గోలకొండ కవుల సంచిక/వివిధ వర్ణనలు
గోలకొండ కవుల సంచిక
గంగాలహరి
శ్రీ పల్లా రామచంద్రశర్మ గారు
శా. శ్రీ రామాహృదయారవింద సరణి శృంగార భృంగాత్మ సం
చారంబొప్పఁగ సేయు శౌరి పదకంజాతంబున బుట్టి లో
కారాధ్యుక్ హరు నుత్తమాంగము నివాసాహ౯ంబుగా నుండి మా
భూరిప్రార్థనలాన వచ్చితిటకు బుణ్యాబ్ధి గంగానదీ!
మ. తరమా పంకజసంభవాదిసుర సంతానంబుకై సభవ
ద్వర చారిత్రము సన్నుతింప గణుతింపగాండ ఖండంబు వే
పరుగెత్తించెడి పాపపుంజములు నిన్భావించుపౌరాళి నా
తరమా వర్ణన సేయ నిన్ను కలుషత్వచ్ఛేది గంగానదీ!
శా. ఆనాడాసగ రాఖ్యభూమి ధవుడే యాగాశ్వము వీడి పు
త్రానీకంబును రక్ష నేయనిడఁగా నామూకకు యోగిసం
తానాలంకరణుండు నౌ కపిలు చేత జావు సిద్ధింపఁగా
నానాకస్థలవాసులన్ సలుపవే యంబోధి గంగానదీ!
మ. హరగంగే, యని యొక్క మాటు నినునాహ్వానించి వే గ్రుంకిన
బరమామ్నాయవిదుండు భాస్కరుడు ప్రాగ్భాగఁబునక్ దోప నా
చరమాగంబునుగూర్చి పారు రజనీసంఘంబులన్ బోలె నా
వరపాపౌఘములున్ దొలంగవె దయాపాధోధి గంగానదీ!
గోలకొండ కవుల సంచిక
అధునాతన విద్యార్థి
శ్రీ తాటిపర్తి గోపాలాచార్యులు గారు
శ్లో. విద్యార్థినంత మధునాతన మంగ; విద్ధి
యద్రీతిరాంగ్లజనతా మనుయాతివేషే
వాక్యాత్ర కేస్ఫురతి యద్వినయోపి యస్య
విద్యాచపుస్త కగతా, గతిరన్యసేవా.
ఏ కేపురో గ్రానప రేభితో గ్రా
నన్యేతిరో గ్రానితి కాకపక్షాన్
అనేక థైవాసృణతే యథేష్టం
తత్రాపిభూయాంసి మతాని నూనం
యావంతీకిల కాక పక్షరచనా సంస్కారసంపాదనే
లీలాకందుక ఖేలనాదిషుచయా కాఫీపయశ్భూషణే
యాచోపానదు వాసనే పటపరిష్కారక్రియాయాంచ యా
శ్రద్ధార్థాపినతత్ర పాఠసమయే విద్యార్థినాంప్రాయశః
పరిణమతి యథాయథాచపాఠ్యం
సులభతర పఠితృప్రకర్షణాయ
అనునరతి తథాత థేవళాఠ్యం
మతిరలసాపిచ హైందవాజ్ ప్రకామమ్.
అహో! అధీయానమిహాత్మ నీనాన్
గృహేషు సందర్శయతే స్వమేషః
వినీత భావాభినయోప్యముష్య
యథాగురుత్వాభినయో గురూణామ్.
గోలకొండ కవుల సంచిక
సంపెంగ
శ్రీ చెన్నమరాజు కొండల రావు గారు
చ. ప్రకట దిగంతరంబులకు బారులు వెట్టు సుమాళి సౌరభ
ప్రకరములద్దిరా! భువన భాసురలీలఁ జెలంగ నీదు సొం
పొక మలినాంగయౌ మధుపి యొల్లకయుండిన నేమిసేయునో
వికవికఁబోయి యన్యసుమ వీచులఁజిక్కులఁజిక్కు సంపెఁగా,
చ. అనిశమరందమాధురిమ నచ్చక నిశ్చలమూని చేర కే
చనెడు భవత్ప్రసూనముల సారమెఱుఁగదు భృంగ మద్దిరా
జననవిధఁ బెఱింగి, యల జాతులమూతులు నాకుచుంటయో
తనువునుజూచుకొంచుఁ దను దాఁదగ మద్యపి నంచొ సంపెంగా
చ. కదలి కసాలపల్లవ ముఖంబులు నాయుధము ల్ఘటించి నీ
వదనము చిన్నబుచ్చ ముర నైరికు మారుఁడు నారిఁ గూర్చెఁగా
మధుపినటంచుఁ గుందకుము మాటికి పంపెగ నీమరంద మే
విధమునఁ గ్రోలు కీటకపు వృత్తి మలీమస మెందుఁబోయెడిన్ ·
చ. జగములెఱుంగు హేమసుమ పౌరభమారయ చంపకంబ! నీ
సొగసు విలాసినీ మణుల సుందర నాసికఁ బోల్పకుందుమా
వగవఁబనేమి నీదు మధువాసన నొల్లకయున్న తేటియే
తగువరి దాని హీనతకుఁ దార్కొనితర్క మొనర్చ బోకుమా.
