చెన్నపురీ విలాసము/ఉత్తరపద్ధతి

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు.

శ్రీవేణుగోపాలస్సహాయః

పంచమంబగు నుత్తరపద్ధతి - ప్రారంభము.

అందు దంత్రీవార్తా ప్రకరణము. ప్రథమము.

క. శ్రీమత్కొప్పాకపురీ
   ధామశ్రీవేణుగోప దైవగృహపురో
   భూమినిహిత ధ్వజోద్ధో
   ద్దమయ యసో భరణనాగ ధాత్రీరమణా.1

వ.అవధరింపుము.2

ఉ.ప్రోలుసృజించునాడట గ్రుచ్చిననిస్తుల వాస్తుసూత్రము౯
  బోలితుదిన్‌ శుభార్థముగఁ బూంచిన తోరణవైఖరి౯గనం
  జాలినభంబుగొల్వ విధిసాచిన మానగుణంబునానుద
  క్పాళిఁజెలంగుఁ గంబములపై నొకలోహపు తీగ పోగయై.3

మ. అమరుల్మౌనులుమన్‌దపోగరిమ నుద్యద్దూరవార్తాగ్రహో
    రు మహత్త్వంబునుగాంచి రబ్రముగ సూరోపీనులాప్రోలనో
    లి మహాచిత్రముగా ఘటించ్రది టెల్లేగ్రాపునాదాన ని
    క్కముగా దూరపు దీవివార్తల నెఱుంగన్వచ్చునేకత్రుటి౯..4

క.ద్వీపాంతరములఁగలదొర
  లాపురిఁగలదొరలు నెదుటనట్లఖిలము స
  లాపింతురంతరస్థ
  వ్యాపక తంత్రియను ప్రాడ్వివాకి గలుగుట౯.5

శా. హసాహస్తికనేర్ప దూరపువార్తార్థంబు లంతంతటఁ
   బ్రస్తారంబుగనిల్పు జాంఘికుల ఠేవన్ బొల్పగుం దత్సువృ

   త్తప్తోకేతరిలోహరజ్జువున కాధారంబదౌసర్వతో
   న్యస్తప్రోన్నతదండకాండ సముదాయ శ్రేణియందెన్నఁగ౯.6

ఉ. ద్రావక లబ్దశక్తికిని దావలమైతగ నిందునందు వా
   ర్తా వివిధార్థ వైఖరులువ్రాయు తదద్భుత లోహ తంత్రిశ్రే
   యోవిధి నింగిలీష్దొరలకోలి లుఖింపశుభంబు దైవ మెం
   త వడిఁ బూనునయ్యు భయతో ముఖలేఖిని నాఁగనందగున్.7

గీ. ఇంగిలీషులు పూంచు నహీనయంత్ర
   మహిమచే సర్వజనుల కిమ్మహిసుదూర
   బంధుసందేశసపది లాభంబుగలిగెఁ
   బ్రభుసమాడంబరము ప్రజార్థంబుగాదే.6

ధూమశకట ప్రకరణము.ద్వితీయము

చ. నగరికుదీచి వార్థికెలనంగన రాయపురంబుమ్రోలనిం
   పుగ పొగబంళ్ళొనర్చుటకు బూంచిన శాలలు కొట్లునింద్లు ము
   జ్జగముల లేని యంత్రచయసంపదలుం పనిముట్లు వస్తువుల్‌
   మిగుల నెసంగు జూపర కమేయత రాద్భుత మావహింపుచున్.1

ఉ. వాగులవ్రంతలన్నడువ వంతెనలన్సవరించి పార్శపుం
   భాగములందుమించ నలవల్రచియించియుఁగ్రిందదారు సం
   యోగము మిాద నాయసమయోజ్వలపట్టములూంచికూర్పగా
   బాగగు రైలురోడ్దుగనువారికి విస్మయమున్ ఘటింపదే.2

గీ. అచటనొక్క మహాద్భుతం బైనవింత
   వంతెనదనర్చుదానిపై సతతంబు
   ప్రజనడచుఁగ్రిందితూముల రైలు బంద్లు
   పఱచునదిచూడ నద్భుతావహముగాదె.3

