కాశీయాత్ర చరిత్ర/ఏడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

చున్నది. చింతకాయ తొక్కుకు నేను ఆవనూనె పోయించినంతలో అతి రుచికరముగా నున్నది. ఈయూరిలో 8 తేది మధ్యాహ్నపర్యంతము వుంటిని.

Kasiyatracharitr020670mbp.pdf

ఏడవ ప్రకరణము

8 తేది మధ్యాహ్నముమీద 3-4 ఘంటకు బయిలుదేరి యిక్కడికి 3 కోసుల దూరములోనుండే జబ్బల్ పూరు అనే షహరు ప్రవేశించినాను. దారి బాగా ఘట్టనచేసి కాలువలకు వరధులు కట్టియున్నవి. దారికి ఇంరుపక్కలా దూరాన చిన్న కొండ లున్నవి. చిన్న యీ గుళ్ళు, బావులు, గుంటలున్ను కొన్ని దారికి ఇరుపక్కలా కట్టి యున్నవి. యీ గుళ్ళూ స్తూపీలు చెరిసగానికి పగలగొట్టిన శిగ గల టెంకాయ చందముగా కట్టియున్నవి.

యీ జబ్బల్ పూరు అనే షహరు లోగ డిదినములలో యధోచిత మయిన కసుభాస్థళము. ఘర్డామండల మనే రాజధాని కింద నుందినది. ఆ రాజధాని నిజాంషాహు అనే కొండరాజుది. షుమారు 20 ఏండ్ల కిందట పూనా శ్రీమంతుడు భోసల వంశస్థులు సాధించిన రాజ్యములు గాక ఇంకా కొండరాజుల కిందనుండే ఘర్డామండలము మొదలయిన రాజ్యములను తియ్యవలెనని సర్వ ప్రయత్నమున్ను అప్పుడప్పుడు చేస్తూ వచ్చినందున బ్ర్రాంహ్మణ జాతిమీద ఒక ద్వేషము ఈకొండరాజుకు జనించి బ్ర్రాంహ్మణులని తన రాజ్యములో కనుపడ్డ వారి నంతా సంహరింపుచు వచ్చినాడు. ఈ నిజాంషాహు రాజును సాధించడము పురాశ్రీమంతునికి ప్రయాసగా నుంచు వచ్చినది.

ఆ కొండరాజుకు రాజధాని యయిన ఘర్డామండల షహరును చుట్టు కొని నర్మదానది ప్రవహింపుచు వున్నది. యీనది మహాత్మ్యమేమంటే గతకాలములో భృగు మహాముని యీ ప్రాంతమున తపస్సు చేయుచు నుండగా నది అతనికి కొంత దూరములో ప్రవహించినది. భృగుమహాముని నా సమీపముగా వచ్చిప్రవహించక వరగడగా పోవలసినదేమని మనసులో నొచ్చుకొన్నంతలో తత్పూర్వపు ప్రవాహమును ఏనుగుల వీరాస్వామయ్య గారి

వదిలి భృగుమహాముని సమీపముగా వచ్చి ప్రవహించినది. పూర్వము ప్రవహించి మళ్ళినచోటుకువరకు ఇప్పటికిన్ని బెడాఘాటువద్ద నవనీతము వంటి తెలుపు నునుపు వర్ణములతో భూమియావత్తున్ను శిలామయమయి యున్నది. ఆ శిలను ఇక్కడి దేవస్థళాలలో ప్రతిమలుగాచేసి యుంచుచున్నారు. నర్మదాలింగాలు తెచ్చి అమ్మే గొసాయీలు ఈశిలలతో కోడిగుడ్డుచందముగా లింగాలుచేయించి స్యయంభువులని దేశాంతరాలలో అమ్ముచున్నారు. మెట్టుకు వీరు ఎంత కృత్రిమముచేసినా నర్మదశిలలు శివస్వరూపాలు అనేమాట సత్యము గనుక ఆ లింగాలను అరాధనచేసేవారికీ అభ్యుదయమే కలుగును.

