Jump to content

జ్యోతిష్య శాస్త్రము/గుణచక్రములోని భాగములలో ఏది మంచిది?

వికీసోర్స్ నుండి

23. గుణచక్రములోని భాగములలో ఏది మంచిది?

గుణచక్రములో మూడు గుణములుగల భాగములు, ఒకటి గుణము లేని భాగము మొత్తము నాలుగు భాగములుండును. గుణములు ఏ భాగములోయున్నా వాటిని ‘‘మాయ’’ అనవచ్చును. మూడు గుణ భాగము లకు మధ్యలోనున్న గుణములేని భాగమును ఆత్మ భాగమనియూ, మాయా తీత భాగమనియూ, గుణరహిత భాగమనియూ, యోగ స్థానమనియూ అనవచ్చును. గుణచక్రము బయటి వరుసలో మొదటి భాగము తామస గుణభాగము, రెండవది రాజస గుణ భాగము, మూడవది సాత్త్విక గుణ భాగము అను పేర్లతో చెప్పుచున్నాము. మూడు భాగములలోని గుణములు వేరువేరు ఆలోచనలను రేకెత్తించి, ఆలోచనకు తగినట్లు ప్రవర్తింప జేయును. గుణ ఆచరణలో పాపపుణ్య కర్మలు తయారగుచున్నవి. జ్ఞాని అయినవాడు గుణాచరణ వలన వచ్చిన కర్మనుండి తప్పించుకోగలడు. జ్ఞానము లేనివాడు కర్మ నుండి తప్పించుకోలేక దానిని తగిలించుకుంటు న్నాడు. గుణరహిత భాగమైన నాల్గవభాగములో గుణములులేవు. కావున దానిని బ్రహ్మయోగమని చెప్పవచ్చును. బ్రహ్మయోగమున జీవుడున్నప్పుడు కర్మ ఆచరణలేదు. అలాగే గుణ ఆలోచన లేదు. మొత్తానికి కర్మేలేదు. కావున కర్మలేని భాగమైన నాల్గవభాగమే గుణచక్రములో మంచిదని చెప్పవచ్చును.