<poem>

చ.ప్రణుత చతూర ధాంగములపై పటుమంటప కూటమందుఁజ

 య్యన నుపధానపూర్ణ శయనాసనదర్పణ కుడ్యదీప యం
 త్ర నికరముల్సెలంగ నతిరమయ వినిర్మిత హర్మ్యలీలచే
 కొనుఁబురిరైలుబంళ్లుగనుగొన్నను గన్నుల పండువౌగదా.4

సీ.ఘనఘటాకరినఘ ర్ఘరఘోరనిర్ఘార

           నిర్ఘోషఘోషముల్‌ నింగిముట్ట
 తత్తముఖోత్తంభితోద్దామధూమస్తంభ
          రంధ్ర నిర్యద్ధూమరాజిగ్రాల
 క్రమపరిక్రమదవ క్రక్తాంతదిక్చక్ర
          చక్రచంక్రమణముల్‌చౌకళింప
 ద్రుతజితానిలతాక్షర్య దుర్నిరీక్ష్యాచింత్య
         చిత్రాతివేగ మచ్చెరువు సేయ

గీ.ధూమ్రశకటంబప(?)త్తార్ణవేగ

 దుర్నివారంబులై పర్వు నిర్నిరోధ
 వార్షికాంబుదిమాలికా వళులమాడ్కి
 నుభయ సంధ్యల నగరికి నుత్తరమున.5

చ.అమరులు మున్ను దివ్య మహిమమాతిశయంబునఁగన్న దేవయా

 నములు దివిన్మనోరయమునంజనుఁగామచరంబులంచు వుం
 టిమి యిపుడింగులీషులు పటిష్ఠత జేసిన రైలు బండ్లునే
 గు మహిమనోజవంబును జిగుర్కొనఁగాబురినద్భుతంబుగాన్.

మ.ఉరు యంత్రోజ్వలమైన ధూమశకటంబు బొక్కండుముందూన్పస

త్వరమై వెంకఁదగుల్చు భూరిశకటవ్రాతంబులన్వా రిదో

 
    త్కరమున్నిర్భరమారుతంబుక్రియ నాకర్షించుచుంబర్వుంగ్ర
    మ్మరఁజేరుంబురిషష్ఠి యోజనమునౌ మార్గంనానాటికిన్‌.7
 