ఈకొండరాజు అపారమయిన ధనముగలవాడు గనుక అజేయుడుగా నుండినాడు. ఆరాజు వేసుకొన్న నవరత్నఖచితమయిన పాపాను (పాపోసు) ఒకటి ఇపుడు సాగరరాజు సంస్థానములో నున్నది. దాని వెల నిశ్చయించను ఇప్పటికిన్ని అశక్యముగా నున్నది. యిట్లావుండగా గోవిందపంతులు, గంగాధరబావా, బాలాజీబావా అనే కరాడి బ్ర్రాంహ్మణులు ముగ్గురున్ను పరస్పర రక్తసంబంధము గలవారు; వారు పునా శ్రీమంతుని ఆజ్ఞను ధరించిన సరదారులు. వారు నర్మదానదిని అనేక సహస్ర సువర్ణపుష్పములతో ఆరాధించి ఆ నదికటాక్షము సంపాదించి దాన్ని కాలినడకతొనే దాటి ఘర్డామండలంజిల్లా తీసుకొని కొండరాజును పట్టుకొన్నారు. ఆ కొండరాజు తాను పట్టుబడకమునుపే తన ద్రవ్యమంతా ఆ నర్మదకు ప్రీతిగా అందులోవేసి పగవారికి లభించకుండా చేసినాడు. ఆ ముగ్గురు సరదారులున్ను సాగరాయనే యూరును తమకు రాజధానిగా చేసుకొని అబ్బాసాహెబు అనే తమ వంశస్థునికి ఈ రాజ్య్హమిచ్చి తమ్ము నాశ్రయించియుండిన ఆంధ్రదేశపు బ్రాంహ్మణులకు తిలవారాఘాటు మొదలయిన స్థలములలో పుష్కలమయిన జీవనాలు కలగచేసి అక్కడి కాపురస్తులుగా చేసినారు. ఆ అబ్బాసాహెబు రవంత మెత్తని వాడయినందున కొన్ని సమయములలో తమ క్షాత్రధర్మము చేత పునాశ్రీమంతుని సంతొషపెట్టి యీ నర్మద సమీపప్రతి అయిన యీజబ్బల్పూరుతొ చేరిన భూమిని నాగపూరు కాశీయాత్ర చరిత్ర

రఘోజీబాబా తీసుఒన్నాడు. పిమ్మట 12 సంవత్సరముల కిందట రఘోజీ వగయిరా రాజులతో యింగిలీషు వారికి కలహము పొసగినంతలో వారు ఈ జబ్బల్పూరునున్ను యిక్కడికి సమీపములోనుండే సాగరా మొదలయిన భూములనున్ను ఆక్రమించుకొని రాజ్యము చేయుచున్నారు. మళ్ళి నాగపూరు రాజ్యమును రఘో దౌహిత్రునికి యిచ్చినా ఈ జబ్బల్పూరు పరగణాలు పూర్వము సాగరారాజుది గనుక సాగరారాజుకు పుత్ర సంతతి లేక అతని భార్య రాజ్యము చేయుచు నుండి యుద్ధ ప్రసక్తి పెట్టుకోకనే రాజ్యమును యింగిలీషువారి అధీనము చేసి సాలుకు వీరు యిచ్చిన లక్షరూపాయిలు తీసుకొని భోజనము చేయుచున్నది గనుక ఆపె తరపున ఈ జబ్బల్ పూరు రాజ్యమును తాము పుచ్చుకొన్నందున ఈ రాజ్యము నాగపూరితొ చేరినది కాదని కుంఫిణీవారు అనుభవింపుచున్నారు.

