Jump to content

చీనా - జపాను/1937 యుద్ధము

వికీసోర్స్ నుండి
జపాను

ఐరోపాలో యుద్ధము జరిగితే జపాను బాగా జుఱ్ఱు కొనఁగలిగినది. ఇప్పుడు వచ్చేది ఒక్క ఐరోపాయుద్ధమే కాక దూరపు ప్రాగ్దేశ యుద్ధము కూడా అగును గనుక జపాను అందులో మునిగిపోవునని పాశ్చాత్యదేశము లూహిం చుచున్నవి.

♦♦♦1937 యుద్ధము♦♦♦

ప్రస్తుతము ఉత్తరచీనాలో చీనా జపానులకు యుద్ధము నడచుచున్నది. పీపింగు, టీన్సీలను మొదలగు నగర ముల నుండి చీనాసేనలు తొలగిపోవలెనని జపాను ప్రకటించెను.చీనాసేనలట్లు తొలగలేదు.ఆమిష మిాద జపా ను సేనలు చీనాసేనలనెదిరించినవి.చీనా సేనలు పీపింగువద్ద ఒక దేవాలయములోనికి తరుమబడినవి. బ్రిటను రాయబారులు అపాయమునుంది తప్పుకొనుటకు తాపత్రయము పడుచున్నారు.చీనా సేనలకు జనరలు సంగు చయను అధికారి.అతనికి నాంకింగు ప్రభుత్వము కావలసిన సహాయమునెల్లచేయుచున్నది.టంగుచౌ నగర మువద్ద 500 చీనావారు మరణించిరి. టెలిగ్రాముతీగెలు తెంచి వేయబడుటచే అక్కడి వార్తలు స్పష్టముగా బయటకు రాకున్నవి. ఫ్రాన్సు, బ్రిటను,అమెరికాదేశములు శాంతికొరకై ప్రయత్నించవలసినదని చీనా జపాను ప్రభుత్వములకు సందేశముల నంపినవి.అమెరికా జపానుకు తొమ్మొదిరాజ్యముల ఒడంబడిక ప్రకారము వర్తిం చుమని కబురు చేసినది.

67
70
చీనా-జపాను

నుండి వాల్జిమోస్టాక్‌ అనుప్రదేశం పొడుగునను ట్రాన్సుసైబేరియను రైల్వే అను పేరిట రైలుమార్గము వేసుకొనిరి. దీనికే తూర్పుచైనా రైల్వే అని పేరుంది.రష్యాలో కలిగిన విప్లవంవల్ల సోవియట్టు రష్యాగా మారిన తర్వాత రష్యా వారికి మంచూరియాలోనున్న అధికారం అంతటిని వదలుకొనెను.ఈ సందర్భములో ఈరైల్వేలైను నంతటిని సోవియట్టు రష్యావారు మంచూకో ప్రభుత్వమునకు అమ్మివేసిరి. జపానువారు మంచుకో అంతటిలోను రైళ్ళను వేసి ఒకవైపు రష్యా సరిహద్దులను కాపాడుకొనుటకున్ను మరోవైపున జపానుతో సులువుగా రాకపోకల ఏర్పా ట్లకున్ను తగిన సౌకర్యాలను చేసుకొనిరి.

మంచూకోను చైనా ప్రభుత్వము నుండి విడదీయుటకు జపాను కృషి చేసింది.మంచూకో చైనానుండి విడిపో యింది. ఆ విడిపోయిన ప్రదేశానికి ప్రత్యేక ప్రభుత్వము ఏర్పడినది.ఆ ఏర్పడిన మంచూకో ప్రభుత్వము జపా ను అధికారం క్రిందనుంటూ ఆ మంచూకో ఆర్థిక సౌకర్యాలకు జపానే పెట్టుబడి పెట్టుతూ ఆవిధముగా చైనాలో ఈమంచూకో భాగాన్ని జపాను ఆక్రమించి ఒకవైపున సోవియట్టురష్యా నుండి జపాను సామ్రాజ్యతత్త్వానికి ముప్పురాకుండా జూచుకుంటోది. మరోప్రక్కను మంగోలియా రాష్ట్రాలలో జపాను తన సైన్యమునువుంచి క్రమేణా చైనాను కబళించాలనుకుంటోంది.