప యోగకరమగు మినారుగను సతఁ డిద్దానిని బ్రవర్తింపఁ జేసెను.


దీనిప్రక్కన నొక దివ్యమగు "హైందవ దేవాలయ ముం డెడిది. దానినిగూడ కుతుబుద్దీను కుతుబ్ మసీదుగ మార్చివేసెను. బానిస వంశీకుఁడయ్యును కుతుబుద్దీను చూపిన బుద్ధి కౌశల్య ముచే నతఁడు త్తమ పరిపాలకులలో నెక్కఁగుగఁ బరిగణింపఁబడ 'నర్హుఁడు సుందరవస్తువును మతా వేశము చే నశింషఁ జేయుట మాని యుపయు క్తమగు భంగి సంస్కరించి నిలువ జేయుట యందఱకును సాధ్యముగాదు కదా !

ఇప్పుడు కుతుబ్ మినారు 238 అడుగల యెత్తుగలదు. శ. 1794 లోఁ గొలిచినప్పుడు 242 అడు లుండెడిది. పిడు గులు భూకంపములును నిట్టియున్న తమగు కట్టడములకు వైరులు కావున నప్పటికే వీని ప్రభావము వలన దీని శిఖర మూడిపోయి యుండెను. అందువలన శిఖరమునకుగాను ఇంకను పదియడుగులు, పదియన నేల ఇరునదిగూడ, జీర్చవలసి యుం డును. క్రింది భాగమున దీని చుట్టుకొలత 48 అడుగుల 4 అం గుళములు. ఈమినా రైదుభాగములుగఁ గట్టఁబడియున్నది. మొదటి 97 అడుగులొకమందము; 97 నుండి 148 నఱకును మఱియొక మందము; 148 నుండి 188 వఱకును వేరొకమంద ము; 138 నుండి 214 వఱకును నాలుగవ మందము; తరు వాత కడపటి భాగము. పీఠమునుండి శిఖరమువఱకును బోను ఫోను మందము గ్రమక్రమముగఁ దగ్గుచుండును. ఒక్కొక్క

యుతస్థును వేరుపలుచి మినారున కలంకారము నొసఁగుటకే
కుతుబుమినారు.


యాయాచోట్ల స్తంభమును జుట్టినచ్చు విశాలములగు • సజ్జ'*[1] (Balconies) లమర్పఁబడినవి. సజ్జలకు మధ్యప్రదేశము 'నందలి స్తంభోపరి భాగము కోణాకృతులును(angular)వలయా కృతులును నై పరస్పరానువ గులగు పట్టెలతో శోభిల్లు చున్నది. ఈ పట్టెలమీఁదఁ జూచువారల సనిమిషులం జేయ గలుగునంతటి చిత్రమగు చెక్కడవుపని చేయఁబడి యున్నది. భారతవర్ష శిల్పి కాచరిత్రను రచించిన "ఫెర్గుసనను ప్రసిద్ధ గ్రంథ కారుఁడిద్దానిని గుఱించి " ఈ జాతి కట్టడములలో నింత సౌం దర్యము గల దిం కెచ్చటను లేదని చెప్పుటలో నేమాత్రమును “నతిశయోక్తి లేదని వ్రాసియున్నాఁడు.

కుతుబ్ మసీదు.

కుతుబ్ మీనారున కనతి దూరమున కుతుబుద్దీను వలన నిర్మింపఁబడిన ప్రాచీనమగు మసీదొకటిగలదు.దీనికి కుతుబ్ మసీదనియు కుడత్ -ఉల్- ఇస్లామ్' అనియు పేర్లు. "రెండవ "దానికి 'ముసల్మానుల ధర్మపుశక్తి ' అనియర్ధము. ఈ మసీదు 150

.......................................................................................................
కుతుబుమీనా రు సింహద్వారము.