గోలకొండ కవుల సంచిక
విశ్వకర్మ
రాఘవనగరం రామసింహము గారు
సీ. ఆదరించినవారి కపకార మొనరించి
ప్రజ్ఞఁదెల్పుట మహాపాతకంబు
ఆపదఁదొలఁగించి యాప్తులౌ వారితోఁ
బగఁ బూనుటయు మహాపాతకంబు
నిజమేదొ తెలియక నిర్నిమిత్తంబుగాఁ
బరనిందఁ జేయుట పాతకంబు
నావంటి పరిపూర్ణుఁడేవంక లేఁడని
భావించుకొనుటయుఁ జాతకంబు
తే. తగని పాపిష్టి గురుని పాదమునుబట్టి
భక్తు లైమ్రొక్కుటయు మహాపాతకంబు
భక్త జననిందనము మహాపాతకంబు
విశ్వపాలనధర్మ శ్రీ విశ్వకర్మ.
సీ. ఘోరక్షోభట క్షోభక సహకార
కారణాంచిత నిర్వికార విభవ
భవమిత్రపద్మసంభవ భావజ జనక
జనక భావప్రపంచజాల గర్భ
గర్భస్థలోక భాగ్యఫలప్రదనయజ్ఞ
యజ్ఞభృజ్జగదసాధ్యప్రతాప
తాపసాఖండ నుతశ్రీ హృషీ కేశ
కేశవహృత శ్రీత క్లేశ సంఘ
తే. సంఘటితజయ ని స్తంద్ర జాయమాన
మానపరిపూణ౯ వసు పరిథాన హీర
హీరఖచితకోటీర కోటీరధారి
విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ.
గోలకొండ కవుల సంచిక
కుసుమాపచయము
శ్రీ ఎం. వి. మాధవరావు గారు
వికసిత మనోహరము లైన విరులఁ గాంచి
కోసి యానందపడెడవు కొంత సేపు
తమక మొకయించు కేనియుఁ దగ్గగానె
మూలఁబడ వై చెదవు దాని ముక్కలెల్లఁ
దరువుఁ బాసిన కుసుమంబు దక్కదనుచుఁ
బూర్వభావణ్యమంతయుఁ బోవుననుచుఁ
దెలిసియునుగోయ యత్నించుఁ దెలివిలేని
పనిని, నేమనుటో? పిల్లతనముగాక
కొమ్మనున్నట్టి పుష్పంబుఁ గోయఁబోక
తావులను గ్రోలు టుచితంబు దాపునుండి
మధువునాస్వాదన మొనర్చు మధుకరంబు
హానిసేయుటకలదె? ప్రసూనములకు
నుఁదరములైన వస్తువుల్ చూచినపుడు
భ్రాంతిఁజెందని మనుజుండు పరగఁగలఁడె
చక్కఁదనమును బ్రేమించు హక్కె కాని
దానిఁ జెరచు ప్రయత్నంబు తప్పుకాదె?
గోలకొండ కవుల సంచిక
స్మృతి
శ్రీ షబ్నవీస్ వేంకటరామనరసింహారావు గారు
సీ. సకలసత్కృతులందుఁ జాయపోలిక నన్ను
ననుసరించినయట్టి వినయభరిత !
ప్రాణంబుకంటే న త్యధికంబుగను నన్నుఁ
బ్రేమించినట్టి సత్ప్రేమధామ!
స్వర్లోకమున కేగు సమయమందైననా
మాటదాటనియట్టి మహితశీల!
పెనుగష్టములయందు బెగడొందనీక న
న్నూరడించెడునట్టి ధీరచరిత!
