చెన్నపురీ విలాసము/అంతరాళపద్ధతి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీరస్తు.

శ్రీవేణుగోపాలస్సహాయః

షష్ఠమంబగు నంతరాళపద్ధతి ప్రారంభము

అందు ముద్రాక్షరశాలా ప్రకరణము. ప్రథమము.

 
క. శ్రీమద్వసంతవాడ
   గ్రామస్థిత వేంకటేశ్వరఖ్యాతహరి
   స్థేమపటుభక్తి నిర్మిత
   భూమశిలాధామనాగ భూపలలామా.

వ.అవధరింపుము.

 
చ. పురిముద్రాక్షరశాలి కనికరమొప్పు న్యంత్ర సంకీలితా
   క్షరభాస్వధనుకోశ సంతతి కళాకాంతుల్పరీక్షింపనా
   దర మొప్ప న్విబుధాధినాధులు నితాంతప్రౌడిరక్షింపఁగా
   నరు దారస్మహిభారతీమహిత భాండాగార సంభావన౯.3
సీ. విద్యానిలయమాది విద్యానిలయము
            కళానిధి జ్యోతిష్కళానిధియును
   శారదానిలయంబు జ్ఞానసూర్యోదయం
            బునల సూర్యాలోకమును సస్వ
   తీనిలయంబు నాదిసరస్వతీనిల
            యంబు వువేక రత్నాకరంబు
   నన వివేకాదర్శమనవత౯మానత
            రంగిణి యువనంగ రమణఁజెందు

గీ.నందు హిందూ ప్రక్లప్తము ద్రాక్షరాల
  యముల శేషమనీషి జనాభినంద్య
  మానవివ్హవాన్వితంబులై మాననీయ
  శారదాటంకశాలికా చారురేఖ.4

చ.జనులెన్నందినవర్తమానియును బోర్ట్సంట్జార్జి గేజెట్క్రిగిం
  టనమిష్నేరియునాఁగమెచ్చనగు నచ్చాఫీసులాయింగిలీ
  షుననృపస్యస్తములప్పు రేందిరతనుంజూడంగ నేతెంచుమా
  తృనికాయంబునకూంచునావసధ భూరిశ్రీఁదనర్చుంబురి౯.5

చ. ఆముద్రాక్షరశాలందు మహితంబౌతండియార్పేట న
   ద్ధామంబాది సస్వతీనిలయ ముద్రావర్ణపద్మంబు సా

54
చెన్నపురీ విలాసము

 
   యామ శ్రీవిలసిల్లుఁ దత్పురిఁ దదధ్యక్షుండు వావిళ్ళ స
   ద్రామస్వామి వివశ్చిదగ్రణి ప్రసిద్ధ ప్రఖ్యగాంచుర్ధర౯.6


హూణదేవాలయ ప్రకరణము-ద్వితీయము

క. అభ్రంలిహశిఖరములు వి
   శుభ్రసుధాలేపవిభవ సుభగములు మహా
   విభ్రమములు పాదురులయ
   దభ్రములగు గుడులు పర్వతభ్రమదంబుల్‌.1

చ.గములయియాదివారముల గాఢపు భక్తిమదిందలిర్పఁగాఁ
  బ్రమదలతోడఁగూడి నిజభావముల న్సకలేశ్వరున్విభు౯
  శమదమయయుక్తి ధ్యానములు సల్పుదురెప్పుడు నన్యకార్య వి
  భ్రమ రహితాంతరంగులు పరంగులు పాదిరిగుళ్ళ నప్పురి౯.2

పోటోగ్రాఫీప్రకరణము-తృతీయము

<poem> శా. ఛాయాగ్రాహిణియాంజనేయుని తనుచ్ఛాయన్వడిన్నిల్పితా

  డాయందీసెననంగవింటిమది చూడన్యంత్రపేటి౯ ఘన
  ప్రాయాదర్శనములందునీడలఁ బొటోగ్రాఫిక్రియన్నిల్వఁగా
  జేయంజాలిరి యింగిలీషులు పురిం జిత్రాతిచిత్రంబుగ౯.1

చ. నలువయొనర్చు స్వగ౯ము వినశ్వరమంతకు మున్నె యాశునా

శుకు ప్రతిబింబ వైఖరులఁజూడఁగఁదాదృశబింబలలీలల
55
షష్ఠమంబగు నంతరాళపద్ధతి

   
  న్నిలిపిరి హూణులద్దముల నిత్యముగాధృతినట్టిశక్తిపెం
  పలరఁగ బొమ్మదేవరవరాన్వయ నాగవిభుండుచేకొనెన్‌.2

