Jump to content

జర్మనీదేశ విద్యావిధానము/అధ్యాయము 2

వికీసోర్స్ నుండి

ఏతరగతి పాఠశాలల సమాచారము తాము విచారింప వలసి ఉంటుందో అట్టి పాఠశాలలలో ఉపాధ్యాయత్వాభవము ఉండి తీరవలెను.

ఆధ్యాయము 2

వివిద విధ్యాసంస్థలు

జర్మినిలో మొట్టమొదట పాఠశాలలను స్థాపించి పోషించిన వారు చర్చి వారు. కాని మార్టెన్ లూథరు, ప్రభుత్వము వారి అధికారము కూడ చర్చి వారి అధికారమంత పవిత్రమైనదే అని ఒక సిద్ధాంతమును లేవ దీసెను. దీనిని జర్మను ప్రజలు అమోదించిరి. ఇందు వల్ల ఆ దేశపు రాజులకు బలము కలిగి మతమును విద్యను కూడ అభివృద్ధి చేయుటకు బాధ్యతను వహించిరి. ప్రస్తుత కాలములో ప్రభుత్వము వారే ప్రజల విద్య విషయమై బాధ్యతను వహించి యున్నారు. ప్రభుత్వము వారే సమస్త విద్యాసంస్థలను స్థాపించి బాగుగా ఆలోచించిన పిదప విద్యావిధానమును ఏర్పాటు చేస్తున్నారు.


8

జర్మను పిల్లలు సాధారణముగా ఆరేండ్ల వస్సు వరకు తమ ఇండ్లలోనే చదువు కొంటారు. తల్లి దండ్రులు తమ పిల్లల చదువులను సరిగా చూచుకోలేనప్పుడు వారిని కింటర్ గార్టెన్ (kinder garten schools)బడులకు పంపుతారు. తల్లి దండ్రులు లేని పిల్లలనున్ను , తల్లి దండ్రులు సరిగా చూడని పిల్లలనున్ను, పోషణ గృహములకు పంపుతారు. ఈ పోషణ గృహములను పురపాలక సంఘమువారు నడుపుతారు. నూటికి పది మంది మాత్రమే పిల్లలు కింటర్ గార్టెన్ బడులకు పోతారు. ఆరేండ్ల నుండి పదేండ్లవరకూ వయసు గల పిల్లలందరు, గొప్ప వారైనా సరే వారి తల్లిదండ్రుల రాబడి ఎంత అయినా సరే, చట్టము ప్రకారము గృంట్

షూలె (grund schule) లేక ఐన్ హేట్షూలే(Einheit shule) అన బడే సాధారణ పాఠశాలలకు పోయి తీరవలెను. ఈ సాధారణ పాఠశాలలలో పిల్లలు జీతము లిచ్చుకోనక్కర లేదు. పేదపిల్లలకు అన్నము, బట్టలు, పుస్తకాలు కూడ ఇస్తారు.

9

పదేండ్ల వయస్సప్పుడు పిల్లలను మూడు తరగతులుగా ఏర్పాటు చేస్తారు. (1)ధనవంతులైన పిల్లలు ఉన్నత పాఠశాలలకు పోతారు. ఇక్కడ వారు జీతము చెల్లించవలెను. ఈ బడులలో తొమ్మిదేండ్లు చదుకోవలెను; పందొమ్మిదోఏటా అభ్ట్యూరియెంటెన్ (Abiturienten) అనే స్కూలుపైనలు పరీక్షలో కృతార్థులై ఏదో ఒక విశ్వవిద్యాలయములో చేరవచ్చును. (2) అంత ధనికులు కాని పిల్లలు, మెట్టెల్ షూలె (Mittel schule) అనే మాధ్యమిక పాఠశాలలలొ చేరుతారు. ఈ బడులు ఉత్తమ తరగతిలో చేరిన బోర్డు స్కూళ్ళయి ఉంటవి. వీటిలో పది నుండి పదహారోయేడు వయస్సువరకూ ఆరు సంవత్సరములు చదువుకోవలెను. కాని, తెలివి గల పేదవిద్యార్థులకు నూటికి పదిమంది వంతున ఉచితముగానే విద్య నేర్పుతారు. (3) తక్కిన పిల్లలు మొత్తము పిల్లల్లో మూడు వంతులలో రెండు వంతుల మంది ఉంటారు. వీరు పధ్నాలుగేండ్ల వయస్సువరకు

