కాశీయాత్ర చరిత్ర/పద్దెనిమిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

యిచ్చమాత్రము యిప్పుడు నిలిచి వున్నది గాని, వారు బోధ చెసిన ఆచార వ్యవహారాదులు యీ దేశాస్థుల సాంగత్యము చేత క్రమక్రమశ: ఖిలపడుతూ వచ్చినది.

వాయుపురాణ ప్రకారము గయావళీలను గయావ్రజనక్రియలు చేయడములో ఆరాధన చెయవలసినది అగత్యము గనుకనున్ను, ద్రావిడాచార ప్రకారము పిండప్రదానాత్పూర్వము అన్నశ్రాద్ధము చేయడము ముఖ్యము గనుకనున్ను, గయవళీలు ద్రావిళ్ళు పచనము చేసిన అన్నము భోజనము చేసేటట్టు సమ్మతించినారు గనుకనున్ను, చటకము మొదలైన శ్రాద్ధాలు చేసి గయావళీలకు ఆమం మొదలైన భక్ష్యయోగ్య వస్తువులు యిచ్చే టంతకన్నా అన్నశ్రాధ్హానికి గయావళీలను బ్రాహ్మణార్ధము చెప్పేటట్టు దక్షణ దేశస్థులు నిశ్చయము చేసినారు గాని యేకారణము చేతనున్ను గయావళీలు పక్వము చేసిన అన్నమును ద్రావిళ్ళు వుచ్చుకునేటట్టు సమ్మతించినవారు కారు. తదారభ్యగయావళీలు ద్రావిళ్ళవల్ల యీపాటి జరిగే గౌరవమును కాపాడుకోవలసి ద్రావిడ దేశస్థులు భోజనము చయ్యకనుండేవారి చేతి పక్వాన్నము తామున్ను భుజించకుండా ద్రావైడాచార ప్రకారము నడిచేవారమని అభినయిస్తూ కాలము గడుపుతూ వస్తున్నారు. యాభై అరవై యేండ్ల క్రిందట సత్యూపూర్ణ పీఠస్థులు యీ ప్రాంతముల చచ్చివుండి గయావళీలకు నమాశ్రయణము చేసి పూజగైకొని పోయినారు. యిప్పుడున్ను పునా శ్రీమంతుడు మొదలయిన గొప్పవారి గయావళీలు మాత్రము యధోచితముగా యజమాన ప్రీత్యర్ధమై బ్ర్రాహ్మణ నిత్యకర్మలు జరుపుకుంటారు.

పద్దెనిమిదవ ప్రకరణము

మనలో పేరుగలిగిన యాభై ఆరు చేశాలు వాటి ఛెప్పన్నభాషలున్ను యీ బ్రహ్మాండములో యేపక్క వున్న వని విచారించగా నేను చేసిన దేశాటనముచేత నాకు కలిగివుండే స్వానుభవము చెతనున్ను, నా వినికిడి వల్లనున్ను, నేను నిశ్చయము చేసినది యేమంటే ఆ దేశాలంతా కర్మద్వారా బ్రహ్మానుసంధానము చేసే 'యిండి యా' అని నామధేయము కలిగిన కన్యాకుమారి మొదలు కాశ్మీరము లోపలనే వున్నవి గాని అన్యత్ర కాదు, అని నిశ్చయము చేసినాను. అయితే బహు దినములుగా యీ భూమి తురకలచేత ఆక్రమింపబడి దేశ సరిహద్దులు తెలియకుండా భూమిని కలిపి వారి యేలుతూ వచ్చి నందుచేత యిప్పట్లో ఆ యాభ్హై ఆరు దేశాల సరిహద్దులు అన్ని కనిపెట్టి వ్రాడనకు ప్రయాసగా నున్నది. అయినా ఆ యాభై ఆరింటిలో అనేక దేశాల సరిహర్రులు కనిపెట్టి వ్రాయవచ్చును.

మనము వసించే భూమితోకూడా ఊర్ధ్వ లోకాలు యేడు; అధోలూకాలు యేడు. వాటిస్థితి యెక్కడ నని విచారించగా నాబుద్ధికి తేటపడ్డది యేమంటే, పయిన వ్రాశిన పదునాలుగు భువనములు యీ బ్రహ్మాండమునకు అంతర్భూతములని నిశ్చయపడ్డది. అది యెట్లంటే యీ బ్రహ్మాండము కోడిగుడ్డు ఆకారముగా వున్నదని మన శాస్త్రమున్ను మతారంతరస్థుల భూగోళ శాస్త్రములున్ను యేక వాక్యవ పడి వున్నవి. మన గణిత శాస్త్ర ప్రకారముగా నున్ను యీ బ్రహ్మాండానికి 120 భాగాలుగా చేసి అందులో మధ్య ప్రదేశాన్ని మనవారు నిరక్ష దేశమనిన్ని, జాతులవాండ్లు 'లయన్ ' అనిన్ని పేరుపెట్టి వున్నారు. గనుక ఆ నిరక్ష దేశానకు వుత్తరము యేడులొకములుగానున్ను, దక్షిణము అధోభాగమునందు యేడు లోకాలుగా నున్ను మన వారు నియమించినారు. వుత్తరము వూర్ధ్వభాగమందు వుండే యేడు భువనములలో మానుష నివాస భువనము వొకటి. దీనికి పై అంతస్థు అంతస్థుగా మనుష్యాపేక్షయా దేవతాస్వరూపులుగా వుండేవారు సృష్టికోటి తారతమ్యాల ప్రకారము శుద్ధసత్విక గుణప్రధానులై శీతల భూప్రదేశాలలో ఆనందింపుచు నుండే లాగు తోచుదున్నది. యీ లోకము లను స్వర్గ మర్వ్య పాతాళలోము అని మూడుగా చెప్పుచున్నారు. నిరక్ష దేశమునకు దక్షిణమందు అధోభాగమున తమోగుణ ప్రధానులైన రాక్షస భూతప్రేత పిశాచూదులు వారి వారి తారత్మ్య ప్రకారము అంతస్థులుగా వసింపుచునుండేలాగు తోచబడు చున్నది.