ఇలెక్ట్రొగేల్వానిక్మిష౯ ప్రకరణము-చతుధ౯ము


(?).శ్రమమిాఱన్సకల ప్రజాంగకముల న్సంధిల్లువాయువ్యధ
    శ్శమియింపంగ జగద్ధితాధ౯ము ప్రశస్త ప్రౌఢియూరోపిలి
    ట్లు మహాయత్నమున వ్రచించిరియు లెట్రోసేటునవ్విద్యన
   శ్రమతన్నేర్ఛె జగజ్జనోపకరణీచ్ఛన్నాభాజానియు౯.1

వ.మఱియు నాఇలెక్ట్రో గేల్వానిక్మిషనను వైద్యవిద్యకు ద్యోతకంబగునొక్క యంత్రపేటియు మందు ద్రావక ప్రపూర్ణంబులగు కాచ పాత్రములు రెండును వానిలో వ్యస్తంబై యంత్రతంబగు తంత్రీ ద్వితీయంబును గలిగియును నా తంత్రీప్రకారంబు.3


(?).ద్రావకన్యస్తతంత్రులఁగ్రమముతోడ
    జరుగునాకృష్టిశక్తియుత్సర్గశక్తి
    యొకటిఁబట్టిన రభసమించుకయులేదు
    నుభ్రయము గ్రహింపఁ బరగునత్యుల్పణముగ.3

(?).కాయములోని ప్రాణము పెకల్చు మహాలయకాలకాలకా
    లాయనకాలపాశమున కచ్చపునెచ్చలి సర్వదేహభృ
    త్కాయని కాయమందుఁ గలధాతులు పీల్చెడిమారిజిహ్వకుం
    బాయని తోడునీడయగు భారపుతంత్రినిముట్టశక్యమే.4

గీ.కందురీఁగల వొకకోటి గఱచినట్లు
  కూడివెయిమంద్రగబ్బలు కుట్టినట్లు
  దాక మోజేతిని దెబ్బతాకినట్లు
  తల్లడిల్లు ప్రాణములుతంత్రిఁ దాకినంత.5

 
గీ. తేలుకుట్టిన వెత కొంత దేహమంద
    జనుల బెదరించుకై వడిఝూంకరించు
    తంత్రినంటినమాత్రఁజిత్రంబుగాఁగ
    జలజలన దేహమణ్దెల్ల జలదరించు.6

గీ. ఎక్కుడగువింటిచేదూది యేకినట్లు
    గులగులనరక్త మాంసముల్కు దురుగుదల
    బల్లటిలుఁబ్రాణములు మేనుజల్లురనఁగఁ
    దీఁగెదోయి కరద్వయిలాఁగునపుడు.7


పెద్దినాయునిపేట వీధిప్రకరణము.పంచమము

వ.మఱియు నాపెద్దినాయనిపేటలోనం దద్దయునిద్దంపు పద్దులనొద్దికగొని త్రిదివంబునకు సుద్దియగు నాపెద్ద వీధియు సెంబడ పిళ్ళారిగుడి వీధియుఁదండులాది ద్రవ్యంబులునిమము మొదలగు లోహంబులు మందులునుం గ్రంధ ద్రవ్యంబులు నమ్ము నంగడులును స్కందస్వామియను వేలుపు మందిరంబును నతిసుందరంబులగు ఝూర్జ రావణబృందంబులు నమందా శేషవిపణికా సందోహంబులునుం గలిగి చెన్నొందు పెద్దయంగడివీధియుం బ్రవిసారిత నానావిధ వివిధవిచిత్ర చేలానీకలోచనా సేచనకంబగు కోకల వీధియుం బెరట్టుకందం పిళ్ళారిగుడికి నెలవగు వయ్యూం పిళ్ళవీధియు నరుణాచలేశ్వరాల యోపహిండితంబగు విరిశాండీసుబ్బిసెట్టి వీధియు నేకామ్రే శ్వ రోన్న మ్రకమ్రభాస్వరకార్తస్వరస్తంభ రేఖావిక స్వరప్రభా రుచిర సౌధరాజంబునకు నడిపట్టా పిళ్ళారి గుడికినిఁ బట్టగు గుజరాతీ వీధియు నాభీరజనవల్లభంబగు వల్లభ౯దొడ్డివీధియుమన్ని
57
షష్ఠమంబగు నంతరాళపద్ధతి

