కుటుంబ నియంత్రణ పద్ధతులు/సంతాన నిరోధ పద్ధతులు విఫలమైతే కలిగే లక్షణాలు

వికీసోర్స్ నుండి

20. సంతాన నిరోధ పద్ధతులు విఫలమైతే కలిగే లక్షణాలు

కోమల కోటి కోర్కెలతో సంసార జీవితంలో అడుగు పెట్టింది. కాశ్మీరునుంచి కన్యాకుమారి వరకు హనీమూన్ వెళ్ళాలని, జీవితాన్ని హాయిగా అనుభవించాలనుకుంది. అందుకోసం వెంటనే గర్భం రాకుండా ఏవేవో మందులు వాడింది. అవి సక్రమంగా వాడకపోయేసరికి కల చెదిరింది. వివాహమయిన కొద్దిరోజులకే కారులో కాస్త దూరమైనా వెళ్ళలేని అనారోగ్యస్థితి ఏర్పడించి. పెళ్ళికాక ముందు అందరి అమ్మాయిల్లాగానే ఎన్నో తీయని కలలుకన్నది. స్కూటరు మీద కూర్చుని, బీచ్ రోడ్డున భర్త నడుముకి చేయిచుట్టి రయ్‌మని పోవాలనుకుంది. కాని పెళ్ళి అయి రెండు-మూడు నెలలు అవకుండానే వాంతులు - వికారం ప్రారంభంఆయ్యాయి.

వాంతులు - నీరసం

సాధారణంగా కడుపు వచ్చినప్పుడు వేవిళ్ళు కలుగుతాయి. ఉదయంపూ'ట ఒకటి రెండు వాంతులు అవడమో లేక కడుపులో వికారంగా వుండటమో తప్ప తల్లి ఆరో గ్యానికి ఎటువంటి హాని కలగదు. ఇటువంటి స్త్రీలకి వేవిళ్ళు వున్నా తీసుకున్న ఆహారం అంతగా బయటకుపోదు. అందువల్ల వీరు బరువు కోల్పోవడం జరగదు. కాని అరుదుగా కొందరిలో ఈ వేవిళ్ళు చాలా ఎక్కువగా వుంటాయి. తక్కిన స్త్రీలలో కొద్దిరోజులుండి తగ్గిపోతే, ఈ స్త్రీలల్లో వచ్చిన వేవిళ్ళు తగ్గకపోవడం అటుంచి, ఇంకాఎక్కువ అవుతాయి. తీసుకున్న ఆహారం ఏ మాత్రం వంటబట్టకుండా వాంతులు పోవడం, దానివల్ల బాగా నీరసం వచ్చేయడం, బరువు తగ్గిపోవడం జరుగుతుంది.

వేవిళ్ళు ఎక్కువగా మొదటికన్పులో కనబడతాయి. కొందరిలో ప్రతీసారి కడుపు వచ్చినప్పుడు వేవిళ్ళు కొద్దో గొప్పో కనబడతాయి. సాధారణంగా నెల తప్పిన పదిహేనురోజుల్లో వేవిళ్ళు ప్రారంభం అవుతాయి. ఇలా ప్రారంభమైన వేవిళ్ళు దాదాపు మూడవనెల నిండగానే లేకుండా పోతాయి. కొందరిలో ఇంకో నెలా రెండు నెలలు ఎక్కువ ఉంటాయి.

స్త్రీ గర్భవతి అయినప్పుడు కొద్ది రోజుల్లోనే శరీరంలోఅనేక మార్పులు గలుగుతాయి. శారీరంలో కలిగే అనేక రసాయనిక మార్పులవల్ల కడుపులో వికారం,వాంతులు ప్రారంభం అవుతాయి. అఇతే కొద్ది రోజుల్లోనే శరీరం ఈ రసాయనిక మార్పులకి తట్టుకుని మామూలుగా తయారవుతుంది. దానితో వికారం, వాంతులు రతగ్గిపోతాయి. అయితే కొందరిలో ఈ రసాయనిక మార్పులవల్ల వచ్చే శారీరిక పరిణామాలు ఆందోళన కలిగిస్తాయి. ఈ మానసిక ఆందోళనవల్ల, భయంవల్ల వేవిళ్ళు తగ్గకపోవడం అటుంచి పెరిగిపోతాయి.