మనుష్యనివాసభూమికి ఊర్ధ్వాధ: ప్రదేశములలో వసింపచే చూస్తే తామసగుణ ప్రధానులకు ద్వేషబుద్ధి జనించడము సహజము గనుక, తామసగుణ ప్రధాను లయిన రాక్షసులు మొదలైన వారికిన్ని సాత్విక గుణప్రధానులైన దేవతలకున్ను యుద్ధములు పురాణోకతముగా వుండేలాగు అప్పుడప్పుడు సంభవిపుచు వచ్చినట్టు తోచుచున్నది. వశిష్టాదులుగా వుండే మునులు జన్మంకుచేత మనుషదేహులైనా వారు చేసిన సుకర్మములచేత దేవదేహులై దేవ సమానులైనారు. గనుక సాత్వికగుణ ప్రధానమైన దేవలోక సంచారములు వారికి గలిగి వుండేటట్టు తోచబడుచున్నది. విరజానది సన్నిహితమైన విష్ణు నివాస వైకుంఠమున్ను, సాంబమూర్తి నివాసమైన కైలాస పర్వతమున్ను మొదలైన వుత్తమ ప్రదేశములు మనకు వూర్ధ్వమున నుడే ఆరు భువనములలోనే వున్నవి. యీ కర్మ భూమిని వసించే మానుష మండలిలో కొందరు తామసారాధన ప్రియులై తామస గుణ ప్రధానులైన భూత ప్రేత పిశాచ రాక్షస్ గణాలను వుపాసన చేయుచూ వచ్చినారు గనుకిఅ వారి ప్రదేశమున్ను యీ మానుష నివాస భూమియందు గలిగి వారున్ను అతి తామసారాధనలచేత సర్వేశ్వరుని కటాక్షము సంపాదించినవారై సాత్వికగుణప్రధానులైన దేవతలను ధిక్కరించేపాటి సామర్ధ్యము కలవారైనారు గనుక వారు అటు తర్వాత తమ్మున ఆరాధించినవారియందు అనుగ్రహము చేయుచు తమంత వారినిగా చెయుచూ వచ్చినట్టు తోచుచున్నది.

లవణేక్షు సురాదులనే యేడు సముద్రములు ప్రత్యేక ప్రత్యేక ముగా నున్నవా లేక వొక సముద్రములోనే ఆ యేడు సముగ్రాలున్ను అంతర్భూతములా అని విచారించగా మన పురాణాదుల రీతిగానున్ను మతారంతరస్థుల పురాణాదుల రీతిగానున్ను సృష్టియొక్క ఆదిలో లోకారాధ్యుడు జలార్ణవముగా వున్న బ్రహ్మాండములో జలమును తొలగతోసి మృత్తికను కలుగచేసినట్టు వున్నది గనుక అటుతర్వాత పిండాండములయొక్క వాసార్ధము కలగచేసిన భూమి వినాగా మిగిలిన ప్రదేశామంతా బ్రహ్మాండములో జలమయముగా వున్నది గనుకనున్ను ఆ జలరాశి సమూహానకు సమిష్టి పేరు సముద్రము గనుకనున్ను సముద్రము వొకటే గాని అనేక సముద్రములు వుండనేరవు. అయితే సముద్రసంచారులుగా నుండే జాతులవాండ్లు సముద్రములో వుండే ప్రదేశాంతరములు గుర్తు తెలిసే కొరకు బ్లాకిసీ, రెడ్డుసీ అని పేళ్ళు పెట్టినట్టు మన పూర్వపు పౌరాణికులు దేవతలు మొదలైన సిద్ధస్వరూపులు వసించే ప్రదేశములు ఈ బ్రహ్మాండములో ఫలాని తావులు అని గుర్తు తెలిసేకొరకు వొక జలరాశిలోనే యిది లవణ సముద్రముయిది యిక్షు సముద్రమని యేర్పచినట్టున్ను ఆ మధ్యనుండే దివ్యభూఖండములను జంబూ ప్లక్ష అనే సప్త ద్వీపాంతరములుగా యేర్పరచినట్టుగానున్ను తోచబడుచున్నది.

సృష్టియొక్క క్రమము విచారించగా మొదట అయిదు మహా భూతములు వుద్భవించినవి. వాటిపేళ్ళు పృధిన్యప్తేజోవాయ్వాకాశాలు. ఆకాశభూతము శుద్దశూన్యమయినా సర్వవ్యాపకముగనుక అదే పర తత్వమైయుపనిషద్వాశ్య ప్రకారము తనవల్ల వాయువు దానివల్ల అగ్ని, దానివల్ల జలము, దానివల్ల భూమి అని యిట్లు సృజించెను. ఆకాశము గాక మిగిలివుండే నాలగు భూతములలోనున్ను వాటియొక్క సృష్టి పరంపరలోనున్ను ఆకాశ మహాభూతముయొక్క సంకల్ప స్వరూపమైన మాయాశక్తిన్ని, సర్వకారణమైన ఆకాశ భూతమున్ను లీనములై యున్నవి. వాయువుమొదలైన మహాభూతములు నాలుగింటిలో మాయాశక్తి చైతన్యము విస్తారము ప్రతిఫలించే స్త్రీ భూతములు తెండు; ఆకాశభూతసంబంధమైన పురుష చైతన్యము విస్తాఅరము ప్రతిఫలింఛే పురుష భూతములు రెండు; అంతు మహా భూతములు నాలుగు. అందుకు దృష్టాంతము యేపురాణములో విచారించినా భూమినిన్ని వుదకరాశినిన్ని స్త్రీలింగాలుగా చెప్పుతూ వచ్చినారు. ఆ అయిదు మహాభూతముల ద్వారా సంకల్ప ప్రకారము అనేక బ్రహ్మాండాలను సృష్టించి వాటిలో అంతర్భూతమయిన అనేక కోటి ప్రకృతిగల పిండాండాలను పరమాత్మ యనే ఆకాశ భూతముసృష్టించినది.

