Jump to content

కులశేఖర మహీపాల చరిత్రము/చతుర్థాశ్వాసము

వికీసోర్స్ నుండి

కులశేఖర మహీపాల చరిత్ర చతుర్థాశ్వాసము శ్రీరమ్యమకుటరత్న స్ఫారద్యుతి విజితభాను భాను ప్రజ ! లో కారూఢకీర్తిసౌరభ ! సారగుణా వేశ ! జనకజాహృదయేశా! 1 అవధరింపుము గురువర్యుండు శిష్యులకిట్లనియె నట్లన్నెలంత విరహ భారమునఁబొరలుచున్న యెడ. మ. జ నీలవేణి నీళాదేవియొద్దకు వచ్చుట హరిహస్తాబ్జ నియుక్త నూత్న కుసుమోద్యన్మాలి కావాసనల్ సరవిం బై పయిఁ గ్రమ్ము దేరఁ జెలులాశ్చర్యమ్మునన్ నల్ దెసల్ బరికింపన్ దివి నీలవేణి ననువొప్పన్ గాంచి రచ్చో నభోం తరనిర్యన్నన చంద్ర రేఖయన నుత్సాహమ్ము వాటింపగన్. ఉ. రంగవ రేణ్యదత్త సుమ రాజి సువాసన మున్నెసంగఁగా నింగి దొఱంగి వేదన మునింగి మనంబుగలంగియున్న నీ శాంగన సంతసిల్ల ధర సంఘులిడన్ డిగివచ్చు నీలవే ణిం గని బాలి కామణుల నెమ్మునముల్ వికసించాఁ గ్రక్కున, కం. కాంచితిఁ గాంచనాంబరు వికస్వరవిగ్రహుఁ గాంచికాగుణో దంచితమధ్యు రంగవిభు నద్భుతమందుచుఁ జెంతనేరి సే వించితి నీదు రూపగుణని భ్రమ వైఖరి సారెసారె గీ ర్తించితి నిన్నతం ఢరుగుదెంచి వరించుట సంఘటించితిజ. అను పల్కు లనుృతరసమై తనవీనులఁ జొచ్చి హృదయ తాపముడుప న 2 19 3 6 7 ఉ. కం. ఉ. కులశేఖర చుహీపాల చరిత్ర మ్మను కేంద్రతనయ కుతుకము దొనుకఁగ నస్త్రీల ల వేశిత నిట్లనియెన్. ఇందుని భార్య | రంగవిభు నెయ్యెడఁ గాంచితివీవు సూచి యే చందమున స్వచించితివి సారె పరాకొకయింత లేక గో విందుఁడు చిత్తగించే నె! విభేది విచారులు గొందఱయ్యెడన్ జెందరుగా ! ననున్ గరుణ చేకొనవచ్చునంటే తలోదర్ ! వ. అనిపలికిన నీలవేణి యిట్లనియె రాజముఖీ ! మనోహరుని రాకలకున్ వగవేల మేఘవి భ్రాజితమూర్తి నీదుపరిరంభము గోరుచునున్న వాఁడు ము న్నే జప మేతపంబు రచియించితొ ! తత్ఫల మబ్బెనేఁడు న వ్యాజమనోజ బాధ లేడయ్యెఁజుమీ జలఖాతలోచనా ! హర్విగాంచి వేడుకొనుటకు నరవిందదళాక్షి మీద లట్లనుప నభోం తరవీధిం జనఁగ విభాం కుర రుచిరములైన మణులు కు సెనే మీఁద. వ. అప్పుడేను వెఱుగుపడుచుండు నింతి. మానవతీ ! మలిన్ "వెఱపుమానుము మింటఁ జరించు సిద్ధవై మానికదంపతుల్ మణిసమాజము వేడుక సారే దోయింట బూని సమంబు బేసియగు బొమ్మని క్రీడయొనర్చుచున్న నీ పై నొకకొన్ని రత్నములు బ్రమ్మినచో వెఱగంద నేటికిన్. 187 8 9 10 11 12 13 14 వ. అనుచు నిరువురు సిద్ధాంగనలు శుభాంగీ ! నీయత్నమ్ము శుభోదరం బగుం బొమ్మని మత్పార్శ్వంబును బలికి నిజేచ్ఛంజనుటయు. తే.గీ. అపుడు పొడవున నరుగుచో ననఁదుఱిక తెలఁ గనుపడే గంపంత లేసినగుచు మహి నిరీక్షింపఁ దుంగభూరుహము లెల్ల దుంగపాచల భంగిఁ గానంగఁ బడియె. 18 15 16 188 చం. చతుర్థాశ్వాసము పటుగతి నేగుచో నెదుట బారులు దీఱు చకోరకమ్ము లు త్కటరవ ముల్లసిల్లఁ దమదండలనుండెడు పిల్ల పిండు ముం దట నెగువంగ సారసముదంచిత కోమలచంద్రికాపళిన్ గుటగుట గ్రోలుచున్కి గనుగొంటి మదికా ముదమగ్గలింపఁగన్, 17 వ అంతఁ గడచి చనుచున్న యెడ విబుధావాసభాసురంబగు మేరునగమ్ము చందమ్మున మహాభాగవతమణిమందిర మాలికాలంకృతంబైన Cంగనగరంబు దవ్వు దవ్వులం గనంబడియె నందు భేరీపటహ శంఖాదినినాదమ్మును నటనటీజనప్రవర్తిత వేణువీణాగానరావంబులును మహాభాగవత ముఖోదీరిత దివ్యప్రబంధానుసంధాన ధ్వానంబులునుం గలసి వీ తెంచిన నమ్మహావైభవంబునకు సద్భుతంబంది విను చున్నంత నామనంబున, కం. ఇట్టిమహావిభవంబుని నెట్టణ విలసిల్లు రంగనిం గనుచందం బెట్టిది చెలికత యే నే పట్టున వినిపింప నేర్తు బహుసంఘములో . అని వితర్కించుచున్న యెడ. కవిరాజ, సలలితకీర్తి పొనం గెడు వేళ విచారముపొందెద వల్లదిగో ! ఫలకుసుమాసవ సౌరభ వై భవ భోజన భూజసమాజములస్ 18 19 20 బొలుచు వనంబు కనంబడుచున్నది పొందుగ నందు ఖగేంద్రునితో నెలదు వసించే రమాగ మ ణీ విభుఁ డిందు ముఖీ ! చను మచ్చటికిన్. 21 5. అని యశరీరి యా దేశించిన కులకు డెందం బోనందకందళితంబగు టయు గగనపథావత: ణమ్ము చేసి యవ్వనంబు చేరంజని యందుఁ బ్రసవవిసగ విలసి తంబులై పొదలు పొదలలోనం గూచ్చున్న. యన్న ళినలోచను నాలోకించునప్పుడు నామనంబున కవిరాజ, అలికుల వేణుల వేణులకుం విరు లారీని తాఁ గొనివచ్చుటకై యళికుల మాకులమందఁగ నిప్పని యపనికిందగు నే యనుచున్ దలఁచితిఁ గ్రమ్మఱఁ దోఁచె నెఱుంగక తప్పఁదలంచితి నీతనికిన్ గలుగిరె భృతులు దీనికి వేరొక కార్యము గల్గునటంచు మదిన్ 22 26 కులశేఖర మహీపాల చరిత్ర 189 §*0. Å తే. క్షం. అని నేను నమ్మహాత్ముని కనుగొనుచున్నంత విపులకాంతా విరహో పనత్మ శాంతిఁ జరించుట కననయ్యెన్ మరుఁడు పాపకర్ముఁడు గాఁడే! రమణీయసుమరజోరాజి రాజలు చోట సొలయుచు వేళించి తొలఁగునిమ్మ లలితకోకిలకు కాలాపముల్ నీ తేర గరములఁ గరముల్ గమ్మునమ్మ మృగనాభి సౌరభో న్మేష సాంక వళిలా వితతుల డాయంగ 'వెఱచునమ్మ ఘనచంద్రికాజాలక లితస్థలమ్ముల నులికి వృక్షచ్ఛాయ నొదుగుసె మ్మ గుంజదళిపుంజ కలహంసకోకనిచయ రుచిర నవపద్మకుముద సరోవతంస మిళిత మరుదంకురములకుఁ దలఁకునమ్మ యంగ జశ్రాంతచిత్తుఁడై రంగ విభుఁడు. అదియెల్లఁ జూచి నామది నోదనె విచారమ్ము విరహయోగశ్రమ మి టిద కాదె యితనిమిది యే మది రాననయందుఁ జెందె మమతదలిర్పన్ . మ తకోకి• సంగతంబగుచుం దరంగము సైంధవంబగుగాని తొ రంగమే జల రాశిలోకము రంగ భర్తృకృతమ్ముగా నింగితజ్ఞు లెఱింగి కొల్చెద రింపుసొంపు వహింప న య్యంగహీనుఁ డెఱుంగఁ డంగ రథాంగపాణి నలం చేడున్, ఈమహనీయమూ రిమది యేమదిరాననాయందుఁ జెంది వి శ్రామములేక నెవ్వగఁ బొసంగిచరించెనా ! చూచిచూచి యే నేమని మాలతాంగి కతలేర్పడఁ జెప్పుదు ! నిప్పుడీ గుణ గ్రామణి పల్కునే యిది యగాధమనోరథ మేమి సేయుదున్, ఉ. 24 25 26 27 28 So 140 కం. చతుర్థాశ్వాసము అనుచు మదిసంశయింపుచు నచట నిలిచి పలుకరింపఁగఁ దగు వేళ గలునంచు మంజుసుమపుంజ మాధవీ కుంజ మొక టీ మాటుకొని చెంతనిలిచితి మగువలార ! అంత సంతళయాను శ కుంతవ రేణ్యుండు కుసుముకోమలశయ్యా భృతమున నునిచి పరి శ్రాంతి యుడిపై నిజగరుద్వ్యజన 9వ పవనమునన్. అతడు గూర్చుండునప్పుడు కొతుకక నన్నేఁచ నేలఁ గుల శేఖరభూ పతితనయా! యని విరహా న్వితచిత్తుం డగుట మఱియు నిను బేర్కొ నియెన్. 29 81 వ అప్పలుకులు నాకు గర్జ గోచరమ్ములగుటయు నామనమ్మున విస్మయంబొదవ నొక్కింత విచారించి యిమ్మహాత్ము డమ్మదవతిజూడకుండియు నృపసన్నిధికిం జనుదెంచు సుధీమణు లయ్యింతం జూచుచుండుదురుగావునఁ దత్తా దత్సౌంద ర్యాది ణమ్ము లిమ్మహాపురుషుని సన్నిధానంబున నుగ్గడించుకతంబున నితండు నీలాంగ నాపరిష్వంగళుత్సుకి తాంతరంగుడై కుసుమశర వేదనాపరిశ్రాంతుండయ్యెం రావలయునని నిశ్చయి చి మఱియును, కం. మ. చి సారక మే వరుదెంచుట Q నిర్ధారితమయ్యె కార్యనిర్వాహము పు ణ్వారి వేన నాడఁబోయిన ణ్యాధి తీర్థ మెదుర్కొనుట యని మదిన్ ముదమొద వెన్ . కలకంఠీమణి ! యప్పు డేనతని యుత్కంఠన్ వితర్కించి ద వ్వుల చూడ్కిస్ బని యెట్టుతో నతని చెయ్యుల్ భావమున్ గాంతు నం చలరుందూఁపుల వేల్పు తండ్రికణ కే నందంద డాయంగఁ గ్రో Lifro 32 28 నెలరాల్లూర్చిన తిన్నియన్ జివురువన్నె ల్మించు తల్పమ్మునన్. 