కుటుంబ నియంత్రణ పద్ధతులు/పురుషులకే కాదు స్త్రీలకి కూడా "నిరోధ్"

వికీసోర్స్ నుండి

18.పురుషులకే కాదు స్త్రీలకి కూడా "నిరోధ్"

ఇంతవరకు 'నిరోధ్' పురుషుల వాడకానికే తయారు చేయబడ్డాయి అయితే ఇప్పుడు స్త్రీలు వాడటానికి కూడా 'నిరోధ్ ' వంటి సంతాన నిరోధ సాధనం తయారు చేయబడింది. స్త్రీలకోసం తయారుచేయబడిన ఈ క్రొత్త నొరోధ్

ఒకటి - రెండు సంవత్సరాల్లో మార్కెట్టులోకి విడుదల అవుతుంది కూడా.

స్త్రీల వాడుకకోసం తయారు చేయబడిన ఈ కండోమ్ (నిరోధ్) యోనిలో అమరే విధంగా పాలీయురిధేన్ శాక్‌తో రూపొందించబడింది. ఇటువంటి 'స్త్రీల నిరోధ్' 15 సెంటీ మీటర్ల పొడవు, 7 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ నిరోధ్ మూతి దగ్గరఉండే పాలియురేధేన్ రింగ్ యోని ముఖద్వారం దగ్గర పట్టి ఉంచితే తేలికగా ముడవబడే రింగ్ యోని లోపల గర్భాశయ కంఠం దగ్గర పట్టుకొని ఉంటుంది. ఈ రకంగా అమరడంవల్ల ఈ నిరోధ్ యోనిమార్గం లోపల "రబ్బరు సంచి" లాగా ఉంటుంది.

సంయోగంలో పాల్గొన్నప్పుడు స్త్రీ యోనిలో అమరిన ఈ పల్చని రబ్బరు తొడుగులో పురుషాంగం ప్రవేశిస్తుంది. స్త్రీ యోని కండరాలతో పురుషాంగానికి తిన్నగా సంబందం రాదు. అయితే స్త్రీలకి సంబంబందించిన నిరోధ్ చాలా పలచగా ఉండబట్టి పురుషునికి అది అడ్డు ఉన్నట్లే అనిపించదు. మామూలుగానే యోనిలో సంయోగం జరుపుతున్నట్లే ఉంటుంది. స్త్రీకి కూడా సెక్సు స్పందనలు కలగడంలో గాని, సుఖప్రాప్తి కలగడంలోగాని ఎటువంటి తేడా అనిపించదు. మామూలుగా యోనిలో ద్రవాలు ఊరుతూ సంయోగ సమయంలో జారుడుగా అనిపించినట్లే ఈ నిరోద్ లో జారుడుగా ఉండేటట్లు రూపొందించబడించి. స్త్రీలకోసం రూపొందించబడిన ఈ నిరోధ్ గర్భం రాకుండా నిరోధించడమే కాకుండా, పురుషునికి ఏమైనా సెక్స్ వ్యాధులు ఉంటే ఆమెకు సంక్రమించకుండా నిరోధిస్తుంది. ఎందుకంటే పురుషులు సంయోగంలో పాల్గొన్నా అతని పురుషాంగం తిన్నగా ఆమె యోని గోడలతో సంబంధం పొందదు. కేవలం యోని లోపల అమరిన పల్చని రబ్బరు గొట్టంతోనే ఉరుషాంగం ప్రవేశిస్తుంది. వీర్యస్కలనం కూడా ఆ తొడుగులోనే జరుగుతుంది. అలా స్కలింపబడిన వీర్యం ఆ తొడుగులోనే ఉండిపోతుంది. సంయోగం అయిపోయిన తరువాత ఆ తోడుగుని యోనినుండి లాగివేసి బయట పారవేయడమే స్త్రీ చేయవలసిన పని.

స్త్రీలకి రూపొదించబడిన విరోధ్‌వల్ల పురుషుల నుంచి స్త్రీలకిగాని, స్త్రీల నుంచి పురుషులకి గాని ఎయిడ్స్‌వంటి వ్యాధులుగాని, ఇతర ప్రమాదకర వ్యాధులుగాని సంక్రమించడం ఉండదు.

స్త్రీల కోసం రూపొందించబడిన నిరోధ్ వాడకం గురించి, దాని సాధకబాధకాల గురించి ఇప్పుడు ఇంగ్లండులో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇంతవరకు జరిగిన ప్రయోగాలనుబట్టి దీని వాడకంవల్ల స్త్రీకిగాని, పురుషునికిగాని ఎటువంటి అసౌకర్యంగాని, అసంతృప్తిగాని కలగడం లేదని తేలింది. పైగా దంపతులు, అందులోనూ ముఖ్యంగా స్త్రీలు దీని మీద ఆసక్తి చూపిస్తున్నారు. 'స్రీల నిరోధ్‌' విజయవంతమైనట్లయితే స్త్రీలు కుటుంబనియంత్రణ కొరకు బిళ్ళలు మింగడంగాని, యోనిలో టాబ్లెట్లు వాడడంగాని అవసరం ఉండదు. పైగా పురుషుడు సరిగ్గా నిరోధ్ వాడకపోతే తనకి ఎక్కడ గర్భం వస్తుందో అని ఆందోళన చెందవలసిన అవసరం ఉండదు. తన భద్రత గురించి తానే జాగ్రత్తపడి హాయిగా దాంపత్య సంబంధాలలో పాల్తొనవచ్చు.

* * *