చీనా - జపాను/బూర్జువా, కమ్యూనిష్టు కలహములు

వికీసోర్స్ నుండి
చీనా

బూర్జువా, కమ్యూనిష్టు కలహములు

1928 మొదలు 1936 వరకు

1928 మొదలు 1936 వరకు చీనాలో కమ్యూనిష్టు, బూర్జువా పక్షములకు నిరంతర యుద్ధములు జరుగు చునే యుండెను.క్యూమింటాంగు లేక నాన్‌కింగు ప్రభుత్వమునకు చియాంగు కెయిషేకు అధ్యక్షుడు. తక్కిన పక్షములు కమ్యూనిష్టు నాయకుల అధికారము క్రింద ఉండెను.ఈపక్షములు దినదిన ప్రవర్థమాన శక్తియుక్త ములగుచుండెను.వీని నణచుటకు చియాంగుకెయిషేకు 9యుద్ధములకు తక్కువ కాకుండా ఒనరించెను. ఒకయుద్ధమునందును అతనికి జయము కలుగలేదు సరేగదా కమ్యూనిష్టు ప్రభుత్వము క్రిందికి అనేక జిల్లాలుజారిపోవుచుండెను.

మొదటి యుద్ధము

మొదటియుద్ధము 1930 అక్టోబరునుండి 1931 వరకును సాగెను.ఈయుద్ధములో చియాంగుకెయుషేకు స్వయముగా సేనలను నడిపించి మూడుమాసములలో విప్లవకారులను కలికములోనికి కానరాకుండా చేయుదునని ప్రగల్భములు కొట్టెను.కాని టంగుకూ యుద్ధములో అతను పూర్తిగా ఓడిపోయెను.1928 లో 10,000 సైనికులుగల కమ్యూనిష్టుసేన యుద్ధము తరువాత 62,000 వరకు ప్రబలెను.వీరిలో సగముకంటె యెక్కువమందియొద్ద ప్రశస్తమైన ఆయుధములు తుపాకులు ఉండెను.

2 18
చీనా-జపాను

రెండవ యుద్ధము

అయినను చియాంగు కెయిషేకు నిరాశ చెందలేదు.విదేశ ప్రభుత్వములు అతని అడియాశలను పెంచు చుండెను.వారి యండ చూచుకొని అతను వెంటనే రెండవ యుద్ధమును ప్రారంభించెను.ఈయుద్ధములో కూడ చీనా యెఱ్ఱ సేనలకే జయము సిద్ధించెను.13,28,54 నెంబర్లుగల సుప్రసిద్ధ క్యూమింగుటాంగు దళములు పరాజితములైనవి.ఎఱ్ఱసేనలు కియాంగ్సీ నగరమును స్వాధీనము చేసుకొనెను.తరువాత రాజధాని నగరమగు నాంచాంగు లోనికి ప్రవేశించెను.హూపే,హోనాను జిల్లాలలో సోవియట్టు ప్రభుత్వములను వీరు స్థాపించి నందు వల్ల చియాంగు కెయుషేకు తన సేనలను కియాంగ్సీ రాష్ట్రమునుండి పూర్తిగా తీసుకొని పోవలసివచ్చెను.

మూడవ యుద్ధము

1931 వేసంగి కాలములోనే మూడవయుద్ధము ప్రారంభమాయెను.చియాంగుకెయుషేకు తన ముప్పది దళములను ఒక్కచో ప్రోగుచేసి మూడు మాసములలోగా విప్లవమును రూపుమాపకున్నచో ఆత్మహత్య చేసుకొందునని ప్రతిజ్ఞ చేసెను.మూడవసారి కూడ అతనికి సంపూర్ణ పరాజయమే సిద్ధించెను.విప్లవదళములు కియాంగ్సీ రాష్ట్రము నందలి కెంబో నగరమును స్వాధీనము చేసుకొని పారిశ్రామిక నగరమగు హాంకోను
చీనా

ముట్టడింపబోయెను.దీనితో వారిసేనలు మరీవృద్ధికాజొచ్చెను.కాని చియాంగు కెయిషేకు తనమాట నిలబెట్టు కొనలేదు,ఆత్మహత్య గావించుకొనలేదు.