తే. గీ. మగువ! నీఋణ వెన్ని జన్మములకైన
నగునె చెల్లింప నీదు సాయంబులేక ?
జానకీ! నాయుదయలక్ష్మీ సమసిపోయె,
నదయ వైనీవె ననువీడి యరుగుకతన!
కలికాల మహిమ
శ్రీ మరింగంటి సీతారామానుజాచార్యులు గారు
మ. అరయన్ సజ్జనులన్ హసించు దురితుండా వాక్య సంశ్రోతలై
పరిపాలించరు భూపులాత్మగత సద్భావాపరాకర్షులై
హరియో స్వాత్మవిధాన మర్చకజన స్వాధీనమున్ జేసిను
స్థిరచిత్తుండయి మౌనమూనె దురితున్ శిక్షించకెం తేనియున్.
క. వేదోపబృంహణస్మృతు లాదినిఖలగ్రంధముల మహా నీచముగా
వేదముల నపార్థముగా భోధయొనర్తురు సమస్తమును గన కెలమిన్
గోలకొండ కవుల సంచిక
దంతము
శ్రీ రంగాపురము వాడాల నరసింహము గారు
సీ. స్వాచేష్ట నస్య యోషాశీరోరత్నాంచి
తాధర పీయూష మానియాని
చటుల నూత్న ముకుర చ్ఛనిగల జవరాండ్ర
గండస్థలక్షతుల్ గడపికడపి
లవణామ్లతిక్తాది లలితషడ్రసయుక్త
దివ్యాన్న రుచు లెల్లఁ దెలిసి తెలిసి
ఘృత తైల గుడపిష్ట యుతపక్వపంచ భ
క్ష్యాంచిత సారంబులరసి యరసి
గీ. వేసరితొవృద్ధతనుజూచి రోసినావొ
ఉదయసమయాంగుళీ ఘాతకోర్చవైతొ
మిట్టిపడి కదలివిడి తోబుట్టువులను
బాసిచను టొప్పునే యగ్ర భాగరదమ.
ఉ. మోమును జిన్న బ్రోవఁగను ముగ్దలుసూచి హసించుచుండ నెం
తోమదిచింత నొందఁగను దిన్న నిపల్కులు దుస్పిపోవఁగ
గోమలదంత చేల మదిఁ గందుచు వ్రాలఁగఁ బూర్వజన్మ హృ
ద్దామమముఁ బాసిపోతి వె రదంబ కదంబపరిత్యజంబ వై.
202
గోలకొండ కవుల సంచిక
98€
విద్య
శ్రీ చక్రహరి నారాయణ భట్టుమూర్తి గారు
సీ. రారాజచంద్రుఁ డై రంజిల్లినను గాని
విద్యాధికునె గారవించు చుంద్రు
నీచుఁ డైననుగాని నిరుపమ పాండిత్య
మునగదా సభలోన ముఖ్యుఁడగును
వికటహపుండైన విదాంసుడగుటచే
పలు విధంబుల శ్రీలఁగులుకుచుండు
ధనవంతుఁడై లోక ధన్యుఁడైననుగాని
శాస్త్రజ్ఞులనుజాల సన్ను తించు
గీ. లౌకికం బెల్ల విద్యచే లభ్యమగును
దుదకు మోక్షంబునకు ని దే తోడుపడును
విద్యయే మానవాళికి వినయమిచ్చు
గాన దీనికి సాటియే కానమెచట
9
కార్పాస లక్ష్మి
శ్రీ వానమాముల జగన్నాథాచార్యులు గారు
సీ. తలదాఁచుకొనుటకై తగునీడయును లేని
యొక చిన్న గుడిసెవారుండువసతి
యాదాయమదిఱోళ్ల యడుగునఁబడియున్న
నొకకొన్ని గింజల నూడ్చికొను టె
భార్యయా తానొక పరమసాధ్వీమణి
యిలుదాటి పొరుగిలు నెఱుగ దెపుడు
30 పుట:Golakonda Kavula Sanchika (1934).pdf/277 పుట:Golakonda Kavula Sanchika (1934).pdf/278 పుట:Golakonda Kavula Sanchika (1934).pdf/279 పుట:Golakonda Kavula Sanchika (1934).pdf/280 పుట:Golakonda Kavula Sanchika (1934).pdf/281 పుట:Golakonda Kavula Sanchika (1934).pdf/282