Jump to content

కులశేఖర మహీపాల చరిత్రము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

కం. కులశేఖర మహీపాల చరిత్ర తృతీయాశ్వాసము శ్రీ జయకీర్త్యభిరామ ! మ హీజాప్రియకామ ! విమతహృద్భీమ! మహా తేజస్సీను ! జగద్దిత Q రాజద్గుణధామ ! రామరాజ లలామా ! 1 వ అవధరింపుము గురువర్యుండు శిష్యులంజూచి యవ్వలికత యిట్లని చెప్పందొడంగె. ఉ. సీ. కులశేఖరుని రామాయణ శ్రవణము ఆనృపవర్యుఁ డాఘనుని యానతిఁ గై కొని సద్గుణాన్వితున్ సూనుని యౌవరాజ్యపదశోభితుగా నొనరించి నిర్భరం డై నిజబుద్ధికిం గడుప్రియంబగు రామకథాసుధారసం బానుచు నుండెఁగర్ణముల నందొక వైష్ణవముఖ్యసన్నిధిన్. కౌశికువెంట రాఘవుఁడు కాల్నడ నేగె ననుచోట రథిఁ జేతుననితలంచు భార్గవుండొగి రాముపైఁ గిన్న నే తెంచె ననుచోటఁ దానెదుర్కొనఁ దలంచు కై కేయి జానకీకాంతుఁ గానలఁద్రోఁచె నను చోట మఱలింతునని తలంచు దశరథాత్మజుఁ డద్రితటుల నెక్క దొడంగె నను చోటఁ దా నె త్తికొనఁదలంచు దానె తే.గీ. వితత కారుత్సగుణ కథామృత రసైక పాఠకౌతుక విభ్రాంత భావుఁడగుట 2 3 92 తృతీయాశ్వాసము నమ్మహారాజు తలఁపులి టగలించుఁ కాలభేదమ్ము దెలియని కారణమున, తే. గీ, ఇత్తెఱంగున నవై ్వష్ణవో త్తముండు మ. కం. సంతతము దాశరథికథ జనవిభునకుఁ దెలుపు నెడ ఖరదూషణాది ప్రచండ సమరసన్న హన ప్రసంగము పొసంగె. అశనిధ్వాంతసమార్భటిన్" బ్రళయమేఘా కారి దేహుల్ చతు ర్దశసాహస్ర నిశాట వీరభటు లుద్యల్లీలఁ గొల్వన్ ఖర త్రిశిరోదూషణ ముఖ్యు లారఘుకుల శ్రేషన్ వెసన్ గెల్వ న శ్వశతాంగేభ పదాహత క్షితిరజస్సంఛన్న దిగ్భాగులై అని కతఁ జెప్పిన విని య జ్జనపతి తాత్కాలిక ప్రసంగం బనుచున్ గిని రఘువీరపద భా వన నాదవిన భక్తిపారవశ్యము కతనన్. అక్కట'ధర్మవత్సలుఁ డుదతిన్ దన దేవితోడఁ దా నొక్కరుఁ డేగుదేర రిపుయూథ మెది కెఁ గదా!భరంబగున్ గ్రక్కునఁ దోడ్పడంద'కు ననం గత చెప్పిన వైష్ణవుం డిదే మెక్కడ ! వచ్చెనంచు భయమెత్తి దిగుల్వడి చూచుచుండగన్. జౌ, చండక్రోథరసజ్వలజ్జ్వలన చంచద్విస్ఫులింగమ్ము లొం కొండన్ గన్గవ క్రేవల న్వెడల వత్యుగ్రాకృతిం దాల్చి మా ర్తండ ప్రక్రియనున్న రాజుఁగనునంతన్ మంత్రిసామంతు లా దండన్ నిల్వఁగఁజాల రైరి భయచింతా విస్మయ భ్రాంతు లై . వ ఇవ్విధంబున దృఢవ్రతతనయుండు సంగ్రామసంరంభ విజృంభితుండై ప్రయాణ భేరి వేయించిన. శ్రద్ధర, తలఁకొందెన్ ' భూరిభేరీధ్వని చెవి సొఅ దిగ్దంతు అత్యంత భీతికా గలుషీభూతంబులయ్యెన్ గడక జలనిధుల్ కంపమందెన్ మహాద్రుల్ 6 7 00 9 10 A ఉ. కుల శేఖర మహీపాల చరిత్ర 98 బలభిన్ముఖ్యామృతాంథఃప్రవరు లదటునన్ బల్కి రాశ్చర్య మంచున్ దలయూఁచెన్ ధాత రాజో త్తము రఘుపతి సద్భక్తి మెచ్చుల్ ఘటింపన్ . 11 వ అంత నమ్మహీవల్లభుండు. దిగ్గన లేచి వీర రసదీప్తముఖాంబుజుఁడై సరేశ్వరుం డగ్గలిక ధనుశ్శరగదాసి ముఖాయుధభీషణమ్ము స మ్యగ్గతిశోభితో త్తమహయాన్వితమై మణిమాలికావళిజ్ నిగ్గులు దేఱు తేతెదుట నిల్పిన సారథిఁ జూచి ప్రీతుఁడై . తదారోహణం బాచరించి. 12 13 14 వ. కం. సదమల తేజుఁడు రథహయ మ. మదకుంజర వీరభటసమాజము దన్నుం బొదివికొని నడువ నరిగె౯ మది రాఘవకార్యభర సమగ్రంబగుటక్. నిపుణాశ్వాఘ ఖురాగ్రధూత మగుచు గెంధూళి పై సోక వి ష్ణుపదీగాహన వాంఛ నేగుటయు వచ్చోఁ దద్రజోవ్యాప్తి త ద్విపరీతాకృతికి దొలంగి వెసనబ్ధిం జేరఁ దద్రేణుతో ణపయఃపూరము గ్రమ్మరం గని నగె నైమానిక వ్రాతముల్ . 15 16 వ. ఇవ్విధంబునఁ జతురంగబల పరీవృతుండై కోదండక శా ప్రచండభుజదండ మండితుండగు సిద్ధ రాఖండలుండు సీతావల్లభునకు సమరసాహాయ్యం నుద్యోగించు నవసరంబున, కం. అదియెల్లఁ జూచీ మంత్రులు తుది మొదలు నెఱుంగఁబడని దుష్కర కార్యం. బిది మానుప నెట్లగునని మది నాశ్చర్యమ్ము భయము మల్లడిగొనఁగన్. ఉ. ఎన్నటికై క యీవరము! లేన్నటి రాఘవరాజ్యవర్జనం ! బెన్నటి దండళోపగమ ! నెన్నటి తాపన వేషధారణం బొనరింప 17 18 94 తృతీయాశ్వాసము బెన్నటి రాక్షసీవికృతి యెన్నటివారు ఖరాది దానవుల్ నిన్నటి నేఁటి కార్యముగునే ! నృపుఁడేల యెఱుంగఁ డక్కటా! సంతతమున్ దిశాంతరని శాంతులు వైష్ణవు లేగుదెంచి యే చింతకుఁ దారయై మనలఁ జెంతలఁజేరగనీక రాజు నే కొంతక థావిచిత్రిత వికల్పములం గడు వెట్టిఁ జేసి హా! యెంతకుఁ దెచ్చి రయ్య లిఁక నెవ్వరికిన్ దరమే! మఱల్పఁగన్. తే.గీ. సచివు లిట్లు వితర్కించి సమయసముచి తా పులగు వారి నల్వుర నరసి తగిన కార్య మెఱిఁగించి పంచినఁ గడగివారు సైన్యములత్రోవఁ గేడించి చనిరి వేగ. సముదితశ్రమబిందుసరణి ముల్ చీరలు మేనులు మలకలై కనుపింపఁ గనయు బీజెండల కడిమిచేఁ గ్రాఁగు కన్ గనలు కెంజివురుల కరణిఁదనర రాలెడు వేణుపత్రములు గ్రమ్మినమ స్త కములఁ బుష్పరజమ్ము గ్రమ్ముకొనఁగఁ అ ట దొడిబడ నీరముల్ దూటి కొఱులఁ బెటు కట్టువల్వల సీరికలు నటింపఁ తే. గీ. జేరువల సాగువల వెంటఁ జేరి తిరిగి కం• దండకాటవి నందుండి తరలివచ్చి నట్లు మాయాపరిశ్రమం బలవరించి మనుజపతి చూడ్కి— నొదవి రమాత్యహితులు. డాయఁబిలిచి వారలతో నేయెడలందుండి విూర లీటవచ్చితి రి టాయాసపడుచు ననవుడు మాయికు లిట్లనిరి రాజమణికిఁ బ్రణతులై. 19 20 21 22 23 મચ కుల శేఖర మహీపాల చరిత్ర భూవర ! దండ కాటవుల పొంత ఘనౌషథు లుండునంచుఁ దేఁ బోవగ నందు బాహుబలభూషణుఁ దారఘువీరుఁ డుగ్ర త్యావళితో రణమ్మునకు నాయితమాటయు నేము చెంగటన్ గ్రావతటమ్మునన్ నిలిచి కల్గొనుచుండితి మద్భుతమ్ముగన్. తే.గీ. ఇనకులో త్తముఁ డసురుల నెల్లఁ దునిమె కం. నపుడు శోణిత వేణిక లడరఁజూచి వెఱచిపఱ తెంచినార ముర్వీత లేశ! యనుచుఁ జెప్పిన వేఱగింది యతఁడుపలికె. ఈగతి నొకరఘుపతియే నాగాశ్వభటోగ్ర దైత్యనాశ క్రీడా యోగోద్ధతుఁడై యెసఁగుట భోగీంద్రశయానుఁ డతఁడెపో ! యూహింపక్ . న ల చం. అనుటయు వార లానృపకులాగ్రణిఁ జూచి ఘూద్వహుండు ము న్నెనసిన బాల్య వేళ మిథిలేంద్రుని వీఁట న రేంద్రు లెల్ల ముఖ గినియు కపర్ది కార్ముకము కేలఁ దెముల్పఁగ నేగుచున్న చో జనకు సంశయంబెఱిఁగి సయ్యన గాధిసుతుండు నవ్వుచుకో. రమే బాలుం డీనర పాలసూనుఁడు ధనుర్భారం బతిస్ఫార మే లీల దీనిఁ గదల్ప నోపునొకొ యీ లేఁ జేత్ర సంచాత్మ ను య్యేలం బెట్టకు చండ భాను గహనాద్రీలా సముద్రేందు ది శ్పాలోద్యద్దుహిణాండ భాండమెగవైనం జూలు హేలాగతి. తే. అనుచు ముని ప్కు పలుకులు జనము లెల కతలుగాఁ జెప్పవిన మె! లోక ప్రచార మరసి రక్షించునట్టి మహానుభావుఁ డకట మనసాహ్య మతని కేమగు నృపాల! అని వారు పలుకుపలుకులు విని సంతప్తమంది సుభటవిసరము గొలువన్ 95 24 25 26 27 28 29 96 43 ఉ. తృతీయాశ్వాసము ట జని పురముసొచ్చి యచ్చట పనయస్థితి నుండె రాముచరితము వినుచున్. రాజ్యము సేయుచుండి యువరా జొకయించుక లేక లోభమున్ ద్యాజ్యము సేసి సత్త్వగుణధన్యత పెంపువహించి వైష్ణవ ప్రాజ్య సమాగమోత్సుకిత భావముచే నొగిఁ దత్ప దాబ్జముల్ పూజ్యములై దలిర్ప మణిభూషణముల్ మదిఁ గోరఁడేమియున్. మంత్రులు వైష్ణవో త్తమసమన్వితులై విలసిల్లు రాజునా మంత్రణ కార్యభాషణ సమర్ధన వేళ ఘటింపకున్న దు ర్మంత్రము బూని వాకిఁట నియంత్రితులైన భటాళితోడ వా క్తంత్రము మీఱ మీరు నృపుదండకుఁ జేరగనీకుఁ డయ్యలన్. వ అని నియమించి చనుటయు, మ. సరనాథుం గను వేడ్క వైష్ణవులు సన్నాహమ్ముతో దిక్కులన్ హరిదివ్యస్థల వానులౌట ఫలభక్ష్యవ్రాతముల్ చందనో 43 ఉ. త్కరముల్ జేర్చిన తీర్థవ ళ్లుభయహస్తమ్ముల్ వేసం గొంచు చె చ్చెర విచ్చేసిరి తీర్పగూడలు భుజశ్రేణిన్ విడంబింపఁగ. కావలివారు వారి లెడగా నేను రేగి మహాత్ములార!