కులశేఖర మహీపాల చరిత్రము/ద్వితీయాశ్వాసము
కులశేఖర మహీపాల చరిత్ర ద్వితీయాశ్వాసము కం. శ్రీజనక జామనోహర! రాజక శాధరధనుర్ని రాస విలాస వ్యాజ ప్రకటిత భుజబల ! రాజద్గజరాజగామి! రామస్వామి! 1 వ« అవధరింపుము శిష్యులంగని గురువర్యుం డవ్వలికథ యిట్లని చెప్పం దొడంగె. సీ. రాజుకడకు భాగవతులు వచ్చుట సుషమపారాశర్యసూత్రత త్త్వవివేక పరిణామ మేధాను భావయుతులు భూత కాసారాదిపూర్వపుణ్యశ్లోక జల్పితద్రవిడ వాళ్చతురమతులు ఘనమనఃకీలితా కారత్రయార్థనిష్ఠాంత్యంత రసిక సాంగత్యమతులు నశ్రాంతకృతతిదీయారాధనార్ధన త్కర్మనిర్మితయళశ్శర్మగతులు తే. గీ. పరనుపురుషానుమతులు శ్రీభాగవతులు నిజ నిలయభాగ వేదికా నిష్ఠులగుచు బలసి సద్దోషి సేయుచోఁ బార్ధి వేంద్ర భటులు గాంచిరి కన్నుల పండువుగను, 2 B వ. కాంచి కరమ్ములుమోడ్చుచు మహాత్ములార! మహీకాంతుండు యుష్మత్సందర్శనంబు గోరుచున్నవాఁడు విజయంచేయుండనుటయు నట్ల కాకయని యందఱుం గదలి. 4 36 సీ. ద్వితీయాశ్వాసము మధుక రాశనమనోరథసిద్ధి వాటింప సారస్వతో దారశక్తి గాంచి సదమలామృతపదాశారసజ్ఞత దోప సఫలసంకల్ప ప్రశస్తి గాంచి పర భామినీసహోదరవృత్తి గన్పింప సుమనస్సమాగమస్ఫురణ మించి బంధు దివ్యప్రబంధకూఢి యెసంగ నిత్యమాధవయోగ నిరతిఁ బూని తే.గీ. యెలమి సంశ్రితజనమనోభీప్సితార్ధ నిచయఘటనాసమర్ధత నివ్వటిల్ల జనిరి రాజేంద్రుకడకు నిచ్ఛావిహార పారిజాతమ్ములో యన భాగవతులు. ఊ. ఆ సౌజన్య గుణప్రసన్నముఖు లిట్లాస్థానముం జేరు ను ల్లాసం బేర్పడ వచ్చుచున్న యెడ లీలన్ మంత్రిసంఘంబుతో నాసక్తీన్ మనుజేంద్రచంద్రుఁడు సముద్యద్భక్తిసంయు క్తుఁడై దాసోహమ్ముని మ్రొక్కెఁ దచ్చరణపద్మ ప్రాంతధాత్రీస్థలిస్ ఆర్యజనాగ్రగణ్యు లపుడాన్న శేఖరుఁ జూచి దోర్బలౌ చార్య సమృద్ధినస్తు ధనధాన్యయ కోవిభవోస్తు సంతతా చార్యకృపాకటాక్ష విలసన్మహిమాస్తు సుపుత్రకోస్తు తే సూర్యసమప్రతాప! యనుచున్ దగ దీవనలిచ్చి రందఱున్, తే.గీ, సరవి నీరీతి మంగళాశాసనమ్ము లెలమిఁ గావించు శ్రీవైష్ణవుల సభ క్తి వినయవినమితుఁడగుచు భూవిభుఁడు రత్న చిత్రపీఠుల నుంచి పూజించె నంత. వ. ఇవ్విధంబున నమ్మహాత్ములం బూజించి 5 6 7 యమ్మహీ కాంతుండు 8 దానునుం దదనుజ్ఞ గైకొని యాసీనుండై వినయవినమితమ స్తకుండగుచు వారలతో 9 నిట్లనియె. కులశేఖర మహీపాల చరిత్ర శ్రీ హరిపాదపద్మతులసీదళతీర్థ రసజ్ఞు లజ్ఞ హృ న్మోహనివ ర్తకుల్ భవవిమోచను లాశ్రితమోక్ష లాభ ని ర్వాహులు రోషలోభమద రాగవివర్జితు లూర్జితక్రియో 37 త్సాహులు నైన మిమ్ముఁ బ్రమదంబునఁ గొల్తురు ధన్యు లెల్లెడన్ 10 సీ. భవబంధ మెడలించు బహుముని వ్రజవపు స్సంగ మంగళజలాభంగ గంగ తనుతాప ముడిగించు వినుతపోడశకళా పరిణామరుచిహారి పంకజారి దారిద్ర్య మడగించు ధన్య లేఖజ నౌఘ కలితనిత్యశ్లాఘి కల్పశాఖ యపమృత్యువు నడంచు నపగ తౌఘసుధీ హృదానందరసపూర యమృతధార తే.గీ. యిన్ని గుణములు గలసి యొక్కెడ నిలిచి యుండు నే వార్థికన్యాప్రియోరుచరిత ఘనసుధాస్వాద విదళితక లుషపాళ వేష్టనులరైన మీయందు వెలయుగాని, హారాళు లెంచ నాహారాళులే యంచు గళమున వనదామగరిమ బూని కేయూ కరుచి మన కేయూర రుచియంచు భుజముల దరచక్రములు వహించి కటకానివృత్తి యక్కట కానివృత్తి యం చొకట చే నక్షమాలిక ధరించి కాంచి కాగుణ మిచ్చఁగాంచి కాగుణమంచుఁ గటి తంతుసూత్ర మొక్కటి యమర్చి తే. గీ, మణివిభూషణ ముఖ్యసంపత్సు దేశ రసము నొల్లక గాఢపై రాగ్యలక్ష్మి. పేర్మి హృద్వీధి నొలయ గాంభీర్య రేఖ నలరు మీ వంటి ధన్యులెందైనఁ గలరె! 11 12 38 కం. ఉ. ద్వితీయాశ్వాసము అనుచు వినుతించి ముదమున ననపాయనిజాభిలషిత మాపుణ్యులకున్ వినిపింపఁ దలఁచి క్రమ్మఱ వినయానతవదనుఁడగుచు విభుఁ డిట్లనియెన్. అట్టి మహానుభావులు మహాగుణగణ్యులునైన మీరు మా పట్టునఁగల్గుటన్ జతుర పాంపతి వేష్టిత రాజలక్ష్మికిన్ బట్టఁపు రాజునై విమల భాగ్యసమృద్ధిఁ బ్రసిద్ధిగాంచు నా పుట్టువు సార్ధమై వెలయఁ బుత్రులు గల్గ ననుగ్రహింప రే! చం. ప్రకృతివికారమైన తను భావము గల్గినచో నిజాన్వయో పకృతి పరోపకారము లపాయములందఁగనీర యేని యా సుకృతులు ధర్మకీర్తి పరిశుద్ధిఁ బ్రసిద్ధి వహింతు రింకఁ ద ద్వికృతియొనర్చునట్టి యవివేకులు నిషలజన్ము లెన్నఁగన్. ఆరయ నిట్టి రెండుపనులందు నొకండు గులాభిరక్ష త త్కారణభూతపుత్రఫలగౌరవ రేఖ నలంకరించి భూ భారము నిర్వహించు సదుపాయం మెఱుంగదలంచియే జుడీ ధీరజనాగ్రగణ్యులగు దేవరవారి గురించి వేడెదన్, తే, గీ, అనుచు ననపత్య దోషభయాభిభూత చిత్తుఁడై వేడుచున్న రాజో త్తమునకు వరదులై యమ్మహాత్ములు కరుణ నెరయు చూడ్కులల రంగఁ బల్కిరి సొంపుమీఱ . కం. పున్నామనరకభీతి వి భాగవతుల యుపదేశము పన్న పరిత్రాణకార్యభారగుఁ డగుచున్ బన్నగరాజశయానుం దున్నాఁడు మదిం దలంకుటు చితమె! నీకున్, ఉన్న జగత్త్రియమ్ము హరి యున్నతకీ ర్థి శుచిత్వ లక్ష్యమై యున్నది మింటనంటి ధ్రువుఁడున్నది ధారుణిపై విభీషణుం 13 14 15 16 17 18 సీ. కులశేఖర మహీపాల చరిత్ర డున్నది క్రింద దైత్యపతియున్నది పుణ్యపు రాణసిద్ధమై ది తోచియున్న దిశనున్నది యున్నది చిత్ర మన్నిఁటన్. యున్నది విప్రకోటికి 'వేదవిధి పేటి ముఖమయ్యె నదియు ఖంబయ్యె నయ్యభిముఖునకు నాకంబున కజాండరోకమ్ము పదమయ్యె నదిపదమ్మయ్యె నమ్మృదుపదునకు సర్వభోజికిఁ జలచ్ఛద రాజి రథమయ్యే సదిరథమ్మయ్యె నయ్యతిరథునకు మునిమనః కేళిక వనపాళి సుఖమయ్యె నదిసుఖమయ్యె నయ్యధిసుఖునకు తే.గీ. నతఁ డనంతుఁ డనంతలో కాంత రాంత రాంతరితో దిభూతమయాంగ జంతు నిచయబహిరంత రనుగత నిజకళాంశుఁ సీ. డధిప! నీచి సంతాప మతఁ డెఱుంగు. శేషదిక్కుంజరశ్రేణి మాన్చి జగమ్ము నిజకరాంగుళమున నిలుపనోపు నొగి జీవకోటుల నుపసంహరించి క్ర మ్మఱఁ గ్రమ్ముకొనఁజేసి మనుపనోపు బ్రహ్మాండభాండకర్పరము బ్రద్దలు వాపి చెలిమి నెప్పటియట్లు సేయనోపు గడిఁదిమై సప్తసాగరముల నింకించి పెంపొంద మఱలనిండింప నోపు తే.గీ. గిరులకరులఁ గిరులఁగరులుగా పుట్టించు కిరులకరుల కరులఁగిరులఁ జేయు నకట వాసుదేవు నఘటితఘటనాను భావ మేమి చెప్పఁ బార్ది వేంద్ర! వ, అతం డెట్టివాఁడని తలంచితి రేని. 39 19 20 21 22 40 ద్వితీయాశ్వాసము తరువఁద్రవ్విన వేళఁ దఱికొండ డిగవ్రాల నరవేల నూఁదీన యతఁడితండు మొసలి కాటులనొంప విసువు నేనుఁగు బెంప నసము డింపక వచ్చు నతఁడితండు రచ్చ రామొగరాన రెచ్చుసింగఁపు మేన నచ్చుగా సరి వచ్చు నతఁడితండు కడిఁది వేలుపునింటఁ గలసిరుల్ గొనుదంట నడుగంటఁ ద్రోచిన యతఁడితండు తే.గీ. విను మతఁడతండు వల్లభవనజ భవమ హేంద్రసనకాది మానసాభీప్సితార్ధ దానధౌ రేయుఁ డాశ్రితో దారధీవి' ధేయుఁ డిసుమంత నీకోర్కె దీర్పలేఁడె. సీ. హరులచేఁ గరులచే నరులు గెల్వఁదరం బె చక్రపాణి సహాయశక్తి లేక కలిమిచే బలిమిచేఁ గులముఁ బెంపఁ దరం బె రాక్షసాంతకు దయారసము లేక సతులచే సుతులచే నుతులకెక్కఁ దరంబె శౌరి కటాక్ష వీక్షణము లేక జపముచేఁ దపముచే నుపరమింపఁ దరం బె కనక చేలుని యనుగ్రహము లేక తే.గీ. మానవేశ్వర! యమ్మహామహుని కరుణ కలుగదేనియుఁ గలుగునే! ఘనులకైన నైహికాముష్మిక సుఖమ్ము లతని నాత్మఁ దెలిసి కీర్తించి నీకో 'ర్కె దీర్చికొనుము. శా ఆ లక్ష్మీ ్మశపదా_ప్తికిన్ బహుళజన్మాయాస విశ్రాంతికిన్ మూలంబైన తదీయభక్తిరచనా మూలమ్మునన్ గోవిదుల్ బాలత్వమ్మున యౌవనమ్మున గుణప్రఖ్యాతి వాటించి వా గాలమ్ముల్ పచరింప రాత్మహిత సౌజన్యమ్ము ధైవారగన్. 23 24 25 కుల శేఖర మహీపాల చరిత్ర భుజంగప్రయాతము, జరాజర్జరీభూతసర్వాంగ యష్టిన్ బరీతో పరివ్యాధి బాధావిభూతిన్ నరుల్ బుద్ధిజాడ్యమ్మునన్ జొక్కు వేళన్ మురారాతి నేరీతిఁ బూజింతు రాత్మన్. తే. గీ, కావున మనోవికారముల్ గ్రమ్మనీక ఘనులు తద్భక్తిఁ గాంతురుగాన శౌరి పూజనము బాల్యయౌవనంబుల ఘటింప వలయు నదియట్టులుండె నీ తలఁచుపనికి. కం. శ్రీ రోపహారనియతిన్ 41 26 27 వారిజదళ నేత్రు భక్తవత్సలుఁ గరుణా పూరితహృదయు భజింపు ము దారత నీకోర్కె దీర్చు ధరణీనాథా ! 28 వ. అనినం గందళితహృదయుండగుచు నమ్మహీపాలుం డమ్మహాత్ములకుఁ బ్రణమిల్లి నిటలకటఘటితకరకములుండై యిట్లని విన్నవించె. 29 సీ. క్షీరోపహారవ్రతారూఢి వాటింపఁ దొడరుచో నేమేమి నడువవలయు పుండరీక దళాక్ష, పూజాపరత్వమ్ము దాల్చుచో నేమేమి దడవవలయు దైనందిన ముకుంద ధర్మనిర్మల గోపి. వెలయుచో నేమేమి విడువవలయు చక్రాయుధధ్యానజప హోమకార్యముల్ గడపుచో నేమేమి నుడువవలయు తెగీ. నెంతకాలమ్ము గావింప నిందిరామ నోహరుం డిచ్చమెచ్చి యుత్సాహ మెనఁగఁ గింకరుఁడనైన నన్ను రక్షించు బుద్ది సంతయు నెఱుంగఁ గృపసేయుఁ డయ్యలార ! 30 42 కం. అని యిట్లు విన్న వించిన ద్వితీయాశ్వాసము మనుజేంద్రునిఁ జూచి భువనమాన్యచరిత్రుల్ వినుమీ వెఱుంగఁదలఁచిన పని యంతయు ననుచుఁ దెలియఁ బల్కిరి వేడ్కన్. తే. నుడువు మచ్యుతనామముల్ విడువు మితర తంత్రముల్ విష్ణుచరితామృత ప్రసక్తి దడవు మిహపర సౌఖ్యసందర్భనిరతి నడువు మవనీశ! వేయు సనంగ నేల! બોટ ప్రకృతిభిన్న స్వాత్మ పరమాత్మ సాంగత్య మొకటియందొకటికా నుడుపవలయు స్తవపూజనాహ్లాద తాత్పర్యశీలమ్ము లొకటియందొకటిగా నునుపవలయు భవ్యకర్మజ్ఞానభ_క్తియోగమ్ముల నొకటిపై నొకటిగా నూఁదవలయు నలమనోబుద్ధిచి త్తా హంక్రియావృత్తు లొకటిచే నొకటీగా నడుపవలయు తే.