గోలకొండ కవుల సంచిక/స్తోత్రములు
శ్రీ భారత్యైనమః
శ్రీనారాయణాష్టకమ్
శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీకృష్ణ పరబ్రహ్మతంత్య్ర. ప ర కాల య తీం ద్రు లు
ధారాధరప్రవర నీరాజనీయరుచి పూరాయలో కగుర వే
ఘోవాహేతక్షుభిత సారామరాధిపతి సౌ రాజ్యకల్పతర వే
నారాయణాయ ఘనసారావభాసికుచి ధారాళధవ్యయశసే
పారాశరీన్ద్ర కలి తారాధనాయనతి రారాదుదాత్త మహసే, 1
స్మేరాసితాభ్రరుచి దోరాహవాకలన ధీరాత్మదిత్యసుషమం
తారాధిపానిశ సమారాధనీయముఖ వారాశిజాత్త విభవమ్
స్వారాజముఖ్యసుర వారాగ్యమౌళీమణి నీరాజి తాత్త్రియుగళ్ళ
మారాదపీహ సుకుమారాకృతిం నమత నారాయణం ననుజనాః 2
వేలాతిశాయిశుభ లీలామృతాబ్దిభన బాలావిహాకసుమహా
డోలాయమానవన మాలామనోహర మరాలాలకం సుతిలకమ్
నీలామ్బరాఙ్క శిశు పాలాన్తకాది యదుమౌళావుద్చతపదమ్
శ్రీలాల్యమఞ్పయదు శై లావతంస మవ హేలామపాస్యహృదయ, 3
బాలాతపచ్చురిత నీలాభ్రవత్కనక చేలాదృతే ద్విలసితం
కైలాస శైలపతి శూలాయుధాదినుతి కోలాహలప్రముదితం
ఏలాలవఙ్గముఖ సాలాభిరామయదు శైలాగ్రశృఙ్గవసతిం
నీలాదిదివ్యమ హి పీ.లాలి తాస్త్రి మను వేలా ్చతం రచయతమ్. 4
గోలకొండ కవుల సంచిక
శంకరస్తవము
శ్రీపత్రి సత్యనారాయణ శాస్త్రి గారు.
ఉ. కట్టఁగ బట్టలేక కడు గారియఁ జెందుచుఁ గుందు వారికిన్
బొట్టకుఁ బట్టెకోగిరము పుట్టక కష్టను లొందు వారికిన్
బట్టకుఁ బొట్టకిచ్చి పెనుబాము లడంచి దిగంబరుండ వై
పొట్టకు బిచ్చమెత్తు కొనఁబోవుట చిత్రముగాదె శంకరా!
ఉ. పాలసముద్రమున్ జిలుకుపట్ల సురాసుర సంఘ మందులో
హాలహలంబు పుట్టె నది యందఱినిన్ దిగ మ్రింగఁబోవ నా
వేలుపుఁ బెద్ద లెల్ల తమ వీటి మొగంబయి పొర దాని, లో
గ్రోలి జగత్త్రయంబుఁ గడు బ్రోచిన దిట్టవు గాదె శంకరా!
చ. ప్రతియెడ భక్తి లేక యుపవాసములున్ సుర పూజలున్ గృహా
గతుల సపర్యలు౯ యతుల గౌరవముల్ ధన ధాన్య ధర్మముల్
సతతము తీర్థ యాత్రలును సల్పుట కాంతకు బూదిలోన గో
ఘృతమును బోయుమాడ్కి యగుఁగీర్తియు స్వర్గము గల్గదీశ్వరా
చ. నరు లీల గౌరవంబును ధనంబును జెందఁగఁ గారణంబుగా
దరయఁగ విద్య పూర్వజన నార్జిత పుణ్య విశేష మొండె సు
స్థిరముగ గారణంబగును దేవతలంచు బుధుల్ భజింతు రీ
పరుసపు రాళ్లులేమి చదువన్ గలిగెన్ వచియింపు మీశ్వరా!