రఘోజీ రాజు యీ రాజ్యూమును కట్టుకున్నది మొదలు ఈ జబ్బల్ పూరు బస్తి అవుచూ వచ్చినది.; యిప్పుడు యింగిలీషువారి దొరతనమయిన వెనక బజారు వీధులు రాజవీధులున్ను విశాలముగా లక్షణముగా కట్టించి బహు సుందరముగా నిర్మలముగానున్ను పెట్టుకొని యున్నారు. సారవత్తయిన భూములు గనుక అనేక తోటలు వూరి చుట్టున్ను వేసియున్నారు. ఇప్పుడు సివిల్ అధికారముచేసి దొరలు ఊరికి 2 ఘడియల దూరములో సుందరమయిన తోటలు వేసి బంగాళాలున్ను కట్తుకొని శాలలు (నీడకోసం రెండుపక్కలా పాతిన చెట్ల వరుసలు) వేసి వేడుకగా కాపురమున్నారు. ఇక్కడ నుండే సుమారు ఒక పటాలం దండున్ను అందుతో చేరిన డాక్టర్ మొదలయిన దొరలున్ను మరియెక పక్క తోటలో బ్యారుకమలు కట్టుకొని కాపురమున్నారు. సకల పదార్ధాలు దొరుకును. కండ గలిగి గొప్పవిగా నుండే దోసకాయలు విశేషముగా అమ్ముతారు. పలవర కాయలు ఇక్కడ శానా దొరుకును. ఇక్కడనుంఛే దేశాంతరమందలి ప్రభువులకు సారిపోవు చున్నారు. బారెడేసి నిడువుగల బీరకాయలు, అమితముగా అమ్ముచున్నారు. బట్టలు పాత్రసామాను ఆయుధ విశేషాలున్ను నయముగా అమితముగా అమ్ముచున్నారు. ఏనుగుల వీరాస్వామయ్యగారి

ఇక్కడ గౌనర్ జనరల్ యేజెంటువుండే స్థలము గనుక హాజూరనిపించుకొని చుట్టుపక్కలావుండే మైహరు రాజు రీమారాజు సాగరారాజు మొదలయిన వారి వకీళ్ళు కాచుకొని యున్నారు. అక్కడక్కడి తాలూకాలు విచారణచేసే ప్రి స్ పాల్ అసిష్టాంటునులు, జడ్జీ అధికారముకూడా జరిగింపుచున్నరు గనుక నున్ను వారి తీర్పులమీద యేజేంటుకు అప్పీలు చేయవచ్చును గనుక నున్ను చుట్టుపక్కల ఉండే అనేక రహితులతోను ఈబస్తీ నిండియున్నది. కాకరు ప్రసాదు అనే సాహుకారు ఒకడు కానుపూరు కాపురస్తుడు ఇక్కడ వసింది సాహుకారు పనులు జరిగింపు చున్నాడు. యేజంటు అయిన స్మిత్తు దొరగారు అత్యున్నతమయిన మొగలాయి సంతనతో దాపుకలిగిఉన్నా నాపట్ల శ్రీరాముల కటాక్షముచేత ఫరవానా ఒకటి దారిలో నాకు సకలక్షేమములున్ను కలిగేకొరకు హయిదరాబాదు కర్నల్ నాగపూరు మేస్తర్ గ్రీందొరవలెనే వ్రాశియిచ్చి కాశివరకుకూడా వచ్చేటట్టుగా చప్పరాశి అనే బిళ్ళబంట్రోతును ఒకని తయినాతి చేసినారు.* యీ జబ్బల్ పూరు చేరేవరకు నాతొగూడా వచ్చినవారందరున్ను సురక్షిరముగా ఉన్నా యిక్కడ చేరిన రెండు మూడుదినములకు వారిలో నలుగు రయిదుగురకి అడివి గడిచివచ్చినా తత్సంబంధ మయిన చలిజ్వరాలు తగిలినవి. యీ యూరిలో చిన్నపడుచులను కొందరిని తెఛ్ఛి అమ్మేటట్టువిన్నాను. యీ బస్తీలో 12 తేదీదాకా నిలిచినాను.

13 తేదీ ఉదయమైన 3.4 ఘంటకు లేచి ఇక్కడికి 6 కోసుల దూరములో వుండే గోసలపూరు అనేవూరు 10 గంటలకు చేరినాను. మధ్యనున్న ఊళ్ళు; నెం.9 కొట్రా 1 సహాగి 1 వరియెడునది 1 సన్నగరు 1 రేవురా 1 కూసుమీరు 1 బాడాగల్ 1 గోసలపూరు 1.


