జ్యోతిష్య శాస్త్రము/మేషలగ్నమునకు మిత్రు, శత్రు గ్రహములు ఏవి?
14 . మేషలగ్నమునకు మిత్రు, శత్రు గ్రహములు ఏవి?
కాలచక్రములో పండ్రెండు భాగములలో మొదటిది మేషభాగము అంటాము. మొదటిది కావున అది బేసి సంఖ్యలో చేరిపోవుచున్నది. అది బేసిసంఖ్య కావున దానికంటే ముందున్న 12 అను సరిసంఖ్యను తీసుకోవలసి యుండును. ఎందుకనగా 2:1 అను సూత్రము ప్రకారము, ముందు సరి సంఖ్యతోనే గ్రహాల మిత్రు, శత్రువులను విభజించవలసి ఉండును. అందువలన మేషలగ్నమునకు మొదటి సరిసంఖ్యjైున మీనలగ్నమును తీసుకొని చూడవలెను. అపుడు మీన, మేష రెండులగ్నములు ఒక వర్గములో చేరిపోవును. అలా మొదట వచ్చిన రెండు లగ్నముల అధిపతులైన గ్రహములు ఒక పక్షముకాగా, తర్వాత గల వృషభ, మిథునముల అధిపతులైన రెండు గ్రహములు మరొక వ్యతిరేఖ పక్షములో చేరి పోవుచున్నవి. ఆ తర్వాత వచ్చు సరి బేసి సంఖ్యలగ్నముల అధిపతి గ్రహములు చంద్రుడు, సూర్యుడు ఇద్దరు ఒక పక్షములోని గ్రహములవు చున్నవి. తర్వాతనున్న బుధ, శుక్ర గ్రహములు ప్రతిపక్షమగుచున్నవి. ఈ విధానము ముందు చిత్రించుకొనిన 16వ లగ్న పటములో చూచెదము.
మనిషిగానీ లేక ఏ జీవరాసిగానీ పుట్టినపుడు గుర్తించబడునది లగ్నము. మనిషి శిశువుగా పుట్టిన సమయములో కాలచక్రములోని సూర్యుడు కర్మచక్రము మీద ఎన్నో భాగములో ఎదురుగా నిలిచి ఉన్నాడో ఆ భాగము
యొక్క ఆ సంఖ్యను లగ్నముగా గుర్తించుకొని, పైన పటములో గల కాలచక్రములోని ద్వాదశ గ్రహములు ఎక్కడెక్కడ గలవో అక్కడనే గుర్తించుకొని చూడడమును పూర్వము ‘జాఫతకము’ అనెడివారు. దానినే ఈ కాలములో ‘జాతకము’ లేక ‘జన్మలగ్నము’ అంటున్నాము. ఆ రకముగా గుర్తించినపుడు జన్మలగ్నము మేష భాగము అయితే దానిని మేషలగ్నము అంటున్నాము. మేష లగ్నమునకు 2:1 ప్రకారము శాశ్వితముగా (12) ద్వాదశ స్థానాధిపతి గురువు, (1) ప్రథమ స్థానాధిపతి యగు కుజుడు మరియు (4) చతుర్థ స్థానాధిపతియు (5) పంచమ స్థానాధిపతియగు చంద్ర, సూర్యులు, అలాగే (8) అష్టమ, (9) నవమ స్థానాధిపతులగు భూమి, కేతువులు మిత్రులగుదురు. శాశ్వితముగా మేషలగ్నమునకు గురు, కుజ, చంద్ర, సూర్య, భూమి, కేతువను ఆరు గ్రహములు మిత్రుగ్రహములని చెప్పవచ్చును. త్రైతసిద్ధాంతములోని మూడు ఆత్మలను కర్మలేనివి, కర్మవున్నవి అనియూ, కార్యము చేయునవి కార్యము చేయనివి అనియూ రెండుగా విభజించి, దాని ప్రకారము 2:1 అను సూత్రమును అనుసరించి మిత్రు శత్రుగ్రహములను కనుగొన్నాము. మొదటి సరి బేసి గ్రహములు మిత్ర గ్రహములుకాగా, రెండవ సరి బేసి గ్రహములు శత్రుగ్రహములగునని కూడ చెప్పుకొన్నాము. దానిప్రకారము మేషలగ్నమునకు ద్వితీయ, తృతీయ స్థానాధిపతులైన మిత్ర, చిత్ర గ్రహములు, అలాగే షట్, సప్తమ స్థానాధిపతులైన బుధ, శుక్రులు మరియు దశమ, ఏకాదశ స్థానాధిపతులైన రాహువు, శని గ్రహములు ప్రతిపక్షగ్రహములగుచున్నారు. దీనిని బట్టి మేషలగ్నమునకు మిత్ర, చిత్ర, బుధ, శుక్ర, రాహు, శని ఆరుగ్రహములు శాశ్వితముగా శత్రు గ్రహములగుచున్నారు.
మేషలగ్నమునకు ఎవరు మిత్రుగ్రహములగుచున్నారో, వారే మీన లగ్నమునకు కూడ మిత్రులగుదురు. అట్లే ఎవరు మేషమునకు శత్రు గ్రహములుగా పేరుగాంచియున్నారో, వారే మీనలగ్నమునకు కూడ శత్రువులగుచున్నారు. కాలచక్రములో చివరిదైన మీనము, మొదటిదైన మేషమును మొదట ఒక వర్గముగా గుర్తించుకొనవలెనని చెప్పుచున్నాము. ఈ విషయము జ్ఞప్తి యుండుటకు, ఎవడైన బాగా ఆలోచించువానిని మీన మేషములను లెక్కించువాడు అని సామెతగా అంటుంటారు. బాగా యోచించువానిని మీన మేషాలను లెక్కించువాడని అంటున్నారంటే జ్యోతిష్యములో మీన మేషముల నుండి గ్రహములను లెక్కించవలెనని అర్థము. అదే విధముగా వృషభ మిథునములను ఈ క్రింద 17వ పటములో చూచెదము.