మా భూవరు నాజ్ఞ లేదిఁక ప్రభుప్రియవాదములాచరించి సం భావన బొందఁ గాల మొకభంగి నటించునే! వచ్చుత్రోవల • 30 $1 32 33 84 బోవుట కార్య మంచుఁ దమ మూర్ఖత వడ్డము వచ్చినిల్చిన 35 తే.గీ. అని నిరోధింప వార లన్యోన్యముఖ ని రీక్షణ మెలర్పఁ బ్రభదర్శ నేచ్ఛ యాత్మ సందడింపంగ శ్రీనివాసా ! యటంచు వేడ్కఁ గూర్చుండి రోగి బహిర్వేదిశలను. కం. మానవపతి తనకు నను హనసమయమగుట నిరుగడలు భాగవతుల్ గానబడ రనుచు మదిలో నూనిన సంతాపమున సముస్థితుఁ డగుచు. 36 37 కులశేఖర మహీపాల చరిత్ర 97 ఆ. వె. పాదచారి యగుచు భవనముల్ వెడలి త మ. కం. ద్వారభూమి గడచి ధరణిభర్త వెలయఁగాంచెఁ బార్శ్వ వేదులఁ గూర్చున్న భవ్యమూర్తులైన భాగవతుల, నృపముఖ్యుండు వేస౯ బ్రణామవినయ ప్రేమల్ విజృంభింప ఘ ర్మపయో లేశలసన్ముఖాంబుజుల సన్మానార్హుల నిష్ఠురా తప దేశ స్థితులై నివారిఁ గని చిత్తం బు తైలంబంద నే యపచారమ్ము ఘటిల్లెనో యనుచుఁ జింతాక్రాంతుఁడై యిట్లను . దాసుని యిలు ద్రొక్కక యేఁ జేసిన యపరాధ మెఱుఁగఁజెప్పక కరుణా భాసురహృదయులు మీ రా యాసపడదగునె యెండ నలమట దోఁపక్. తే, గీ. అనిన వారిట్టులనిరి మహాత్మ! నీకు నరయ నపచార మిసుమంతయైనఁ గలదె ! ద్వారపాలురు రాజాజ్ఞ దప్పదనుచు బలిమి మమ్ము నిరోధింప నిలువవలసి వ, అని తెలియంబలికిన. చండక్రోధరసానలప్రభలు చంచన్నే త్రకోణమ్ము లం దొండొండఱో వెడలంగ భూరమణుఁ డత్యుగ్రాకృతిం దాల్చి పే రెండ౯ ద్రోఁచిరి వైష్ణవో త్తముల మీ రీద్వారపాలాంధుల ఖండీభూతులఁ జేయుఁడంచుఁ బని చెక్ ఖడ్గాయుధోదగ్రులర్. తే.గీ. అనుచుఁ బనిచినఁ దలవరు అధిపునాజ్ఞ ద్వారపాలురఁ ద్రుంప నుద్ధతి వహింప నలదు వలదిట్టి కార్యమ్ము వసుమతీశ యనుచు శ్రీవైష్ణవో త్తము లడ్డపడిరి. 13 38 39 40 41 42 48 44 98 తృతీయాశ్వాసము ఇట్లామహాత్ములాని తిచ్చిన నుపశ మితక్రోధుండై సవినయంబుగా శ్రీవైష్ణవులం దోడుకొని నిజభవనంబునకుం జని ప్రియనచనపూర్వకంబుగా సంభా వితులం జేసి తదనంతరంబ. చం, అనవరతమ్ము రాజహృదయానుగతి బఠియించు వైష్ణవుం డనుపమ కార్యభారమున నందొక యూరికిఁ బోవుచుండి నం దను నృపసన్నిధీన్ ఘనకథాశ్రవణమ్ము ఘటింపఁబంప స య్యనముఁడు గోపనీయమని యాత్మ నెఱుంగక చెప్పెనంతయు. అక్కట రావణాసురుఁ డుదంచితమాయుఁడు రామలక్ష్మణుల్ గ్రక్కున మాయలేడి వెదుకుంజనునట్లు ఘటించి జానకిళా స్రుక్కక నెత్తికొంచుఁ జనుచోట జటాయువుఁ ద్రుంచి దుర్మదం బెక్క నిజప్రణాశగతి నిచ్చ నెఱుంగక నేగె లంకకు. 45 46 47 తే. అనిన నుల్కుచు నృపుడు సఖ్యాళిఁ జూచి వింటి రే! లోకమాత నుద్వృత్తిఁ దెచ్చి యసుర చెఱఁద్రోచె ననుట యేనితనిఁ ద్రుంచి సీతఁ దో డెచ్చి రఘురాముఁ జేర్పవలయు. కులశేఖరుఁడు రావణునిపై దండెత్తుట 48 వ. అనిపల్కి ప్రచండరోష కాపాయితలోచనుండ సచు మహనీయ జవోదేశహసితో చ్చైశ్రవంబగు నిజాశ్వంబు సన్నద్ధంబు జేసి తెచ్చినఁ దానునుం గట్టాయితంబై యతిఘోరధారాభిలంబైన కరవాలంబును గనకఔందసందోహ సముజ్జ్వలంబైన ఖేటకంబును ధరియించి తదారో' హణంబు సేయునవసరంబున. 49 ఇది పూర్వ కార్య ముర్వీశ ! యి ట్లేటికి పూర్వకార్య సీ. వేగిరపడ నంచు విప్రవరులు రామరావణచరిత్రంబు మున్నెఱుఁగ వె మఱువ నేమిటికంచు మంత్రివరులు కయ్యంబుసేయ నేగదలంచి యిది యేమి మముఁబిల్వవంచు సామంత వరులు సన్నాళ్ళకథయిది యి వ్వేళవైష్ణవుం డెక్కబెట్టినటంచు నితరజనులు కులశేఖర మహీపాల చరిత్ర తే.గీ. బహుజనంబిట్లు బహువిధ భాషణముల నలదువలదను ఘోషమ్ము వసుమతీశు కర్ణముల సోఁకదయ్యె రాఘవపదాబ్జ వర్ణనోల్లాస భాసురస్వాంతు: డగుట. మ. చం. తురగ క్రూరఖురాగ్ర ధూతధరణీ ధూళిచ్చటల్ గ్రమ్మి ది క్కరి గండోదిత దానబిందు చయ మింకన్ జండ బాహా విని పుర కాచేయకఘోరదీప్తి మదనిష్ఠ్యూతాహితవ్రాత దు స్తరగర్వాంధతమం ఒడంగ నృపరత్నంబేగె నుగ్రాకృతిన్ - వెనుకొని వచ్చు సైన్యములు విశ్రుతఘోష సముద్రతోయమున్ గని వెఱుగంది నిల్చిరతిగా ఢభయంకరరోష మొప్ప న జ్ఞానపతి చక్రపన్నగ ఝషప్రకర ప్రతిభోజగత్రయీ పనిత మహాబ్ధివీచికల పై ఁ బఱ పె" జటులా బఱపెజ్ శ జటులాశ్వరత్నమున్ . తే, గీ, అల రమా దేవి వై దేహియయ్యె నప్పు డెలమి శేషాహి లక్ష్మణాకృతి వహించే చక్రహస్తుండు రఘుకులస్వామియయ్యె వరుస నేతెంచి రామహీశ్వరుని ళం. వచ్చి నృపముఖ్యు భక్తికి చం. కడరు. న చ్చెరువడి చూచి మందహాసాననుఁడై మెచ్చు దళుకొ త్తఁ బలికె వి యచ్చరసంఘంబు ప్రేమ నభినందింపన్. రాజకుమార ! యేనురఘురాముఁడ రావణనామదైత్యు ఘో రాజి నెదిర్చి వానితనయా ప్తులతోడ వధించినాఁడ ను ద్వేజకమయ్యె వార్ధికి మదీయ శరోద్ధతి యింక సద్యశో భోజనమయ్యెఁ గార్యగతి భామినిఁ దోడ్కొనివచ్చితిం జుమీ ! ఎలమి మదీయభ క్తిభర మెల్లను నీవ వహించినాఁడ వీ జలనిధి నీఁటిపైఁ జనుట చాలు పురంబున కేగు వత్స శ్రీ నీ ! 99 50 51 52 54 55 100 తృతీయాశ్వాసము వలన సమస్తభాగ వతవర్గము కోర్కులు చెందుచుండు ని ర్మలగుణసంపదన్' భువనమాన్యచరిత్రుఁడ వెన్ని చూడఁగన్. తే.గీ. అవుడు తురగమ్ముడిగ్గి రాజాత్మజుండు హర్ష బాష్పమ్ము లెనగఁగ నమ్మహాత్ము చరణకంజాతముల వ్రాలె చటులమకుట గతమణిప్రభ తన్న ఖద్యుతులఁ బెరయ, To. కరములు మోడ్చుచుఁ బులకాం కురములు మైనిగుడ వినయగుణభూషితుఁ డ న్నరపతి రఘువల్లభు భా చం. క్షం. సుర సుందరమూ రిఁ జూచుచున్ వెసఁ బలికెన్ • I నిరుపమశీల! లోకజననిం జెఱ పెట్టిన దుష్టచిత్తు సో దరసుత బంధుమిత్ర సహితంబుగఁ ద్రుంచుట చోద్యమే ! భవ చ్ఛరనికరాగ్ని కీలము లెసంగినచో నిలువంగ మేరుమం దరగిరులై : నోపు నె నితాంతయశోబల భవ్యవైభవా ! రాజీవాహిభయంక రాబ్ధి చులుకప్రాయమ్ముగా దాటి ఘో రాజిన్ దానవరాజి రాజితమహోగ్రాస్త్రమ్ములం ద్రుంచి ది గ్రాజవ్రాతము వేడ్కఁజెంద భువనప్రఖ్యాతి వాటించి తౌ, రాజీవాక్ష! భవత్పదాబ్జములు హృద్రంగమ్మునస్ గొల్చెదన్. అనుచు విమలించు నృపతిన్' వినయానతవదను గౌరవింపుచుఁ బురికెన్ జనుమని యాజ్ఞ నొసఁగి య ద్దరు జాంతకుఁ జరిగె నాత్మధామంబునకున్, వ. 56 57 58 59 60 61 ఇప్పగిది నప్పర మేశ్వరుం డానతిచ్చిన నప్పుడమితేఁ డనన్య సాధారణ పరాక్రమోపక్రమ విదళితవిరోధి సైన్యంబగు నిజసైన్యంబుతోడఁ బురంబుప్రవే శించి సుఖంబుండె మఱియును, 62 కం. సీ. తే" సీ. ఈలీల నలరు ధరణీ కులశేఖర మహీపాల చరిత్ర నీళాదేవి యవతరించుట పాలాగ్రణి సతికి సత్యభాషిణికి వెసన్ నీళాదేవ్యంశంబున బాలామణి పుట్టె రుచికపాలాలకయై, నీశాభిధానయగు న బ్బాలిక విలసిల్లే ధవళపమైందవ రే ఖాలీలఁ బెరిగెనంత వి కౌలంబగు యావనావసర మే తెంచెన్. సంపూర్ణ శశిక ళాజాలంబు మెచ్చని ణ ముఖమున కొకవింత పొలుపు దోఁచే వికసితేందీవర ప్రకరమ్ము నోడించు కన్నుల కొకవింత కాంతి దనరె కలహంసకృతమందగమన మెంతనఁజూలు వడలయం దొక వింత నలు వెసం గ శుకపికాలాపని స్తులమాధురి కెదుర్చు పలుకుల కొక వింత చెలువు మిగిలె భ్రమరసందోహచక్రవాకముల గెలుచు కచకుచంబుల కొకవింత రచనకొడమె సరవి నవయన సౌందర్య సౌవనంబు వెలసె నవయౌవనాగమవేళ సతికి, కచము సారంగలోకంబుతోఁ జర్చింప గమనంబు సారంగగతులు గెలిచె నయనముల్ జలజబృందముల పైఁ దార్కొన్న కంఠంబు జలజసంఘముల గెలిచెం గటితటంబొగి రథాంగములతోఁ బురణింప ఘనకుచంబులు రథాంగములు గెలిచె రసవదోష్ఠము పద్మరాగంబుల హసింప కరములు పద్మరాగముల గెలిచె 101 63 64 65 102 తృతీయాశ్వాసము తే.