గీ. వలయు నీకింక నొక్కటి వనజనాభ చరణకంజాతమంజుల సౌరభాను భ వరసిక భాగవతజనాపచితి యిదియె మాధవారాధన ప్రౌఢి మనుజనాథ! తే.గీ. అధిప! భార్యాసమేతుఁడ నగుచు నొక్క వత్సరము బ్రహ్మచర్యానువర్తనమున శ్రీహరి భజింపఁ గార కార్యసంసిద్ధి మగుట నిశ్చయంబంచు పలికిన నృపవరుండు అంజలి చేసి పల్కెఁ బుల కాంకురజాలము లంగకమ్ములన్ బుంజములై తలిర్పగుణభూషణులార! మదీయ భాగ్య మొ స్పెం జగ మిచ్చమెచ్చ నిరుపేదకుఁ బెన్నిధి గల్గగోరి సి ధౌంజన మిచ్చినట్లు కృప నానతి యిచ్చితిరిట్టి ధర్మముల్ యి 31 82 38 84 35 ఉ. కులశేఖర మహీపాల చరిత్ర వందన మాచరింతు బుధవంద్య చరిత్రులు కేర్పడన్ బున ర్వందన మాచరింతు గుణవై భవయుక్తులకుఁ బునఃపున మాచరింతు హితవత్సలచిత్తులకంచు భూమిసం క్రందనుఁ డమ్మహాత్ములకు గాఢమతిన్ బ్రణమిల్లెఁ గ్రక్కునన్. 48 36 వం ఇట్లు మనుజేంద్రుండు భాగవతశిఖామణులకుం బ్రణామమ్ము లాచ రించి త తన్మందిరమ్ముల కనిచి తానునుం దదీయ శాసనం బవలంబించి దక్షులగు వారలం బురరక్షణమ్మునకు నియోగించి పత్నీ సహితుండై శ్రీ కున్నా రాయణ పరాయణత్వంబునన్ గృతవ్రతారంభుండయ్యె నప్పుడు. వ్రతారంభము మృగ నాభితిలక వర్ణితమైన నుదుటిపై బొలుపొందె ధవళోర్థ ్వపుండ్ర రేఖ యతులచీనాంబరోచితమైన నెమ్మేన నలరారెఁ గృష్ణసారాజినమ్ము సీతహారపుంజరంజిత మైన యురమునఁ దళుకొ త్తెఁ దులసికాదామపంక్తి కొంచనవలయ సంగతిగాంచు కరమున నమ రె వినూత్న పద్మాక్షమాల తే.గీ. వితతమంజులమణిగణ ద్యుతివిదీ ప చటులకోటీరయోగ్యమస్తకమునందుఁ గీలితంబయ్యె హరిపదాంకిత పటమ్ము సచ్యుతారాధనోద్యుక్తి నవనిపతికి. సీ. సమ దేభతురగశిచమత్కారమ్ము పరగించె నింద్రియపటలి యందు శత్రురాజన్య దౌర్జన్యభంజనశక్తి సమకొల్పే మదమత్సరముల యందు 37 38 44 ద్వితీయాశ్వాసము వసి ధనుశ్శరకృతాభ్యాసకౌశలబుద్ధి గర పె నష్టాంగయోగముల యందు పర రాష్ట్రదుర్గసం పాదనక్షమవృత్తి నెర పె భక్తిజ్ఞాననిరతులందు తే, గీ, భాసురావర్ష మణిగణభర్మరజత జాలకో శాల యేక్షణాన కి నిలిపె కమలలోచను దివ్యవిగ్రహమునందు భవ్యరుచిహేళి యమ్మహీపాలమౌళి. కం. కం. అతులిత జప హోమంబుల సతిశయమునఁ బ్రీతుఁ జేసె నంబుజనాభున్ బ్రతిమారూపమ్మున న చ్యుతు నర్చితుఁ జేసెఁ దత్తదుపచారమునన్, కేసరములఁ సేసెను గేసరినిభ మధ్యుఁ బద్మ కేసర చేలున్ వాసి దగు మలికాసుమ 39 40 వాసనలన్ బొదవె భక్తవత్సలు పదముల్ . 41 కం. కం. చారుతులసీ దళము లవి కారత నర్పించేఁ దులసి కాదామునకున్ శ్రీ రోపహార మొసఁ గెను శ్రీ రాంబుధిశాయికిన్ విశేషమనీషన్. కమలా ప్తసదృశ తేజుఁడు కమలమ్ములఁ బూజచేసెఁ గమలాస్త్రగురున్ గమలాక్షు గమలనాభుని గమలాహృదయేశు హృదయకమలం బలరన్. 42 43 వ. ఇవ్విధంబున నారాజదంపతులు భక్తినిష్ఠాగరిష్ఠులగుచు భగవత్సమారా ధనం బొక్కసంవత్సరంబు నలుపుటయుఁ దదనంతరంబ. 44 సీ. కుల శేఖర మహీపాల చరిత్ర శ్రీమన్నారాయణ సాక్షాత్కారము Q కలుములు వెద్యజలఁ గలశవారి జనించు మగువతో మొల తెంచు నగవుతోడ పరిపూర్ణ చంద్రబింబము వోలు చక్కని మొగముతో శేష వన్న గముతోడ మొనసి నారదముఖ్యు లొనరించు గానని స్వనముతో గరుడవాహనముతోడ ప్రభ మించు భద్రసుభ ద్రాదిపరిచరో త్తములతో శంఖచక్రములతోడ తే, గీ. సజలజలధరకోమల శ్యామలాంగ కలితకీలితరత్న ధగద్ధగాయ మానభూషణరుచిభీత భానుకిరణుఁ డజ్జనాభుండు ప్రత్యక్ష మయ్యె నపుడు . చం. పెలుచ ననేక జన్మకృతభీషణదోషకృపాణవంపై నొలయఁగ నీని గట్టి మరువూదిన కై వడి నింది రామనో లలితవిహారి రాక నొడలన్ బులకాంకురపుంజపంజరం బలవడఁ దాల్చె భూరమణుఁ డాచరణాననమస్తకమ్ముగన్, మృదునాళీక దళ ప్ర దేశముల దారిందూరి లోవ్రాఁకలన్ గుదురై నిల్చు దుషారవారి పయిటేకుల్ వేకువన్ దుమ్మెదల్ బెదరింపన్ దొనుకాడులీల హరి విచ్చేయంగఁ గనేవలన్ గదలంబాజె నృపాలదంపతుల కానందాశ్రుబిందుచ్ఛటల్. న. పతగాధీశ్వరు నెక్కి లేము లుడిగింపన్ జూచు వాల్గంటితో శతసూర్యద్యుతి నిషుధవ్వగురుఁ డిచ్చన్ దోఁచినన్' మేదినీ పతి దా వ్రాల్చినకన్నుదోయి కదలింపన్ జాలఁడయ్యెన్ సము ద్గతసంతోషర సాతి రేక జనితాంతః పారవశ్యంబునన్. కం. అంత నృపమాళి లక్ష్మీ కాంతుని కృప విపులభై ర్య గౌరవ మేధా 45 45 46° 47 48 46 ఉ. వంతుండై వీక్షించె ము ద్వితీయాశ్వాసము రాంతకు శుభమూర్తి లోచనానందముగన్. శాంచి మహీవరుండు పులక ప్రక రాశ్రుపరీతమైన మో మంచిత భూప రాగ పటలాంచితమై విలసిల్లినట్లు న కంచరవైరి దివ్యపదతామరసమ్ముల వ్రాలె సంపతత్ కాంచనదండ రేఖ సవికారచిరంతనభ క్తి వైఖరిన్, 49 50 ఇ తెఱంగున సమ్మహీ కాంతుఁ డనంతశయనునకున్ బ్రణామమ్ము లాచరించి యిందిరా దేవికి వందనం బొనర్చి పరిషద్భాగవత బృందమ్మునకు బ్రణ మిల్లి కృతార్ధంబైన చి తమ్ముతో నప్పరమేశ్వరు సగ్రభాగమ్మున నిటలతటఘటిత కరకమలుండై యానంద బాష్పజలసి కకపోలుండగుచు నిట్లని వినుతించె చం. జయజయ! భక్తలోకహరిచందన పంకజ గర్భ పార్వతీ ప్రియ! సనకాది దేవమునిబృందని పే. వితపాదపద్మ! దు ర్జయరిపు రాజగర్వతరుషండద వానల! ధర్మమార్గని శ్చయనిరతాంతరంగ! బుధసన్నుత యంచు మతించి క్రమ్మఱన్. త సీ. అనిలాన్న వన్యాశనాంగమానసశయ్య లొకనిద్ర యొక నిద్ర నొనరు ముద్ర కమలకై రవలబ్ధకల్యాణదై వమ్ము లోకకంట నొకకంట నొగరి యుంట నరిశిరశ్రవణదా రాయుధ శ్రేష్ఠమ్ము లొక కేల నొక కేల నొనరు లీల భ్రాంతిసంపత్పూర్ణ కాంతాలలామమ్ము లొక కేవ నొక క్రేప నొనరు రేవ తే. గీ. పంక మణఁగింప లోకమ్ము లంకురింపఁ జేయగల యాడు మొగ పాప లాయితముగ దగ నడుగు దమ్మి పొక్కి టిదమ్మిఁ బొడము మహిమ నీయందె చెన్నొందె మధువిరోధి, 51 52 53 సీ. కులశేఖర మహీపాల చరిత్ర బహుభోగనిలయత్రిపాద్విభూతిసమృద్ధి నుతికెక్కు నారాయణుండ వీవ వాసు దేవాదిభ వ్యవ్యూహ భేదనం గతుల మించిన జగత్పతివి నీవ భువనరక్షణక ళాస్ఫూర్తిచే నవతార విభవము లను జగత్ప్రభుఁడ వీవ సకల చేతనకర్మసాక్షి పై సదసదం తర్యామి యగు మహ త్తరుఁడ వీవ తే, గీ, యీవకావె క వేరక న్యావిదూర తుంగమణి హేమహర్మ్యానుషంగరంగ పురవిహారివి, సితకీ ర్థిపరిచితా భ్ర గాంగభంగ ! విహంగ పుంగవ తురంగ ! చం• 1 నే నేనోములు నోచినాఁడని శరన్నిర్ణి ద్రపద్మా ! నా నానై నోనిచయం బడంచితి నితాంతధ్వాంతమున్ సంతతో నూ నేనో ప్రచయం బడంచుక్రియ నిన్నుం గొల్తు నెట్లనఁ గా నీ నేనౌననఁ గాదనాగలనె. రానీ నీదయాసారమున్. విదితజగత్ప్రయాక్రమణవిశ్రుతి కాంచి విరించికుండికా భ్యుదితపయః ప్ర సేచనసమున్న తినొంది మహాఘవల్లి కా విదళన కేళిలోలుపఆవిత్రములై విలసిల్లుచున్న నీ పదకమలమ్ము లెప్పుడు కృపామతి నిల్పుము నా మనమ్మునన్. 47 64 55 56 వ అని యిట్లు భ క్తినిష్టాగరిష్ఠుండుగు నృపశ్రేష్ఠుండు వినుతించుచున్న యెడ నప్పరమేశ్వరుండు కృపారసతరంగితంబులగు నిజకటాక్ష వీక్షణమ్ము అతని పయిం బరగింపుచు జ్ఞానముద్రాముద్రితంబగు దక్షిణక రాగ్రంబు గదలింపుచు ముక్తా ఫలదంత కాంతద్యుతినహకృతంబగు మందస్మిత చంద్రి కాజాలమ్ము బొలుపుదీపింప సజలజలధర మధుర భాషణమ్ముల నిట్లని యానతిచ్చె. నలుగడలం 57 48 ద్వితీయాశ్వాసము వర ప్రదానము ఉ. ఇంపెనలార నాదుమతి నెంతయు మెచ్చితి మిమ్ము భూమిభృ ద్ధంపతులార! మీ హృదయ తామరసమ్ములఁ గల్గు కోర్కె ల క్షింపఁగ నయ్యె నటై పొసఁగించెద మీవలె మద్విధంబు ని ష్కంపిత భక్తిచే నెఱుఁగగానరు గా నరులెందుఁ జూచినన్. కం. అనఘమతులార! మీ యం దనుపమత మదీయ కౌస్తుభాంశంబున నం దనుఁడు జనియించుఁ 'దేజో వినయోజ్జ్వలశౌర్యధైర్యవిశ్రుతు లెనఁగన్. 58 59 వ అదియునుంగాక మదీయ ప్రియాంగన యగు నీళావధూటి యంశంబున భవత్పుత్రునకుం బుత్రిక యై యొక్క కన్యాలలా మంబు సంభమిషగలయది. మదీయ విభవస్థానం బైన శ్రీరంగంబునం బొలుపు దీపించుచున్న యే నవ్వరారోహం బరిగ్ర హింపంగలవాఁడ మహీపాలా! నీయెడం గృపాళుండ నగుటం జేసి భవదన్వయంబు పవిత్రంబయ్యెం బొమ్మని యానతిచ్చి రథాంగధరుండు నిజభవనంబునకు విజయం చేయుటయు నా రాజదంపతు లానందభరితాంతఃకరణమ్ముల నగ్గరుడధ్వజుం బొగడుచు నాత్మగృహమ్ముఁ బ్రవేశించి రంత. శా. శ్రీ దేవీపతి సత్కృపామహిను ధాత్రీకాంత కాం తాసుత ప్రాదుర్భూతికి వేగురింప మణిరాజాంశంబు తద్గర్భ మ ర్యాదన్ లోక సుఖప్రవర్ధనకరంబై యొప్పె నంత స్తమః జో దాంచర్ఘటమధ్యదీ పక ళికాంకురాను కారి ద్యుతిన్, కం. వనజాక్షుకరుణ కేరళ జనపాలాంగనకు భువనసంస్తుత్యకళా జనకమగు కౌస్తుభాంశం బనుపమజఠర ప్రవిష్టమై 'పెనుపొందెన్. ఖర్జూర వ ల్లరీగర్భ పాంసుచ్చాయ గండపాళికలపైఁ గానుపిం చే 60 61 62 తే. కం. కులశేఖర మహీపాల చరిత్ర కమలకో శాగ్రసంగత మధు వ్రత రేఖ మనపయోధర చూచుకముల నమరె గ్రస్తపల్ల వకంఠకలకంఠరవలీల మందసల్లాపసంపదలఁ దోఁచె వలిత శైవలనూత్న వల్లీవిలాసమ్ము సువ్య క్తరోమాళిఁ జూడనయ్యె వసధిమేఖల నొడుచు సర్భకుఁడు గర్భ యుక్తి గన మధ్య మేఖల యోహటించి కొలఁకు లందక మంజూషికల నడం జిగురుఁబోడికి దోహదశ్రీ వెలుంగ. మిసమిసయను చెలి 'మేనన్' బసపున నలుగిడుట వెట్టిపనియని చెలులా రసికతఁ జూపరు మేలిమి పసిఁడిన్ గరసాననేయు పనులుం గలవే! తే, గీ. గర్భగతడింభకునియూర్పుగములు తోడు పడిన కై వడి నిశ్వాసపం క్తి యింతి వదనమున సంచరింప దుర్వార విమత జనపతుల కట్టి నిట్టూర్పు లినుమడించె. చం• మించెం జెమర్చె పొంగె నని మేన ఘటింపక యింతి ద్రోచినక్ గొంచక తన్మనోహరుని కూరిమికి గటకమ్మ కాంచి మేల్ గాంచు పురంబులయ్యె మొదలం దుదఁ జెందు వివర్ణవృత్తి న ర్ధించి నిచోళ మంగదము దేశములయ్యె నృపాలమౌళికిక్. ట హరిసతి శంభురాణి యచలాహితు నంగన యిట్టి నేర్పు ము న్న రాయగఁ జాలరంచు వసుధాధిపుదేవి తనంత మృత్కణో త్కరరుచి గోరె కామశిఖ కాండజయంతు లెఱుంగ లేని త త్సరస రసారసజ్ఞత నిజప్రభవవిష్ణుఁ డెఱుంగునట్లుగ, 7 49 63 64 65 66 67 50 కం॥ ద్వితీయా శ్వాసము కులశేఖరుని జననము ఆరయఁ గుంభసంక్రమణ ముందు శుభానుగతి బుసర బునర్వసూ తార నుదారకీర్తి వనితాసహచారుఁ గుమారు సద్గుణా ధారు న రేంద్రసుందరి ముదంబునఁ గాంచె సముల్ల సత్పయో వారిధి గర్భ వీచి చెలువంబుగఁ జంద్రుని గన్నకై వడిష్ . తనయుండు సంభవి చుట విని భూపతి సూతికాని వేశమ్మునకు జని బాలు వదనకమ ము కనుగొనె సంతోష మాత్మ గడలుకొనంగర్ . తే. జనకునకు నాత్మభవరత్న జనన వేళఁ కం. ఉ. తే. గానబడు పితృలోళతమోనివృత్తి నాత్మభవరత్న ముదయింప నవ్విభునకు గానఁబడే సర్వలోకతమోనివృత్తి సుతు కభ్యుదయముగా జన పతి యానందమున నొసఁగె భర్మాచల గో వితతమణి చేల యువతీ ప్రతతుల నమితముగ భూసురప్రవరులకున్. Qa లోకహితారియైన శిఖిలోచను సాధనభంగవృత్తి : నాకుని పక్షహానియు మనమ్మున సైపక హేమశైలర త్మాకరతోయముల్ దలపఁడయ్యె సుతోత్సవదానవేళ సు శ్లోకులు సాధురక్షణనిలోపము సేయుట కోర్వనేర్తురే. చంద్రవంశావతంసమై సంభవించు సుతున కన్వర్ధముగనై యశోధనుండు ప్రేమఁ గుల శేఖరుండను నామమిడియె సకలశిష్ట న భోజనసమ్మతముగ 68 69 70 71 72 73 రంబులు వ క్రమంబున. కులశేఖర మహీపాల చరిత్ర 51 ఇట్లమ్మహీపాలుండు బాలునకు జాతకర్మ నామకరణాది సంస్కా నిర్వర్తించి సంతుష్టాంతరంగుండై యుండె నయ్యర్భకుండు క్రమ ఆ. వె, అక్క మ త్త యవ్వ యనియెడి నామమ్ము లోలిఁ బలుక నేర్చు వేళలందు కం. రామ! రామభద్ర ! రఘువీర ! యనియెడు పేరు లుగ్గడించి పిలువఁదొడఁ గె. పాపని తోకతోక పలుకుల లోపల రఘుతిలక ! కమలలోచన! యను స లాపము లెఱింగి పొంగున్ భూపతి యొక భుజము రెండుభుజములు గాఁగన్. శ్రీ రామమూర్తి వర్ణించువారల పొందు వీడఁ డాకొనియున్న వేళనైన రఘునాథనామకీర్తనము సల్పెడుపట్టు వెడలఁడు నిద్రించు వేళనైన కాకుత్సవరు గుణోత్కర మెన్ను నెడఁ బాయఁ జాలఁడు క్రీడించు వేళ నైన జానకీపతి కథాశ్రవణ మబ్బిన నొండు వినఁ డంబ పిలిచిన వేళనైన తే. దశరథాత్మజ పాదపద్మప్రసక్త చిత్తవృత్తికిఁ బరదైవవృత్తరక్తి సొరగ నీఁడయ్యె మహనీయసుగుణగణవి రాజితుండైన కేరళ రాజసుతుఁడు. చం. అతివలు నవ్వుటాలకు నృపార్భకుతోఁ దనతండ్రి ద్రోఁచినన్ సతియును దాను రాఘవుఁడు శైలములందుఁ జరించెనాఁగ దుః ఖతుఁడగు జానకీవిభుఁడు కేవలమర్త్యుఁడె! సోదరుడు భూ సుతయును దోడరా నగరుపొచ్చెననన్ మదిఁబొంగు క్రమ్మఱన్. 74 75 76 77 78 52 ద్వితీయాశ్వాసము ఆ.వె. కోసలేంద్రతనయు శోమలవిగ్రహ ధ్యానవశత నుండుచో నతండు ననుభవింపఁగోరి యటమున్న తెమ్మన్న దాది చేతిపండు తాఁ దినండు. కం. కినియుచుఁ బోరిడు నతనికి జనని గుడఫలాదు లొసఁగఁ జల ముడుగక యుం డిన నెల్లి వచ్చు రఘుపతి మనయింటికి ననిన నలుకమాని చెలంగున్. వ 79 80 ఇత్తెఱంగున నైసర్గిక శ్రీ రామ చరణకమలభ_క్తి భావనాధురీణుండగు కుమారు నుపనీతుం గావించి దృఢవ్రతుండు వివిధవిద్యావిశారదుఁ జేయఁదలంచి యార్యుల వశంబు చేసిన నతండు. కం. శ్రీ తిపాలసుతుఁడు గురుసం ఉ. గతి నతులిత సూక్ష్మబుద్ధికౌశలమున నం చిత వేదశాస్త్రముఖ్యో ర్జితవిద్యానిచయ మభ్యసించెన్ బ్రీతిక్. క్రూరకుదృష్టి భాషణనిగూఢ వికల్పితశబ్దలింగశా రీరక శాస్త్రసూత్రక బరీపరి వేష్టిత విష్ణుతత్వమం దారసుమమ్ము దాఁ గొనియె ధన్యవిచారుఁడు నీరసుగత చెల్వగు శ్రీ రవి వేచ నారచన తే. శా హ సకిశోరవై ఖరి౯. వేద వేదాంగముల ధను ర్వేదమున న రుంతుదాభ్యాసకాశలస్వాంతుఁ డయిన యక్కు.మారునిఁ దోడ్కొని యార్యజనులు పార్ధినేంద్రుని కడ కేగి పలికి రెలమి. రాజన్మూర్తి భవత్తనూజుఁడు మనో రాజీవవీధిన్ మహా రాజశ్రీరఘురామనామదివిషద్రాజాధిరాజాంఘి సే వాజాగ్రద్దతిఁ బూని నేర్చెఁ జదువుల్ వైదుష్య మేర నో రాజా ! పాండురకీర్తి రాజనిధిముద్రా ! రాజ రాజోఫమా ! 81 82 88 84 85 కుల శేరఖ మహీపాల చరిత్ర సీ. అనఘ! పురాణవాగర్ధబోధాయనం డాగత వివిధ భాషాగరుండు 53 ప్రాకటన్యాయశాస్త్రి కదృక్చరణుండు చతురాత్మపౌరుష శబ్దభోగి విపులాహి తైశ్వర్యవిక్రమబల భేది రమ్యధర్మకళాప్తిరాజమాళి ప్రమదామనశ్చ్యుతి ప్రసవసాయక పాణి ధృతిసార విహసిత క్షితిధరుండు, తే, గీ. చతుర గాంభీర్య వాహినీ స్వామి పద్మ వేష్టితపదార్హుఁ డనుభవవితరణస్వ భావఘనుఁ డింక నిన్ని చెప్పంగ నేల సుజనమాన్యుఁడు నీతనూజుండు రాజ! చం. అనవుడు ధారుణీరమణుఁ డాత్మజుఁ గగ్గోని బార సాచి య క్కున గదియించి పెల్లెసఁగు కూరిమి పేర్మి నిజాంకపీఠి పై నునిచి శిరంబు మూర్కొనియె నోలి కుమారు శిరోజపాళిఁ జెం దిన నవమౌక్తికంబులగతిని ప్రమదాశ్రుకణమ్ము లొల్కఁగన్, 86 87 వ. ఇట్లమ్మహీ వల్లభుండు ప్రమోదరసభరితాంతఃకరుణుండగుచుఁ గుమారు గారవించియాచార్యునకు ననేక మణిభూషణ సువర్ణ చేలంబు లొసంగి పరితుష్టులగు వారలయాశీర్వచనంబులు గైకొని యనంతరంబ కుమారునకు ననన్యక న్యాసాధార ణమ్ములగు గుణసౌందర్యవిశేషమ్ములం బొలుపు దీపించు నొక్క రాజపుత్రికం ఖరిణయంబుగావించి పరీక్షి తశుభ లక్షణశోభితుండుగు నతనివలన నాత్మీయ సామ్రాజ్యలక్ష్మి సురక్షిత యగుంగాక యనితలంచి నిజపరికరంబులతో నతని రాజపీఠంబున నభిషిక్తుంజేసి ప్రధాన సామంతబలపరిజన భాండాగారంబులు మొద ఆగు సప్తాంగంబులతని వశంబు చేసి తన్నుం గృతార్ధుంగా దలంచుచు నిర్భరుండై యుండె నంత, 88 54 కం. ద్వితీయాశ్వాసము కులశేఖరుఁడు రాజగుట సాంద్రసుధాకరమగు మను జేంద్రసుతాభ్యుదయమున మహీచక్రము ని సంద్ర ఫల వృద్ధి గనియెన్ జంద్రోదయ వేళ నలరు జలనిధి వోలెన్. ఉ. సంతతసత్య దానగుణశాలి దృఢవ్రతనందనుండు కా ర్తాంతిక విద్వచార్య కవిరాజ సుఖప్రదుఁడై చతుస్సము ద్రాంత వసుంధరాభరణ మాత్మభుజాభరణమ్ము జేసె ది గంతి భుజంగ రాజ కనకక్షి తిభృత్కిటులన్ హసింపుచుకో. Ф చం• వనులు ఫలప్రవాళసుమ వాసనల దటినీ చయమ్ము గో కనద బిసప్రసూన నవగంధ మనోహర తీరము గో ధనము పయః ప్రదోహనవిధానమును ధర సస్యసంపద దన రే దృఢవ్రతాత్మజుఁ డుదారత రాజ్యవిభూతి నందుట౯ • చం• భుజబలశాలి యవ్విభుఁడు భూరిశరాసన బాణధారియై గజ రథ వాజి వీరభట గౌర వభీషణ సైన్య బృంద మ క్కజముగఁ గొల్వ ౯గి పటు గర్వమహీపతికోటి నోర్చి ది గ్విజయము జేసెఁ గీర్తిపదవీపిహితాంబుధి సప్తకంబుగ౯. ఆ ధనుర్ధరు ధాటి కంగరాజు చలింప కర్ణాటవిభుఁ డిచ్చకంబు నెరపె నౌపుణ్యునకుఁ గామరూపభ ర్త ప్రియమ్ము సేయ విదేహుండు సిగ్గువడియె నా వినోదికిఁ గుంతలాధీశ్వరుఁడు మొక్క కాశ్మీరపతి హితకారి యయ్యె నాయజ్ఞరతుఁ గాశనాయకుండు భజింప నొగి విదర్భవ రేణ్యుఁ డోటువడియె నాబలాఢ్యునకు మహారాష్ట్ర రమణుండు మ్రొక్క వరాటేంద్రుఁ డుక్కు సిడియె 89 90 91 92 తే. సీ. కులశేఖర మహీపాల చరిత్ర పరగఁ బాంచాలపతి పద్య ఫణితి నతని వినుతిసేయంగ గాంధార విభుఁడు పఱచె బలియులగు వారలీటులైన జలలిహీను లేమి సే సెద రమ్మానవేంద్రు నెచుట. అతని సౌందర్యధుర్యతకు వస్త్ర తుండు బెదరి పట్టినకొమ్మ వదలఁడయ్యె నతని విచారదక్షతమ దక్షుఁడు నాన యెత్తి వంచినకల యెత్తఁడయ్యె అతని మహాబలోన్నతికి భీతిలి మహా బలుఁడు పాఱిన కాలు నిలువఁడయ్యె నతని ప్రతాపానలాభీలతకు శూలి తివిరి మూసిన కన్ను తెరువఁడయ్యె తే.గీ. నతని చెలియెంత యాతని యల్లుడెంత యతని సుతుఁడెంత యాతని యశన మెంత కాముఁడైనను రాజైన భీముఁడైన గరళమైనను సరినెన్న గలరె కవులు. తే.గీ. అతని ధైర్యప్రతాపవిశ్రుతికి విబుధ దంతివహ్నులు దలఁకి దిక్తటులఁ జేరె నవియె చిరధారుణీభర మాని మోచె నవియె భయమంది మిన్నుల నాశ్రయించె. సీ. తన సఖత్వము శారదా దేవి వాంఛింప హనీలవేణి పొమ్మంచుఁ బలికి తన కుచా ప్తత రాజతనగమ్ము గాంక్షింప హరసతీనిలయ! పొమ్మంచుఁ బలికె తన నేత్రముల మైత్రి ధవళాంబుజము వేడ నలికులాకులమ పొమ్మంచుఁ బలికె
