కాశీయాత్ర చరిత్ర/పందొమ్మిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

వల్లనున్ను యీ బ్రంహ్మాండమునకు చలనశక్తి కద్దనడానకు సందేహములేదు. గోళము తిరుగుతూవుంటే గోళముమీద నుండేవారికి నిలిచిన స్థలము కదిలికె అయితే తెలియదా అనిన్ని, గోళము తిరిగితే జంరువులు తలక్రిందుగా నడవా అనిన్ని కొందరు సందేహిస్తారు; ఆ సందేహము యెంతమాత్రము నిమిత్త్ములేదు; యెందువల్లనంటే పెద్దవాడలలో వుండేవారికే వాడనడవడము తెలియక వుండగా యింతబృహతైన గోళముమీద వుండేవారికి గోలచలనముయేట్లా తెలుసును గనుక? సూదంటు రాయిని పొడుగుగాయెత్తి కింద సూదిని వుంచితే భూమిని ఆధారముగా చేసుకొనివున్న సూది రాయిలోవుండే ఆకర్షణ మహిమచేత పైకిలేచి రాయిని అంటి వెలాడుచూ వుంచున్నదిగాని భూమిమీద పడదు గనుక, యీ గోళమునకువుండే ఆకర్షణ మహిమ చేత గోళము మీదనుండే సృష్టికోటి తలక్రిందుగా పడవలసిన నిమిత్తము యెంతమాత్రమున్ను లేదు.

పందొమ్మిదవ ప్రకరణము

మార్చినెల 22 తేది బదరుగంజు అనే వూరు చేరినాను. యిదిన్ని పది అంగళ్ళుగల బస్తీవూరు. యీ బదరుగంజు నుంచి గంగాభవాని తూర్పుగా సముద్రగామి కావడానకు సాగిపోవుచున్నది. ఆపెద్దప్రవాహము గుండా కలకత్తాకు సాగిపోతే సముద్రములో ప్రవేశించి కొంతదూరము సముద్రములొ పడమరగా వచ్చి మళ్ళీ హుగ్గుళి అనే నది ముఖద్వారములో చొచ్చి దక్షిణముగా తర్లి కలకత్తాకు చేరవలచినది గనుకనున్ను అటు పోవడానకు యిలాగంటే బజరాలు మొదలయిన వావాలు నడిపేవారికి జీళ్ళ పొలుకువ తెలియదు గనుకనున్ను అటుపొవడము యిరివై దినములు చుట్టుగనుక నున్ను అటివెళ్ళే గంగాభవానిధార సుందరవనమనే అఘోరమైన యడివి మధ్యే పోతున్నది. గనుకనున్ను ఆ అడివిలో నుండే వ్యాఘ్రాదులు మదలైన దుష్టమృగములు మనుష్యులను బాధపెడుతూ వుండుటచేత గట్టున దిగడానకు సయిపు లేక వావాలమీదనే భోజన మజ్జనాదులు గడపవలోసినది గనుకనున్ను గంగాభనానిలోనుంచి హదరుగంజు అనే వూరివద్ద చీలి దక్షిణముగా ప్రవహింపుచూ కలకత్తాకు పొయ్యే జలంగి అనే పేరుగలిగిన గంగధారలో ప్రవేశించి కలకత్తాకు సాగి వచ్చినాను. యీ జలంగినది గంగాప్రవాహము తక్కువైన దినము లలో బహు హ్రస్వమై కొన్ని మిట్టతావులలో వొక మూర, వొకటిన్నరమూర లోతు వుంచున్నది. అట్టి తావులలో వస్తూవుండే వరకు నిండిన పడవలు నాగక దినాలవెంబడి సమూహములుగా నిలిచి, వచ్చేపొయ్యే పడవలకు దారికూడా లేకుండా నిబిడీకృతముగా వుంచున్నవి. అట్లా తక్కువ నీళ్ళు గల ప్రదేశములకు గట్టానా అని యీ నావవాండ్లు పేరు పెట్టినారు. అట్టి తావులలో వొక నిమిషమైనా ఆలస్యపడకుండా నాతోకూడావుండే మనిషికట్టుద్వారా సమీప గ్రామవాసుల సహాయద్వారానున్ను అక్కడా నిలిచివుండే నావ మల్లాలద్వారా నాబజరా వుల్లాకులతో యివతలికి సాగివచ్చినారు.

మార్చ్ది నెల 23 తేది పటకాబాడి యనే గొప్పవూరు చేరినాను. యీ వూరుచెరేలోపల గట్టానాలు శానా తగిలినవి. యిది మొదలు జలంగినది పల్లపు ప్రదేశములో ప్రవహిస్తూ వచ్చినది గనుక నీళ్ళుకావలసినంత నదిలో వుంటూవున్నవి. యీ జలంగినది సర్పాకారముగా బహుచుట్టు చుట్టి ప్రవహింపుచున్నది. గనుక వుత్తరమునుంచి దక్షిణము పోవడములో మళ్ళీ మళ్ళీ వుత్తరమే చేరి, భోజనము చేసి వూరికి గట్టున రెండు గడియల దూరములో వుండేవూరు సాయంత్రము చేరుతు వచ్చినాము.