శ్రీ విభవభద్రంబగు వీరభద్రభవనంబునుం జెంగామంగఛి యుం(?)యంగడియుం బిల్లారిగుడియు మంగల్గి పెంపొందు గోవిందప్పనాయని వీధియు వినూత్నరత్నకాంతిచ్ఛటా మంజులా మూల్య నానావిధాభరణ సువణ౯ ము ద్రికాప్రాజ్యంబగు వాణిజ్యంబుచేబూజ్యంబగు మందవ్ళివీధియు బ్రా౯ష్టూరివ్వీధియుఁ బారిషీ వెంకటాచలయ్య వీధియు వరదాముత్తియప్పని వీధియు మొదలగు వీధులంబ్రసిద్ధినొందియుండునందుఁబెద్దవీధియందు,1


సప్తకూపప్రకరణము షష్ఠము

(?).పురిప్రావృతకూవసస్తక జలంబుల్తద్ఘటీయంత్రసం
    సరణోన్నీతములై దరోదర నివిష్టస్ఫారనాళావళీ
    సరణిన్లోపలికోటఁజేర నటసోజర్లు౯ దొరల్తద్భటో
    త్కరముల్ద్రావుదరందునందుజలయంత్రస్తంభరంధ్రంబుల౯.1

(?).లలినలయేడుబావులజలంబు లితాంతరలీననాళికా
    వలిమిళితంబులై నడచి వారిధి తీరమునందునొక్కయు
    జ్జలజలయంత్రకుండినులువ న్బహుదూరయుయాసులౌసరం
    గులుగొని యోడలందుజలకుండలునింతురునిచ్చనిచ్చలు౯.2


పుష్పకూపప్రకరణము సప్తమము

గీ.ఏడుబావులదొడ్దికినినజుదెసను
  బూలబావులు నామూడుసొలపుగాంచు
  వీటఁగలసకల ప్రజాకోటికెల్లా
  నాజలంబులె పానయోగ్యములుదలప.1

58
చెన్నపురీ విలాసము


మ. పసుపున్నూనియ నిగ్గులంగములపైఁబైఁబర్వతాంబులపుం
    బసపుక్కిళ్ళకునిక్క వన్నెగల వల్వల్గట్టిపూదండలిం
    పెసఁగంగొప్పులఁజంకబిందె చనుదోయిన్రాయఁదత్కూపవా
    రిసతుల్దెత్తురుగుంపులై నగరి దారింజూడ్కిలు న్వేద్కగా౯.2

శా.ఆకూపంబులబుట్టురేయుఁ బగలత్యాశ్చర్యసంమర్దమో
  ెహూకన్పట్టును వేయుచేఁదమఱితీయుంజేఁదయున్మున్నుము
  న్వీకంజేదగ బోవువారు మఱియున్నే ముందునేముందటం
  చాకారించెడివార లైజలము తీయస్సందడుల్సేయగ౯...

చ.పొలుపుగఁబుష్పకూపజలపూర్ణఘటంబులు దొంతిగాశిరం
  బుల ధరియించియయ్యరవ బోటులు వీటనుమేటివీటుకు
  ల్కులనరు దెంతురాత్మజితకుంభసమున్నతి కోర్వకాగ్రహుా
  చ్చలనముగాంచు భంగిబిగి చన్గవపయ్యదమిాఱినిక్కుఁగా౯.4

జంబురాతోఁట ప్రకరణము-అష్టమము


క. జంబూరాజియుతంబగు
   జంబూరాతోటలోఁ బసఁబరంగులునో
   జంబూరాయిడిఁబ్రరా
  జంబూరాడఁగనిల్పు సఖులనఁగదరే.


టంకశాలాప్రకరణము-నవమము


ఉ.ఆపురిటంకశాలవరణాగ్రవిటంక విశంకటాభిత
  స్ధ్యాపితకాచశంకుభయదంబుకఠోరక వాటదు
  ష్ఫ్రాపమనేక హూణభటవగ౯బహుప్రతిహారిగుప్తమా
  లోపలనొప్పుయంత్రగృహలోహహృహాయుధకూట కోశముల్>

      
క. ఆటంకశాల నెపుడు ని
   రాటంకతనొప్పురౌవ్యహాటకతామ్ర
   శ్రీటంకపరికరైకమ
   హాటంకోటంకటాంక్రియాఘోషంబుల్.2

చ.ఒదవగఁద్రుప్పుబిట్టు చిలుమూనినప్రాచిధనంబుగల్గుతొ
  మ్మిదినిధులొప్పునాధనదుమేటి గృహంబదియెంతతత్పురి౯
  పదపడుఁడంకశాలలనపార వినూతపుంజితాన్వహా
  భ్యుదితసువర్ణతామ్రరజతోద్యదనేక సిముద్రికానిధుల్.3

గీ.బీరపువ్వులఁబోలుదీనారసమితి
  రిక్కరేన్బోలురౌప్యముద్రికలగములు
  కర్ణికారభతామ్రటంక వజ్రములు
  రాసులైటంకశాలలరమణఁగాంచు.4