55 93 94 95 96 2 56 ద్వితీయాశ్వానము తే.గీ. తన సితచ్ఛాయ సరిసేయఁ దగిన వారి నెరసు లెన్నంగఁదొడఁగె నా నృపవ రేణ్యు కీర్తిసీమంతినీ మణి కేళిసలుప తే, నవని కడద్రొక్కి, వినువీధి కరుగునపుడు. తెలిగన్నులకు మీను బెళుకు లెన్నినఁ జాలు కలువ రేకులఁ జెప్పవలె నటమ్మ ! మాటల కమృతంపు డేఁట లెన్నినఁ జాలు కలికికోయిలఁ జెప్పవలె నటమ్మ ! తగు మోము చికిలియద్దము నెన్ను కొనఁ జాలు వనజాతములఁ జెప్పవలె నటమ్మ ! గతులకు రాయంచగమన మెన్ని నఁ జాలు వారణమ్ములఁ జెప్పవలె నటమ్మ ! పొలఁతి వర్ణించు కవివరుల్ ప్రొద్దువోక నిన్ని ద్రవ్వెద రనుచు దా నితర కాంతిఁ గేలిగొను సమ్మహీనాథు కీర్తికాంత ప్రాణసఖియైన మిన్నేటిపడుచుఁ గాంచి, 97 98 చం. అడుగునఁ బుట్టితీవు దివియందు జనించినదాన నౌట నే కం. 80, పొడవని గంగ పల్క, నరపుంగవు కీర్తివధూటి పల్కు నౌ నడుగున నీవుపుట్టితివి హస్తష్టాలమ్మునఁ బుట్టినట్టి నే పొడవని యిటైసంగుదురు భూరి నభోంతరవీధి నిద్దఱున్. ధర విక్రమమునఁ గులశే ఖర నృపతిం బోల్ప హృదయగతుల మహీపా లుర వెదకి వెదకి వేసరి సరి కేసరి యొకటి యండ్రు సరసులు సభలన్. అని యతిశ యో కి రచనన్ వినుతింపన్ దగి సముద్ర వేలావృతభూ జనర పరతంత్రత నొనరె౯ ధరణీశ్వరుఁడు సమున్న తలీల, 99 100 101 వ కులశేఖర మహీపాల చరిత్ర 57 వెండియు నఖండసామ్రాజ్యలక్ష్మీ కటాక్ష వీక్ష ణసంధుక్షిత ప్రతిక్షణా భినవోదయ వై ఖరీనిరీక్షణోపగత నిజైశ్యర్య న్యూసతానుశయ సంకుబ్ధసహస్రారు. సంతాపని శ్వాసశ్వసనఘటనా నిశ్శేషి పరిశోషిత మకరంద పరిమ్లాన నిజసుందరీప యో ధర మిళితమం దారమాలికావిర క్త మధువ్రతనికరపరి వేష్టి తాత్మీయమహో ద్యాన మం డలుండును, మండలాగ్ర విధుంతుదక బళిత విరోధి రాజన్య యశశ్చంద్రికానిమాలనో న్మీలన సంతాపితతదీయకాంతా నయనో పాంత విగళితసాంజనసలిలధారా ప్రవాహ తిమిర ప్రసారనిరోధక నిజతురంగరింఖా సంఘాతసంఘట్టన సముద్ధూతభూ భాగారుణపరా గ రేఖామయూఖానుమిత నిరవసాన స్వప్రతాపతపనోదయ సంవ్రీడితపద్మినీ బంధుండును, బంధుజననయనానంద సంధాయక నిరంతర నిజకరతలము క దాన ధారాసలిల వేణికా పరిప్లుతసమస్తమహీవలయ సంచార సముదంచిత కీర్తిసీమంతినీ చరణపంకాంకిత దిక్కుంభి కుంభ మధ్యుండును, మధ్యమానమహార్ణవ సముదీర్ణ సంక్షోభ తిరస్కార కారణభూరి భేరీభాం కారరవశ్రవణసమయోపగతభయకుతూహల భరితామిత్రమిత్ర సముదయుండును, దయారస లేశమాత్రయోగ పాత్రభూతార్ధి సందోహమంది రాంగణ ప్రవేశిత దంతావళక పోలమదామోదానుభవామోదిత మధు వ్రతమాలికాఝంకారర వాకర్ణనోత్సుక ప్రాహూతిక ప్రశంసితనిజౌ చార్య గుణవిశే షం డురు గౌతమ జైమినిద్వైపాయనప్రభృతి ప్రణీత వివిధతంత్రాంతరాళ యారుందతు మేధాశాలి విబుధహృదయాహ్లాదసంధాయకుండునునగు నమ్మహీనాయకుండు మహ నీయ కుడ్యవించిత చిత్రపుత్రికాసౌందర్యావలోకన కుతూహలాయాత జన విస్మయా పాదకంబును, మణిఖచితశాతకుంభ స్తంభశోభావి భాసమానాభ్యంతరప్రదేశంబు నగు సభామధ్యంబున విలాసినీకరకమల చలద్వాలవ్యజన జనితమృదుపవనంబు లొలయ విచిత్రసింహాసనాసీనుండై సచివసామంతపురోహిత ప్రభృతులగు ముఖ్య జనంబులతోడసంభాషణంబులు సలుపుచుండె నంత, వైష్ణవ యతి వచ్చుట సీ. జడలుగట్టిన శీరోజశ్రేణి బాలార్క కిరణాంకురమ్ములఁ శ్రేణి సేయ భూషిత శ్వేతోర్ధ్వపుండ్ర రేఖలలోనఁ బచరించు హారిద్రరుచు లెసంగ 102 8 8 ద్వితీయాశ్వాసము బహుతంతు కీలితపటమిళత్కంఠ పా ళిక పయోజాక్షమాలికలు గదల పుణ్యతీర్ధోదక పూరితంబగు తిరు క్కావేరి వల కేలఁ గానుపింప తే.గీ. భవ్యభుజవీఠి వ్రేలుచు దివ్య దేశ గమ్యమృదుతీర్థ గుళికల కక్షపాల సారె నురియాడ శ్రీభ క్తిసారు లనఁగ నెసఁగ నొకయోగిశేఖరుం డేగుదెంచె. కులావతంసం 103 ప ఇట్లు చనుదెంచు యోగీంద్రు నసతిదూరంబునం గాంచి యారాజ బిరుగడలు నాందోళితవ్యజనదండపాణులను సీమంతినీరత్నమ్ముల కరతలమ్మున వారింపుచు కాంచనపీఠమ్ము డిగ్గ ముఱికి సంభ్రమంబున సభాసదులుం దాను నమ్మహానుభావు నెదుర్కొనిఁ ప్రదక్షిణపూర్వకంబుగా సాష్టాంగదండ ప్రణామంబులాచరించి కనకాసనంబున నునిచి త ప్తకాంచనకల కౌనీతంబులగు పూతశీతల సలిలంబుల నమ్మహాత్ముచరణంబులు గడిగి తత్తో యంబులు శిరంబున నిడుకొని యథావిధిం బూజించి తదనుజ్ఞ గైకొని తానును సమ చితపీఠంబున సమాసీనుండై నిజవిలోక కిరణాంకుర నికరంబు లమ్మహనీయమూర్తి ముఖముండ లంబునంబొలయఁ గరంబులు ముకుళించి సవినయంబుగ నిట్లనియె. ఉ. కం. మ. ఏయెడ నుండి మీర లిపు డిం దరుదెంచితిరయ తిరయ్య!మున్ను నేఁ జేయు తపమ్ము లన్నియును సిద్ధివహించె రమామనోహర శ్రీయుతదివ్యమూర్తి మదిఁ జేర్చి భజించు మహానుభావు లే ఛాయకు వచ్చినన్ గలుషసంఘము వాయుట తథ్య మెన్నఁగన్. మది మిమ్ముగొలుచుటకు స Ф మ్ముదమున భావింప సాడఁబోయిన తీరం బెదురుకొనునట్లు మీ రి య్యదనున విచ్చేసితిరి కృతార్ధుఁడ నైతిన్ . భవదావానలకాల మేఘము విపత్పాథోధిపోతము దుః ఖవిషాభీల భుజంగ బర్హిణము మార్ఖ గ్రావదంభోళి దు ర్వ్యవసాయాంధతమఃపతంగకిరణ వ్రాతంబు, తాపత్రయీ నవిధారణ్యకుఠారధార భవదీయోలాభ మెవ్వారికిన్ . 104 105 106 107 కులశేఖర మహీపాల చరిత్ర 59 కం. సంసరణం బెటు దొరకు జడులకు భగవ సంసృతివిపినము వెడలగ త్సంసతియులగు యుష్మ త్సంసర్గము లేకయున్న ధన్యవిజారా! 108 వ. కావునఁ బుణ్యపాపఫలమ్ము లెట్టివానికి ననుభవింపందగియుండు నెట్టి వానికి మోక్షమ్ముదొరకొను నదియునుంగాక నాకుం గాలక్షేపమ్ము సేయు సదు పాయమ్ము నెఱింగింపవలయునని ప్రార్ధించినం బ్రీతుండై యమ్మునీంద్రుండు నరేంద్రునింజూచి యిట్లనియె. 109 రాజు ప్రశ్నములకు యతి యుత్తరము సీ. నిసువుఁబ్రొయముఁ జెన్నెసఁగు నారాయణ ద్వయమంత్రవర్ణ సంతతులు గాంచె చుంచు బెంచిననాఁడె మంచు ద్రుంచిన వేల్పు కొలము సామి భజించు నెల వెఱింగ గరిడి ద్రొక్కిననాఁడె గర్వాంధపరిసంధి కంధికి మంథాద్రికరణిఁ దోచె నఱుత జన్నిదమూఁదినప్పుడె తోలుపల్కు కొనలఁ దోఁచిన తత్త్వమునఁ తే.గీ. కర్ణ:సనాగ్రభుజబుద్ధికౌశలములు వర్ణనీయమ్ములయ్యె నవ్వలనుగాంచి కాంచుగా కేమి సిరినెదఁ గొంచు విభుని క ఠరత్నంబు పుట్టువు గాంచుకతన, వ బెం గె 110 ఇట్టి నీవు పరత త్త్వవిచారపరుండవగుట యాశ్చర్యము కాదు కావున నీవడిగిన ప్రశ్న వచనంబులకు నుత్తరమ్ములు సెప్పెద నాకర్ణింపుము. 111 సీ. ఓనర నేబదికోట్ల యోజనమ్ములు గర్భ గోళమ్ము దళ మొకకోటి యోజ నంబులు గలిగి వర్ణ్యంబై హిరణ్మయాం డంబు దీపించు నున్నతిఁ దనర్చు 60 ద్వితీయాశ్వాసము నయ్యండమునకు జలానలానిల వియత్ప్రభృతి సప్తావృతి ప్రతిభ దనరు భువి యాదిగా సప్తభువనపర్యంతమ్ము దగ నూర్ధ్వలోకస ప్తకము వెలయు తే. గీ, నతలవితలాదిసంజ్ఞల నమరి క్రింద జగము లొకయేడుగలవు విశాలలీల నిందు భువిదక్క దక్కిన పొందుపట్లు పుణ్యపరిపాక లభ్యముల్ భూవరేణ్య ! 112 వ ఇంక భూలోక విశేషమ్ము పరిపాటి నెఱింగించెద, 118 కం. గ్లంబై యొక లక్ష యోజనంబుల దగు దీ జంబూద్వీపము వి స్త్రీ నిం బరివేష్టించిన లవ ణాంబుధికిన్ మాన మదియె యవనీనాథా! బ 114 వ ఇ తెఱంగునఁ బదిద్వీపంబు లేడును నైక్షవప్రభృతిసముద్రసప్త కంబు నొండొంటికి౯ ద్విగుణితయోజన విస్తీర్ణంబులై విలసిల్లుచుండ సముద్రద్వీప పరిమితమహీ నలయంబునకునినుమడియగుచు పిపీలికామశకమక్షి కాది విరహితంబును విబుధవిహార యోగ్యంబునునగు సువర్ణభూమి తేజరిల్లుచుండుమఱియును. తే.గీ. అంత మీఁదట జక్రవాళాచలంబు పసిఁడిపుడమికిఁ బెనుకోలు పగిది నెసఁగు నవల మిహిరాంశుజాలమ్ము లడర వదియె బంధు రాంధతమఃపుంజపంజరమ్ము శా. సంబద్ధోరుతరప్రకాండని చేయచ్చన్నాంబరప్రోల్లన జ్జంబూభూజపతత్ఫలప్రజరస స్రావస్రవంతీతటీ జంబాలోజ్జ్వల హేమ కొంతిపి తాళాకోణమై యుండుటన్ జంబూద్వీప మనంగఁ బెం పెసఁగు భాస్వల్లీల శోభిల్లుచున్ . 115 116 117 కం, ఈజంబూద్వీపంబున కులశేఖర మహీపాల చరిత్ర నోజ్" నవఖండములు సముజ్జ్వలలీల రాజిల్లు నందు నెన్మిది తేజోవిలసితము లగుచు దీపించు నృపాం తే.గీ. ద్వీపషట్క భూమిఁ దిరిగెడు పుణ్యాత్ము లాఁకలియును దప్పి యలఁత ముదిమి వ మ. చెవులు లేక నెపుడు తెలివొంది యుండుదు రష్టఖండవాసు అట్టివారు, మఱియును. నిరవద్యాచ్యుతలో కలోలుపసుధీని శ్రేణి కాదండ, మా దరణీయాతిథికల్ప కాండము వినూత్న శ్రీకరండమ్మ ని ర్జర భాగాశనపూర్ణ భాండము, త్రివర్గస్థేమశౌండమ్మ నరతా త్తామృతఖండ భరతఖండం బొప్పు భూవల్లభా ! 61 118 119 120 121 వ. మఱియు నిట్లుస్నా నతపోయజ్ఞ వసనభూషణాన్న ప్రదానాది సుకర్మంబుల వలన స్వర్గాదిపుణ్యలోక ప్రాప్తియు బ్రహ్మహనన సుజనతిరస్కరణపరధనపర దారాద్య వహరణ మృపావాద ప్రముఖ దుష్కర్మంబులవలన నిరయని వాసంబును సిద్ధించు స్వర్గ నర శాదిసంబంధంబులు జీవులకు స్వకర్మఫలభోగై కవినాశ్యంబులు కావునన్ బుసర్జనన కారణంబులై యుండు భగవన్మాయానిరుద్ధులగు బద్దజనంబులు కామాది గుణవికారమ్ములం జేసిక దా గదాధరు నారాధింపంజాలరు జాలరి జాలకంబునం బొదివి జలచరంబుల నిరోధించు చందంబున నప్పరమపురుషుండు నిజమాయావిశే షమ్మువలనం జీవులం జిక్కువఱచుచుండు మనుజసమూహంబు ధనదారపుత్ర క్షేత్రాభిమానంబులను తిమినక్రఝషభుజంగంబుల నతిభయంకరంబగు సంసారసము ద్రంబునంబడి మునుంగుచుండు. భగవతీ డాపరికరంబును గుణత్రయాన్వితంబును నగు ప్రకృతివలనంబుట్టిన మహత్తత్త్వంబున నగు సహంకారంబువలన నయ్యెడు శబ్దస్పర్శాదితన్మాత్రలం బ్రభూతంబులగు గగనాదిభూతంబుల మేళనంబునం జేసి యీశరీరంబులు శరీరులకు భోగ భోజనంబులగుచుండు. పూర్వపూర్వజననావసరసము త్పాదితినా నావిధకర్మఫలానుభ వజ విత వాసనావి శేషంబుల వలన బహీరింద్రియోపకర ణంబులను మనోబుద్ధ్యాదులు సెక్కు త్రోవలం ద్రొక్కింపుచుండు. నప్పర మేశ్వరుండే 62 ద్వితీయాశ్వాసము - L P తత్ప్రపంచంబునకు నుదయస్థితి విలయకారణమ్ములైన రజస్సత్వతమోగుణమ్ముల నాశ్రయించి వాసు దేవాదివ్యూహ భేదమ్ములను రామకృష్ణాద్యవతారవిశేషంబులను వినోదంబుసలుపుచుండు నింకపునరావృత్తిరహితంబగు నప్పరమపురుషు పరమస్థానం బునకుఁ జేరు రుపాయమ్ములు కర్మజ్ఞానభక్తిప్రపత్తియోగమ్ములను నభిధానమ్ములు జతుర్విధంబులని యార్యులవలన వినంబడు, నవి యెయ్యనియం టేని శ్రీవిష్ణునుందిర • నిర్మాణ తదీయసమ్మార్జన దీపారోపణ మాల్య సమర్పణాదికంబును పంకజోదర కైంకర్యరూప తపోదానయాగాధ్యయనవన తటాకాదినిర్వర్తనంబులను క్రియాని శే షంబుల నగునది కర్మయోగంబనంబడు, నట్టిది జనక మహీపతి ప్రభృతులయందు ప్రఖ్యాతంబయ్యె స్వస్వరూపపరస్వరూపనిరోధిస్వరూప ప్రభృతి విషయకంబైన యథాబోధంబు జ్ఞాన యోగంబనంబడు, నట్టిదినారదాది