ఆప్రకారము సృష్టి అయిన అనేక బ్రహ్మాండములలో వుండే ప్రకృతి గల దేవమానుషులు మొదలైన దివ్యదేహాలంతా పరతత్వమయిన ఆకాశ మహాభూతము యొక్క ప్రత్యక్ష సృష్టి గనుక ప్రకృతి గలదేహములన్ని పంచభూతాత్మకములుగా వుంచున్నవి గనుక ప్రకృతి దేహాలకు బ్రహ్మానుసంధానము చేయదగిన శక్తి పుట్టే వరకు భగవద్గీతా వాక్యమైన 'వాసాంసిజీర్ణానీ అనే వాక్యప్రకారము దేహాంతరములు కలవు. ఆప్రకారము పరతత్వమువల్ల సృష్టిచేయబడిన ప్రకృతిదేహాల రక్షణనిమిత్తము గాను వాయు మహాభూతము తిర్యగ్జంతుకోటి అయిన పశువులు మొదలైన ప్రత్యక్ష జీవరాసులను సృష్టించెను. అవి పరతత్వముయొక్క సృష్టి కావు గనుకనున్ను పశువులు మొదలయిన దేహములలో పరతత్వముయొక్క ప్రతిభాతి కాతగ్గ ప్రకృతిలేదు గనుకనున్ను ఆ జంతుకోటికి దేహాంతరాలున్ను లేవు. యంత్రములవలెనే వాటిలో ప్రాణవాయువు నిలిచివుండే వరకున్ను చరింపుచు నుండి దేహములో ప్రాణవాయువు వదలగానే దేహాంతరములేక యంత్రము పగిలిపోయినట్టు విచ్చిన్నమై పొవును. అయితే తిర్యగ్జంతు కోటి ముఖ్యమయిన మహా వాయుభూతముయొక్క సృష్టి గనుక నున్ను ఆ జంతుకోటిలో ఆకాశభూతవ్యాప్తి ప్రత్యక్షముగా లేకపోయినప్పటికిన్ని వాయు మహాభూత సమేతముగా కొదవ నాలుగు మహాభూతముల వ్యాప్తి సంపూర్ణముగా నుండుటచేత ఆ జంతుకోటి దేహములలో పంచేంద్రియములు గలిగి ఆ యింద్రియాల ప్రేరేపణచేత ఆహార నిద్రాభయ మైధునాదులున్ను బాల్య యౌవన కౌమార వార్ధక దశలున్ను వాటికి కలిగి వున్నవి. అయితే అవి తల్లి బిడ్డ అనే వ్యవస్థలేక మూఢత్వముతో చిన్నదేహాలను పెద్దదేహాములు ఆహారము చేసికొంటూ వుంచున్నవి.

పరతత్వము యొక్క సృష్టిఅయిన ప్రకృతిదేహుల సంరక్ష్ణార్ధమని ఆ ప్రకారము వాయుమహాభూతము సృష్టించిన తిర్యగ్జంతుకోటిచాలదని తోచి అగ్ని మహాభూతమువల్ల వృక్షాదులు ఓషధులు సన్యాదులు, తృణాదులు మొదలయిన అచేతన వస్తుకోటి వాయుభూత సృష్టియైన జంతురక్షణకొరకు సృష్టించబడినది. తద్ద్వారా అగ్ని సృష్టించిన వృక్షగుల్మ సస్యాదులున్ను, పరతత్వవ్యాప్తిన్ని, వాయుభూతవ్యాప్రిన్ని అంతు రెండు వ్యాప్తులున్ను లేనందున పంచేంద్రియ వ్యాపారములు తజ్జనితమైన ఆహార నిద్రాభయ మైధునముల్ లేక్ నున్ను జాగ్రత్స్వప్నసుషుప్తులనే అవస్థా త్రయము లేకనున్ను స్థావర రూపములను వహించి బాల్యము యౌన వస్తాడు. ప్రతిభాతి తక్కువపడే కొద్ది జీవాత్మ అశుద్ధు డవుతూ వస్తాడు. ప్రకృతిలో పరమాత్మ ప్రతిభాతి పరమాత్మ సగృశమై పరమాత్మ తేజోంశము పూర్తిగా సంబంధించే వరకు యీ ప్రకృతి కష్టసుఖములు అనుభవింపుచూ వచ్చుచున్నారు. పైన వ్రాసిన పాంచభౌతిక దేహనివాసి అయిన ప్రకృతిని ఆత్మ అని పెద్దలు అనుచున్నారు; అందులో ప్రతిభాతి అయ్యే పరమాత్మ ప్రతిబింబాన్ని అంతరాత్మ అను చున్నారు. ప్రతిభాతిని కలగచేసే వస్తువు పరమాత్మ అని అంటారు.

ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ, అనేవస్తుత్రయము దేవ మాను షాది దివ్య దేహములలో అంతరించి వున్నవి. యీ దేహములలోని ప్రతిభాతులన్ని పరమత్మవల్ల సృష్టి అయిన విన్ని, పరమాత్మ సమములున్ను అయినందున యివి పాంచభౌతిక దేహములు అయినవి. అటువంటి ప్రకృతి దేహములు యీ యెనిమిది వస్తువులతో వుండేవి స్థూల దేహములని పేరువహించి వుంటున్నవి. స్థూల దేహాకృతి పూర్తిగా కిందవ్రాసిన పాణి పాదాదులయిన అవయవాలతో యేర్పడగానే కిందవ్రాసిన జ్ఞానకర్మసాధనములైన యింద్రియాలు జనములై ఆ యింద్రియాలకు పటుత్వము రాగానే వాటి సమూహాన్ని సూక్ష్మదేహ మని అనుచున్నారు. యీ సూక్ష్మ దేహల్ము శబ్ద స్పర్శ రూప రస గంధాలను గ్రహింపుచు జాగ్రదవస్థలో బహు వ్యాపారములు విరామము లేకుండా చెయుచున్నది. అందులో వాక్చక్షుశ్శ్రోత్ర జిహ్వాఘ్రాణా లనే పంచేంద్రియములు బహు వ్యాపారమువల్ల అలియగానే మనస్పనే ఇంద్రియము తమకు యజమానుడు గనుక ఆ మనస్సనే యింద్రియము తాను అలిశే వరకు స్వప్నావస్థ అని వొక అవస్థను కల్పించుకొని ఆ అవస్థలో బహువ్యాపారములను యేకాంతముగా చేయుచూ వుంచున్నది. ఆ మనస్సనే ఇంద్రియానకు అలసట పుట్టగానే అది ఆత్మ అనే జీవునిలో లయించి పోవుచున్నది. అలాగు మన స్సనే యింద్రియము ఆత్మలో లయించి నప్పుడు సుషుప్తి అవస్థ యని అనిపించు కుంచున్నది. వాయుభూతజన్య మయిన తిర్యగ్జంతు దేహముల కన్నిటికి త్వక్కు చర్మము మాంసము మొదలైన అన్ని వస్తువులు గలిగినా వాటివల్ల శిర:పాణి పాదావయవాలు వుద్భవించినా అవస్థాత్రయము ఇంద్రియాలద్వారా వున్నా ఆకాశానికి బదులు వాయునే అంతరత్మ అయి వాటి ఆత్మలను కల్పించెను గనుక ప్రకృతి దేహాలవలెనే తిర్యగ్జంతువులు సుషుప్త్యవస్థా వంతరము 'యీ వరకు సుషుప్తి యనే అవస్థను నేను పొంది వుంటిని ' అని అనుకోవడానకు నాటి దేహములలో వస్త్యంతరమున్ను తెలివిన్ని లేదు. ఆ వస్తువే పరమాత్మభాతి అని తెలుసుకోవలసినది. అగ్నిభూతజన్యమైన వృక్షాదులలో అగ్ని మహాభూతమే వాటికి ఆత్మగా తన ప్రతిభాతి ద్వారా యేర్పడి నందున ఆ సృష్టికోటిని తిర్వగ్జంతువులకున్ను భిన్నముగా మొరివొకవిధమయిన తక్ చర్మ మాంసాదులతో వాటి దేహములు యేర్పడి శిర:పాణి పాదాలుగా వుండే అవయవములు పరిష్కాతముగా యేర్పడక యింద్రియములు జనించక బీజాంకురాలను మాత్రము కల్పించుదున్నది. అప్పుభూతము యొక్క సృస్టిలో ఆకాశము, వాయువు, వహ్ని యీ మూడు భూతముల ప్రతిభాతి లేనందుననున్ను స్వయం అప్పుభూతమే సదమునదులు మొదలయిన జలరాశి స్వరూపము ధరించుట ఛేత చలనశక్తి మాత్రము వాటికి కలిగి వురుషభూతముల సృష్టికోటిని కాపాడుతూ వున్నది. పృధివీభూతము తన సృష్టి అయిన మృత్తు మొదలయిన వస్తువులలో పయి నాలుగు మహాభూతముల వ్యాప్తి లేనందున చలనశక్తి కూడా లెకుండా పురుషభూతసృష్టిని ధరించి అప్పుసృష్టి సహాయ ద్వారా వాటిని పరిపాలన చేయుచూ స్థితిని పొందియున్నది.

యీ ప్రకారము యీ బ్రహ్మాండములలో సృష్టి అయిన సకల మున్ను ఆకాశ మహాభూతమువల్ల సృష్టి అయిన ప్రకృతి దేహముల పరిపాలనార్ధమే గనుక యీ ప్రకృతి దేహములు మిగిలివుండే సృష్టికోటిని యేలుబడిచేయు చున్నవి. యీ యిక్తిమీద విచారించగా ప్రతి బ్రహ్మాండమునకున్ను అటువంటి పరమాత్మ ప్రతిభాతికి యోగ్యమయిన ప్రకృతులు సృష్టికి అదిన్ని యిన్ని అని సంఖ్య నిర్ణయింపబడి వుండవలనని తోచబడుచున్నది. యింతే కాకుండా మహమ్మదు యింగిలీషు శాస్త్రాల ప్రకారమున్ను మనశాస్త్రముల ప్రకారమున్ను యీ ప్రకృతులకంతా వొక్క కాలములొనే వుపసంహార మనిన్ని తోచబడుచున్నది. ఆకాలమును జాతులవాండ్లు డే ఆఫ్ జడ్జిమెంటు అంటారు. మనవారు బ్రహ్మణాసహముక్తి అంటారు. మహమ్మదు మతస్థులు కయామల్ కాదిర్ అని చెప్పుచున్నారు. సృష్టియొక్క విభజన తెలిసే నిమిత్తము పైన వ్రాసిన వివరములవల్ల పరమాత్మవ్యాప్తి కొన్నిటియందు లేకుండా వుండునేమో అని సందేహించ వలసినది లేదు. పరాత్పర మయిన ఆకాశమహాభూతమనే పరమాత్మ సరాంతర్యామిగానున్ను, అణువులో అణువుగానున్ను మహత్తులో మహత్తుగా నున్ను ప్రత్య్హక్షపరోక్షాలుగా వుండే వున్నాడు. సృష్టియొక్క విభజన తెలియడానకు పయిఖుల్ల స్సు వ్రాసినాను. పంచమహాభూతములే దీపదీపికా న్యాయముగా పరమత్మ సంబంధములే గనుక సర్వంబ్రహ్మమయం జగర్ అనేవచనము సత్యముగా నమ్మడానకు యేమిన్ని సందేహము లేదు.