మ.అతిదీఘ౯బతిపీవరంబునిబిడంబభ్రంలిహాగ్రోద్ధితే
   తతధూమంబయిచిత్రమై యనలయంత్రస్తంభనాళంతరై
   భృతిరక్షైకవినిద్ర వాస్తుపురుషాపీతాననోత్తంభితా
   ద్భుతవృత్తాయతధూమవతి౯యననొప్పు౯డంకశాలస్థలి౯...5

ఘూజ౯రవీధీప్రకరణము-దశమము

మ.గుజరాతీలునుబొందిలీలునునమేకుల్మారువాడీలు బే
   రజపుం బేరపునేర్పులేర్పడనర్ఘ్యద్వైవనానామణి
   వ్రజభూషభత్ర్కయవిక్రయంబులు నొనర్పంబొల్పగున్సౌధరా
   జింజెలంగుంగుజరాతివీధిధనలక్ష్మీ నిత్యసంవాసమై.1

చ.అనువుగ గుబ్బుచన్నుగవనంచులు మూయఁగ పట్టుకంచలల్
  తనరఁగదాల్చి వేణులు నితంబతటంబుల వ్రేలసావకుం

   ఠవలయు సౌధమండల విటంకములంగననైరి ఘూర్జరాం
   గనలు విమాన గానిషకాంతలు నాగుజరాతిచీధిలోన్.2

మందవెళివీధిప్రకరణము

చ. పనిగొనకుందలమూలనిడఁ బ్రాతపడున్ఫలమేమటంచు పె
   న్గనులధనంబు పెంపుగని నవ్యతమించఁగ బేరమూన్పనా
   ధనపతి పెక్కురూపములుదాల్చెను నాఁగవణిగ్జనాళిమే
   ల్వినుతివహించు మందవెళివీధినిరత్నమయాపణంబుల౯.1

ఉ. ఆపుటభదనంబునకుఁనాభరణస్ఫురణంబువూన్చుర
   త్నాపణ రాజిలబ్ధపణయత్న వినూత్న చిరత్నరత్నపా
   ళీపటురాసులుల్బణపు నీలఁదనర్చును వారిరాశియా
   త్మీపగరత్నలక్ష్మిపురి యొద్దను దాఁపగనుంచెనోయనన్.2

చ. విరివిఁదనర్చుమందవెళి వీధిసరాబులు నాపణంబులం
   బరచు ననర్ఘ్యరత్న రుచిభాస్వరభూషణపుంజముల్మనో
   హరనగరీ గృహేందిరలకర్థిపృధగ్గతిరత్నగర్భ భా
  సురముల నేడు వారముల సొమ్ములనీనెను నాసిరుల్గను౯.3

పెద్దయంగడివీధీప్రకరణము.త్రయోదశమము

మ. పుడమిన్వేడ్కలుచూడఁగోరినయెడల బొల్పారు నాపెద్ద యం
    గడివీధిం దగఁగన్గొనన్వలయ లోకఖ్యాతమవ్వీధి యే

పాఠశాలా ప్రకరణము-చతుర్వింశము

శా. మేలొప్పద్దగునప్పురంబునను నార్మే౯స్కూలునయ్యాండ్రసన్‌
    స్కూలుంబొల్పగు పచ్చయప్పవిభునాస్కూలున్విచారింప హై
    స్కూలున్లోనగు స్కూలులప్పురిసిరుల్గుల్కుంబఠద్బాలకో
    న్మీలత్కంఠఘళంఘళల్వెలయవాణీ నాట్యరంగాకృతి౯.1

చ. పలకలు పుస్తకంబులును బణిసరోజములంధరించిప
   డ్త్కులుగొని దారుపాళిపయి గూర్చుని వ్రాయుచు బాడుచున్నము
   జ్జ్వలతర వేషము ల్వెలయబాలురు తత్పురిఁబాఠశాలలం
   చలరుదురంగ బాక్సురు చిరాక్షర దైవతపజ్త్కులోయన౯.2

క. హిందువులునుపఁగ నాపుర
    మందలరున మందవి భ్రమాస్పందములై
    హిందూవిద్యానిలయము
    ముందగుపటు పాఠకూటములనేకంబుల్‌.3

హౌసు ప్రకరణము(?)(?)(?)
వాణిజ్యశాలా ప్రకరణము-పంచవింశము

మ.అలయార్బత్నెటుహౌసుబెన్నిహవుసొప్పార౯లయన్హౌసునా
   బలుహౌసుల్మఱిషాపులు న్వెలయుదీప్తశ్రీలనేతతత్పురి
   నల్గిత ద్వైవవిచిత్ర వస్తుకలన న్వారాశిపుత్ర్యేకవ
   త్సలతంపద్మకుఁగూర్చు శైశవకళాంచత్కేళిసద్మాకృతి౯.1

