గోలకొండ కవుల సంచిక/కథాలహరి
గోలకొండ కవుల సంచిక
కాంత
శ్రీ గాదె రామచంద్ర రావుగారు
పసిడిచాయల దేహ వైభవము గలిగి
తీక్షమగు మోహనకరంపు దృక్కులందు
రూప రేఖావిలాసంపు దీపులందు
వయసుటిల్లాలి సహజ సంపదల మించి
కాంత" యను పేర శ్యామలు కాంతయలకు
రాజితగుణుండు ధిషణాధురంధరుండు
శ్రీయుతుండును చామన చాయవాఁడు
రహినినలువందు శ్యామలరావు పేర
పూర్వకృతపాపఫలమె యీపుట్టువందు
భార్యారూపాన"కాంత” దుర్భమలగొలిపె
పండితుండైన సర్వ సంపదల చేత
వెలయువాఁడైన భూరి దోర్బల పుఁగలిమి
నలరువాఁ డైన మగువల తళుకుబెళుకు
సరసములనమ్మి చెడిపోని నరుఁడుగలఁడె
మగఁడు మేదకుఁడైనచో మగువలహహ!
పుడమినాడింపకుందు రే బొమ్మలట్లు
టక్కుటకటొంకు టాటోటు టెక్కుగలిగి
పతినిఠవళించి లోలోనఁ బ్రమదమందు
మగనిబంధువు లేతేరఁ బగనుబూని
యావరణఁ జేరి యెగసి క్రోధానలంబు
లుమియు దుర్వారరూక్ష మహోరగంబు
ననుకరించుచు నిర్భాగ్యుఁడైనపతిని
దిట్టు కొరకొరలాడు తద్దినము వెట్టు
కులుకు బెళుకులకొంప గయ్యాళి గంప
7872 పుట:Golakonda Kavula Sanchika (1934).pdf/316 పుట:Golakonda Kavula Sanchika (1934).pdf/317 పుట:Golakonda Kavula Sanchika (1934).pdf/318 పుట:Golakonda Kavula Sanchika (1934).pdf/319 పుట:Golakonda Kavula Sanchika (1934).pdf/320 పుట:Golakonda Kavula Sanchika (1934).pdf/321 పుట:Golakonda Kavula Sanchika (1934).pdf/322 పుట:Golakonda Kavula Sanchika (1934).pdf/323 పుట:Golakonda Kavula Sanchika (1934).pdf/324 పుట:Golakonda Kavula Sanchika (1934).pdf/325 పుట:Golakonda Kavula Sanchika (1934).pdf/326 పుట:Golakonda Kavula Sanchika (1934).pdf/327 పుట:Golakonda Kavula Sanchika (1934).pdf/328