34 సీ. S కుల శేఖర మహీపాల చరిత్ర శిలపత్రపత్రి సౌష్టవము మెచ్చని దయో దారి విశాల నేత్రముల వాని బ-ధురగల్ని దర్పణపాళి నోడించు లలితకోమలక సోలముల వాని బలభిన్మణిస్ఫురత్ఫలకమ్ము నిరసించు సముదీర్ణ విపుల వక్షమ్ము నాని ణ దర్పితరాకాసుధాకరశ్రీ నోర్చు భాసురవదనబింబమ్ము వాని హారకుండల మకుట కేయూర కౌసు భాంగుళీయక కాంచికాద్యతుల కత్న భూషణోజ్జ్వలవిగ్రహు బుధమనోని తుని రంగ విభుని గాంచితి లతాంగి! చం. సదము భక్తిచే నతని సారసతుల్య పదద్వయంబు ఫా లము గదియంగ మ్రొక్కి మఱలన్ గనుదోయికిఁ దత్సమగ్రతే జము మిఱుమిట్లుగొల్పి భయసంభ్రమములో మదీనగలించి తా లిమి చెడి యొక్క తీవఁ గదలింపుచు మోమఱపొంచి నిల్చితిన్ . ఆ. వె. నాద్భున మెఱిఁగి నారాయణుఁడు చిఱు నగవు మిగులఁబల్కె మగువ యిచటి కేమిదలఁచి వచ్చి తెవ్వరుబనిచిరి వెఱవనేల దెల్పవే మృగాక్షి ! వ 141 35 36 37 అనిపల్కు నమ్మహాత్ముని సంభాషణమ్ముల వలన ధైర్యం బవలం 38 బించి కరంబులుముకుళించి యిట్లని విన్న వించితి. 3 ఆ. వె. హరి జగన్ని వాస హాటక వసన ర మావిహార నాడు మనవి యొకటి కలదు చిత్తగింపవలయు నీదగు దయా మతృవిలోకనములు మెండుకొనఁగ. 89 149 సీ, చితుర్థాశ్వాసము జుండు సర్వసర్వంసహాచక్ర నిర్వహణక్రి యా సముద్యత నిజోద్యద్భుజు దీనితికీర్తికన్యా పదన్యాస చి హ్నాన్విత నిఖలదిగంతరుండు చటులకోదండ ల స్తకవినిర్గత శరా సార మోహిత శత్రుసముదయుండు సతితానుగత భాగవతబృంద వందనా చార సత్కారనిష్ఠాఘనుండు తే.గీ. రమ్య వేదాంత గుంఫితార్థ ప్రపంచ శం. పరిచయావా ప విజ్ఞాన పరిణతుండు సకలజన పాలనోత్సాహశక్తి ధరుఁడు వెల సిఁ గుల శేఖరాహ్వ యోర్వీవిభుండు. ఆమహనీయ తేజునకు నద్భుతశీలగుణ ప్రసిద్ధయై శ్రీమహిళానిభద్యుతులఁ జెల్వముగాంచి జనించెఁ బుత్రి సు తామపదమ్మునందు వసుధాస్థలి రాజగృహమ్ములందు క న్యామణు లెదజేని సరియాదు! కేరళ రాజకన్యకున్ . ఆసమశర కుసుమవిశిఖో ల్లసనము నోడించుసుతను లావణ్యశ్రీ నెసఁగు చెలికి నీళాహ్వయ మసదృశ విభవమున నొసఁగె నవనీపతియున్, కం. సిరిమించు లక్షణమ్ముల చం, సురుచిర లావణ్యశీలసుగుణశ్రేణిన్ సరవిఁ బెనుపొంది యున్నెడ సరసవయో రేఖ దనరె సరసిజముఖికిన్. జనకుని సన్నిధానమున సమ్యగు పాగత వైష్ణవాస్యసం జనిత భవద్గుణామృతము సారెకు వీనులఁ గ్రోలుచున్న య య్యనుపమగాత్రి నిన్ను హృదయమ్మున నాథునిగా భజింపుచున్ ఘనవిరహాగ్ని తాపమునఁ గ్రాగుచునున్నది రంగవల్ల భా ! 40 41 42 48 44 కులశేఖర మహీపాల చరిత్ర 148 రెండును వ, ఇంతెఱంగున మదన శరపీడితయగు నన్నెలంత నిరంతర చింతా సంతా సీతస్వాంత యైభవత్సన్ని ధానంచిన నిజవృత్తాంతం బెఱింగించి ప్రార్ధించుటకు నన్నుం బనిచిన నే తెంచితి నన్నెలంత ప్రాణపరిత్యాగ ప్రాణరక్షణమ్ములు భవత్కరకమలగతంబులై యున్నయవి భక్తవత్సల! దేవర దివ్యచి తమ్మునకుం దోఁచినయట్లు చేయుండని మ్రొక్కి నిలిచిన నమ్మహాత్ముండు వికసితముఖుండై నన్ను జూచి, కం. మున్ను బుధు లెన్న నిన్నియు విన్నాఁడఁ దదీయవిరహ వేదనచే ని ట్లున్నాఁడ నింక నేన క్కన్నియఁ గైకొనక తాళగలనా! లలనా ! తే.గీ. అతివ ! నేన వత్తు నచటికిఁ గుల శేఖ రావనీశుఁ గాంచి యాదరించి యతనిపుత్రిఁ బెండ్లియాడెద నిఁక వేయుఁ జెప్ప నేల చనుము తెలియకడకు. 45 46 47 అని యానతిచ్చి నిజనఖరముఖలిఖితంబు శ్రీముఖంబు నీకు నిమ్మని యొసంగె మఱియును మధుక కనికరసుక మ్ములగు నెత్తావివిరిదండలు నాకుంగృపసేసి బహూకరించె పదంపడి భవద్విరహశాంతి శాంతిం బొందించుకుని యమ్మహాత్ముం శాజ్ఞాపించినం జనుదెంచితిననిపల్కి.. మఱియు నిట్లనియె. ఈ ఓసుకుమ "రగాత్రి ! సుగుణోజ్జ్వలకీర్తి ! నృపాలపుత్రి యు ల్లాసమేసంగ రంగపతిలాలితలైన లతాంగులెవ్వరున్ నీ సరిరారటంచు మది నిశ్చయమేర్పడఁ బల్కె నింక నీ చేసిన పుణ్య రాశి ఫలసిద్ధి వహించెఁగదమ్మ ! నేఁటికిన్. 48 49 వ అనిపల్కి రంగ వల్లభుండిచ్చిన శ్రీముఖపత్రంబు నీళాంగనకు నొసంగిన నెయ్యింతి నిజసఖులుం దానును పత్రికాలిఖితవృత్తమ్ము చదివించి రండు. శా శ్రీలాలిత్యవిశాల రంగనగరం జెల్వొందు గోవిందుఁడన్ బాలారత్నమ! చింతయేమిటికి, సంభావించి శక్రాది ది 50 144 చతుర్థాశ్వాసము శ్పాలుల్ ' మెచ్చ: బరిగ్రహింతు నేను సౌఖ్యం బేర్పడన్ భృంగిలీ లాలోలాలకలాంఛితాలిక ! నినీళాళవరూధూమణీ, 51 వ. అనుచుం జదువునప్పుడు నామాక్షర వ్యత్యయమ్మునకు వితర్కించు సమయమ్మున నెచ్చెలు లిట్లనిరి. చం. మగువ విచారమేల! వనమాలి మనోభవబాధితాంగుఁడై సొగయుచు వృత్త లేఖ నొక చొప్పున వ్రాయుచునుండి యంత నీ దగ్గునభిధానవర్ణము లుదంచితలీల లిఖించుచోటఁ బె లెగసిన మోహనంతమ మిటు రచింపఁగఁ జేసెఁ గోమలీ ! 52 [3 వ. అని ప్రౌఢశాంతలుపన్యసింప వారలు తదర్ధానబోధ వంబునకు సంతసిల్లి రాజకన్యక' వికసిత ముఖకమలయై నీలవేణిం జూచి, పద్మసంభవముఖ ప్రార్థనీయ పదుండు నిలిచి మాటాడెన్ నీలవేణి ! నకల వేదాంత సంచారస్వభా వాడ్యు నెలవు జేరితివటే! నీలవేణి శతమఖప్రముఖ పూజితపదాంభోజుండు నిను సత్కరించెనే! నీలవేణి కవిబృహస్పతి కృతి స్తవ భవ్య వరితుండు నీనుతుల్' 'మెచ్చెనే! నీల వేణి తే. శ్రీ. నాగశయనుని దర్శించి నాచుమనవి వితతముగ విన్నవించి సమ్మతునిఁ జేసి యెలమిఁ దళుకొ త్త ననునిర్వహించి తీవు నీదు ఋణమెట్లు దీర్తునే నీలవేణి ! తడస్ధానబోధనంబునకు 54 55 3. అని పొగడుచు నెయ్యింతం గౌఁగిలించికొని సంతోషమ్మునం బొదలుచున్న యెడ సఖీజను లారాజకన్యం గనుంగొని, 56 కుల శేఖర మహీపాల చరిత్ర మనలఁ జూచుచు నీపముసవ్రాలెఁ జెకల నడలఁ జేయకయు న్నె యదిశి ఖండి సనల రోయుచు: బరాకున నున్న గ్రనాయ దే కార్టీ పెంచిన కంపుగంటి పులుగు నొక చోటఁ గాలు సిల్వక లతాంగుల నేలడం బూని కుమ్మలు సోకుబూతి మరియె యెక్కడెక్కడి చాయ ప్రక్కలు మైనిండి నిక్కు నుండెడు బద్మినీవిరోధి తే.గీ. మరుని గాదిలిచుట్టములో మనకుహితులే విరహిణుల నేతు రిచ్చోట వీరులతోట నెడలి నీదగు మహనీయ వివిధరత్న చిత్రకాంచన సౌధమ్ముఁ జేరవలయు, 145 వ. అనుచు నమ్మానిని మేననుండిన సుమనోరజమ్ము కరమ్ములు దుడిచి శీతల సలిలమ్ముల ముఖమ్ముగడిగి తిలకమ్ము దీర్చి కరమ్ముబట్టి లెమ్ము లెమ్మనుచు లతాంగులు నీళెంగనం బొదివికొని చరణశింజారవమ్ము పిక్కటిల్ల హంససం దోహమ్ము నడచుకరణి మందగతిం జని మహనీయ సౌథాంతరమ్ము సొచ్చి యుచిత గతి నివసించియుండిరంత. 8 ఉ. బును మంత్రుల దుర్మంత్రము శీలగుణోజ్జ్వలుండు కుల శేఖర భూవరుఁ డాత్మమంత్రి ల మనిత్యలౌకిక విచారఫలం బదియేల నంచు ల శ్రీలలనామనోహరు విశిష్టక థాశ్రవణమ్ము మోక్షదం బై లలినొప్పు నట్టిది మహాత్ముల సన్నిధిఁగాని కల్గునే ! 