మహామునులయందు విశ్రుతం బగుచుండు విజ్ఞాన పరిణతంబురు సత్త్వగుణాతి రేకో పగతవుల కాంకుర బాష్ప గద్గదస్వర వికారాది గుణవిలసితంబును విచ్ఛిత్తివిరహితంబునునగు భగవద్విషయ ప్రేమవి శేషంబు భక్తియోగంబనంజను, నది ప్రహ్లాద ప్రభృతులయందుఁ బ్రసిద్ధంబయ్యె నింకఁ దృప్తప్రపత్తియు నార్తప్రపత్తియుననన్ బ్రసత్తియోగంబు ద్వివిధంబై యుండు ముకుందభ_క్తిపరిపాకంబువలన దేహ దేశకాలాదుల వైరాగ్యంబువలనను నిత్య యు క్తంబులగు తాపత్రయజనితదు ఃఖమ్మువలన నసహిష్ణుకంజేసి విష్ణు దేవునిం గూర్చి యాక్రోశించునది యా ర్తప్రపత్తియనంజను సది గజేంద్రముఖ్యులయందు విఖ్యాతం బయ్యె నింక నాచార్యకృపాలబ్ధంబులగు పంచసంస్కారంబులవలనం బవిత్రిత గాత్రుండగుచుఁ దదుపదిష్టత త్త్వజ్ఞానవి శేషవిశ దీకృతాంతఃకరణుండై స్వపార తంత్ర్యంబును భగవత్స్వతంత్రతయు నెఱింగి యాశేషతల్పునకు శేషభూతుం డును బరమ భాగవత సేవానిరతుండును నగుచు గృహస్థుండయ్యును సుహృత్కశత్ర పుత్రక్షేత్రారామపశుప్రముఖంబులను ధనంబులయందు మమత్వమ్ము విడిచి యర విందస `భవ భ వేంద్రసనక ప్రముఖ వర్ణనీయంబులగు నయ్యంబుజేక్షణు దివ్యరూప విద్యగుణ దినముహిమైశ్వర్యంబులు మనంబులం దలంచి పులకితశరీరుండగుచు మోక్షపర్యంతంబు కాలక్షేపంబు సేయునది తృప్తప్రపత్తియనంజను, నట్టిది వశిష్ఠ పరా శరశౌనక వ్యాసాది ఋషులయందును బ్రియవ్రతోత్తానసుత ధ్రువ నాభి వైన్య రుక్మాంగదాంబరీష ప్రభృతి రాజముఖ్యులయందును సుప్రసిద్ధంబయ్యె నదియట్లుండెల గారణజన్ములగు వివంటియు త్తమపురుషుల కీధర్మంబులు సులభంబులై యుండు కులశేఖర మహీపాల చరిత్ర 6. నదియునుంగాక శ రవాచకశబ్దంబులకు శరీరిపర్యంతధావనం బుగలదు కావున జగచ్ఛ రీరుండగు నప్పురుషో త్తముండు సకలశబ్దవాచ్యుండగు నైనను విష్ణునారాయణ వాసు దేవాదిదివ్య నామంబులతనియందు ముఖ్యవృత్తిం బ్రవర్తించుటంజేసి తదాత్మ కంబయినమంత్రంబులు ప్రపన్నులకు నవశ్యమునం ధేయంబులని వేదవాకంబుల వినం బడు నదియునుంగార భావజ్జనససమయంబున దృఢవ్రత శాంతాని శాంతంబునకుఁ జను దెంచి సూత్రవతీ కాంతుండే శాంతంబున శ్రీమన్నారాయణదివ్యమంత్రంబు నీకు నుపదేశించుటంజేసి మున్న కృతార్థుండవై యున్నవాడనైనను సంధుక్షితమోక్ష లక్ష్మీప్రతీక్షి తులగు విచక్షణులకుననంతశయను ననంతగుణకథనశ్రవణంబులం గాలయాపనంబు సేయవలయుంగావున భాగవతకులావతంసంబ ! నీవును దొల్లిబృం దారక బృందసం ప్రార్థితుండై గోవిందుండు రావణవధార్థంబుగా దశరథసుతుండై యుదయించి చేయు కార్యంబులు వల్మీక సంభవుండు శ్రీరామాయణంబను నభిధానంబిడి రచియించు నితిహాసంబుపరమపవిత్రంబురు నిహపర సౌఖ్య సంధాయకంబును నగుటం జేసి యాప్రబంధంబు శ్రీవైష్ణవసన్నిధానంబున గాల క్షేపంబు సేయునదియని యాదే శించిన నా ధరాభారధౌరేయుండు రోమాంచకంచుకితశరీరుండును ప్రమోదబాష్ప సలిలసంసి_క్తరీ పోలయుగళుండునునగుచు నమ్మునివరుసకుం బునఃపునఃప్రణామంబు లాచరించి యంజలిపుటంబు ఫాలతటంబునం బ్రస్ఫుటంబు గావింపుచు నిట్లనియె. 122 యతివర పం_క్తీకంఠుఁడు సురావళి నెట్లుజయించె వార లే చం. గతి హరిఁగాంచి వేడిరి జగన్నుతుఁడేమనియానతిచ్చె సం శ్రితహితవృత్తిఁ దా నవతరించి విరించివరాను భావగ ర్వితులగు దైత్యముఖ్యుల హరించిన చందమెఱుంగఁ బల్కవే! కం. సారములు సాధునిచయా కం. ధారములు నిశాటహృద్విచారములు మహో దారములు మోక్షలక్ష్మీ హారములు రమాధిపతి విహారములరయన్. కావున శ్రీహరిచరితము పావనము శుభాన్వితమ్ము ప్రమదం బెసఁగన్ నీవలనన్' వినవలె నని భూవరుఁ డరింప యోగిపుంగవుఁ డనియెన్. 123 124 125 64 సీ. 3. కం. ద్వితీయాశ్వాసము రావణోదంతము వినవయ్య! విశ్రవస్త నయులు రావణ కుంభకర్ణులు జగతోభ మెసఁగ నవ్విరించి గుఱించి యతిఘోరమగు తపం బాచరించిన మెచ్చి యవ్విధాత సుర దైత్యనాగన్న రయష్ ముఖ్యుల వలన నొప్పమిలేని వరము లొసఁగె నది కారణమున దుర్మదగర్వదు ర్వార సంరంభుఁడై దిగీశ్వరులఁ దొడరి నొడిచె నగధారి మృగధారి నోటువఱచె నణఁచె నరభోజి హరవాజి నపహరించె తఱిమె ధనరాజు దినరాజు దర్పమణఁ చె గెలిచె నలకీలి వల కేలి కలిగతుల అంత నిరంతరరోషను రంతో గ్రబలేంద్రజిద్భుజాక్రాంతుండై వృతఁబడవలసె నమరా త్యంతీనుండైన ధవళదంతీశునకున్. శ్రద్ధర. మదవదై త్యేంద్రర క్తాంబక చలనచలన్మంజుల స్వర్గలక్ష్మీ శ్రీ పదమంజీరారవోజ్జృంభణత సనుమితా పద్భయుల్ దివ్యులాత్మా స్పదకాంతారంబు డాయంజనఁగ బెదరి కుంజసింహొమ మంత్రి స్యదసీర్యద్రావమై విచ్చలవిడి విబుధస్థానముల్ జేరు నోలిన్, శిఖరళి మహాశ్రద్ధర, తూలెన్ గైలాస మత్యద్భుత ఖర శిఖాందోళనధ్వానకుప్య ద్వ్యాళీనిశ్వాసధూమవ్యతికరకుహనా వారిద భ్రాంత చేతః ఖేల త్తద్బర్హి కేశాళృతగుహపద కేకి ప్రతిధ్వానమై ద ర్పాలీఢానేక లోకోద్యమ దశ వదనోద్యద్భుజోత్సాహశక్తిన్, 126 127 128 129 కులశేఖర మహీపాల చరిత్ర ఆ. వెం అమరు లలిగి వరప్రౌఢి ననురు లలిగి నిశితపత్రిదశ ద్వేషి. నిశితపత్రి తే. గతులఁ గఱచిన బహుపత్రిగతులఁ గఱచి పర చిరంతనహాస్యు లై పఱచినంత. ఇంచుకించుకవడియైన సంచితాస్త్ర సంచయాభీల శౌర్యు నక్తంచరేంద్రు నొంచుటకుఁ జాల కమరులు సంచలించి యంచ రాతింటపంచమే లంచుఁ జనిరి 65 130 131 వ. ఇట్లే తెంచి విరించిగాంచి దండప్రణామమ్ము లాచరించిన సుపర్వుల పరిశ్రాంతి నిరీక్షించి యతండు వారలతో నిట్లనియె. సీ. వింతగౌరుల మేలుబంతి నీచౌదంతి యేదొంతిఁ జొచ్చె నహిప్రభేది! నిక్కి వైరులఁద్రొక్కు నీపోతుజక్కి యే చక్కిఁ జిక్కెనౌ విభాస్వత్కుమార! పన లేమి విసివి నీ మొసలి దాముసలియై మసలేనో జలధిసామ్రాజ్యధుర్య! కొంక దిజ్జగతి నిశ్శంక సీజింక యే వంక జంకెనొ గంధవహనశాలి! తే.గీ. వాహనము లాయుధమ్ములు వదలి యలసి సొలసి యేతెంచితిరి దశాస్యునకు నేము వరము లిచ్చు టెఱింగియు వానితోడ కయ్యమున కియ్యకొనరు గదయ్య! మీరు, అనినం ద్రిదశపతులాభాషాపతితో నిట్లనిరి. తే.గీ. ఇంటి ముంగిట నుండనీ కెగ చియెగచి యసుకబూతంబు వెను వెంట నంటి తఱుము వచ్చుటయకాని వానితో వైరమెత్తి పోరొనర్పంగఁ దరమె యెవ్వారి 182 188 184 ! 135 66 కం. పెరువేట్లగిబ్బ కొమ్ముల ద్వితీయాశ్వాసము కొనలకుఁ బదనిచ్చి విడుచుకొమరున మీరా దనుజులకు వరములొసఁగిన గినిసి యతనిఁ దొడరవశమె! గీర్వాణులకున్. 186 అనిపలికిన వారలపలుకులకుఁ జి తమ్మునం గనికరమ్మువొడమి పద్మసంభవుండు పాకశాసన పావక సరేతవతి ఫుల భోజన పాశధక పవన పౌలస్త్య పార్వతీపతులం దోడ్కొని పాలకడలిపట్టునకుం జని యొక్క శుచిప్రదేశంబున నాసీనులై నియమి కేంద్రియ వ్యాపారులగుచు శ్రీహరి నారాధించుచున్న యెడ. 187 సీ. మొలకలె త్తెడునవ్వు ముఖసుధాకరునిపై నవచంద్రికాసమున్నతి నెసంగ సచుకొన్న కరుణారసమ్ము కన్దమ్ముల మకరందబిందుసంపద వహింప పొలుపొందు కలుసులబోటి వక్షఃపీఠి తగు రత్న రేఖావిధమ్ము దాల్ప విలసిల్లుదరచక్రములు భుజోదయశృంగ ములకేవఁ జంద్రార్క కలనఁ బెనుప లలిత పీతాంబరము గాత్రజలధరమున మించు క్రొమ్మించు తెఱఁగున మెఱుపులీన చటుల ఖగ రాజ పక్షఘోషము లెనంగ శౌరి విచ్చేసె నిర్జ రేశ్వరుల కడకు, మ 188 ఇత్తెఱంగున మొదలిచదువులు తుదలంబొదలు కలిమిచెలి మగనిరూపు చవి చూపులంగ్రోలుచు నొండెఱుంగక యొక్కింత తడవూరకుండి యంతఁ దెలివి కొని యమ్మహాపురుషునిం గాంచి. చం. సనకసనందనాదిమునిసన్నుత పాదసరోరుహాయ, స జ్ఞానవిపడంధ కారదివసప్రభ వే, కమలాల యాఘన స్తనతటకుంకుమారుణవిలాససముజ్జ్వలవక్షసే, సుహృ ద్వినయవిదే నమోభగవతే భవతే ! యనియొక్క రందఱున్', 39 140 కులశేఖర మహీపాల చరిత్ర మ. అపు డ దేవవ రేణ్యు లాత్మనీటల ప్రాంతమ్ములం జేర్చుపా ణిపుటంబుల్ విలసిల్లె రావణభు: జాన్వీత జ్వలచ్చంద్రహా సపటు క్షేవనిరీక్షణోదిత మహాసంతాపముం జెందు డెం కం. దపుఁ చెందమ్ములచంద మచ్యుతుని చెంతం దెల్పునట్లొప్పుగన్, చతురానుపమోక్తుల న చ్చతురాననుఁ డాత్మవినయ సంభృత్వడై స న్నుతి గావించిరి శంకర శతమన్యుప్రభృతులును వళస్స్ఫురితులుగన్. చం. జయజయ ! భక్తలోళ హరిచందన ! నందసునందపత్రి రా డ్జయవిజయాది నిత్య పరిషద్భజనీయ నిజస్వరూప! దు ర్ణయదనుజాటవీదవధనంజయ ! వేదశిరస్సకస్థలీ శయితమర్తాళ! కాననగజశ్రమమోచన! పద్మలోచనా ! సీ, సదముల భవబంధచయము బాపెడు వ్రాశ పదములందు జనించి బయలువ్రాక యొడలిపైఁ దెలిచాయ కడలఁజిమ్మెడి చిల్వ కడలిపై నుసుపాన్పుశరణి గొల్వ కరమునందు సువర్ణకమలమూఁదిన చాన యురమునందు వసించి యొరపు బూస శ్రుతులందు నుతులఁ బేర్కొన్న చిల్వల గొంగ గతులందు వైభవోన్నతి నెసంగ తే.గీ. నతివిచిత్ర ప్రభావాభిమత విలాస భాసురోదారచరిత మేర్పడిన నిన్ను సన్నుతింతుము రక్షితసకలభువన ! జంగమస్థావర ప్రాణి చక్రపాణి, కాదన రాదు కాదు శిఖ కృధి నడంచు భవత్ప్రతాపముకో గాదనరాదు కాదు ఫణి కాశ్యపిఁ బూన్బుమహోపకారమున్ గాదన రాదు కాదు ఘనుకాంతి నడంచుతనూవిలాసమున్ నీదువిహారముల్ దెలియ నేరరుగా విధిముఖ్యు లీశ్వరా! 