జర్మనీదేశ విద్యావిధానము/అధ్యాయము 1

వికీసోర్స్ నుండి

శ్రీ

జర్మనీదేశపు విద్యావిధానము.

ఆధ్యాయము 1.

మధ్యకాలపు జర్మనీదేశములో మూడు వందలకు పైగా పరగణాలు (States) ఉండేవి. వీటిలో కొన్ని చర్చి అధికారము క్రిందను, కొన్ని దొరతనము అధికారము క్రిందను ఉండేవి. ప్రషియా దేశము అభివృద్ధి పొందడము, ఫ్రన్సు దేశములో విప్లవము జరగడము, పంతొమ్మిదో శతాబ్ద మద్య భాగములో జాతీయతా భావము విజృంభించడము, ఈ మొదలైన కారణముల చేత భిస్మార్కు యువరాజు తన పలికుబడి నుపయోగించి వేరు వేరుగా ఉన్న చిన్న చిన్న పారగణాల నన్నిటిని చేర్చి పెద్ద పరగణాలుగా యేయగలిగినాడు. 1870 సం. లో 26 పరగణాలతో జర్మను సామ్రాజ్యము ఏఎర్పడినది. ఈ పరగణా లన్నిటికి ప్రష్యా నాయకురాలు. ఈ ఇరవైయారు పరగణాలలో ఒక్కొకదానికి ఒక్కొక పార్లమెంటు ఉన్నది. మూల ప్రభుత్వము, అనగా జర్మను సామ్రాజ్యము నకు 'రీచ్సటగ్' (Rcichstag) అని ప్రత్యేక పార్లమెంటు ఉన్నది. దీనిలోని సభ్యులను ప్రజలే యెంచుకొంటారు. వాటి వాటి జనసంఖ్యను బట్టిన్ని, ప్రాముఖ్యము బట్టిన్ని, ఏ పరగణావారు ఎందరు సభ్యులను ఎంచుకొనవలెనో ఏర్పాటయి ఉంటుంది. ఈ పార్లమెంటు అధ్యక్షుని ప్రజలే స్వయముగా ఎన్నుకొంటారు.

సైన్యము, పరదేశములతో సంబంధము, పోస్టాఫీసులు, రైళ్లు, ఓడలు, మదలైన వాహనములు ఇవి మూల ప్రథుత్వమునకు సంబంధించినవి. వీటిని మంత్రులు చూస్తారు. రైళ్ల పరిపాలనము ప్రభుత్వము చేతిలోనే ఉంటుంది గాని ఇంగ్లండులో వలె కంపెనీల అధికారములో ఉండదు. మూల ప్రభుత్వమునకు సంబంధించని విషయములను ఆయా పరగణాల మంత్రులు చూచుకొంటారు. ఇండియాలోను ఇంగ్లాండులోను కొన్ని పన్నులను మూల ప్రభుత్వము వారున్నూ, కొన్నిటిని రాష్ట్రీయ ప్రభుత్వముల వారున్నూ వసూలు చేస్తారు. జర్మినీలో అలాగు కాదు. మూల ప్రభుత్వమువారే పన్నులనన్నిటిని వసూలు చేసి చట్ట ప్రకారము ఈ పరగణాకు ఇంత అని ఆయా ప్రభుత్వముల ఖర్చులకు పంచి పెట్టుతారు. పుర పాలక సంఘముల వారు మాత్రము నాటకములు, సినిమాలు, మొదలైన వినోదముల మీదనున్నూ, పురములకు కావలసిన పరత్యేక సౌకర్మములను కోసమున్నూ, పన్నులను విధించుకోవచ్చు.

పెద్ద పరగణాలు రాష్ట్రములు గాను, ఒక్కొక్క జిల్లా (1)(ఘెమైందె) (2)స్టాడ్ట్ (Stadt) అనే భాగములు గాను, విభజింప బడి ఉంటవి. ఇవి ఇంగ్లాండులోని కౌంటీలు, బరోల కున్నూ, ఇండియాలోని తాలూకాలు, పట్టణముల కున్నూ సరిపోతవి. బెర్లిన్ వంటి పెద్దపట్టణములకు రాష్ట్రముల హోదా ఉంటుంది.