నాలుగవ యుద్ధము

1932 నుండి చియాంగుకెయి కష్టములినుమడించెను.చీనాలో విప్లవదళములు వృద్ధియగుచుండుటయు తనకు కష్టము లధికమగుచుండుటయే గాక జపానుకూడా చీనాకు ప్రక్కలో బల్లెమై క్రిందను మీదను కూడా పొడవ జొచ్చెను.షాంఘేనగరమును నావలతోను విమానములతోను యెదురుకొనుటయే గాక చీనానుండి మంచూరియా ను విడదీసి దానికి “మంచూకో ” అని ఒక క్రొత్త నామధేయమును పెట్టెను.1911 లో చీనా సామ్రాట్టు పదవి నుండి భ్రష్టుడుగా చేయబడి దిక్కులేక తిరుగుచుండిన హెన్రీపూయిని మంచూకో సామ్రాట్టుగా నొనరించెను. ఈసమయమునందే విదేశప్రభుత్వములు కూడ దక్షిణనగరములపై బాంబులు విసరి అల్లకల్లోల మొనరించు చుండెను.చియాంగుకెయుషేకు అవతల జపాను నెదురుకొనునా,ఇవతల విదేశప్రభుత్వములతో డీకొనునా? రెండును మాని సోవియటు విప్లవులపై తిరిగీ యుద్ధమును అతడుప్రారంభించెను.విదేశ,జపానుప్రభుత్వములతో డీకొనుట కష్టమనియు,చీనావిప్లవులనే చితుకగొట్టవచ్చుననియు అతడూహించి,నాల్గవయుద్ధమును మొదలుపెట్టెను.

19
20
చీనా-జపాను

కాని చీనా విప్లవపక్ష మంతసులభముగా ఓడిపోవునా?ఇప్పటికే కియాంగ్సీరాష్ట్రమంతయు వారిస్వాధీనమైనది. 1931 నవంబరు 7 వ తేదినాడే అక్కడ జూయికిన్‌ రిపబ్లిక్కు స్థాపింపబడి కాంటనుకమ్యూను పడిపోయిన కొరతను పూర్తిచేసినది.కనుక ఈ నాలుగవ యుద్ధముకూడ ఇంతకు ముందరి మూడు యుద్ధములవలె అతనికి పరాభవమునే కూర్చినది.అవతల ఉత్తరచీనాలోనా అతని ప్రతిష్ట పోయినది.దక్షిణమున తన సేనలకు దెబ్బలు తగులుచున్నవి.ఏమిచేయుటకును అతనికి పాలుబోలేదు.హూపే,హోనాన్,అన్హులెయి రాష్ట్రములు కూడా సోవియట్టు ఆధీనమైనవి.

అయిదవ యుద్ధము

అయినను చియాంగుకెయిషేకు సుప్రశస్త సేనాని.అతనికి చీనా పుంజీదారుల సహాయమేకాక జపాను, విదేశ ప్రభుత్వముల మద్దత్తుకూడా ఉన్నది.వెంటనే అతడు 8లక్షల సేనను జాగ్రత పెట్టెను.కాని సోవియటు సేనలు,వర్గములు ఇట్టి బెదరింపులకు లొంగునవి కావు.చియాంగుకెయిషేకు అయిదవయుద్ధము నింకను ప్రారంభిచకముందే యెఱ్ఱ సేనలు షెచ్వాను రాష్ట్రములో అకస్మాత్తుగా ప్రవేశించెను.నాన్‌కింగు ప్రభుత్వమునకు చెందిన రెండుదళములను,క్వాంగుటంగుకు చెందిన ఆరు దళములను కలిపి మొత్తముమీద క్యూమింగుటాంగునకు చెందిన 37 దళములనుయెఱ్ఱ సేనలు ఓడించి,4 లక్షల
చీనా

రైఫిలులను,190 ఫిరంగులను,5000 మిషీనుతుపాకులను 12 విమానములను, అనేకము వైరులెసు పరికరములను స్వాధీనము చేసుకొనెను.ఈయుద్ధానంతరమున సోవియటు సేనలు 2 లక్షల వరకు పెరిగినవి.300 తాలుకాలలో సోవియటులు వ్యాపించిరి. 8 కోట్లు ప్రజలు వీరియాజ్ఞప్రకారము వర్తింపజొచ్చిరి.

ఆరవ యుద్ధము

అప్పటినుంచి చియాంగుకెయిషేకు ఆరవయుద్ధమునకు సన్నాహములు చేయుచుండెను.చీనాపరిశ్రమలను, విమానములను బాగుచేయు మిషతో అమెరికావారు అతనికి 55 కోట్ల డాలర్లను ఋణముగాఇచ్చిరి.కాని ఈఋణముయొక్క ప్రధానుద్దేశ్యము చీనా అభివృద్ధికాదు.సోవియటు రిపబ్లికు యొక్క విధ్వంసము.ఇదికాక జర్మనీ,జపాను దేశములు మంచి సైనికసలహాదారులను, అమెరికా, కనడా,ఇటలీ దేశములు సుప్రసిద్ధ వైమానికదళ నిర్వాహకులను పంపించిరి.1938 సెప్టెంబరునాటికి చియాంగుకెయుషేకు సేన 10 లక్షలు.వీరిలో 4 లక్షల40వేల మందిని చీనా రిపబ్లికుయొక్క మధ్యభాగమునందే అతడు కేంద్రికరించెను.వీరికి 300 విమానములు, అసంఖ్యాకములగు తుపాకులు, గ్యాసు బాంబులు ఇయ్యబడెను.