గంగాభవాని ప్రవాహము పుష్కలముగా వుండేకాలములో బదరుగంజుకు పడమరగా వుండే మౌర్హగంజు భగవ్రాగోలా అనే వూళ్ళవద్దనుంచి వొక ధారమక్కుషూరాబాదు (మూర్షిదాబాదు) కాసంబాజారు (కాసీంబజారు) బురంపూరు అనే మహర్లమీద వచ్చి యిప్పుడు నేను వచ్చే ధారలొ కృష్ణనగరు అనే వూరివద్ద కలియుచున్నది గనుక ఆ ధార కలకత్తా వెళ్ళడానకు నిండా సూటి యని ఆదారిని అన్నినావాలు వెళ్ళుతున్నవి. యిప్పట్లో ఆ ధారలో వుదకములేదు గనుక యీజలంగినదిగుండా అన్ని వానాలు వస్తూ పోతూ వుంచున్నవి. కొందరు యింగిలీషు దొరలు సుందరవనపు నరిధార పూర్వోత్తరములు తెలిసినవారిని కలకత్తాలో బజరాల మీద యెక్కించుకుని గంగాభావానిలో యీ నీళ్ళ తగ్గుసంబంధమైన శ్రమను పొందకుండా కలకత్ తనుంచి కాశికి ఢిల్లీ మొదలైన దేశములకు వెళ్ళుచున్నారు. యీ గంగామహానదిలో గొప్ప దేహములు కల మొసళ్ళు, కూర్మములు, మత్స్యములున్ను అమితముగా వున్నవి. వొక గొప్ప మత్స్యమును నా బజరామల్లాలు గాలమువేసి పట్టిరి. అది పురుష ప్రమాణము పొడుగున్ను, అందుకుతగ్గ లావున్ను గలిగి వుండినది. దాని కళేబరమును నాతోకూడావున్న పరిజనము సుమారు యిన్నూరుమంది రెండు మూడు దినములుగా భక్షణచేసినారు. యింత గొప్ప జలచరములు గంగలో వసించినా యెవరినిన్ని హింసపెట్టినట్తు యీవరకు వదంతి లేదు. సుందరవన మనే అడివిమధ్యే ప్రవహించే గంగలో సముద్రసంబంధమైన జలచర జంతువులుకూడా వచ్చి ప్రవేశించి వుంచున్నవి గనుక అవి మనుష్యులను బాధపెట్టుచున్నవని చెప్పుతారు. యీ జలచరజంతువులేమి, కౄరములైన స్థలచరజంతువులేమి వీటి ఆత్మలలో పరమాత్మ ప్రతిభాతి ప్రవ్యక్షముగాలేక వుండుటచేత జ్ఞానవిహీనమిలైన చిన్నదేహాలను పెద్దదేహములు భక్షణచేయుచూ యితరులకు వుపద్రవకరములుగా వుంచున్నవి. మనుష్యులు మాత్రము జ్ఞానయుక్తులై వుండేటందువల్ల పరస్పరభక్షణ లేకుండా, ప్రకృతిలేక యంత్రవత్తుగా వుండే అజ్ఞాన జంతు దేహములను దూరము విచారించి తమ ప్రభావము తెలుసుకునేదాకా భక్షిస్తూ జ్ఞానోదయము స్ఫుటముగా కలిగినవెనకగాని సంకేత బోధనవల్లగాని అటువంటి భక్షణలను చాలించి అగ్నిమహాభూతసృష్టితో చేరిన సన్యాదులు భక్షిస్తూ వచ్చి పిమ్మట తుర్యదశను పొందినవెనక హఠయోగరాజయోగలంబికా యోగములచేత తమలోని వాయువునే తాము భక్షణ చేయుచు దివ్యదేహధారణ చేసి వుంటారు.

యీ జలంగినది అనేక తిరుగుళ్ళుగా ముందువచ్చి వెనకకు పోతూ వుండే టందున యిందులో బజరామీద వచ్చేటప్పుడు బజరా తిరుగుడువల్ల సూర్యబింబము వొకపక్కనుంచి మరివొక పక్కకు


. ధర్మము లేదు గనుక సమస్త జగదాధార మయిన వస్తువు అవాజ్మానస గోచరమై శుద్ధశూన్యముగా ధ్యానించ పడి వున్నది. గనుక నున్ను నాస్తికులు ప్రపంచము యే స్వభావముచేత జరుగుచున్నదని అంటారో ఆ స్వభావాన్నే జ్ఞానులకు సహపాకులే గాని వేరే కాదు.

యేప్రల్ నెల 1 తేది కృష్ణనగర మనే గొప్ప వూరు చేరి నాను. ఈ వూళ్ళో యిక్కడి రాజు అనే వొక జమీందారుడు వున్నాడు. శానా అంగళ్ళు వున్నవి. సకలపదార్ధములు దొరుకును.

యిక్కడ కుంఫిణీవారు వచ్చేవానాలు వగయిరాలకు వాటిదాంట్ల సంఖ్యమీద నున్ను, నావాల గాత్రములమీద నున్ను నిరుకులు యేర్పరచి టల్లా అనే తీరున తీస్తారు. ఆ సుంకము తీరువ వసూలు చేయడానకు వొక కలకటరు యీ వూళ్ళో వుంటాడు. ఆ టల్లా అనే తీరువ నిమిత్తము నా బజరాకు వుల్లాకు అనే వాడకున్ను యేడున్నర రూపాయి యిచ్చినాను. యీ ప్రకారము వసూలు చేసే తీరువ రూకలకుండా కుంఫిణీవారు శిబ్బంది వుంచి జలంగినది అనే పేరు కలిగిన గంగాదారలో నుంచి బదరుగంజు వద్ద చీలే ప్రదేశము మొదలు నదిలో మిట్టలు పెట్టకుండా సూత్రపు పడవలకుండా మన్ను యెత్తి పారవేసి నావాలు రావడానకు వయిపు చేయుచుంటారు. యీ జలదంగి నది ధార చిన్నది గనుక ఈ వుపాయము కుంఫిణీవారు చేయడము బహు అగత్యముగా నాకు తోచినది. మన్నుయెత్తే సూత్రపు పడవ వోకటి బదదుగంజువద్ద వున్నది. ఆ పడవకు గొప్ప పారచిప్పలను మాత్రము కట్టి తగిలించి వున్నారు. పడఫలలో మనుష్యులు సూత్రపు తాళ్ళు పట్టి యీడిస్తే ఆ పారచిప్పలు మన్ను తొవ్వి పడవలో తెచ్చి వేస్తున్నది. సూత్రపుపడవ తయారిచేయడానకు యిరువై వేల రూపాయలు ఖర్చుతగిలి వుండునని తోస్తున్నది.

. సదరహీ కృష్ణనగరము దాటి రాగానే నదీయ, నద్య, అనిన్ని నవద్వీప మనిన్ని త్రినామము కలిగిన విద్యద్గ్రా మమువద్ద మక్కుషూదాబాదుకుండా వచ్చేభాగీరధిఅనే పేరుకలిగిన గంగధార కలియుచున్నది గనుక యిక్కడ నద్యామొదలుగా ధారగొప్ప అయి అరకోసువెడల్పున ప్రవహింపుచున్నది. ప్రవాహవులోతున్ను మిక్కిలీగంభీరమై వున్నది.