జర్మినీ దేశములో మూల ప్రభుత్వమునకు విద్యతో సంబంధము లేదు. ఆయా పరగణాలు తమ తమ విద్యా సంస్థలను తామే ఏర్పాటు చేసుకొని, తామే పరిపాలించి కోవలెను. ఇరవై యారు పరగణాలలోను ఒక్కొక పరగణాకు ఒక్కొక విద్యాంగ మంత్రి ఉంటాడు. అతను ఆ పరగణా శాసన సభకు బాధ్యత గలిగి ఉంటాదు. ఆయా శాసన సభలు మూల ప్రభుత్వము వారు ఏర్పాటుచేసిన సామాన్య సూత్రములకు లోబడి తమతమ చట్టములను ఏర్పాటు చేసుకోవచ్చును. ఉపాధ్యాయులను నియమించడములో గాని, విద్యా విధానములో గాని, విద్యార్తులను బడులలో చేర్చు కొనే విషయములో గాని, మూల ప్రభుత్వము వారు జోక్యము కలుగ జేసుకోరు.

జర్మినీ దేశములో యూనివర్ సిటి విద్ద్యార్థులు ఏదో ఒక యూనివర్సిటిలోనే ఉండిపోరు. తమ అనుభవమును వృద్ధి చేసుకొనటకు ఒక యూనివర్ సిటీనుంచి మరియొక యూనివర్ సిటికి పోతూ వుంటారు. ఆఖరు పరీక్షకు మాత్రము ఏదో ఒక యూనివర్ సిటిలో స్థిరపడతారు. అందు


4

చేత ఒక పరగణావారి యూనివర్ సిటిలో ఆపరగణాలోని విద్యార్థులకంటె ఇతర పరగణాల విద్యార్థులే ఇక్కువ మంది ఉండవచ్చును. ఇండియాలో వలె, ఒక యూనివర్ సిటీ ప్రదేశపు విద్యార్థులను మరియొక యూనివర్ సిటీ వారు సాధారణముగా చేర్చుకొనక పోవడములేదు. విశ్వవిద్యాల యములున్నూ, ఉన్నత పాఠశాలలున్నూ మంత్రుల ఆధీనములో ఉండవి. ప్రథమిక పాఠశాలలు మాత్రము గెమిండె, స్టాడ్త్ (తాలూకా బోర్డులు, పురపాలక సంఘములు) అధికారములో ఉంటవి. జర్మినీ లోని విద్యాసంష్తల కన్నిటికిన్ని పెట్టుబడి పెట్టి పరిపాలించేవారు ప్రభుత్వము వారే. ప్రభుత్వము వారి సహాయమును పొందినవన్ని, పొందనివిన్ని, ప్రయివేటు బడులు ఉన్నవి గాని అవి చాల కొంచమే. విద్యా పరిశోధనలను చేయడమునకు మాత్రమే అవి పనికివస్తవి.

యూనివర్ సిటీల మీద స్కూళ్ల ఇన్ స్పెక్టర్లకు అధికారము లేదు.మంత్రి తనకు బదులుగా వాటి చూడడానికి క్యూరేటర్ (kurator)

5

ఆను ఒక సివిలియను ఉద్యోగిని నియమిస్తాడు. ఈ ఉద్యోగి యూనివర్ సిటి పట్టణములో కాపరముండి తన కాలమంతా యూనివర్ సిటీ పని మీదనే ఉపయోగించ వలెను. యూనివర్ సిటీ వారికిన్నీ మంత్రుకిన్నీ జరిగే ఉత్తర ప్రత్యుత్తరములు ఇతని ద్వారా జరుగవలెను. ఒక రాష్ట్రములో ఉండే ఉన్నత పాఠశాలలను స్కూలె కొల్లెగియం (Schule koilegeum) అనే ఇన్ స్పెక్టర్ల సంఘము వారు నిర్వహిస్తారు. ఈ సంఘములో ఆయా రాష్ట్రముల విస్తీర్ణమును బట్టి, ముగ్గురి నుండి ఏడుగురు వరకు ఇన్ స్పెక్టర్లుండ వచ్చును. వీరు ప్రతి ఉన్నత పాఠశాలలు ఏడాదికొక సారి అయినా తనిఖీ

