చీనా - జపాను/చీనాలో విజయములు
మంచూకో రాజ్యముయొక్క విస్తీర్ణము జర్మనీ, ఫ్రాన్సు,స్విజర్లేండు, ఆష్ట్రియా దేశముల విస్తీర్ణమంత ఉండును. లోపలి మంగోలియాలో దూరుదమన్నను,అమెరికాను ప్రతిఘటింతమన్నను, ఉత్తర చీనాలో మరింత దొలుచు కొందమనను ఈరాష్ట్రము జపానుకు మిక్కిలి అనుకూలించును.
ప్రత్యేక స్వతంత్రరాష్ట్రమను పేరేగాని చక్రచర్తి హెన్రీపూయిా యొక్క కుటుంబ సంరక్షకశాఖ మొదలు సమస్త రాజకీయ సైనిక పోలీసు ఉద్యోగములును జపానువారివే.జపాను వెళ్ళుటకు ముందు మంచూకో దొంగల యము;శాంతికి శూన్యము, పరిశ్రమలు లేవు,వ్యవసాయము తక్కువ.జపాను దక్షిణ మంచూకో రెయిల్వేను తీసుకొని ఇతర రెయిళ్ళను వేయించి,పోలీసు స్టేషనులు పెట్టి శాంతి నెలకొల్పెను.మంచూకోలో నవ నాగరి కత నెలకొల్పేటందుకు 1932లో జపానుకు 29 మిలియనుల యెన్నులైతే,1934 లో 78 మిలియను లైనది.ఏటా ఈరీతినే ఖర్చులు హెచ్చుచున్నవి.మంచూకో రాజ్యస్థాపన సమయమున బ్రిటను, అమెరికా మొదలగు దేశము లకు మంచూకో తలుపు తెరచియుంచి అందరకు లాభములు కలిగిస్తానని సూచించినది కాని ఇంత దండుగ అవడము చూచి ఆతెరచియుంచిన ద్వారములనుండి పూర్వపువారిని వెళ్ళగొట్టుటే కాని క్రొత్తవారిని రానీయ కుండా చూచుచున్నది. 54రాజ్యస్థాపన అయిన క్రొత్తరికములో మంచూకోకు సంవత్సరమునకు 40 మిలియనుల గాలనుల క్రూడు ఆయి లు కావలసియుండేడిది.దీనిలో 4/5 అమెరికా, బ్రిటను, డచ్చి కంప్నీల వారు ఇచ్చుచుండిరి.జపాను ఈ ఖర్చును భరించలేక కొంత పెట్టుబడి మంచూకోలోనే పెట్టి ఫుషూనుషేలు ఆయిలు తయారుచేయింప నిశ్చయిం చు కొన్నది.తక్కిన విదేశస్థులు ఇది అక్రమమని పెద్ద గోలచేసిరి.కాని జపాను లక్ష్యపెట్టలేదు.మంచూకోలో శాంతి నెలకొల్పుట,ఫ్యాక్టరీలు కట్తుట మొదలైనవన్నీ యెంతకష్టమైనను,జపాను వీటికన్నింటికిని తెగించుకొనుట కొక్కటే కారణము.ముందు మంచూకోలో బైటాయిస్తే క్రమంగా చీనా అంతలోను పెద్దతనం వహింపవచ్చుననియే జపాను యూహ.
మంచూకో వలన జపానుకు ఉత్తరోత్తరా మంచి లాభముగా వుండునే కాని ప్రస్తుతము అవసరములకది చాల దు.సరేగదా ముందుకలిగే లాభములకు ఇప్పుడు చాలావరకు దండుగ పెట్టుకోవలెను.జపాను జనసంఖ్య వెయ్యికి 30 కంటె యెక్కువ యేటాపెరుగుచున్నను వ్యవసాయ తరగతులు మంచూరియాకు వెళ్ళలేదు, వెళ్ళవు.వర్తకములు ఉద్యోగములుచేసి పైపైని తడుముకొనుటయే జపాను ఉద్దేశ్యము.ఇటువంటి పనులకై ఇదివరకే చాలావరకు వృద్ధికి వచ్చిన దేశము అవసరము. మంఛూకో దిగువనున్న ఉత్తర చీనా అనబడు అయిదు రాష్ట్రములును అట్తివి.హొపీయి, చాహారు, స్యూయి యాన్,షాన్సీ, షాంటంగులలో 90 మిలియనుల ప్రజలున్నారు.అనగా జపాను జనసంఖ్య కంటె 22 మిలియ ను లెక్కువ.వీరు సంవత్సరమునకు 200 డాలర్ల విలువగల విదేశీవస్తువులను దిగుమతి చేసుకొనుచున్నా రు.ఈ సరుకంతా జపానులో తయారైనదే అయిన యెడల అలాభములు కలసివచ్చుటయే కాక రానున్న యుద్ధమునకై మంచూకోలో చేయవలసిన ప్రయత్నములకది యెంతయు ఉపయోగపడగలదు.ఇదిగాక అక్కడ మంచి ఇన్నుము, నూనె, తగరము, రాగి బంగారము గనులున్నవి.అక్కడ మంచి ప్రత్తిపంట పండును. ఆప్రత్తి తన స్వాధీనములో ఉండిన యెడల ఇండియానుండియు అమెరికానుండియు సంవత్సరమునకు400-500 మిలియను టన్నుల ప్రత్తి దిగుమతి అగుటకు అవసరముండదు.అక్కడ పశుసంపద చాలా శ్రేష్ఠమైనది. వాటితోలు ఒలిచి చెప్పులు మొదలగు వస్తువులు తయారుచేసి ప్రపంచమున విరజిల్లవచ్చునని జపాను ఊహ. రెయిల్వేలు సిద్ధముగా ఉన్నవి గనుక రాకపోకలు రక్షణలుకొరకై తడములాడుకొననక్కరలేదు. యుద్ధ సమయ మున జపానుకు ఆహారము పోనీయకుండ చుట్టివేతమని అమెరికా రష్యాలు తలచుచున్నవి.ఉత్తరచీనా రేవులు జపాను చేతులలో వుండిన యెడల ఆపని సాగనేరదు.లోపలి మంగోలియాలోనికి సెంట్రలు ఆసియా లోనికి, టిబేటులోనికి యెగబ్రాక వలెనంటే ఇదిచాలా అవసరము.