స్త్రీ గర్భవతి అయినప్పుడు హార్మోన్లలో కొంత అస్తవ్యస్తత ఏర్పడుతుంది. ప్రొజస్టిరోన్ హార్మోను తక్కువ అయిపోయి కోరియానిక్ గొనాడో ట్రాపిక్ హార్మోను ఎక్కువ అవడం వేవిళ్ళకి ఒక కారణంగాకూడా భావించబడుతుంది. కొందరిలో కడుపు వచ్చినప్పుడు కొన్ని ఎలర్జీ పరిస్థితులు ఏర్పడి దానివల్ల వాంతులు కలుగుతాయనే భావం ఉంది. ఏది ఏమైనా వేవిళ్ళు ఉన్నప్పుడు పుల్ల పుల్లగా తినడమనేది, కేవలం తినాలని తినడం తప్ప వేరే కారణం లేదని కొందరంటారు.

అతిగా వేవిళ్లు

ముందు చెప్పిన కారణాలతో పాటు గర్భవతి అయిన స్రీలల్లో మానసిక భయాందోళనలు ఎక్కువగా ఉంటే వేవిళ్ళు అతిగా ఉంటాయి. ఇలా అతిగా వేవిళ్ళు ఉన్న స్త్రీ పూర్తిగా క్షీణించిపోవడం జరుగుతుంది. వాంతులు నీళ్ళు నీళ్ళుగా ఉండడమో, కాఫీ రంగులో ఉండడమో జరుగుతుంది. అతిగా వాంతులు అవడంవల్ల కళ్లు లోపలికి పోతాయి. చర్మానికి సాగే గుణం పొతుంది. కడుపులోపల అణిగిపోయి నటలు వుతుంది. నాలిక, పెదవులుపగిలినట్లయి ఎండిపోతాయి. కళ్ళు పసుపుపచ్చగా కామెర్ల లాగా మారిపోతాయి. మూత్రం చాలా కొద్దిగానే అవుతుంది. రక్తపోటు పడిపోతుంది. ఒంట్లో వేడికూడా తగ్గిపోతుంది. ఇటువంటి వేవిళ్ళ పరిస్థితిని చలావరకు సరిదిద్దడమో, అరికట్టడమో జరుగుతున్నది.

వివాహిత స్తీకి వికారం - వాంతులు వచ్చినంత మాత్రాన గర్భం కాదు సుమా!

కొన్ని ఇతర కారణాలవల్ల కూడా కడుపులో వికారంగా వుండడం, వాంతులు అవడం, జ్వరం వున్నట్లు అనిపిస్తుంది. అంతమాత్రాన అవి వేవిళ్ళు లక్షణాలేనని డాక్టరు చేత పరీక్ష చేయించుకోకుండా ఊరుకోవడం సరియైన పద్ధతి కాదు. మూత్రపిండాలకి సంబందించిన వ్యాధి స్రీలల్లో సాధారణంగా కనబడుతుంది. దీనివల్ల వాంతులు అవుతూ వుండడం, ఆకలి లేకపోవడం, ఎప్పుడూ వికారంగా వుండడం ఉంటాయి. అలాగే స్త్రీకి గర్భం రావడంతో సంబంధం లేకుండా జీర్ణకోశవ్యాధులు, లివర్ వ్యాధులు, మెదడుకి సంబంధించిన వ్యాధులు కల్గిన వాంతులు అవుతూ ఉండవచ్చు. అందుచేత డాక్టరుచేత పరీక్షచేయించుకుని వాంతులు వికారం ఎందుకు ఉన్నదీ నిర్ధారణ చేసుకుని చికిత్స పొందాలి.

గర్భిణీ స్త్రీలో వచ్చే మరికొన్ని మార్పులు

గర్భవతి అయిన స్రీలో వచ్చే మార్పులు వేవిళ్ళు కనబడడం మాత్రమే ఒక ప్రత్యేక మార్పుగా కొందరు భావిస్తారు. గర్భిణి స్త్రీకి వేవిళ్ళు రావడం, వక్షోజాలు బరువుగా, బిగుతుగా మారడమే కాకుండా ఇంకా అనేక శారీరక మార్పులు వస్తాయి. స్త్రీ గర్భవతి కానప్పుడు గర్భసంచి 3 అంగుళాల పొడవు, రెండు ఔన్సుల బరువు మాత్రమే ఉంటుంది. కాని గర్భవతి అయి నెలలు నిండుతూ వుంటే గర్భసంచి 12 అంగుళాల పొడవు ఉండటమే కాకుండా 2 పౌన్లు బరువు కూడా పెరుగుతుంది. దీనికి గర్భసంచికి కండ పెరగడం ముఖ్యకారణం.