గీ. నువిధ రుచిరాంగకంబులం దొకటికొకటి సొంపు రెట్టింప దీపించె సురసురాంగ నానికాయంబునం దిట్టి నవ్యరూప సంపద పొసంగునే యంచు జనులుపొగడు 66 వ, ఇ తెఱంగున సర్వాంగ సౌందర్యశోభితయగు నయ్యంగనారత్నంబు సఖిజనమ్ముల తోడనాడుచుఁ బితృసన్నిధానంబునం బుణ్యకథలు వినుచుఁ బ్రసిద్ధి వహించి యుండె నంత. కం. కం. రంగముననుండి వైష్ణవ పుంగవులు శమాదిగుణవిభూషిత చేత స్సంగు లొకకొందతానృప తిం గనుగొను వేడ్క నేగుదెంచిరి నెమ్మిన్. ఈరీతి నేగుదెంచిన వారల కెదు రేగి మ్రొక్కి వరమణీమయపీ ఠారూఢులఁ గావించి మీ హీరమణుఁడు పూజసేసె నెలమిదలిర్పన్". 67 68 69 వ. ఇవ్విధంబున నమ్మహానుభావుల సంభావించి తదనుజ్ఞ గా కొని తానును సమాసీనుండై సంభాషణమ్ములు నలుపుసమయంబున వారలతో శ్రీరంగవల్లభుని గుణరూప వైభవమ్ము లెటెట్టివనిస నగుచు నమ్మహాత్ము లిట్లనిరి. తే.గీ. విశ్వమునకెల్ల విభుఁడు తద్విభవ మెన్న నలవియే యింక నతని కల్యాణగుణము కం. లజున గెనను గణుతింపనగునె రూప గృహీమ యూహింప మన్మథమన్మథుండు. అని మఱియు హరిచరిత్రము జనపతికిం దెలుపుచున్న సమయమ్మునఁ దా విని నిశ్చయించె నీళా వన జేక్షణ విభుఁడు రంగవల్ల భుఁడనుచున్ , 70 71 72 కులశేఖర మహీపాల చరిత్ర 10% 3, ఇత్తెఱంచిన సన్నీ ళాంగన 'దిగపల్లభునెడం బొడమిన మోహాంకు రంబు దినదిన ప్రవర్ధమా నదిన ప్రవర్ధమానం బగుటయఁ 'బిల్లుకొను విరహశ్రమంబునన్ గుందు చున్నంత. చం• సవినయలీల పెంగపతిసన్నిధికిం జను దూరదేశభా గనతులు రాజకన్య గుణ గౌరవరూపవిలాస [కాంతి]సౌ ష్ఠవములు సారెసారెకుఁ బ్రసంగవశంబున నెన్న విన్న య న్న వనలినాథుఁ డా చెలి మనంబునఁగోరె బరిగ్రహింపఁగన్. హేయ భవవ్యపాయ య రసికేహిత దివ్యపదప్రదుండు ప ద్మాయతలోచనుండు సుగుణాంబుధి శౌరి, వధూవిమోహ చిం తాయుత చిత్తుఁడౌటకు ముదంబునఁ బొంగి యనంగుఁ డుబ్బుసన్ గో యని కేలుసాచె నును క్రొవ్విరికోలకుఁ బచ్చవింటికిన్ • వ. 78 74 75 ఇత్తెఱంగున రంగవల్లభుండు నీళాంగ నాపరిష్వంగ సముత్సుకాంత రంగుండై యున్న యెడ. ఉ. అంత వసంతం పెసఁగె సద్భుత సౌరభ లోభబంభరా క్రాంత చలల్ల తాంతము వికస్వ ర పద్మన ళిన్యు పొంతవి శ్రాంతమరాళ కాంతము రసాలకిసాల రసానుమోద సం భ్రాంత పీకావళీ మృదుతరస్వర భాసుర తానిశాంతమై, సహసాసముల్ల సత్సహకారమంజరీ పుంజమంజుల విభాభూషితమ్ము మల్లి కావల్లకీ మధుపతంత్రీ ఝంకృతి స్వనోత్సుక కిరాతీజనమ్ము దు స్యజా శాశుక త్రోటీతటత్పక్వ ఫలరసాపాత పంకిలతలమ్ము కలహంసమాలికాకులితపంకజ రజ శ్ఛన్న కాసారాంబు సౌరభంబు తే.గీ. సరసకిసలయ చర్వణోత్సాహ కలిత వితత కోకిల కాకలీ సితఖలీన 76 77 104 తృతీయాశ్వాసము కర్షణకుబ్జ విముఖత గమనసాంధ a సైంధవము మధుమాసవాసరము దన రె. పశ్యజ్ఙ నేను భావ్యంబులై కేసరంబులఁ నేనుభావ్యంబు దగు కేసరంబులకును ప్రచలత్సరోజకై రవమందిరమ్ములై సరసులకింపైన సరసులకును లలితవిచిత్రపల్లవశోభి సుమరమా కందమ్ములైన మాకందములకు మధుపానమదలీన మధుర వాగ మరీ కదంబంబులైన కదంబములకు తే ఓ పనసజంబూ శిరీష చందన మధూక మాలతీకుంద కురవక మల్లి కొది తరులతాగుల్మతతులకు సిరి దనర్చె మాధవోత్సాహశక్తికి మాఱుగలదె ! 78 79 వ. ఇవ్విధమ్మున మధుసమయ ప్రేరితమ్ములై పల్ల వకుసుమ ఫల విలసితంబు లగు మాకందమధూక కేతకీవకుళ చంపక శిరీష మాలతీ కదంబజంబూమాధవమన్మథ మల్లి శాప్రభృతి సకలమహీరుహ శోభితారామంబులు లోచనాభిరామంబులై యొప్పు చున్నంత. శం. భూవరకస్యక రంగ మ్మివల్లభు వలన విరహసంభూతవిచా రావిలమానస యగుతఱి భావించి వధూజనమ్ము భయళంకితమై కం. మును రంగస్వామి పయికో జనియించిన మమతకతన సంచలితమనో వనజ యగుచున్న యది చెలి వన కేళి బ్రొద్దు గడపవలయున్ మనకుకో, 80 81 82 కులశేఖర మహీపాల చరిత్ర 105 వ అని తలంచి యన్నెలంత యలంత బావుటకు సఖీజగంబు లుద్యాన వనంబునకుఁదోడ్కొనిచన నుద్యోగించు నప్పుడు. కం. ప్రాలంబాలంబిత కుచ రోలంబాలక విడంబరుచిరకరలస త్కోలంబకనీలాంబక నీళాంబుజవదన కదలె నెచ్చెలు లలరన్'. 83 వ. ఇవ్విధంబున సభీ పరివార పరివృతయై మందగమన యారామసమీ పంబునకుం జను నెడ. సీ. వనవిహారము చరమ కందలకౌంతమ్ముల దొంతులు దొరలంగఁ ద్రోఁచిత్రోఁచి సరససారసనిక స్వరకుడుంగంబుల పత్రములో గదలంగఁ బ్రాఁకిప్రాణి రమణీయక నక వర్ణ ప్రకాశములైన పుప్పొడుల్ మెయినిండఁ బొరలిపొరలి వాసంతి కాల తావ్రజకీలితమ్ములై యొనరు నుయ్యెల లెక్కి యూఁగియూఁగి తే.గీ. కదలిఁ గదలించి విరజాజిపొదలఁ బొదలి కం. సీ. కీచకమ్ముల మొదయించి కేకితతులు గరులు చెదరించి భ్రమ సఖ్యము వహించి పవనడింభకుఁ డెదురేగె పద్మముఖికి. మలయానిలాంకురము పై నొలసిన మదిసంచలింప యువతీమణి నె చ్చెలులఁగని పలికెఁ గేవల విలసిల్లెడు తరులఁ జూచి విస్మయమొసఁగన్. కౌసుంభవసన యోగ ప్రకాశములయ్యె సవి మన్మథుని తేరుల టె మృగాక్షి రచిత రేఖావిచిత్రమ్ములై దీపించె నవీ మారునిపతాకల శుభాంగి 85 86 87 14 106 తృతీయాశ్వాసము నవ హేమరుచిర భాండవిభూషితములయ్యె నవి కంతుని హయమ్ముల టె సుమధ్య నీలగండశిలావిశాలమ్ములై యొప్పె నవి దర్ప కేభమ్ముల ఒ సుదోష్ఠి తే. గీ యనిన సఖు లింతి నీక్షించి యవియనూన కింశుకము లవికుసుమిత కేసరమ్ము సీ. లవిసువితచంపకములు పల విత గురుత మాలభూజమ్ములల్లవి మధుర వాణి ! మఱియు నిట్లనిరి. పున్నాగసదయానుభూతి గోరెడు నీకు పున్నాగసంగ్రహస్ఫురణ వలదె సహకార ఫల పరీక్షణ మెఱింగిన నీకు సహకార ఫలపరీక్షణము వలదె ప్రియకాంత సుమనో నువృత్తిగాంచిన నీకు ప్రియకాంత సుమనోనువృత్తి వలదె బంధుజీవక గుణ ప్రతిభగాంచిన నీకు బంధుజీవక సౌరభంబువలదె ! తే.గీ. సమదమధుక ఠశుక పిక సముదయముల మ డిందుపఱచుట కిదిముందు కుందరదన సూన ఫలపల్ల వమ్ములఁ జాఱగొంద మనుచు వన కేళి సలిపి రయ్యజ్ఞముఖులు. ఒక నారీమణి మల్లిశాసుమములన్ యోజించి రాజన్యక దోయిఁట నించినన్ గరతలోద్యద్రాగ మేపారఁ గిం న్యకకున్ శుక సూస భ్రమ నింతి నీ కతగునంచున్ ద్రోయఁ గాంతల్ పకా నక నవ్వన్ వీరు లేని త్రుంతు ననుచున్ భాషించె రోషమ్మునన్ . తే.గీ. సుదతి విరు లీవుగోయఁ బయ్యెద తొలంగి బాలనీ లాహి గతి నాఱు బయలువడియె .88 89 90 91 కులశేఖర మహీపాల చరిత్ర కొమ్మ పయినున్న గొమ్మి కల్గెనక మున్న క్రమ్ముకొనవమ్మ సరిగ ఔఱందు దిగిచి. తే, గీ అలరుఁ దేనెలు తేంట కాహారమగుట కొమ్మ విరిగొమ్మ కదలింపకమ్మ కమ్మ విలుతుఁ బిలువంగ షట్పదకులము గినుక కదలె నరమించు పసులకుఁ గరుణకలదె ? తే. గీ, అకట కర్ణావతంసమ్మునకు రసాల వల్లవముద్రుంప నాయాసపడకుమమ్మ ! చెన్ను దళుకొత్తు చివురునఁ జివురుకోయ వశమె ! యేఁద్రుంచియిచ్చెద వనిత నీకు . Y3 తే. సీ. వకుళముయ నందు ఖగ వర్గము లిట్టటు బాఱఁ దగ్గరు త్ప్రకటితమారుతాహతులు రాలిన పుప్పొడి మేనసోక ద ర్పకనశతన్ దుపాసలము పైఁబడినట్లు వణుకుచున్న య మ్ముకురనిభాననం బొదివి ముద్దియ లూఱడిలంగఁ బల్కుచున్, ఇది యదనుగాగ నీయెడఁ గుదుఱుపఱచి మదనుఁ డదయత పూముల్కు లొదవఁ జేయ బెదరుకొని నీవు మెదలు తుమ్మెదల రొదలఁ బొదలు పొద లేలదూలెదు మృదుల వేణి ! వనిత పుప్పొడి( ద్రొక్కి నగ చెదు విరిఁదేనె మడు వల్లయదియె కాల్గడుగవమ్మ శుక మోహబింబమ్ముఁ జూడ భీతిలకు మి చ్చటు సంకుసౌగంధ్య జటిలమమ్మ తుమ్మెదల్ నెమ్మోముదమ్మిఁ బై కొను చింత దలఁగి సంపగివిరుల్ దాల్పవన్ము మలయానిలమ్ము పై నోలయు నంచడలకు వేణికాఫణి డాయ వెఱచునమ్మ 10% 92 98 94 95 96 108 తృతీయాశ్వాసము శే. గీ, కొమ్మ యీలీల వెతనందకమ్మ రంగ వల్లభునిఁ గూడి బహు కేళిపై భవముల నెలమి వాటింప నీశుక పికంబు మదనకుముదా ప్తు లా ప్తులయ్యెదరు నీకు, మ అనిన వారలతో రాజకన్య యిట్లనియె, 8. అతివ వని నేనఁగె విరహుల సతనుం డేచుటకు చేయు ననలా, మతిఁ గుందనగునె జ్యోతి బుల్ రతల ద్యుతులనుచుఁ దెలియరాదె మ్మగా ! తే.