కుటుంబ నియంత్రణ పద్ధతులు/డయాఫ్రం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

8. డయాఫ్రం


డయాఫ్రం అంటే ఏమిటి ?

క్రొత్తగా కాపురం పెట్టిన రోజారమణికి కడుపు రాకుండా రోజూ మాత్రలు మింగాలంటే మహాయిబ్బందిగా ఉంది. పిల్లలు కలగడం విషయంలో తనకేమంత పట్టింపు లేకపోయినా రామారావుకి మాత్రం తన "పంచవర్ష ప్రణాళిక" పూర్తి అయ్యే వరకూ పిల్లలు పుట్టకూడదని పెద్ద పంతంగా ఉంది. ఈ విషయమై రోజూ మాత్రలు మింగలేని రోజారమణికి రామారావుకి మధ్య ఎప్పుడూ వివాదమే. దీనికి వేరే పరిష్కారమార్గం ఉందేమోనని డాక్టరు సలహా అడిగితే కొంత తృప్తి కల్గించే మార్గమే కనబడింది. అదే సంతాన నిరోధక పద్ధతిగా - డయాఫ్రం.

వెజైనల్ డయాఫ్రంని మొదట జర్మనీకి చెందిన శాస్త్రజ్ఞుడు హాన్సే 1882లో రూపొందించాడు.

KutunbaniyantranaPaddathulu.djvu
సంతాన నిరోధానికి వాడే డయాఫ్రంలు ముఖ్యంగా నాలుగు రకాలు: 1. వెజైనల్ డయాఫ్రం, 2. వాల్ట్ కాప్, 3. సెర్వయికల్ కాప్, 4. వెములె కాప్.

డయాఫ్రంలు రబ్బరుతో గాని, ప్లాస్టిక్‌తో గాని తయారు చేయబడతాయి.

వెజైనల్ డయాఫ్రంలు, వీటినే డచ్‌కాప్‌లు అంటారు. రబ్బరుతో తయారు చేయబడతాయి. ఇవి వివిధ సైజుల్లో లభ్యమవుతాయి. 50 మిల్లీమీటర్ల నుంచి 100 మిల్లీమీటర్లు నిడివి ఉండేవి లభ్యమవుతాయి. పిల్లలు కలగని స్త్రీలకి 65-70 మిల్లీమీటర్ల సైజు కల డయాఫ్రలు కావాలి. పిల్లలు పుట్టిన స్త్రీలకి 75-80 మిల్లీమీటర్లు సైజువి కావాలి. ఈ డయాఫ్రంలు ఎవరికి తగిన సైజుల్లో వారు ఎన్నుకొని యోని లోపల సింఫసిస్ ప్యూబిస్ దగ్గర ముందు ఫిక్స్ చేసి తరువాత యోనికి వెనక భాగంలో బిగుతుగా పట్టుకొని ఉండే విధంగా అమర్చాలి. ఇలా అమర్చగా దానిలో గర్భాశయ కంఠం మూసివేయబడుతుంది.

డయాఫ్రంని యోని లోపల పెట్టుకోవడం ఎలాగో ఒకసారి తెలుసుకుంటే తరువాత నుంచి తేలికగా పెట్టుకోవచ్చు. కాని ఎందుకనో మనదేశంలో డయాఫ్రంలు వాడే స్త్రీలు చాలా తక్కువ. 1981-82 సంవత్సరములో మనదేశంల్లో కేవలం 1065 డయాఫ్రంలు వాడబడ్డాయి. వాల్ట్‌కాప్ డయాఫ్రంలు ఐదు సైజుల్లో తయారు చేయబడి ఉంటాయి. ఇటువంటి డయాఫ్రంలు కూడా మన దేశంలో వాడటం లేదు.

సెర్వయిస్‌ల్ కాప్ డయాఫ్రంలు కూడా మనదేశంలో వాడటానికి స్త్రీలు ఉత్సుకత చూపించడం లేదు. వీటిని లోపల పెట్టుకోవడం కాస్త ఇబ్బందికరమైన టెక్నిక్ కనుక స్త్రీలు వీటి ఎడల అంతగా ఆసక్తి చూపించడం లేదు.

విముల్ కాప్ అనేది సెర్వయికల్ కాప్ వాల్ట్ కాప్ రెండింటి సమ్మేళనం. ఇవి మూడు సైజుల్లో దొరుకుతాయి.