శా, పారావారములో మునింగి యసువుల్ వర్ణింపఁ గావచ్చు దు
ర్వారాభీల దవాగ్నిలోఁ బడి శరీరత్యాగమున్ జేయ నౌఁ
గ్రూరాహీంద్రు విషంబు మ్రింగి ధరపై ఁ గూలంగ వచ్చు దుదిన్
దారిద్ర్యంబు భరింపరా దేవరికిన్ దథ్యంబుగా శంకరా!
గోలకొండ కవుల సంచిక
మారుతి
శ్రీ సిరివెల్లి విశ్వనాథ శాస్త్రిగారు.
మ. దీననాథాన్వయులైన రా కొమరు లే తేరంగ వీక్షించి సూ
ర్యుని పుత్రుం డతివేగ నిన్ బనుపఁ బుణ్యోపేతులౌ వారితో
డను సుగ్రీవుని చెంతకుం జని నిరాటంకంబుగా మైత్రిఁ గూ
ర్చిన నీ లీలలు గోరి వ్రాసెనను తండ్రీ! ప్రోవ వేమారుతీ!
చ. తన కుల కాంతను గుటిల దానవుఁ డొక్కఁడు దొంగిలించి వేఁ
జనటయు నాదిగాఁ గలుగు సంగతుల వినిపింప సూర్యసం
దనుఁడు మనంబులోపలను దద్దయుఁ జింతిలి నిన్ను జానకీ
వనితనుగాంచి రమ్మనుచుఁ బంపిన నేగితి వీవు మారుతీ!
మ. లవణాంభోనిధి దాటి రావణుపురీ లావణ్యమున్ జూచి దా
నవ రాజేంద్రుని రమ్య సౌధములలోనన్ గాంచఁగాలే కశో
కవనంబందునఁ గ్రూర దైత్యవనితా క్రాత ధరాజాత రా
ఘవునాతిం గనినట్టి నీకిదె నమస్కారంబులో మారుతీ!
ఉ. జానకితోడ ముచ్చటలు సల్పి వనంబును భంగ పెట్టఁగాఁ
బూని కుతూహలుండవయి భూరిగ నాదముఁజేసి శాఖలున్
మ్రానుగముల్ బడంగలంచి రాక్షసులెల్లరు భీతినొందవే
భానుజుఁ జేరగాఁ జని సువార్తను దెల్పితివీవు మారుతీ.
ఉ. అంగదుఁడాదిగా ఁగల వనాటులతోడను రాము దేవిఁ గా
నంగను దక్షిణాబ్దికి ఘనంబుగ నేగి ముదంబుతోడ ను
ప్పొంగుచు దాఁటి లఁకకును బోయి నిశాచరనాథు శౌర్యమున్
భంగమునొందు వాక్యములు పల్కితి వచ్చట నీవు మారుతీ!
గోలకొండ కవుల సంచిక
ప్ర్రా ర్థ న
శ్రీ వలిపె వేంకటరావుగారు వకీలు
ము. జననం బాదిగఁ జేయు పాపములకై జాలింగడు గాంతునా?
మును జన్మంబుల కర్మసంచితము నాత్మ గాంచి దుఃఖింతునా?
ఘన సంసాం దవానలంబునకునై గాసిల్లి ఘోషింతునా?
వసజా తేక్షణ! యేదిదారియిఁక నీవ్యామోహముక్ మార్పునూ.
చ. సరసిజనాభ! నీదు పదసారసముల్ శిరమందుఁ దాల్చి నే
నిరతము సంస్మరించెదను నీ శుభనామ మనేక భంగులన్
బిరబిర నన్నుఁ బోవఁగను భీమపరాక్రమ వేగ రాగ దే
బిరుసు వహించి నన్నుఁ గడు భీతునిఁ జేసిదవేల మాధవా!
ఉ. సారవిహీనమై తుదకు సంకటమౌ నరకంబుఁ జేర్చు సం
సారములో మునింగి కడు జాలిని నొందుటకంటె వేగ నా
సారసనాభునిక్ సుగుణసాగరు సూరిజనాభి మద్యు వే
సారక నాత్మనుంచి మనసార భజింపఁగ సౌఖ్యమబ్బ దే!