  
చ.వివిధ విచిత్ర వస్తుచయవిభ్రమ మెన్నఁగనేలగాచగో
  ళవిసర వైభణ్బులు ధళద్ధళదుజ్జలదర్పణోపల
  క్ష్యవిపుల భూమికోన్నతలు నద్భుతశిల్పమునొప్పుహౌసులు
  ద్దవిడిగ౯ దిఘీశపురదర్శా కౌతుకముల్లభింపవే.2

శా.నానార్ఘ్యమనోజ్ఞవస్తువుల కేనాడుంబరం(?)రం
  గీ నేత్రల్సనుదెంచి తన్నగరనిక్షిప్తంబులౌషాపుల
  న్మానాతీత విశాలదర్పణగ తామ్లానాంగులైపొల్తుర
  క్షీణక్షీరసరస్వదూర్మి చలదత్సిక్తాప్సరఃప్రక్రియ౯.3

క.హిందువులు నిల్పుషాపులు
  నందలరు౯ హూణులునుచుహౌసులకు ననుం
  గుందమ్ముల హౌసులుమన
  నిందిత సంపదలచే ననేకములరయ౯.4


దశావతార ప్రకరణము-షడ్వింశము

<poem> శా.పాధోరాశిపరు(??????) భ్రాజన్మిధోఘృష్టిసం

  బాధోద్రేక బహిర్గతాత్మజరరస్ఫా యద్విరించాండరే
  ఖాధీదాయిమహోగ్రభూత్క్రుతిమరుద్గాధస్యదాభ్రాటదు
  స్సాధక్ష్మాధరుడౌఝుషేంద్రుడు కృతిస్వామిష్టదుండయ్యెడున్.1

శా.అంభోద్యున్మధనక్షణోద్ధసుర దైత్యక్ష్వేళిత ధ్వాననం

  రణ్భాత్యంత విభిన్న నిష్పతదురుబ్రహ్మాండసౌధోద్యతి
  స్తంభన్మంధ మహిధ్రమూలఫలకాంచత్కృష్ఠనైష్ఠంరని
ర్ధంభుడౌక మలేశ్వరుండుకృతికర్త౯ సంత్కృప౯బ్రోవుత౯.2 పుట:Chennapurivelasa018957mbp.pdf/63

  
    ర్తిలతోద్యత్ఫల కోరక ప్రసవ మాధ్వీభూత సూర్యోడు చం
    ద్రలసద్యోధుని యౌబలుండూకృతికత్ర౯ కూర్మిబాలించుతన్.
మ. స్వమహాబాహుమహీధరోన్మధిత సత్వస్ఫారకంసాది దు
    ర్దమదర్పాబ్ధి సముద్ధితాసదృశవిర శ్రీయశో
    హిమధామామలసత్కధామిష సుధాహృష్టేందుడౌనందనంద
    దనుడే తత్కృతి కన్యకాపతికి నిత్యంబుంబ్రసన్నుండగు౯.9
మ. స్థిరతాడ్యస్వపురంథ్రి కానిభృతపాతి వ్రత్యవర్మాభి
    గుప్తరణ ప్రౌఢిమదుర్జయ త్రిపుర చైత్యచ్ఛేద నార్థాదిక
    స్మరధక్కారిత బౌద్ధశాస్త్రమయ భాస్వచ్చస్త్రరేఖామనో
    హదుడయ్యాదిమ బౌద్ధుడికృతిపుదీర్ఘాయుర్యుతున్ జీయుతన్.10
మ. నిజబహాఫణి జిహ్వకానిభచలన్నిస్తింశనిర్నద్రరా
    హుజ వాక్రాంతనిఘృష్టదంత భవవహ్న్యుద్యచ్ఛిఖాఘృష్టిసు
    ఘజటాలోగ్రతురుష్క మస్తక నిరీక్షానైక భానుగ్రహా
    ర్త జగత్కుకలికి౯ భజించెదకృతిప్రత్యూహముల్ మాంపగన్.11
ఉ. పండితకోటికి౯ మిగుల పామరమందలికి౯ మనంబులం
   పండువుసేయునట్లు మృదుపాకముగా విశదార్థకంబుగా
   నుండగ హూణవైభవము నొప్పగ జేయునటంచు నాగభూ
   మండల భత౯యానతిసమ<బుగ నీకృతినేనొర్చితి౯.12

భుజంగ ప్రయాతము

<poem> గు.హూద్యద్భుజాటోప గూడూరు నీవృ

న్మహాప్రాజ్యసామ్రాజ్య మాన్య ప్రతాపా

   ర్పడ నానావిధచిత్రవస్తుచయ పూర్ణశ్రీలనేకంబులం
   గడులుండన్వెలయుం ద్వీతీయజన లోకంబు న్విడంబించుచు౯.

