గురుజాడలు/కవితలు/మాటల మబ్బులు
స్వరూపం
మాటల మబ్బులు
దబ్బరలుం గొండెమ్ములు
మబ్బువలెం గ్రమ్ము మాయ మాటల తీపున్
నిబ్బరపు మొండితనమును
నబ్బురమగు విద్యలచటి యధికారులకున్.
తన కొక మేలు చేకురగ తక్కినవారికి గీడు సేయుటల్
మనమున లేని భక్తి యభిమానము మాటలలోనే చూపుటల్
గొనకెటు లాభముల్ గలుగు? గొంకక నాటకమాడ సాగుటల్
ధనమునకు న్మహోన్నతికి దారులు రాజ గృహాంతరంబులన్.
కెంజిగురుల కోయిల, సుమ
మంజరులన్ దేటిగముల, మనుజ ఖగములన్
మంజుల ఫలముల, చూతమ!
రంజించెద వితర తరులు రా వాదుకొనన్.
విధి వశమున నీ చెంతకు
మధుపము రా హేళనంపు మాటాడకుమా
మధు వొలుకు జలజ కులముల
కధికపు నెయ్యుఁడగు కుటజమా! తెలియు మెదన్.