67 141 142 143 144 145 68 ద్వితీయాశ్వాసము కం. అనుచుఁ జతుర్ముఖుఁ డీక్రియం కం. దను నుపనిషదర్ధగతులఁ దగ వినుతింపన్ విని పద్మలోచనుఁడు కృప నెనయు మనోవృత్తి దెలియనిట్లని పలికెన్, ఏమి హిరణ్యగర్భ ! పనియేమి శచీశ్వర! వహ్ని వారిధి స్వామిమరుత్కు బేరదివసప్రభుచంద్రములార! బూర లే మేమొకదా భయ బడరి యిట్లరుదెంచుట పం క్తికంధరో ద్దామభుజావిజృంభణవిధానము సైపకనో! తలంపగన్. హరి యిట్టు లాన కిచ్చిన సరసీజగర్భుండు విపులసంతోషాంతః కరణుండై పురుహూతుం గరము ల్లాసమున సైగ గాఁ గన్నుగిలిపెన్. Q శ్రీమన్నారాయణునితో నింద్రుఁడు తనపాట్లు చెప్పికొనుట తే. గీ. శీఖకలాపాగ్రమేచకశ్రీ నెనంగు కం. లోచననహస్ర మమ్మేమమే దశాంగు మోముచందురు పైఁ బర్వ మ్రొక్కులిడుచుఁ జేరి వృతారి తమకత చెప్పఁ దొడఁగె అనుపముభుజశౌర్యమునన్ మును జగములనేచు రావణుండుతపస్సం జనీతబలమ్ములఁ గ్రమ్మఱ పసరుహసంభవుని వలన వరములు వడసె౯. రక్కుసులతేఁడు తన పే రుక్కున బలి గెలువఁబోయె నోహో ! తన యూ రెక్కడ! సుతలం బెక్కడ! నక్కజ మగుచున్న దిప్పుడది మదిఁ దలఁప. 146 147 148 149 150 151 కులశేఖర మహీపాల చరిత్ర సొలయ నెల్లెడఁ ద్రిప్పి సురభిఁ ద్రొక్కెర త్రాళ్ళ స్రుక్కఁజేసిరి పాలుగ్రోల ననుచుఁ దఱిమి యైరానతదంతిదంతమ్ములు పెకలఁ దీసిరి వాలుబిడులకనుచు సనయులై పారిజా తాదిద్రు శాఖల విఱుగఁద్రొక్కిరి మంచివిరులటంచు బలిమి రంభాది కాంతల పయ్యెడలు పట్టి తలఁగఁ జేసిరి కేళికలకు ననుచు తె.గీ. నసురు లిబ్భంగి విశ చకలా రకమల కైరవస్ఫార సౌరభోద్గారివుణ్య 7 వారిశోభిత గగనస్రవంతిఁ జొచ్చి కసటుగల్పిరి మేనులు గడిగి కడిగి, తే. వరములందిన యప్పుడ సరవి నాతం సీ. తే. డమరకాంతలఁ జెఱగొందు ననుచుఁబలికె నాది నిది చెప్పవలయు నాహా! నిశాట కపటకృతి బుద్ధి కొక పాదు గలుగనీదు. దనుజేంద్రుసంధికై త్వష్ట నందుఘటింప నతని స్వహర్మ్యనిర్మితికిఁ జొనిపె సడలక నంత వైశ్వానరుఁబు త్తేర నతనిఁ బొక క్రియాన్వితునిఁ జేసె పనిద ప్పెనని సమీరునిఁ బంప నతని శు ద్ధాంత కేళీశ్రమం బణఁప నుని చె మానక విధుని సన్మానించి పంచిన నతని నుద్యానానుగతిని నిలిపే మన బృహస్పతి సర్దించి పనుప నతనిఁ గాంచి శుక్రుండు సుతులతోఁ గవసి పలుగు రాల వైచుచుఁ దఱిమినఁ జాలుననుచుఁ బుడవి యద్రువంగఁ బఱ తెంచి పురమునిచ్చె. 69 152 153 154 70 ఉ ద్వితీయాశ్వాసము అక్షత వార్ధి జన్యధవళేశ్వము నెక్కి జయంతుఁ డేగ, ధూ మ్రాక్షుఁడు దాడిమైఁ జనుచు నాతనిఁ ద్రోఁచి హరి హరింప, నా రాక్షసుఁ దాఁశనోడిరి సురప్రభులట్లనె పోఁ జుమీ! రమా ధ్యక్ష ! మదూర్వశీవచనహాసవిలాసము లాఁగకుండిన . 3. కుంభుఁ డటవచ్చి వెలిగిడ్డి గొనియె మొదల చం. చం దాని విడిపింప నశ్వరత్నమ్ముఁ బొదినె దాని విడిపింప వెండియు దానిఁ బొదినె చూడు వేల్పులపాటు కౌస్తుభవిభూష ! తవిలి దశాస్యు (డస్మది భదంతము కుయ్యిడ గాఁ బెక ల్చే దా నవపతిసూతి నన్నొగి రణమ్మున గెల్చి మదం బెలగ న య్యవినయుఁ డింద్రజేత యను నాఖ్యవహించె ని కేమిసేయుదు నవసినదంతికి విముతనామకృతంబగు కింవదంతికి. బంచి పే దనుజుఁడు మేనకాది సుం తామర సాక్షులఁ బిల్వఁబంచి ర్చిన మధుపానజృంభణముచే దశవక్త్రముల గడంగి చుం బనగతుల దదీయతను పార్శ్వముల బలు గంట్లు సేయఁ గా ర్కొనియెడు భీతి వానియిలు ద్రొక్కరు క్రమ్మఱ నెన్ని చెప్పినక్. కం. అందుకు మావెల్లేనుఁగు కం. బందియ పెట్టించినాఁడు పాపరతుం డీ చందమ్మున బృందారక బృందము త్రిదివమున నిలువరింపఁగ గలదే! వీరు వినుఁడు ననుబిల్చున్ వీరుఁడు రక్కసుడు మేషవృషణ! యహల్యా జార ! యనుచు నిరిద్రసునా సీరాఖ్యులు నుడువ డపహసింపుచు సభలోన్, ఆయసుర మరుత్తుని యా గాయతనముఁ జెఱుపఁదలఁచి యత్యుగ్రుండై 155 156 157 158 159 160 ఉ. కులశేఖర మహీపాల చరిత్ర డాయగ భీతిలు సురలకు వాయన కృకలాస రూపవై భవ మమరెన్. రాజీలు దైత్యరాజునకు రాజు భయంపడె రాజరాజు నీ రాజన మిచ్చె దక్షిణపు రాజు ప్రదక్షిణ మాచరించే వా రాజు వణంకె డొంకె ఫణిరాజు హరీ! యిశ నేమి యే మరు ద్రాజనె కాదె రాజపదరాజికి నోటమి గలై నేఁటిఫిక్. 71 161 162 బంధుర, అమృతము ద్రావుదు రమరులు సుఖులని యందురు పామరులౌటఁ జుమీ! విమత నిశాచర వీర శిలీముఖ విషపితాంగకులై విబుధుల్ నెమకుదు రద్రిగుహాగహనోదర నిర్వ్యధనాంతరముల్ గతిగా కమలవిలోచన! విబుధవిపర్యయ కార్య మవార్యమె! దేవరకు", తే. వేయు నేటికీ దను దుర్విష హదుర్వి నెలవు వీక్షింపఁ జనరు వేల్పులు ముకుంద! 163 లాసదుష్ట క్రియాప-కిలమ్ములైన నిన్నె కొలిచెద మిచ్చోట నిలుము కృషను. 164 అని విన్నవించు సురలను సురేంద్రునిం జూచి కృపావిస్మయంబులు మనంబునం బెనంగోన హరి యిట్లనియె. 165 అభయ ప్రధానము కం, శుభమగు వెరవకుఁడిఁక మీ కభయ మ్మిచ్చెద నిశాచరాధీశ్వరునిక్ బ్రభ చెడఁ దునుమాడెద ము న్ని భరాజుం బ్రోచు టెఱుఁగరే! సురలారా! 166 అనుచు గోవిందుఁ డందఱం దప్పక చూచి నిూమియంశంబులం గీళపతులం బుడమిం బొడమునట్లు గావింపవలయునని యానతిచ్చి విరించి నూఆడించి, రుద్రు నుల్లాసామృతసముద్రునిం జేసి, పురందరు నానందకందళిత హృదయారవి దుం గావించి, తక్కటి బృందారకుల నందఱం బ్రియంబంద మందమందసల్లా పమ్ముల ననూనయించి వారల వీడు కొల్సి యంతర్హితుండయ్యె మఱియును. 167 72 ఉ. సీ. తే. కం. తే. సీ, ద్వితీయాశ్వాసము అంత నిరంత రాదరిత హంసర థాది సుపర్వ సంచయ స్వాంతుఁ డుదార సద్గుణని శాంతుఁడు శాంతజనాంతరంగవి శ్రాంతుఁడు పుణ్య కాననవసంతుఁ డనంతుఁడు కోసలావనీ కాంతుని కాంత నెమ్మొగము కాంతినహింప జనించు వేడుక. పరిసంధిక స్త్రసంపాతవారణవజ్ర పంజరమ్ములు భద్రకుంజరములు ఉరుతరో త్సేధమంధరకుభృచ్ఛిఖరాభి నందనంబులు ఘనస్యందనములు నతుఱరింఖావిలంఘితత తాహితపురీ కూటకంబులు నటదోటకములు 900 గణనీయబిరుదో గ్రరణరంగభూతలో ద్వృత్తనృత్తార్భటుల్ వీరభటులు బలసి తనుగొల్వ గల్వల చెలిమి కానీ కలిమి నలమిన సస్యమ్ము కరణి ధరణి విరులు వరులందు, జనులందు సిరులు సమత నెసఁగె దశరథ భూపాలుఁ డేలునపుడు. అతఁ డనపత్యతఁ బాయఁగఁ జతురగతిన్ ఋశ్యశృంగు సాహాయ్యమునన్ గ్రతు వాచరించి విప్ర ప్రతతికి గోభూహిరణ్యరత్నము లొసఁగెన్, మెఱయు గౌసల్య కైక సుమిత్ర లనెడి రాజసతులకుఁ గ్రమమున రామభరతు లోలి లక్ష్మణశత్రుఘ్ను లుదితు లై రి మంత్రపాయస భాగ సంబంధకలన, మురునందు చిన్నారిమోము కస్తురిబొట్టు శశిబింబతాంఛనచ్చవి వహింపం దళుకు కెంజూయ కన్నులపై కనీనకల్ తమ్మి రేకుల తేటి యె యెమ్మె నెరప 168 169 170 171 `కులశేఖర మహీపాల చరిత్ర పొలుచు గెమ్మోనిపైఁ గళలీను పలుగొనల్ చివురు పై మొగ్గల చెలువుదాల్ప మెలఁపు చెక్కుల నవ్వు తెలివి యద్దములపై చికిలి నిగ్గుల గుంపు చెలిమిఁ బెంప తే.గీ. మణిరుచిరకింకిణీగుణుకుణుర వంబు కం. కం. లుల సీల బాలలీలలఁ దల్లిమ్రోలఁ జెలఁగు రఘురాము నెలమి నీక్షించు పౌర జనములకు నేత్రలాభమ్ము సఫలమయ్యె. మఱచి మరునొకనిఁ బిల్తు రె మఱి నూర్వుర వలయు రూపమహిను నతనికిన్ దఱచి విధు నెన్న వచ్చు నె మణి నూర్వుర వలయు రససమంచితరుచికిన్, ఆటల వేళనె దోర్బల పాటవ మెలరు భజింపఁ బటువిశిఖమున౯ తాటకఁ బడనేసె గాధితనయుం డల కక్షా. కాటుక ప్రోవుం బోలిన ఖేచరులై నిశాచరులు కిల్బిషవృత్తి మునిప్రణీత యా గాచరణాంత రాయకరు లౌట వెసంగని వారి ఘోరనా రాచపరంపరం బొలుపఱం దునుమాడి కువాచు నీచు మా రీచుఁ బయోధివీచికల కేవలఁ ద్రోంచె మరుచ్ఛరమ్మునన్. సీ. పదసరోరుహర జఃపట లేక లేశాను భూతిచే నొగి రాతి నాతిఁ జేసె కరపల్ల వాగ ప్రకర్ష ణాకర్షణ పెల్లుచే హరువిల్లుఁ బొల్లుచేసె ప్రకటపై భవముచే సకలాస్త్ర దేవతా ప్రతతుల నిజదాస్యరతులఁ జేసి మృదురూపమహిమచే మిధిలేంద్రకన్యాల లామంబు దనకు నిలాలిఁ జేసె 78 172 173 174 175 76 ద్వితీయాశ్వాసము తే.గీ. రామభద్రుండు విహరించే భీమసింహ శరభ శార్దూలభల్లూక చమరశల్య గండ భేరుండ కాసర ఖడ్గగవయ దంతిముఖజంతుఘోరకాంతారములను. కం: అవిరళవిక్రముఁడు రఘు ప్రవరుం డయ్యడవి నుగ్రభంగి వధించె దివిషన్ని రోధు భైరవ రవరూఢక్రోధు సాపరాధు విరాధు. కం. ఈలీల మదిని మునిపరి పాలనతత్పరత నవ్విభావసువంశ శ్రీలుం కరిగె౯ వ్యాఘ్ర వ్యాళమృగార్భటికిఁ బంచవటి చక్కటికి, తే.గీ. అమ్మహాటవి శూర్పణఖాభిధాన దానవీదుర్విధానప్రధానవచన సూచిత క్రూర తాసహిష్ణుత నతండు జేసెఁ దత్కర్ణ నొసనిచ్ఛేద మపుడు. Vo. ముక్కును జెవులును బోయిన రక్కసిమొఱలిడుచుఁ జని ఖరప్రభృతులతో నక్కార్యం బెఱిఁగించిన నెక్కొను రోషమున రాము నిర్జించుటకున్, తే.గీ. ఆగరిత జాగరితయగు నమ్మహాత్ము నాత్మమాయల బెదరింప నలవిగాక రుధిరపూరమ్ము సెవినిండి బధిరఁజేయ దీనగతి నేగె నజ్జనస్థానమునకు . . మందరాచల నిభస్యందనారూఢుఁడై భాసురుండైన ఖరాసురుండు పటురణోత్సాహసంభరితుఁడై ధృతధను ర స్తకుండైన త్రిమ స్తకుండు 3- 185 186 187 188 189 190 కులశేఖర మహీపాల చరిత్ర తతసింహఘోషదుర్దాంతుఁడై కృతమరు త్క ఆపనుండైన యకంపనుండు భూరిదోస్సారప్రభూతగర్వక్రూర భాషణుండై పేర్చు దూషణుండు తే.గీ. దర్పమద విస్ఫురచ్ఛతుర్దశసహస్ర దనుజ భటపు కి నడువ నుద్దతి యెసంగం జనిరి రఘుకులసార్వభౌముని జయింతు 50. మనుతలంపు నిలింపులు కసము బెంపు అది చూచి రాఘవుండ భ్యుదితో గ్రక్రోధశి ఖళి భోజ్జ్వల నిశిత ప్రదరా స్త్రధనుర్ధరుఁ డై యెదు రేగెన్ దనుజవీరహింసాకృతికిన్. మత్తకోకిల, ముంచె నుగ్రశరాగ్ని కీలల మోహరించు భటావళిన్ ద్రుంచే ఘోర శిలీముఖమ్ముల దూషణు ద్రిశీరు౯ మహో దంచితాస్త్రముల స్వధించె ఖరాసురుఁ బ్రియమంది భూ షించే దేవగణమ్ము లారఘుశేఖరు గుణసాగరు. చం. అదివిని జాతరోషభయదాకృతియై దశకంధరుండు దు ర్మదమున మాయఁపుంబసిఁడిమొగల లేడివి గమ్ము రాఘవుం డుదిత సతీనియుక్తి నిను నొయ్యనఁ గైకొన నేగుదెంచు న య్యదనున సుందనందన నృపాంగనఁ గైకొని తెత్తు లంకకు . 