ఉ. కోరినవారి కీవు పలు కోర్కెల నియఁగలేదె? వార లే
తీరునఁ గాన్క లిచ్చిరొక తీరని భక్తియ కాక నే నిరా
ధారుఁడ నీదు నామము నెదక్ స్థిర భక్తి జపించువాఁడ నో.
నీరజనేత్ర! నా పయిని నీదగు ప్రేమను జూపి ప్రోవవే.
ఉ. తల్లివి దండ్రి వీవనుచుఁ దమ్ములు నన్నలు నీవ యంచు నే
నెల్ల విధమ్ములన్ ఉంది మదిని నెన్నికతోడుత నున్నవాఁడ నో
పల్లవ కోమలాంఘ్రీయుగ! పన్నగ శాయి! పతంగ వాహనా!
యుల్లమునందుఁ దా వొసఁగిఁ యుత్తమ మార్గము వేగఁజూపుమా !
శ్రీనివాస ధ్యానసోపానము శ్రీమద్భాల సరస్వతీ, తర్క తీర్థ శ్రీ బుక్కపట్టణం శ్రీనివాసాచార్యులు
సంస్కృత భాష ఏకీభూతంకిలతనుజుషాం మన్మథానాం సహస్రం రాశీభూతం కలజనదృశాం ప్రాక్త నంభాగ ధేయం కారుణ్యానామివసముదయం కాంక్షి తానామి వౌఘం కల్యాణానామివచ నివహం కాముయే శ్రీనివాసం. ప్రాకృతి మాణిక్క మంజుణి ఉరజ్జుఇ సంఝు రాఅ సంపక్క సంగ్రహి అసోణిను సందభావో దవ్వీరఇంద సిహరిందు సుహంఘీసోహా బాలాఅతోమహహి అంబు అముజ్జలేఉ. మాణిక్య మంజునూపురద్యుతి సాంధ్యరాగ సంపర్క సంగ్రథిత శోణిమసాంద్రభావః దర్వీక రేంద్ర శిఖరీందు శుభాంఘ్రి శోభా బాలాతపోమమహృదయాంబుజ ముజ్వలయతు. శౌరసేని జపహాపుంజప్పస రే తాసవ్వవిలో అణా ఇమ ఉళీభోంతి తారిసకొత్తుహవక్కో
కహణుసి ఆఅమణేత్త సుహసం సెవ్వో ఛాయాli ఛాయా|| గోలకొండ కవుల సంచిక యత్ప్రభాపుంజప్రస రే తస్యైవవిలోచ నేముకు ళీభవతః తాదృశకౌస్తుభవమో; కథంనుస్యాదస్మన్నేత్ర సుఖసం సేవ్య : మాగధి మిదహశి దమిశాఏ చందిమాశంపలఏ శీలిణయణ చఓలాణంద మాకంద మైతే అ గె మహులీఉ ముహచందే అమణె త్తేనులమ్మం ము అదివి అతుశాలం భూ పేయూశధాలం. మితహసిత విషయా చంద్రికాసంపదా శ్రీసయన చకోరానంద మాకందళయ మధురిపు ముఖచంద్రోస్మన్నేత్రయోరమ్యాం ముంచతీవతుషార్వా భూరిపీయూషధారు. వైశాచి ణిబిడెక్కెక్కవ్వవహిత మకు టప్పచ్చుత్త వరరతినరుచీ సోభతిస మొప్పి తాహరి సిరమ్మిసీతసోణ పొమ్మమా లవ్వ, నిబిడై కై కవ్యవహిత మకుటప్రత్యుప్త వజ్రరత్న రుచి; శోభ తేపమర్పి తాహరి రసిసిత శోణపద్మమాలేవ. > E 2 గోలకొండ కవుల సంచిక 50 C రామలింగస్తుతి కంబము వీర రా రామయ్యగారు THE & SH సీ. కైలాస గిరిఖేల కల్యాణ గుణశీల సురచక్ర పాల యశోవిశాల భంజితాంహోజాల పాలిత ముని