జడకుచ్చులు/రాధపిలుపు

వికీసోర్స్ నుండి

రాధ పిలుపు

మూడునాళ్ళాయెరా మువ్వగోపాల
నినుజూడకేనింక నిలువజాలనురా!
* * * *
కనులలో మెదిలేవు కనకగోపాల
నీచక్కదనమెందు దాచుకోగలవు,
చాటుగా నిలుచుండి పాటబాడేవు,
మరుగున తలవంచి మాటలాడేవు,
ముసుగులో నేమిటో ముచ్చటాడేవు,
తెరలోను రాగాలు తీసెవు కృష్ణ!
* * * *
మురళివాయించరా వరహాలకృష్ణ!
నీజాడలను బట్టుకోఁజాలుదేను
గజ్జెలందెలుమ్రోయ కదపరాకాలు,
నీగుట్టుమట్టెల్ల నే నెఱుంగుదును,
* * * *
నెమిలికుచ్చుతురాయి నిగనిగలాడి
నిను బట్టియిచ్చునంచును తీసినావె?
నీచుట్టుపచ్చగా పూచేనటంచు
బంగారు శాలువాపారేసినావె?

96

జడకుచ్చులు

ఎంతసేపాయెరా యీవనాంతమున
నీకోసమొంటిగా ప్రాకులాడితిని,
ఎందెందు వెదకినా యీబృందయందు
నీవన్నెలే కానరావేల కృష్ణ!
* * * *
పొదలలో పూవు వై పోయినావేమో?
ఆలలో దూడవై యరిగినావేమో?
తమ్ములతీయగా ద్రవియించితేమొ?
కలికి వేణువుతోడ కరిగిసావేమొ?
* * * *
నిన్నెందుజూతురా చిన్నారికృష్ణ!
ఏమూల వెదికేదిరా మోహనాంగ!
* * * *
వెన్న దొంగిలి కానిపింపకున్నావొ?
చీర లెత్తుకపోయి దూరమైనావొ?
తరుణులే నిను దారి తప్పించినారొ?
మధురలో పౌరులే మఱపించినారొ?
* * * *
ఏమి సేయుదునురా నా ముద్దుకృష్ణ!
నినుజూడకేనింక నిలువజాలనుర

97

రాధపిలుపు

రాధను వేధింపరాదురా కృష్ణ
రాధపై కోపింప రాదురా కృష్ణ!
పిలిచిముద్దీయరా ప్రేమాలపిందె
కలిసిక్రీడింపరా కళ్యాణకళిక!