ఆకాశవాయు వహ్నిభూతాలు సృష్టించిన జంతుకోటికి బాల్యయౌవన కౌమార వార్దక దశలు సంభవించడానకు కారణమేమనిన్ని ఆ నాలుగు దశల సంచారకాలాలలో ఆ దేహములలోని అంతరాత్ములు దశాభేదరల్హితులైనా వారి దేహ చేష్టలద్వారా వారికే దశాభేదములు కలిగినట్టు అగుపడవలసిన దేహ చేష్టలద్వారా వారికే దశాబేదములు కలిగినట్టు అగుపడవలసిన దేమనిన్ని విచారించగా సృష్టియొక్క్జ వృద్ధి నిమిత్తము స్థూల దేహములలో పాంచభౌతికాలుగా వుండే ప్రకృతులనే బీజాలను యీశ్వరుడు ప్రవేశపెట్టి వాటి ధారణకున్ను పొషణకున్ను, అంకురోత్పత్తి చేయనున్ను మాయాశక్తి చైతన్య స్వరూపులయిన స్త్రీల యొక్క గర్భాలను కలగచేసి పురుష దేహసంగమ ద్వారా ఆ గర్భాలలో బీజాలను కలగచేసి, ఆబీజము తగుపాటి అంకురము కాగనే మాయాశక్తి చైతన్యము పూర్తిగా కలిగి పృధ్వీభూతము మీద ప్రత్యక్షముగా యీశ్వరుడు నిలుపుతాడు. అని మొదలుగా ఆ అంకురాన్ని పృధ్వీ మహా భూతము వృద్ధిచేసి దాని సన్యకాలము వచ్చేవరకు పోషింపుచూ వుంచున్నది. సమస్త విధములయిన దేహములను ధరించి పొషించే శక్తి పృధ్వీ మహాభూరముదేకాని యితర మహా భూతములది కాదు. అందుకు దృష్టాంత మేమంటే మనుష్యులేమి, మృగాదులేమి, పక్షులేమి అన్ని జాతులున్ను వాటి పిల్లలను, గుడ్లను భూమి ధరింఛేపాటి పక్వమయ్యే వరకు మనుష్యులు విత్తనములు భూమిలో చల్లేటందుకు ముందర కొంతసేపు కుండలో నానవేసి వుంచి నట్తు కొంతకాలము జంతువులు బీజములను వాటి స్త్రీజాతి గర్భాలలో వుంచుకుని అవి భూధారణకు పక్వములు కాగానే యీశ్వరాజ్ఞ చొప్పున భూమిమీద ఆయా స్త్రీ జంతువులు వుంచుచున్నవి. అది మొదలుగా పృధివీ భూతము వాటినన్నిటిని యింకా తన మీద వుంచబడే యితర బీజములనున్ను అంకురాలం ఛేసి తర్వాత ఆ వృక్షాదులను, సస్యాదులనున్ను బెంచి మనుష్యులకు, జంతువులున్ను అనుభవించేటట్తుగా యీశ్వరాజ్ఞ చేత కాపాడుతూ వస్తున్నది. యీప్రకారము వుత్పత్తి అయిన దేహములు పెరిగి పుష్టిని పొందక బీజప్రదానము చేయలేక వుండేకాలము బాల్యదశగానున్ను, పెరిగి పుష్టిని పొంది బీజప్రదానము చేయ నిచ్చయించే కాలము యౌనదశగా నున్ను తర్వాత బేజొత్పత్తి చేయగలకాలము కౌమారదశగానున్ను, తదనంతరము విరామకాలము వార్ధకదశగానున్ను ప్రత్యేకముగా అనుభ్వించడానకు హేతు లైనవి. కాష్టములో అగ్ని ప్రవేశించినట్టు ఆత్మాంతరాత్మలు దేహాలలోప్రవేశించి వుంటారు గనుక కాష్టము వంగితే ప్రవేశించిన అగ్నిన్ని వంగినట్టు ఆత్మాంతరాత్మలు దేహసంబంధ మైన దశలను దేహాలు అనుభవించేటప్పుడు తామున్ను అనుభవించేవారివలె అగుపడుతారుగాని, ఆనాలుగు దశానుభవాలు ఆత్మాంతరాత్మలకు యెంతమాత్రమున్ను వాస్తవముగా లేవని తెలియబడుచున్నది.

