చిరస్మరణీయులు, మొదటి భాగం/హైదర్‌ అలీ ఖాన్‌

వికీసోర్స్ నుండి

23

3. హైదర్‌ అలీ ఖాన్‌

(1722-1782)

రాజ్యవిస్తరణ కాంక్షతో రగిలిపోతున్న పరాయిపాలకుల పన్నాగాలను గ్రహించి ఆ శక్తులకు, ఆ శక్తుల తొత్తులకు వ్యతిరేకంగా జీవిత చరమాంకం వరకు పోరాడి 'అరివీర భయంకరుడు'గా విశ్వరూపం చూపిన మొనగాడు హైదర్‌ అలీ ఖాన్‌.

దక్షిణ భారతదేశ నెపోలియన్‌ గా ఖ్యాతిగడించిన హైదర్‌ అలీ 1722లో కర్నాటక రాష్రం దేవనహళ్లి గ్రామంలో జన్మించారు. తండ్రి ఫతే మొహమ్మద్‌ అలీ, తల్లి మజిదాన్‌ బేగం. చిన్నతనం నుండి యుద్ధ విద్యల పట్ల ఆసక్తి చూపిన హైదర్‌ అలీ ఆయా విద్యలలో మంచి ప్రావీణ్యత సంపాదించారు. విద్యాగంధం లేకపోయినా, ఆయనకు కుశాగ్రబుద్ది, అసమాన ధారణశక్తి, ధాఢ సంకల్పం, పలు పనులను ఏకకాలంలో నిర్వహించగల సామర్ధ్యం, కార్యదక్షత, ధైర్యసాహసాలు సహజ లక్షణాలయ్యాయి.

1749లో జరిగిన దేవనహళ్లి ముట్టడిలో పాల్గొన్న యువకుడు హైదర్‌ అలీ ప్రదర్శించిన ధైర్యసాహసాలకు ముగ్దుడైన మైసూరు రాజ్య మంత్రి నంజరాజ్‌ ఆయనను 'ఖాన్‌' బిరుదుతో సత్కరించి, చిన్న సైనికదళం నాయకుడ్ని చేశాడు. ఆక్కడి నుండి 1758లో సర్వసెన్యాధిపతిగా ఎదిగి 1761నాటికి హెదర్‌ అలీ మైసూరు పాలకులయ్యారు. ఆ అనూహ్య ఎదుగుదల నచ్చని మరాఠాలు, నైజాం నవాబు, పరాయి పాలకులైన

చిరస్మ రణయులు 24

బ్రిటిటీషర్లకు దోస్తులుగా మారి హైదర్‌ అలీ మీద పలుమార్లు దండయాత్రలు చేశారు. ఈ దాడుల తొలిదశలో హెదర్‌ కొంత నష్టపోయినప్పటికి ఆ తరువాతి కాలంలో ప్రథమ, ద్వితీయ మైసూరు యుద్ధాలలో అరివీర భయంకరంగా వ్యవహరించి శతృవును పలుమార్లు చావుదెబ్బ తీసి ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైన్యాధికారులకు సింహస్వప్నమయ్యారు.

సర్వమత సమవర్తనుడైన హైదర్‌ అలీ, పాలకుడు ముస్లిం అయినంత మాత్రాన ప్రభుత్వం ఆ మతానికి చెందినది ఏ మాత్రం కాదని ప్రకటించి, అన్ని మతాల పట్ల సమాదరణ చూపారు. మతాలతో సంబంధ లేకుండా ప్రజలకు సమన్యాయం పంచారు. పలు మసీదులు నిర్మించిన ఆయన మఠాలు, పీఠాధిపతుల పట్ల ఎంతో ఔదార్యాన్ని చూపుతూ వాటి నిర్వహణకూ, పూజారుల, మఠాధిపతుల జీవన పరిస్థితుల మెరుగుదలకు ధన, కనక, వస్తు, వాహనాలను అందించటమే కాక ఆలయాల నిర్మాణాలకు ఆర్థిక సహకారం అందిస్తూ, ఆయా నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షించారు.

ప్రజారంజకంగా పాలన చేస్తున్న హైదర్‌ అలీని రెచ్చగొట్టి ద్వితీయ మైసూరు యుద్ధానికి బ్రిటీషర్లు శ్రీకారం చుట్టారు. 1780 జూలై మాసంలో మహాసేనను తీసుకుని శతృవు ఆటకట్టించేందుకు కుమారుడు టిపూ సుల్తాన్‌ సమేతంగా బయలుదేరిన హైదర్‌ ఆర్కాటును పాదాక్రాంతం చేసుకోగా ఇటు టిపూసుల్తాన్‌ మద్రాసుకు 50 మెళ్ళ దూరంలో ఉన్న కంజీవరాన్ని సునాయాసంగా గెలుచుకున్నారు. ఆ విజయాలతో భయకంపితుడైన గవర్నర్‌ జనరల్‌ వారెన్‌ హేస్టింగ్స్ అదనపు బలగాలను, అవసరానికి మించిన ధనమిచ్చి సర్వసైన్యాధ్యక్షుడు sir eyre coote ను హైదర్‌ మీదకు ఉసిగొల్పాడు. ఒకవైపున విదేశీ శత్రువుతో హెదర్‌ పోరాడుతుండగా పాలెగాండ్లు మలబారు నాయర్లు, నిజాం మద్దతుతో తిరుగుబాటును ప్రకటించగా హైదర్‌, టిపూ తలోదిక్కుగా సాగి వారిని ఎదుర్కొన్నారు. చరిత్రాత్మక ద్వితీయ మైసూరు యుద్ధం జయాపజయాలతో సాగుతుండగా వర్షాకాలం రావటంతో 1782 నాటికి యుద్ధమేఘాలు తాత్కాలికంగా అంతరించాయి.

ఆ యుద్ధం నాటికి హైదర్‌ అలీ వయస్సు 60 ఏండ్లు. ఆ వయస్సులో కూడా అసమానమైన వేగంతో, ఆయాసరహితంగా వందల మైళ్లు అశ్వరూఢుడై ముందుకు సాగుతూ పలు పోరాటాలు సాగించి అద్బుత విజయాలకు చిరునామాగా ఖ్యాతిగాంచిన హెదర్‌ అలీ మృత్యువుతో సాగించిన పోరాటంలో మాత్రం విజయం సాధించలేక పోయారు. ఆంథ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా నరసింగరాయుని పేట వద్ద యుద్ధభూమిలో 1782 డిసెంబరు 7న హైదర్‌ అలీ ఖాన్‌ కన్నుమూశారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