బాల భావజేభమృగేంద్ర భక్త పాల కరుణాలవాల శంకర పురహర బాల నక్షత్ర రాడ్డర సమిత లోల సవనాంతకా భవ సంభృత కరశూల దిగాల చేలార్క రగ్విశాల గీ. దీన సురపాల గళరుగ్గి తేంద్రనీల నిలచి ప్రణుతించితిని గదే నీదు మ్రోల యేలఁ జాలవి దేల నే నెగడఁజాల ( రాజమిహిరరథాంగ శ్రీ రామలింగ. సీ, రవిశళి శిఖ నేత్ర భవలతో గ్రలవిత్ర కవిజన స్తుతి పాత్ర ధవళ గాత్ర దివిజోపవన చైత్ర భువన రక్షణ సూత్ర నివసిత సితగోత్ర శివపవిత్ర గుజనద్రు కరపత్ర విజిత శాత్రవ గోత్రి వృజినౌఘ కానన వీతిహోత్ర రక్షిత మునిపుత్రి దకు ప్ర ధ న జై పంకజాయత నేత్ర కంక పత గీ. ధవళ వృవపత్ర సుచరిత్ర ధనద మిత్ర నిభృతదృ క్నోత శ్రీభవా నీకళత్ర త్ర మిత్రజామిత్ర మానిసం స్తోత్ర పాత్ర రాజ మిహిరరథాంగ శ్రీరామలింగ గోలకొండ కవుల సంచిక ( ము క్త ప ద గ్ర స్త ) క జ } శ్రీసర్వ మంగళా చేతోబ్ద సారంగ సారంగ నిర్జర వైరిభంగ భంగీ కృతత్రిపుర భవనాశ ధవళాంగ యంగ సంభవ భంజి తార్యసంగ సంగ మేశ్వర సమస్తక భన్యసురగంగ ౦గేయ నగచాప కరకురంగ రంగద్భుజం గేంద్ర రవణ కృపాపాంగ యంగద జనక ద్విఢ సువిభంగ గీ. భంగరహిత ఫలప్రద భద్రసంగ సంగ తాప్ప స్వరూప వాసగిరి శృంగ శృంగ మునినుత శుభ్ర వృ షేడ్తురంగ రాజ మిహిరరథాంగ శ్రీరామలింగ సర్వ లఘు ) సీ. తరుణహిమ కిరణధర ధరణీరథ హరిణకర మరణ జని రహిత హృత దురిత విసర కమలభవ దమనసుర విమతకుల శ్రమనసర సమితపద జ జయుగ యభయదకర కదనతల విజయమద మదనహర కుధరవర సదన జగదవన మృదువచనసుకర విహగహయ వినుతపుర గహనదవ దహన చిర బహుళతర విభవ నిరుపమ శుభకర గీ. కమలనిధి శరధి గరళ గళ గగన చికుర నరగమనసఖ సుఖఫలద మురహర శర నిజగుణ కథన చణకమలజ మధుకర రాజమిహిర రథాంగ శ్రీ రామలింగ శ్రీ o 3 గోలకొండ కవుల సంచిక 03 భక్తిభిక్ష శ్రీఒద్దిరాజు లక్ష్మీనరసింహ రావుగారు. ఉ. భావముపల్లవింప నిజభక్త హృదంబుజ లోకమిత్ర ! ల శ్రీ శ్రీవిభవాభిరామ ! నిను గీస్తే నసేయుదు; సర్వలోక సం సేవితమైన శీదుపదచింతనమాననిబుద్ధినిచ్చి న గావుము దీనపోష ! సనక ప్రముఖాఖిలమౌనిసన్ను తా. చ. అనయమునీదు చెంగటఁ బ్రియంబున నిల్వగఁ గోటిసూర్యకాం తినిభ మహావిలాస రమణీయభవ త్తను భూరిదీ ప్తి నా త్మను పదిలంబుగానిలుప, మంజురుచీ రమణీయ ద్రవ్యగా ధన విన తావకీన సునితాంతదయ మతినిచ్చి ప్రోవుమా. శా. నీరూపంబులు, నీదు వేషములు, సీ నేర్పుల్, విలాసంబులు నేరఁజాలరు తెల్యయోగులనఁగా, నేనెంతవాఁడ బృహ దీరా ! భక్తి నొసంగిప్రోచుటకు నీదే భారము ద్వేల దు ష్టారిధ్వంసక ! పాలముంచినను నీట ముంచిన శ్రీహరీ ! 