అడుగుల పొడవుగలది. ఇందున సగము వెడలుపు. అంతర్భాగమం దలి విడిస్థలము 142 అడుగుల నిడుపును 108 అడుగుల వెడ లుపునుగలది. ఉత్తర ద్వారమును బూర్వ ద్వారమును నిప్పటికిని మంచిస్థితియం దున్నవి. అచ్చటనె ఈకట్టడపు జన్మ చరిత్రం గెలుపు శాసనములు గనుపట్టుచున్నవి. ఇది మొట్ట మొదట హిందువుల దేవాలయముగ నుండెననుట నిర్వివాదాంశము. ఇది పృథ్వీరాజు దేవాలయమని ప్రతీతి. పఠానులు ఢిల్లీ నగరమును స్వాధీనపఱచుకొనిన తరువాత కుత్ బుద్దీను, అతనికి వెనుక అల్తమషు, అతనికిఁ బిదప నల్లాయుద్దీను ఈ మసీదును గ్రమక్రమ ముగఁ బూర్తిచేసినట్లు అగుపించుచున్నది. దేవాలయమును మసీదు సేయుటలో మహమదీయులు దమ మత సిద్ధాంతములకు విరుద్ధమని తోఁచిన విగ్రహములను గొన్నిటిని బూర్ణముగఁ బగులగొట్టిరి. మరికొన్నిటిని గానరాకుండఁ జేయు తలంపు: నాయభాగముల పదట్టమగు సున్నము పూతఁబూసిరి. కాల క్రమమున నా పూత చెదరిపోయి ప్రథమమున మహమ్మదీయులు హిందూ 'దేశమును బ్రవేశించునాటికి హైందవశిల్పకలా చాతుర్య మెంత యౌన్నత్య దశయందుండె ననుటను స్పష్టముగ బోధించు విగ్రహాదులు బయల్పడినవి. స్తంభములపై నిప్పటి అని చూడనగు చిత్రస్వరూపములు గన్నులపండు వొనర్ప- గలవు. ఒక్కెడఁ బక్ష ఫలపుష్పములతో వేగు లతామతల్లికలు

గుబురులు గుబురులుగ సుంద రపాత్రముల నుండి వెలువడి
కుతుబుమసీదు, లేక, పృధ్వీ ం య దేవాలయము,

పించుట ప్రౌఢీమతో బ్రదర్శింపఁబడియున్నది. మఱియొక్కెడ పూమాలలతో నొప్పు చిరుతపులియర్రులును, వేరొక్కెడ సంకెలలకు వ్రేలఁగట్టఁబడిన గుటలును దృష్టిని దనుపుచున్నవి. ఇంకొక్కెడ దివ్య మంచక ములును ప్రసూన దామపరంపరలును బ్రేక్షకుల నాకర్షించుచున్నవి. అన్ని టికంటే మిన్న యయి యొక స్తంభము కామ ధేనువును గోవత్సంబును జూపఱులముందఱకు దొబ్బి యిల్లిదే నీయభీష్టములఁ దీర్పఁగల నేనిట నున్న దానను రమ్మని చీరుచున్నది. మాచదువరు లింతకంటె నపూర్వంబగుఁ బ్రేక్షణీయము నాశింతురే? ఇంకొక్కటి మాత్ర మీమసీదున గలదు. ఉత్తరపు గోడన బహిర్భాగమందు రెండన గవాక్షము పైని శిలమీఁదఁ జక్కఁబడిన కృష్ణజన్మఘట్టము 'సొంపులు గుఱిపించుచున్నది.

ఇదియంతయు హిందువుల దేవాలయ ముండిన భాగము. ఇక క్రొత్తంగ మహమ్మదీయులు చేర్చిన దేమన సత్యద్భుతముగు కమానుల వరుసలు. ఇవి మసీదునకు పశ్చిమ భాగమున గలవు. వీని పొడవు 885 అడుగులు. ఇందు మూఁడు గొప్పవి; ఎనిమిది చిన్న వి. నట్టనడుమనుండు కమాను వెడలువు 22 అనుగులు; ఎత్తు 58 అడుగులు. దీని కావల నీవల నుండునవి యింత యెత్తే గాని వెడలువునమాత్రము రెండడుగులు గొప్పవి. పఠానులు శిల్పులనుదమ వెంటఁ బెట్టుకొని రాలేదు. కాని శిల్పకళయందభిరుచి గలవారగుట వీరు దమ హైందవ పౌరు