58 59 ఇవ్విధంబున మనంబునం దలంచి శ్రీవైష్ణవసన్నిధానంబున నిరంతరం యోగ్యకాలక్షేపమ్ము సలుపుచుండె నయ్యవసరమ్మున నిజప్రభుప్రియ సంభాషణా భావజనిత క్రోధమ్మగు మంత్రియూథమ్ము దమలోన, కం. శ్రీవైష్ణవు లి త్తేఱఁసిన భూవరునిం బొదివికొని ఋభుప్రవరులకుం 19 60 148 చతురాశ్వాసము P డే డాడిగ నాగ్రహించి చనిన మ్మెయినిచ్చిన చోట నెవ్వ తే జాడలవత్తురో తెలియశక్యమే ! నూకు ధరాతలేశ్వరా ! ఆ. వె. అనినఁ జెవులు మూసికొని పాపరతుల దు ఉ. చం. 'చన వినఁగవలసె ననుచు ర్వచనరచన జనవ రేణ్యుఁడపుడు సంత ప్తచిత్తుఁడై కనరుదోఁప మంత్రిజనులఁ జూచి. అక్కట శాంతచిత్తులు మహాత్ములు భాగవతో త్తముల్ మఱిన్ స్రుక్కక వారు చోరులనుచున్ గద యిట్లు వచించుటెర మీ కెక్కడి సత్యశౌచకథ లెక్క డిధర్మవిచార సౌష్ఠవం కదంబొకటి హీనవిచారులఁ జేయకుండునే ! జలరుహపత్రలోచనుఁడు సర్వజగత్పతి వైష్ణవో త్తముల్ దలఁపఁ దదీయపుత్రులుగ దా ! ధరఁ గల్గుధనమ్ము లెల్ల వా రలవిని గైకొనందగుదు రట్టిదెఱింగి యివేల పెక్కు. భా షలు భగవత్ప్రపన్నులకుఁ జొర్యము లేదని పాము ముట్టెదన్. అని తెంపునఁ బలికెడి య జ్జగపతి గపతి వచనములకులికి నచివులు నృప ! నీ కనుచితము బాస ధరఁ గాం చనవాంఛం బొసంగు నెట్టిజనులకు సైనాన్ ఏమేమి ! మీకణములు స్వాములపై 'ద్రోచి పలుకఁ జను నే . దుశ్చిం తామలినస్వాంతులు ల శ్రీ మహిళారము చెంత వేంగల రే! 76 77 78 79 30 81 వ. అనిపల్కి భాగవతపరిధనభాషణ శ్రవణజనితతో షక పాయితమ్ము లగు కనుంగొనల నిప్పులుప్పతిల్ల వారలముఖభంగంబును భగవత్ప్రపన్న ప్రభావ ప్రకటనంబురం జేయం దలంచి దండ నొకయహితుండకునిం బిలిచి నీల వర్ణాభీలంబైన వ్యాళంబునొక్కటి గొని తెండని పనిచిన వారు నతిక్రూరపత్కారఘోరం బైన భుజంగమ్ముఁ బట్టి తెచ్చిన నిజావళీయకంబుతో దానినొక్క నూత భాండమ్ము కులశేఖర మహీపాల చరిత్ర 149 నందుఁ బెట్టించి తానును నియతుండై దానింబట్టికొన నుద్యోగించునప్పుకు సు: గరుడ గంధర్వకన్నా కింపురుష సిద్ధిసాధ్యాకు లాకాశమ్ము నివకాశమ్ముగా నిలిచి విస్మయంబునం జూచుచుండిరి హిత్రపు లోహతి మంత్రి సామంత వర్గం బిది యేమి పనియని యిమ్మహారాజునకు దోఁ చెనను వారును నెవ్వరిగుణమ్ము లెవ్వరెఱుంగుదు రిట్టిసాహసమ్మునకుం జొత్తు రేయను వారును నయ్యుండి ంత నమ్మహీ కాంతుండు. 82 స్వాములకు దోషములేమికిఁ గులశేఖరుఁడు పాము ముట్టుట తే.గీ. చూడు డెల్ల వారు శుద్ధాంత రంగులు 0 భాగవతులు వారిపట్ల ఁ గలుష వృత్తి లేదటంచు వెనఁ గేలఁదడ వెద సర్ప మూఱకునికి సాక్షిమీరు. 85 అనిపలికి దయాసముద్రుండగు రామభద్రుం దలంచుచు. 84 కం. చండాళీ విష భీషణ భాండమ్మునఁ గేలుసొనిపి భయవిరహితుఁడై యుండిన మండలవతిఁగని గుండియ లిట్టట్టు చెదరెఁ గొకొని ప్రజకున్. 85 రం. తృణరజ్ఞులీల వంచిన ఉ. ఫణమెత్తికయన్ని ఘోరఫణి గాంచి నృపా గ్రణి యొక్కకడకుఁ ద్రోచుచు మణిముద్రిక డిగిచిచూపె మనుజుల కెల్లన్, సురగంధర్వవిహం. పుంగవులు యక్షుల్ సిద్ధవిద్యాధరుల్ ధరణీవల్లభు సత్యధర్మముల కాత్మన్' విస్మయోల్లాస ని క్భరులై యాతినిమీఁద దిన్యకుసుమ వ్రాతిమ్ము వర్షించి ర చ్చరబోటుల్' నటనావిశేష లలితోత్సాహమ్ము వాటింపఁగన్. అప్పుడు మంత్రులెంతయు భయంపడి మేరులు సంచలింప మా తప్పు క్షమించుమంచు వసుధావరు పాదములందు వ్రాలినన్' జొప్పకు శాంతి చేఁ బలికె నుక్కి వెతంబడ నేల ! స్వాములం దెప్పుడు భక్తియు క్తిఁ జరియింపుడు ముష్కృతమెల్లఁ బాయఁగన్,

86 87 88 150 చతుర్థాశ్వాసము భూమినాతంత పౌరజనంబుల సాధువాదంబు బెరియుకలకలంబు ఊశీల నెసంగె నప్పుడు. శ్రీమన్నారాయణ సాక్షాత్కారము సీ. మురువుదీపించు నెమ్మోమ జాబిల్లిపై చిఱునవ్వు వెన్నెల చెలువుఁజు - ప జిగిదళుకొ త్త వాసించుపొక్కిటితమ్మి బొమ్మవేలుపు జన్మభూమిఁ దెలుప నడుమునఁ గాంచీగుణవ్యా ప్తి బొడ్డులో గలజగమ్ములకుఁ బై కాఁపుఁబూస పొలుచు వక్షోహారములు చందిరఁపుఁ గాప్ కమలాకుచగాని గణనసేయ "తే మంజుళంజాత కింజల్క పుంజ రుచిర ఉ. નો 金 పీతకౌ జీయరుచులు మైఁబెరయ విహగ రాజతురగమ్ము నెక్కి శ్రీరంగరమణుఁ డమ్మహీవల్లభునకుఁ బ్రత్యేక్షమయ్యె. మించుల మించు వస్త్రరుచి మేదుర భూషణరత్న దీధితుల్ మించిపొనంగ నిన్ని ఁటినిమించి మురాంతకుదివ్య తేజమున్ గాంచుటకుఁ దలం కెడుమనంబు నొకించుక నిల్వరించి సే వించె నృపాలమౌళి యరవిందడముని పాదసన్నిధిన్. తే.గీ. ఇట్లు ప్రణమిల్లి యతఁడు లక్ష్మీకు నెమట నిటలతటమున నంజలిపుటముఁ జేర్చి సమ్మదాశ్రులు కన్నులఁగ్రమ్ము దేఱ సవినయమ్ముగ నిట్లని సన్నుతించె. చం• సరిసిజగర్భశంకరీ కృశానుశతశ్రతు ముఖ్య సేవ్య ! భా సురమహీమాలవాల ! పరిశోభితభూరియశో విశాల ! దు ష్కరదనుజవ్రజోగ్ర బలఖండనపండిత కాండజాల ! ను స్థిరనిగమాంత సంచరణశీల ! సుధీజనపాలన ప్రియా ! 89 90 91 92 98 కులశేఖర మహీపాల చరిత్ర ! 151 సంజాత డకము, శ్రీమత్సుధా-భోధి వీచీ చలచ్చేషభో గ్రీంద్రపర్యంక శాయీ ! ప్రపంచో దయాదిక్రియాసంవిధాయీ ! సధర్మానుయాయీ ! బుధానందదాయీ జగజ్జీవనాధారసమ్యగ్విచారా ! ధరాభార సంహార కార్యావతారా! జితా రాత్రిశూరా ! మహోదారలక్ష్మీ శ్రీ విహారా ! గభీరోరుసంసారఘోరాం బురాశింబ్రవేశించి నిర్మిస్తులై తీరమున్ జేసి గాజాలరజ్ఞుల్ కడుం బ్రాజ్ఞులాత్మన్ భవద్విగ్రహధ్యానయోగంబు పెన్నావగాఁ జెంది నిశ్శంక బుద్దిన్ నిజృభింతు రానందసంధానసద్మంబు లైనట్టి మీ పాదపద్మంబు లెల్లప్పుడున్ గొల్చు వారెంతవారొక దా! త్వత్ప్రభావమ్ము భావింప నేనెంతవాఁడన్ మహ త్తి త్వసంభూతభూతాద్యహంకార శబ్దాది తన్మాత్రజా భానిలాగ్ని క్ష మాఖ్య ప్రసిద్ధ బులౌ పంచభూతంబు లన్యోన్య యోగంబుసం జేసికాదే ప్రపంచంబ నే కాళ్ళతుల్ దాల్చి చూపట్టు నోయయ్య నీనెయ్యెడ సూక్ష్మరూపంబునంజొచ్చిన ర్తింతు నీ వేకదా! మున్ను కల్పాంత వేళిన్ ' మహల్లో లకల్లో లవీ చీన ముద్యత్ప యో రాశి మధ్యంబున్ దివ్యతేజోనుకాస ! నమో ! మీనమై వారిధింజొచ్చి డై త్యాధముంద్రుంచి వేదమ్ములా వేదకర్పింపవే చెప్పకంబై భారం బున౯ మందు ్మధరం బ-బధింగస్వముంజేసి దేవాసురుల్ దచ్చుచో గ్రావసంభోధిఁగ్రసంగ విలోకించి కారుణ్యదృష్టితో మహోర్మిచ్ఛటల్ జర్ఘరీభూతముల్ గా వడింగూర్మమైచొచ్చి యక్కొండకుం ద్రిండుగా దండీవై నిల్చి చంచత్సుధాకుంభసంభూతి గావించి బర్హిర్ముఖశ్రేణులక్ బ్రోవవే ! దుర్జయుండై హిరణ్యాక్షుఁ డుర్వీతలం బంతయుం జాపచుట్టంగ నీక్షించి బ్రహ్మాదులత్యంత భీతిన్ వితర్కించుచోనో మహోదార ! భూదారరూపంబున౯ దైత్యువడమ్మ భేదించి నిష్ప్రణునింజేసి లోకమ్ములంగావవే ! యింకఁ దత్పూర్వజుండైన దుష్టాసు రేంద్రుండు సమ్యగ్గుణాదారు గోవిందపాదాబ్జచింతావిహారుం గుమారున్ని రోధించి నాతోవిరోధించె దే దుర్మతీ ! యివ్విరించి ప్రపంచమ్మనం దెవ్వఁడైన మదీయాజ్ఞ కున్మించిన చెనే! విష్ణుఁ డెందెందు శోధించినందోఁచు సంచీవు 'శోషిం చెద పైన నేతత్సభా స్తంభమధ్యంబునం జూపుమం చుగ్రబాహాగ్ర సంఘట్టనధ్వాన నిర్భిన్నదిగ్ధంతి కర్ణద్వయీగోళముల్లా సభా స్తంభమున్ వ్రేయ సందద్భుతాకారఘోరమ్ముగా ముద్భవంబై నృసింహాకృతిం బెంపువాటించి దైత్యేంద్రుని న్మింటిపై నొంటిమై వంటి రానీని వేగంబునం బాఱుచో వానిఁబోనీక యుమ్మద్భుజదండసంఘట్టి 0 152 చతుర్థా శ్వాసము తుం జేయుచుందెచ్చి రాజత్సభాద్వార దేశం.. సం దూరు దేశంబునం బేర్చి దఃభోళిధా రాధి కారంబు న దందనిందించు చంపన్న ఖాగ్రంబులం దున్మితూటాడి తత్పుత్రు నత్యంత సౌభాగ్యసంపన్ను నిం జేసి రక్షింపవే ! తొల్లియి.