పయిన వ్రాసిన నదియ్య అనే గ్రామములో కొందరు జమీందార్లవల్ల కొన్ని పాఠశాలలు యేర్పరచబడి అందులో అనేక విద్యార్ధులను పోషించేటట్టు నియమముచేసి వున్నది గనుక గౌడులలోనున్ను, ద్రావిళ్ళలోనున్ను నన్నూటిదాకా సుమారు శాస్త్రపాఠములు చదువుకొంటూ వుంటారు. యిక్కడ శిక్షాధికారులు గౌడా బ్రాహ్మణులుగాని, ద్రావిళ్ళు కారు. వారి పాండిత్యము ప్రసిద్ధికెక్కి వున్నది.

యేప్రల్ నెల 2 తేది శాంతిపూరనిన్ని సంతిపూరనిన్ని ద్వినామము కల విద్యద్గ్రామము చేరినాను. యిదిన్ని గొప్పవూరు. అన్నివిధాల నద్యాకు సరిపోలివున్నా విధ్యార్దులున్ను, శిక్షాధికారులున్ను మిక్కిలిలేరు. యీ శాంతిపూరుకు ముందు కలనా అనే గొప్పగ్రామమున్నది. యీవూరు మొదలుగా టెంకాయతోపులు, పోకచెట్లు నిండా చూస్తూవస్తాను. మనస్వదేశము వదిలిన వెనక యీవరకు యెక్కడా టేంకాయ తోపులు చూచినవాణ్నికాను. టెంకాయచెట్లు, పోకచెట్లు శానా ప్రదేశములలో లేకవుండినా ఆ ఫలములు అయ్యే ప్రదేశాములలో లేని దేశస్థులు తెప్పించుకుని అవశ్యము వాడికెలోకి తెచ్చుకుంటూ వున్నరు. యీ హిందూ దేశములో యీ వుభయఫలములకు యింత అవశ్యకత యీశ్వరుడు కలగ చేశినాడు.

నదియ్యా అనే గ్రామము మొదలు యీ గంగధారలో సముద్రము యొక్క పోటు పాటు ప్రత్యహము రెండుమాట్లు తగులుతూ దక్షిణము రాగారాగా ఆపోటుపాటు యొక్క జోరు అవుతూ వస్తున్నది. సకల విధమైన నావాలకు రాళ్ళతోను, మట్టితోను బళువుకలగచేసి లంగరు అందముగా కొయ్యలతో నద్యావద్ద కట్టి నావాలకు నిత్యము వేస్తూవస్తరు. లంగరులు లేకనే యీ వరకు నావాలను తాళ్ళతో గట్టున మేకులు పాతి దిగగానే బేపర్వాగా కట్తుతూ వచ్చినట్తు నద్యామొదలు రావడము లేదు. పోటుకు మనిషి పొడుగుకు అధికముగా నీళ్ళువచ్చి పాటుకు తీశిపోతూ వస్తున్నవి. యీ పోటు పాటు కాలములో కలకత్తకు పోవలసినవారు పాటులోను, అక్కడనుంచి వచ్చే వారు పోటులోను నవాలను నడిపిస్తూ వస్తారు.

3 తేది హుగ్గులీ అనే కసుబా బస్తీ చేరినాను. యిక్క్డ కలకటరు వగైరా అధికారస్థులున్నూ, శొంతదండున్ను వున్నది. యీ హుగ్గులీలో సుందరమైన యిండ్లు జాతులవారు గంగాతీరమునందు శానాగా కట్తివున్నారు.

4 తేదీ బారకుపూరు అని జాతులవాండలవల్ల చెప్పబడుతూ నల్లవాండ్లవల్ల ఆ చానక్కు అని చెప్పబడుతూ వుండే ద్వినామధేయము గల వూరు చేరినాను. ఈ బ్నస్తీవూరు కలకత్తతోచేరి కలకత్తను అందుకొని వున్నది. యీ బస్తీలో గౌరన్ మెంటు వారిది వొక గొప్ప యిల్లు తోట బహుసుందరముగా కట్టించబ్నడివున్నది. యిక్కడ కొంత దండుకూడావున్నది. యీ బస్తీ కలకత్తకు సమీపముగా 3 కోసుల దూరములో వున్నది గనుకనున్ను, విశ్రాంతి ప్రదేశాముగనుక నున్ను యిక్కడ అనేకులు సౌఖ్యార్ధముగా మంచితోటలు, యిండ్లు బంగాళాలు కట్టించివున్నారు. అందులో గ్రీష్మకాలములో కలకత్తా నివాసులైన గొప్ప దొరలు వచ్చి వాసము చేస్తూ వుంటారు.