గుజిరీవీధీ ప్రకరణము-చతుర్దశము

మ.గుజరీవీధిని గుంపుగుంపులు పరంగుల్హిందువుల్బల్దొర
   ల్ప్రజవేడ్కంగన నెక్కుసారటులు తీవ్రంబౌరయంబారగా
   గులిరీవేళఁబరిభ్రమించు జనవద్ఘోట్టాణ ఘోరార్భటి౯
   గజబీజల్గొనియందు నంగడుల లోకవ్రాతమఱ్రాడఁగ౯.1
చ. పెళపెళలీన గంజిబిగివిం కుబుసంబులు మేనుగప్పియం
   చుల జగజంపులిప్పుగని చుట్టుదెసల్పరవం జనేల పై
   నెలమిని జీరువార వెసనీతలు ంరోతలుగాఁగఁ బాదచా
   రలయి చరింతురచ్చటఁ బరంగిన రాంగులు సంజవేళల౯.2
మ.మరుదుల్లోలితఫుల్ల కాశవనసామ్యంబొప్పఁగా సాంద్రబం
   ధురపౌరౌఘము సర్వతోముఖసరత్కోలాహలోన్నిద్రమై
   యరుదారంగఁ జరించునందు గునీయంగ ళ్ళనిందూదయో
   త్సరదూర్మి స్ఫురదంబు రాశికం బ్రతిద్వంద్వత్సింధ్యలన్‌.3
ఉ. దొంగల భంగురద్రఢిమ దొందిలదొడ్డలు నానడంగి వ్రే
   ల్చెంగులముళ్ళు కత్తెరులఁజించి వడున్మటుమాయసేయు నా
   యంగడులందు ఫోలియిసు లారసి దందన సేయుచుండ్రు వా
   రింగడు దానదొంగ గుజరీయంగా నొకపేరుదానికి౯
చ. బడిబడిఁబిల్చి తియ్యనగుపల్కుల నమ్మిక పుట్టగా వెల
   ల్గడు సుతులంట దెల్పి జనఁహాలిడ బేరములందుఁగూర్చుచుం
   గడుసుతనంబు హేళనము గానగుచుం జీరకోట్టి వైశ్యులం
   గడులను మోసపుచ్చుదరు గ్రామ్యతతింబితలాటమేర్పడన్.5

కోకలవీధీ ప్రకరణము.పంచదశమము.

ముత్యాలవీధీ ప్రకరణము.షోడశము.

మ. అతిరమ్యంబగు చెన్నకేశవ గృహంబా చెన్నమల్లీశ్వరా
    యతనంబు పటవీధీవీలకలశోదారాగ్రతంగూడి యా
    దత శోభాఢ్యపురీవధూపృధుకుచద్వంద్వ భ్రమలూర్చుశో
    భితమౌతన్నికటస్ధదీర్ఘికయూఅభీవిభ్రమంబుంగనున్.1