ద్రుం బలీంద్రుండు చండప్రతాపానలజ్వాలలం గ్రమ్మి నా కాదిలోకమ్ములన్ న్నిల్వఁగానీక ఘోరాటవిం జెందగాఁ జేయుచుస్ బూజ్యమైనట్టి స్వర్ణోక రాజ్యమ్ము తాఁజేయుచోఁ ఆశ్యప ప్రార్ధనావాక్య సంతుష్టచిత్తుండ వై వామనా కారమే పొు యాజ్ఞా మద్దానుం జేరి నాకు జపస్థానదానమ్ము గావించు మూఁడడ్గులంచుం బ్రసంగించి మైకొన్న చోఁ బాదముల్ "పెంచి బ్రహ్మాండగోళంబు పాదద్వయింగొల్చి డై త్యేంద్రునోడించిస్వారాజ్య మింద్రాది బృందారకుల్ మెచ్చంగా నిచ్చి పోషించ వే! యింక మున్గార్త వీర్యార్జునాది క్షమాభర్థ అత్యంత గర్వోద్ధతిన్ ధర్మవిధ్వంసమున్ జేయఁ గోపించి నీవయ్యెడన్' జామదగ్న్యడవై పుట్టి పాపక్రియో పార్టునుండైన యయ్యర్జునుందాఁకిత ద్భాహుసాహస్రముల్ తిత్కిరీటోజ్జ్వలంబైన శీర్షంబుతోడన్ గుఠారోగ్రధారాహతిం ద్రుంచి గర్వాంధ రాజన్యక ధ్వంసమున్ జేసి భూభారమున్ మాన్పవే మున్ను లోకై కసంరక్షణం బాచరింపన్ విరించాదిసం ప్రార్థణంజె ది ధాత్రీస్థలిం గోస లేంద్రాగ్ర భార్యాలసద్గర్భసంభూతి వాటించి శ్రీరామనామంబుగన్ బూర్ణ చంద్రాకృతిన్ సొంపుదీపించి ఘోరధ్వనిధ్వస్త నానాపుర గ్రామ శృంగాటకం దాటక ద్రుంచీ సంగ్రామికోత్యాహు నత్యుగ్ర దేహున్ సుబాహున్ ధరనూల్చి మారీచు సంభోధివీచీనిమగ్నాంగు గావించి మౌనీంద్రుయాగమ్ము సౌభాగ్య యోగమ్ము గావించి వేఱక్కచోటన్ మునీంద్రోగ శాపమ్మునన్ గ్రావరూపమ్మునన్ గాననాపన్న యైయున్న యన్మని దేవిన్ " గృపాదృష్టినీక్షించి నీపాద పద్మద్వయీసాలసు లేశమ్ము సన్ దోషనిర్ముక్తయై తొంటిరూపమ్మునం జెంది తద్భర్తృసంభోగ సౌఖ్యమ్మునొందింప వే ! శంకరోదగ్రకోదండద ఉమ్ము ఖండమ్ములౌ నట్లు గావించి లోకైక విఖ్యాతల క్ష్మీకళాజాతయా సీతఁ బెండ్లాడి త్రోవన్ని రోధించినన్ భార్గవుందోలి నా కేతముంజేరి నీనంత మాత్రం ద్వేష యోగఁబునన్ రాజ్య సౌఖ్యాభిలాషమ్ము చాలించి సమ్యగ్గుణో పేతయై యొప్పు సీతామహాదేవియున్ ప్రేమదీపింప సౌమిత్రియుం గొల్వఁగాఁ దాపసాకార మేపారఁ గాంతారవీధిన్ విరాథన్ ఖరున్ దూషణాద్యుగ్ర తేయులం ద్రుంప వే! రావణుండంత దుస్తంత్రుఁడై ధారుణీకన్యఁ 20 కులశేఖర మహీపాల చరిత్ర 153 గొంపోయి లంకాపురారామసీమన్ జెజిన్ బెట్టుటన్ నీవు సుగ్రీవసాం గత్యమిoపొందఁగావించి యొక్క మ్మునస్ వాలిఁదూలించి సుగ్రీవు రాజ్యాభి షేకోజ్జ్వలుంచేసి తత్సంగతిని వార్ధి బంధించి వేగస్ హనూ మతభృత్యుగ్రశాభామృగశ్రేణితో లంక కేవించి 3 ధూమ్రాక్షకుం మౌని భేంద్రజన్ముఖ్యులం జంపి యక్కుంభకర్ణన్ ధరనూల్చి జైత్యేశ్వర ప్రాణవిధ్వంసమున్ జేసి నీదాసునిస్ సంభకర్ణానుజుంబ్రోచి బ్రహ్మేంద్ర ముఖ్యుల్ భజింపంగ సీతాసమేతుండవై జాంబవచ్చారువు తొంజ నే యాంగ దాదుల్ వెసంగొల్వ రత్నప్రభావిస్ఫురత్పుష్ప కారూఢి నేతెంచి మా ర్తండవ శావనీశ ప్రియంబౌన యో ధ్యాపురంబున్ బ్రవేశించి గంధర్వ గానంబురంభాదినాట్యప్రసంగంబులున్ కణ్వాది వ్రజంబున్ సునాసీరముఖ్యామరశ్రేణియుస్ భూరి భేరీమృదంగాది హో షములుంబర్వఁ బర్వేందుబింబంబుచంద బునం గాంతి పెంపొందఁ బట్టాభి షి. కుండపై లోక సంరక్షణోపాయమేపారశోభిల్ల వే! యింకనుం దేవకీదేవి గర్భంబునంబుట్టి పెంపేర్పడస్ రామకృష్ణాభిధానంబులన్ బెంపువాటించి వ్రేపల్లెలో నల్లవుల్ మెచ్చ' గ్రీడించుచున్ వెన్న లుంబాలు చౌర్యం బునం గ్రోలుచో గుంపులైగోపికల్ రంగుసేయన్ బ్రమోదింప వే ! పూతనాఖ్యన్ దృణావర్తూనిస్ వత్స చైత్యున్ బకాభ్యాసురాభిఖ్యులస్ ద్రుంచి గోగోపక వ్రాతమున్ బ్రోవవే ! కాశీయాహిన్ మదంబింక పాదం బులంద్రొక్కిస్రుక్కింపవే! వజ్రకోపించుటన్ ఘోరపాషాణవాతాంబు పాతంబులన్ గోకులం బాకులంబండగాఁ జేయు మేఘవ జంబుకో విలోకించి గోగోపగోపీజనంబుల్ ప్రమోదింప గోవర్ధనోర్వీధరంబెత్తి హస్తాగ్ర పీఠమ్మునన్' నిల్పి ఛత్రమ్ముగాఁబట్టి యాధీసులు బ్రోవవే ! గోపికల్ నీపయిన్ మోహవిభ్రాంతిచేఁజేరి ప్రార్ధింప గద్వాంఛలీడేర్పవే ! ధర్మ విధ్వంసునింగంసుహింసించి మోదంబునన్ గల్లి దండ్రుల్ హితుల బంధు సందోహముల్ సంతసింపంగవ ర్తింపనే! కీర్తి మూర్తీభవింపన్ ద్విజ శ్రేణులన్ బ్రోవవే! మాగధాదిద్విషత్కోటి నిర్జించి శ్రీరుక్మిణీకన్యకం దెచ్చి పత్నీ వతంసంబుగాఁ జేయవే ! పాండుపుత్ర ప్రియా కాంక్షి వై దుష్ట చారిత్రుదుర్యోధనుఁ గూల్ప వేచక్రపాణీ! జగన్నాథ! నిన్నున్ భజింపంగ శక్తుండనే రాక్షసవాత నిర్యాత నేచ్ఛన్ దకీయాంగ నాసదతధ్వంస ముంజేయ బుద్దావతారంబుగై కొంటివింకన్ గలివ్యాకులంబైన కాలంబు నన్ దుర్మదోదగ్రమై మ్లేచ్ఛ వర్గంబు దోర్గర్వదుర్వారవృత్తిన్ విజృం 154 చతుర్థాశ్వాసము భించి ధర్మక్రియా నాశముం జేసి వి ప్రాదిక ప్రాణిలోక ప్రమాదావహంబై న యత్నంబునన్ మించి బాధించినన్ గాంచి కోపించి నీవయ్యెడ గుల్కి కాదె రంగత్తురంగాధిరూఢుండవై బాహుదండస్ఫురన్మండలా గ్రంబునం దుష్టులం బట్టి ఖండించి సన్మార్గముల్ పెంచి లోకంబళోకంబుగాఁ జేసి రక్షిం పవే! వృష్టి చేఁ దుష్టిగావించి సస్యాభివృద్ధికి బ్రజన్ బ్రోవవే! గ్రాహ సుగ్ర సమై హ స్తిరాజమ్ము ఘోషింకపు గారుణ్య మేపారనే తెంచి రక్షిం పవే! కర్మవిజ్ఞాసభ_క్తిప్రపత్త్యాదులందెద్దియుం జేయఁగాఁజాల నీపాద పద్మద్వయంబున్` శరణ్యమ్ముగా నమ్మితిన్ నన్ను రక్షింపవే! భక్తమం సర్వప్రజాధార ! లక్ష్మీ విహారా ! నను సేనమస్తేనమః, ୪ చం. అనుచు నుతించుచున్న వసుధాధిపతిన్ గరుణామృతమ్ము చే నేనసినచూడ్కి ఁ జూచుచు రమేశ్వరుఁ డాతని మేను పల్లవం బన మృదులీలనొప్ప నిజహస్తతలంబున నంటుచున్ గుణా వనతుఁడవీవు నీకు సరివత్తు రె ! దివ్యులు భక్తియుక్తికిన్ . తే, మెచ్చువచ్చితి వేమైన నిచ్చఁగల్గు చం. తే, వాంఛ దీర్చెద నరవర! వరము వేడు మనినఁ గుల శేఖరుఁడు వినయమునఁబలి కే స్వామి ! నీపాదభక్తియే చాలుననుచు, సురనరనాగలోకముల శోభిలుకన్యకలందు విందుమె వ్వరు సరిరారు రూపగుణవై భవలీలలు నీతనూజ కి దరనని లోకు లెన్నఁగ నుదారగుణాకర ! నాదుకన్యక దీరముగ నీకు నీఁదలఁచితిన్ జెలిఁ బెండిలిగమ్మ నెమ్మితో. వరమిదియెయనిన నవ్వుచు హరి యిట్లను నోసుగీజనాగ్రణి ! లక్ష్మీ ధరణీనీళాళఖ్యలు ము వ్వురు మత్సతులనుచు నెఱుఁగవో! వేదములకీ, ఇపుడు నేను