యీ వూరికి యెదురుగా నదికి అవతలపక్కను శ్రీరాంపూరు అనే వొక వొలందావారి కసుబాబస్తీ గ్రామము అనేకమయిన గొప్ప మిద్దెలు కలిగివున్నది. హుగ్గుళిమొదలుగా ఆచానక్కువరకు నదికి యిరుపక్కలా యిండ్లు, తోటలు, మిద్దెలు అసంఖ్యముగా కట్తివున్నవి. అందులో కొన్ని బస్రీలు ఫ్రాంసువారివిగానున్ను కొన్ని డెన్మారు కు వారివిగా నున్ను, కొన్ని డచ్చివారివిగానున్ను ఆద్యాపి ఆ యా జాతి వాండ్ల యేలుపాటులో వున్నవి గనుక నొచ్చి పొయిన బంగాళాదేశస్థులు యింగ్లీషువారిన్యాయ ప్రకారము అప్పులవారి నిమిత్తము కలిగే రాజదండనవల్ల తప్పించుకొనే కొరకు చెన్నపట్టణమువద్ద పులిచేరికి వంజి నది. మాయాశాక్తి దుష్ట నిగ్రహార్ధము మహాకాయము ధరించి దుష్ట నిగ్రహము అయిన వెనుక తన మహాకాయము తనకు అసహ్యముగా తోచినంతలో తన చైతన్యాన్ని సౌమ్యకాయము సృష్టించుకొని అందులో ప్రవేశపెట్టి లోగడి మహాకాయమును వదిలి నంతలో మహాశక్తి నాధుడైన సాంబమూర్తి ఆ మహాకాయ మోహితుడై ఆ మహాకాయమును చంకపెట్తుకొని పరవశుడై దేశాటనము చెస్తూ వచ్చినట్తున్ను లోకశిక్షకులలో వొకడయిన అతను పరవశుడైవుండుటచేత లోకమునకు క్షేమవిరోధ మయినట్టున్ను లోకరక్షకుడయిన విష్ణువు లోకముయొక్క క్షేమముకొరకు చక్రాయుధధరుడై, అటుతిరుగుతూ వున్న సాంబమూర్తిని వెంబడించి అతని చంకనుండే కళేబరమును చక్రాయుధముతో తునకలుగా కత్తిరించుతూ వచ్చినట్టున్ను అవి భూమిలో రాలుచు వచ్చినట్తున్ను అటుక త్తిరించిన తునకలలో యీ కలకత్తాలో ఆ మహాకళేబరము యొక్క చేతివ్రేలు పడ్డట్టున్ను యిక్కడికి వుత్తర దేశమందుండే కామరూప దేశములొ యోనిపడ్డట్టున్ను యింకా యితర ప్రదేశములలో అనేక అవయవాలు పడ్డట్టున్ను అటు అవయవాలుపడ్డ ప్రదేశములంతా శక్తి ప్రత్యక్షకరములై ఆరాధించిన వారికి అబీష్టసిద్ధులు చేస్తూ వచ్చేటట్టున్ను యిక్కడి స్థలపురాణ మహిమ గనుక యీ కలకత్తా షహరుకు మూడుకోసుల దూరములో దక్షిణభాగమందు ఒక కాళీ గుడి వున్నది.

ఆ గుడి దక్షిణదేశమువలెనే నిండా సుందరముగా కట్టివుండక పోయి నప్పటికిన్ని విశాలమైన గర్భగృహము ముఖమంటపము కలిగి వున్నది. ఆ గుడిసమీపముగానే గంగవాగు వకటి పారుతూవున్నది. ప్రతిదినము ఆ శక్తిని యీ దేశపు బ్ర్రాహ్మణపండ్యాలు పూజ చేయుచు వుంటారు. మేకలను, మేకపిల్లలను లోకులు ప్రతిదినము తెచ్చి బలులు యిచ్చి పోతారు. శుక్రవారము, ఆదివారము విశేషబలులు పూజలు జరుగుతున్నవి. నవరాత్రిళ్ళలో యిక్కడ మహోత్సవమును జరిగించి యీ దేశములో మహిషములు లేకపోయినా దేశాంతరాలలొ నుంచి అనెకములుగా తెప్పించి యీగుళ్ళలొ నున్ను వారివారి యిండ్లలొ పెట్టి పూజచేసే బింబాల ముందరనున్ను బలులు యిస్తారు. యీ కలకత్తాలోనున్ను చుట్టుపక్కలనుండే బంగాళీ దేశాస్థులకు యిక్కడ విలశిల్లివుండే కాళి ప్రత్యక్షదేవతై వారిభక్ర్తిని మిక్కిలిగా ఆకర్షిస్తూ వున్నది. యీ గుళ్ళో వుండే కాళిప్రతిమ బహుస్థూలముగా వున్నది. బహుమంది గుళ్ళలో పునశ్చరణ చేయుచుంటారు. గుడిచుట్టూ పూజాదిద్రవ్యాలు అమ్మే అంగళ్ళు శానావున్నవి. జపాకుసుమాలు సంపెంగలు వగయిరా పుష్పాలు మనిషి చెయ్యెత్తు పొడుగున మాలలు కట్టి అపరిమితముగా సదా అమ్ముతూ వుంటారు. ముప్ఫయి రూపాయిలలో వస్త్రసమేతముగా షోడశోపచార పూజ అవుతున్నది. భిక్షుకులు బ్రాహ్మణులుగా నున్ను కంగాళీలుగా నున్ను ప్రతిదినము వెయ్యింటికి తక్కువ లేక గుడిచుట్టూ వుంటారు. యీ దేశమందు గవ్వలు మరడముచేత పిడికిడేశి గవ్వలు యిచ్చినా యిరువై రూపాయలు దక్షిణకు పట్టుచున్నవి. పూజ చేసే లోకులు మిఠాయి మొదలైన పక్వపు పదార్ధములు పండ్లు పచ్చిబియ్యమున్ను నైవేద్యము పెట్టుతారు. గుడి పూజారులు నిత్యము పక్వాన్నము మొదలయినవి నైవేద్యముచేసి, తాము తిని బ్రాహ్మల కిస్తారు. దేవీప్రతిమను సువర్ణముతో దావుడు నాలికెను చేసి యెనిమిది భుజములు కల్పించి లలాటమందు సిందూరము వుంచి భీకరాకారముగా అలంకరించి వుంటారు. ముఖమంటపముకన్నా గర్భగృహము, రొమ్ముల లోతు పల్లములో వుంచున్నది. నవరాత్రిళ్ళలో ఈ బంగాళీదేశస్థులు భీకరాకృతిగా మృత్తుతొ దేవి ప్రతిమలుచేసి వాటికి వర్ణరేఖలు మొదలయినవి పూయించి వుత్సవానంతరము విభవముకొద్ది వూరేగింపుచేసి గంగలో కలుపుతారు. ఆ వుత్సవాలకు మద్యపానాలు వేశ్యలపొందున్ను బహుశా జరిగి చూడ వింతగా వుంచున్నది. ఆ విభవము మతాంతరస్థులకు యీ మతస్థులను నింద చేయడానకు ప్రబలమైన ఆకరముగా వున్నది.