లలోని చతురులతోఁ బనినంతయుఁ జేయించుకొనుచుండిరి. కావున మున్ను దేవాలయమును గట్టిన వారలే యీ కమాను. లను గూడ నిర్మించియుందురు. అట్లగుట దేవాలయమందలి యలంకారమే యిచ్చటను గానవచ్చుచున్నది. కాని యిట విగ్రహములకు మారుగ కొరాను గ్రంథమునుండి బహుజాగ రూకతతో నేరఁబడిన వాక్కులుగంపించుచున్న వి. సంపూర్ణతా శక్తితో సూత్తుతమముగు చిత్రరచనా చాతుర్యమునుజూపి తన్మ ధ్యమునఁ బై కెగయుచు గ్రిందికి దిగుచు చక్షురానంద దాయకములగు ధార్మిక వాక్యములను జెక్కి వెట్టిన నేభక్తుని హృదయము ప్రబోధమందదు? ఈ కమానుల ముఖమునఁగాన నగు కొరానువాక్కుల ధోరణిఁజూడ కొరాను భూలోకము నుండి పోయి భగవంతుని దర్శింపుచు భగవంతునుండి భూ ప్రజకు జ్ఞానామృతమును గొనివచ్చుచుండునట్లు తోఁచుచున్న దని యొకానొక మహమదీయుఁడు నుడివియున్నాఁడు.

జుమా మ సీదు.

ఢిల్లీ రాచబాట నవలోకించుచుఁ బురమును జొచ్చుట తోడనె దృష్టి నాకర్షించు ప్రథమవిషయము జుమా మసీదు. భర తవర్షమునం దుత్తమనిర్మాణములలో నిదియునొక్కటి క్రైస్తవు లకు రోముపట్టణమందలి సెయింటుపీటరు చర్చివ లెను, హిందు వులకు ఒరిస్సాయందలి జగన్నా ధాలయమువలెను, మహమ్మదీ యుల కనుక రించున దీ మసీదే. ఆగ్రాయందలి తాజ్ మహలు


సౌందర్యమున సర్వోత్కృష్టమైనదే గాని, దానికిఁ దరువాత మసీదులలో నిదియెయెన్నఁబడవలసియున్నది. ఇదియంతయు నెర్రరాతితోఁ గట్టఁబడి మధ్య మాత్రము కొంతసంగమర్మరు చూపట్టుచున్నది. మంచి సంగమర్మరు. శిలలతోఁ బూర్తిగఁ గట్టఁబడియుండినచో నిదియును నాగ్రా'తాజ్ మహలున లెనే

జుమామసీదు.

తన ధవళ ప్రభలచేత జనులమనముల నాక్రమించుకొని యుం డును. ఇట్లనుట నిప్పుడిది ప్రేక్షణీయము గాదనుటగాదు. సర్వ ఢిల్లీ మధ్యమున నత్యుచ్చముగఁ దలయెత్తుకొని తన భవ్యత్వము పలనను రక్తిమప్రభల వలనను నితర ' స్వల్పభవనముల నిది .

కేరడము లాడుచున్న దనిన నిద్దాని ప్రాముఖ్యతను వర్ణించిన వార మగుదుము.