వ.మఱియుఁదత్పురప్రకాండంబు భూమండల స్వర్గంబగుట నందుండువారల కనుభావ్యంబుగ భవ్యంబులగు నవ్యతర దివ్యయానంబులఁ జేయంబూనుచందంబునం గొందఱు శిల్పశాస్త్ర మనీషులగు నింగిలీషులు చిత్రమ యంబగు మయమాయనను మేయించి శంబరాలంబవంబగు శాంబరివిడంబియుఁ గడంగి యతి విచిత్రంబుగ యంత్రంబులు తంత్రంబులు మరలు నరలు గీళ్లునుసౌళ్ళుమం గిలకలుంబలకలుం గీలుకొల్పి యనల్ప శిల్ప నాకల్పంబాకల్పంబు వెలయ ధూమయంత్ర శకటంబులును రుచిరతరయాన శకటంబులుం గల్పింప నయ్యేకైక యంత్రశకటంబునకు వెనుక ననేలయాన శకటపరంపర మాలికాకారంబుగ లంకెలిడి తన్ముఖస్థిత యంత్ర శక టాంతరాళంబున దహరకుహరంబుతోడం దగవాడు దహనకుహారంబులోన శిలామయంబులగు వెక్కసంపు రక్కసి బొగ్గులగ్గలంబుగనునిచి పెనిచి యనలంబుదరికొల్పి మరకాఁడొక్కరుండక్కడనిల్చి మఱిమఱి మరద్రిప్పఁ దెప్పరం బుగ లోని యంత్ర చక్రంబులు కులాలచక్రంబులు క్రియన వక్రవేగంబున గిఱగిఱందిరుగఁ గెలలిగిఱిగొనుచుఁ గర మడరు కరువలిందవులుకొని రవులుకొనంజిగిమిగుల నెగడుచుం బుగబుగనబుగులుకొని తదగ్నియంత్రో పరిప్త లోత్తంభితోత్తాన ధూమస్తంభ నాళరంధ్రంబున నుద్దామ ధూమస్తోమరేఖావలయంబులు వెడలి లయకాలవిలయ ధూమకేతుబ్రమంబాపాదించుచు నభ్రంకషంబులై నెగయఁదాదృగ్విధయంత్ర దహనంబు బహుల హేతిఛ్ఛట జటిలంబుగ భగ్గుభగ్గు రంబుట్టి బెట్టెగఁదట్టి దట్టంపుమంటలు బెట్టిదంబుగ నెట్టుకొనంబట్టుయ్య చుట్టునుం దొట్టిలోనం బట్టిన నెగదొట్టు నుదకపూరంబుగ్రాఁగి తెకతకనుడికి మసలి వెసరుల వసంగ సరెత్తి దిగువాఱముసురుగొను నావిరి వావిరింగావిరి కొని తీవరంబువావికి న్వెంకనూల్కొలిపిన కుబ్జయంత్రస్తంభనాళద్వారంబులంబోవం దధుద్దామ దహన దాహాతిరేక సంతప్తసలిలసంక్షోభ సహకృత ధూమోద్గమనరభసభవ మహాబలరయవశంబున సుప్తోత్ధితంబు చందంబున జడం బయ్యుఁజేతనంబుపగిది మెల్లన నాదించుచుం గదలి బొదలి నీల్గినిక్కి సాగి జరిగి క్రమ విజృంభితంబైన గరసౌధ రుత్మతరత్న ప్రభాప్రతిఫలనంబునకు జడిసి కడలివెడలి వదనంబున విషానలార్చులు పేర్చి మిగులనూర్చుచు బుసకొట్టుచుంబఱచు మహాద్భుత భుజంగంబు భంగిఁ సేతుసురంగంబులు దూఱి వెడలుచు బడబానల స్ఫులిం గంబులమును కొని ఘూర్ణిళ్ళుచుఁ బశ్చిమా కూపారంబు జేరం బాఱుపూర్వసాగరా భంగ సముత్తుంగ తరంగి భంగికా పరంపరవడువున నిమ్నోన్నతాభోగభాగ విభాగంబు లెఱుంగనీక పుడమిం బర్వుచు జలధి జలంబులు మిగులఁ గ్రోలితత్సలిలాతి భారంబున నెగయంజాలక నేలపరుపుగఁ బరువెత్తు విద్యుల్లతా వలయితానన స్ఫీతంబు లగు జీమూతంబుల భాతి నతిగంభీర మధురంబుగ గర్జిల్లుచు నూర్జితంబుగ బవనజవంబున నానాటికిఁ ద్రింశ ద్యోజనాయామంబు పఱచి యెడనెడ నిలుప నిలుచుచు మరల మరద్రిప్పఁదత్క్రమంబునగ్రమ్మఱ నాపురం బుఁ జేరుచుండు మఱియును.8

గీ.రైలురోడ్డుల రేలఁగంబాలమిాఁద
  జిత్రవర్ణప్రదీపము ల్చెలువుగాంచు

      

   నగ్నితన చిత్రభాను విఖ్యాతి వెలయ
   బహులరూపకృతులు పూని పరగెననఁగ.9

గీ.రైలు రోడ్డునందు రగినందునందుంగం
  బముల కొనల వ్రేలు ఫలకయుగము
  రైలుబండ్లుగదల వ్రేలుచుదిగజాఱు
  వెసదాగమైక పిశునమగుచు.10

వైద్యశాలా ప్రకరణము-తృతీయము.

గీ. ఆపురికి నుత్తరమున వప్రాంతికమున
   సకలలోక హితార్థమా జాతిదొరలు
   ప్రీతి నిలుపఁగ నొక్క యాస్పిటలు వెలయు
   బహు విధామయపీడిత ప్రాప్యమగుచు.1

ఉత్తరశాఖానగర ప్రకరణము-చతుధ౯ము


గీ.చెలఁగు చాకలిపేట సంజీవరాయ
  పేటయును గత్తివాక కాలేటిపేట
  యెరణపురి తిరువట్టూరు మఱియు రాయ
  పురము నలతండియార్పేట పురికుదీచి.1