10

కున్నూ ప్రాథమిక పాఠశాలలోనె వుంటారు. ఆ తరువాత విద్య నేర్చుకోవలెననే నిర్భందము లేదు. పద్నాలుగేండ్ల వరకున్నూ పిల్లలందరూ ఏదో విధమైన బడిలోనికి పోయి తీరవలెను. ధనవంతుల పిల్లలు ఉన్నత పాఠశాలలకు పోయి జీతేములు చెల్లించుకొని పదహారేండ్ల వరకో

పంతొమ్మిదేండ్ల వరకో, చదువు కొంటారు. ఐరోపాలోని చాల దేశములలో నిర్భంద విద్య పద్నాలుగేండ్ల వయస్సుతో సరి. కొన్ని దేశములలో కొంచెము తక్కువగా కూడ వున్నది. ప్రాన్ సులో పండ్రేండ్లకే విద్య చాలించు కోవచ్చును. ఒక పబ్లికు పరీక్ష ప్యాసైతే, పదకొండేండ్లకే మానుకోవచ్చును. ఇంగ్లాండు దేశములో ఈ వయస్సు పది హేనేండ్ల వరకూ హెచ్చించడానకు ప్రయత్నిస్తున్నారు.

జర్మినీ దేశములోని యీ నిర్భధ విద్య యొక్క గొప్ప ఏమిటంటే, మగ పిల్ల వాడు గాని ఆడ పిల్ల గాని పధ్నాలుగేండ్ల వరకున్ను నిర్బంధముగా చదువుకొని, తరువాత ఏదైనా ఒక వృత్తి నవలం



11

బించవలెననిఉంటే జీతేము లేకుండా ఆ వృత్తిని నేర్చుకొంటూ మూడేండ్ల వరకున్ను ఒక పారిశ్రామిక విద్యాలయమునకో ఒక వృత్తి విద్యాలయమునకో పోవలెను. ఆ మూడేండ్లున్ను చదువయిన తర్యాత ఒక వృత్తికి సంబంధించిన పరీక్ష జరుగుతుంది. దానిలో కృతార్థులైతే జీతము గల ఒక ఉద్యోగము దొరుకు తుంది. ప్రాథమిక పాఠశాలలో చదువు కొన్న వ్యవసాయ దారుల పిల్లలు కూడ ఉన్నత గ్రామ విద్యాలయమ్లకు పోవలెను. వాటిలో వ్వవసాయము నేర్పుతారు. దుకాణము మీద ఉండే పిల్లగాని, పొలము మీద కూలి చేసుకొనె వారు గాని పద్నాలు నుండి పదిహేనేండ్లు వయస్సు వచ్చే వరకున్ను ఒక వృత్తి విద్యాలయము నకు పోయి తీరవలెను.


మాధ్యమిక పాఠశాలలలో పదేండ్ల వయస్సున చేరే మగ పిల్లలు, ఆడ పిల్లలు కూడ వాటిలో ఆరేండ్లు చదువుకొన్న తరువాత ఈ క్రింది రీతిగా చేయ వచ్చును.

(1) వారొక ఉన్నత పాఠశాలలో చేరి,


12

అక్కడ మూడేండ్లు చదువుకొని విశ్వవిద్యాలయమునకు పోవచ్చును.

(2) లేదా, వారొక దుకాణములో గాని ఒక పారిశ్రామిక సంస్థలో గాని చేరి, పని నేర్చుకొంటూ, మూడేండ్లు ఒక వృత్తి విద్యాలయ్తములోనో, ఒక పారిశ్రామిక విద్యాలయములోనో, చదువుకొన వచ్చును.

(3) వారు ఒక వృత్తి విద్యాలయములోనో పారిశ్రామిక విద్యాలయములోనో చేరి, తమ కాలమంతా అక్కడనే వినియోగింప వచ్చును.