  • జబ్బల్ పూరులొ తాలూకా ప్రించిపాల్ అసిస్తాంటు అయిన కర్నల్ స్లీమన్ గారు శిఫారసు ఉత్తారా లిచ్చి కాశీవరకు చప్రాసీనిచ్చి పంపినారని వ్రాత ప్రతి 133 పుటలో నున్నది. ఈ స్లీమన్ గారు తరువాత హిందూదేశాన్ని గురించి అనేక గ్రంధాలు వ్రాశారు. కాశీయాత్ర చరిత్ర

దారి యిక్కడ పరంగి కొండకు* పొయ్యేమార్గమువలె సడక్కు అనే ఘట్టనవేసి యిరు పక్కలా మామిడి చెట్లు అశ్వద్ధాలు శాల@ వేసియున్నది. ఆ చెట్లు చూడగా వేసి యాడాది అయినట్టు తోచుచున్నది. దారి వెల్లిడిగా యిరుపక్కల తోపులతో వరిపయిరులతో శృంగారముగా ఉన్నది. చిన్న వాగులకు వారధులు కట్టినారు. పెద్దవాగులకు కల్లుగాళ్ళతో ఇనపమేకులు బిగించి దారిని కోయకుండా యెక్కి దిగడానికి సులువుగా మెట్లు కట్టియున్నవి. యీచెట్లు శాలపెద్దగాపెరిగితే సూర్యరశ్మిపయిన పడదు. గుర్రపుబండ్లు వేడుకగా నడిచి పోవచ్చును. ఈ దారులనున్ను శాలవృక్షాలనున్ను కాపాడడానికి రీమా అనే యూరిలో ఒక దొరను తగుపాటి సిబ్బందితో మార్గ విచారణకర్త హోదా కలగచేసి ఉంచియున్నారు. ఈ దారుల విషయమై బంగాళా గౌవర్ మెంటువారు చేసే వ్రయాణానికి ఈశ్వరుడు సంతొషించునని తొచుచున్నది. దారిలో పెన్నగరు అనే వూరికి ముందు ఒక పెద్దనది దాటవలసినది. యిక్కడ 2 దోనెలు ఉన్నవిగాని నాకు కాలునడకగానే యుండను. పెన్నగరుకు ఇవతల ఒక పెద్ద వాగు దాటవలచినది.

ఈ గోసలపూరు పెద్దది. దుకాణాలు కొట్టాయిలున్ను కట్టి యున్నారు. అవి వసతివికావు గనుక వూరికి సమీపాన నుండే ఒక కొలను వొడ్డున డేరాలు వేసుకొని దిగినాను. అది రమణీయమయిన జలము గలది; ఫలవృక్షాలతోనున్ను అవరింపబడియున్నది. ఒక గొసాయి యిక్కడ శివప్రతిష్టచేసి కొన్ని మంటపాలు కట్టినాడు. అందులొ కొన్ని నూతన సృష్టములయినా యీశ్వరాజ్ఞ చేత శిధిలములయియున్నవి. యీరిలో సకల సకల పరార్ధాలున్ను పుష్కలముగా దొరుకును. చింతపండు మిరపకాయ యీ రెండు వస్తువులున్ను బహు ప్రయత్రముమీద కాశీ పర్యంతము దారిలో నా


  • పరంగికొండ అనగా చెన్నపట్నంలో సెంట్ తామస్ మౌంటు. దీనికి పోయే రాజబాటకే మౌంటురోడ్డు అని పేరు. ఆ కాలానికే ఇది చాలా అందముగా ఉండేది.

