చిరస్మరణీయులు, మొదటి భాగం/బేగం హజరత్‌ మహల్‌

వికీసోర్స్ నుండి

65

24. బేగం హజరత్‌ మహల్‌

(- 1874)

మాతృభూమి కోసం ప్రాణాలను పణంగాపెట్టి, ఏ దశలో కూడా శతృవుతో రాజీపడకుండా ఆంగేయ బలగాలతో తలపడిన రాణులు చరిత్రలో అరుదుగా కన్పిస్తారు. అటువంటి అరుదైన ఆడపడుచులలో అగ్రగణ్యురాలు బేగం హజరత్‌ మహల్‌.

ఆమె ఉత్తర భారతదేశంలోని అత్యంత సంపన్నవంతమైన అవధ్‌ రాజ్యం అధినేత నవాబ్‌ వాజిద్‌ అలీషా భార్య. ఆమె స్వస్థలం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఫైజాబాద్‌. ఆమె చిన్నప్పటి పేరు ముహ్మది ఖానం. ఆమె అందచందాల గురించి విన్న వాజిద్‌ అలీ షా ముగ్దుడై ఆమెను ఏరి కోరి మరీ వివాహమాడారు. వివాహం తరు వాత ఆమె ఇఫకారున్నీసా బేగం, ఆ తరువాత హజరత్‌ మహల్‌ అయ్యారు. ఆ దంపతులకు మీర్జా బిర్జిస్‌ ఖదిర్‌ బహుదూర్‌ అను కుమారుడు కలిగాడు.

1856 ఫిబ్రవరి 13న నవాబ్‌ వాజిద్‌ అలీషాను ఆంగ్లేయులు నిర్భందించి, మార్చి 13న కలకత్తా పంపి అక్రమంగా అవద్ ను ఆక్రమించుకున్నారు.ఈ చర్య వలన ప్రజలలో తీవ్ర అసంతృప్తి రగులుకుంది. ఆ అసంతృప్తికి ఆలంబనగా బేగం హజరత్‌ మహల్‌ నిలబడ్డారు. ఆమెకు అండదండలుగా ప్రజలు, కులమతాల ప్రసక్తి లేకుండా స్వదేశీ యోధు లు, వివిధ ప్రాంతాల పాలకులు నడిచారు.1857 మే 31న అవధ్‌ రాజ్యం రాజధాని

చిరస్మ రణీయులు 66

లక్నోలోని ఛావనీలో బేగం నాయకత్వాన స్వదేశీ యోధులు, ప్రజలు స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు. స్వతంత్రతకు చిహ్నంగా ఫిరంగులు పేల్చారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలనాధికారం, ఆంగ్ల అధికారుల ఆనవాళ్ళు లక్నో గడ్డ మీద లేకుండా చేశారు.

1857 జూలై 5న బేగం హజరత్‌ మహల్‌ తన బిడ్డ బిర్జిస్‌ ఖదీర్‌ను అవధ్‌ నవాబుగా ప్రకటించారు. ఆ నిర్ణయాన్నిపలువురు ప్రముఖులు, ప్రజలు బలపర్చారు. ఆ ప్రోత్సాహంలో 1,80,000 మంది సైనికులను సమకూర్చుకుని లక్షలాది రూపాయలను వ్యయంచేసి లక్నో కోటగోడలను బేగం పునర్మించారు. ఆమె ఏనుగునెక్కి బిడ్డడు బిర్జిస్‌ ఖదిర్‌తో పాటుగా పనులను పర్యవేక్షిస్తూ, సైనిక కార్యకలాపాలను గమనిస్తూ ఇటు ప్రజలలో అటు సైనికులలో ఉత్సాహన్ని నింపుతూ మంచి ప్రజాదారణ పొందారు.

మతం, కులం, ప్రాంతాల ప్రసక్తి లేకుండా పౌర, సైనికాధికార ప్రముఖులైన ముమ్మూఖాన్‌, మహారాజ బాలకృష, బాబూ పూర్ణచంద్‌, మున్షీ గులాం హజరత్,మహమ్మద్ ఇబ్రహీం ఖాన్‌, రాజా లాలా సింహ్‌, రాణా జిజియా లాల్‌, రాజా మాన్‌సింగ్, రాజా దేశిబక్షసింగ్, రాజా బేణి పసాద్‌ లాంటి వారితో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. డిల్లీలోని మొగల్‌ చక్రవర్తి బహుదూర్‌ షా జఫర్‌ ప్రతినిధిగా బిర్జిస్‌ ఖదీర్‌ను ప్రకటించారు. ప్రజల అండతో బ్రిటిషు బలగాలతో డీ అంటే డీ అంటూ కంపెనీ పాలకులకు చెమటలు పట్టిస్తూ బేగం హజరత్‌ మహల్‌ సుమారు 10 మాసాల పాటు ప్రత్యక్ష పాలన చేసి ప్రజలను, ఇతర స్వదేశీపాలకులను ఉతేజితుల్నిచేశారు. 1858 నవంబర్‌ 1న విక్టోరియా మహారాణి ప్రకటన విడుదల చేయగా అందుకు సమాధానంగా తన చారిత్రాత్మక ప్రకటన 1858 డిసెంబర్‌ 31న విడుదల చేశారు.

1859 మార్చిలో భారీ బలగాలతో అన్నివైపుల నుండి ఆంగ్ల సైన్యాధికారులు లక్నోను చుట్టుముట్టారు. భయంకర యుద్దం సాగింది. పరాజయం తప్పని పరిస్థితులలో

సహచరుల ఒత్తిడి మేరకు నానా సాహెబ్‌ పీష్వాతదితర తిరుగుబాటు నేతలతో కలిసి

ఆమె నేపాల్‌ అడవుల్లోకి వెళ్ళిపోయారు. ఆమెను తిరిగి లక్నోకు రప్పించేందుకు బ్రిటిష్‌ ప్రభుత్వం లక్షలాది రూపాయలను నజరానా ఆశ చూపినా, స్వతంత్ర అవధ్‌ రాజ్యం తప్ప మరొి తన లక్ష్యం కాదాంటూ ఆ ప్రతిపాదనను నిర్ద్వందంగా తిరస్కరించారు.

చిట్టచివరి వరకు స్వతంత్ర రాజ్యం కోసం ప్రయ త్నిస్తూ,ఖజానాతోపాటు సహచరులు కూడా తరిగిపోగా నిస్సహాయ పరిస్థితులలో అతి సామాన్య జీవితం గడుతూ ఆ మంచు కొండల శిఖరాల మీద రపరపలాడుతున్న అవధ్‌ రాజ్యం ఛత్రచాయలో 1874 ఏప్రిల్‌లో బేగం హజరత్‌ మహల్‌ కన్నుమూశారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