3 మ. ప్రణవార్థప్రతిపాదకుండవు, సురా రాతీవ్రజాహార్య భం జనదంభోళివి, యోగిమానసపయోజద్వాదశాత్ముండ వెం దునది క్కెద్దియులేని నాకలుషముం దూలించి రక్షించి నా మనమందుకొ భవదీయ నామమును సంస్థాపించి రక్షింపుమా. క. అనిశము చేత స్పౌధాం గనమునఁ క్రీడించుపరమ కారుణ్య చిరం తనమూ ర్తి భక్తి భి ని దానిన యొసఁగు మైత రేయమునొల్లక్. ос >
CE గోలకొండ కవుల సంచిక
౧౪
శ్రీరామ పంచాక్షరీ స్తవము
శ్రీ పుల్లగుమ్మి శ్రీనివాసాచార్యులు గారు
ఓంకారప్రతిపాద్యంశ్రీభూ దేవ్యంచితునిగమవేద్యం.
శ్రీకేశవపర దేవంవద్దేహంసర్వసంపదాంప్రాప్త్యి౧
రాంక వభూషితవపుషందయానిధింమాత్స్యరూపమబ్జాక్షం
వేదోద్ధరణధురీణంశరణాగతరక్షిణంప్రణామిహరిం.౨
రాజన్మన్దరశైలంపృష్ఠెధృతవాదివౌకసోనేతుం
జీవాతుమమృతమబ్దేహ్ కూర్మాకారోహరిస్సదావ్యాన్నహ్.౪
మానాతీతవిభూతిర్దంష్ట్రోద్ధృతధరణిమండలశ్శ్రీశః
సదయోమమాన్తరంగేమహావరాహశ్చింనరీవర్తు.౫
యస్తంభభవోన్యదృణాద్ధీరణ్యకశిపోరురఃఖరైర్నఖరైః
సనృసింహవపుర్లక్ష్మీజానిః పాయాద్విపత్త తేరస్మా౬
నమతామాఢ్యంకరణో బలిమ స్తన్యస్తశోభిశుభచరణ
మాతాద్యావాభూమ్యోఃపదద్వయే నైవవామనోవతునః౭
మర్మానిద్వైగితతేక్షితిమక్షతాంముహారుషాకృత వా౬ త్రిస్సప్తకృత్వపతజ్జమదగ్నిసుతస్సుఖాకరోత్వస్మాక్
౧౭
వేణుగోపాల ధ్యానము మరతాటి వేణుగోపాలచార్యులు గారు మధురిపువదనసరోజం దరహాసమరాళ రాజరమణీయం మురళీరవమథుధారాం విసృజద్విలసతుమదీయహృత్సరసి పదయు X గతకిణ్కిణీనినాదానుకరణ వేళల బాలహస్త తాళః అపనుదతుమమాంతరంము రారిస్తిమిరము దారవిలాసలో లశీలః ౨' మంజులగుంజాహారీ మాళి చలాచలశీ ఖండమాలీమాం కులసుందరీ విహారీకువలయక రావతంసి తాపాతు ణ ఉరగాలంకృతికలితం సుమశరసుందరమహీశగిరివాసం కలయే శాలవక్షస్థలలసదర వింద నిలయమురుశరుణం 36 కురుమతిగిరీంద్ర నిలయోవిలసతు శ్రీ కవితార్కిక సింహాచార్యులు గారు 3 నవకువలయదలనీల;కమలాస్త నకమలముకులలో లా లిః కురుమతిగిరీంద్రనిల