సంయోగంలో పాల్గొన్నా పాల్గొనకపోయినా కుటుంబనియంత్రణ మాత్ర అయితే మరచిపోకుండా రోజూ వేసుకోవాలి, డయాఫ్రం మాత్రం కేవలం సంయోగం చేసేటప్పుడే ఉపయోగించడం జరుగుతుంది. వీర్యకణాలని నిర్మూలించే జెల్లీ కూడా డయాఫ్రంతోజాటు కలిపి ఉపయోగించడం జరుగుతుంది. డయాఫ్రం - జెల్లీ పద్ధతి తేలిక కాబట్టి గర్భనిరోధక పద్ధతులలో చాలా ప్రచారం అయింది. డయాఫ్రం మెత్తని రబ్బరుతో తయారుచేయబడింది. డయాఫ్రం చిప్ప ఆకారంలోఉండి ఎలా కావాలంటే అలాముడవబడే విధంగా ఉంటుంది. దీని అంచు లోహంతో కూడిన స్ప్రింగుతో చేయబడి ఉంటుంది. అందుకని దీనిని గర్భాశయ కంఠానికి తగిలించి పెట్టినపుడు అక్కడ జారి పోకుండా పట్టుకుని ఉండి పిట్టుగా ఉంటుంది. డయాఫ్రం ఒక విధంగా గర్భాశయ కంఠద్వారాన్ని వీర్యకణాలు ప్రయాణించడానికి వీలులేకుండా మూసివేసినా, డయాఫ్రం లోపల రాసిన జెల్లీ కూడా వీర్యకణాలని నిర్మూలిస్తుంది.

డయా ప్రంని ఉపయోగించడం ఎలా?

డయాఫ్రం సైజులు ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి తేడా ఉంటాయి. అలాగే ఒకేవ్యక్తికి మొదట సరిపోయిన డయాఫ్రం కొద్దిరోజులు పొయిన తరువాత వదులు అయిపోవచ్చు. అందుకని ముందుగా గర్భనిరోధక సాధనంగా డయాఫ్రం ఉపయోగించే స్త్రీ డాక్టర్ సహాయంతో దానిని ఉపయోగించే పద్ధతి నేర్చుకోవాలి. ముఖ్యంగా దాంపత్య జీవితంలో కొత్తగా అడుగుపెట్టిన స్త్రీకి మొదట్లో చక్కగా సరిపోయిన డయాఫ్రం కొద్ది రోజులలోనే వదులు అయిపో

KutunbaniyantranaPaddathulu.djvu
             డయాఫ్రం పెట్టుకునే విధానం తుంది.  దానికి కారణం సంయోగంలో పాల్గొంటూ ఉండడం వలన యోని మార్గం వదులుగా అవుతూ ఉండడమే.  దాంపత్య జీవితపు తొలిదినాల్లో ఇలా మార్చవలసి ఉండగా మరికొన్ని సందర్భాలలో కూడా డయాఫ్రం సైజులను మార్చవలసి వస్తుంది.  ముఖ్యంగా కాన్పు అయిన తరువాత గర్భిణీలు పోయినప్పుడూ, ఆపరేషన్ అయినప్పుడూ, అంతే కాకుండా ఏ స్త్రీ అయినా పది పౌన్ల బరువు పెరిగినా, తరిగినా డయాఫ్రం మార్చవలసి వస్తుంది.

ఒక స్త్రీకి సరయిన డయాఫ్రం నిర్ణయించడానికి ముందుగా యోని లోపల గర్భాశయ కంఠం, బస్థి ఎముకల స్థితి ఎలా ఉన్నదీ డాక్టరు పూర్తిగా పరీక్ష చేయడమే కాకుండా ఆ స్త్రీకి కూడా తనంతటకి తాను గర్భాశయ కంఠాన్ని దానికి ముందు ఉండే బస్థి యెముకని చక్కగా

KutunbaniyantranaPaddathulu.djvu

డయాఫ్రం పట్టుకుని యోనిలో ప్రవేశ పెట్టుకునే విధానం గుర్తించే విధంగా నేర్పవలసి ఉంటుంది. ఇలా నేర్పిన తరువాత డాక్టరు ప్రయోగత్మకంగా ఒక డయాఫ్రంని యోనిమార్గం గుండా ప్రవేశపెట్టి ఆ స్త్రీ చేత దానిని పూర్తిగా గుర్తించేటట్లు చేసి తిరిగి బయటకు యెలా తీయాలో నేర్పుతారు. ఇక దీని తరువాత ఆ స్త్రీ తనంతట తాను డయాఫ్రం యోని మార్గం లోపల సంయోగానికి ముందు ఫిట్ చేసుకుంటుంది. డయాఫ్రంని లోపల ఫిట్ చేసుకోవడానికి ముందు దానిపైన వీర్యకణాలని నిర్మూలించే జెల్లీ వ్రాసి, ఆ డయాఫ్రం అంచులని రెండు వ్రేళ్ళతో అదిమిపట్టి నొక్కితే, కప్పలాగా కనబడే డయాఫ్రం దొప్పలాగా పొడుగుగా మారుతుంది. ఇలా వ్రేళ్ళతో నొక్కి పట్టుకొని యోని మార్గంలోకి లోపలికల్లా దూర్చి ముందుబాగం గర్భాశయ కంఠం క్రిందకు చేర్చితే పైభాగం గర్భాశయ కంఠానికి ముందు ఉండే బస్థి ఎముకకు ఫిట్ అవుతుంది. ఆ విధంగా గర్భాశయ కంఠాన్ని డయాఫ్రం మూసి వేస్తుంది. డయాఫ్రం ఉపయోగించే పద్దతి ముందు డాక్టరు ద్వారా నేర్చుకోవలసిందే కాని స్వయంగా తెలుసుకోవడం కష్టం ఒకవేళ స్వయంగా ప్రయత్నించినా అది సక్రమంగా ఫిట్ అవడం జరగదు.