ఇది కట్టుబడిన స్థలము మిట్టప్రదేశము. అక్కడ మున్నుం డిన గుట్టను చదరము చేసి యాచదరము పయినది నిర్మి బడినది. దీనికి నాలుగునై పులను మార్గములుకలవు. "కాని ప్రవే శద్వారములు తూర్పు, ఉత్తరము, దక్షిణము, ఈమూఁడు పార్శ్వములందుమాత్రమేగలవు.పశ్చిమద్వారము బొత్తిగనశించి పోయినందున సచ్చట నున్నతములగు భిత్తులు మాత్రమె కాన వచ్చుచున్నవి. ద్వారములుగల మూఁడు నైపులను నదీఘట్టములఁ జూపట్టు సోపానపరంపరలఁ దిరస్కరించు పడికట్లు కట్టఁబడియు న్నవి. ముఖ్య ద్వారము లిత్తడితోఁ బోయఁబడిననగుటచే మిక్కిలి ఘనమై విశాలముగఁ గన్పట్టుచుండును. అందులో బూర్వద్వార మెక్కుడు సౌందర్యము గలదియు దళమైనదియు నై మహాద్వారమని పిలువ నర్హముగ నున్నది. ఈ ద్వారమునఁ జొచ్చి లోపలికి నడచినచో గొప్పయంగణ మొకటి గానవచ్చును. ఇది 1400 చదరపు గజములు గలదు. దీని ' నట్టిల్లొక (Floor) విధమగు నెఱరాతిపఱపు గలిగియున్నది. తన్మధ్యమున సంగ మర్మ రుశిలలతో నిర్మితమయిన కృతక సరోవరం బొండొప్పు చుండును. దీనిలోని కీ గుట్టపయినుండు జీవఝరములనుండి శుధోదకము ప్రవహింపఁ జేసియున్నారు. ఇట్లలంకృతమయిన యీచతుష్కోణాకృతియగు నంగణమున నైదు వేలసంఖ్యగల ముసల్తానులు ప్రార్థనార్థము చేరుటకు వీలుగలను. ఈమసీదు నందు ముఖ్యాంగమగు నంతరాలయ మీ చద రమునకు .పశ్చిమభాగమున నున్నది. ఇది పశ్చిమమున నుండుట కుఁ గారణము మక్కా-పడమర నుండుటయె. ప్రతిమహమ్మ దీయుఁడును దైవము ను బ్రార్ధించు నెడ మక్కా ప్రక్క కు దిరుగ వలయునని యొక సిద్ధాంతము. కావున నీయంతరాలయముఁ జొచ్చుట తోడనే భక్తులు పశ్చిమాభిముఖులై యుండునటుల సౌకర్యముకలుగఁ జేయుటకు పడమట చివర నె యిది గట్టఁబడి నది. ఈ యంతరాలయము దీర్ఘచతుష్కోణాకృతి కలదయి పొడవున 201 అడుగులును వెడలుపున 120 అడుగులును నున్నది. దీనిశిరోభాగమున మూఁడు గొప్పగుమ్మటములు గలవు. వీని పై బంగారు నీరుతో వ్రాయఁబడిన చిత్తరువులున్నవి. ఇంతియేగాక యీయంతరాలయపు రెండు చివరలను రెండు మినారులు 180 అడుగుల యాన్నత్యముగలవి ప్రౌఢముగఁ గన్పించుచుఁ బ్రక్క ప్రదేశమునఁ గలమేడలకంతకును మేమె రాజులమని చాటు తెఱంగున నర్థవర్తులాకారము లై కిరీటము లఁ బోలుచిన్న గుమ్మటములను ధరించియున్నవి. మసీదు ముందరి భాగము మహా ద్వారమున కీవల నావల నై దేసి . సొంపులు గులుకు కమానుల చే నలంకరింపఁ బడియున్నది.


ఈకట్టకపు మధ్యమున నొక చోట శుభమగు నల్ల రాతి పయి స్వచ్ఛమగు సంగమర్మరుశిలలతో నక్షరములు దీర్పఁబడి యున్నవి. ఈ శాసనమున నీమసీదున కైనవ్యయమును మసీదు ప్రారంభిచి ముగించిన తేదీలును నీయఁబడియున్నవి. దీని ననుసరించి చూడకీ| శ || 1841 లో ప్రారంభమయి 1850 మధ్యమునకు నీ మసీను పూర్తియయినట్లు తేలుచున్నది. సుమా రా రేండ్ల కాల కట్టడమునకయి 5000 పనివారలు చమట. నూడ్చుచుండిరి. అప్పటి లెక్కల ననుసరించి దీనికి పదిలక్షల రూపాయిలు పట్టినట్టు తెలియుచున్నది.