రంగమందుండు టెఱిఁగి కోర్కి మదివొడమి నీదుపుత్రియై యుదయమందె 94 95 96 97 98 కులశేఖర మహీపాల చరిత్ర 155 కం వింటెనరపాల ! యే నంతకంటే మున్నె కోరియున్నాఁడ నెయ్యింతిఁ గూడుటకును. అని యభిప్రాయంబెఱింగించిన. రాజు ప్రియమంది యోఖగ రాజతురంగానుషంగ రంగపతీ ! మా రాజీ వేక్షణఁ బెండిలి గాఁ జేయ ననుగ్రహింపగావలయుఁ గృపన్ , 99 100 101 వ. అనుచుం బ్రారించినన దేవ దేవుం డట్లన కాని డని యనుగ్రహించినం గార్తాంతికులం బిల్వఁబంచి యా రేయి ముహూర్తనిశ్చయంబుగావించి ముక్తాఫల మాలికాభిరామంబును మరకతమణి ప్రభాశోభిత స్తంభసంభృతంబును బద్మరాగ శిలాపుంజమంజులసాలభంజికా రంజితంబును నగణితమణిగణకిరణభూషితసువర్ణ బిందు సుందరళ వాటశోభితంబును నగునొక్క మహా సౌధంబమ్మహాత్మునకు ట విడిదలగా నిరూపించి యచ్చటికి విచ్చేయునట్లుగావించి రుచిరాభిష్ట పదార్థంబులు సమర్పించి యంతఃపురంబు శృంగారింపందగువారి నియోగించిన. సీ. రచితసాము తాంగ రాగమఁటిసక ఆల్ తలఁగఁ జేసిరి సభా స్తంభములను రజమడంగఁగఁ జందనజలంబుఁ జల్లిరి వీధివీథులు బహిర్వేదిక లను మృగనాభి నలికి కూర్చిరి కప్పురంబున రంగువల్లికలు గేహాంగణముల రహిమించు పచ్చతోరణముల నెడ నెడ వ్రేలఁగట్టిరి కర్క రీఫలముల తే.గీ. ధూర్తు లెసఁజల్లు పిష్టాతధూళి బొరయు పటిక ముల నొరసిరి ? [మఱి] పావడముల ప్రేమ దళుకొ త్త నిలిపిరి నృపతిగృహ వి టంకతటములఁ జత్రపటధ్వజములు. 102 10% 156 కం. సరసాన్న పానముల న చం. కం. చతుర్థాశ్వాసము న్నరవరుఁడు సమస్తజనమనఃప్రియముగ భూ సురసంతర్పణ మత్యా దరమునఁ గావించే విబుధతతి మెచ్చంగ౯. ఫలములు జున్ను ఖజ్జములు పాయసముల్ గలమాన్న మప్పడం బులు వడ లిడ్డెనల్ సగుడ మోదకముల్ మినియంపుఁజూరు సం ధిలు మృతపూరధారలు తుదిన్ దధిఖండసహాయమేర్పడన్ జెలిమి భుజింపఁబె నృవసింహుడు బంధుహితార్దకోటికి. 104 105 . అంత సమ్మహీకాంతుండు నిజకెన్యాసకులు బిలిచి యిట్లనియె. 106 మీర లిపుడేనని మా నీ నొలం గౌరమణికి నుచితమంగళస్నానా కారమ్ములు గావింపుడు నారీమణులార ! కడు మనఃప్రియమైన గ 107 అని యాజ్ఞాపించిన నవ్వెలందుల మందగతిం జని యొక్క మణిమాలి కాలంకార సురుచిరంబగు మందిరంబునందు సముచిత పీఠమ్మనం గూర్చున్నయన్నె లంతం గాంచి డాయంజని యిట్లనిరి, కం. ఏ వేళన్ మది' గూస్తు వాఘకుఁడు తానేతెంచె మీతండ్రీ సం భావించే న్ని ను బెండ్లి సేయఁగ శుభాంభస్స్నాన శృంగారముల్ 'మిషన్ మముఁబంచినాఁడిచట నా లస్యమ్ము గానీక లే నాలస్యమ్ముగానీక 'బే లేవమ్మా రుచిరాంగి! నీవిభవ ముల్లేఖంపలేరెవ్వరున్, గా అనుచు నృపకన్యఁ దోడ్కొసి చని యొకసీఠమున నునిచి జల క్షేక్షణలో య్యన సభ్యంగ స్నానం బోనరించిరి పరిచుళ ప్రయు జలములన్. కం. ఒడలు తడియార్చి పొందళు కెడలని నునువలువఁ గట్టనిచ్చి నెఱికురుల్ 108 109 110 కుల శేఖర మహీపాల చరిత్ర 157 దడవి ముడియునిచి జగిచిం మ . దెను కస్తూరితిలకమిడిరి నెలలకు నునుట, సరవిం గన్నులఁ గజ్జలంబు నిచి చంచ చందనస్వాదుప త్రరుచుల్ చెక్కులఁ జేర్చి కర్క శకుచద్వంద్వంబునజ్" గుంకుమ స్ఫురణం బేర్చఁడఁ జేసి మానికఁ పుసొమ్ముల్ శోభిలక్ బెండ్లి కూఁ తురు గావించిరి పేరటాండ్రు మహిళృత్పుత్రికా బ్రమోదమ్మునక్, తే.గీ. హారతాటంక హీర మంజీర కటక కాంచికా హంసకచ్యుతుల్ గడలు కొనఁగఁ దనరు రాజన్యకస్యకఁ గనక పీఠి నునిచి పాటలు వాడిరి సనజముఖులు. 111 112 118 వ, అంత మళ్లీ కాంతుండు రంగ విభునకు మంగళస్నానాలంకారాద్యు ప చారంబులాచరింపందగిన పుణ్యాంగనలను వేదవేత్తలగు విప్రవరులం బంచిన వాళలమ్మహాత్మునిసందర్శించి వచ్చిన కార్యంబు తెజం గెఱింగించి తదనుజ్ఞఁ గైకొని, కం. సీ. మోము సెమర్పఁ గన్ను లఱమోడ్పు వహింపఁ గ చ ప్రసూనముల్ వేమఱు జాఱుపాఱఁ గుచవీధి దొరంగి సరుల్ నటింప హ సామితరత్నకంకణచయధ్వని సొంపువహింప నొక్క కాం తామణి నేర్పుచే సురభితైలమునం దలయంటె శౌరికిక్. ప్రాంచద్భహుమణి కీలిత కాంచనకలశోదకములఁ గడు వేడుక దీ పించి జలకమాడించిరి పంచాన మధ్య లపత్రాగునకుకో. పనితెయెుక్క తో సవ్యకనకతాంబడం బందిచ్చి లోకైకనుండరునకు తరుణియొక్క తె ఫాలతలమునఁ గస్తూర్ రేఖఁ దీర్చె వినన్రు లేఖుసుకును 114 115 116 158 చతుర్థాశ్వాసము సుదతియొక్క- తె సంకుమదమృదు శ్రీగంధ మలఁదె భక్తాభీష్ట ఫలదునకును జెలియోర్తు మకుటళుండలముఖ్యభూషణో త్కర మొసంగెను సుధాకరముఖునకు తే. గీ, వెలఁదియొక్క తె సుమమాలికలు మురారి కంఠమునఁ జేర్చె `నేతొక్క కంబుకంఠి పసిఁడిపావాలు దొడిగె శ్రీపతిపదములఁ జికిలిముకురమ్ముఁ జూపె నేఱక తె హరికి. 117 ప ఇ తెఱంగున సమ్మ త్త కాశినులప్పురుషో త్తము నలంకరించి మణివిచి త్రరుచివిలసితంబగు నొక్క సమున్నతకసకపీఠమ్మునందునిచి మహీసురమంత్రో చ్చారణరవంబు లెసంగం గొలిచియున్నంత. 118 సీ. అరుదెంచె గరుదంచలాంచీత హంసాశ్వ సాదరుండగు సారసోదరుండు చనుదెంచె శుభ్రాభ్రసముదగ్ర వృషభైక వాహితుండగు నీలలోహితుండు నేతెంచె గతిచాతురీ హితారోహణో చ్చైశ్రవుండైన వృద్ధశ్రవుండు తరలివచ్చిరి మరుద్వరుణవహ్ని కుబేర ముఖులు శ్రీహరిపదాంభోజసఖులు తే.గీ. నపుడు చేరిరి గంధర్వు లప్సరసలు రంగవల్లభు పరిణయారంభ మెఱిఁగి యందఱచటకుపఱ తెంచి రధిపుఁ గొలువ జయవిజయ శేషభజ గేంద్ర సైన్యపతులు. కం. పేక్కండ్రు విబుధ శేఖరు లొక్కటఁ దను జుట్టి కొలిచియుండఁగఁ దేజం బక్కజముఁగ హరియొప్పెక్ జుక్కలలోఁ జంకకుండు శోభిలు భంగిన్. 119 120 కులశేఖర మహీపాల చరిత్ర ఆ. వెళ్లి కేరళేశ్వరుడు కేశవుతోడ వి చ్చేయవలయు దడవు సేయవలదు వరముహూర్త వేళ వచ్చుచునున్నది యనుచుఁ జెప్పిపనిచె నచ్యుతునకు, కం. జనవరుని పలుకులేర్పడ 159 121 నీళాకల్యాణము విని రంగవరుండు చిత్తవృత్తులలు ము న్న నువ ర్తించిన సురవర ముని సంఘముతోడఁ గదలే ముదమొదఁ బొరల. 122 వ. ఇవ్విధంబున జగచ్ఛరణ్యుండగు శ్రీరంగ వరేణ్యుండు సంఛదిత విచిత్ర వర్ణాదీర్ఘ కుథాంచలవిలంబిత చంచస్మణీమాలి కాశోభితో భయపార్శ్వభాగంబును జిరత్నరత్నకింకిణీరుచి)సూత్రసం వేష్టిత శింజాన చతుశ్చరణంబును సుధాంశుకరనిభో దంతదంతంబును నగు దంతావళంబు నారోహించె నప్పుడు. సీ. అంకుశమ్ముధరించి యహిహంత యంతయై ఘనగఙస్కంధ భాగమున సమర శేషుండు ము తెంపుజగజంపు జిగి పెంపు తళుకులగొడుగు చందము వహింప కనక వేత్రము పూని గజిబిజి యడఁప వి ష్వక్సేనుఁ డగ్రదేశమున నడువ సరవి నిర్వంకల జయుఁడును విజయుండు రహిమించు దెలిచామరములు వీవ తే.గీ. బ్రహ్మరుద్రాది సకలసుపర్వవరులు కదిసి యేతేకఁ గరదీపి కాసహస్ర దీ ప్రపథమున విచ్చేసె దేవదేవుఁ డమితి వాదిత్రఘోషమ్ము లతిశయిల్ల, తే.