యిది కన్యాకుమారీ క్షేత్రమంటారు. యిక్కడ పురుషులు స్ఫురత్తులేక దీనత పొందివుంటారు. స్త్రీలున్నూ నిండా సౌందర్యవతులుకారు. 12 మూరల బట్టతో దేహాచ్చాద్నమంతా చేసి తల మీద ముసుకుకూడా వేసుకుంటారు గనుకనున్ను రవికెలు తొడిగే సంప్రదాయము లేదు గనుకనున్ను అవయవాలు పూరాగా కప్పబడి వుండడములేదు;. పుల్రుషుల దీనత్వమున్ను, స్త్రీల ఆచ్చాదనమున్ను మళయాళానకు సరిపోలివుండినా స్త్రీల సౌందర్యముమాత్రము వ్యతిరిక్తముగా లోపముపడివున్నది. బంగాళీభాష హిందూస్థాని అభాసముగా బడా అండాకు బోడా అనే వతుగావున్నది. బంగాళీ అక్షరాలు దేవనాగరానకు కొంచెము భేదము కలిగివున్నవి. పురుషులు కృశాంగులు గనుక ప్రయాసకు యెండకు వోర్చలేరు. శైత్యోపచారాలు తైలలేపనము ప్రత్యహముచేసి శీకాయ మొదలయిన నూనె పొయ్యే పదార్ధాలతో తోమి కడగక నేస్నానముచేసి వొళ్ళు తుడుచుకుంటూవస్తారు. శీకాయ యిప్పపిండి మొదలయిన పదార్ధాలు యీ దేశమందు దొరకవు.

యీ దేశాన్ని గౌళదేశమనిన్ని, విరాట దేశమనిన్ని చెప్పుతారు. యీ దేశమందు శిష్టులయిన బ్రాహ్మలుకూడా సహజముగా మత్స్యభక్షణ చేయడముమాత్రమే కాకుండా యిచ్చటి వారు సకల బ్రాహ్మణులున్ను ఆరీతినే చేస్తూ వుందురనే సిద్ధతాత్పర్యులై నావంటి విహితులు తటస్థమైనప్పుడు లేతమత్స్యకలేబరాలను యితర భక్ష్యయోగ్య పదార్ధాలతో కూడా పంపిస్తూ వస్తారు. యిక్కడ పండితులకు ద్వైత సిద్ధాంతము కలిగి గౌతమ వైరచితమయిన న్యాయ శాస్త్రములో చాలా పరిశ్రమకలిగి వున్నది. యీ దేశస్థులకు స్నాననియమము దేశాచారములు చాలా కలిగివున్నవి. స్యయ్ంపాక నియమమున్నూ కలిగివున్నది. వుప్పునీళ్ళు కలియని పక్వాన్నాలు వ్యవస్థ లేక పుచ్చుకొని భక్షిస్తున్నారు.

300 సంవత్సరముల కిందట యీ దేశపురాజు వొక యాగము యత్నముచేసి నిర్వహించను సమర్ధులు యీ దేశపు బ్రాహ్మలలో లేనందున గంగా యములమధ్య ప్రదేశ నివాసులయిన కాన్యకుబ్జులను అయిదు గోత్రాలవారిని యీదేశమునకు పిలువనంపించి ఆ యాగము సాంగముగా కాచేసుకొని ఆ అయిదు తెగలవారిని యీ దేశములో నిలుపుకో వలెననే తాత్పర్యముతో వారిని కులీనులని ప్రసుద్ధ పరచినాడు. యీ కులీనుల కూటస్థులు యీ దేశములో ప్రవర్తించిన వెనుక కొన్ని జాతినియమాలు ఆచారనియమాలు కలగచేసినారు. అందులో కొన్ని సువర్ణపు పనులు సువర్ణవ్యాపారాలు చేసేవారు బనియాలనే జారిని స్వర్ణస్తేయము సురాపానము మొదలైన పంచమహాపాతకాలు శాస్త్రచోదితములై వుండుట చేతనున్ను, యీ సునారుబనియాజాతి యేవిధముగా స్వర్ణ స్తేయము చేయకనే విధిలేని వారుగనుకనున్ను ఆ జాతిని అతినికృష్టముచేసి పెట్టినారు. తదారభ్య అదేరీతిని నికృష్టులయి వున్నారుగాని దక్షిణదేశపు కంసాలజాతివలెనే బ్ర్రాఃమలకు సమము కావలెననే ప్రయత్నము కలవారయి యేమాత్రము వుండలేదు.

యీ బంగాళీ దేశములో వంశావళీ పరంపర ఆయా తెగది ప్రత్యేకముగా వ్రాశివుంచగలందులకు తెగకు కొన్ని కుటుంబాలను ఘటికులని యేర్పరచి వుంచి వున్నారు. వివాహాలు తటస్థ మయి నప్పుడు ఆకవిలెలు వ్రాసేవారిని పిలువనంపించి యోచించి ఆ ఘటికులు సమ్మతించిన వెనక ఫలానివాడికి ఫలాని చిన్నదాన్ని యివ్వవలసినది నిశ్చయము ఛేయబడుచున్నది. యీ సంప్రదాయము దక్షిణదేశములో నందవరీకుల కులాచారాలకు సరిపడుతున్నది.

యీ దేశములో వివాహాములు విషయమందున్ను అపరవిషయముల యందున్ను ధనికులకు విశేష వ్రయముచేసే సంప్రదాయము కలిగి యున్నది. పూర్వాపరాలు చేయించడములో మంత్రబాహుళ్యము లేకపోయినా తంత్ర బాహుళ్యము చాలాగా కలిగి మళయాళదేశము వలెనే శుభాలు ప్రసక్తి అయినప్పుడు స్త్రీలు కొళాలి అనే ధనిచేసే వతుగా కంకారానము చేస్తారు. అనుగమనాలు స్త్రీలు చేయడము యీ దేశములో యీ వరకు బహు విస్తారముగా జరుగుతూ వచ్చినది. అని భక్త విషయములో కూడా యీ దేశమందు స్త్రీలకు భాగము కద్ధు. రఘునందనుడనే వొక పురుషుడు చేసిన పునస్మృతిని యీ దేశములో నిండాగా వాడుకుంటారు. తంత్రజ్ఞులని పేరుపెట్టుకొని శాక్తమతస్థులు కొందరు ప్రబలి వున్నారు.