సెప్టెంబరులో యుద్ధము ప్రారంభమాయెను.కాని 1934 మేయి జూనులనాటికి యెఱ్ఱ సేనలు క్యూమింగుటాంగు యొక్క 7 దళములను సర్వనాశనము చేసెను.50,000 మంది

21
22
చీనా-జపాను

మరణించిరి.లక్షమందికి గాయములు తగిలి కాళ్ళు చేతులు విరిగినవి;12 వేలమంది ఖైదీలయిరి.కాని యెఱ్ఱ సేన 2లక్షలనుండి 2,60,000 కు పెరిగినది.

ఈయుద్ధమింతటితో ఆగలేదు.విప్లవపక్షమునకు సేనలయొక్క ఆవశ్యకతయు ప్రాధాన్యమును బాగా తెలిసినది.చీనా సోవియటు సేనల హెచ్చించి మంచిశిక్షణము నిప్పించుటయందే తమ శ్రద్ధనంతటిని వారు కేంద్రికరించిరి.సేనల బాగుపరచిన తరువాత రివల్యూషనరీ మిలిటరీకౌన్సిలువారి సలహా ప్రకారము వారు మధ్యజిల్లాయగు కియాంగ్సీని విడచిపెట్టి పశ్చిమ ప్రాంతములలో జొరబడిరి.1934 అక్టోబరులో వీరు చియాంగుకెయిషేకు యొక్క 8 లక్షల సేనలమధ్యనుండి యుద్ధము చేయుచు దూరుకొనిపోయి 1935 జనవరి నాటికి క్వాంగ్సీరాష్ట్రమునందలి క్వెయిలిన్ నగరమును చేరిరి.అక్కడున్న క్యూమింగుటాంగు సేనల నోడించిరి.క్వెయిచొ రాష్ట్రమునందలి క్వెయిటింగు నగరమునుదాటి ఫిబ్రవరి మధ్యభాగమునాటికి స్వెషాను ప్రాంతమును ముట్టడించిరి.ఏప్రిల్‌ వరకు వారెన్నో యుద్ధములొనరించుచుండిరి.దీనితో చియాంగుకెయిషేకు యొక్క 8 వ దళముకూడా ఓడిపోయినది.వాంగుకాయిలే అను మరియొక సేనానియొక్క అసంఖ్యాక దళములు ఓడిపోయినవి.

పిమ్మట యెఱ్ఱసేనలు యున్నాను రాష్ట్రములో ప్రవేశించి అక్కద సోవియట్టు సభలనేర్పాటు చేసెను.తరువాత షెచ్వాను
చీనా

రాష్ట్రములో ప్రవేశించి అచ్చటనున్న సోవియట్టు సేనాని హ్సూహ్సిసియాంగుషేను సేనలను కలుసు కొనెను. క్వెయిచొ, షెచ్వాను, సికాంగు, యున్నాను, కాన్సూ,షాన్సీ జిల్లాలను చేర్చి ఒక పెద్ద సోవియటు రాష్ట్రము ను నిర్మించెను.ఈవిధముగా ఇప్పటికి 398 జిల్లాలలో సోవియటు ప్రభుత్వము నెలకొల్పబడినది.ఇప్పటికి యెఱ్ఱ సైనికుల సంఖ్య 5లక్షలు.వీరిక్రింద 19 రాష్ట్రములున్నవి.వీటి పేరులు కియాంగ్సీ, క్వాంటంగు, ఫ్యూకీన్‌, షెకియాంగు, అన్వుహెయి, హోనాను, హ్యూపె, హ్యూనాన్‌, షెచ్వాను, క్వెయిచొ, యున్నాను, సికాంగు, షెన్సీ, కాన్సూ, హ్యోపేయి, ఫెంగ్టీను, కిరీను, హైలంగుకియాంగు.

జపాను ప్రతికూల పక్షములు

18-9-1931 తేదిన్ చీనాలోఒకపెద్ద ఖండమును జపాను ఆక్రమించుకొని మంచూకో సామ్రాజ్యమును స్థాపించినది.మరి నాలుగేళ్ళవరకు ఈవిజృంభణము ఇట్లే సాగినది.చీనాలో సుమారు సగము భాగము జపాను సామ్రాజ్యము క్రిందనో సైనికదళములక్రిందనో నలిగి వారికి లొంగిపోయినది.మంచుకో తరువాత జహోలు స్వాధీనమైనది.పిమ్మట చీనా“పెద్దగోడ”(గ్రేట్‌వాల్‌)చుట్టునున్న ప్రాంతమగు షాంఘయిక్వాను స్వాధీనమైనది. తరువాత లియాంగుటంగు జిల్లాలుని సైన్యములు నిరాయుధములు చేయబడినవి. పిమ్మట సూయనును, చాహార్‌, హోపేయి రాష్ట్రములను జపాను

23