చిత్రలేఖనము/BOOK I/రెండవ భాగము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

రెండవ భాగము.

మొదటి ప్రకరణము.

మన మేదైనవస్తువును చూచి వ్రాయునపుడు మన దృష్టిమట్టమును బట్టి దానియెక్క రూపు మాఱు చుండును. ఈ విధమైన చిత్రలేఖనము నభ్యసించుటకు మనము మొదట నొకపెట్టెను తీసికొనవలెను. దానిమి మనము కొంత దూరముగ నుంచి వ్రాయుట ప్రారంభింపవలయును.

11చూడుము.

"క , ఖ "అనుగీత మనదృష్టికి సమానముగ నున్న దనుకొందము. మనచూపు "గ" అను చుక్కమీదికి బరగుచుండును. 1వ నెంబరు గీతలన్నియు "గ" దగ్గర కలియును. 2,3 నెంబరుల గీతలు సమానముగా గనబడును. ఈ పెట్టె మనదృష్టిమట్టమునకు దిగువనున్నది. గనుక దీని పైభాగము మనకు గనబడుచున్నది. సమానముగనున్న యెడల రెండువైపుల కనబడున. మీది భాగమును, ఎదుటిభాగమును కనబడును.

ఈ క్రిందిపెట్టె మనదృష్టికి కొంచెము దిగువను, ప్రక్కను నున్నది. అందువలన మూడువైపులు కనబడుచున్నవి. 'క, ఖ' అనుగీత ఏమి? యని మీరు నన్ను ప్రశ్నింప వచ్చును.సముద్రతీరమున నిలువబడిసముద్రము వైపునకు చూచినయెడల భూమికిని, ఆకాశమునకును, విడదీయురేఖయొకటి కానబడును. దీనినేదిగంతమందురు.ఇదియే యీగీత.

12 చూడుము.

ఈ క్రిందియుల్లు మనదృష్టిమట్టపుగీతకన్న నెత్తుగానున్నది. అందువలన ఇంటికప్పుయొక్క క్రిందిభాగము కనబడుచున్నది. ఏ వస్తువైనను దృష్టిమట్టపుగీతకు దిగువనున్నయెడల ఆ వస్తువుయొక్క పైభాగమును, దృష్టిమట్టపుగీతకు పైనయున్నయెడల ఆ వస్తువుయెక్క అడుగుభాగమును

13-3 చూడుము.

ఎన్ని పెట్టెలుంచినను యిదియేవిధముగ భూమికి సమాంతరము (Paralle)గా నున్న అంచులన్నియు ఈ దృష్టి మట్టపు గీతయందు మనకంటికి సమముగానున్న చుక్క వద్దనే కలియును. 13-1చూడుము.

కాని యీదిగువ నుదహరించిన పటముననుసరించి చూడ మనము పైనుదహరించినది తప్పని తోచును. కాని అటుల కాదు. 13-2చూడుము.

రెండవ ప్రకరణము

మనయెదుట నొకపెట్టె నుంచుకొని పండ్రెండడగుల దూరమున గూర్చుండి వ్రాయ మొదలిడవలెను. వ్రాయునపుడు మాత్రము పెద్దపెన్సిలు దగ్గర నుండవలెను. ఈ పెన్సిలుతో కొలుచుచుండవలెను. 1 వ నెంబరు గీతను కొలుచునప్పుడీ విధముగ కొలువవలెను.

దానికంటే ముందు చిన్న పటము వచ్చిన యడల రెండు మూడు మారులు పెద్దది చేయ వచ్చును. 14.... 2 చూడుము. పెట్టెను వ్రాయునపుడు 'క, ఖ ' అను గీతను కొలిచి నిట్రము (perpendicular) వ్రాయవలెను. తరువాత 'గ,ఘ,' లను నిర్ణయించ వలసియున్నది. పెన్సిలును ఆమూలలకు సమానముగాను, భూమికి సమాంతరము(parallel) గా నుంచి 'క,ఖ,' యను గీత నెక్కడ కలియు చున్నదో కనుగొనవలెను. తరువాత ఆగీత కీమూల లెంత దూరమున నున్నావో కొలచిన యెడల వీని యెక్క స్థలము నిర్ణయమగును.