@శాలవేసి యున్నదనగా నీడకోసం రోడ్దుకు రెండు పక్కలా చెట్లువరుసగా వేయబడనవని అర్ధం. ఏనుగుల వీరాస్వామయ్య గారి

భ్రాంహ్మణ పరిజనానికి చాలేటట్టు జబ్బల్ పూవు బస్తీలో సంపాదించి బియ్యముతోకూడా రెండు బాడిగె గుర్రాలమీద గుర్రము 1 కి 10 నాగపూరి రూపాయలవంతున కాశికి బాడిగ మాట్లాడి యేర్పరచి తీసుకొని వచ్చినాను. ఈ యూరిలో ఈ రాత్రి నిలిచినాను.

14 తేది ఉదయముయిన 4 ఘంటలకు లేచి యిక్కడికి 8 కోసుల దూరములో నుండే సలమాబాదు అనే ఊరు రెండు ఘంటలకు చేరినాను. నడిమిఊళ్ళు: నెం|| 10 బజారి - 1 - మహీరా- హోందన్నయనది - సోమిరిల్యా 1 - పరవా - శిహోరా 1 - క్మానం రేవరా - మోహలా - 1 - ధనుగ్రా - 1 - చప్రా - 1 - సలమాబాదు 1. బోయీలు యీదినము యెండగొట్తు పడినందున చప్రా అనే వూరివద్ద వారు వంటచేసుకొని భోజనముచేసి వచ్చే దాకా నాలుగు గడియలు నిల్వడమయినది గనుక మజిలీ చేరడానికి ఇంత ప్రొద్దు పోయినది. దారి నిన్నటివలె సౌఖ్యప్రదముగా శాలవేసి యున్నది. దారిలో హోరాఅనే యూరు బహు గొప్ప కసుబా, బస్తీ అయినది. సుందర మయిన మామిడితొపులు గుంటలు చెర్వులు చిన్న దేవాలయాలు జప మంటపాలున్ను కలిగి యున్నది. యీ యూరివరకు అడివిలేదు, ఫెల్లడిగా నున్నది. పైరుభూమి, దానికి ఇవతలి మజిలీ యయిన సలమాబాదు వరకు దారికి యిరుపక్కలా తేలికె యయిన అడివి కలిగి యున్నది. జబ్బల్ పూరు మొదలుగా ఈమజిలీ యూరివరకు భాట కిరుపక్కలా దూరములో చిన్న కొండలు కనుపడుచువచ్చుచున్నవి. యీ సలమాబాదులో ఉన్నట్టు ఈయూరిలోనున్ను ఒక కొత్తవాలు ఉన్నాడు. సకలపదార్దాలున్ను దొరుకును.

ఈఆచార నియమములు మనోబంధహేతుకము లనిన్ని "అభావే విరక్తి" అనే సత్యవచన ప్రకారము సాగని పక్షమందు ఆ నియమాలమీద విరక్తి పుట్టగలదని యనడానకు ఒక దృష్టాంత మే మంటే, మేము చెన్నపట్టణమూ వదలి వచ్చిన వెనక హైదరాబాదుకు ఇవతల నుండే మల్లుపేట అనే ఊరివరకు బ్రాంహ్మణయిండ్లు వుండి కష్టపడితే ఖాళీ పుట ఏనుగుల వీరాస్వామయ్య గారి

14 వ తేది ఉదయాన 4 ఘంటలకు లేచి యిక్కడికి ఆరుకోసుల దూరములో నుండే మురువారా అనే గళగ్రామము 10 ఘంటలకు చేరినాను. నడిమి వూళ్ళు: నెం.11 తెవురి 1 నయ్యగా 1 లక్కెపటారి 1 పిప్పరవేడు 1 దేవుడి 1 జింజరి 1 మురువారా 1. దారి నిన్నటిదారివలెనే శాలవేసి రమణీయముగా నున్నది. పయిమజిలీవూరు ముందరనే కాటిని అనే నది దాటవలసినది. యిక్కడ దోనెలు వేసి యున్నా నేను కాలినడకతోనే దాటినాను. దేవురి అనేవూరివద్ద నేవారు అనే నదిఒకటి దాటవలసినది. అదిమొదలుగా మురువారా చేరేవరకు చిన్న పర్వతాలు దారికి నిరుపక్కలా సమీపమున నున్నవి. పొడిచెట్లు అడివివలనె యున్నవి. ప్రతిదినమున్ను అక్కడక్కడ మనుష్యులు భాట మరామత్తు చేస్తూ శాలగా పెట్టియుండే చెట్లను పశువులు తినకుండా చుట్టు అడివికొయ్యలతో గ్రాదులు కట్టుచునున్నారు.