ఈ వృత్తి బడులలో పుస్తకవిద్య, అనుభవ విద్య కూడ నేర్పుతారు. ఆచదువు అయిన తరువాత, 'గెసెంల్లె ప్రుపుంగు "(Gesselle prufung) అనే పరీక్ష ప్యాసు కావలెను. మంచి పనివాళ్లుండే కొన్ని ఖార్కానాలలోనికి ఈ పరీక్ష ప్యాసయిన వారినే చేర్చుకొంటారు. అక్కడ మరి మూడేండ్లు అనుభవము కుదిరిన తరువాత తిరిగి ఒక పరీక్ష జరుగుతుంది. అందులో ప్యాసయిన వాళ్ళకు ఆచార్య (Master) అనే పట్టా యి


13

స్తారు. బడి వదలి పెట్టిన బాలుడు గాని, బాలిక గాని, జీతము లేకుండా ఏదయినా ఒక కార్ఖానలో అని చేయవచ్చును. కాని, పై గెసెల్లె పరీక్ష ప్యాసయితేనే గాని జీతమివ్వరు. "ఆచార్య " పట్టాను పొందితేనే కాని స్వంతముగా ఒక వృత్తిని అవలంబించడానికి వీలు లేదు.


ఇక పదేళ్ళ వయస్సున ఉన్నత విద్యాలయాలలో చేరే పిల్లలను గురించి అలోచించుదాము. ఉన్నత విద్యాలయాలలో (High school) తొమ్మిదేండ్లు చదువుకోవలెను. సాధారణముగా పంతొమ్మిదోయేట పిల్లలు ఈ బడిలోని తుది పరీక్షను (Abturicoten) ప్యాసవుతారు. అప్పుడు వారు కళలు, విద్ద్యలు, శాస్త్రములు, వృత్తులు, నేర్పే విశ్వవిద్యాలయాలలో చేరుతారు. ఇంజినీరింగు, వర్తకము, వ్యవసాయము, అడవులు, వీటిని గురించి చెప్పే కళాశాలలు ప్రత్యేకముగా ఒక్కొకటి ఒక్కొక విశ్వవిద్యాలయమై ఉండి సాధారణ పట్టాలను, డాక్టరు బిరుదమును కూడ ఇవ్వవచ్చును. "అబ్ట్యురిఎంట్న్ "(Abituri-


14

centen)పరీక్షకు బడిఓ చదివిన కాని, ప్రయివేటుగా గాని ప్యాసయితేనే కాని, ఉన్నత పారిశ్రామిక కళాశాలలో ప్రవేశించడానికి వీలు లేదు. ప్రయివేటుగా ప్యాసు కావడము క్రొత్తగా వచ్చినది. ఈ ప్రయివేటు పరీక్షకు " ఇంటెలిజెన్ సుటెస్టు " (Intelligence Test) అంటారు. డాక్టరు బిరుదమునకు ఆయా విశ్వ విద్యాలయాలలో నాలుగేండ్లు నుంచి ఏడేండ్ల వరకు చదువుకో వలెను. తొమ్మిదేళ్ళున్ను పూర్తిగా ఉన్నత విద్యాలయములో (High school) చదువుకోలేని విద్యార్థులు మాధ్యమిక పాఠశాలలోనుంచి వచ్చేవారి వలె ఉన్నత వృత్తివిద్యాలయాలలో (Secondary Technical Instittes) చేరవలెను.

వయస్సు మీరిని వారి విద్య ఈ మధ్య చాల అభివృద్ధి చెందినది. గ్నానాభివృద్ధిని కోరే స్త్రీ పురుషుల కోసము " ఫోక్ హాక్ షూలె" (Volkhoch schyke) అనే ప్రతేక విద్యాలయాలను ఏర్పాటుచేసినారు. అచ్చటే జరిగే ఉపనాసాలను వినడానికి జీతమిచ్చుకో వలెను. ఆ ఉప



15

న్యాసాల కందరున్ను పోవలెననే నిర్భందముకూడ లేదు. అయినా ఈ బడులలోనికి జన సంఖ్యలో నూటికి ఒకరు విద్యార్తులుగా పోతూనే ఉన్నారు.

మగపిల్లలకున్న ఆడపిల్లకున్ను, ఉన్నత విద్యాలయాలు వేరు వేరుగా ఉన్నవి. ఆడ పిల్లల ఉన్నత విద్యాలయాలకు ' లెజెయం "(Leyziuin) అని పేరు. ఇందులో ఆరేళ్లు చదువుకోవలెను. ఈ ఆరేళ్ళు చదువయిన తరువాత బాలికలు (1)ఉన్నత పారిశ్రామిక పాఠశాలలో (Secondary Technical School) చేర వచ్చును, కేదా (2) మరి మూడేండ్లు "ఓబర్ లిజెయం " అనే బడులలో చదువుకొని, ఒక విశ్వవిద్యాలయములోనో పారిశ్రామిక కళాశాలలోనో చేరవచ్చును.


16