మంగోలియాలో ఇంకను కొందరు మంగోలు నాయకులు జాతీయ భావపూరితులున్నారు.ఈజాతీయ భావము నూతగొని జపాను చీనారష్యాల కడ్డముగా వారిని నిలబెట్టవచ్చును.పశ్చిమ మంచూరియా,లోపలి మంగోలి యా, మంగోలియను రిపబ్లికు కలిస్తే మంగోలియా దేశమగును.జెహోలు, సౌంగాను అను రెండురాష్ట్రములు, మంగోలియాకు చెందినవి.అప్పుడే వానిని మంచూకో రాష్ట్రములోని అయిదు జిల్లాలలో ఒకభాగముక్రింద మార్చుకొనినది.చీనానుండి మంగోలియాకు యెవ్వరునూ పోకుండా రహదారీ ప్యాసుల సిష్టము జపాను పెట్టి నది.జపాను సేనలకు తెలియపరచకుండా ఆభాగములద్వారా రాకపోకలెవ్వరికిని సాధ్యముకాకున్నది.
హోపేయినుండిచీనా గవర్నరును తీసివేయవలెననిన్నీ,క్యూమింటాంగుతో దానికి సంబంధముండకూడదనిన్నీ, అక్కడ జపాను ప్రతికూల ప్రచారము చేయరాదనిన్నీ 1935 లో జపాను చీనాకు సందేశము పంపించినది. హోపేయితో సంబంధముంచుకొనని చీనాచేతులు కడుగుకొని జపాను విజయమును స్థిరపరచినది. చాహారు నుంచి కూడా చీనాగవర్నరును తరిమి జపాను తన గవర్నరును పెట్టినది.ఈ రెండు రాష్ట్రములతో తక్కిన మూడు రాష్ట్రములను చేరి వేరే స్వతంత్ర రాష్ట్రముగా కేటాయించవలెనని జపాను చీనాకు 1935 సెప్టెంబరులో ఒక సందేశము పంపినది.ఈరాష్ట్రమును"కమ్యూనిష్టు ప్రతికూల ఉత్తరచీనా స్వతంత్ర రిపబ్లికుసభ” అధికారము క్రింద నుంచవలెనని కోరినది.నవంబరు 23 వ తేదిని ఇందుకై యుద్ధమునకు కూడ దిగినది.కాని కొందరు కర్షకులు పన్నులీయమని తిరగబడుట వలన జపాను కొంచెము శాంతించి వెనుకకు తగ్గినది.పీపింగు, టీస్ట్సిను మొదలగు నగరముల ప్రజలు చీనా పక్షపాతులే యైనను జపాను సహాయము లేనిదే తాము నెగ్గలేమని తక్కిన మూడు రాష్ట్రముల గవర్నరులకును తెలియ వచ్చినది.కనుక ఈ అయిదు రాష్ట్రములును నేడు చీనానుండి యింకా సంపూర్ణముగా స్వతంత్రములు కాకున్న ను చీనాకందు పలుకుబడి లేదనియు జపాను చెప్పినట్లుగా ఆడి జపానుకు లొంగియుండుచున్న వనియు విశదమగుచున్నది.
మంచుకో దేశమునకు పడమరను రెండుదేశములున్నవి.దక్షిణభాగమునకు లోపలి మంగోలియా అనియు, ఉత్తరభాగమునకు వెలుపలి మంగోలియా లేక మంగోలియన్ రిపబ్లికు అనియు పేర్లు.ఈ రెండింటికిని చాలా భేదములున్నవి.మంచూకో రాజవంశమువారు మొట్టమొదట దక్షిణభాగముతో స్నేహముచేసి ఉత్తరభాగమును కూడా బెదరించి చీనానంతటిని జయించి ఒక సామ్రాజ్యముగా కొంతకాలము వరకును పరిపాలించిరి. ఈవిధము గా 1911 వరకు ఉండెను.1911 లో చీనా రిపబ్లికుస్థాపించబడగానే ఉత్తర మంగోలియా