చందమామ పిల్లల మాసపత్రిక/సంపుటము 1/జూలై 1947/చిక్కుమాట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ముఖచిత్రం
Chandamama 1947 07.pdf

చిక్కుమాట

    సంపాదన: చావలి రామారావు


         అబ్బాయిలూ!
         అమ్మాయిలూ!
         నేను ఐదు అక్షరాల దేవుణ్ణి!
         నేను 'నడక'లో ఉన్నాను గాని పరుగులో లేను.
        'రంభ'లో ఉన్నాను కాని 'మేనక'లో లేను.
        'సింహము'లో ఉన్నాను కాని 'పులి'లో లేను.
        'హరి'లో ఉన్నాను కాని 'బ్రహ్మ'లో లేను.
        'పాము'లో ఉన్నాను కాని 'తేలు'లో లేను.
         పిల్లలూ! నేను ఎవరు?
_____
జవాబు 61 పేజిలో చూడండి.