కుటుంబ నియంత్రణ పద్ధతులు/ఆపరేషను చేయించుకున్న తరువాత తిరిగి పిల్లలు కావాలనుకుంటే

వికీసోర్స్ నుండి

17. ఆపరేషను చేయించుకున్న తరువాత తిరిగి పిల్లలు కావాలనుకుంటే...

ట్యూబెక్టమీ, వేసెక్టమీ ఆపరేషనులు శాశ్వత కుటుంబనియంత్రణ పద్ధరులు. తాత్కాలిక కుటుంబనియంత్రణ పద్ధతులని అవలంబించడము మానివేస్తే త్వరలోనే గర్భం వస్తుంది. ట్యూబెక్టమీ గాని వేసెక్టమీ గాని చేయించుకున్న వాళ్ళకి ఇక గర్భం వచ్చే అవకాశంమే లేదు. కాని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ట్యూబెక్టమీ గాని, వేసక్టమీ గాని చేయించుకున్న వారికి తిరిగి సంతానం అవసరం ఏర్పడుతుంది. ఆపరేషను చేయించుకున్న తరువాత ఉన్న పిల్లలు కాస్తా మరణించడమో, భార్యో, భర్తో మరణించగా మళ్ళీ వివాహం చేసుకుని తిరిగి సంతానం కావాలని అనుకోవడమో అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటుంది.

ట్యూబెక్టమీ చేయించుకున్న స్త్రీలుగాని, వేసక్టమీ చేయించుకున్న పురుషులు గాని తిరిగి ఆపరేషను చేయించుకుని సంతానం కోసం ఆశలు పెట్టుకోవచ్చు. సంతానం కోసం తిరిగి ఆపరేషను చేయించుకోవడాన్ని ట్యూబోప్లాస్టీ అనీ, రీకెనలైజేషన్ అని అంటారు.

స్త్రీలలోగాని, పురుషులలోగాని సంతానం కొరకు తిరిగి ఆపరేషను చేయించుకున్న వారిలో నూటికి 60-70 మందికి సంతానం మళ్ళీ కలుగుతుంది. ట్యూబోప్లాస్టీగాని, రీకెనలైజేషన్ గాని కాంప్లికేటెడ్ ఆపరేషన్లు కాదు. అయితే ఆపరేషను చేయించుకున్న ప్రతీ ఒక్కరికీ తిరిగి తప్పక సంతానం కలుగుతుందనే హామీ లేదు.

పురుషులలో వేసెక్టమీ ఆపరేషను చేయించుకున్న తరువాత తిరిగి సంతానం కొరకు రీకెనలైజేషన్ చేయించు కుంటే ఆపరేషన్ సక్సెస్ అవడమనేది ఒక ముఖ్యమైన విషయం మీద ఆధారపడి ఉంది. వేసక్టమీ చేయించుకున్న తరువాత తిరిగి త్వరలోనే రీకెనలైజేషన్ ఆపరేషను చేయించుకుంటే సంతానం కలిగే అవకాశాలు ఎక్కువ. అలా కాకుండా వేసెక్టమీ చేయించుకున్న అనేక సంవత్సరాల తరవార సంతానం కొరకు తిరిగి ఆపరేషను చేయించు కుంటే సంతానం కలిగే అవకాశాలు తక్కువ. ఎందుకంటే వేసక్టమీ చేయించుకున్న తరువాత నిదానంగా వీర్యకణాలని ఉత్పత్తి చేసే సెమిన్ ఫెరస్ ట్యూబ్యూల్స్ పనిచేయడం మానివేస్తాయి. అందుకని తగినన్ని వీర్యకణాలు లేక గర్భం రాదు. ఒక్కొక్కసారి ఆపరేషను విజయవంతంగా జరిగినా ఆపరేషన్ చేసిన చోట తిరిగి మార్గం మూసుకుని పోవచ్చు దీనితో సంతానం కలుగకుండా అయిపోతుంది. ఇలా మూసుకుని పోవడము మనేది తిరిగి ఆపరేషను చేయించుకున్న స్త్రీలలో ఫురుషులలో ఇద్దరిలోనూ జరగవచ్చు.

* * *