చీనా - జపాను/సమృద్ధిలో దారిద్ర్యము

వికీసోర్స్ నుండి
4
చీనా-జపాను

సమృద్ధిలో దారిద్ర్యము

ఈసంబంధముల వలన చీనాప్రజలు నానాటికి దరిద్రులగుచున్నారు.చీనా వ్యావసాయక దేశమై జీవనాధారములైన పంటలన్నిటినీ యెక్కీదొక్కీ పండించుచున్నను, ఈ పంటయంతయు నేమియగుచున్నదో కాని, చీనావారికి కావలసిన ఫోక్తు ఆహారపదార్థములలోనే నూటికి యెనిమిది వంతులు విదేశములనుండి అవి విధించిన వెలలకు కొనుక్కొన వలసి వచ్చుచున్నది.దీనికి సరిపడునట్లు వ్యవసాయమును వృద్ధిచేయవలె నంటే, భూమికి కొదువలేదు.ఇప్పుడు నూటికి 10 వంతుల భూమి సాగులోవుంటే తక్కిన 90 వంతులూ బీడే, ఈ 90 వంతుల భూమి తక్షణ వ్యవసాయమున కర్హమైనదే అయినప్పటికీ అందుకు తగిన పరికరములే చిక్కకున్నవి.పూర్వపు సాగు కాలువలను జలాధారములను మరమత్తు చేయుంచేటందుకు క్రొత్తవానిని నిర్మించే టందుకు దిక్కులేదు.కొన్ని చేలు యెండలకు మాడి పోతూవుంటే కొన్ని వరదలకు కొట్టుకొనిపోవుచుండెను. పేదలై నిరాధారులైయున్న ప్రజలు ఇట్టి దుర్భర వ్యయప్రయత్నముల కెట్లు పూనుకొనగలరు?అన్యదేశ నిర్బంధ ప్రభుత్వమునకు వీరిని బాగుచేయగల సమర్ధతకాని దీక్షకాని యెట్లు కుదరగలదు?

ఈస్వల్పమాత్రపు ఫలసాయమైనను ప్రజలు అనుభవించగలరేమో అంటే,దానిని అమ్ముకొని విదేశవస్తువులను
చీనా

కొనుక్కొని వారు దరిద్రులు కాక తప్పకున్నది.విదేశివస్తు ప్రవాహము నఱికట్టు యీ పంటల యెగుమతి నాపుదమని కొందరు ఫ్యాక్టరీల పరిశ్రమల వైపునకు కూడ మరలుచున్నారు.ఫ్యాక్టరీ పరిశ్రమలంటే పెట్టుబడి తోడిమాట.ఈ పెట్టుబడి ద్రవ్యమునుకూడ ఈ ఫ్యాక్టరీదారులు అప్పుచేసి సంపాదింపవలసి వచ్చుచున్నది.ఈ అప్పులిచ్చేవారు కూడా విదేశస్థులే.ఈ అప్పులకు వీరు పద్ద వడ్డీలు విధించుటయేకాక, యెన్నో వాణిజ్య సౌకర్యములను కూడ గుంజుకొనుచున్నారు.ఇంతకు ముందే వీరు చీనాదేశమంతటను తమ స్వంతఫ్యాక్టరీలను పెట్టి లాభములు అనుభవించుచున్నారు గనుక ఆలాభములకు వట్టము రానట్లుగానే యీ సదుపాయములను వారు చేయుచున్నారు.ఇందు వలన చీనాకు మరింత నష్టమే కాని లాభము కలుగకున్నది.

చీనా గనులలో 930,000,000,000టన్నుల బొగ్గు పడివున్నను,సంవత్సరమునకు 28,000,000 టన్నుల కంటె యెక్కువ త్రవ్వుటకు వీలులేకున్నది.1,000,000,000 టన్నుల ఇనుము పడివున్నను, సంవత్సరమునకు 2,500,000 టన్నుల కంటె యెక్కువ త్రవ్వుటకు సాధ్యము కాకున్నది.ఈగనులలో చాలాభాగము మంచూరియా,జహోలు ప్రాంతములందుంటచేత ఆ భాగ్యమును జపాను దోచుకొనుచున్నదేగాని చీనాకు దక్కకున్నది.ఈ కారణములవల్ల సుప్రసిద్ధమైన చీనా నేత పరిశ్రమలలో నూటికి 85 వంతులు ప్రత్తినూలు బట్టలు, 6
చీనా-జపాను

40 వంతులు పట్టుబట్టలు ఫ్యాక్టరీలలోగాక చేతిమగ్గముల మీదనే తయారుచేయవలసి వచ్చుచున్నది. పెక్కు మంది వ్యవసాయజీవులే యైనను మిల్లులలో పనిచేయువారు 2,750,000 మంది గృహపరిశ్రమలవారు 12,000,000 మంది ఉన్నారు.ఈ పరిశ్రమలవారందరూ దగ్గిర దగ్గర నగరములలోను,విదేశస్థుల మిల్లుల లోను జీవించుటచేత వీరికి మంచి ఐకమత్యము,బలము ఉన్నది.పనిచేయు గంటలు తగ్గించుమని, కూలి హెచ్చించు మని.నిరుద్యోగమును తొలగించమని. ఇతర హక్కులిమ్మని,ఇందుకు తగిన శాసనములుండవలెనని వారు నిరంతరాందోళనము చేయుచు పల్లెటిగ్రామములవారిని గూడ ఉద్బోధించి విప్లమును లేవనెత్త జూచు చున్నారు.చీనాదేశమునకు మహత్తరమయిన శక్తిస్వాతంత్రములు రావలెనంటే వీరి ప్రయత్నములవల్లనే వచ్చుననుటకు సందేహము లేదు.

జాతీయ ప్రభుత్వ స్థాపనము

చీనాకు ఈవిధము ఆర్థికదారిద్య్రము,రాజకీయదాస్యము,కాయిక కష్టము ఒక్కముహూర్తమున సంభవించినవి. దీని కంతటికిని విదేశసామ్రాజ్యతత్వ ప్రభుత్వముల చర్యలే కారణములని చీనాప్రజలు గుర్తించిరి.1900లో బాక్సరుతిరుగుబాటు పేరుతో"యుహొచుఆను" అను ఉద్యమము లేచినది.ఈతిరుగుబాటును విదేశ ప్రభుత్వ ములన్నీకలసి అణగద్రొక్కినను ఉద్యమము మాత్రము