కృషీవలుడు/ప్రేమాంకము
స్వరూపం
ప్రేమాంకము.
శా|| అన్నా మన్నెము శేషురెడ్డి, యెటులో
యావిర్భవంబొంది స్నే
హౌన్నత్యంబు పరస్పరంబు రమణీ
యానేక భావంబులం
జెన్నారెన్ హృదయానుబంధర చనా
చిహ్నంబుగన్, మాఱుపా
టెన్నండుం దలచూప దిందనుక దై
వేచ్ఛాప్రభావంబునన్.
తే. గీ. అట్టి నిర్మలమైత్రికి నానవాలు
నవ్యకవితాసుమంబుల దివ్యమాల
నెమ్మి గీలించుచున్నాడ నీదుకీర్తి
కామినీ కంఠసీమను గాంతు లొలయ.
ప్రియమిత్రుడు,
దువ్వూరి రామిరెడ్డి.