గీ. ఉవిద చెంగట వమిచ్చె నొకపికమ్ము చెవికిఁ జేదయ్యె నిక నేమి సేయుదాన కాదుకాదమ్మ మనకలకంఠి యొక తే పంచమస్వరగతి పాటపాడఁ దొడఁ గె. 97 98 99 100 న ఇట్లు నారీశిరోమణి నూఱడింపుచు సఖులెల్లఁ గుసుమాపచయ కుతూహలంబునం జరియించుచున్న యెడ. సీ. చెలియోరు దాడిమీఫల కాంక్షఁ బఱ తెంచు శుకములఁ దోల నొండొకతె గొనియె 'వెలఁదియొక న కోకిలసూ కులకు మాఱు క్తు పలుకంగ సరియంచుఁబలికె నొక తె సకియ యొక్క తె సూన శాఖ పంపక మున్న జూచితినని కోయఁజూచె నొక తె వనితయొక్క తె హంస వెను వెంట గతిఁజూప నొప్పుగాదనుచు నొండొక తె నడచె తే.గీ. మఱియు రుచిరక్రియ వచోమహిమ మిగుల సరవిఁ బుష్పాపచయ కళాచతురగతులు భామినులు కాలయాపన్న పొడి సలుప నీళ సొలయుచు నొకమా వినీడ నిలిచె 101 102 కులశేఖర మహీపాల చరిత్ర తే.గీ. కలికి యొక్క తెగడు వేడ్కఁ గరము లె తి ధరణిఁ జరణాగ్రముల నూఁది వీరులుగోయ కుచసరోరుహరోశమి:ల్ కొండలయ్యె గౌను వీక్షింప నదియొక గగనమయ్యె . 109 103 వ. ఇవ్విధమ్మున బహువిధవిహారపరిశ్రాంతలు నన్నెలంత లక్కాంతా మణిం దోడ్కొని నిశిజాతపక్లాంత మ్ములగు శరీరంబులు లగుటయు జలావగాహంబు గోరుచుం బోవుచున్న యెడ. మధుపాసవదనూన మండలీనసదలీన పదసూన మృదుగాన బంధురమ్ము తతకూ 'జ తమాలతతి ఖేలదతి వేల ప్రతగాలపిత జాల భాసురమ్ము స్మశాతశరపాత సరిభూతనర జాత విరహాతపరయేత భరహరమ్ము రసనాగ బిసపూగ కిసభాగరసభోగ రసికాగతసరాగ రాజహంస తే.గీ. మనుల కెరవకమల గంధానుబంధ మలయ మరుదంకురాగమోన్మాద చరిత ప్రాథసందోహమగు సరి ప్రవర మొకటి యా సొంతల కచ్చోటఁ గానబడియె. కం. మ. చని సంతసించి శశిముఖు లొనరఁగ నొండొరుల కరతలూఁదుముఁజని లన పదములిడుచు శీతల వనజాకర జలవిగాహ నశమతు లగుచున్ స్వేదోద్గమా క్రాంతంబు 104 అతులాంభోజ విరాజమాన సరసీతో సావళిం గేరి య య్యతినల్ నీరమునం జరింపగఁ దదీయాం మ్ము లుత్తుంగ దీ ప్రతటీ స్ఫాటిక రత్ని బింబితములై భాసిల్లె లాస్యైక మ్మృతిలీల బ్రతినిదిపైఁ బసిఁడిబొమ్మలో వోలె శోభిల్లుచున్ . లా స 105 106 107 110 తే. తృతీయాశ్వాసము ఆమందయానల హాసస్వరమ్ములు బెరయ హంసమ్ములు బెదరిన చె నాఘన స్తనుల బౌహాగ్రవిక్షేపముల్ కనుగొని చక్రవాకములు బెదరె నా చంచలాక్షుల యంఘ్రవిన్యాసార్భ టులకుఁ బాధీనమ్ము లలవుదరి గె యానీలక చల యాహ్వానధ్వనులు బర్వి నెరిఁ బాసి భృంగముల్ నింగికెగసె రాజవదనల చల్లుపోరాట వేళ వనజబృందమ్ము లొకవంక వ్రాఁదొడఁగె నొకటిచే మున్న మోటరియున్న వాని రెండవవి కొన్ని పొడువంగ గుండె చెడదె. డాయుచుఁ బాయుచుం గరపుటమ్ములు సాచుచు వారిపూరమ్మున్ ల దోయజలోచనల్ చలముతో నితరేతరవక్త్రబింబ ఔ్యయతదృష్టిఁ జిమ్ముచు సహాసవచోరచనల్ జెలంగ నీ రాయతనమ్మునం దరగలాడవు త తటఘట్టితమ్ములై . శా. స్తుత్యశ్రీలగు మేనులం దొరగి కస్తూరీమిళత్కుంకును ప్రత్యుప్తాగురు పంక సంకర హరిద్రాచూర్ణముల్ గ్రమ్మి సాం గత్యం బేర్పడఁ జిత్రవర్ణములచేఁ గాసార మొప్పారుచో వాత్యుక్షిం జల కేళిసల్పె నబలావర్గం బుదగ్రమ్ముగన్. తే. పద్మమండమ్ము లందొక్క పంకజాక్షి మునిగి మోమెత్తియున్న చో ముగుద లెల్ల కం. కని వదనమంచు నదిగాదు కమలమనుచు నిశ్చయింపంగఁజూలక నిలిచి రపుడు. మీను తోడఁదగిలి యులికెడు మానిని వెరుచఱచి వెరపుమాన్పుచు నొకప ద్మానన గంతులువై చేను దీనతఁ ధనకాలు నాచుదీవఁ దగిలినన్, 108 109 110 111 112 తే. తే. များ grad తే, చం. కుల శేఖర మహీపాల చరిత్ర అంచలు చక్రవాకము లుంచిత గుంజదళి ప్రసంగముల్ కాంచనసన్ని భాబ్దములు గాంచి మనోజుఁడు మెచ్చు రచ్చవ ట్టంచుఁ దలంచి చిత్తమురియాడగ నీరవిహాకలీలోఁ జా లించి సరోవరమ్ము వెడలెన్ నరపాలకుమారి గ్రక్కునన్. నెచ్చెలులు రాజకన్యక నెమ్మనమున వెఱపుమిగులుట దెలిసి వెన్వెంటఁ గొలను కతస్థలి వెడలి తట సెకతసలి నిడినమడుగు తెలంచాలిచి రెంతయుఁ జెలువుమిగుల, అప్పు డతివలు నెరులార్చి కొప్పు దీర్చి తిలక మలికమ్మున రచించి కలపములఁది క్షితిత లేశ్వరుకన్య, గై సేసి రెలమి చెలిమి నొకయింతి పూబంతిచేతి కిచ్చె. విరహపరితా సభరమున వివశ యగుచు సొలసి తూగాడుచున్న యన్నెలఁతఁ జూచి లలితమగు నిందు కాంతశిలావితర్ది నొనరు కిసలయశయ్యపై నునిచిరంత. సూర్యా స్తమయవర్ణనము వనధిలుత తరంగముల వ్రాలుటకున్' వెఱపగ్గలించినన్ దనదు మయూఖవార మొకదారిఁ జనన్ బెడఁగైన మేనఁదా ర్కొనిన వివర్ణవృత్తికి మఱుంగుగ శోణపటంబు దా వహిం చినగతి రక్తదీ ప్తిఁ బొలిచినవి పశ్చిమ శైల సంగతి. చరమాద్రి తటనటచ్చబరార్భకులు చిమ్ము చిచ్చురకొమ్ముల జిగి యనంగ హరు లబ్దిపొరమి మల్లాడు కుంటెనకుఁ దో డ్పడవచ్చు ఖగ విభుప్రభ యనంగ దళితమం దేహకంధర నుద్గమించి మి న్నొ రసిన శోణితద్యుతు లనంగ నినుఁబాసి వగచు పద్మినుల కేఁగన్నుల మితిమించు కోణదీధితులనంగ lii 113 114 115 116 117 112 తృతీయాశ్వాసము తే, గీ, రవిరథాపక్ర చక్రచంక్రమణ జనిత రవసము ది క్త కోపనిర్యద్భుజంగ బహుఫణారత్న భవ కాంతి పటలము న్యగ సాంద్ర సంఖ్యారుణచ్ఛవిచ్ఛటలు దన . కం. మ. ఏదిశలను రవిసింహము రె. ప్రోఁదిస్ బరికించి పిఠపఁగ్రుంకినఁ గని స మ్మోదంబునఁ బొంగి తమో వేదండ శ్రేణి గుహలు వెడలెజ్ బెలు చ. ప్రమదంబ:ది తమిస్రయోషిదలక వ్రాతమ్ములన్ మెచ్చి దం ష్టి మహిష్యాదులఁ బ్రోది చేసి గజరాజిన్ గౌఁగిటం జేర్చి కా కమయూరీగళకోకిలమ్ములకు సాంగత్యమ్ము వాటించి గ ర్వమణం చెన్ ఒక శంఖహంసహరి జీవంజీవజాతమ్ములన్, తే.గీ. జారచోరుల రాత్రిప్రచార మెఱిఁగి మూక ఫల్గునికాదు లాగుణము గాంచె జాతి వేఱయ్యు మనుజ భాషణము లెఱిఁగి శౌరికలు మాఱుపలుకుట సాక్షిగాదె! తే. గీ, వసుధ విహరించు రాత్రిదేవతకుఁ బ్రీతి సత్కృతియొనర్పఁ దలంచి దికృతులు వేడ్కఁ దనర బహుపుష్పములు మేన నునిచినటు దివి బహుగ్రహతారకల్ తేజరిల్లె, చం. చం• 553 0 ఇనుఁ డతిరక్తి మున్ను దను నేర్పడఁ జెంది యతిక్రమించి వం చన నపరాశఁగూడి మది చంచలతం జనఁజు చి ప్రాద్దిశాం గన నగినకా రదద్యుతులు గ్రమ్మిసకై వడిఁ దేజరిల్లెఁ గా ర్కొను పెనుఁజీఁకటుల్ విరియఁ గొంత సుధాకరదీ ప్తి తూర్పున . హరుసిగబొందు పద్మనిచయమ్మున కెత్తినమచ్చుమందు మే లరసిఘటించు కల్వలకు నబ్బినవిందు పయఃపయోధిపు 118 119 120 121 122 123 సీ. కులశేఖర మహీపాల చరిత్ర ష్కరములు పుష్కరంబెనయఁ గాంచినకందు జగమ్ముమెచ్చఁ జిం దరుఁ డుదయించెలేటి చెలి తోడుగఁ దూఱుపుకొండ కొప్పున. కలశాబ్ధిసుతు తనుగ్గాని పోఁగడుగుచో ధరకుడిగిన సుధాధారలనఁగ శశిరథోద్ధతిఁ బూర్వ శైలద్రుమంబులు సుడియ వీడిన విరిపోవలనఁగ పతిఁజూచి రోహిణీప్రభృతు లబ్బునఁదాల కొలఁకులంటని హారగుళికల సఁగ 'జు తామసగర్వరాహిత్య మొనరింపఁ బేర్మిఁజూపిన వెండిబెత్తులనఁగ తే, గీ. హరజటా పేటి విధుసఖ్య మమరెఁ దొలుత నాకసమ్మున నిపుడబ్బెననుచు గంగ పొంగఁ జదలేటి నవ ఫేన పుంజ మనఁగఁ జంద్రికలువ్రాలె ధాత్రి ని స్తంద్రగతిని. చం. పనవుచుజక్కవల్ జతలఁ బాసి చరించే చకోరకమ్ము క మ్మని కడిగాంచే పంక జసమాజ మొగిక్ ముకుళించె పాంథభం జనపరుఁడై మరుండు శరచాపము లోలిధరించెఁ బిండిచ ల్లినగతి వెన్నెలల్ఱఁతలేక జగమ్ముల నిండియుండఁగన్, అర్ధేందునిభలలాటాంతరమ్మునదిద్ది తీర్చిన కస్తూరీతిలక మనఁగ జిలుగుబంగరు శాలు జిగిఁజిందు మౌళిపై ఁ బికిలికుచ్చులదండ పెంపుఁజూప సరసచందనచర్చ సమకొన్న యురమున సిరిగాంచు ముత్యాలసరులు గదల సొరిది నెన్నడుమునఁ జుట్టినధట్టి చె ఱంగు లిర్వంకలరంగుఁ జూప తే, గీ, శారికాకోకిలాళీ మయూరభటులు దండ నేతేర నిక్షుకోదండకుసుమ 15 118 124 125 126 114 తృతీయా శ్వాసము కాండములు బూని శుకతురంగంబు నెక్కి విరహిమృగముల వేటాడవెడలె మరుడు. తే, గీ, మలయపవనమ్ముడాయ వెన్నెలలుగాయ భృంగసంఘమ్ము రొదసేయఁ బికముగూయ తుంటవిలుదంట క్రొవ్విరితూఁపు లేయ సక్రియ సుమశయ్యఁ గనుముయ్యఁ జాలదయ్యె. మన్మధాద్యుపాలంభము మ. వ ఇట్లయ్యింతి మదన తాపమ్మునం బొరలుచు సఖులంజూచి, మునుభర్గుండు లలాటకీలల మరుస్ బోకార్చియున్ గ్రమ్మరన్ దనకు జాలినయంత భిక్ష.