ఈ మూలలనుండి "గ,చ, ఘ,చ, యను గీతలను క,ఖ, యను గీతకు సమాంతరము (parallel) వ్రాసి వాని యెక్క పొడవును కొలవలెను. అపుడు 'చ,ఛ,' లు నిర్ణయమగును. తరువాతను చ,క,, ఛ,క" "ఘ,క","గ.ఖ"అను గీతలను సులభముగా వ్రాయవచ్చును. ఇంక "జ" యను చుక్కను నిర్ణయించ వలెను. మునుపటి వలెనే పెన్సిలును "జ"అను చుక్కకు సమముగాను, భూమికి నిట్రము(perpendicular) గాను పెన్సిలునుంచి ఆ పెన్సిలు "చ,క"అను గీత నెచ్చట కలియుచున్నదో కనుగొనవలెను. తరువాత నాస్థలమునుండి "జ" యను స్థల మెంత దూరమున నున్నదో కొలిచి "జ"ను నిర్ణయించవలేను. అప్పుడు "ఛ,జ", "చ,జ" యను గీతలను గీయుట సులభము. ఈ విధముననే యే పెట్టెనైన గృహమునైనను శుభ్రముగ వ్రాయవచ్చును. కాని మునుపు చెప్పిన ప్రకారము కొన్ని గీతలొకచోటను, మరికొన్ని గీతలు మఱియొక చోటను, దిగంతము మీదను కలియునని జ్ఞాపకముంచుకొనవలెను. ఈ ప్రకారముగ మీరు వ్రాయు పటమునందు లేని యెడల వ్రాసినది తప్పని తెలిసికొనవలెను.

మూడవ ప్రకరణము

ముక్కోణపు ఆకారముగల ఘనపదార్థము.

ఇది వ్రాయుట సులభము. మునుపు చెప్పిన ప్రకారము 1, 2, 3,నెంబరు గలగీతలను గీయవలెను.ఇందు 4వ నెంబరు గీత యెకచోటను కలియును. కాని చక్ర వాళమునకు సమమైన గీతకు సమాంతరముగ నున్న గీత లెప్పటికిని కలియవు.

స్తంభాకారము.

16-1 చూడుము

దీనిని వ్రాయునప్పుడు 1,2 నెంబరుల గీతలను వ్రాయవలెను. తరువాతను 2 వనెంబరు గీతలను రెండు సమభాగములుగ భాగించి దీనికి సమకోణములు వచ్చునట్లు 3 వ నెంబరు గీతలను కొలిచి వ్రాయవలయును. ఈ గీతలుకూడ రెండు సమభాగములుగ భాగింపబడియుండవలెను. అనగా 2,3 నెంబర్లగీత లొకదానినొకటి సమకోణములు వచ్చునటుల కలిసికొని సమభాగములుగా భాగింపబడవలయును. (They must bisect each other at Rt. |_) వీని సహాయమువలన వంకరగీతలను సులభముగ వ్రాయవచ్చును.

రైట్ ప్రిజిము. 16-2చూడుము. .....టమునందు చూపిన ప్రకారము లిఖింపవలెను. తరువాత 1,2,4 నెంబరల గీతలను రబ్బరుతో తుడిచివేయవలెను.

చెప్పటకు మఱచితిని. ఇట్టి చిత్రములను వ్రాయునపుడు అవసరములేని గీతలను రబ్బరుతో తుడిచివేయుట ముఖ్యము.

గోపురాకారము.

16-1 చూడుము.

ఇదివరకు ప్రిజమునందు చెప్పినప్రకారము క్రిందిమట్టమును వ్రాసి 1 వ నెంబరు గీతను కోణమందువలెనే వ్రాయవలెను. పిమ్మట 2 వనెంబరు గీతలను వ్రాయుట కష్టములేదు. ముందు చెప్పినవిధమున ....నన్నిటిని రబ్బరుతో జాగరూకతతో చేరిపివేయవలయును.

గోళము.

16-5 చూడుము.

ఇది ... మీ కారమువలెనే కానబడును. మొదట దీనియొక్క వ్యాసమును వ్రాసి దానిని రెండు సమభాగములుగా భాగించి ఆ మధ్యస్థలముననుండి సమకోణములు వచ్చునట్లు అదియే పరిణామముగ మఱియొక వ్యాసమును వ్రాయవలెను. తరువాతను వలయాకారమును జాగ్రత్తగా వ్రాయవలెను.

వివిధములైన ఘనపదార్ధభాగములు.

16-5 చూ

ఇదవరకు చెప్పినప్రకారము పైజెప్పినవి వ్రాయట మిగుల సులభము. కాని వీనిని జాగ్రత్తగా వ్రాయవలెను. ఇవన్నియు చక్కగ నభ్యసింపవలయును. మనకు సహాయము కొఱకు వ్రాసుకొన్న యనవసరములైన గీతల నన్నిటిని రబ్బరుతో చెరిపివేయవలెను. తరువాతను కుర్చీ బల్లలు, మేజాలు, కలశములు, డేరాలు మొదలగునవి వ్రాయట నభ్యసింపవలెను.