ఈ రకంగా గర్భసంచికి సంబంధించిన కండ పెరగడానికి ఈస్ట్రోజోన్, ప్రొజిస్టిరోన్ హార్మోనులు కావచ్చు. సాధారణంగా స్త్రీ గర్భవతి కాగానే బహిష్టుస్రావం కనబడటం ఆగిపొతుంది. కాని అరుదుగా కొందరిలో నెలతప్పిన మొదటి రెండు మూడు నెలలు కాస్త బహిష్టుస్రావం నెల నెలా కనబడుతుంది.

గర్భవతి అయిన స్త్రీలల్లో కొందరికి నెలలు నిండుతున్న కొద్దీ తెల్లబట్ట అవడం జరుగుతుంది. ఎందుకంటే గర్భిణీ స్త్రీలో గర్భాశయ కంఠం రక్తాదిక్యతవల్ల మెత్తబడుతుంది. ఈ రక్తాధిక్యతవల్ల అక్కడినుంచి ఒక పల్చని ద్రవం ఊరుతూ ఉంటుంది. అంతేకాని అదేమీ జబ్బు కాదు. నెలలు నిండుతున్న కొద్దీ గర్భసంచిలోని బిడ్డ పెరగడం జరిగి డయాఫ్రమ్ పైకి నెట్టివేయడంవల్ల ఊపిరితిత్తులు నొక్కి వేయబడినట్లు అనిపిస్తుంది. దీనివల్ల గర్భిణిస్త్రీ గాలి పూర్తిగా పీల్చలేకపోవడం, ఆయాసపడటం జరుగుతుంది.

గర్భిణి స్త్రీలల్లో గర్భం వచ్చిన మొదటి 2, 3 నలల్లోనూ ఎక్కువసార్లు మూత్రవిసర్జన జరుగుతుంది. దీనికి గర్భం దాల్చినప్పుడు గర్భకోశం దగ్గర రక్తాదిక్యత కలగడం పెరుగుతున్న గర్భకోశం మూత్రకోశాన్ని నొక్కడం కారణాలు నాలుగవ నెల వచ్చేసరికి ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయడం ఆగిపోతుంది. తిరిగి నెలలు నిండి కాన్పువచ్చే ముందు ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయడం జరుగుతుంది. దీనికి కారణం బిడ్డ తల క్రిందికి దిగుతూ మూత్రకోశాన్ని నొక్కి వేయడమే. కొందరి స్త్రీలకి మూత్రం పరీక్షచేస్తే మూత్రంలో షుగర్ కనబడుతుంది. గర్భిణి స్త్రీలకి మూత్రంలో షుగర్ కొద్ది మొత్తంలో లీక్ ఆవడం మామూలు విషయమే.

గర్భిణి స్త్రీలలో చాలామందికి నరాల బలహీనత కలిగి నట్లు అనిపిస్తుంది. కొంతవరకు దీనికి మానసిక వేదన కారణం. ఈ మానసిక ఆందోళనలవల్ల చికాకు, నిద్రలేకపోవడం, నిర్లిప్తత, అకస్మాత్తుగా ఆవేశం, ఉద్రేకం కలుగుతూ ఉంటాయి. ఈ మానసిక విపరీత పరిస్థితివల్లనే కొందరు భోజనంమీద ఆసక్తి చూపించకపోవడం, బొగ్గులు, మట్టి, బియ్యంలోని రాళ్ళు లాంటివి తినడం చేస్తూ వుంటారు.

గర్భిణీ స్త్రీలలో బరువు పెరుగుదల

స్త్రీకి కడుపువచ్చిన మొదటి నెలలోబరువు పెరగడం జరగకపోయినా 2వ 3వ నెలల్లో ఒక్కొక్క పౌను, నాలుగు అయిదవ నెలల్లో నెల ఒక్కింటికి నాలుగు పౌన్లు, ఆరుఏడు నెలల్లో నెలఒక్కింటికి అయిదుపౌన్లు, ఎనిమిదితొమ్మిది నెలల్లో నెల ఒక్కింటికి 3 పౌనులు బరువు ఎక్కడం జరుగుతుంది.