కాత్యాయనీ ప్రకరణము పంచమము

వ. మఱియు నత్యంత సుకృత కృత్య నిరత్య యసత్య ప్రత్యయంబులై నిత్యాంక నివాసస్తుత్యంబులు నవ్యత్య యాను రూపరూపాభిజాత్య సౌహిత్యంబులు నగుట నావీటికి నపత్యంబులమాడ్కిఁ జూడ్కీ న్వేడ్కబాటించు చుం దీటుకొని గాటంపు నీటుల నాటుకొను నా నాటుపురంబులోన న్మేటియగు కాలేటిపేటలోఁ గారుణ్యంబు నఁ గాణపంగ్వంథాది జనలోకంబులకు కాంక్షితాథ౯ంబులఁ గటాక్షింపఁ గామనీయక సులభవిలోకనీయ కమనీయాకారంబు గైకొని కాంచన ప్రాసాదంబుఁ గావున్న కాలకంఠప్రణయినియుఁ గామితాధ౯ప్రదానియునియుఁ గాకోదరీగణోద్గీత స్వాపదాన ప్రపంచికయుఁ గాళి న్యా(?)కళాకాంతయు గాకోలూకాహుతిప్రియయుఁగాకోల భయసంహర్త్రియుఁ గాకలీకలలాపినియుఁ గాకు స్వరైక సాకూతయుఁ గాకత్రా సకృదర్చితయు గాచగోళోజ్జ్వల గారయుఁ గాంచీదామ విభూతియుఁ గాచస్వర్ణ సమానాశ యుఁ గాంచీపుర నివాసినియుఁ గాంచనాచలశ్ర్ంగస్థయుఁ గాతి౯కేయ ప్రజననియుఁ గాతా౯ంతికకృతాదరయుఁ గాత్యాయనియుఁ గాంతిమతియుఁ గాంతైకలంపటయుఁ గాదంబరీ ససాస్వాదయుఁ గాదికక్షావసానార్ణ మాతృకా మండలాత్మికయుఁ గాదంబ మందగమనయుఁ గాదంబ వనవాసినియుఁ గాదంబినీ కమ్రకచయుఁ గాదర్యేకని వారణియుఁ గాదాచిత్క ప్రకోపాఢ్యయుఁ గాధివ్యాధిప్రమద౯నియుఁ గానీనిక ప్రభాశారకలితా పాంగవీక్షణీయుఁ గానీ నరిపులక్ష్మేక్షణోత్సుకయుఁ గానన ప్రియయుఁ గాపట్యరహిత స్వాంతయుఁ గా పిశాయనలాలనయుఁ గాపిలాది కళాభిజ్ఞయుఁ గాపాలికసుదు౯మయుఁ గామేశ్వరప్రియాలాపయుఁ గామసంధుక్షణౌషధియు గామలీలా రసానంద లోలయుఁ గామకళాతిక్రయుఁ గామేశ్వరియుఁ గామ్యమానయుఁ గామపాలన సహోదరియుఁ గామందకాది నీతిజ్ఞయుఁ గామితార్థ ప్రదాయనియుఁ గామికాద్యాగమాభుజ్ఞయుఁ గామిలాద్య పహాణియుఁ గామనాకామనాతీత స్వభావయుఁ గామచారిణియుఁ గాయికాద్యర్చనప్రీతియుఁ గాయ శుధ్యాది సిద్ధిదయుఁ గారీర్యాదిమన ఫలప్రదయుఁ గారుణ్యవారధియుఁగారణాకారణాతీతయుఁ గారాబంధ ప్రమోచన యుఁ గారండవాదికలిత కాసారైక విహారిణియుఁ గారవల్యాది శాకైకరసియుఁగారికా స్తుతయుఁ గాలాంబుద సమ భాసయుఁ గాలదూతభయంకరియుఁ గాలేయ పంకదిగ్ధాంగియుఁ గాలకంధర కామినియుఁ గాలాగురుప్రధూపై కప్రియయుఁ గాస్వరూపిణియుఁ గావేర్యాది నదీరూపయుఁ గాశీనగర వాసినియుఁ గాశజాధిష్ఠిత స్వాంకయుఁ గాషాయంబరధారుణియుఁ గాశశ్వనది హరిణియుఁ గాసరాసుర మర్దనియుఁ గహళీకమనీ యోరుజఘయుఁ గవిరాజితయుఁ గాళరాత్యాదిసహితయుఁ గాళికాహ్వయయుఁ గాంక్షితార్థ ప్రదాయునియునగు కాత్యాయనీ మహాదేవినిన్ం గాంచినఁ గాలుష్యంబులు కాందిశికంబులుగా నెమఱియును.