దేహులయొక్క దేహాలలో సత్వరజస్తమోగుణములు మూడున్ను భిన్నములై వుండవలసినదేమనిన్ని, వాటి ప్రవృత్తి నివృ త్తులకు కారణ మేమనిన్ని విచారించగా సాత్వికగుణము ఆభాసమయితే రాజసగుణముగా పరిణమింపుచున్నది గనుక నున్ను రాజసము ఆభాసమయితే తామసముగా పరిణమించడము దృష్టాంతము గనుకనున్ను, సత్వగుణ ప్రధాను డయిన పరమాత్మ ఆత్మలో భాతిఅయి ఆభాతే అంతరాత్మ అయినది గనుక పరమాత్మవల్ల అంతరాత్మ జనించినట్టు సాత్వికమువల్ల అంతరాత్మ స్వభావమయిన రజోగుణము దేహములో వుత్పత్తి అయినది. అంతరాత్మజననద్వారా ఆత్మకు చైతన్యప్రభావము కలిగినది. గనుక ఆచైతన్యము అంతరాత్మయొక్క ఆభావమైనందున రాజసగుణాభావముగా వుండే ఆత్మస్వభామైన తామస గుణము దేహములో జనించినది. ప్రకృతి దేహములలో పరమాత్మ - అంతరత్మ -ఆత్మ యీ ముగ్గురి వ్యాపకము సిద్ధముగా నుండుటచేత వారి ముగ్గురిస్వభావాలైన సత్వర్జస్తమోగుణాలున్ను వ్యాపించి యున్నవి. తమోగుణ జన్య మైనవి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు; వీట్లను సాధారణముగా అరిషడ్వర్గము లనుచున్నారు. రజోగుణజన్యములు అహంకార మమకారాలు. సత్వగుణజనములు శాంతి దాంతిక్షములు, ఆత్మకు అంతరాత్మద్వారా చైతన్యముకలిగినదనే తెలివి ఈశ్వర్కటాక్షము చొప్పున కలిగేవరకు దేహియొక్క దేహములో తమోగుణప్రవృత్తి కలిగి ఆత్మ అరిషడ్వర్గాలచేత బహు బాధపడుతూ వుంచున్నది. అటుతర్వాత పరంపరగా అంతరాత్మకున్ను, నాస్థితికి కారణము పరమాత్మేగదా. నేను యే పాటివాడను? జలబుద్బుద వత్తనే తెలివి కలిగేవరకు రజోగుణానకు ప్రవృత్తి కలిగి నాకు సమానులు వొకరుకద్దా నేను శాసాపనులు చేసినారు, యింకా చెయగలుగుదును; అంటూ అహంకార మమకారాలచేత అంత రాత్మ వ్యధపడుతూ వుంచున్నది. పైన వ్రాసిన తెలివి అంతరాత్మకు కలిగి అంతరాత్మ ప్రకోపము అణిగిపోగానే పరమాత్మ యొక్క దీప్తిస్ఫరత్తుగా ప్రకాశించి సత్వ గుణ ప్రధానమై తజ్జ్స్యమైన శాంతి దాంతి క్షమాదులు ప్రవృత్తిని పొంది వుంచున్నదవి.

సపుంసక లింగము వుల్లింగము స్త్రీ లింగ మనే లింగ త్రయము వాచకము లేల పుట్టినవి? వేటికి ఆ వాచకములు వాస్తవమూఅ వుపయుక్తము అని విచారించగా పరమాత్ముడు సృష్టినిమిత్తముగా వటబీజములో వటవృక్షము అణిగి వున్నట్టు ఆకాశభూత స్వరూపముతో సమస్తములో అణిగినాడు గనుక, అట్లా అణిగిన వస్తువులన్ని బీజాలు అనిపించు కున్నవి గనుక వాటిని నపుంసక లింగా లని చెప్పవలసినది. అటువంటి బీజములను తానే ధరించి అంకురోత్పత్తి చేసే నిమిత్తము గర్భములో వుంచతగిన దేహముల నంతా పుల్లింగములుగా చెప్పవలసినది. అటు చేయబడే బీజప్రదానాలను భక్తి శ్రద్ధలతో ప్రతిగ్రహించి గర్భములో భద్రపరచి అంకురోత్పత్తి పూర్తి కాగానే మహా స్త్రీలింగభూతముగావుండే పృధ్వియొక్క అధీనము చేయుచు వుండే దేహాములంతా స్త్రీలింగములుగా చెప్పవలసినది. యీ లింగత్రయము పైన వ్రాసిన దేహములను విభజనచేసి వ్యహరించను జన్యమైనది గనుకనున్ను నపుంసక లింగవాచక యోగ్యమైన బీజాలు అదృశ్యాలు గనుక స్త్రీలింగ పుల్లింగ వాచకములు ఆకాశ మహాభూతము వాయుమహాభూతమువల్ల చేయబడ్డ సృష్టికోటికే వుపయోగములు గాని మిగిలిన భూతత్రయముయొక్క సృష్టికోటిమి లింగవిభజన లేదు గనుక వుపయోము లేదు. అయితే మానుషకోటి తమయొక్క సమయ సంకేతాలనే శాస్త్రములద్వారా అటువంతి సృష్ట్యంతరములగుండా స్త్రీలింగ పూర్వకమయిన నామధేయములు వుంచి వాడుకొనుచున్నారు.

పయిన వ్రాసిన ప్రకారము లింగవాచకములు వుత్పత్తి అవుట చేతనే శాక్తమతస్థులు "సర్వం శక్తిమయం జగత్" అని చెప్పేమాటము బంకరముగా ఆత్మ - అంతరాత్మ - పరమాత్మ యీ ముగ్గురికిన్ని ఇచ్చా శక్తి - జ్ఞాపకశక్తి - పరాశక్తి అని నామాంతరాలు వుంచినారు. యీ మూడువస్తువులు వాస్తవమూఅ స్త్రీలింగవాచకములున్ను పుల్లింగవాచకములున్ను కాక శుద్ధ నపుంసక లింగవాచకాలు అయివుండినా రామ అనేశబ్రములో రుద్ర సంబంధముగా వుండే అక్ష్రరము వున్నదని దశరధనందను డని చక్రవర్తి తిరుమర్హి అని రాముడికి వైష్ణవులు పేరుపెట్టి నట్తున్ను, శైవు డయిన అప్పయదీక్షితులు వగయిరాలు నారాయణ అనే నామాన్ని శైవపరముగా అర్ధముచేయును మిక్కిలి హింసపడ్డట్టున్ను ఆత్మ - అంతరాత్మ - పరమాత్మ - అనే వాచకములు పురుషపరముగా వున్నదని శాక్తులు స్త్రీపరముగా నామాంతరాలు వుంచినారు.