నాలుగవ నెలనుంచీ నలుగురికీ తెలిసే లక్షణాలు

వేవిళ్ళు కాస్త తగ్గినట్లు అనిపించినా నోట్లో ఉమ్మా మాత్రం ఎక్కువ అవుతుంది. వక్షోజాలు సైజు పెరగడం ప్రత్యేకంగా కనబడుతుంది. ఈ విషయంలో అయిదవ నెల దాటిన తరువాత మరింత త్వరగా మార్పు కనబడుతుంది. నాలుగు నెలలు నిండిన పదిహేను రోజుల్లో కడుపులో బిడ్డ కదలడం ప్రారంభమవుతుంది.

మొదటి కాన్పులోకంటే తరువాత కాన్పుల్లో బిడ్డ కదలికలు ఇంకా యింతకంటే ముందుగానే తెలుస్తాయి. పిండం గర్భకోశంలో ఎదుగుదలతో పాటు గర్భాశయం ఎదుగుదల ప్రారంభం అవుతుంది. 3 నెలలు నిండగానే పొత్తికడుపు దగ్గర గట్టిగా తగిలినా అయిదవనెల నుంచి స్పష్టంగా అందరూ గుర్చించే విధంగా పొత్తి కడుపు దగ్గర ఎత్తుగా కనబడుతుందీ. గర్భాశయం ఎదుగుదలతో పాటు కడుపుమీద తెల్లని చారలు ప్రారంభిస్తాయి. ఈ చారలు కూడా స్త్రీ ఒక్కసారి గర్భవతి అయినట్లుగా తెలియజేస్తాయి. కొందరిలో నెలలు పెరుగుతున్నకొద్దీ కడుపులో నొప్పి లేకుండా కడుపు బిగబట్టి వదిలినట్లుగా అనేకసార్లు అనిపిస్తూ ఉంటుంది. అయిదవనెల నిండిన తరువాత కడుపుమీద చెయ్యివేసి బిడ్డని నొక్కినట్లయితే, గర్భాశయంలోని బిడ్డని తేలికగా కదిపినట్లు అవుతుంది. ఈ సమయంలో బిడ్డ సైజుకంటే ఉమ్మ నీరు శాతం ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. ఆరవనెల నిండిన దగ్గరనుంచీ బిడ్డ కదలికలు చాలా స్పష్టంగా తెలుస్తాయి. ఈ సమయానికి బిడ్డ పెరగగా గర్భాశయం తల్లి బొడ్డుదాకా పెరుగుతుంది. గర్భాశయంలో ఉన్న బిడ్ద గుండె కొట్టుకోవడం కూడా స్టెతస్కోపు ద్వారాగాని ఫీటస్కోప్‌తో గాని స్పష్టంగా వినవచ్చు. బిడ్డ శరీరభాగాన్ని పొట్టపై నుంచి అదిమి తెలుసుకోవచ్చు కూడా.

ఏడవ నెల నుంచీ కనబడే లక్షణాలు

నెలలు నిండుతున్న కొద్దీ వక్షోజాలు నిండుగా, పెద్దవిగా తయారవుతాయి. కాని మడమల దగ్గర, పాదాల దగ్గర నీరుచేరి ఉబ్బినట్లు అవవచ్చు. పని చేయగానే ఆయాసం అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా అన్నం తినగానే ఆయాసం వస్తుంది. దీనికి కారణం పెరుగుతున్న గర్భంకోశం, జీర్ణకోశాన్ని చాతిని నొక్కివేయడమే. అప్పుడప్పుడు సడన్‌గా కడుపు బిగదీసినట్లు అవుతుంది. మూత్ర విసర్జన కూడా ఎక్కువసార్లు అవుతుంది. కడుపుపైనుంచి చేతితో నొక్కిచూస్తే బిడ్దకి సంబంధించిన శరీర భాగాలయిన తల, పిరుదులు, చేతులు, కాళ్ళు మొదలయినవి తగులుతూ వుంటాయి.

* * *