ఈముసీదు. మధ్య భాగమున నొకచోట నట్టిల్లంతయు సంగమర్మరము పఱచిన ప్రదేశమున మూఁడడుగుల పొడవును ఒకటినరయడుగు వెడలుపును గల కమానులు ' దీర్చఁబడియు న్నవి. వీని మొత్తము సంఖ్య 900. ఇట్లు ప్రత్యేకించి పెట్టఁ బడిన స్థలముల బాదుషాహలును నమీరులును నవాజు సేయు టకుఁ గూర్చొనుచుండిరి. ఢిల్లీయందు బాదుషాహ నగరున . నెచ్చటను మసీదు గానరాదు. కావున నతఁడు ప్రార్థనార్థము దన సర్వసామంతులతో నీ మసీదున కే వచ్చుచుండి నట్లును నీ స్థలము లట్టి యూహతోడనె కట్టఁబడియున్నట్లును నిశ్చయముగఁ జెప్పు వచ్చను. మధ్యగుమ్మటపు క్రింది భాగమున నక్షీ పని సర్వోత్కృ స్టముగఁ జేసియున్నారు. దీని కెదుట ముఖ్యమతాచారుల పీఠ మఖండనుగు నొక్క-సంగమర్మరశిలతో నిర్మింపఁబడి యున్నది. ఇచ్చట ఒక గోడమీఁద షహజహాను, బహదూరు షహాల స్వహస్తాక్షరములు చెక్కఁబడియున్నది.

ఈమసీదు గదులలో నొక్కెడ మహమ్మదీయుల కత్యంత 'పవిత్రమగు మహమ్మదు మహాపురుషుని జ్ఞాపక చిహ్నములైన వస్తువులు భద్రము చేయఁబడియున్నవి. ఇందు మూలా చార్యుల పాదరక్షలును, రాతియందు చెక్కిన యాతని చరణా కృతియును, నమూల్యరజత పేటిక యందు మహాదరముతో గుప్తీక రించిన మహమ్మదు గడ్డమునుండి తీసిన రక్తవర్ణపు వెండ్రుక యును గలవు. ఏడవ శతాబ్దమున వ్రాయఁబడిన కోరానుగ్రంథపుఁ బ్రతియొక్కటిగూడ నీ చిన్న గది కలం కార ములలో నొక్కటిగ నున్నది.

జుమా మసీదును గుణించి రస్సెలను నొక ఐరోపియను గృహస్థుఁడు " ఈకట్టడపు విశుద్ధశోభయు, దీనిరచన యందలి ప్రమాణ సౌందర్యంబును, మఱియు నిర్మాణము నందలి యుదా త్తకల్పకతయు, మన క్రైస్తవ ప్రార్థనమందిరముల శుద్రమును దరిద్రమును నగు స్వరూపములతోఁ బోల్చిచూచిన 'భేదముతో దలవంచు కొననలసి నంతటి వైపరీత్యము గానుపించు”నని వ్రాసి యున్నాడు.

లోహస్తం భ ము..

కుతుబ్ మినారు సమీపమున మఱియొక ప్రేక్షణీయ

'మగు వస్తువుగలదు. దాని పేరు మనమిదివఱికే వినియున్నారము.
లోహ స్తంభము.

లోహస్తంభమని నతోడనే, మాచదువరు లద్దాని స్మరియింపఁ గలరు. హైందవ సామ్రూజ్య కాలమందు క్రీస్తుశకమునం దైదవ శతాబ్దమున. ఢిల్లీని వీక్షింపఁబోవు ప్రవాసికులందఱును బహు కాలముగ దీనిని ప్రశంసించుచునే వచ్చుచున్నారు. కుతుబ్ మసీదు ప్రాంతమునఁ జూడవలయు ముఖ్యతమమగుఁ జిత్ర ములలో ఒక్కటియ , పెర్గుసను వ్రాసియు న్నాఁడు. ఇది యిప్పుడుభూమిపై నిరువది రెండడుగుల యెత్తు న్నది. భూమిలోనుండు భాగము 20 అంగుళములు మాత్రమే యని మనకు విస్పష్టముగఁ దెలిసియున్నది. కావున మొత్త మున అద్దాని పొడవు 23 అడుగులు 4 అంగుళములు. పీఠమున దీనిచుట్టుకొలత 164 అంగుళములు; శిరోభాగమున 12.08 అం గుళములు......క్రీ! శ|| 363 లేక 400 ప్రాంతము లందలి గుప్త వంశజులగు చంద్రరాజుల కాలమున నియ్యది నెలకొల్పఁబడె నని నా నమ్మకము. క్రీ! శl 400 సంవత్సరమున నిది స్థాప్పిపఁబడె ననుకొనినను మనమిదివఱి కెప్పుడు నూహింపనైన నూహింపని యంశ మొక్కటి బయలుపడుచున్నది. నిన్న నేఁటివఱకును నైరో పాఖండవాసులు నిర్మింప నేరక యిటీవల ఒకటి రెంటిని మాత్రము నిరింప గలిగిన స్తంభజతిలోఁ జేరిన ఈ లోహ స్తంభమును హిందువు లంత ప్రాచీనకాలముననె పోతపోసిరనుట విశదమగు చున్నది... ఇంతియెగాదు. పదునాలుగుశతాబ్దములు వర్షమున కును వాయువునకును దలమొగ్గి యీ యినుప కంబము రవ్వంత