మిడ రీతన్వంగులం చల్క నం గనలం జంపుటకై యనంగునకు సంగశ్రేణిఁ గల్పించి పం చెనౌ ! కాదేని ధనుస్సుమాస్త్ర చయ మేచేత విడంబిం చెడుజు. స్త్రచయ అని పరిశ్రాంతిం బల్కిన. కం. నీలాలకజాల గుణా వాల మహీపాల బాల వగ పెఱిఁగి సఖుల్ దూలుచు శైత్యవిధానము లోలిం గావింప నప్పుడొక సఖి పలికె౯. . మలయానిలాహతాకులమైన చెలిమేనఁ జందనసలిలమ్ము చల్ల వలదు కుముద బాంధవ రుచిషుభితమౌ నురమున మనసార రేణువుల్ గ్రమ్మవలదు రతిరాజతాప లోహితములై తగు నేత్ర ములఁ బద్మపత్రముల్ మొనుపవలదు వరపిక స్వరభీతిఁ బొరలుచోఁ బఱపునం జూతపల్లవములు చొనుపవలదు తే.గీ. తజ్ఞనిత్వమ్ము తన్నామధారణమ్ము తచ్ఛరత్వమ్ము తత్త్రియత్వమ్ము నెఱిఁగి సేయు శిశిరోపచారముల్ చెలికిఁదగు నె పగఱకూరిమిగలవారు పగటి కారె ! 127 128 129 180 131 132 133 కులశేఖర మహీపాల చరిత్ర 115 హ. త్తెఱంగున నత్తెఱవ మనస్తాపమ్మునకు ను తలంపడు చిత్తమ్ము లతోఁ దరుణకిరణప్రసారవిజృంభితుండగు సుధాకరుంజూచి సరోష భాషణమ్ముల నిట్లనిరి. సీ. అతి వేలగుణగణోన్న తుఁడైన శంకరు శిరముద్రొక్కిన దుష్ట చేష్టితమ్ము తొలుత దివ్యుల కాత్మకళలు దానమొసంగి క్రమ్మఱఁగైకొన్న కల్మషమ్ము నతులవిద్యా ప్రదుండగు దేవతాచార్యు నీల్లాలిఁ గవసిన హీనవృత్తి 533 నీనామముధరించి నెమ్మి వాటించిన శిలల నీరుగఁ జేయు చెట్టతనము తే.గీ. కాని పనులిన్ని ఁటికిఁ దలకట్టు తోడు బుట్టువున్న ట్టియిల్ల రికటుకొనుట మానినీమణి నేచక మానఁగలవె ! 134 కలుషమూలమ్ము నీదారి కమలవైరి. సీ. హంసాదిఖగముల కానంద మొనరించి శోకమిచ్చెదు చక్రవాకములకు కుముద ముఖ్య ప్రసూనములకు సిరులిచ్చి కుందొసం గెదు పద్మబృందములకు బహుశైలపంక్తులపై నింపువాటించి కరపు దెచ్చితి తి విందుకాంతములకు యువతీజనమ్ముల నుల్లసిల్లఁగఁజేసి వెతలేర్పఱించెదు విరహిణులకు తే.గీ. పక్షపాతేచ్చ నీకిట్లు ప్రాప్తమైన కళలకును బక్షపాతసంగతి పొసంగె రాజ వే ! నీవు ధరణిఁ గారణగుణములు కార్యగుణముల కారంభకములుగావె ! 135 136 116 తృతీయాశ్వాసము చం. అమృతము కాలకూటము సుధాంబుధియందు జనించే నట్టిచం దమున్న నీవునుం బొడమినాఁడవు నీకు హలాహలస్వభా పము దిరమయ్యె నయ్యమృత వై ఖరి యించుక లేదు భామినీ శ్రమకృతకల్మషం బొకటి చాలదె నిన్నుఁ గృశాం' సేయఁగన్, ఉ, రోహిణి మున్నుగా సతులు రూఢినొనర్చిన సువ్రతమ్ములన్ రాహుముఖమ్మునన్ వెడలిరాఁగలిగె విరహాంగ నాజన ద్రోహము నిన్ను నబ్ధిఁబడద్రోయదె ! మేన కృశింపకు న్నె సాహసవృత్తి మానుమిది సౌఖ్యకరంబగునే సుధాకరా ! సీ. రాజవై నినుగన్న రత్నాకరము నేచు బడబాగ్ని నుడుపని వెడఁగుదనము డాయఁజీఱిన మాత్రదాయకై వడి భర్గు తల కెక్కి నిలిచిన తులువతనము చిఱులేటిఁ గొని నేలఁ జెంగలిఁ దిననీక వినువీధి నడ్డ పెట్టిన భవమ్ము వితతవిద్యాసమన్వితుఁ జేయు నాచార్యు సీమంతినీమణిఁ జెందునఘము తే.గీ. కందుకొను నీకు బహుళపక్షక్షయ ప్ర సక్తి వాటించి విదలింపఁజాల వమృత కిరణభరణమ్ము భవదీయశరణమగుట. మ. చం•

! గగనమ్మెక్కటి నెక్కి రాతిరిపగల్' గావింపఁ దాపంబునన్ మగువల్ కుయ్యిడ ధాత నీదు కళలక్ మార్చెజ్ సుధావా ప్తిచే నెగవారం డిగవారఁ గొంతకుశలం బీలీలఁ బూర్ఖుండ వై జగతి౯ జాలయిన౯ గరం చెదవు మాశక్యమ్మె జై వాత్మకా ! కలఁగక బాడబంబు నిజగర్భమునందిడుకొన్న తోయఫిక్ గళగళఁ బొంగగాఁ గముచుకాఁకల గొన్నమవై హళహళిక్ హలహల మట్టిణంచు హరునౌదల నెక్కి మహావిషంబ వై నెలకొను నీకు నివ్విరహిణీవధ దుష్కరమా ! కళానిధీ ! 187 138 1839 140 141 కుల శేఖర మహీపాల చరిత్ర ఉ. తమ్ముల చేనఁ జెక్కి గురుతల్ప సుఖమ్మున జొక్కి యాత్మకాం తమ్ముల నీఁటఁద్రొక్కి జడదారి శిరమ్మన నెక్కి పాంథజా తమ్ములమీఁద నిక్కి క్షణదావిహృతిం బుయిలోటదక్కి చి త్తమ్ముల నుక్కి వుండనక తజ్ఞులుదూతన విక్కె దే! శశీ ! కం. హరిణేక్షణ లి తెఱఁగున చం. సీ. సరసీరుహవైరి దూరి సఖి వేత గిని ని ష, రుణాత్ముఁ డనుచుఁగ్రమ్మఱ మరు నుద్దేశించి కుసితమానస లగుచు, 117 142 143 మయూరము ! మదన ! తురంగమా శుకము ! మంగళకాహళమా న్మదకరిబృందమా పికసమాజము ! చంద్రసమీరులా ఫులా ! ప్రదరములా సుమమ్ములు! శరాసనమైక్షవమా ! మృదుత్వసం పద లీటుగల్గియు సతుల పాలిటి బూతమ వైతి వక్కటా ! మధుప సంపదగుణప్రధితుండవగు నీకు 144 సరసధర్మగ్రహోత్సాహమేల ! జడచారసాహ్యలక్షణశాలినగు నీకు సన్మార్గవిహరణశ్రాంతి యేల! రజనీచరత్వదౌర్జన్యమ్ముగల నీకు మాధవాశ్రయణసంబంధ మేల! కృతపద్మినీచయాహితవృత్తివగు నీకు శుక వచఃపరిచయౌత్సుక్య మేల తే, గీ బాలికాచి త్త దుస్సహాభీల కీలి కీల జాలోపమోదగ్ర కేళి సలుప శరములేను ధరించే దుత్సాహమేసఁగ శరమెఱుంగవు దుశ్చారి శంబరారి ! చం. అనుపము సౌరభమ్మున సుమాళి జగత్త్రియ మాచరించి పే ర్చిన సుమనోభిధానమునఁ జేర్ను దలిర్ప సగంధవృత్తి స య్యన భవదీయసాధనములై కుసుమాహ్వయమంది డిందె దు ర్జనసహవాస మీక్రియఁబొసంగిన వన్నెయువాని గ్రుంగదే! 145 146 118 తృతీయాశ్వాసము నల్లవశ్రీ నోటుపఱుపఁ జూచెద వేనీఁ బల్లవశ్రీ నోటుపఱుప లేమె ! మల్లీలతాంతమ్ము మఱల నే సెద వేని మల్లీలతాంతమ్మె మనుపలేమె ! యజ్ఞమ్ముచేఁబూని యరమఁజూ చెద వేని వదనాబరోచులఁ బొదువలేమె ! కువలయంబని యేము దివుర నేసెదవేని కువలయ౦బనియేము దివుర లేమె తే, గీ, నీవశోకమ్ముగొని యుగ్రనియతిఁ బూన నీవ శోకమ్ముగొనధాటి నెరపలేమె మార్గణములిట్లు వమ్మైన మార్గణములు పరిహసింతురు నినుఁజూచి పంచబాణ : ఉ. తాలిమి చూఁబోవఁ బరితాపము గూర్చెదు మానసమ్మునన్ బాలిశుఁ డేనియున్ దనదుపట్టు దహించునె! నిన్ను దూఱగా నేల భవచ్ఛరీర మొగి నీశుని మిక్కిలికంటి మంట చేఁ గ్రాలకకాటన్ గొఱవికై వడి వేడిమి సూపకుండు నే ఘోరం బగు కుసుమశరా సారమ్మునఁ గప్పి ధైర్యసారము దప్పన్ . బోరుడుగ వక్కటకటా ! మారుఁడనయ్యెదవొ మాకుమారుఁడవయ్యున్, , మానిని, ఫాలవిలోచనలోచనరోచుల భస్మమయంబై మేనొకటన్ సోలకవ్రాలక గాలిపిశాచము చొప్పున గుప్పునఁ గొందలిరుం గోలల గోలల నేయుచు డాయుచుఁ గోలుమసంగి యెసంగెడు నీ శీలము జాలము గాంచిన ప్రాంచులు చెట్టని తిట్టరె భావభవా ! 'తే. అనుచునొక్కట మీన కేతనుని రోష భాషణమ్ముల నిరసించి భయదలీల నెమ్మి నేతెంచు దక్షిణానిలము దలఁచి తోయజాక్షులు నిందింపఁదొడఁగి రపుడు. 