చేసి అబుట్యురి ఎంటెన్ (Abiturientebn) అనే తుది పరీక్షను చేయవలెను. వీరు ఉపాధ్యాయుల పరీక్షలను కూడా చేస్తారు. ఉన్నత పాఠశాలల యుపాధ్యాయులకు జర్మినీలో ప్రత్యేకముగా ట్రైనింగు స్కూళ్లు లేవు. సాధారణ పాఠశాలల లోనే ఉపాధ్యాలులకు ట్రైయినింగు ఇస్తారు.

ప్రాథమిక పాఠశాలలమీద ప్రత్యేకముగా

6

ఒక ఇన్ స్పెక్టరుంటాడు. ఇతను ప్రారంభ విద్యా డైరెక్టరుకె తిన్నగా రిపోర్టు పంపుకొంటాడు. ఉన్నత పాఠశాలల ఇన్ స్పెక్టరుకు ఇతను లోబడి ఉండ నక్కర లేదు. ప్రాథమిక విద్యను గమెండె స్టాడ్ట (తాలూకా బోర్డు, పురపాలక సంఘము) ల వారే చూచుకుంటారు. ప్రభుత్వము వారు ఆ బడులకయ్యే ఖర్చును వీరికిస్తారు. ఆయా గెమెండె స్టాడ్ టులవారి అధీనములో ఉన్న బడుల లోని ఉపాద్యాయుల, విద్యార్థుల మొత్తమును బట్టి గ్రాంటుల మొత్తమున్ను ఉంటుంది. ప్రాథమిక పాఠశాలలు స్థానిక ప్రభుత్వముల వారి అధీనములో ఉన్నా, వాటిని ప్రభుత్యోద్యోగులే తనిఖీ చేస్తారు.

ప్రాన్ సులో వలె ఒక్కొక మంత్రి క్రింద అనేక డిపార్టుమెంటులుంటవి. ఒక్కొక్క డిపార్టుమెంటు ఒక్కొక్క డైరెక్టరు క్రింద ఉంటుంది. మంత్రికి వచ్చే ఉత్తరములన్నీ ఆయా డిపార్టుమెంటుల డైరెక్టరు చూస్తారు. ఈ డైరెక్టర్లు మంత్రులక్రింద శాశ్వతోద్యోగులై వుంటారు. వీరికి ఏతరగతి పాఠశాలల సమాచారము తాము విచారింప వలసి ఉంటుందో అట్టి పాఠశాలలలో ఉపాధ్యాయత్వాభవము ఉండి తీరవలెను.

ఆధ్యాయము 2

వివిద విధ్యాసంస్థలు

జర్మినిలో మొట్టమొదట పాఠశాలలను స్థాపించి పోషించిన వారు చర్చి వారు. కాని మార్టెన్ లూథరు, ప్రభుత్వము వారి అధికారము కూడ చర్చి వారి అధికారమంత పవిత్రమైనదే అని ఒక సిద్ధాంతమును లేవ దీసెను. దీనిని జర్మను ప్రజలు అమోదించిరి. ఇందు వల్ల ఆ దేశపు రాజులకు బలము కలిగి మతమును విద్యను కూడ అభివృద్ధి చేయుటకు బాధ్యతను వహించిరి. ప్రస్తుత కాలములో ప్రభుత్వము వారే ప్రజల విద్య విషయమై బాధ్యతను వహించి యున్నారు. ప్రభుత్వము వారే సమస్త విద్యాసంస్థలను స్థాపించి బాగుగా ఆలోచించిన పిదప విద్యావిధానమును ఏర్పాటు చేస్తున్నారు.


8