యేని త్రుప్పుపట్టకుండుటయు దీనిమీఁది శాసనములందలి లిపు లు కొంచెమైనం దఱుగుడు వడి మాసిపోక స్పష్టముగ గను పడుచుండుటయు మిక్కిలి వింతగ నున్నది. ఈ సంభముమీఁది శాసనమును బట్టి యిది విష్ణువునకు సమర్పింపఁబడినట్లు తెలియు చున్నది. కావున దీని చివర గరుత్మంతుని విగ్రహముండియుం డును. మహమదీయులవలన నిర్నూలనమందియుండును. కాని యీస్తంభమునిలుపుటకు ముఖ్యోదేశము సప్తసింధువు తీరమున బాహ్లికులను హిందూ రాజులోడించి తరుముటను దెలుపుటయే.

అశోకుని శిలాస్తూపము.

దర్శనీయమగు ఢిల్లీలోని చిత్రములలో నశోకుని శిలా స్తూపము' మఱి యొక్కటి. ఇది మొట్ట మొదట పాంచాల దేశము నందలి అంబాలా మండలములోని జగంద్రియను గ్రామమున కేడుమైళ్ల దూరమున నుండెడిది. దానిని ఫిరోజు షాహ పెకలించి తెచ్చి ఢిల్లీయందుఁ దననగరున నాటించుకొనియెను. ఇతని కాలపుచరిత్రను వ్రాసియుంచిన జయా-ఉద్దీ - బాగ్ని క్రిందిరీతిని దీనికథను 'జెప్పుచున్నాఁడు.

“స్తూపమును పరుండ బెట్టుటకు నుత్తమమార్గమును బాగుగ యోజించిన పిడప నా ప్రాంతములందలి " కాల్బలమును నాశ్విక సైన్యమును దక్కుంగల జనసామాన్యమును నచ్చటికీ, రావలసినదని ముదలయాయెను. అప్పనికి నర్హమగు సర్వవిధో

పకరణములను బ్రతిమాసవుఁడును దేవలసినదనియు నుత్తరువు,
ఆశోకుని శిలాస్తూపము.

పుట్టెను. బూరుగుప్రత్తి బస్తాలుబస్తాలుగ వచ్చి చేరుటకుఁ దగు నేర్పాటు లొనర్పఁబడెను. స్తూపమునకుఁ జుట్టును గొల్లలుగ నీప్రత్తిపఱచి వైచిరి. స్తూపము గ్రింది భాగములోని మట్టిని దీయుటతో నది యల్లనల్ల నదనకొఱ కేర్పడిన మెత్తపయిఁ బడెను. ప్రత్తికొంచెము కొంచెముగఁ దీసి వేయఁబడెను.. స్తూపము భూమిపై సురక్షితముగఁ బడియుండెను. త్రవ్విన భాగమును బరీక్షిం షఁగా నొక పెద్ద చదరపురాయి దీని కాధా రముగా నిడియుంట దెలిసెను. దీనినిగూడ పెకలించి దీసిరి.. స్తూపమునకు దెబ్బ దాకకుండుటకయి దాని కావరణముగ మెత్తని తుంగగడ్డియు తోళ్లును వైచి కట్టిరి. నలుబది రెండు చక్రములతో నొక బండి సిద్ధమా యెను. ప్రతిచక్రమునకును నొక్కొక్క- తాడు కట్టియుంచిరి. ఒక్కొక్క త్రాటికడను వేల కొలఁది జనులు పనిచేసి మిక్కిలికష్టముతో నాస్తూపమును శక టముమీఁది కెక్కించిరి. తరువాత గానుకు గానుకు నొక్కొక్క మోకును బంధించి, మో కొక్కింటిని నూరుగురుజనులు పట్టి లాగి, యీ బండిని యమునానదీతీరమునకుఁ దెచ్చి విడిచిరి. సు ల్తానుగా రీస్తూపము సాగుటను వీక్షింప నటకే తెంచిరి. అదివఱకే 2000 మణుగుల బరువునకుఁ దక్కువగాక 5000 ను 7000 ను మోయఁగలుగు గొప్ప పడవల నేకములు యమునా నదియందు

