కుటుంబ నియంత్రణ పద్ధతులు/ఫోమ్స్, ఫోమ్ బిళ్ళలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

9. ఫోమ్స్, ఫోమ్ బిళ్ళలు

ఆసుపత్రికి వచ్చే పేషెంట్లు రకరకాలుగా ఉంటారు. కొందరు డాక్టరుని విసిగించి ఒకే విషయాన్ని పదిసార్లు అడుగుతూ ఉంటే మరి కొందరు డాక్టరు చెప్పినదంతా వింటూ అంతా అర్ధమయినట్టే బుర్ర ఊపి, చివరికి చెప్పినదానికి భిన్నంగా చేస్తారు. అలాంటి యువతే రత్నకుమారి. గర్భనిరోధానికి ఫోమ్ బిళ్ళలు ఎప్పుడు వాడవలసిందీ, ఎలా వాడవలసిందీ డాక్టరమ్మ చెప్పుతున్నంతసేపూ తల ఊపి ఇంటికి వెళ్ళీ "ఫోం బిళ్ళ"లని వాడవలసిన పద్ధతిలో కాక నోట్లో వేసుకుని మింగేసింది. కడుపులో కలిగిన వికారానికి మరునాడు డాక్టరమ్మ దగ్గరికివెళ్ళి "అబ్బ, ఏమిటి డాక్టరుగారూ బిళ్ళలు అసలే పెద్దవిగా ఉన్నాయి. మింగలేక చచ్చాను, ఏదో కష్టపడి మింగాను కదా అని అనుకుంటే, అంతటితో పోక కడుపులో వికారం ప్రారంభం అయింది" అంటూ చెప్పింది. తాను అంత చెప్పినా రత్నకుమారి చేసిన పనికి నవ్వాలో, ఏడవాలో తెలియలేదు డాక్టరమ్మకి.

గర్భనిరోధక పద్ధతుల్లో ఫోమ్ భిళ్ళలు, నురగలాగా "ఫొమ్ " ద్రవాలు కూడా వున్నాయి. వీర్యకణాలని నాశనంచేసే రసాయనకాలు సంయోగం సమయంలో యోని మార్గంలో వాడే పద్దతి చాలా ప్రాచీన కాలంనుంచి అమలులో ఉంది. 3500 సంవత్సరాల క్రితమే ఒక ఈజిప్టు రచయిత గర్భనిరోధకానికి తుమ్మబంక కలిపి తయారుచేసిన ద్రవం వాడబడుతుందని తన రచనలో తెలియజేశారు. రోజులు గడుస్తున్న కొద్దీ వీర్యకణాలని నాశనం చేసే గర్భనిరోధకరసాయనకాలు తయారయి వాడబడుతూ వచ్చాయి. ఈ రకమైనవి యోని మార్గంలో సంయోగ సమయంలొ వాడినప్పుడు ఆ స్త్రీ ఆరోగ్యానికి ఎట్టి నష్టం కలగకుండా కేవలం వీర్యకణాలనే నాశనంచేసి గర్భాశయ కంఠాన్ని కూడా తాత్కాలికంగా మూసివేస్తాయి. ఇలా జరగబట్టి ఏ కొద్దిపాటి వీర్య కణాలయినా నిర్మూలింపబడకుండా ఉంటే గర్భాశయ కంఠం మూసివేయబడి ఉండబట్టి దాని ద్వారా గర్భాశయంలోకి ప్రవేశించలేవు.

వీర్యకణాలని నాశనం చేసే 'ఫోమ్స్‌' గర్బం నిరోధించటంలో క్రీమ్స్, జెల్లీలుకంటే బాగా పని చేస్తాయి. ఈ "పోమ్" ఒక నురగలాంటి ద్రవం. దీనిని యోని మార్గంలో ప్రవేశ పెట్టగానే చాలా త్వరగా మొత్తం యోని మార్గం అంతానిండిపోతుంది. పైగా గర్భాశయ కంఠాన్ని కూడా ఆక్రమించి, అందులోని ద్వారాన్ని మూసివేస్తుంది. జెల్లీలు, క్రీమ్స్ ఇలా యోనిమార్గాన్ని ప్రభావితం చేయడంగాని, గర్భాశయ ద్వారాన్ని మూసివేయడముగాని చేయలేవు. అంతేకాకుండా ఈ క్రీమ్స్, జెల్లీలు సంయోగ సమ యంలోగాని, తరువాతగాని యోనిమార్గం నుంచి కారినట్లయితే కొంత అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఈ "ఫోమ్స్"ని టిన్నులలో కాని, సీసాలలో కాని గట్టి ప్రెషర్‌లో పాక్ చేసు ఉంచుతారు. ప్రత్యేకమైన అప్లికేటరు ద్వారా దానిని తీసి యోని మార్గంలోకి ప్రవేశ పెట్టడం జగుగుతుంది. మామూలుగా "డెల్ఫిన్" ఫోమ్‌ని వాడడం జరుగుతుంది. ఈ ఫొమ్ చాలా తేలిక, ఉపయుక్తమైనదీను.