గీ. సరనసౌరభ మృగమదసాంకవారి కలిత చందన తాంబూలములు పసిండి పళ్లెరమ్ముల నిడుకొని ప్రమదమెసఁగఁ బుణ్యకాంతలు చనుదేర భూవిభుండు, 123 124 125 160 వ. చతుర్థాశ్వాసము బంధుజనసహితుండై వివిధ వాద్యరవమ్ములు పిక్కటిల్ల ముచుకుంద వరదు నెదుర్కొని. చం, మృదుల సుగంధ చూర్ణములు మేనులపైఁ గురియించి యందుస్ గదిసినచో సృపాలుఁడు జగత్పతికిం గలపంబల: ది స మ్మదమున సూనమాలికల మానితలీల నలంకరించి సొం పొదవ విరించిరుద్ర పురుహూతమునిద్విజులన్ గ్రమమ్మునన్. 126 127 వ. సముచితపూజావి శేషమ్ములం బల్నీ సహితులగువారలకుం బ్రియంబు నెఱవీ యందఱందోడ్కొని చన నగరవీధిం గ్రమ్ముకొను రంభాద్యప్సరోగణమ్ముల నృత్తప్రకారమ్ముల వీక్షింపుచు మందగతిం జనునప్పుడు భేరీపట హభాంకారఘోష మ్ములును గాహళ వేణువీణాగాన స్వాసమ్ములును దిశలం బర్వె నయ్యవసరమ్మున 128 వేణువీణాగానస్వానమ్ములును సీ. తుంబురు నారద స్తుతగీతరసలీల భౌమగాయక గాన ఫణితి గాంచె రంభోర్వశీకృత ప్రచురనాట్య విధంబు నగర వేశ్యానృత్త సయత నేన సె ఆంగీరసోదీరి తాగమస్వర సిద్ధి నగవద్విజోచ్చారణతఁ బొసంగె సురకంఠముచారసూన సౌగంధ్యంబు జనధృతప్రసవవాసనల నొదిగె తే, గీ, మఱియుఁ గౌబేరనిలయ సంపత్ప్ర భావ మానృపతికోశగృహలక్ష్మి ననుసరించే వింతగాదిది శ్రీరంగ విభుని కరుణ కలిగె నేనియు సచట దుగ టముగలదె. వ. 129 ఇత్తెఱంగున రంగవల్లభుండు మహీ సురస్వ స్తివాచనంబులతో సంతః పురంబు సొచ్చిమొగసాల నేనుం గుడిగ్గి సేనాపతికగంబవలంబించి కత్యంతరంబులు గడచి విరించి ప్రభృతులు పొదివికొనిరా నేతెంచి ముందట నతివిచిత్రపాంచాలికా సముదంచిత స్తంభాభిరామంబును బరిస్తీర్ణమనోహరణా స్తరణశోభితంబును నగు కల్యా ణావసథంబు నగు మొగంబునం బ్రవేశించి సపరివారంబుగా నాసీనులై యున్నంత. 180 కులశేఖర మహీపాల చరిత్ర - తే.గీ. అపుడు నగరి పురోహితు లమర గురువ శిష్ఠముఖ్యమునీంద్రులచే ననుజ్ఞ కాంచి యుచితస్థలంబునఁ గనకవిరచి తోపకరణమ్ము 'లునిచి మంత్రోక్తు లేసఁగ. పావనపీఠమున రంగపతి నునిచి యిఁకన్ 161 131 కం. వైవాహిక సమయోచిత వేవేగఁ గన్యఁ దోడ్కొని రావలయునటంచుఁ బలుక రాజు ప్రియమునన్. 182 కం. చెలులఁ గని కన్యకామణి నెలమిన్ దో డెండు మీరలిపుడని పనుపన్ జలజాక్షులు వేగమెచని కలవాణిం గాంచి ప్రేమ గడలుకొనంగన్. 188 మతిమతి మాలతీ సుమసమానశరీరిణి ! మంజు భాషిణీ! కుతుక మెలర్ప లోకములకుం బతి నీపతియయ్యె, నయ్య నీ కతిహితమాచరించే సముదంచితమయ్యె విగించి లేఖ ము న్నతనుఁడు నిన్ను నేఁచె నిఁక నాతని నేఁ చెద వమ్మ క్రమ్మఱక్. తే.గీ. అనుచుఁ గించిదవాఙ్ముఖియైన రాజ కన్య కరమూఁది తిగిచి యగ్గలిక మిగులఁ బొదివికొని వచ్చి చూపఱద్భుతము నొందఁ దండ్రిముందట నునిచిరి తలిరుబోండ్లు. తే.గీ. అంత సంకల్పతంత్రమంత్రాది విధులఁ బరగు వైదికముఖ్యు లేర్పడఁగఁ జేయ సరవిఁ గూర్చున్న యవ్వధూవరుల కపుడు నడుమఁ దెఱఁబూనిరి భవుండు నళినభవుఁడు. కం. జనపతి పసిండిపళ్ళెర 21 మున రంగేశుని పదాబ్జములు నిలిపి ముదం బున శుభ జలములఁ బ్ర శనమొనరిచి మాళిఁ దజ్జలమ్ము వహించెన్. 184 185 136 137 162 కం, దర్పకుఁడు విరిశరమ్ముల కం. కం. చతురాశా ర్థాశ్వాసము ననుచుఁ దలఁక మహీశుం దర్పం బెడయయ్యె డేర్పడ నొగి మధుపర్కం బర్పించెన్ రంగపతికి సర్క ద్యుతికిన్. నరనాథుఁడు ప్రాగ్జ్యోతిష ధరణీశుండొసఁగు గంధదంతావళమున్ హరికి సమర్పించేఁ బురం దరుఁ డిచ్చిన కల్పకుసును దామమ్ములజోన్. ఆరట్టవిభుఁడు మును దా కోరినక్రియ నిచ్చు చటుల ఘాటకముల ల క్ష్మీరమణునకిచ్చెన్ మది కూరిమి దళు త్త రత్నకుండలములతోన్. 138 139 140 వ మఱియుం గుల శేఖరధరారమణుండు మదింబొదవుముదంబు తుది గానంబడక జగద్వల్లభుండైన యల్లునకుఁ బరార్థ్యహారకిరీట గోహిరణ్యాదిపదార్థం బులు సమర్పించే సంత వధూవరులకు మఱుంగుపడ నెరంగు తెఱ వీడం జేసిన. 141 సీ. రంగవల్లభు చూడ్కి రమణిమోమునఁ జెందె సతిచూడ్కి విభుపదాబ్జమునఁ బెనఁగె వరుచూపు బోటీ కంధరమున విలసిలె చెలి చూపు హరియూరువులఁ దనర్చె కాంతువీక్షణ మింతిఘనకుచమ్ముల వ్రాలె నాతివీక్షణ మీశు నాభి నెసఁగె పతిదృష్టి సఖినితంబములపై ఁ బ్రాపిం చె యువతిదృష్టి మురారియురము బ్రాఁకె తే.గీ. నాథుని విలోకనమ్ములు నాతి యూరు జానుజంఘాదులకు డిగ్ఁ జంద్రముఖి వి లోకనమ్ములు భర్త బాహకపోల నయన నిటలావలంబనోన్నతికి నెసఁగె. తే.గీ. రంగపతి తన్ను ఁజూచిన రమణీమోము వాంచు నతఁడొండుజూచినఁ గాంచుమఱల 142 కులశేఖర మహీపాల చరిత్ర హంసములు ఖంజరీటమ్ము లందిడింది మొనసి డాఁగురుమూఁతలాడిన విధమున, కం. సంగతి జగముల కెల్లన్ మంగళదం బనుచు జన్మలు మది మెచ్చఁగ నీ శాంగన కంఠంబున హరి మంగళసూత్రమ్ముగ ట్టె మది ముదమెసఁగన్, అంచిత హేమపాత్రముల నక్షత్రముల్ దగ నాణిముత్యముల్ నించి నిజా ప్తులిస్గడీల నిల్చిన దంపతులింపుమీఱ ల క్షించి చలించుదోయిళులఁ జేర్చి పరస్పరమాళు లొప్పఁగా నుంచిరి ముద్దులేనగవు లూలెడుమోములు సొంపుగుల్కఁగన్. చం. పదపడి వహ్ని నేల్చి తనపాణితలమ్మునఁ బద్మగంధి కే ల్ముదమునఁ గీలు కొల్చి ద్విజముఖ్యులు మంత్రములుచ్చరింప నం బుదముపిఱుందఁ గ్రోమ్మెఱుఁగు బూనినరీతి లతాంగితోడ సౌ ఖ్యదహుతభుక్త్రదక్షిణము కైటభవైరి యొనర్చేనయ్యెడన్ . వ. Q 163 148 144 145 146 ఇత్తెఱంగునఁ గ్రమక్రమంబున వివాహకార్యక్రమంబు నిర్వర్తించి యొక్క మణిమంటపమ్మునందు సువిశాలమనోహరంబై నకుసుమతల్పమ్మునందయ్యి రువురుదంపతుల నునిచిరి. పుణ్యాంగనల జయమంగళంబను పాటలు రవం బెసం గె వేణువీ ణాపణవాది వాద్య ఘోషమ్ములు పిక్కటిల్లె గంధర్వగానంబువినంబడి యెనచ్చ రలు పెచ్చు పెఱిఁగి తమ హెచ్చులమెచ్చు లెఱుంగుటకు విచ్చలవిడి నటనమ్ము సలుపం దొడంగిరిట్లు మహావిభవమ్మునం దేజరిల్లుచున్న శ్రీరంగ వల్ల భుం జూచి. సీ. ఘటితరత్నచ్ఛటాజటిలహాటక మైన మకుటమ్ము గమలసంభవుఁ డొసంగె మంజురోచిఃపుంజ రంజితాభ్రంబైన పచ్చలపతకమ్ము భవుఁ డొసంగె మందారగంధసంబంధ బంధురమైన హారవారము సునాశీరుఁ డొసఁగె మానితాంబుజ రాగ మణిమండితములైన కుండలమ్ములు మృగాంకుం డొసంగె 147 164 చతుర్థాశ్వాసము తే గీ, వహ్నివరుణాది దిక్పతుల్ వసనభూష ణాదిసం భావన లొనర్చి రలవుమెఱసి రందఱును నవ్యతులసికాహ స్తులగుచు మంత్రపుష్ప మ్మొ సంగిరి మాధవునకు. సగముకల్వల తేని సరిపచ్చు నుదుటిపైఁ గ్రమ్ము క స్తురితిలకమ్ము దనర కెమ్మోవిరుచిగ్రమ్మి కెంపులకై వడి ముక్క ఱము త్తెముల్ మురువునూప రహిమించు చెక్కుల రవల తాటంకముల్ మితిలేని ధగధగద్యుతి నైసంగ కుంకుమంబలఁదిన కుచకుంభయుగళిపై మణిహారపంక్తి సంపదవహింప తే, గీ, సిరులెనయుచూడ్కి పొదల ముంగురులు గదల పసఁపుజిగిచీర మెఱయఁ బూఁ బాన్పుమీఁద ఘనుని చెంగట రాజన్యకన్యఁ జూచి విబుధ కాంతలు సిగెత్తి వెల నెరి తి తే.