బారుగాఁగట్టియుండెను.మహాచాతుర్యముతో స్తూపమాపడవలు
కాశ్మీర ద్వారము.


కాశ్మీరద్వారము-ఇది పట్టణమున కుత్తరభాగము: నున్నది. క్రై స్తవచర్చి కిని ప్రభుత్వ పువారి కార్యాలయములకును నిది దగ్గర.


పై కెక్కింపఁబడి ఫిరోజాబాదుకుఁ గొనిపోఁబడెను. అచ్చట నెంతో ప్రయాసతో నిద్దానిని నగరుఁ జేర్చిరి " *[2]

ఇది నగరు చేరిన పిదప దీనిని నిలుపుట కొనర్చిన పరి శ్రమ గూడవర్ణ నీయమే. ఢిల్లీయందలి చతురులగు పని వా రెల్లరును జేరి మిక్కిలి జాగరూకతతో విచారించి యొక యుపా యమును బన్నిరి. సున్నముతోను గార తోడను నొకకట్టడ మును గట్టి యొక్కొక యంతస్థు ముగియుటతోడనే ఆయంత స్థు పై కీ స్తూపపుఁ జివర నెక్కించుచువచ్చిరి. ఇట్లెక్కింప నెక్కింప నొక యెత్తేర్పడెను. తరువాత స్తూపమును సమ రేఖాకృతిగ నిలువఁ బెట్టు టకుఁ గొన్ని యంత్రములు పన్ని మిక్కిలి శ్రమ చేసి కార్యము సాధించిరి.

ఈ స్తూపము 37 అనుగల ఎత్తుగలదు. పీఠ భాగమునఁ జుట్టు కొలత 9 అడుగుల 4 అంగుళములు. దీనిపై చెక్కఁబడిన య శోకుని నాలుగు శాసనములును చెక్కు చెదరకున్న వి. ఇవియే భరతఖండ చరిత్రమున నిలిచియున్న శాసనములలో బ్రాచీన తమములు(క్రీ! పూ. మూఁడవశతాబ్దము). క్రీ! శ | 1164 సంవత్సరమున చౌహణ్ రాజగు నీసల దేవునిచే రచియిం పఁబడిన శాసన, బొండుగూడ దీని నలంకరించుచున్నది. ఇంకను ఢిల్లీయంద నేక ప్రేక్షణీయ విషయములు గలవు గాని యవి యెల్లయు వర్ణించుట కిచ్చట తావుచాలదు. .............................................................................................

లాహోరుద్వారము.


లాహోరు ద్వారము - ఇది పశ్చిమ భాగముననున్నది. ఇటనుండి

చాందినీ చౌకుకు బాటకలదు.

ఢిల్లీ ద్వారము.

ఢిల్లీ ద్వారము - ఇది పురమునకు దక్షిణ ముఖమున నున్నది. 4


ద్వార ము లు.

కాశ్మీరద్వారము, లాహోరుద్వారము, ఢిల్లీ ద్వారము, అనునవి వీనియందు ముఖ్యములు. ఈ ద్వారముల పటములను మాచదువరు లిందు చూడఁగలరు