147 148 149 150 151 మ, ఉ. కుల శేఖర మహీపాల చరిత్ర రాణం గందపు శుబ్బలిం బొడమి సారగ్రాహివై సారస శ్రేణిన్ సౌరభ శైత్య సంపదల నాశ్లేషించి లోకుల్ జగ త్ప్రణుండంచు వచింతు రత్తెఱఁగు తథ్యంబైనఁ బొంథాంగనా ప్రాణంబుల్ గొన నెట్టు లోర్చితివి దుష్ప్రరంభ ! మందానిలా ! అహితప్రార్ధన మాచరించి మలయాఖ్యమ్ముధ రేంద్రమ్మునన్ బహుభోగి ప్రకటస్ఫటా మణిరుచి ప్రాగల్భ్యముల్ మాని దు సృహదంష్ట్రా విషవహ్నిఁబూని విరహక్రాంతాంగ నాంగవ్యథా వహబుద్ధిం జనుదెంచెదింత కుటిలత్వం బేల మందానిలా ! ప్రాణపదంబటంచు నిను భావమునన్" గణుతింపుచుండుదున్ ఘ్రాణసుఖమ్ము సేయుమికఁ గస్తురిరంగని మేనితావిచే నేణము నెక్కి.. పొమ్మచటి కీక్షణమాత్రనా రెమ్ము క్రమ్మఱన్ బాణియుగమ్ముసాచి నినుఁ బ్రార్ధన చేసెద మారుతార్భ కా కా! చం. అకలుషజీవనమ్మున మహాసరసుల్ దన రార దూజెదో ! వికల ముఖంబుగాగ నడవిన్ సుమన స్తతి గెంటఁద్రోచెదో ! ప్రకటరజోవికాసమున భాసిలు కొమ్మలఁ గౌఁగిలించెదో ! ఆకటకటా మహ త్తరులు కాకులపాటొద వెన్ సమీరణా ! ఉ. క్రూరభుజంగ చంగములు కోఱలు జీరలు వాఱఁజీఱగాఁ బౌరుష మేది కాలునిలుపన్ ధృతిమాలి విరాలి జాలిపొం గారఁ గలంగుచున్న యబలాళిఁ గురంచి మహాబలుండనక్ బేరును బెంపుగాంచుటిది పెంటితనమ్మునుమా సమీరణా ! 119 152 153 154 155 156 వ. అని యిత్తెఱంగున నిందుకందర్ప మందపవనులు నిందించి తత్పరిసర వర్తులగు మరాళచంచరీకశుక కోకిలమ్ముల నుద్దేశించి యిట్లనిరి. కలుషించి వినముగ్రక్కకు రాజహంసంబ మలినమ్ముగా దె నీమానసమ్ము కొదుకుపల్కులఁ బండుగొఱుకకు కీరంబ ! యేవగించిన దీఱ దీఫలమ్ము 157 120 తృతీయాశ్వాసము పానమత్తత నెదురఁ గరాకు మధుపంబ తెలియఁజాలవు నీదు దేహబలము పంచమస్ఫూర్తి గారించనేల పీకంబ పలుగాకులకుఁ దేటపడుకులంబు తే, గీ, నేల నడవడి దప్పుదు రేల మొగము గంటు మానుడు రేల మీ కాఱులరవ రేల కన్నెఱఁజేయరు మేలు మేల్వి జాతులకుఁ బక్షపాత మెచ్చట ధ్రువంబు, వ. అని యుపాలంభంబు సేయు నవసరమ్మన. తే.గీ. ధరణిపతికన్య విరహసంతాపభరము కం. కం• మ. మది సహింపక వెన్నెల మడువు సొచ్చి తనువు దొర గెద ననుచు నుద్ధతివహింప వలదు సాహసమనుచు నెచ్చెలులు గదిసి. పొదివికొని యూఱడింపుచు మదవతు లారాజకస్య మఱలఁదిగిచి నె మ్మది కుసుమశయ్యఁ జేర్చిన మదనాశుగ తాపత ప్త మానసయ సమున్. వ్యాకోచాంబుజలోచనల్ పొదివి యాశ్వాసించుపల్కుల్ మనో వైకల్యమ్ము నొకింత మాన్చుతటి దుర్వార స్ఫుర చ్చంద్రికల్ పై కొన్నన్ నెత సశుతోయకణముల్ రాలం గళం బెత్తి తా శోకించెన్ గలకంఠి కోకిలరవ స్ఫూర్తి విడంబించుచు. వికలమతి నెద్దియును దో చక వగచుచుఁ జూచుచున్న జలజాక్షుల యం దొక నీల వేణి యనఁజను ముకు రాసిన పల్కెఁ జెలియమోము నిమురుచున్. అకటా ! రూపగుణ ప్రభావరుచిర వ్యాపారయోగమ్ములన్ బ్రకటింపందగు రాజకన్యక వికన్ గన్నీరుమున్నీరు సే 160 161 162 163 164 165 సీ. కులశేఖర మహీపాల చరిత్ర యకు నీనాయకు రంగనాయకుని నెయ్యం గాజు దో నేర మ త్సుక రాలాసము లోపు పేరుతో నాత్సుళ్యమ్ము వాటింపుమీ ! హరిణశాబేక్షణ! హంసమయూC ధూ ర్తకులు నీకూర్చు న ర్తకులఁ జేతు మధురోష్ఠి ! భయకంద మందమారుత రతి ధవుల నీ విహిత బాంధవులఁ జేతు వనిత ! కోకిలమధువ్రత ముఖక్రూరవ త్తములు నీ గాయ త్తములఁ జేతు కాంత ! సంతాపదుష్కర చంద్రికాపేటీ కల నీదుకడఁ జేటికలుగఁ జేతు తే. శ్రీ సతిన మును నీకుఁ బగవారు లైనవారిఁ జెలిమి నీకింక భృత్యులఁ జేయుదాన గంగవిభు నిన్ను గూర్చు తెఱం గొనకు విగవవలదమ్మ యేనుగులుగ శుభాంగి ! చం. చెలియ మనోవ్యథన్ వెతలఁ జెందఁగ నేటికి నన్ను మున్ను బెం పలరఁగ నేలినట్టి ఋణమంతయు దీర్చెద రంగభ ర్తతో నలవడ నీరు సచ్చరితమంతయుఁ జేక్కొని తోడి వెత్తు నీ కెలమి ఘటింతు నుజ్జనకుఁడిచ్చిన ఖేచ విద్య పెంపున౯. ఆ. వె. అనిన నీలవేణి యంబుజమృదుపాణి మోహసాగరమున మునిగియున్న నన్ను నుద్దరింప నావ వీవైతివి పొమ్ము రంగభక్త పురమునకును. కం. అని కౌగిలించికొని పొ మ్మనుసమగతి నీవువచ్చునంతకు నిచ్చో టనే నిలిచియుండువారము ఘనవిగ్రహు తోడి తెమ్ము గమలదళాక్షీ ! 121 166 167 168 169 170 122 తృతీయాశ్వాసము అని యిట్లు నముచితసత్కారమ్ములం బ్రియమ్మున్నపి మఱియు నయ్యింతింజూచి నీల వేణి ! మనోభన పాణి విసృష్టమ్ములగు బాణవేణికల మును గంజాల సొమ్ము చక్రపాణి నభిముఖుం జేయుమని యాజ్ఞాపించిన నయ్యింతి పితృద తంబగు విద్యావి శేషమ్ము నవలంబించి నభంబున కెగసి చనందొడంగెనంతనక్కడ. శ్రీ రంగపతి విరాళి చ. ఎలమి మరుండు రంగ విభుఁడెంతయు రాజసుత గురించి సం చలితమనస్కుఁడౌ ఒఱిఁగి సయ్యన నెయ్యపుఁదియ్య వింట నే ర్పలకఁగఁ బూన్చి సూనవిశిఖావళి పై బరగించు సంతకుం దొలుత విపాండుపత్రరుచి దోఁచె మురాంతకు నెమ్మొగమ్మునన్, J తే.గీ. మును నృపాత్మజ చెలువమ్ము వినినయపుడ నెఱి మరుండు జగదమణీ శ్రమంబు దలఁగి యాత్మీయహృత్బీకి నెలవునేయ రంగనిఁ గోర్కి యువతిపై జెంగలించె. కం. ఇవ్విధమున రాజాత్మజ దవ్వుల నుండియును దనదు గండ నిలిచిన ట్ల వ్వేళలఁ దోఁచిన మది నవ్విభునకు విరహధాన మగ్గలమయ్యెన్. మంభాద్రిఁబూని యుబం వీధిఁ జను మేటి విరహభారముజల్ప వేచుచుండె పెఱిగినజలనిధిన్ బృధివిఁ దేల్చిన దిట్ట మోహాబ్ధివొడల సందేహమందె తీసుక దావాగ్ని మ్రింగిన మహాద్యుతిశాలి దర్ప కానలసముద్ధతికి నులికె సకలదివ్యాస్త్ర తేజము లణం చెడుజోదు నొనరు పూఁదూఁపుల నోటువడియె తె, గీ, చటుల భేరీసహస్ర ఘోషమున కోర్చు ధైర్యధుర్యుండు కోకిలధ్వనికి నో ర్చె 171 172 173 174 కులశేఖర మహీపాల చరిత్ర 128 సహహ ! యెటువంటి ఘనులకునైన నొక్క కాలమునఁ గొన్ని వింతలు గలుగుకున్నె. గ్రోల 175 ఇట్లు నీళావథూలధురాధరరసమ్ము గ్రో ను తెలపడు చిత్తము నిలుపనోపక ఫలప్రసూనకిసలయాభిరామంబగు నిజారామంబునం బ్రొద్దుగడపం దలంచి రంగవల్లభుండు విహంగపుంగవస్కంధంబున నిజక రా గ్రంబవలంబించి యతం డొక్కరుండు సహాయుండుగా మందగమనంబునం జని సుమనోమనోహరం బలగు ననేకానోకహంబుల నవలోకింపుచు సంచరించుచో నొక్క యెక రంగపతి విహగం పతితో నిట్లనియె. ఊ. నాకు నెఱుంగఁ జెప్పునదె నాలుకలేల్లెడఁ గానుపించి ద ర్వీకర వైరి ! యంచు హరి విస్మయమంద నతండుపల్కె శో భాశరమైన పల్లవచయంబిది చూడు మశోక నున్న, న స్తోకవియోగిచి త్తమున శోకము సేయు నశోకమయ్యెనే! చం. ఉ. రజ మెగఁజల్లి వేడిమి భరింబిడి పాతకులై వియోగికిన్ గజిబిజి "సేయు దీని నెఱుఁగం జెపుమయ్య సుపర్ణ! నావుడున్ భుజగవిరోధి నవ్వుచు సమాన సుమవ్రజ సౌరభంబుసన్ బ్రజ నలరించు కేతకులు పాతకులే ! జగదేకనాయకా! ఆతత పాంథశోణితమయాకృతు లేర్పడియున్న భూతనం ఘాతము నిల్చెఁ గట్టెదుటఁ గగ్గొను మీనన నీకు నిజ్జగ దాతమునందు బూత మెదురంగలదే! యివి నూత్నపల్ల వ ప్రోతములైన చూతములు బూతములే నవపద్మలోచనా ! ఉత్సాహ. ఉల్లలద్బహుస్ఫులింగ కోగ్రలీల లేర్పడన్ గ్రోళ్లువాత నౌర ! వహ్ని కీల పెంపన బత ద్వల్లభుండు పల్కె మెచ్చువచ్చు కోరకమ్ములతో పుల్ల నల్లి కామతల్లి పుష్పవల్లి కేశవా ! 176 177 178 179 180 ఇవ్విధంబునఁ బల్లవఫలకుసును విసరభారోదారంబులగు భూరుహంబు లంజేరిప్రకటించు " శుక కేకికోకిలాలాపమ్ములవలనను గమల సౌరభ విలసితంబై చను 124 తృతీయాశ్వాసము దెంచుమలయానిలమ్మువలనను బచ్చనిలుతుండడరించు విశిసులుకులవలననుం బోడ మినయలజడికి గ్గాలునిలుపంజాలక దలఁళుచున్న యన్న లువతండ్రిస్ దోడ్కొనిచని యొక్క యెడఁ గునుమితిల వంగలతా వేష్టితమ్ములును బుష్పిత కుల్లి కావితాన విలసి తమ్ములునగు నికుంజనిచయుబుల మంజులంబను మధ్యదేశంబున శోభిల్లు తరుణ చూతశీతలచ్ఛాయం గనుపట్టియున్న చంద్రకాంతశిలా విరచితంబగు వితర్ది కోపరి భాగమ్మునం బఱచిన పల్లవశయ్యం జేర్చి పల్లవశయ్యం జేర్చి ఖగేంద్రుండు నిజగరుదంచలంబుల నిట్లనియె. నాయాసం బెడల విసరుచు నిట వియె కం• 80. శుక మెఱుంగనిఫలములు పికమునోటి గీఁటు లందని చివురులు తేఁటి తేనె లాసఁగానని కుసుమముల్ హంసగరులఁ జెదరని సరోరుహములు దెచ్చెద మహాత్మ! అనుటయు రంగవిభుం డి ట్లను పత్రరథావతంస ! యల్లప్పుడె చె ప్పనె కుల శేఖరభూవర తనయాసంభోగవాంఛ దలకొనే నేనుచుజు. మదికి నది పల్వలంబై నదియై మున్నీటి తెఱఁగును బెం పై యు న్నది ది మోహరసము నేనా సుదతిన్ వరియించు తెఱుఁగు జొప్పడదనఘా ! ఆయింతికెమ్మోని యమృతమానినఁ జాలు సమధిక ఫలరసాస్వాదమేల నామానినీమణి మోముమూర్కొనఁ జాలు కమనీయపద్మ సౌగంధ్య వే మేల నాబోటి నును జెక్కు లంటఁ గల్గినఁ జూలు పల్లవాలంబన భ్రాంతియేల నా లేమ: గౌఁగిట సలవరించినఁ జాలు తనుపుష్పమాలిక దాల్ప నేల 181 182 184 తుల శేఖర మహీపాల చరిత్ర 125 తే.