గీ. భారతీపద్మసంభవుల్ ' పార్వతీత్రి పురహరులు శచీపురందరులు మొదలు సురవలో త్తము లవ్వధూవరుల చేత మిధున తాంబూలములు గాంచి రధికలీల, శం. అంత వసంతములాడిరి పంతములిగురొ త్త విబుధపతు లచ్చరలున్ వింతగ సామంతులునటఁ గాంతలతో చలుపోరు గావించిరొగిన్, 148 149 150 151 వ ఇట్లు కృతోత్సవలీలావిశాలుండగు కులశేఖరనృపాలుండు కార్తాంతి కులవలన దంపతులనొకటి సేయుటకు ముహూర్తమ్ము నిశ్చయించి తత్సమయంబగు టయు నయ్యరువురు సముజ్జ్వలాలంకారశోభితులంగావించి గంభీర స్తంభసం భాస మానమ్మును విచిత్రచిత్రపుత్రికామనోహరకుడ్యమ్మును వినూత్నపల్లవతోరణోల్ల కులశేఖర మహీపాల చరిత్ర 165 సితపురోభాగంబును వివిధ వర్ణోపరినిబద్ధవి తానవిల సీతమ్మునువి తానపర్యంత లంబమాన విద్యోతమానఖద్యోతసదృశ సమృద్ధమణిమాలి కాలంకృతమ్మునునగునొక్క రమణీయ మంటపమధ్యంబునందు. తే.గీ. పచ్చరాఁగోళ్లు పవడంపుఁబట్టియలును పట్టువఱచిన నునుపట్టు పట్టెడలును దనరు పర్యంకపాళి మందారకుసుమ 152 పుంజములు మంజులాకృతిఁ బొందుపఱచి, 158 కం. పొందుగ ఫలభక్ష్యమ్ములు చంద నక స్తూరి కానుషంగ భరణీకల్ సుందరతల్పప్రాంతము నందునిచిరి చంద్రవదన లతి మోదమునన్ • 154 వ. అయ్యవసరమ్మున, 155 కం. వాచస్పతియు వసిష్ఠుఁడు తగినచోటుల శోచి పేశుండు తగిన చోటుల మంత్ర శ్రీచతురతఁ జూపిరి సమ యాచారవిచార కార్య మనుకూలముగన్, కం. వాణీయు శర్వాణియు గీ ర్వాణాధిపురాణి గూడి రాణించు గుణ 156 యిట్లనిరి. శ్రేణిఁ దనరు నీళాక ల్యాణిం దోడ్కొనుచుఁ జనిరి హరియున్నెడకున్ . 157 వ ఇట్లు దోడ్కొని చనుదెంచి శ్రీవత్సాంకు పర్యంతసమీపమ్మున నిలిపి బొంకుట నేర దర్ధిజనపోషణతత్పర సత్యధర్మని స్పంక చరిత్ర వృద్ధగురు భ క్తిసమన్విత శీలసతియా లంకృత కీర్తిశాలిని విలాసమనోహర తావకైకమో హాంకుర భిన్న హృన్న ళినయై యిటులున్నది రంగవల్లభా ! ఆ. వె. సరసవచనరసిక ! సకలపతివ్రతా తిలక మీమృగాక్షి దేవ! నీదు 158 159 166 కం. ఉ. కం. కం. చతుర్థాశ్వాసము పత్నులందు మెచ్చుపడ నేర్చు నీ ముద్ద రాలి మనసు దెలిసి యేలికొనుము. అని యప్పగించి దేవాం గనలు నగవులొదవు వదనకమలమ్ములతోఁ జనుటయు రం రం గేశ్వరుఁ డ జ్ఞానపతిసుతవలనఁ గేలుసా చెన్ బ్రీతిన్. జృంభితభర్తృమోహ మొక చెంత నలంత ఘటింప నద్భుతా రంభితయా నపత్రప భరమ్మున నిల్వఁగ లేక మంటప స్తంభము మాటుకుం జనినఁ దత్పరిరంభ విలోలచి తనం రంభమునం గనుంగొనుచు రంగ విభుం డెలనవ్వు మీఱఁగన్. విరిపాన్సు డిగి రంగే శ్వరుఁ డయ్యరవింద గంధి జాడుజని త త్కరపల్ల వమ్ము నిజకర సరసిజమున నూఁదినగ వెసఁగ నిట్లనియెన్. ఇదియే మే శుక వాణీ ! మదనాయాసమున నీవు మగువననుప నే నొదవిన వీరహశ్రమమున గదియం జను చేర, నెట్లుగాఁ దొలఁగితివో ! 160 161 162 163 164 అనిపల్కి యయ్యితిం గౌగిటం జేర్చి పూఁ బాన్పునక్కు దెచ్చె మఱి యునుమృదు మధుర సల్లాపమ్ముల నబ్బోటి పుయిలోటఁదీర్చి రంగవల్లభుండు. సీ. శశిబింబ మెంతనఁజాలు పూబోడి నే మ్మోముపైఁ గదియంగ మోముఁజేర్చె పసిఁడిచాయల డిందుపఱచుఁ జక్కని చెక్కు టద్దముల్ కళలంట ముద్దులిడియె మృదులబింబఫలంబు నదలించు సఖిమోవి నలరు సుధారసం బాసఁదోడఁగె గజకుంభములు 'గెల్వఁగడఁగు పీనప యోధ రంబుల సఖలాంఛనంబు లునిచే 165 కులశేఖర మహీపాల చరిత్ర తే, గీ. విరులు క్రొమ్ముడినునిచె ముంగురులుదడ వె ప్రబ్బి మేనులఁ బుల కాంకురమ్ము లెసఁగ మరుని చెయ్యులఁ బెగ గొన్న మమతకతన రమణి నీవికిఁ జెయిసాచె రంగవిభుఁడు. తే.గీ. ప్రౌడ పెంపున నయ్యింతి విభుని కేలు తనకరమ్మున బిగఁబట్టుకొనిన నగుచుఁ జెలియ చిబుకంబు నివురుచుఁ జెలిమి నెరపి రంగరమణుండు చెలి యనుగ్రహమువడసె, 167 166 167 వ. ఇట్లన్యోన్యబద్ధాను రాగులగు నయ్యిరువురు సురతవి శేషని హారమ్ముల మెలంగునప్పుడు చెదరిన తిలకమ్ములును జిక్కువడినహారమ్ములును సడలిన కేశకలాప మ్ములును ముదురులగునూర్పులును గలిగి పరిశ్రాంతస్వాంతులగుచుఁ బర్యంక తలమ్మున శయనించియున్నంత. ఉ. చందన శైల దేశమున సంజనితంబగు చుక్ సుమప్రజా మంద సుగంధసంపద సమంజసమై విమలోల్ల సత్సరో ఉ. ఉ. బృంద పయఃకణప్రజము 'పెంపెసఁగన్' మరుదంకునమ్ము గో విందుఁడు సుందరీమణియు వేడ్క సుఖంపఁగ వీచె నయ్యెడన్, జాతవియోగదుఃఖయగు జక్కవ మెచ్చఁగ మున్న హర్ముఖ శ్రోతకు వేళఁ దెల్చి విలసద్గతిఁ బద్మిని మేలనన్ మనః ప్రీతి చెడన్ జకోరకము, బిట్టలుకన్ విట చోరభంగ వి ఖ్యాతములై యెసం గెఁ జరణాయుధకంఠకఠోరనాదముల్, అయ్యెడ మేలుకొంచి కమలాసన మెల్లన శయ్యడిగ్గి కౌ నొయ్యన సంచలింప ముడియూడిన కొప్పు నెఱుల్ నితంబమున్ నెయ్య మొనర్ప సళ్లుకొను నీవి కరంబునఁబట్టి సిగు సం దియ్యక తోడ్పడంగఁ బడకిల్ వెడ లెన్ బదముల్ తడంబడన్, 168 169 170 171 వ. ఇట్లు వెడలిచను నెడ నెచ్చెలులచ్చేడియం గూడుటయు లజ్జాభరమ్మునఁ జిఱునగవు నెఱయు మొగంబెగ యిం పంజాలక యూఱక చనుచున్న యన్నరపతిసుతం జూచి వారలిట్లనిరి. 172 168 కం. చతుర్థాశ్వాసము ఏమియుఁ జెప్ప ఎప్పుడదియేమి సరోరుహగంధి మున్నుగా నీమది సంచలింప నతన్నిగదియంబడి చుల్కనైతొ, యా ధీమణి ప్రార్ధనల్ వడసి తేజముగంటివో ! చెవులన్నియున్ క్షేమముగోరు మాకు నెఱిఁగింపుము సఖ్య మునివ్వటిల్ల గన్ . అనిన వారలకిట్లనియె. అక్కట క్రొ తకతలు మీ రిక్కడ సెప్పెదరు వింటినింతియసరి యం దొక్కటియు నే నెఱుంగను జిక్కులఁ బెట్టంగ నేల చేడియలారా! అనిన సఖులిట్లనిరి. తే. గీ, ఏమియు నెఱుంగననుచు నీవిపుడు మమ్ము చిక్కు పఱి చెను సరులేలఁ జిక్కు గొనియె కుచతటుల నెలవంకలగుంపు మోవి కెంపు లివియేమి తెల్పవే కీరవాణి ! 178 174 175 176 177 అనియిట్లు సాభిప్రాయవచనమ్ము లెసంగ మందస్మితాలంకృత వదనార విందలగుచు నృపాలసుతం దోడ్కొని సముచితకృత్యమ్ములకుం జనిరంత. ఉ. తామరసాక రోత్సవవిధాయి రథాంగవిహంగ సంతత క్షేమసమర్ధనమ్ము సువి శేషబుధప్రజ[ వేద]భాషిత శ్రీమహనీయమై రుచులఁ జెన్నెసఁగె భువనైకదర్శన ప్రేమరసావలంబ మినబింబము తూఱుపుకొండ కొప్పునన్. కం. సీ. సూర్యోదయమ్మునకు స త్కార్యా[ హర్ముఖములెల్లఁ] గావించి మహాశా చార్యధురీణుఁడు హరి దను నార్యులుగొలువఁగ వరాసనాసీనుం డై చంద్ర చందనకళాసౌరభస్ఫురమాణ వదనవక్ష స్పౌష్టవం బెసంగ 178 179 180 కుల శేఖర మహీపాల చరిత్ర పాదాబ్జరాగవి భ్రమరుచిస్పృహణీయ లలితాధరాలకోల్ల సన మొప్ప పల్ల వావ ర్తశోభాగధీరస్ఫుర త్పదనాభిసురుచిర ప్రతిభ దనర శంఖకుంజరహ_స్తసౌందర్యయుత దీర్ఘ కంఠబాహువిలాసగరిమ దోన తే.గీ. మంజు కేయూర కుండలమకుట హా ముఖ్యభూషణములు మేన మురువు సూపఁ దేజరి లేడు కరుణావిధేయు నెదుట ఁ గాంచె దేవని కాయమ్ము గారవమున. 169 181 వ. ఇవ్విధంబునం గాంచి చతుర్ముఖశర్వగీర్వాణవల్లభులు దేవమునిసహి తులై రంగవల్లభునకుం బ్రణామమ్ములాచరించి ప్రసాదసుముఖుండగు నమ్మహాత్ము నిచే ననుజ్ఞాతులై నిజస్థానమ్ములకుంజనిరి కులశేఖర సుహీ వల్లభుండు నల్లుని యభి ప్రాయంబెఱింగి ప్రయాణోచితమ్ములగు చతుర్విధ సైన్యమ్ముల సమకట్టంబని చె మఱియును. చం• ఉరుతరత ప్త హేమ కలశోపహితాగ్రము పార్శ్వభాగ భా సురసురరాజరత్న రుచిశోభితదారుచయమ్ము కేతువి స్ఫురిత విహంగ పుంగవ విభూషిత మద్భుత వేగవాహబం ధురమగు తేరు రంగరమణుం డెదమెచ్చఁగఁ జెంతనిల్పినవి. తే. గీ. అత్తమామలు మ్రొక్కుచు ననుప వెడలి కనకమయరథ మెక్కె రంగ ప్రభుండు ప్రాద్ది శాశై లశిఖర సంభావ్య మగుచు భానుబింబమ్ము శోభిల్లు పగిదిదోఁప. తే.