నద్యా శాంతిపురము మొదలుగా వుండే యిండ్లు పూరియిండ్లు, కము చేసుకునేటట్టు వునికి పట్టుకు కొంత భూమి యిచ్చి యెగుమతి దిగుమతి సరుకులమీద నూటికి యింత అని తీరువ సుంకము మొకరరు (నిర్ణయము) చేస్తే మా యింగిలీషు జాత్రివారికి క్షేమము కలగుచున్నది; యింతకు మిక్కిలి బహుమానము నాకు యేమి అక్కరలేదని మనివి చెసుకున్నంతలో పట్నా షహరు ప్రభువు ఆ డాక్టరుయొక్క సామర్ద్యానికిన్ని నిస్పృహతకున్ను సంతోషించి అప్పుడే పరవానా డాక్టరు కోరిన ప్రకారము వ్రాసి యిచ్చినాడు. తదనంతరము, కాళీ గుడివద్ద కొన్ని గుడిశెలు వుండగా ఆ స్థలములలో ప్రవేశించిన తర్వాత హుగ్గులియనే సమీపపు వూళ్ళో గిడ్డంగీలు యిండ్లు మొదలైనవి కట్టుకొని యింగిలీషు వారు వర్తకము చేయుచూ వచ్చినారు. తర్వాత మక్కుషూదాబాదు (మూర్షిదాబాదు) లోని అధికారస్థునికి ఢిల్లీ పాదుషాకుండా మొక్త్యారు అధికారము కలిగి యీ దేశము అతని అధీనమై ఆ అధికారస్థుడు, యీదేశములో పూర్వపు కాపురస్థులైన ప్రాంచువారి బోధనవల్ల యింగ్లీషు వారిని యెక్కువ తీరువ యివ్వమని నిర్భందపెట్టి పట్నా అధికారస్థుడు వ్రాయించి యిచ్చిన ఫరవానా పాదుషాదికాదు అనే షరా మీద యిక్కడా యింగిలీషు వారికి వుండరాములు చెసినంతలో యింగిలీషు వారు ఒక డాక్టరు సమేతముగా డిల్లి పాధుషాతో మొరపెట్ట్లుకునేటందుకు వెళ్లినారు. అప్పట్లో యీశ్వర ఘటనచేత ఢిల్లీ పాదుషాకు దేహము స్వస్థములేక యత్నము చేసిన వివాహము కూడా నిల్చివుండేటట్టు ప్రసక్తి అయి యింగిలీషు డాక్టరు వచ్చివుండే వైనము తెలిసి పిలువనంపించినాడు. యీశ్వరుడు ఆ డాక్టరుమూలమగా పాదుషాకు దేహముకుదిర్చి యింగిలీషువారి అభీష్టమును పాదుషా పరమానా మూలకముగా సిద్ధి చేసినాడు. ఆ ఫరమానా ప్రకారము కొంచెము దినములు నడిపించి మళ్ళీ మక్కుషాబాదు అధికారస్థుడు తిరగబడినందున యింగిలీషువారి నిభాయించ లేక కొందరు తమవారు వుండే చెన్నపట్టణముచేరి శీమరాజుకు అర్జీ యిచ్చుకున్నంతలో శీమరాజు తమ జాతివారి క్షేమముకొరకు కొన్ని యుద్ధపు వాడాలను ఫౌజుబందితో కూడా కలకత్తకు పంపించి చెన్నపట్టణపు గౌవరుమెంటువారిని కుమ్మక్కు చెయ్యమని వుత్తర్వు చెసినందుననున్ను యిరుపక్కలా భూమి ధనురాకార ముగా వుండే సముద్రోదకము గంగా సంగమమయ్యే భాగీరధిలో వూరాగా లోచొచ్చేటట్టు యీశ్వర నియమనమయువున్నది. గనుక ఆ భాగీరధి కుండా యుద్ధపువాడలు హుగ్గులీ ప్రవేశించి ప్రాంసువారు వాసము చేయను కట్టుకొనివుండే కోటను వూరినిన్ని తీసుకునియింతలో మక్కుషూబాబాదుపై యుద్ధముచేసి వాన్ని స్వాధీనముచేసుకొని *కుమ్మక్కు చేసిన హస్తాంతరమయినవానికి అప్పట్లో ఢిల్లీపాధుషా దొరతనము ఆరాజకమై వుండగా అందులో పట్టాభిషేకము చేసి ఇంగిలీషువారిలో అప్పటికి యుద్ధప్రసక్తికి నిలిచిన దొరలు కావలసినంత ధనము కొత్త ప్రభువువల్ల పుచ్చుకొన్నారు. అదిమొదలుగా కలకత్తా కోటయున్ను వూరున్ను బస్తీ అయినది.

యింగిలీషు జాతివారు యీశ్వర కటాక్షమునకు పాత్రులయ్యే కొరకు వాక్యమందు ప్రయాణికులై నందున వర్తకులు ధనికులున్ను అనేక హింసలుగల చుట్టుపక్కల రాజ్యములు వదిలి కలకత్తా బ్నస్తీ ప్రవెశించినారు. యిప్పటికి కోట్యంతాధారులుగా వుండే హిందువులు కలకత్తాలో పదిమంది అయిదుమంది వున్నారు. యిరువై ముప్పై లక్షలు కలవారు నూటికి యిన్నూటిటికిదాకా వున్నారు. యీకలకత్తా బస్తీ యీ చొప్పున నవీనమైనందున గొప్పవారి యిండ్లన్ని యింగిలీషు తరహాగా కట్టివున్నవి. వొక మాత్రపువారి యుండ్లు యెంతమాత్రము బాగులేక యింగిలీషు డౌలుతో హిందూతరహాకూడా కలిసి వొక వికారమగా కట్తివున్నవి. కలకత్తాలో కోటచుట్టూ యైస్ల్చ్దానేడు అనే కొంత బయలు విడిచి అవతల యింగిలీషువారు రెండు మిద్దెలకు తక్కువ లేకుండా అయిదు అంతస్థులకు ఎక్కువలేకనున్ను గొప్పయిండ్లు అనేకముగా కట్టివున్నారు. యిక్కడికి జాతూలవాండ్లు చెప్పడ మేమంటే కలకత్తా యిండ్లు రాజునగళ్ళు అనిన్ని, చెన్నపట్టణపు ఇండ్లు బంగాళాలు అనిన్ని ప్రతిష్టగా చెప్పుకుంటారు. కలకత్తా గౌర్నమెంటు యిండ్లంత


  • మూర్షిదాబాదు నవాబు సురాజుద్దౌలా క్రింది యుద్యోగి మీర్జాఫరు స్వామిద్రోహముచేసి యింగ్లీషువారితో చేరగా 1757 లో ఇంగ్లీషువారు ప్లాసీయుద్ధము గెలిచి మీర్జాఫరును నవాబు జేసిరి. గొప్పయిండ్లు యీ వరకు నేను చూచినది లేదు. హయిదరాబాదులో మాత్రము రిసైడెంటు వుండే యిల్లు యీ యిండ్లకు ముకాలువాసి గొప్పగా చెప్పవచ్చును. యిక్కడి గౌరన్ మెంటు యిండ్లు మూడు అంతస్థులు భాగీరధీ నది వెంబడిగా శాలవేశి కష్టమాఫీసు మొదలైన కచ్చేరీలు అన్ని కట్టివున్నారు. కలకత్తా కోటచుట్టూవుండే బయిలు శాలలు చూస్తే చెన్నపట్టణము చూచి తయారు చేసినట్టు తోచు చున్నది.