77 191 192 198 194 అనుచు మారీచుం బు త్తెంచిన నతండును హేమకురంగరూపధరుఁ డై శ్రమసమీపవర్తియగుటయు. స్వాశ్రమ 80. చంచద్రత్న కురంగో దంచితరూపమ్ము గని ధరాత్మజ వేడ బంచాశుగనిభు విభుఁ బ్రో ర్ధించే గాంచనమృగమ్ము దెన్ముని వేగం, 195 196 78 a. 80+ ద్వితీయాశ్వాసము సీతాపహరణము జ్యోతితశౌర్యుఁ డారఘుకులో త్తముఁ డట్లు మృగానుసారియై యాతతవృత్తి నేగఁగ దశాస్యుఁడు భవ్యకులాభిజాత ని ర్ణీత పతివ్రతా చరితనీత సుధీజనగీత సద్గుణ వ్రాతసమేత సీతఁ గొనివచ్చె జటాయువు గూల్చి లంకకు. శంకితమానసుండగుచు జానకిఁ గైకొని రావణుండు దా లంకకు నేగె భాస్కరకులప్రవరుండును హేమరత్న చి త్రాంకమృగాకృతిం జను నిశాటు వధించి నిజాశ్రమంబు ని ర్వంకల నింతిగానక దురత్యయ భేదపరీతమూర్తియై, కంఠే దనుజక రఖడ్గ విదళిత తనుపక్షశ్రీ ణబలు పతంగాధ్యక్షు గని కనికరమున రఘునం దశుఁ డిచ్చెన్ మెచ్చి యచ్యుతంబగు పదమున్ . కం. క్రౌంచారణ్యమ్మున నృప కం॥ పంచానను లాగ్రహించి బాహాయుగమున్ ద్రుంచి పడవైచి రురుమృగ పంచజనాద్యంధు దురిత బంధు కబంధున్, ఎలమిఁ గబంధుఁడు దమకున్ చెలిపిన గతి నేగి కనిరి దీపితపంపా సలిలాశయ తటతరుసుమ కలిత రజఃపటల జటిలక బరిన్ శబరిన్. 197 198 199 200 201 వ అంత నత్యంతసంతుష్టాంతరంగయగున య్యెఱుకుటింతి సేవంతినీలతాం తంబులఁ బ్రఫుల్ల మల్లి కాకుసుముదామస్తోమంబుల మా తీప్రసవమాలికల సుకరంబు బగువకుళముకుళంబుల మఱియు ననేక విధార్ఘ్యంబులం బూజించి సుధామధుర ఫలవి శేషంబులు సమర్పించి కృతార్థమైయున్న యన్నాతికిం బ్రీతియెసంగ దివ్య పదం బొసంగి తదుపదిష్ట ప్రకారంబున సుగ్రీవుం జూచువారై చనిచని ముందట. 202 సీ, కుల శీఖర మహీపాల చరిత్ర తటసరద్దఙఘటాఘటిత మేఘాశయో త్కంఠానటన్నీ లకంఠచయము స్ఫటికాశ్మబింబితస్వతనువీడాన్యధీ వై రసంఘుష్టకంఠీరవమ్ము సానుసన్నిహి తేందుసందర్శనా సీత ఫలమనీషోత్పతద్వానరమ్ము ఘనవిదూర జళి లేక్షణబాఖుభుగ్భీతి కేకరీకృతకోకకోకిలమ్ము తే.గీ. సైరిభద్వంద్వ కలహప్రసంగ శృంగ చిటచిట రవోపగత వేణుపటల దావ బహుళశబ్ద భ్రమభ్రమద్బహుళమృగ ని కాయమగు ఋశ్యమూకంబు గానఁబడియె. సుగ్రీవ సమాగమము కం. కనుగొని యటఁగ్రుమ్మరు న మ్మనుజేంద్రాత్మజులఁ జూచి మదిఁ బెగడుచు న య్యిన తనయుఁ డనుపఁ బావని చని వారి తెఱం గెఱింగి సంతుష్టుండై తే.గీ. నక్తసాంకవమృగ మదస్ఫటిక తటుల నడుగులిడఁ గష్టమగునంచు హనుమ వగచి తనభుజమ్ముల నిడుకొని దశర థేంద్ర సుతులఁ గొనివచ్చె మార్తండసుతుని కడకు, తే.గీ. అంత నిరువురు సఖ్య సౌఖ్యమ్ము నంది వెలయ సుగ్రీవుఁ డవనిజ వెదకు పనికి, సరవి రఘువల్ల భుఁడు వాలిఁ జంపుటకును శపధములు జేసి రపు డగ్నిసాక్షికముగ. కం. లీలఁ దళ్లుకొత రాముఁడు మేలగుబలువింటఁ దొడిగి మిడుగురులడరన్ 79 208 204 205 206 80 వాలిక తూఁ పెద నాఁటిన ద్వితీయాశ్వాసము వాలి వెసన్ దూలి తూలి వ్రాలెన్ బుడమిన్. అంత ననంత తేజుఁడగు నమ్మనుజేంద్రతనూజుఁ డబ్దినీ కాంతునిపట్టికిన్ బ్లవగ గౌరవ రాజ్య మొసంగినన్ శుచి స్వాంతుఁ డతం డగణ్యమగు వానరసైన్యములన్ సమ స్తది కాంతములందు సీత వెదుకం బనిచెన్ బ్రతికారశీలుడై. 207 208 వ. ఇవ్విధంబున నవ్వసుధాకన్యాన్వేషణమ్మునకు ననన్యసామాన్యబలో దీర్ణమ్ములగు సైన్యమ్ముల నలుగడలకుం బసిచి హనుమదంగ దజాంబవన్నీ లనల ప్రభృతులను కపిప్రవరుల ననేకవీర వాన రానీకంబులతోడం బనిచిన వారును దక్షిణ దిశావలయమ్ము కలయంబరికించి పదంపడి సంపాతివచనంబులవలన రావణానీతయై సీతా దేవి లంకాపురంబున నుండుట యెఱింగి పరితోషమ్మునం బొంగు నంతరంగమ్ము లతో( '( జనిచని ముందట. స్రగ్ధర, అభ్యస్తోదగ్ర వేగవ్యవసిన మకర వ్యాళ పాఠీనధాటీ 80. శుభ్యత్తు బ్రాండజంబై మురనికర మనస్తోమకృద్రత్న దం బై బిభ్యదై ్వమానిక స్త్రీ పృథుకుచ పరిరంభీకృతోరఃప్రియంబై యభ్యుద్యత్తుంగ భంగాహతఘనతటమై యబ్ధి గానంగ నయ్యెన్. చూచి వెతఁ జెంది తొల్లిఁటి వాచాలత యుడిగి రిచ్చవడిరి కపులు కా లోచిత మెఱింగి పావని ఖేచరగతి నడువ సుత్సుకితమానసుఁడై. 209 210 211 హనుమ సముద్రమునుదాఁటి సీతఁగనుగొనుట సీ, చూచినచూపులు సురవైరిపుర గోపు. రాట్టాలకమ్ముల సదరఁ జేయ చాచిన హ స్తముల్ సమదవైమానిక ప్రకరమ్ము నిటట్టు పరవఁ జేయ పూఁచినపదములు భుజగ రాజస్ఫటా తతులకు దుస్సహ త్త్వమ్ముఁ జేయ కుల శేఖర మహీపాల చరిత్ర వీచిన వాలమ్ము విపులది శాగ జ శ్రేణికి గుండియల్ చెదరఁ జేయ తే.గీ. అచల మల్లలనాడ విహంగ రాజ గతి నెగసి లీలఁ దళు త గగనవీధి నరుగఁ దొడఁగె నవక్రపరాక్రమ ప చండ వై ఖరి నన్న భస్వత్సుతుండు. మ. 80. చని యాతండు తమస్వినీ సమయ సంచారోన్ముఖుండై పురా తనలంకాపుర గోపురావసథ సౌధస్ఫారశాలా వినూ తనపుష్పావృత పుష్పక ప్రతనరత్న గ్రావముల్ రోసి పూ నిన చింతన్ నృపచంద్రచంద్రముఖ న న్వేషించే జాగ్రద్గతిన్. మొనసి పురియరసి కానక పనివడి క్రమ్మఱఁ దహించే పావని కులపా పని వనితామణి జనకా వనిపాలతనూజ కింకవని తావని తాజ్ . అనిలాత్మజుఁ డవ్వనమున పనివడి వెదుకంగ శింశుపాతరుమూలం బునఁ గృశత దోఁప చింతా తినతాననయైన రాముదేవిం గనియెన్ . తే.గీ. కాంచికోదంచదవలగ్న కాంచనాంగి కాంచి కపి కార్యసిద్ధి యూహించి పొంగె భంగ సంఘాతసంచారభంగిఁ గ్రుంగి చంద్రకళఁ గాంచి పొంగిన జలధివోలె. 312 213 214 215 216 ఇక్కరణి నక్కపికుంజరుండు నిశాచర చరిష్యమాణంబగు నవ్వన మధ్యంబునఁదనుమధ్యం జూచి పతివిరహజనిత చింతాపరి శాంత స్వాంతయు నుపవాస కృశాంగియు నగు నన్నలినలోచన చిత్తంబు రామలక్ష్మణ క్షేమక థాకలితంబులగు సొంత్వవచనంబుల నుపశమిల్లం జేసి రాఘవాుగుళీయకం బమ్మధుర భాషిణికి నభి జ్ఞానమ్ముగా నొసంగి సంతోషరసతరంగితాంతరంగం గావించి పునఃప్రయాణోన్ము ఖుండగుచు న దేవిచేత ననుజ్ఞాతుండై యచ్చోటు గదలిచని. 11 217 82 ద్వితీయాశ్వాసము తే.గీ. చంపకాశోక సహకార చందనాది బహుళతరు ఫలపుష్పసంపదల నొప్పు ప్రమదవనమెల్ల నిర్ఘాతపాతఘోష భీషణమ్ముగ విఱిచే నా భీమబలుఁడు. శా. ని స్త్రీంశాదినమ స్తనధనకళాన్వీతుల్ నిశాటుల్ సమి న్నిస్త్రాసుల్ పొదునం గవీంద్రుఁడు గదానిర్ఘాతపాతమ్ములన్ భస్త్రాజాలముభంగిఁ బ్రోవులుగ గూల్ఫన్ మేఘనాదుండు బ్ర హ్మాస్త్రం బేసి నిబద్ధుఁజేసి వెసఁబిత్రా వాసము జేర్చిన". తే.గీ. అతఁడు రోషారుణామఁడె యనిల తనయు వాలమునఁ దైలసంసి కన స్త్రచయము చం. చం. ట జుట్టి కాల్పింపఁ బచిన సురవిరోధు లట్ల కావించి రత్యుగ్రులై కడంగి. లుకొడహనము పవనజుఁ డంత రజ్జుకృతబంధనముల్ విదిలించి వైచి వా ల విపుల ఘోరవహ్ని శిఖల దరికొల్పి సుశాలి శాలికా సవనిరయ స్ఫురన్ద్రవిణసద్మ విభూషణవస్త్రపేటికా భవన విచిత్రమంటప సభానిచయమ్మ దహించె నుగ్రుడై. దెసలఁ బటు స్ఫులింగములు దీటుకొని గపివాల కీలిచేఁ బసిఁడిక వాటముల్ గరఁగిపాటి మణిచ్ఛట క్రాఁగి ప్రక్కలై వసుమతిఁ గూలె సౌధరుచివైఖరి తీజె రవమ్ముమీజె రా నవని తాశ్రుబిందువులు జాలై కనుంగవ నిండి కేవలన్. తే.గీ. జృంభదతికాయ కుంభ నికుంభ కుంభ కర్ణ ధూమ్రాక్ష మ త శుక ప్రహ స్త జిష్ణుజిన్ముఖ్యమందిర శ్రేణి దవిలి తోఁక చీచ్చయ్యె హనుమంతు తోకచిచ్చు. 218 219 220 221 222 223 కులశేఖర మహీపాల చరిత్ర 88 బాచ వ. ఇవ్విధంబునఁ బ్రళయసమయ విజృంభితతాండ ప్రచండమూర్తియగు రుద్రునిచందంబున సకలదనుజ భయంక రాక పండగుచు లంకాపురీదహనం రించి యుపశమితక్రోధుడై కీలికీలాభీలంబగు వాలంబు సముద్రసలిలంబుల జిల్లార్చి రామపత్నింగాంచి ప్రణామంబులా చరించి య దేవిచేత ననుజ్ఞాతుండై సముద్రంబు గడచి వాలితనయజాంబవత్ప్రముఖులం గూడికొని చని లక్ష్మణసుగ్రీవసహితుండై యున్న యన్న ృపశిఖామణి చరణంబులకు, బ్రణామంబులాచరించి సీతావృత్తాంతం బంతయు నెఱింగించిన నమ్మహాబాహుండు కపిగోలాంగూల భల్లూక సై న్యంబులు పరివేష్టింప భేరీ భాంకార నిర్దళిత దిశాభాగుండగుచుసత్వర ప్రయాణమ్ముల సాగర సమీపంబునకుం జనిచమూసమావృతుండై యచటనిలిచియున్నంత. కం. అగ్రజుఁడు రావణునిచే చం• విగ్రహముంజెంది యలవిభీషణుఁ డపుడ వ్యగమతి నేగి రఘువీ రాగ్రణి కృపఁజెంది నిలచె ననుచరుఁడగుట. నరవరుఁడంత దర్భశయన వ్రతియై తను వేడుచున్న, ము ష్కరమతియై సముద్రుఁడు ప్రసన్నుడుగామి నత్తి ప్రచండని ష్ఠురభయదాకృతిన్ ధనువుజొప్పడఁ దాల్చి మహానలజ్యాల చ్ఛరనికరంబు పై ఁ బఱ పై సాగరనీరము నింకఁ బాఱఁగన్. ఉడుకునీట వసింపనోఁడి గ్రక్కున దీవి మేటల నలరు తామేటికులము శరధూమవిసరధూ సరవహ్ని కీలలఁ జెదరి శోషిలుచుండు చిలువపిండు తూఁపుటగుల కాకదొరలి తూలింపంగఁ దెరలుచుఁ బెన్నీటఁ దేలుమాలు విశిఖానలో మ్మ దుర్విన హమై క్రమ్మిన మినుక జాలక తెళ్లు పెనుమొసళ్లు తే.గీ. నగుచుఁ గంధిజలమ్ము లుగ్రాస్త్రశిఖకి నింధనము లయ్యె దనుజసంబంధ మింత జేసె నను భూనభశ్చరశ్రేణి ఘోష మెల్లెడలఁ బర్వె సాగరం భింకఁదొడగె. 