ఫోమ్స్ ఫోమ్ బిళ్ళలు వాడే విధానము

ఫోమ్ వాడేముందు ఆ ద్రవాన్ని బాగా కుదపాలి. ఒక చిన్న పిచికారీలాంటిది ఫోమ్‌తో బాటు సరఫరా చేయబడుతుంది. పిచికారీని పూర్తిగా క్రిందకి నొక్కేసి ఫోమ్ ఉన్న దానికి బిగించినట్లయితే, దాని లోపల వున్న ప్రెషర్ వల్ల పిచికారీలోకి ఫోమ్ చేరుకుంటుంది. నిదానంగా ఫోమ్‌తో నిండిన పిచికారీని తీసుకుని యోని మార్గంలోకి ప్రవేశాపెట్టి పిచికారీ పిస్టల్ని నొక్కాలి. అలా చెయగానే ఫోమ్ యోని మార్గంలోకి చేరిపోతుంది. ఫోమ్ ట్యాబ్లెట్లని అయితే యోని మార్గంలోకి రెందువ్రేళ్ళతో పట్టుకుని లోపలికల్లా ప్రవేశ పెట్టాలి. ఫోమ్స్‌గాని. ఫోమ్ బిళ్ళలు కాని యోని మార్గంలోకి ప్రవేశపెట్టిన తరువాత ఒక గంటలోగానే సంయోగం చేయాలి. గంటగడచిన తరువాత సంయోగంలో పాల్గొంటే వాటి ఫలితం లేకుండా అయిపోతుంది. తిరిగి వాటిని యోని మార్గంలోకి జొప్పించి సంయొగంలో పాల్గొనవలసి వస్తుంది. ఒకవేళ వీటిని యోనిమార్గంలోకి ప్రవేశపెట్టి సంయోగంలో పాల్గొనకుండానే లేచి నడిచి మల మూత్ర విసర్జనలలో దేనికయినా వెళ్ళవలసివస్తే మళ్ళీ వాటిని వాడవలసిందే. ఈ ఫోమ్స్ తాత్కాలికంగా అంటుకొని బట్టలకి రంగు వచ్చినా ఆమరకలు ఉతికితే పోతాయి.

ఒకవేళ సంయోగం అవగానే ఢూష్ చేసుకోవలసిన అవసరం వుంటే ఈఫోమ్స్ వాడేటప్పుడు కనీసం ఆరుగంటలు డూష్ చేసుకోకుండా కూడా ఆగవలసి వుంటుంది. ఎందుకంటే సంయోగ సమయంలో యోనిమార్గంలో ప్రవేశించిన వీర్యకనాలన్ని ఒక్కసారిగా నిర్మూలింపబడవు. కొన్ని వీర్యకణాలు వీర్యస్కలనం అయిన తరువాత కొన్ని గంటలపాటు జీవించే వుంటాయి. డూష్ వెంటనే చేసుకుంటే ఫొమ్ తుడిచి పెట్టుకుని పోతుందికాని వీర్యకణాలు కొన్ని మాత్రం యోని మార్గంలో అంటిపెట్టుకొనే వుంటాయి. ఫొమ్స్ వాడేటప్పుడు డూష్ చేసుకునే అలవాటు మంచిది కాదు. ఫొమ్స్ వాడేవాళ్ళు సంయోగానికి ముందు ఫోమ్స్ వాడి తిరగడం తప్పు. అయినా సంయోగానంతరం లేచి తిరగవచ్చు.

ఫోమ్స్ గాని, ఫొమ్ బిళ్లలుగాని వాడితే కేన్సరులాంటివి యేవీ రావు. అలాగే ఫోమ్స్ వాడినప్పుడు గర్భం వస్తే గర్భంలోని బిడ్డికి యెటువంటి అవలక్షణాలు రావు. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. పోమ్స్‌గాని, పోమ్ బిళ్ళలుగాని నూటికి నూరుపాళ్ళు గర్భం రాకుండా అరికడతాయని చెప్పడం కష్టం. కొన్ని సందర్భాలలో ఈ పద్దతి పని చేయక గర్భం రా వచ్చు.

* * *