కలకత్తాకు వుత్తరము చిత్తుపూరు అని వొక బస్తీవున్నది. దక్షినము మచ్చిగోల అనిన్ని గార్డన్ రీచ్చి అనిన్ని ద్వినామము కలిగిన బస్తీ వొకటి వున్నది. ఆ బస్తీలో తోటలు మెద్దెలు గంగాతీరమందు వుండుటచేత సూప్రీం కోరటు జడ్జీలు మొదలయిన గొప్పవారంతా అక్కడనే వున్నారు. ఆ ప్రదేశము వసతి అవుటచేత నేను వున్న దినాలకు నెల 1 కి 120 రూపాయీల వంతున ఒక తోటమిద్దె బాడిగకు తీసుకొని వున్నాను. పడమటిపక్క చోరంగ అనిన్ని, కిదరుపూరనిన్ని, లాలుడిగ్గీ అనినిన్ని మూడు బస్తీలు వున్నవి. యిక్కడ సమస్త జాతివారు రెండు మూడు అంతస్థులుకల గొప్ప మెద్దెలు కట్టుకొని కాపురమున్నారు. అయితే ఆ మెద్దెలకు చుట్టూ తోటలు లేవు. చిత్తుపూరు నుంచి కిదరపూరికి వచ్చే శాలలో వస్తే చెన్నపట్టణపు పాపంసు బ్రాడివే అనే వీధిలో వచ్చినట్టు యిరుపక్కలా షాపులు కలిగివున్నవి.

కలకత్తా షహరులో పోలైను వారు నెంబరు వేశిన వోఢ్రబోయీలు మోశేకూలి పల్లకీలు 1000 కె సరిగా వుంచున్నవి. వోఢ్రబోయీలు యిరువురు మోయడమేగాని ముప్పిరియెంత బళువైనా వేయరు. నడుముకు వొకబట్ట చుట్తుకుని చేతమొగిలాకు గొడుగు పట్టుకుని చింపిరితలతో మోయుచు నుంటారు. కరాచీలు అనేబండ్లు యింగిలీషు చారయాట్ బండ్లకు నకలుగాచేసి, రెండుతట్టువాణి గుఱ్ఱములు కట్టి చెన్నపట్టణపు గూడుబండ్లకు బదులుగా వీధికి నాలుగైదు బాడిగకు పెట్టుకొని వున్నారు. కలకత్తా షహరు అలంకారము జాతి వాండ్ల యిండ్లవద్దనున్ను శీమవాడలు నిండియుండే గంగాతీరపు శాల లోనేగాని హిందువుల యిండ్ల వద్దికిపోతే సామాన్యపు స్త్రీలకు రాజును చూచిన కండ్లతో మొగుణ్ణి చూచినట్టు వుంచున్నది. జాతులవాండ్ల బస్తి ఆపేక్షయా కలకత్తాను చెన్నపట్టణమునకు రెట్టింపు షహరని చెప్పవచ్చును. యింకా హిందూస్తాన్ లో జమీందారులు రాజులు నిస్సారులు కాక వుండేటందున యిక్కడ వర్తకము అమోఘముగా జరుగుచున్నది.

యేప్రల్ మే నలలు రెండున్నూ యిక్కడ మిక్కటమైన గ్రీష్మ కాలము గనుక ప్రతీ ఇంట్లోను ప్రతికొట్టిడికిన్ని పంకాలు వేశివున్నవి. యీ కాలములో ఆ పంకాలగాలివల్ల యిక్కడివారు జీవిస్తారు గాని అన్యధా కాదని తొచినది.

యీ ప్రదేశాలభూమి నివాసులున్ను పశువులున్ను బలిష్టములు కాకపోయినప్పటికిన్ని భూమి పచ్చికమాత్రము బాగాపట్టి వున్నది. అయితే పచ్చిక పొడుగు పెరగలేదు. యీకలకతాలో యింగిలీషువారు వారి శీమలోని పిచ్చన్సునే పండ్లున్ను రెండుదినుసులు పయిరువేశినారు. లిచ్చన్సుపండ్లు బెత్తపు పండ్లు జాడగా పులుసుతో తీపుకలిసి వుంచున్నవి. సిచ్చన్సు అనే పండు బాదంకాయలవంటి విత్తులు లోపల కలిగి పులుసుమీరిన రుచితో వుంచున్నది. యీ షహరు హిందువులు జంబునేరేడుపండ్లను పూజ్యతగా వాడుతారు. పచ్చిద్రాక్షపండ్లు అరుదు. హిందువులందరు అటాటాకులు వేసుకోవడమేగాని యితరమయిన ఆకులు తాకడములేదు. అన్నిచెట్లు వీర్యముగానే పెరిగివున్నవి. గీష్మకాలపు రెండు నెలలనున్ను యీదేశస్థులు తుపాను కాలమంటారు. యిక్కడ హుక్కాలు తాగనివారులేరు. గుడాకుచేసే గిడ్డంగీలకు బొగ్గువుంటలుచేసే గిడ్డంగీలు శానా కలవు, గుడాకువుండలు ప్రతి అంగడిలోను వుంచి అమ్ముతారు. తమల పాకులు బహుదళముగానున్ను పెద్దవిగానున్నుమిక్కిలి లావు పొడుగైన కాడలు కలవిగా నున్ను తెచ్చి సాధారణముగా అమ్ముతారు. యీదేశస్థులు తాంబూల చర్వణము చేయడము విస్తారముగానే వున్నది.

