జ్యోతిష్య శాస్త్రము/కాల చక్రములో 12 గ్రహముల స్వంత స్థానములు ఏవి?
12. కాల చక్రములో 12 గ్రహముల
స్వంత స్థానములు ఏవి?
బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రముల సముదాయముల చట్రములో క్రింది నుండి మూడవ చక్రము కాలచక్రమని ముందే చెప్పుకొన్నాము. కాలచక్రము 12 భాగములుగా ఉన్నదని చెప్పుకొన్నాము. ఆ పండ్రెండు భాగముల పేర్లు 1) మేషము 2) వృషభము 3) మిథునము 4) కర్కాటకము 5) సింహము 6) కన్య 7) తుల 8) వృశ్చికము 9) ధనస్సు 10) మకరము 11) కుంభము 12) మీనము అని చెప్పుకొన్నాము. కాలచక్రములోని మేషాది 12 లగ్నములను క్రింది 13వ పటములో గుండ్రముగ మరియు చతురస్రాకారముగా చూడవచ్చును.
ఇక్కడ కాలచక్రములోని మేషాది ద్వాదశ భాగములలో 12 గ్రహముల స్వంతస్థానములను క్రింది 14వ పటములో చూడవచ్చును.
ముందు పేజీలోని చిత్రమును బట్టి పండ్రెండు గ్రహముల స్వంత స్థానములు క్రింద ఈ విధముగానున్నవి.
మనలో కొందరికి స్వంత ఇల్లు ఉండిన, ఉద్యోగరీత్యా స్వంత ఇల్లు విడచి, వేరు ఊరిలో ఇతరుల ఇళ్ళలో కొంత కాలము కాపురముండు నట్లు, గ్రహములు కూడ వాటి కర్తవ్య నిర్వహణలో తమస్వంత స్థానములను విడిచి, ఇతర గ్రహముల స్వంత ఇళ్ళలో కొంత కాలము ఉండవలసిన పనియుండును. అందువలన శాశ్వితముగ గ్రహములు వాటి స్వంత ఇళ్ళలో ఉండవు.