జ్యోతిష్య శాస్త్రము/వృషభము
Appearance
15. వృషభము
వృషభలగ్నమునకు ఆ స్థానాధిపతియైన మిత్ర, మిథున లగ్న స్థానాధిపతియైన చిత్రగ్రహములు రెండు; అలాగే కన్య,తుల స్థానాధిపతులైన బుధ,శుక్రులు; మకర, కుంభ స్థానాధిపతులైన రాహు, శని అను ఆరు గ్రహములు మిత్ర గ్రహములుకాగా, చంద్ర, సూర్య, భూమి, కేతు,గురు, కుజులు అను ఆరు గ్రహములు శత్రుగ్రహములగుచున్నారు. వృషభ లగ్నమునకు ఎవరు మిత్రులగుదురో మిథునలగ్నముకు కూడ వారే మిత్రులగుదురు. అలాగే వృషభ లగ్నమునకు శత్రువులైన వారే మిథున లగ్నమునకు కూడా శత్రువులగుదురు. వీరు ఈ రెండు లగ్నములకు శాశ్వితముగ మిత్రు, శత్రువులుగ ఉందురని తెలియవలెను. వృషభ, మిథున లగ్నములకు శాశ్వితముగ మిత్రు, శత్రు గ్రహములు క్రింది విధముగ గలవు.