ప్రకృతి దేహములలో కొందరిని దేవతలుగానున్ను కొందరిని రాక్షసులుగానున్ను కొందరిని మనుష్యు మొదలయిన వారుగానున్ను భేదము కలగఛెసి అటువంటి తెగలలొను ప్రతి తెగకు అనేక ప్రకృతి భేదములుగా పరాత్పర వస్తువు సంకల్పము చేయవలసిన దేమని విచారించగా సృష్టి సంకల్పము అబాజ్మానస గోచరమైన వస్తువుకు పుట్టడము చిద్విలసాల్ర్థము గనుక సృష్టిని అంఖండమున్ను, యేకాకారమున్ను చేస్తే రసము పుట్టదు. అందుకు దృష్టాంత మేమంటే మనుష్యులు తమ నకలుగా విలాసార్ధమై వొక మేళము జతపరచి నత్రనము చేయించి వేడుక చూచేటప్పుడు అందరున్ను వొక్కతాళము నేవాయించితే రనముగా వుండ దని, ఆడేటట్టుగా వొకరిని నియమించి, సుతి8పట్టడానకు ప్రత్యేకముగా వుండేటట్టుచేసి మళ్ళీ అందరిని వొక తావులో చేర్చి వొకనికి వొకణ్ని పైపోటీచేసి తన్నే 'శాబాను ' అన వలెనని ప్రతిపురుషుడు తనకు నీమకమయిన వాద్యాన్ని శ్రావ్యముగా వాయింపుచునుంటే యెట్లా మనమువారి యితరేతర ధిక్కరాలను పరస్పరానుకూలతనున్ను చూచి ఆనందిసారేమో తద్వత్తుగా సరోత్తమమయిన వస్తువు యీదేహములనున్ను వాటిలోని ప్రకృతులనున్ను భిన్నములుచేసి వారి మనస్సు వాక్కు- కాయములు - కర్మములద్వారా వారు చేసే చేష్టలను చూచి ఆనందింపుచున్నది.

సప్తగ్రహముల పేళ్ళతోవుండే బృహస్పతి, శుక్రుడు మొదలయిన వారిని సప్తబ్రహ్మాండములనే చెప్పవలని. ఆపేళ్ళు గలవారు బ్రహ్మాండ స్వరూపులయితే యీ బ్రహ్మాండానికి వచ్చి శృతులకు వ్యాఖ్యానమయిన స్మృత్లుచేసి యీ బ్రహ్మాండము వదలి దేవతలు, తోరాక్షసులు మనుష్యులతోను వారు సహవాసము యేట్లా చేసినారని యోచించి విచారించగా పరమాత్మ జ్యోతిర్భూత మయిన సూర్యుణ్ని రూపములయిన జ్యోతిస్వరూపలు గాక రాత్రిళ్ళు భూపతన మవు తూవుండే కొన్ని తేజస్సమూహాలు నక్షత్రాలుగా తోచబడుచున్నవి. అవి భూమిని అగుపడే మిణుగురులవలెనే భేచరమార్గముతో వుండే మిణుగురులు గాని నక్షత్రములు గావు గనుక నున్ను ఆ మిణుగురులు బృహత్తులు గనుకనున్ను అవి అధోభాగమునందు పడేటప్పుడు ఆ బృహత్తులయిన మిణుగురులు నక్షత్రములవలెనే మనకు అగుపడుచూ వుండుటచేత మిరియాలలో నుండే నల్లరాళ్ళను వాటి యేకరాశి గతివల్ల వాటి సమూహదర్శన మైనప్పుడు రాళ్ళను మిరియాలనుకున్నట్టు ఆ బృహత్తులైన మిణుగురులను నక్షత్రములని భ్రమ పడవలసియున్నది.

యిటువంటి అనేకకోటి బ్రహ్మాండములలో కొన్ని బ్రహ్మండములయిన బృహస్పతి మొదలయినవారు తృటికాలముకూడా జ్యోతిర్భూతమునకు చేసే ప్రదక్షిణము భంగము కాకుండా తిరగవలసిన వారై వుండగా వారు యీ బ్రహ్మాండమునకు పురుషాకృతితో వచ్చీయిక్కడి పిండాండాము లయిన మనకు స్మృతులు చేసి యిచ్చి హెతవు యెట్లా ఛేయగలుగుదురు! గనుక, వాటి వాస్తవము యేమంటే భృగు బృహస్పతి మొదలైన వారు మన ఆపేక్షయా దేవతలు గనుకనున్ను స్వేచ్చావిహారులై మన స్వూర్యుణ్ని ఆశ్రయించి వుండే కొన్ని బ్రంహ్మాండములకు వెళ్ళుతూ వాటిలొ విస్తారముగా వసింపుచున్నందున నవాబు వసించే పెటను నవాబుపేట అని గుర్తు నిమిత్తము నవాబు పురస్సరముగా పేటను తెలియ చేసినట్టు బృహస్పతి మొదలైన వారి గమనాగమనములు పట్టి జ్యోతిశ్శాస్త్రములో గ్రహగతులు గణిత మూలకముగా నిర్ణయించబడమునకు గాను యీ మహా పురుషుల పేళ్ళనే ఆ బ్రంహాండములకు సంకేత వాచకములైన పేళ్ళుగా విర్ణయించి యుండవలె నని తొచుదున్నది.