యీ షహరులో ఒక వేగినాటి బ్రాహ్మణుడు విశ్వనాధభొట్లనే వాడు ముప్ఫై యేండ్లుగా సంసారములో దక్షిణ దేశపు బ్రాహ్మణులకు యధాశక్తి సహాయము చేయుచూ కాపురమున్నాడు. సంపాదనార్ధము అగంతుకులుగా పంచద్రావిళ్ళతో చేరిన బ్రాహ్మలు ముప్పదిమంది వాసము చేయుచు బంగాళీ ప్రభువులను ఆశ్రయించి వారివల్ల జీవనము చేయుచున్నారు.

బంగాళీ వారికి శివప్రతిశ్హ్ట చేయడము బహు అగత్యము గనుక గర్భగృహము మాత్రము కట్టి గుమ్మటపు అందముగా స్థూపీ కట్టి యీ ప్రాంతములలో అనేక లింగాలు ప్రతిష్ట చేయబడివున్నవి. యీ షహరులో అనేక తటాకములు కలవు. అందులో నేను దిగిన ప్రదేశములో వుండే మూతిబీలనే గుంట బహుప్రసిద్ధమయిన వుదకముకలది. యీ షహరులో వుద్యానవనములున్ను అనేకముగా వున్నవి. అందులో గంగకు అవతలి పక్కవుండే కుఫిణీవారి "బోతానికాలు గార్డన్ " అనే వనౌషధుల తోట బహుగొప్పది. నిడుపులో వుత్తర దక్షిణాలు అయిదు గడియల దూరము వుండును; వెదల్పులో సుమారు మూడు గడియల దూరము కద్దు.

కుంఫిణీవారు, బంగాలీల శిక్ష నిమిత్తము, కొన్ని కాలీజు పల్లె కూటములు పెట్టినారు. అందులో చదివి తీరిన పిల్లకాయలు దేశము విస్తారం కర్మభూయిష్టమయి నప్పటికిన్ని శుష్కవేదాంతులై ప్రవర్తింపు చున్నారు.

యీ దేశస్థులు మీసాలు ప్రాయశా: వుంచడములేదు క్షౌరము దినముమార్చి దినము చేసుకుంటారు. స్త్రీలు పురుషులున్ను బహుశా లలాట శూన్యులుగానే తిరుగుతూ వుంటారు. తులసీమణిధారణ విస్తారము కద్దు. కొందరు స్త్రీలు ముక్కుమీద పచ్చ పొడుచుకుంటారు. పట్నాప్రాంతముల స్త్రీలకు పాపటలో సిందూరమును కాయముగా ధరించడము శృంగారమని తోచినట్టు వీరికి ఆ పచ్చ శృంగారముగా తోచి వున్నది. యిక్కడదొరికే చీరలు 12 మూరకుయెక్కువ దొరకవు. తెల్లచీరలే సాధారణముగా ధరించుతారు.

షహరు వీధులలో భిక్షుకులు నిండా తిరగడములేదు. యిండ్లబాడిగె నవుకర్ల జీతాలున్ను బహు భారీగా వున్నవి. జాతిదొరలున్ను గొప్ప హిందువులున్ను సరకారనే పేరుపెట్టి వొక ప్రధాన నవుకరును వుంచుతారు. ద్వారమువద్ద కాచివుండడమునకు దారువాన్ అనే పేరుతో వొక నవుకరును అవశ్యముగా వుంచుతారు. క్రీస్తుమతానికి అంతర్భూతమయిన అరమనజాతి మొదలయిన వారిగుళ్ళు బహుశ: యీ బస్తీలో కట్టివున్నవి. క్రీస్తుమత ప్రకటన నిమిత్తము యిక్కడ అనేక ప్రయత్నములు గ్రంధప్రచురత్వద్వారా జరుగుచున్నవి.

ముచ్చిగోలా మొదలు బ్రారకుపూరుదాకా వొక సడక్కువేసి యిరుపక్కలా చెట్లువేసి బహుసుందరముగా యేర్పరచి వున్నది. సహరు బస్తీ నిడువున వుత్తర దక్షిణములు మూడామడవుండవచ్చును. వెడల్పులో రెండామడ వుండవచ్చునని తోచుచున్నది. జనబాహుళ్ళము చూస్తే సుమారు 15000 వేలు వుండవచ్చునని తోచినది.

మవాసైనీలయిన స్త్రీలు శంఖపుగాజులు ధరించవలసినది అగత్యము గనుక దక్షిణదేశపు శంఖాలంతా ఈ దేశములోనే వ్రయమయ్యేటట్టు తోచబడుచున్నది. స్త్రీలు విస్తారము ఆభరణాదులు ధరించడము లేదు. పురుషులలో గొప్పగా వుండేవారు యింగిలీషు జాడగా వస్త్ర వాహనాదులు వాడుకుంటున్నారు. వాద్యవిశేషములలో ఫిడీలు అనే యింగిలీషు వీణలు యీప్రాంతముల బహు ప్రచురముగా వున్నవి. యిక్కడల స్తర్లు గ్లాసులు కరిగిపోశి చేయుచున్నారు. కంట్లాలు మోశే గుర్రాలు వొంటెలు దొరకవు గనుక నా డేరాలను బోయీల చేత మోయించేటట్టు నిశ్చయము చేసినాను.

దేశ దేశపు వాడలు యిక్కడ వరకు తెచ్చి యిక్కడి సరకులు దేశ దేశాలకు తీసుకొనిపోవుటచేత యీ షహరులో దొరకని ద్వీపాంతర పదార్ధములుగాని స్వదేశ పదార్ధములు గాని లేకవున్నవి. వర్తకులు సుఖించివున్నారు. యిటువంటి కలకత్తాషహరులో జూన్ నెల 2 తేది వరకు వసించినాను.

ఇరువదియవ ప్రకరణము

3 తేది వుదయాన 5 గంటలకు ప్రయాణమై పడవలమీద వుడుబడియా యనే వూరికి 12 గంటలకు చేరినాము. ఈ దేశములో ఆయుధపాణులుగా యెవరున్ను వుండకూడకపోయినా బనారసుల్లో