ముత్యాలపేట వీధీ ప్రకరణము.షోడశము

<poem> వ.మఱియు నత్యంత వైచిత్ర్యస్తుత్యంబగు ముత్యాలపేటలో కాళికాభవన పాళికారుచిరంబును మల్లీశ్వర ప్రసా ద మహితంబును దీర్ఘశిలాస్ధగిత దీర్ఘికావర్ఘ్య జలార్ఘ్య ప్రీణితాంతర్ఘ్య స్రేశ్వరంబును నగు పెద్దవీధియు వివిధ విద్రుమ వార్ధుషిక హర్మ్యనుభగంబగు పగడలవీధియు గృష్ణునిగుడివీధియు నట్టపాళేము వీధ్యుఁ వీరపిళ్ళవీధి యుఁ ససంభ్ర మ సరభసభ్రమద్బహులతిలయంత్ర సవిభ్రమభ్రమిా ప్రభవనిర్భరాభ్రతలోత్సర్పదభ్ర ఘటాద భ్రగ్జ రాభ్ర మదఘనారావ ఝూర్ణితంబగు గాండ్లవీధియుఁ గ్రొత్తవీధియుంబట్టుకాశప్ప మోదలి వీధ్యుఁ గప్పల్పోలి సెట్టివీధియుఁ నాగప్ప మొదలిముసైయనందగు నేయికార పొన్నప్పసెట్టి వీధియు సమగ్రవిద్యానిరవ గ్రహంబు ను వివిధద్వజ పరిగ్రహంబు నునై తనగరరాజ కంఠాగ్రహారంబగు కృష్ణప్పనాయని యగ్రహారంబు ను శక్రపురీ సదృశంబగు శక్రసెట్టివీధియుం గట్టకారయారు మొక మొదలివీధియుం గారు జనాకీర్ణంబగు కారకు పేటవీధి యుం బార్కసువీధియు వీరసామి పిళ్ళవీధియు వెంకటమేస్ర్తి వీధియు భేరీవణిగ్జనాస్పందంబులగు తంబు సెట్టి లింగిసెట్టి ముత్తుమారి సెట్టుల వీధులును లబ్బలవీధియుఁ వేశ్యాజనాధికాలో కనీయంబు నోడకాలువీధియు నుత్సవావసర విమానకాయమానం వితాన విలంబమాన వివిధ కాంస్య పాత్రికా లంకృతంబు నత్యుచ్చంబునగు కచ్చాలేశ్వరుని గుడియు విమలసలిల పరిష్కరిణియగు పుష్కరిణియుం గలిగి యమరునరమనవారివీధియుఁ బెద్దపాళమ్మయనుగ్రామదేవత గుడియును గజవదన సదనంబునుం గుదురుకొన రమనీయంబగు నయ్యప్పసెట్టివీధియు సెంగళునీరు పిళ్ళారిగుడివీధియు హూణసందోహమందిర సుందరంబగు నైనియప్పని వీధియు దాదృశంబులగు శంభుదాసు శౌకిముత్తుమలయప్ప యప్పుమేస్త్రి డైమిన్సుజై మిన్సుల వీధులును సమస్త ప్రశస్త నిస్తులాస్తోకవస్తువిస్తాల శ్వేతకాయ వార్థుషికనికాయ వాణిజ్య సౌధమంటప విశాలంబ గు పాపమ్సువీధియుఁ నచ్చారప్పనివీధియు నాండియప్పమేస్త్రి వీధియు వెంకటాచల మొదలివీధియుం ద్యాగ రాయపిళ్ళవీధియు నిరిశప్పమేస్త్రియును త్తుంగతరాభంగ శృంగశృంగారమేదురాది కేశవహరిభవన మంగళంబగు ముంగమ్మవీధియు ముక్కుముత్యామెందులభయు షార్టు సుబ్బరాయమొదలి వీధియుఁ బెడగుంట్లవీధియు నూతభవనంబులచే దట్టంబై ధర్మరాయ దేవసదనంబునకుంబట్టగు మిట్టవీధియు మారుకట్టునుంగలిగి యుండునందు

కచ్చాలేశ్వరప్రకరణము-సప్రదశము

 
శా. కచ్చాలేశ్వరు నాలయాంతరమునంగన్పట్టుదీపచ్ఛటాం
   చచ్చారుచ్ఛవిఁగాయమానముల పంచ౯వ్రేలునచ్ఛాచ్ఛతో
   ద్యచ్చిత్ర ద్యుతిమించు కంచములసాంద్రచ్ఛాయజాజూనని
   ద్యుచ్చక్రాభగనందధీశ్వరుని చిజ్జ్యోతిర్మయత్వప్రధల్‌.1

      
మ.నిబిడాలంకృత పుష్పదామకములు న్మీలద్వితానాగ్రలం
   బబహుస్ఫార విచిత్రకాచమయ దీప్యద్దీపయంత్రచ్ఛటా
   స్తకంబుల్క దళీప్రకాండఘటితస్తంభంబులై పందిరుల్‌
   ప్రబలుందద్విభునుత్సవంబులఁదలపం బుష్పకప్రక్రియ౯.2

పగడాలవీధీప్రకరణము-అష్టాదశము

మ.పొగడొందుం బగడాలవీధి నగరింబొల్పారి ముత్యాల వే
   టఁగళాకల్పము నాననలృగృహకూటస్ఫార శాలోచ్చసౌ
   ధగణాకీర్ణము భూరిపోతవణిగుత్తాల ప్రకీర్ణార్ధరా
   శి గరీయస్తరమై ధనేశ్వరఘనశ్రీమన్నివాసాకృతిన్‌.1

డైమిన్సు జైమిన్సు వీధుల ప్రకరణము.ఏకోనవింశము

మ. వెలయన్ బుట్తలబోలిమస్తములటోపీలొప్పఁ జిత్రంపుబొం
    తలు నెమ్మేనులుగప్ప లాగులు పదద్వంద్వంబులోజేర్ప వే
    డ్కలు సేయుంపుర శ్వేతకాయచయమాడైమిన్సుజైమిన్సు వీ
    ధుల నంభోనిధిఁబాసి యందలరుపాధోమానుషప్రక్రియ౯.1

