జడకుచ్చులు/ఒకమాట

వికీసోర్స్ నుండి

ఒకమాట

                      1
పుస్తకము హస్తభూషణముగ ధరించి
నడతు వీవీధి నెవఁడవో పడచువాఁడ!
మృదులముఖియు, నర్థోన్ముక్తహృదయయైన
ఈ పరవశగాయనిఁబిల్తు రేమిపేర?
                      2
వంకబద్ధములయి దిగఁడెడు త్రోవ
లందుఁ గా ల్పెకలింపలే కలసి సొలసి
పోవు పాడియావులు తలంవునకుఁ దెచ్చు
భావగర్భనిర్భరములౌ పద్యగతుల.
                      3
వృక్షమున నిగ్గుచేవ లూహించి గొప్ప
గండ్రగొడ్డండ్ర నఱకేటి కాష్టవతులు
స్మృతికిఁదెత్తు రాయోమయ శ్లేష కుటిల
కవచములు చీల్చు గూఢవ్యాఖ్యానములను.
                      4
హరితశాటీకషణ మనోహరనితంబ
యయి ధరణి మేఘదౌత్యము నాచరించు

అమృతరసవతులైయొప్ప నఖిల వికసి
తార్ద్రసుమములు బాలెంతరాండ్రపోల్కి.
                   5
పచ్చగిలిన వసుందరాభాగ్యసీమ
నెల్లయెడలఁ గన్విందుగా నుల్లపిలుచు
పసుబుబూసిన ముత్తైదువల మొగాల
ననుకరించి గుమ్మడిపూవు లందమయ్యె.
                   6
కలికితీగెలఁ బ్రణయమున్ జిలుకరించి
శ్రావణవనస్పతులు పచ్చిరసికులైరి
ఱెక్కలెత్తని బాలశారికలుగూడ
నీడముఖముల గుసగుస లాడదొడగె.
                   7
కం.పలికించిన పలుకఁడితడు
నలినేక్షణ! తెనుఁగుమీఱినాడేమొ సుశీ
తలసుభగంబుగ నాతోఁ
బలుకుము నీవైన చెఱుకు పాలొలుకంగన్.
                   8
గీ.మేళవించిన తీఁగెలమీఁద మీటి
యీ జగన్ముగ్థపదము వాయింతొ? లేక

94

జడపచ్చులు

సఖుఁడు బెజ్జాలువేసి సాజంపు విరతు
లొదుగదీర్చిన వేణు వూదెదవొ? చెలియ!
                        9
గీ. శ్రుతికిఁ చెవులొప్పగించి రుచు లుదయించు
స్వరకలావమ్మునకు మదిన్ వశముఁజేసి
బాహువులు సాచువాఁడ నీప్రణయసుఖసు
గంధబంధుర మగుభావబంధమునకు.
                        10
గీ. చనవులు, విలాసములు, మనోజ్ఞములు నయిన
భవదమృతరాగభోగబాంధవము లతివ!
నాకుఁ బొడగట్టుచున్న వింత యెడముండి
నను నతిస్పష్టముగ దర్పణమునఁ బోలె.
                        11
గీ. పెదవికదలించి పలికిన పొదలపొంత
కదలుచున్నవి నవ్వులింకను శుభాంగి!
త్రెంచిపోసిన ముత్యాలతీరుఁదోప
సూత్రమెందుఁ బాఱేసితో చూపవమ్మ!