224 225 226 227 84 ఉ. కం. ద్వితీయాశ్వాసము అంత దురంత రోష చరణారుణలోచనుఁడైన జానకీ కాంతుఁడు ప్రజ్వలజ్జ్వలన కాండము మార్వి టింప ఘోరక ల్పాంతవిజృంభితార్కనిభమాట సముద్రుఁడు భీతుఁడై జలా భ్యంతరసీను వెల్వడి నృపాగ్రణిఁ గొల్వఁగవచ్చె నమ్రుఁడై . నిరహంకృతి నతఁ డారఘు వరుని న్వినుతించి కరుణవడసి సరస్వ తరణమ్ము సేతు బంధో ద్ధరణమ్మున నగునటంచుఁ దగఁ బల్కుటయుస్ . వ శెలసా! శిలాజాతంబుల 228 229. అట్లకాక యని తదా దేశ ప్రకారంబున ననేక ప్లవంగి పుంగ వానీతంబులగు సేతుబంధంబుల సలక రృకంబును శతయోజనపరి మితంబురు నై విలసిల్లె నంత రామభద్రుండు లక్ష్మణసుగ్రీవహనుమ ద్విభీషణాంగద జాంబవన్నలనీలాదివీ కభట పరివారంబు గొలువ సముద్రతరణంబు జేసి చని ప్రదం డాట్టహాసగర్జారవఘోరమ్ముగా లంకాపురద్వారనిరోధంబు జేసినం గుపితులను నిశాచరవరులు కయ్యమ్ము సేయవెడలిన. మ యుద్ధము అమితోత్సాహులు భాను జాంగద జగతాణాత్మజుల్ జాంబవ త్ప్రముఖుల్ నుర్కటభల్లుగాధిపులు ధూమ్రాక్ష ప్రహ సప్రజం ఘ మహాపార్శ్వ నికుంభ కుంభముఖ విఖ్యాతాసుర శ్రేణులస్ సమగక్షోణి వధించి రుజ్జ్వల భుజాసరం భదుర్వారులై . తే.గీ. మేరు సమభీరకాయు రమేయబల వి మ. జృంభణోదీర్లు శిఖవర్లు కుంభకర్లు చండకోదండము కార చంద్రవిశిఖ నిహతిఁ దునుమాడె రామావనివిభుండు, ఉరులంకాపురవజ్రపంజరము మాయోపాయమంజూష యు ద్దుర గర్వాంధత మోద్రిగహ్వరము వేథోదత్తదివ్యాళ్లుగా కర మీతండన నొప్పు నింద్రజిదభిఖ్యాతాసురుం దాఁకి దు ర్భరబాణాహతిఁ ద్రుంచే నొక్కట సుమిత్రాపుత్రుఁ డవ్యగ్రుఁడై . 280 281 232 283 CAX కం. సీ, కులశేఖర మహీపాల చరిత్ర దనుజేంద్రుఁ డంతయును విని ఘనశోక ద్వేషరసవి కారోద్ధతుఁడై యిన వంశ వర్యుఁ దొడరుదు నని సూతుంబనిచె రథముదగ్రతఁ దేఱన్". ప్రకటభల్లూక చర్మస్యూతషోడశ చక్ర చంక్రమ చలఱ్ఱ్మాతలంబు యుగ భారసహ వేగయుక్తురంగ సహస్ర ఖురధూత ధూళిసంకుల నభంబు వితతాంగ దారులంబిత ఘంటిక జాల ఘోష కాతరది శాకుంజరమ్ము చటులరత్న ప్రభా సంవృతధ్వజపటీ రచిత గృధ్రవిహంగ రాజితమ్ము తే.గీ. శరగదా కుంతకోదండ శ క్తిపశు ఖడ్గ ముఖ్యాయుధోగ్రంబు కాల కేతు సూతచోదిత మగుచుఁ బ్రఖ్యాతమైన ఘనరథం బెక్కి వెడలె రాక్ష సవిభుండు. 85 234 235 వ ఇట్లు వెడలి రావణుండు ప్రచండకాండపరంపరలం బ్లవంగ పుంగవులం దొలగిపరడం జేయుచు రామభద్రుందరిసిన సమ్మహాబాహుఁడును బురుహూత పేషితంబును మాతలి సూతసహితంబును న గుస్యందనం బెక్కి రక్కసు వెసం దారొజు ని కయ్యంబుజేసె నప్పుడు. చం• అపుడు రఘూద్వహుండును దశాననుఁడున్ బరగించుఁ దూఁవు ల ట్లపరిమితంబులై దిసలు నౌకసమున్ వెసఁగ్రమ్మె నట్టిచో నృపమణి యుగ్రలీల రజనీచరవల్లభు మస్తకంబులున్ విపుల భుజంబులుం దునిమి వే మొలువం దునుమాడె సారెకున్. రావణ వధ తే.గీ. అంత రఘువీరుఁ డత్యుగ్రుఁడగుచు బ్రాహ్మ ణాస్త్ర మకరించి వజ్రవ్రణాంక మైన 236 237 86 ద్వితీయాశ్వాసము రక్కసులలేని వక్షమ్ము ప్రక్కలింప నసువు లెడలిన గిరివోలె వననివ్రాలె. 288 వ ఇవ్విధంబున దశవదను వధియించి రామచంద్రుండు సర్వసుపర్వగణ మధ్యంబున వెలుంగు మ హేంద్రునిచందంబున సకలకవిసేనా మధ్యంబునం దేజరిల్లు చున్నంత లక్ష్మణసుగ్రీవ హరు మదంగ దాది కపివీరు లమ్మహాత్మునకుం బ్రణామమ్ము లాచరించియభినందించి రప్పుడు. సీ. కురిసె రాఘవుని పై ఁ గోమలమందార సుమసముచితమైన సోనవాన మొరసె నొక్కట నవాబుద గభీర ధ్వాన గభీరధ్వాన తులితమై దివ్యదుందుభి రవంబు మెఱసె నంబరవీథి మృదులాప్సరోగణ సంగీతనాట్య ప్రసంగసరణి నెక సె నల్లనఁ బద్మినీ సూన చయనీతి సౌరభంబగు దివ్యమారుతంబు తే.గీ. సురలవిరుతులు మునివరస్తుతులు మర్క టో త్తమస్తోత్రములు కొన్న రోర గేంద్ర సిద్ధయకు స్తవంబులు చెలఁగె దిశల జానకీజాని విజయావసరమునందు, ఇందీవరా రేండు కుందబింబోడు స న్నియనఫాల రదోష్ణ నఖరనిచయ కలశ కేసరి శంఖకలహంస ఘనతుల్య కుచమధ్య గళయాన కచవిలాస స్మరధనుఃకరభ చంపకతన్నుకుర సు భ్రూరునాసాంగ కపోల ఫలక యావ రబిసకాహళాంబుజశ్రీ నము ద్యన్నా భిబాహు జంఘాంఘి కర్ణ తే.గీ. సీత సద్గుణసంఘాత శిఖముఖంబు వెడలి సీత చేలచందనవిమలకుసుమ రాజ రాజతమూ రియై రామవిభుని శోభితోత్సంగ పీఠిఁ గూర్చుండె నపుడు। 239 240 241 కం. సీ. కులశేఖర మహీపాల చరిత్ర పూజ్యయశోనిధి రాముఁడు ప్రాజ్యగుణు విభీషణునిఁ గృపన్' బహులీలా భోజ్యంబగు లంకాపుర రాజ్యరమావిభవమునకు రాజుం జేసెన్. వ అయ్యవసరమ్మున, మంచు వేలుపు చాయ లెంచి మెచ్చని కాంతి మించి రాణించు రాయంచ నెక్కి కొమ్ముజిమ్ముల బొమ్మగ్రుడ్డు జీరలువాఱఁ గ తరించిన మేటిగిత్త నెక్కి నడల నచ్చరబోంట్ల కడువ్రీడ నొందింప రంగారు మద్యపు టేనుంగు నెక్కి రతనంపుజతలు దీధితు లెల్లెడలఁ బర్వ మానితంబైన విమాన మెక్కి ఆ. వె. పద్మసంభవుండు ఫాలేక్షణుండు సు కం. రేశ్వరుండు దశర థేశ్వరుండు సకలవిబుధవరులు జనుదేఱ నేతెంచి రోలి రామచంద్రుపాలి కవుడు. ఊర్జితవాచారచనల నిర్జితరిపురాముఁ బొగడి నెరి ససురేఖా వర్జితులగు వానరుల పు న ర్జీవితులుగ నొనర్చి నయమెసలారన్. 87 242 243 244 245 వ మఱియును దగువరమ్ములోసంగి నిజనివాసంబులకుం జనిరంత రామ భద్రుండురు జానకీలక్ష్మణసమేతుడగుచుఁ బుష్పకాధిరూఢుండై విభీషణసుగ్రీవ హనుమదంగదప్రభృతులగు ప్రధానవకులు సపరివారమ్ముగాఁ దన్నుఁగొలిచిరా సాకేతపుర సమీపమ్మునకుం జనునప్పుడు భరతుండంతయు విని మహానందభరితాంతః కరణుండై కౌసల్యాదిజననీచయంబును వశిష్ఠ ప్రభృతిగురువర్గంబును సుమంత్రప్రభృతి మంత్రిసంఘంబులును సమస్తపౌరజనంబులునుం బరివేష్టింపు జని యగ్రజు ఐదు ర్కొని, 246 88 కం. కం. ద్వితీయాశ్వాసము తాఁ దలనిడుకొని భరతుఁడు మోదమ్మునఁ దెచ్చి మణిసముజ్జ్వలవిలస త్పాదుకలు రామభద్రుని పాదమ్ములఁదొడిగి మ్రొక్కె బహువారమ్ముల్ . జననీ గురుభూసురవం దనములు గావించి సచివనాగరజనులన్ వినయో క్తుల నలరింపుచు నినవంశ పయోధిచంద్రుఁ డేగెన్ బురికిన్. అయోధ్యా ప్రవేశము తే, గీ, జడలువిడిపించి మంగళస్నాన నమలరం జేసి రుచిరాంబరంబులఁ జిత్రరత్న భూషణమ్ముల స్రగ్గంధపుంజముల న లంకరించిరి వెసరామలక్ష్మణులను. సీ. శ్రీ రామభద్రాభిషేకోత్సవంబు ని త్ప్రత్యూహ మగునంచు, శాకునికులు సముదగ్రజలధరస్వన సమధ్య నిక రో దారాహతులఁజూపు మారజకులు తత ముఖానిలసముద్ధతఘళంఘళ ఘోష కలన నేర్పులు జూపు కాంబలికులు షడ్డాది బహువిధస్వరమిళన్మాధురీ వైఖరుల్ గావించు వై ణవికులు తే, గీ, స్వస్తివాచన ముఖర ద్విజ వ్రజంబు జయజయార్భటి వందిసంచయము వోగడ రుచిర కాంచనమయ రథారూఢుఁ డగుచు రామచంద్రుం డయోధ్యాపురంబు సొచ్చె. వ తదనంతరంబ. 247 248 249 250
- 351 కుల శేఖర మహీపాల చరిత్ర
కం. చంచన్మణిమృణి విలస త్కాంచనపీఠమున జనకతన్యకతో ప __క్తంచరవైరి రఘూద్వహుఁ . డంచితగతి నొప్పుచుండె నార్యులు పొగడన్ శ్రీరామాభిషేకము ణ కపిముఖ్యుల్ చతురబ్ధితోయముల వేడ్కందేర సమ్యక్సుధీ సపది ప్రోత్సహనమ్మునన్' జని యుదం వత్స్వర్ణ కుంభమ్ములన్ నిపుణప్రక్రియఁ దెచ్చినన్ ముదము సంధిల్లన్ ద్విజవ్రాత మం త్రి పురోథస్సుహృదా ప్రవర్గము బలశ్రీమన్మహూర్తమ్మునర్, తే.గీ. అమలమణిమయసింహాసనమున జనక జనవరాత్మజతో రామచంద్రు మునిచి మహిత పుణ్యోదకంబుల మంత్రరచన వెలయ నభిషిక్తుఁ జేసిరి విప్రవరులు. కవిరాజ, బలిమి చెలంగ నితండు ఘనుండని పల్కు నిలింపుల మాటలతో నలరుచు గీతుల రీతు ఁ దేలేడి యచ్చరబోటుల యాటలతో పలుగడలన్ జయమంగళమే యను పాటలగంధుల పాటలతో రఘూద్వహు నయ్యభి షేచన మన్నరవానర కోటులతో, మ. నల రె మరుదీశుం డురుపారిజాత సుమదామంబుల్ కనద్రత్నసం దర కేయూరము లర్యమాత్మజుఁడు చంద్రద్యోతిహారాళి శం బరనాథుం డనిలుండు కుండలము లింపారం గిరీటంబు కి న్నరపాలుండు నొసంగి రవ్విభునకున్ మంజుక్రియాధుర్యులై• తే. గీ, జలనిధులు పొంగె దివిమ్రింగె సాధువాద మవనిసుర సౌఖ్యము పొసంగె సమముగ్రుంగె పుణ్యము లెసం గె విమతుల పొలుపుద్రుంగె రామభద్రుండు రాజ్యాభిరతి సహింప 12 89 252 253 254 255 256 257 90 ద్వితీయాశ్వాసము ఇవ్విధంబున రామచంద్రుడు సామంతమంత్రి పురోహితగోభూసుర సమూహానందసంధాయకుండగుచు లక్ష్మణ భరతశత్రుఘ్న హనుమత్సుగ్రీవప్రముఖా నుజసుహృత్రియజనంబుగొలువ పదునొకండు వేల యేండ్లు రాజ్యమ్ముఁ జేసి శ్రీమన్నా రాయణలక్షణలక్షితంబైన నిజరూపంబుధరియించి గరుడ వాహనారూఢుండై పరమ స్థానంబునకుం జనియె భూపల్ల భా ! ఇట్టి శ్రీరామచరిత్రంబు వల్మీక సంభవ ప్రోక్తం బునుగాయత్రీవర్ణాత్మకంబును నుభయలోక సౌఖ్య సంధాయకంబునునగుటం జేసి యి ప్పుణ్యచరితంబు భాగవతోత్తమునిచే నాకర్ణింపుచున్ గాల క్షేపంబు సేయుమని చెప్పి యప్పుడమిలేని నామంత్రితుం జేసి నిజేచ్చంజనియె నని చెప్పిన శిష్యప్రవరు లయ్యా చార్యుంజూచి యవ్వలివృత్తాంతం బెట్టిదని యడిగిన. మ. కం. జనక్మవరకన్యకాముఖసరోజూ తార్క 1 శక్రాదిదే ! వళి కాయాపదపాయ హేతుకర భాస్వచ్చండకోదండము కనిశాతాశుగ భిన్న దైత్య గళరక్త ప్లావితో గ్రాహవా పనిభాగా! మద నాగశూన్య ఘనవిద్వ ద్వేద్య తత్త్వోజ్జ్వలా ధీరజనోద్ధార ! మహో దారగుణాధార ! సారతర విద్యావి స్తార! సీతఖడ్గధారా దారిత మాద్యత్క బంధదై తేయక రా! మాలిని, శరవిహతవిరాధా! సద్ధితాత్మీయబోధా ! సురుచిరశుభదాయీ! శూరలో కాగ్రయాయీ! సరసిజదళ నేత్రా ! చంద్రబింబాభవక్త్ర ! ! సురహితజయభద్రా ! శోషితాం భస్సముద్రా ! 258 ! 259 వ ఇది శ్రీరామచంద్రకరుణానిరీక్షణసమాసాదిత కవితావి శేష 260 261 శేషా స్వయప్రదీపక వేంకటాచార్యకుమార రఘునాథక్యప్రణీతంబైన కుల శేఖరమహీ పాల చరిత్రంబను మహాప్రబంధంబునందు ద్వితీయాశ్వాసము. 262