జడకుచ్చులు/తిలకము

వికీసోర్స్ నుండి

తిలకము

1. లిమిలన్నియ కలికినుదుటకు
                  కళలుచిమ్మే కనక తిలకమ!
   వలపుకృష్ణుని వయసు తేనెకు
                  పాత్రమయ్యేతిలకమా!

2. పార్వతీసతి ఫాలతమున
            గర్వరాగముఁn గ్రక్కుతిలకమ!
   ధూర్వహుండగు ధూర్జటికి థృతి
            దూలఁద్రోసినతిలకమా!

3. పలుకుపడతుక పసుపునొసటను
            మొలక జీవము లొలుకతిలకమ!
    కలిసిబ్రహ్మను కంఠమొత్తగ
            కౌగిలించిన తిలకమా!

4. రచ్చకీడిచి రమణిద్రౌపది
            కుచ్చెలలుకొని కోకలూడ్చిన
    చిచ్చువలె నాచెలువమొగమున
            విచ్చిమండిన తిలకమా!

99

తిలకము

5. నరకుపైఁబడి కఱకుకోలల
             సరకు సేయక సాహసముతో
    నరకసాగిన నాటిసత్యా
             వనమునంటిన తిలకమా!

6. వెడదకత్తులు వేటలాడే
             కడిదిఘోరపు కదనసీమల
    తడిసివీరుల పడుచునెత్తుట
             థన్యమయ్యే తిలకమా!

7. పరిమళమ్ములు వంతమాడగ
             వరువవుంజికి పైకిపొంగే
    సరసకాముక శయనగృహముల
             చక్కబెట్టే తిలకమా!

8. సిగ్గువలదని చెంపలేయగ
             భగ్గుభగ్గని పచ్చివలపును
    బిగ్గనిలిపే పెండ్లికూతురు
             నిగ్గులేలే తిలకమా!

100

జడకుచ్చులు

9. ఇనుపసంకెల లేసిత్రోసిన
             వనజముఖి దేవకిలలాటము
     నెనసి కంసుని హృదయఫలకము
             మొనవగిల్చిన తిలకమా!

పుట:Jadakucchulu1925.pdf/114