కుటుంబ నియంత్రణ పద్ధతులు/కడుపురాకుండా కాపాడేబిళ్ల "టుడే"

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

4. కడుపురాకుండా కాపాడేబిళ్ల "టుడే"

రేవతికి ఇటీవలే వివాహమైంది. అప్పుడే పిల్లలు వద్దనుకుంది. కాని ఏం చేయాలో తెలియలేదు. ఒకసారి డాక్టరు దగ్గరకు వెళ్ళి డాక్టర్, నాకు ఇటీవలనే వివాహమైంది. నేనూ, మావారూ ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం. వారొక ఊరులో ఉద్యోగం చేస్తూ వుంటే నేను మరొక ఊరులో, అందుకని మేమిద్దరం రతిలో పాల్గొనగలిగేది నెలకి ఏ మూడు నాలుగు రోజులు మాత్రమే. ఇద్దరం చెరొక ఊరులో వుండడం, ఉద్యోగం చేస్తూ వుండడం వల్ల గర్భం రాకూడదని అనుకున్నాం. అందుకని వారు ఇక్కడికి వచ్ఫినప్పుడు నిరోధ్ వాడుతున్నారు. మరి వారికి చేతకాకపోవడంవల్లనో, మరెందుకనో సరిగ్గా కుదరడం లేదు. తరచుగా జారిపోతుంది. పైగా నిరోధ్ వల్ల తృప్తి వుండడం లేదని తీసి ప్రక్కన పడేస్తారు. అలా చేస్తే కడుపు వస్తుందేమోనని భయం కలుగుతూ వుంటుంది. సరే వారు నిరొధ్ వాడకుండా నేనే కడుపు రాకుండా మాత్రలు వేసుకుందామని అనుకున్నాను. రోజూ రతిలో పాల్గొన్నా పాల్గొనకపోయినా నెలకి ఒకటి, రెండుసార్లే కడుపు రాకుండా బిళ్ళలు మాత్రం రోజూ తప్పనిసరిగా వేసుకొవాలి కదా, అలాగేనని వేసుకో వడం మొదలు పెట్టాను. కాని అది కడుపులో త్రిప్పుతుంటే ఒక నెల కూడా పూర్తిగా వాడకుండా మధ్యలోనే మానివేశాను. ఇలాంటి పరిస్థితివల్ల రెండు మూదు రొజులే రతిలో పాల్గొన్నా ఆనందం లేకుండా భయం భయంగా పాల్గొనవలసి వస్తోంది. అందుకని నాకొక సలహా కావాలి. నాకు గాని, మా వారికి గాని ఇబ్బంది లేకుండా, ఇద్దరం కలుసుకున్నప్పుడే వాడే బిళ్ళలు ఏవో తెలియజేయండి. అవి వాడుతూ హాయిగా గర్భం రాకుండా కాపాడుకుంటాం. నా మానసిక వేదనని అర్ధం చేసుకోండి" అంటూ తన మానసిక వేదనని వ్యక్తపరిచింది.

ఎప్పుడో ఒకసారి రతిలో పాల్గొంటూ గర్భంరాకుండా జాగ్రత్తపడాలంటే "టుడే" వజైనల్ పెసరీ బాగా ఉపయోగపడుతుంది. వజైనల్ పెసరీ అంటే యోనిలోపలి వాడే బిళ్ళ. "టుడే" బిళ్ళ గర్భం రాకుండా నిర్భయంగా వాడవచ్చు. దంపతులు రతిలో పాల్గొనడానికి పది నిముషాల ముందు ఒక బిళ్ళని యోని లోపలికి పెట్టుకోవాలి. వ్రేలుద్వారా పూర్తిగా లోపలికి పోయేటట్లు నెట్టుకోవడం అవసరం. యోని లోపలికి ప్రవేశపెట్టుతున్న ఈ బిళ్ళ 10 నిమిషాల్లో కరిగిపోతుంది. ఇలా కరిగిపోయిన బిళ్ళ గర్భం రాకుండా వీర్యకణాలని నిర్మూలిస్తుంది. అయితే ఈ బిళ్ళ గంటసేపే పనిచేస్తుంది. గంట తరువాత మళ్ళీ రతిలో పాల్గొ నాలంటే మరొక బిళ్లని యోనిలోకి ప్రవేశపెట్టాలి. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి. యోనిలోకి బిళ్ళని ప్రవేశపెట్టుకున్న తరువాత 10 నిమిషాల వరకు రతిలో పాల్గొనకుండా ఆగాలి. యోనిలోకి ప్రవేశపెట్టుకునే ఈ బిళ్ళలవల్ల యోనిలో మంటగాని మరో బాధగాని వుండదు. బిళ్ళ వెంటనే కరిగి పోతుంది కనుక రతికి ఎటువంటి ఆటంకం వుండదు. స్త్రీకిగాని, పురుషునికి గాని ఎటువంటి అనారోగ్యం కలగదు. ఈ బిళ్ళలు ఎంతకాలం ఉపఉయోగించినా నష్టం కలగదు. ఏ వయస్సుకి చెందిన స్త్రీలైనా ఉపయోగించవచ్చు. అయితే ఆ బిళ్ళ పనిచేసేది గంటసేపే అనేది గుర్తు వుంచుకోవాలి. ఒకవేళ ఒకేరోజున మూడు నాలుగుసార్లు రతిలో పాల్గొంటే అన్నిసార్లూ ఒక్కొక్క భిళ్ళని యోనిలో పెట్టుకోవాలి. ఇది మెంగే బిళ్ళ కాదు కనుక కడుపులో వికారం వంటి బాధలు వుండవు.

* * *

స్త్రీ బాహ్య జననేంద్రియాలు

KutunbaniyantranaPaddathulu.djvu
1.యోని శీర్షం 2.బాహ్యాధరాలు 3.అంతరాధరాలు 4.కన్నెపొర 5.బార్ధోలియన్ గ్రంధి 6.యోని ద్వారం క్రింది భాగం 7.మలద్వారం 8.వెస్టిబ్యూలు 9. మూత్ర ద్వారం 10. యోని ద్వారం

స్త్రీ అంతర్ జననేంద్రియాలు

KutunbaniyantranaPaddathulu.djvu

1. గర్భాశయం లోపలిభాగం 2.గర్భాశయం పై భాగం 3. గార్టినెర్స్ డర్ట్ 4. రక్తనాళాలు 5.అండవాహికం చివరి భాగం 6. మోర్‌గాగని గ్లాండు 7.అండాశయంలో అండం తయారైన భాగం 8. సారూపోరాన్ 9. గర్భాశయం గోడలోని కండరాలు 10.గర్భాశయ కంఠం లోపలి ద్వారం 11. గర్భాశయ కంఠంలోని మార్గం 12. యోనిమార్గం 13. గర్భాశయకంఠం బయటిద్వారం 14. గర్భాశయ కంఠం 15. గర్భాశయానికి రక్తనాళాలు 16.అండాశయం లిగమెంట్లు 17. అండాశయం 18.అండాశయంలో అండం తయారి 19. అండవాహికలో వెడల్పయిన భాగం 20. అండాశయం రక్తనాళాలు