గ్రామ బడులకున్ను, పట్టణపు బడులకున్ను చెప్పే విషయముల సంఖ్య ఒక్కటే గాని, బోధన చేసే తీరు మాత్రము వేరుగా ఉంతుంది. రెండువిధాల బడులలోను లెక్కలు చెప్పుతారు గాని, ఇచ్చే ప్రశ్నలు మాత్రము వేర్వేరుగా ఉంటవి. ఒకరీతి బడికి పనికి వచ్చే పుస్తకము, రెండో రీతిబడికి పనికి రాక పోవచ్చును.
"కింటర్ గార్టెన్ "అంటే జర్మను భాషలో "పిల్లల తోట" అని ఆర్థము. ఫ్రోబెల్ అనే గొప్ప ఉపాద్యాయుడు పిల్లలకు పుస్తకాల ద్వార విద్య నేర్పకూడనిన్నీ, ఆటలు, సరదాలు మూలముగా నేర్ప వలసినదనిన్నీ, చెప్పి. ఇరవై ఆటలను కల్పించి నాడు. వీటికి "ప్రోబెల్ బహుమానములు" అని పేరు. పిల్లలు ఈ ఆటలలో ఉత్సాహము చూపేటట్లు అతడు చేసినాడు. వాటి మూలముగా
వారికి విద్ద్యాభివృద్ది చేసినాడు. ఫ్రోబెల్ అనంతరము అతనిని పద్దతి ననుసరించిన వారు, అతని అభి ప్రాయమును కనుక్కోలేక, అతడే బహుమానాలను ఏర్పరిచినాడో వాటినే గ్రుడ్డిగా అవలంబించినారు. అందు చేత పిల్లలకు వాటిలో ఉత్సాహము పుట్టక పోయినది. ఆటల మూలముగా విద్య నేర్పవలెనన్నీ, పై నిర్బంధమేమీ విద్యావిషయములో పిల్లలకుండ కూడదనిన్నీ, మాత్రమే ఫ్రోబెలు అభిప్రాయము. మొన్నటి యుద్ధమునకు పూర్వమే ఈ బహుమానము మీద పిల్లలకు ఆసక్తి పోయినది. అది చూచి, డాక్టరు మాంటిసారీ అనే ఆమె మరిఒక పద్ధతి మీద పిల్లలకు కొన్ని ఆటలను కల్పించినది. ఫ్రోబెలు పద్ధతి మంచిదా, మాటిసారీ పద్ధతి మంచిదా, అనే విషయములో ఇంకా వివాదము జరుగుతూనే ఉన్నది. పిల్లలకు అవకాశము (Space) ధ్వని, రంగులు, పొడవులు అనే విషయములను గూర్చిన గ్నానము నివ్వడానికి అనేకమైన పనిముట్లను కల్పించినది. ఆ తరువాత కొక్కెములు, గుండీలు మొదలయిన సాధారణ
మైన వస్తువులను తన విద్యాపద్ధతికి సాథనాలుగా ఏర్పాటు చేసినది. ఇప్పుడు జర్మినీలోను, ఇంగ్లాండులోను కూడా, ఇవే బహుమానము లుండవలెననే అభిప్రాయము పోయినది. ప్రతి ఉపాద్యాయురాలున్ను, తేన చుట్టుప్రక్కల కనుగుణముగా ఉండే బహుమానాలను ఏర్పాటు చేసు కొంటుంది. ఫ్రోబెల్ పద్ధతి మంచిదే కాని, దానిని ఉపయోగించడములో తప్పులు చేస్తున్నారని విద్యాధికుల అభిప్రాయము. ప్రపంచమంతటా ఫ్రొబెలు ఏర్పాటు చేసిన బహుమానములే ఉండ వలెననడము అతని అభిప్రాయనికి విరుద్ధము. ప్రతి ఉపాధ్యాయుని యున్ను తన బహుమానాలను పిల్ల తెలివి తేటలను బట్టి తానే ఏర్పాటు చేసుకోవలెను. ఈ బహుమానాలకోసము ఉపయోగించే పదార్థములు బెడద లేకుండా, పిల్లలకు తెలిసినవై ఉండవలెను.
జర్మినీలో నూటికి పది మంది పిల్లలు ఈ కింటర్ గారేన్ బడులకు పోతారు. తక్కిన తొంబైమందిన్ని తమ యిళ్ళలో చదువు కొంటారు.
పట్టణాలలో కింటర్ గార్టెన్ బడులలోనికి పోయే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ బడుల లోనికి పిల్లలను మూడేళ్ళ వయస్సున పంపిస్తారు. అక్కడ వారు ఆరేళ్ళ వయస్సు వరకూ ఉంటారు. పిల్లలు చదవడానికి పుస్తకాలేమి ఇవ్వరు. బొమ్మలు వ్రాయడము, లెక్కపెట్టడము, పాట పాడడము, పిల్లలు తేమంటట తామే నేర్చుకుంటారు.
ఇంటర్ గార్టెన్ బడులకున్ను ప్రథమిక విద్యాలయాలకున్ను ఎట్టి సంబంధమూ లేదు.రెండు బడులు మాత్రము అట్టివి విన్నవి. వాటిలో ఒకదానిలో విద్యావిషయమును బోధించే ఒక అద్యాపకుడు (professor) ప్రోబెలు, మాంటిసారి పద్దతులను ఎట్లు సమయ్వయము చేయడమని పరిశోదనలు చేస్తున్నాడు. ఇంగ్లాండులో వలె కాక, జర్మను విశ్వవిద్యాలయాలకున్ను బోధనాఅభ్యాసన కళాశాలకున్ను సంబంధము లేదు.
తల్లిదండ్రులు సరిగా చూడని పిల్లలకున్నూ, చెడు సహవాసము వల్ల గాని, తల్లి తండ్రుల ముద్దు
చేతగాని చెడిపోయే పిల్లలకున్ను, మాత్రమే ఈ కింటర్ గార్టెన్ బడులు పనికి వస్తవి. ఆరేళ్ల లోపు పిల్లల యెదుట దేశ పటములుంచి వ్రాత, చదువులను నేర్పి, వారి మనస్సులలో ఆయా విషయములను క్రుక్కకూడదు. ఆయా ఆటలను ఉపాధ్యాయినులే ఏర్పాటు చేయవలెను. అని సాధారణముగా పిల్లలు బడులలోను బయటను చూచేవిగానె ఉండవలెను.
పిల్లల మొత్తము సంఖ్యలో నూటికి ఇరవై ఇద్దరు ఈ కింటర్ గార్టెన్ బడులలో చదువు కుంటారు. కాని, ఈ బడులలో చదువుకొనే పిల్లల కంటే, ఇంటివద్ద చదువుకొనే పిల్లలే ఎక్కువ తెలివి తేటలుగలవారని తెలియవస్తున్నది.