యో విలసతుమమమాన సేరమావాసః శ్రీవత్సవై జయంతీకొస్తుభలక్ష్మీ పరిష్కృతోరస్కః విలసతుహృదివిధిశత = ఖహరిశరముఖవంది తాఁఫ్రి రాజీవిః విద్యుద్రు చిరుచి రాంశుక సంవీతః కిసలయాధరశ్శుభదః విలసతుమమహృదికలశాంబుధికన్యాస్వాంతకమలకలహంసః 3 షట్పదనివహమదాపహమఁజులకు టిలాలకస్ఫుర త్ఫాలః కమలాకటాక్ష దాసోవిలసత్వనమఃకృతాసురత్రాస; పర్మాలయాపదాంబుజలా డాంకితవక్ష సంసరోజాక్షం
కలయామిక లుషజాలకకూలంకషమంశుమాలినిభభాసం పుట:Golakonda Kavula Sanchika (1934).pdf/67 పుట:Golakonda Kavula Sanchika (1934).pdf/68 పుట:Golakonda Kavula Sanchika (1934).pdf/69 పుట:Golakonda Kavula Sanchika (1934).pdf/70 పుట:Golakonda Kavula Sanchika (1934).pdf/71 పుట:Golakonda Kavula Sanchika (1934).pdf/72 పుట:Golakonda Kavula Sanchika (1934).pdf/73 గోలకొండ కవుల సంచిక
33
భద్ర సంధాయకా !
శ్రీ ధప్పూరి సత్యనారాయణాచార్యులు గారు
సీ. శ్రీనాయకాయ భాసితశుభాకారాయ
పద్మనాభాయ తుభ్యంన మోస్తు
జగదీశ్వరాయ సజ్జన పాల కాయ శో
భనచరితాయ తుభ్యంన మోస్తు
విశ్వరూపాయ సర్వేశ్వరాయ ధీ రాయ
భవవిదూరాయ తుభ్యంన మోస్తు
కాంచనవసనాయ కమనీయ దేహాయ
భక్త వంద్యాయ తుభ్యంనమోస్తు
గీ. అజ్జనిభలోచనాయ తుభ్యంన మోస్తు
పరమకరుణాకరాయ తుభ్యంన మోస్తు
భద్రసంధాయకాయ తుభ్యంన మోస్తు
భావరామభద్రాయ తుభ్యంన మోస్తు.
మ. సకలాధారుఁడు వేదవంద్యుఁడుమహాశాంతుండుమౌనీంద్రర
క్షకుఁడజ్ఞానమహాంధ కారపటలీ సప్తాశ్యుం డబ్జాక్షుడ
త్యక లంక స్తవనీయనామకుఁడు నిత్యానంద కై వల్యదా
యకు డా శ్రీరమణీమనోహరు మహత్త్వం బెన్నఁగ సాధ్యమే
గోలకొండ కవుల సంచిక
83
శ్రీ వేంకటేశ్వర స్తవము.
శ్రీ కాళ్ళూరి రాజేశ్వర రావు గారు
సన్నిధినున్న మానినల సంగతిమాని సమస్త కార్యభా
స్వన్ని జ భారము మరచి భక్త జనాళిఁ గృపాకటాశు సం
పన్న తఁ బ్రోవ వేల ? నిజ భావద యాస్థితిఁ జూప నేల యో
యన్న పు రెడ్డిపల్లి నగ రాభ్యుదయేశ్వర ? వెంకటేశ్వరా ?
ఎంతో కాలమునుండి యాశ్రితుఁడవై యేనిట్లు ప్రార్ధించుచో
సంతోషించివరంబునీయవు పయిక్ సంధింతుక ష్టంబు లక్
బొంత జేరిన మోసగింపఁదగునే పుణ్యాత్మ? చంచత్కృపా
నంతా ? అన్న పురెడ్డిపల్లినగ రేశా ? వెంకటేశ ప్రభూ.