డయాఫ్రం - కొన్ని విశేషాలు

డయాఫ్రం ఉపయోగించడం తెలుసుకుంటే చాలా తేలికగా గర్భాశయ కంఠం దగ్గర ఫిట్ చేసుకోవచ్చు. డయా ఫ్రంని యోనిమార్గంగుండా లోపల ఫిట్ చేసుకొనేటప్పుడు పడుకుని ఉండి అయినా చేసుకోవచ్చు. లేదా కూర్చుండయినా చేసుకోవచ్చు. నించుని పెట్టుకునేటట్లయితే ఒక కాలుమీద నిలుచుని రెండవకాలు కొద్దిగా మడచి ఎత్తి పెట్టి ఉంచుకోవాలి.

KutunbaniyantranaPaddathulu.djvu
డయాఫ్రంకి జెల్లీ వ్రాసి లోపల పెట్టుకున్న రెండు గంటలలోగా సంయోగంలో పాల్గొనాలి. అలాకాక ఆలస్యం జరిగితే తిరిగి అప్లికేటరుద్వారా జెల్లీని లోపలికి ఎక్కించుకోవాలి. డయాఫ్రం పెట్టుకుని నడవవచ్చు, స్నానం చేయవచ్చు. మూత్ర విసర్జన చేయవచ్చు. కాని సంయోగానికి ముందు ఒకసారి డయాఫ్రం సరయిన స్థితిలో ఉందో లేదో చూచుకోవాలి.

ఒకసారిసంయోగంఅయిన తరువార తిరిగి కొద్దిసేపట్లో సంయోగంలో పాల్గొన్నట్లయితే తిరిగి జెల్లీని అప్లికేటరు ద్వారా డయాఫ్రం దగ్గరికి నొక్కాలి. సంయోగం అయిన ఆరుగంటల వరకు డయాఫ్రంని యోని మార్గం నుండి తొలగించకూడదు. ఒకవేళ డూష్ చేసుకోవాలని మనసుంటే సంయోగం అయిన ఆరుగంటలవరకు డూష్ చేసుకోకూడదు.

సంయోగం అయిన ఆరు గంటల తరువాత తొలగించి తీసివేసిన డయాఫ్రంని సబ్బునీళ్ళతో కడిగివేసి ఆరబెట్టి, పౌడరు జల్లి జాగ్రత్తగా అట్టిపెట్టాలి. సాధారణంగా డయాఫ్రం చిరగడంగాని, కన్నాలు పడడం కాని జరగదు. కాని డయాఫ్రం అంచుల దగ్గర స్ప్రింగు వుంటుంది కనుక అక్కడ కాస్త చిరగడానికి అవకాశము ఉంది. డయాఫ్రంకి యెటువంటికన్నాలు లేవని తెలుకోవాలంటే అది కప్పు ఆకారంలో ఉంటుంది కనుక అందులో నీళ్ళూ పోసి పరీక్ష చేయాలి. డయాఫ్రం పర్సులో దాచుకున్నా, అలమారా సొరుగులొ పెట్టినా ఏమీ చెడిపోదు. డయాఫ్రం పద్ధతి ఫేల్ అవడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. డయాఫ్రంని సరిగ్గా ఫిట్ చేసుకోవడం చేతకాకపోయినా, సంయోగం సమయంలో యోనిమార్గం ఎక్కువ వెడల్పు అయినా, డయాఫ్రం అంచులకి జెల్లీ వ్రాస్తే ఆ అంచులు జారిపోయినా అసలు జెల్లీ రాయకుండా డయాఫ్రం ఉపయోగించినా గర్భనిరోధం జగకపోవచ్చు కొన్ని సంయోగ పద్ధతుల వల్ల కూడా డయాఫ్రం జారిపోవచ్చు. ముఖ్యంగా భర్త క్రింద పరుండి, భార్య అధిరోహించే పద్ధతివలన డయాఫ్రం ఉండవలసిన పొజిషన్ నుంచి తొలగవచ్చు. ఏది ఏమైనా డయాఫ్రం పద్ధతి చాలా తేలిక, తక్కువ ఖర్చుతో కూడుకున్నది.

* * *