నేను యెనిమిదో లంజం భాగలోవుండే కన్యాముమారి మొదలుగా యిరువైయారో భాగలో నుండే కాశీపట్టణమువరకు దేశాటనము చేయడములో అహ:ప్రమాణములు దేశదేశానకున్ను భేదింపుచు వచ్చుచున్నది. యీ ప్రకారము అహ:ప్రమాణములు దేశ దేశానకు భేదించడమునకు కారణ మేమని విచారించగా యీబ్రంహ్మాడము యొక్క మధ్యభాగమైన నిరక్షదేశములో రాత్రి పగలున్ను సరిగా ముప్పదేసి గడియల వంతున దిన ప్రయాణ మవుచున్నది. గనుక సూర్యోద యాస్తమయములు సమముగా అవుతూ వుంచున్నవి. అందుకు కారణము అక్కడి వారికి సూర్యబింబ దర్శానము వుదయకాల మందున్ను, అస్తమయ కాలమునందున్ను చక్కని అభిముఖము కావడముచేత అది మొదలుగా వుత్తరపు దిక్కు వుదయాస్తమయకాలములలో సూర్య్దర్శనము యధోచితమయిన పార్శ్వభాగముగా క్రంక్రమముగా అవుతూ వుండుటచేత బ్రంహాండము యొక్క వున్నత ప్రదేశములలో వసించే వారికి సూర్యదర్శనము అయ్యే ప్రమాణకాలము భూమియొక్క చక్రాకార చలనముచేత క్రమక్రమముగా తక్కువవుతూ వచ్చుచున్నది. యీబ్రంహ్కాండమునకు చలనశాక్తి కలిగి వుండడానికిన్ని, యీ బ్రంహాండము సూర్యబింబానికి ప్రదక్షిణము చేయుచూ వుండడానికిన్ని యీ అహ:ప్రమాణభేదము వొక్కటే దృష్టాంతముగా వున్నది. యిదిన్ని గాక యింగిలీషు దేశపు సముద్రసంచారులలో వొకడు యీ పరెక్షనిమిత్తము వొక ప్రదేశములోనుంచు కావలసిన రస్తు కొన్ని సంవత్సరములకు వాడలో వుంచుకొని తూర్పుగా పోతూవుండేటట్టు వాడని సాగిస్తూ వచ్చినాడు. తూర్పుదిక్కు ఫలాని దనే జ్ఞానము సూర్యోదయమువల్లనే పుట్టుచున్నది గనుక ప్వత్యహము సూర్యోదయమును పట్టి తూర్పు తెలిసి పోతూవుండే కొద్ది సుమారు కొన్ని సంవత్సరములలో బయిలువెళ్ళిన స్థలమే చేరినాడు. అట్లా యెందువల్ల బయలు వెళ్ళిన స్థలమే ఆ పురుషుడు చేరినాడంటే బ్రంహ్మాండములో నొకపక్క వసించే వారికి తూర్పుదిక్కు బ్రంహ్మండముయొక్క చలనద్వారా వారి వృష్ణభాగమునందు వసించే వారికి ఆ తూర్పుదిక్కు పడమటి దిక్కౌతున్నది గనుక తూర్పూని తోచేప్రదేశమునుంచి బయలుదేరి అక్కడికి పడమర వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి తూర్పు దిక్కుగానుండే ప్రదేశమునకు తరులుతూ వస్తే బయిలు వెళ్ళిన తావు చేరడము వింతకాదు గదా! యీ దృష్టాంతము వల్లనున్ను యీ బ్రంహ్మాండమునకు చలనశక్తి కద్దనడానకు సందేహములేదు. గోళము తిరుగుతూవుంటే గోళముమీద నుండేవారికి నిలిచిన స్థలము కదిలికె అయితే తెలియదా అనిన్ని, గోళము తిరిగితే జంరువులు తలక్రిందుగా నడవా అనిన్ని కొందరు సందేహిస్తారు; ఆ సందేహము యెంతమాత్రము నిమిత్త్ములేదు; యెందువల్లనంటే పెద్దవాడలలో వుండేవారికే వాడనడవడము తెలియక వుండగా యింతబృహతైన గోళముమీద వుండేవారికి గోలచలనముయేట్లా తెలుసును గనుక? సూదంటు రాయిని పొడుగుగాయెత్తి కింద సూదిని వుంచితే భూమిని ఆధారముగా చేసుకొనివున్న సూది రాయిలోవుండే ఆకర్షణ మహిమచేత పైకిలేచి రాయిని అంటి వెలాడుచూ వుంచున్నదిగాని భూమిమీద పడదు గనుక, యీ గోళమునకువుండే ఆకర్షణ మహిమ చేత గోళము మీదనుండే సృష్టికోటి తలక్రిందుగా పడవలసిన నిమిత్తము యెంతమాత్రమున్ను లేదు.

పందొమ్మిదవ ప్రకరణము

మార్చినెల 22 తేది బదరుగంజు అనే వూరు చేరినాను. యిదిన్ని పది అంగళ్ళుగల బస్తీవూరు. యీ బదరుగంజు నుంచి గంగాభవాని తూర్పుగా సముద్రగామి కావడానకు సాగిపోవుచున్నది. ఆపెద్దప్రవాహము గుండా కలకత్తాకు సాగిపోతే సముద్రములో ప్రవేశించి కొంతదూరము సముద్రములొ పడమరగా వచ్చి మళ్ళీ హుగ్గుళి అనే నది ముఖద్వారములో చొచ్చి దక్షిణముగా తర్లి కలకత్తాకు చేరవలచినది గనుకనున్ను అటు పోవడానకు యిలాగంటే బజరాలు మొదలయిన వావాలు నడిపేవారికి జీళ్ళ పొలుకువ తెలియదు గనుకనున్ను అటుపొవడము యిరివై దినములు చుట్టుగనుక నున్ను అటివెళ్ళే గంగాభవానిధార సుందరవనమనే అఘోరమైన యడివి మధ్యే పోతున్నది. గనుకనున్ను ఆ అడివిలో నుండే వ్యాఘ్రాదులు మదలైన దుష్టమృగములు మనుష్యులను బాధపెడుతూ వుండుటచేత గట్టున దిగడానకు సయిపు లేక వావాలమీదనే భోజన మజ్జనాదులు