తోటలు

రాణి తోటయనునది షహజహాను బాదుషాహగారి పుత్రిక యగు జహనారా బేగముచే వేయఁబడిన ఉద్యానవన మని ప్రతీతి గలదు. దీని మధ్య ప్రదేశమున యమునాకాలువ లోని యొక శాఖ ప్రవహిం చుచున్నది. దీనివలన నీయుద్యాన వన మిప్పుడును బహుసుందరమయి యలరారు చున్నది. కాని పూర్వకాలమున సంతకంటె సుందర తరముగ నుండియుండెనను టకు సందియము లేదు. ఇప్పుడీ యుద్యానవనము నలంక రించు వస్తువులలో శ్రీ విక్టోరియా మహారాణి గారి శిలారూప మొక్క టియు రాతితోఁ దీర్చఁబడిన ఏనుఁగుస్వరూప మొక్కటియు నున్నవి. ఈ రాతి ఏనుఁగు పూర్వము ఢిల్లీ ద్వారమున నుం డెడిది. ఢిల్లీయందీ యుద్యావనన 'మొక్కటి గాక దర్శింవ సర్హల ములగు సొంపైన తోటలు మఱికొన్ని గలవు. అందు ‘సంతోషసదన' మని యర్థమిచ్చుచు ఔంగ జేబు పట్టాభి షేకమునకు స్థానమయి చెలువొందిన షాలిమరు తోటయును, రాణితోట వేయించిన జహనారా బేగము సోదరియును ఔరంగా జేబు పక్షువ ర్తియు నయిన రోషనారావలన వేయఁబడిన రోష

నారా తోటయును యమునానది తీరమునంగల కుద్సియా తోటయును ముఖ్యములు.

వీధు లు.

ఢిల్లీయందు పెద్దవీధులు పది గలవు. వీనిని నైర్మల్యము న నేమి,. ప్రకాశమున నేని, సౌకర్యమున నేని, వై శాల్యమున నేమి మించువీధులు గల పురము భరతవర్షమున మఱొక్కటి లేదు. ఇందు ముఖ్యము చాందిని చౌకు. చాందిని చౌకు అనగా రజత వీధియని యర్థము. ఇది కోటలోనుండి లాహోరు ద్వారమునకు 1 మైలు వ్యాపించుచున్నది. దీని వెడలుపు 74 అడుగులు. దీని మధ్య ప్రదేశమున నుండు కొంచె మెత్తగు బాటకు రెండు వైపులను వృక్ష పంక్తులు పాంధులకు జల్లనినీడ నీనఁ గంకణము గట్టి నిలుచొని యున్నవి.

దర్బారునీధి యనునది ఢిల్లీ రాజ మార్గమునుండి పోవు చీలిక లలో నొక్కటి. దీని కుత్తర భాగమున నె బవారిమైదానము గలదు. ఈ బవారి మైదానమె దర్బారు రంగము. ఇది కాశ్మీర ద్వారమునుండి 34 మైళ్లున్నది. ఇచ్చటనే 1977వ సంవత్సర మందు విక్టోరియా మహారాష్ట్ర కాలమున లిట్టను ప్రభువును, 1903 న సంవత్సరమున సప్తమైడ్వర్డు చక్రవర్తి గారి ప్రతినిధిగ లార్డు కర్జనును. దర్బారుల నడిపిరి. ఇచ్చట నే కడచిన ' డిశం బరు మాసము పండ్రెండవ తేది మంగళ వారమున సర్వ

సామంత ప్రభువులును ప్రజలును నేత్రపర్వముగాఁ జూచుచుండ

దర్భారువీధి,


ర ము. శ్రీపంచమ జార్జి సార్వ భౌముఁడును నతని యర్ధాంగలక్ష్మీయగు శ్రీ మేరీ చక్రవ ర్తినియును స్వయముగ నే తెంచి మున్నెన్నఁడు నెఱుఁగని మహానై భవమున మూర్థాభిషిక్తు లయిరి.

  1. మద్రాసునందు లైట్ హౌసు పై కెక్కి.. దీపముండు అరను చేరిన తరువాత, జనులు చుట్టుంగల. నగరప్రదేశమును జూచుటకయి ఆ అరనుండి బయటికి వచ్చి "నిలచుటకు ఆ ఆరచుట్టును గొంచెము 'వెడలుపు; లైట్ హౌ సను స్తంభమునుండి నిక్క పొడుచుకొనుచున్నదో నాఁ దోపింప జేయు బయలు ఆటక వేయఁబడినది. దాని చివర రక్షణార్ధము కమ్ములతోఁగ టక మమర్పఁబడినది. ఈ విధమగు శిల్పములకు సజ్జలని పేరు,
  2. "ఫెర్గుసను గారి కొన్ని వాక్యములకు భాషాంతరీకరణము.