మ. అలరారుంబ్రతిశుక్ర వాసర సపర్యారంభముందాహిమా
    చలకన్యామణి గేహసీమన సకేత్సౌవస్తిక స్వస్తియున్‌
    లలితానామ సహస్ర పూజజని తోల్లసంబు దీపోత్కరం
    బులు తౌర్యత్రికముల్‌ ప్రజాకలకలంల్దుందుభిధ్వానముల్‌

మ. భృగువారోత్సవదర్శనోత్సుకత నారీపూరుషుల్మల్లికా
    ప్రగుదంచత్కచహారులై నడతురోజం దత్పురద్వార్గమా

  
   దిగ నాకోవెల ముట్టదిట్టముగఁ దద్దేవీకృపావృష్టి దె
   ల్పఁగంనౌపాండపిపీలికావళులలీల(?)ధ్యనినిండారగన్‌.3

(?).వీటివధూటులెక్కు నతివేగచలచ్ఛకటాళులా
    హాటకశైలచాపధరునంగనగ న్గొనవచ్చుయోగినీ
    కోటిరథంబులట్టు లరుగువ్వడిఁ జాకలిపేట తండియా
    ర్పేటల వీధులందు నిబిరీసములై భృగువాసరంబులన్‌.4

క. కుంకుమ మసరాంకుశార్చా
   లంకారముగాంచి నిష్కళంకద్యుతినా
   శాంకరి శశాంకశేఖరి
   యంకురిత కృపారసాంకురాకృతిఁబొల్చున్‌..5

గీ. అనఘ సౌభాగ్యమారోగ్య మాత్మభవుల
    నభిలషించి వధూలోకమలమి కొలువ
    నమ్మహాదేవి భవనమింపారునెపుడు
    వరవధూమయ మనసుక్రవాసరముల.6


త్యాగరాయ ప్రకరణము-షష్ఠము

(?).తిరువత్తూరునఁ ద్యాగరాజపురజిద్దేవాలయఁబొప్పు శం
    కర శైలంబయి కూటకందరతటా కారంబు ప్రాకారగో
    పుర శారాగృహమంటపంబులు గనంబొల్పారు కోనేరు భా
    స్వరమౌ మానస పంకజాకరమునై భాసిల్లు భావింపఁగ౯..1

గీ.భక్త జనులకు వాంఛితవరములొసఁగి
    పెక్కుకృతులంది సత్కీర్తిఁబేరుగాంచు
    త్యాగరాయాఖ్యదేవుడం దధివసించు
    నలవియే తిరువట్టూరు చెలువుపొగడ...2

      
పంచచామరము.
   ఋజుమ్రదిష్ఠ సత్కరహృష్ట సప్రజోల్లస
   త్ప్రజాప్రజోజ్జ్వలధ్వసంతవాడ రాజ్యధూర్వహా
   ధ్వజస్ఫుర ద్గజాశ్వపూర్ణ ధాటికారి దుస్సహా
  భుజాభుజంగ రాజభోగభోగ భూసుఖావహా.

గద్యము.

ఇది శ్రీమన్మాల్య శైలనృసింహప్రసాద సమాసాదిత సకల శాస్త్ర

సంవిదుపస్క్పత సంస్కృతాంధ్ర సాహితీ పురస్కృత సరససార

స్వత చతురవాగ్ధోరణి మతుకుమల్లి కులమతల్లి కాబ్జవల్లికా

వియన్మణి కనకాద్రిశాస్త్రి బుధగ్రామణి తనూ భవాగ్రణి

నృసింహ విద్వన్మణిప్రణీతంబగు చెన్నపురీవిలాసంబను

ప్రబంధణ్బుబణ్దుఁ బంచమంబగు నుత్తరపద్ధతి

సంపూర్ణము.