గీ. తన్ను నెడబాయు నడలునఁ దాల్మివిడిచి చిన్న వోయిన పూఁబోణిచిన్నె దెలిసి జనని భాషించె వగవ కే ! సరసిజాక్షి ! 忘 కోరుకొన్నంత మేలు చేకూరె నీకు, 182 183 184 185 172 కం. సేమమె ! నీతలిదండ్రుల చతురాశ్వాసము కీమానితమూర్తి మదికి నెక్కి నరూపం బీమహిమ నీకుగలుగుట ఁ గామించే వరించె మేలుగలిగె దరుణీ ! 196 వ. అని పలికిన లజ్జాభయమ్ములన తన్వి నెత్తమ్మిటేకుల మొత్తమ్ము ను తలపడం జేయుకన్నుల నిలాతలమ్ముఁజూచుచు నెమ్మొగంబెత్తక యున్న చిన్నె యెఱింగి శ్రీదేవియిట్లనియె, తే.గీ. సుదతి ! మోమె తి నావంకఁ జూడ వేమి మ. కం. తొల్లిఁటి తెఱంగు విన సపత్నులము మనము అక్క చెలియండ్రమనెడి నెయ్యమ్ము గలుగ వెఱచి యిటులుండ నేటికి వెట్టి నగుచు, అలి వేణీ ! శుకవాణి మున్ను మనమయ్యడ్డాడు దాస్యమ్ము సం ధిలఁ గ్రీడించుచునుండువార మిపుడు దేవుండు రంగేశుఁడై నిలువజే బద్మకుడుంగ రాన్గృహములన్ దీపించియిట్టుల్ సప 197 198 త్నులమై కూడెడుభాగ్యమబ్బె హరి నిన్ను కొనన్ను బ్రోచుకొగృపక్. 199 అన నృపకన్యక పలికె జననొసఁగితి నాదు పూర్వచరితము టెలి సెక్ ఘనతన్నీ కడఁ జేరితి మనమున నాకింకి వెఱపు [మాటయు] గలదే ! వ అనిన శ్రీ దేవి భూపాలకన్య కంజూచి సంతసిల్లుచు నిట్లనియె. అదనిదియె నీదుమదికి 1 గొదువలు లేవింకఁ జక్రిగూడి సకలసం పద లనుభవింపు మేలిమి పదవే ! పూఁబోడి [వాసభవనమ్మునకున్] 200 201 202 వ అని యయ్యింతి నుత్సహింపఁజేసి సఖులందోడిచ్చి నిజసౌధంబునకుం బనిచె నంత రంగవల్లభుండల్లనల్లన నిజాగ్రమహిషీ సమీపమ్మునకుం జనుటయు నయ్యబ్జ గేహిని యొక్కింతకినుక నెరయ నతనింజూచుచునిట్లనియె. 203 కం. కం. కం. ఉ. కులశేఖర మహీపాల చరిత్ర ఈసారి పెండ్లికూతురు నేసీమం దెచ్చికొనఁగ నిచ్చఁదలఁచితో ! ఆసపడి మాననగు నే వేసరకుఁడి క్రొత్త చెలుల వెదకెడుపనికి. నావుడు శ్రీహరి యిట్లను దేవి నధూమణుల నేను దెచ్చుటలు భవ తేసేవాసరిచర్యలకుం గావ లెనని కాదె ! వేఱు గాఁ దలఁపకుమీ ! అప్పలుకులు విని యిందిర తప్పక విభుమోముఁజూచి ధర్మాత్ములు మీ రెప్పటికీ [మాయ] లెఱుగరు చెప్పకుడి(క మేలిపనులు చేసెద రెలమిక్, కుంఠిత వైరి ! మున్ను నినుగూడి చరించెడి వేళలందు వై కుంఠములోన నీళ యానుకూలసత్వ మొనర్చెఁగాన యు త్కంఠ జనించె నింక నొరుకన్నియఁ దెచ్చెదవేని దాని సో ల్లుంఠములాడి రంగ పురిలో వెడలింతుఁ జుమీ ! జగత్పతీ ! వ. 178 204 205 206 207 అనిమేలంబునంబలికి నెమ్మొగమ్మునం జిఱునగవు నెఱయ నగధరుం గౌఁగిలించికొనియె నిట్లయ్యిరువురు చతురసల్లాపర సానుభవమ్ము సేయుచు నాత్మీయ సౌధంబునకుం జనిరి మఱియును. సీ. మంజులోద్యాన ద్రుమచ్చాయ లందుండి శుకకోకిలో కుల సొంపు వినుచు పద్మకై రవసౌరభము లోప్పుకొలఁకుల సలిల కేశీ సముత్సాహు లగుచు మణిమయప్రాసాద మహితస్థలమ్ముల రమ్యవీణాగానరసికు లగుచు కలితమా క్లికమాలికా డోలికల నెక్కి లాలితక్రీడావిలాసు లగుచు 203 174 చతుర్థాశ్వాసము తే.గీ. ఘనజనాలోక నానందకారులగుచు ప్రేమ నీళాంగనారంగథాము లపుడు బంధురై శ్వర్య సౌఖ్యసంపదలఁ బొదలి కం॥ యెలమిఁ బెంపొంది రానందకలన దనక ఇ తెలఱుఁగున నిజపుత్రి యు త్తమహాసౌఖ్యభోగదశ గని భూపా 3 లో త్తముఁడు సంతసిలుచుఁ జిత్తమునం దనపురమ్ము జేరం దలఁ చెక్ కం. రంగపతికిఁ బ్రణమిల్లి సు కం. ఉ. సంగతమౌ గతి నతండు సరవి ననుప పు త్రిం గాంచి గౌరవించి ర మాంగనకు మ్రొక్కి పలికె నతిమోదమునక్. గోమునఁ బెరిగినయది మది నేమియుఁగాపట్య మెఱుఁగ దెఱుక నొసఁగినకొ బ్రేమగొను నడుగ దెద్దియు నీమఱువునఁ జెల్లెలనఁగ నిలుపుము వేడ్కర్. చల్లనిచూపు లెండు వేదఁజల్లి జగమ్ములఁ బ్రోతువీవ కా తల్లివి భవ్య వై భవమతల్లివి సేవక కల్పవల్లి ! ని న్నెల్ల బుధుల్ భజించుకత లేమెఱుఁగు బసికూన! దీని నీ చె తెల్లెలిగాఁ దలంచి కృపసేయుము నేరములే మొనర్చిన కొ". తే.గీ. అనిన శ్రీ దేవినగుచు నోయవనిపాల ! మది చెదరి కూతునప్పగించెదవు గాక జన్మజన్మమ్ములను విష్ణునుతుల మగునుఁ జెలిమినుండెడు మాకిన్ని చెప్పనగునె! కం॥ అనఘ ! భవత్సుత మీగృహ మున మెలఁగినయట్ల యిచట ముదమున నలరు ననుగూడి చెలఁగుచుండెడి మనమున సంతోషమైనఁగ మరలుము పురికి", 209 210 211 212 213 214 215 . . తుల శేఖన మహీపాల చరిత్ర 175 అనిరమా దేవియానతిచ్చిన సంతుష్టాంతరంగుండై తన్నుంగృతార్థం గాఁదలంచుచు స కలపరిజనయు] తుంపై నిజనగరంబు ప్రవేశించె మఱియు. 216 కం. శ్రీవైష్ణవ పూజాసం సీ. భావనలేముఱక రామభద్రచరిక సే వావిలసిత హృదయుండై భూవరుఁ డాళ్యాగులనఁగఁ బొలుపు వహించెన్. సతతమ్ముపురమున పాటించు థెరీము దంగ మెసంగ శ్రీరంగయాత్ర రచియించె హరిభ క్తిరసము జొబ్బిల బుధా నందానుకూల ముకుందమాల ణ నిఖిలప్రపన్న వర్ణి తముగాఁ బ్రకటించె బంధు ద్రవిడ ప్రబుధ మొకటి సంతతిశ్రీ రామ చరితామృతాస్వాద తే, గీ బహుళ నివృత్సమాయాత భాగవత జ నాభినందన గురుసపర్యాభిలషిత వస్తువి శాణన క్రియావశత 'నెసఁగె నతహితుండు దృఢవ్రత సందరుండు, 217 218 80, చిరకాలము భూపాలస వరుఁడై .. TAS F స్ఫురణమ్మున నిజతనయున్ గరిమన్ బట్టాభిషిక్తుఁ గావించె వెసన్. 219 ఇట్లు నప్తాంగంబతనివశమ్ము జేసి నిర్భరచిస్తుండై యుండె మఱియును. నంబు గావించి జానకీనాథుఁ గొలిచి తే. వసుధఁ బాలించి శ్రీవైష్ణవప్రియార . రూఢుఁడగుచు 4 నెమ్మి నృపమాళి విష్ణుసన్నిధికిఁ జనియె, అని యి తెఱంగు : -221 222 176 చతుర్థాశ్వాసము కం. గురువర్యుఁడు శిష్యునకున్ నిరుపముకుల శేఖరావసీవల భు చ్చరితం బంతయు నేర్పడ కం• కరుణు దగ నానతిచ్చి క్రమ్మఱఁ బలికెన్. కుల శేఖరాళువారుల విలసిత చరితమ్ము జగతి వినినఁ జదివిన్ గలుషప్రజమ్ముడొలఁ గెతు నెలమింబ్రాపించు నరుల కిహపరసుఖముల్ , 228 224 అనిపలికి శిష్యో త్తమా ! పరమపవిత్రంబగు కుల శేఖరచరిత్రంబు సవిస్త రంబుగా నీకు నెఱింగించితిననుటయు శిష్యుండాచార్యునకుం బ్రదక్షి ణపూర్వకంబుగా ప్రణామంబులాచరించి విమలంబులుగుకుసుమ చందనంబులం బూజించి మమ్ముంగృతా జేసితిరని యానందరసభరితాంతఃకరణులై విలసిల్లిరి తెఱంగున. మ. తరుణీలోలపితౄ క్తిపాలనకళాధారేయ ! గా ధేయదు ర్భర భ వ్యాధ్వరమంత్రతంత్రక లనా ప్రత్యూహకృ దైత్యసం హర ! రంహోభయదాబ్దిగర్వదశ నోద్యద్రక్తనేత్రాంచలా ! ధు ధై ర్యాఢ్య ! ధరాధురాధరభుజా ! ధారాధరాంగద్యుతీ ! కం. కాకమదోద్రేకతమో 225 226 మాలిని, 227

కలశజనుతిశాలీ కమ్రపద్మాక్షమాలీ విలులితసదపద్య వేద వేదాంత వేద్యా 228 గద్య. ఇది శ్రీరామచంద్రకరుణానిరీక్షణసమాసాదితకవితావి శేష శేషా స్వయప్రదీపక వేంకటాచార్యకు మారరఘునాథార్య ప్రణీతంబైన కులశేఖరమహీ పాలచరిత్రంబను మహాప్రబంధంబునందుఁ జతుర్థాశ్వాసము, సంపూర్ణము 229