వేశ్యాప్రకరణము-వింశము

శా. ఇంపున్సొంపును బెంపుసంపద నిలింపైణాసిలగ్గింపఁగా
   శంపాభల్విలసాఖంపచకుచ ల్చాంపేయ నాసల్చల
   ఝుంపాతాళమనోజ్ఞనాట్యభరతాచార్య స్తుతశృఈలసూ
   ర్యంవశ్యల్పురి వేశ్యలుందురు ఘనంబౌ నోడకాల్వీధిలోన్.1

సీ. పెదవి మెదల్చిరా మృదులపల్లవరాగ
             తుములమరందబిందువులుచిందుఁ
   గన్నులల్లార్చిరా కమలకాండోజ్జ్వలో
            త్పలశిలీముఖభావములుగురియుఁ

      
   గాలుకదల్చిరా కలహంసకక్వాణ
           కమనీయలస్య వైఖరులు నెరయుఁ
   గేలుమలంచిరా కిసలయుంబుజని
           లీలాభినయనముల్లేఖలలరు
గీ. మేనుమెలఁగించిరా సరసానుబంధ
   రతిమనోజ్ఞాంతరంగహారములు వఱలు
   వెలయు తత్పురినోదకాల్వీధిలోనఁ
   జెలగు వెలయాండ్రు స్మరజయ శ్రీలుహారే.3
మ.లలితామూల్యతనూవిలాస గుణజాలం బుల్ప్రసారించియు
   జ్జ్వలనైపధ్య మనోజ్ఞవిభ్రమము నెంచందీముఁగా గూర్చియా
   వలితాపాంగ శిలీముఖావళియువవ్రాతంబు వేఁటాడు న
   ట్లలరున్సంజలనిల్చి వాఁకుళుల వేశ్యావారమవ్వీధిలోన్‌.3
మ. కలగానామృత వృష్ట్ఁగంబములు శాఖాపత్రపుష్పచ్ఛటా
    కలన్మించఁగ లస్యవిభ్రమ కలాకల్పంబుల వ్సభ్యులు
    జ్జ్వలచిత్రాకృతిఁ బూనజేయుదు రుదంచల్లీలనవ్వీట వే
   శ్యలు నానాసభలన్మనోభవుని మాయమంత్రశక్తుల్బలె౯4

రాక్షసాంగార ప్రకరణము-ఏకవింశము

గీ.పురిని ముత్యాలపేటకుత్తరమునందుఁ
  గోటకడరాక్షసాంగార కూటతతులు
  కొంగలనలొప్పు తన్మషీక్షోడకలనఁ
  బుడమి నీలాంబరియనంగ బొలుపుగాంచు

కప్పలపోలిసెట్టి వీధీప్రకరణము-ద్వావింశము

 
మ.ప్రణుతింపందగి యొప్పునప్పురిని గప్పల్పోలి సెట్టప్పవీ
ధిని నాముత్తెపుపేట నాభియనబందీగ్రాహముల్చేసి కా
ర్కొను టాటోతులు జారులుం గలహాకారుల్లోను గాఁబట్టిమే
ల్గను కొత్వాలుది కొల్వుకూటమది సాక్షాద్దండనీతిస్థితి౯.1

చ.చలిగొనుచేమగోగవిసి శాకినిమున్గయు మెంతిచుక్క బ
చ్చలులును దోసమావి పనసల్చిటి కాకరపొట్ల బీరవం
గలు సొరగుమ్మడుల్కదలి కాయలుచిక్కుడుకాయలాదికూ
రలుమఱిమాంసముల్పలుదెఱంగులుపొల్పగుమారుకట్టునన్.2


బందీశాలా ప్రకరణము-త్రయోవింశము
పంచపాదిమత్తేభము

  ప్రకటాటోప భయంకరంబు వికటప్రాకారగుప్తంబు దీ
  ప్రకవాటంబు బహిర్విటంకతటలంబ ప్రాణహృత్పాశయం
  త్రకలాపంబు నివాతకూట పటలాంత్తసప్తబందీజన
  ఘకఠోరంబటు యొప్పునప్పురి జయల్ఖానాయుముత్యాలపే
  టకు దగ్భాగమున న్మహానరకవాటప్రోత్కటాభిలమై.1

మ.మలమూత్రక్తమలీమసాంగులు పరిమ్లానాన్యనిమ్నాక్షులా
   విలలోలప్రవికీర్ణ కేసభరులు ద్వేలాంత్రయంత్రయంత్రాభగా
  త్రులు జీర్యన్మలినాల్పకర్పట పరీతుల్గానబందీలు నా
  కులతంజెంది వసింతురందు నరకక్షభ్యజ్జనప్రక్ష్యత౯.2