గీ. యేల విధములు తురగంబులేల పేరు చం, చితిరథమేల రత్ని హర్మ్యమ్ము నేల నన నేల నీళావధూలలాసు లే" గైకొనియెనేసి నిన్నియుఁ గలుగవలయు. అనిస ఖ గేంద్రుఁడిట్లనియె నక్కట దేవరవార లాసతి చ్చినపని మాళ్ళిచాల్చి కులశేఖరభూవరుఁ డాత్మకన్యఁ దో డ్కొని భవదీయసన్నిధికి గొబ్బునఁ, దానరు చేరకున్నె ! యం తనె కుశలమ్ముగ లెడు వృధా విరహశ్రను మంద నేటికిన్, తే.గీ. అనిన లక్ష్మీశ్వరుండు ఖగాధి నాథుఁ బలికె వినుమన్న మున్ను నేభావవీధిఁ తెలిసియుండగ సంకిలిగలిగె నొకటి యదియు వినుపింతు నీకు నెయ్యం బెసంగ. శం. ఏయువతికైన శస్త్ర ప్రాయంబగు హృదయ మింది రా దేవి సప త్నీ యోగమ్మున కోర్వదొ కో యని వెఱఁజెంది యూరకుండితి ననఘా ! వ, అనిపలికిన పైన తేయుండిట్లనియె. & I 062 శ్రీభూనీళలు మున్ సపత్నులగుచున్ సేవింపరే ! నిన్ను శాభామామణి దా వరించుటకు లీలస్ రాజక న్యాకృతిన్ శోభిల్లెన్ వేసి నిందిరారమణి మెచుంగాక సంపద్యశో లాభమ్ముల్ గృపసేయు దేవికి మనోల్లాసమ్ము గాకుండు నే ! 185 186 187 188 189 190 అనుటయు ఖగవల్లభువచనమ్ములకుఁ గలంక దేసిన మనమ్ముతో వికసితముఖుండై మధుసూదనుండిట్లనియె. కం. పతగేంద్ర! నీసఖత్వము కతనం జితమయ్యె హృదయగతసంశయ మ 191 126 తృతీయాశ్వాసము య్యతినం బరిణయము కు సం గతికిఁ బ్రయత్నమ్ము సేయఁగావలయు నికన్. అని పల్కు నవసరమ్మున, కం. నృపకన్య మున్ను పనిచిన యువకారిణి గగనవీధి నొగి నేగుచు రం గపతిం గను టెట్లో ! యే నెపమున భాషింపనగు న నేక జనులలోన్. க తే. ఉ. కం. 19 ఆరమణీవతంసమున కాత్మహితమ్ముగఁ బెక్కు ప్రేలితిన్ దూరవిచార మించుకయుఁదోఁచక రంగ విభుండు వేడ్క దే వేరులఁ గూడియుండు తిరువీధుల నేరెడు వేళ చిత్రవి ద్యారతు లేగు దింతురు రహస్యవచోరచనల్ ఘటించు! అని వితర్కించు వేళ నల్లదియె విరుల తోట యచ్చోట ఖగరాజుతోడ రంగ నాయకుఁడు సంచరించుచున్నాఁడు నీల వేణి ! పొమ్మంచు నశరీరవాణి పలికె. ఆపలుకుల్ మనమ్మునకు వచ్చేరుపాటు ఘటింప నభ్రవీ ధీపథ ముజ్జగించి జగతీస్థలికిన్ వెసడిగ్గి వార్ధిక న్యాపతి సంచరించు తెఱఁగారసి నిక్కడ వేళఁగాని నే నాపృధివీశపుత్రి చరితామృతమున్ జవిచూప నెట్లగున్. వ అని తలంచుచు. అంతట నొకయీరమ్మున నంతర్హితలీలఁ దాల్చి హా ! నీళాసీ మంతిని యనికూర్చున్న ము కాంతకు పలుకాలకించి యతిన మనమునన్ . ఎక్కడివింత భూపసుత నెన్నడుచూచే భ్రమంబుజెందె ! నీ చక్కని సామికిం జెలియ చక్కదనమ్ము మదిం ఘటింప న 192 193 194 195 196 197 198 199 కం. కులశేఖర మహీపాల చరిత్ర లిక్కులనుండి శ్రుమ్మఱు సుధీ గుణ గుణు లెవ్వరుపూనికొక్కొ 127 మ్రొక్కి యెఱుంగఁ జెప్పుటలో మున్నె యెఱుంగ నయ్యె వయ్యకున్', 200 అనుచు భయసంభ్రమంబులు దనమది ముప్పిరిగొనంగఁ దరుణీమణి య ల్లన నడుగులిడుచుఁ జనియెన్ వినయాన్వితయగుచు రంగవిభుఁ డున్నెడకున్, తే.గీ. వచ్చుచున్నట్టి విరిబోడినలను సూచి భూపకన్యక హృదయసంతాప ముడుపఁ దలఁచి యేతెంచు సఖినకాట దనదుదివ్య చి త్తమున గోచరించె లక్ష్మీ విభునకు, పరిపూర్ణ చంద్రబి బహ్మునందు నెరసులె న్నఁగఁజూచు సుందరాననము. వాని శరదుల్ల సత్సరోజ దళమ్ముల హసించు విమలవిశాల నేత్రములవాని కమనీయపద్మరాగమణిద్యుతుల మించి రాణించు సరసాధరమ్మువాని భూరికుంజ కరస్ఫూర్డినోడించు న త్యున్నతదీర్ఘ బాహువులవాని తే.గీ. చెన్నైనఁగు చిన్ని నగవులు వెన్నెలలకు నన్నలునుదమ్ములును జేయునట్టివాని రమ్యనుగు శయ్య గూర్చున్న రంగ విభునిఁ గొంచెఁ బూబోడి కన్నులక అవుదీజి. 5. కని భయజౌతుకమ్మ లెసఁగన్ వెసఁగ్రమ్మిన సమ్మదాశ్రువుల్ కనుగవనిండఁ బర్వితొనుకస్ గొలుకుల్ నిలుపోప లేమిఁ జ య్యన నును జెక్కులం బెరయ నంగకముల్ పులకింప రంగథా ముని చరణాంబుజమ్ములకు మ్రొక్కె సరోజదళాక్ష్ని గ్రక్కునన్, 201 202 203 204 128 కరి మ్రొక్కి నిలిచి యదేవుని తృతీయాశ్వాసము వెక్కసమగు తేజమునకు వెఱదుడు మదిలో స్రుక్కి తలవొంచి పలుకని యక్కోమలి తెఱఁ గెఱంగి హరి యిట్లనియెన్, ఎందు వసించుదానవిట కీగతి రాఁజనియేమి కుందమా కందమధూక చంపక విక స్వర వాసన విందుగోరి నీ విందుఁ జరించెదొక్కొ! మఱియింకొక కార్యభారమ్ముపూని చందమున న్మెలం గెదవొ చంద్రముఖీ ! భయమంద నేటికిన్. తే.గీ. అనుచు రంగేశుఁ డానతిచ్చిన మృగాక్షి, ముదము సంధిల్లఁ గరములు మోడ్చి పలికె సద్గుణాధార ! సాధురక్షణవిచ్చా ! కూర్మిఁదళుకొ త్త మనవి చేకొనఁగవలయు. నీలవేణి నీ వృత్తాంతమును శ్రీరంగపతికి విన్నవించుట కం. శ్రీనిలయ ! నీచుసన్నిధి ఉ. సీ. నే నెంతటిదాన నట్టిదిట్టిదియనఁగా నైనరు నొక సందేహము పూని యిటకు వచ్చితిని ప్రభూత పణాఢ్యా ! హేలి న రాతినిర్మథన హేతుపరాక్రమశాలియై యశ శ్శీలదయారు భావములు చెల్వగు పక్కల శేఖరావనీ పాలుని దేవియైన కులపాలిక కున్ జనియించి బాల శో భాలలితాంగియై పెరిగె బాల సుధాకర రేఖ వైఖరిన్. ఆయింతీ కుచగౌ: వారూఢిఁ గనికాదె గజకుంభములు ధూళిఁగప్పికొనుట యాలేము ముఖకాంతిఁ బోలఁజాలకకదా పసజారి కడు కృశత్వమ్మునొందె 205 206 207 208 209 కుల శేఖర మహీపాల చరిత్ర యానాతి లోచనశ్రీ నోటువడిక దా కమలముల్ జలములఁ గదలకుండె నాబోటి పలుకుల యల వెఱుంగకకదా చిలుకలు పంజరంబుల వసించె తే, గీ, నాచలచ్చూర్ణకుంతల యంఘ్రయుగళి నులికి చివురులు శాఖాగ్రములఁ జలించే నా కలికి మధ్య భాగావలోకనమున బెదరికాదె మృగేంద్రముల్ బిలము సొచ్చె . 129 210 వ. ఇవ్విధమ్మున నయ్యింతి చెలువమ్ము గొంతకొంత యెఱింగించి రమా కాంతునితో నిట్లనియె. తే, గీ, మతికొలఁది నింతి యవయవ ప్రతతీఁ బోల్పఁ దోఁచె నివికొన్ని సదృశవస్తువులు సాటి మున్న తెలిసిన సర్వజ్ఞమూర్తి వీ వెఱింగినను నాకుఁ దెల్పవే ! రంగనిలయ ! వ అనిన రమావల్లభుండిట్లనియె. తే. గీ. లేమ సుగుణమ్ములెన్న పులోమజాది సతుల నెఱుఁగవె పత్నీ ప్రశంస సేయ నాకు నుచితంబె చెలియ సౌందర్య మహిమ నీ వెచెపు మేను వినియెద నీలవేణి. కం. మ అని తను నియమించిన న వ్వనజాయతనయన రంగవల్లభుని గనుం గొని చెప్పఁదొడఁగె భూవర తనయామణి రూపసంపదలు తెలియంగన్. రమణీవేణిక పై నెదుర్చు మధుపవ్రాతమ్ముల స్మారుఁడ క్షముఁడై త్రోఁచిన వ్రాలి కట్టెదుట రాజన్నాసి కాచంపక 17 211 212 213 214 215 130 మ. చం• మ. ఉ. తృతీయాశ్వాసము భ్రమదోఁషన్' వెఱగంది వక్త్రశతపత్ర ప్రాంతయు క్లీన్ సఖి త్వము వాటించెననంగ ముంగురులు దత్ఫాలమ్మునన్ బొల్పగున్. తనముఖ్యాస్త్రము లింతిలో చనములై త తద్యువాంతర్వి భే దనమున్ దృశ్చరపం_క్తి చేఁ బెనుపఁ గందర్పుండి కేలంచు పై చిన పుండ్రేక్షుశరాసనమ్ములు కృతస్నేహములై యక్షిప ద్మని దేశమ్మున నిల్చిన ప్లేసఁగె సమ్య గూలతల్ బోటికిన్. విరహిత సౌరభంబగుచు వెల్వెలఁ బాఱు దిలప్రసూనమున్ జరదళీ సంఘసంగతిఁబొసంగని చంపకమున్ దలంచి ని ర్భరబహుగ్రంధలబ్ది ముఖపద్మవిలో ల