ఒక్కడునవ్వుచుండు మరియొక్కఁడుదు దుఃఖమునొందుచుండు వే
రొక్కఁడు రూపయౌవనమహోత్సవమందు చరించుచుండు వే
రొక్కఁడు చాలహీనతను నొంది సుఖంబు త్యజించుచుండు నీ
చక్క నికర్తృకత్వమిడు శక్తి యెవానిదొ? వెంకటేశ్వరా
జలసంచారము చేయు కాలమున నాజాతి స్వభావమ్ము నీ
కలవా టైనకతంబుచే నలతులంద న్యాయము బూని కే
వలహింసాపరబుద్ధి పూనికొనినావా? యిట్టిధర్మౌఘముల్
గలవా? అన్నపురెడ్డిపల్లి పురపాలా వేంకటేశ ప్రభూ ?
ఒకనాడామరి రెండునాళులొకొ యేనోర్పువహింపంగ నె
ట్లకటా ? యేండ్లును బూండ్లుగా దొడఁగె విద్యా సష్టమై వ్యావహా
రిక సంబంధము లందు మున్గితినయా రే! యఁతము లేదె యిం
తకు నోయన్న పురెడ్డిపల్లిపుర నాథా? వేంకటేశ ప్రభు.
గోలకొండ కవుల సంచిక
88
వేంకటేశ్వరస్తవము
శ్రీ వేంకటగిరి రామాచార్యులుగారు.
సీ. ముగ్ధాంగనాజన మో హిత తారుణ్య
మహనీయవిభవ రమావరేణ్య
దుగ్ధపానస్నిగ్ధ ముగ్ధాంగలావణ్య
కల్యాణభాస్వ దగణ్యగుణ్య
దగ్ధసంసరణదుస్తర ఘోరారణ్య
శరణాగతాసుర వరశరణ్య
నిరవధికానందకరపూర్ణ కారుణ్య
నిరుపమానానంత నిరత పుణ్య
గీ. వినతసన కాదినారద మునివరేణ్య
సకలలోకాధి దేవతా నికరగణ్య
సరసగుణజాల వేంకట శైలఖేల
భక్త జనపాలగోపాల భర్మచేల.
సీ. జితయాతుధాన సంవృత హేమపరిధాన
సతజనాధీన కంపిత నదీన
కృతసర్వదాన నందితము క్తసంతాన
తత వేణుగాన సన్న తనిధాన
సత తాభిమాన రక్షిత పాదగతదీన
ఖగ రాజయాన సాగరశయాన
పరమాభిదాన భాసురముక్తి దస్థాన
రుచిర కీర్తి నవీన ఖచరయాన
గీ. అధిగతజ్ఞాన మునిజనావనవిధాన
ప్రబల తరదివ్య తేజో విరాజమాన
గోలకొండ కవుల సంచిక
సీ. నిరవధి కా నంద నిలయంబునీ ప్రాపు
నిగమాంతముల కేపు నీదుచూపు
జగములన్ని యునిండు సొగసైన నీరూపు
సాటి లేదెందు నీమాటతీపు
నీ పదస్మరణంబు నిరయంబు నెడ బాపు
దయతోడనాకునీ దాపుజూపు
కడలికవ్వపుగొండఁ గడతేర్చెనీవీపు
భేదించుకుజనుల నీదుతూపు
గీ. పాపరాయఁడు నీకు రేబవలు కాపు
పరమునీకీర్తనము మోక్ష పదము జేఁపుఁ
సరసగుణజాల వేంకట శైలఖేల
భక్త జన పాలగోపాల భర్మచేల.
సీ. శ్రీమానినీమణి చిత్తాబ్జమత్తాళి
పదపంకరుహనమ్ర భక్త పాళి
శైశవవిధ్వస్త శకటాదిదనుజాళి
వరమౌనిహృత్సరోభవసు హేళి
ధారుణీ సురగోత్ర దారుణదఁభోళి
సందిత ద్రుహిణ బాలేందుమౌళి
మురళీని నాదసమ్మోదితగోపాళి
పరమకీర్తిత వియచ్చరమరాళి
గీ. కుటిలఫణివరపటుఫణా నటన కేళి
రాధి కానవ్యకు చపటీ రార్దపాళి
సరసగుణజాల వేంకట శైలఖేల
భక్త జనపాలగోపాల భర్మచేల.
83