మధువ్రతాప్తి దా నరసి మృగాక్షి నాస పరిహాసమొనర్చు నిజోపమమ్ములన్, నవసంఖ్యాకృతితో ననంతగుణమాన్యమై శ్రీ శ్రుతిప్రఖ్య ద మ్మవలంబించుట వీను లెన్న శతపత్రాకారమున్ రూపరూ పవదర్ధగ్రహశక్తి మాకె తగు గర్వం బేలనం చింతిక నవ కిస౯ గడఁద్రోయు నట్టులమరేజ్ గర్ణాంతవిశ్రాంతమై. చిలుక ముక్కునఁ జిందరల్ సేయునట్టి దాడిమీబీజములు ముంటి దారిఁ జూపు ము త్తెములు విచ్చిచను మొల్ల మొగ్గగుంపు 1 రహి సమంబులే పూబోడీ రదనములకు, ఆరమణీముఖంబు సరియందురు మోవికిఁజాలనంచు నం భోరుహ మంబులం దపముబూనుట రాగము జెంది రత్నమై నీరసమౌటకున్వగచి నిష్ఠురమైన గతిం దపించి ని రత బింబమై యధరబింబమనం జను కంబుకంఠికీ. ర్భీరుత స్థాణుశిరమ్మున న్ని యతిసల్పి తమంబెడల బుధాన్న వి శ్రోణన మాచరించి జనరంజనత శుభుఁడయ్యు జందురుం ణము దాల్చియున్కి హరిణేక్షణ ప్రనన్ని మోము సాటికి నాణెము జెందఁడయ్యె నలినంబది పంకజ మెన్న నేటికి 216 217 218 219 220 221 222 కులశేఖర మహీపాల చరిత్ర కం. వదనము ఘనసారస్వత సీ. పదనిగళము గళము రుచిరపటుశంఖకళా స్పద మాపదంబు వేసలి మృదుబిస కాండమ్ము లంబు జేక్షణ భుజముల్ ణ సౌవర్ణ కలశముల్ సరివచ్చు శిఖశిఖా క్రమణకల్పితములు గాక యున్న వనజకోకము లెన్నవచ్చుఁ జంచలచంచ రీక రేచితములు గాక యున్న గజకుంభములు సాటిగాంచుఁ దుండోఙ్ఞత గ్రాసధూసరములు గాక యున్న శైలాగ్రముల్ బోల్పఁజాలు నిమ్నోన్నతా కారఘోరమ్ములు గాళయున్న తే.గీ. కాంతిసౌష్ఠన సమతాతీకఠిన భావ కలన నొక్కొక్క ధర్మంబు గలుగఁజూచి కొఱత లెఱుఁగక పూఁబోడి కుచసమాన ఫణితి నెన్నుట యుచితమే ప్రాజ్ఞులకు. మ. ప్రబలం బై చెలి యావనామృతఝరుల్ పై పై మెయింబర్వ నా భి.బిలావర్త విఘట్టితాహి వెఱ నుద్వృత్తి బయల్నాకుచుకో సొబగొప్పక్" వళివీచిక ల్గడచి యచ్చోట సగంధ స్తన కాంతస్థితిఁ గాంచెనాఁ జెలికి నందంబయ్యె నూఁగారొగి౯. తే, గీ, గగనమై తోఁచు నయ్యింతి కౌనుతీఱు చం• స్వాతిపథమందు మౌక్తికస్థగిత కాంచి కోసల వ్రేలెడు వజ్రంపు గుంపు లెల్లఁ జుక్కలై తోఁచు నెయ్యింతి సొబగు తెఱఁగు, వలుద మెఱుంగుచన్ను లిరువంకలఁ గాంచనకుంభముల్ బోమల్ సలలితచాపముల్, గళముశంఖము పల్కులు కోకిలో కులి టల రెడు గాంతమేను కుసుమాయుధుఁడుండు పసిండితేఱు సం చలితరథాంగ మింతికటి శాతశరమ్ములు చూడ్కులెన్నఁగన్. 181 223 224 225 226 227 139 తృతీయాశ్వాసము తే.గీ. రమణి రూపమ్మును నోడి రంభయొక తి యులికి కనుముయ్యదయ్యె “వేతొండు రంభ కన్య యూరుభయంబునఁ గదలికదలి కం. చం• కం. ఉ. ન కదళి యను పేర నేఁటికిఁ గదలుచుండు. ఆహితగుణజంఘలకును గూహకమున నోరు దెఱచికొని కలహకళా మోహమున నఱచుచుండెడు కాహళములఁ బోల్ప నుచితగతియే చూడన్. సరవిఁ బ్రవాళ మాత్మరుచిసంపద పేర్మిఁ దదీయవిస్ఫుర చ్చరణతలమ్ములం గెలుచు సాహసమూఁది నిజాంగ సంగి ని పురతఁ దలంచి క్రమ్మఱినచోఁ దనమార్ధవ రాగ యోగని ర్భరత నెదిర్చి పల్లవము పల్లవమయ్యె సరోజ సంధికిన్. ఆయింతి రూపగుణ రే ఖాయుత సౌష్ఠవము తోచినంత తెలిపితిన్ వేయేల నీకుఁదగు చెలి తోయజముఖ కీవు దగుదు తుల్యాకృతులన్. స్వాములు మున్ను కొందఱు భవద్గుణరూప విలాసముల్ నృప గ్రామణి చెంగటన్ దెలుఁగాఁ బితృసన్నిధిఁ బాయకున్న క న్యామణి విన్న మాత్ర హృదయంబున మతృతి నిర్జితాహిత సోముఁడు రంగభ రయనుచుం దలఁ చెస్ దమి చెంగలింపఁగన్. కం. రంగాధినాథ ! చటులవి નાક హంగేంద్రతురంగ ! విలసితాంగ జనిభది వ్యాంగ ! నినుబొందుటకు నీ శాంగన తపియింపుచున్నయది మదిలోనన్, హా! జగదీశ చాలతడవాయెగదా యిటు నేను వచ్చి యా రాజకుమారి సాహసికురాలుగ దే ! తనువల్లి యింత కే 228 229 230 231 232 288 కులశేఖర మహీపాల చరిత్ర యోజకుఁ దెచ్చునొక్కొ మరుఁ డుద్ధతుఁ డోర్చునె ముద్దరాలు ! వి భ్రాజితదివ్యమూర్తివి కృపన్' సెలవిచ్చినఁ బోయిన చ్చెదన్, . మానిని, కోకిల కోళ బలాక కులార్భటిఁ గొందల మందెడి డెందముక దీను గందపుగుబ్బలిఁ బ్రమ్మిన తెమ్మెరతావుల యుమ్ములిక పైకొని చిన్నెల యన్నెల వెన్నెల పర్విన నోర్వలి వేదన : కా కం. ఉ. ఆకలవాణి తపింపకయుండునె! యారనిపోరిది లోకపతీ ! అని నీలవేణి పలికిన వినయోచితవచనరచన విని యుత్సాహం బుస హృదయమలర నవ్వుచు వనజాక్షుం డిట్టులనియె నసతామణితో, సంగతిమీఱ సభ్యులు ప్రసంగవశమ్మున మెచ్చుచున్న నీ శాంగన రూపసద్గుణ సుధాంబునిధిక్ మదిడిందియున్న న న్నంగభవుం డెఱింగి కుసుమాస్త్రము వేయఁ గలంగికాదె నా రంగ లవంగలుంగ వనరంగవిహారము గలె ! గోమలీ ! ఇంగితజ్ఞురాల ! యిఁక వేయు చెప్పంగ నేల యేనయటకు నేగుదెంచి క్షితిత లేంద్రతనయఁ జేకొనియెద వేగఁ జనుము చెలియ సంతసమున నెనయ. వ. అనుటయు. కం. స్వామీ ! మా రాతయకు નક సేమం బెసగంగ ముదము చెన్ను వహింప శ్రీముఖపత్రిక యొసఁగుకు నా, మధుదై త్యాంతకుండు నగుచుం బలికెన్. అంచిత సౌరభ స్ఫురితమైన మృగీమదకర్దమంబు నీ లించి సమంచి తాత్మనఖ లేఖని చే నౌక వృత్తపద్ధతి 133 234 235 236 237 288 239 240 134 తృతీయాశ్వాసము గాంచన కేతకీ కునుమగర్భదళమ్మున వ్రాసి లేదు కి మ్మంచు నొసంగె నంతట మురారి సువాణికి నీల వేణికి, 241 వ, అని యిత్తెఱంగున రంగపతి యానతియిచ్చి విహంగ పుంగవ సమర్పి తంబగు లేఁజివురులు బొదివిన కుసుమమాలి కానిచయమ్ము నీల వేణికి సబహుమాన మ్ముగానొసంగి నీలావథూమణి నూఱడింతువుగాని పొమ్ముపొమ్మని యానతిచ్చిన నెలంత శ్రీకాంతునకు మ్రొక్కి యమ్మహాత్ముని చేత ననుజ్ఞాతయై సభమ్మునకు నుద్గమించి చనునెడు నంతనట నీళావధూటి విరహభార పరిశ్రాంతయై యుండుటం జేసి నెచ్చెలులతో నిట్లనియె. క్షం. తే. ఆకల్లార్పఁదొడంగె మందపవనుండందంద సూనాస్త్రభృ ద్రాకాచంద్రులు దోడ్పడ గినుకచే, రానోవునే! తద్భయో దేశంతికి నీల వేణి, విభుఁ దో డేఱంగ నేగెక్ బనుల్ గాకున్న కొగద రాకయున్కి యని యక్కంజూస్య చింతింపఁగళా. వ. అనిన నచ్చేడియతో నెచ్చెలు లిట్లనిరి. బాలామణి ! మది నెఱుఁగక నీలో వగ పేల కార్యనిర్వహణక ళా శాలినియై సేమంబున నీలోనన నీలవేణి యే తేఱంగళా. చొఱనీయవలెగదె శుద్ధాంత మందిర ద్వారసంస్థిత మహోదగ్రభటులు నెడమీయవలెగదె యింది రావిభుఁ గొల్వ బడిబడి నే తెంచు భాగవతులు మాటాడవ లెగదె మదనమోహనమూ రి తేటకన్నుల నింతిఁ దేటిచూచి తలయూఁచవ లెగదె తగిన కార్యంబంచు తాల్మి చేవలయూరు తల్లి గారు తెలివి నూహింప నిన్ని పట్టులు నిజప్ర సంగభంగుల సవరించి రంగవిభుని 242 243 244 245 కుల శేఖర మహీపాల చరిత్ర 135 మానసమ్మున నీమోఁది మమతఁ జేర్చి వేగ నే తెంచు మననీల వేణి యబల! 246 వ, అని యిత్తెఱంగునఁ జెప్పిరనిన గురువర్యుగం జూచి శిష్యప్రవరులు తఱువారి చరితం బెట్టిదనిన వినుఁడని చెప్పఁదొడంగె. కం. సుగ్రీవానిలనందనాది సుభటస్తోమప్రియోత్సాహ ! పం .క్తిగ్రీ వేంధన వీతిహోత్ర ! విబుధ మావహా ! శంకరో దగ్రేస్వాసనిశాసభాసుర ! జగత్ప్ర ఖ్యాత చారిత్ర ! క త్న గై వేయకముఖ్యభూషణ లసత్సౌందర్య పాథోనిధీ : రాజద్రాజతనగ సుర రాజేభాజాశ్వ భుజగరాజ త్రిదివ త్మజ మృగరాజ ధవళాం భోజ ద్విజరాజ సదృశ పుంఖతకీర్తీ! మాలిని. అనుపనుగుణసాంద్రా ! హంసవం శాబ్ధచంద్రా ! వినిహతరిపుసేనా ! విప్రపుత్రాసుదానా ! మనసిజరిపుకాయా ! మానుషార్చాని ధేయా ! జనకనృపకుమారీ | సమ్యగానంద కారీ ! గద్య. ఇది శ్రీరామచంద్రకరుణానిరీక్షణ సమాసాదితకవితావి శేష శేషాన్వయ ప్రదీపక వేంకటాచార్యకుమారక రఘునాథాచార్యప్రణీతం బైన 217 248 249 250 కుల శేఖరమహీపాలచరిత్రంబను మహా ప్రబంధంబునందుఁ దృతీయాశ్వాసము, 251