నాగపూరు మొదలుకొని ముఖ్యముగా జబ్బల్ పూరు మొదలు గానున్ను సకల స్త్రీలున్ను వృద్దులతొ గూడా బహు పనితనముగా అనేకవిధాలుగాచేసి వెండివలె శుభ్రముగా నుండే కంచు పాంజేబులున్ను మోచేతులకు పొడుగుగా ఆలోహముతోనే చేసిన కడియాలున్ను ధరించియున్నారు. భూమి సారవంత మయినది గనుకనున్ను దేహము పృధ్వీభూత సంబంధ మయినది గనుకనున్ను స్త్రీలు పురుషుల వలెనే కండపుష్టిన్ని దేహవర్ణమున్ను కలిగి యున్నారు. దేహ మాధ్యంతమున్ను పావడ పయిట రవికె వీటి చేత నిండుగా కప్పియుండడముగాక పురుషదర్శన మయినంతలో ముఖమునకుకూడా ముసుగు యీడ్చి కప్పుకోవడానకు మాత్రమే యిక్కడి స్తీలకు తెలుసును గాని దాక్షణాత్యులవలె చిన్నలు వన్నెలు కులుకులు బెళుకులు చేయడానికి యేపాటిన్ని తెలియదు. పనిపాటలు చేసే సామాన్య పురుషులు అందరున్ను తల మట్టుకు యిమిడేటట్టు ఒక కుళ్లాయివలె యేర్పరచి దానిచుట్టూ విశాలముగా ఒక చట్టము వెదురు దబ్బలతోనున్ను మదారపు ఆకులు మోదుగాకులతో నున్ను గొడుగు చందముగా యేర్పరచుకొని యెండకు వానకున్ను తలకు వేసుకొని నడుస్తూ బయలులో పనిపాటలు చేస్తూ వుంటారు. కాశీయాత్ర చరిత్ర

యీ మజిలీ వూరు రహితు పుష్టిగలది. నేను దుకాణాలలోనే దిగినాను. యిది నదీతీరము. సకల వస్తువులు ముసాఫరులకు దొరకును. యీరాత్రి యీయూరిలో వసించినాను. జబ్బలపూరులో వుండే తపాలు అఫీసు మ్యానేజరు కుషుచందరుదత్తుబాబు అనేవాణ్ని మంచి తనము చేసుకొని, ప్రతిచౌకిలో నుంచి ఒక తపాలుమనిషి వఛ్ఛేటట్టు జాగ్రత్త చేసు కున్నాను. హయిదరాబాదు మొదలు యీ తపాలు మనిషి కూడావచ్చుటచేత ఖర్చువిస్తారముగా తగులుచూ వచ్చినా యీ పరరాష్ట్రములో దారి తప్పితిమి అనేమాటలేదు. దారి యెటుపోవలసినదని ఒకణ్ణి అడగవలచినది లేకుండా దారితెలిసి నడుస్తూ రాబట్టి సౌఖ్యముగా వున్నది. యీమురువారాలో యీ రాత్రి వసించినాను.

16 వ తేదీ ఉదయాత్పూర్వమే 3 ఘంటలకు బయలుదేరి 10 ఘంటలకు యిక్కడికి 5 కోసుల దూరములో వుండే సభాగంజు అనేయూరు చేరి అమావాస్యగనుక వంటభోజనములు దుకాణాలలో చేసుకొని 2 ఘంటలకు బయిలుదేరి అక్కడికి 5 కోసులలో వుండే గుణవారా అనేయూరు సాయంకాలము 6 ఘంటలకు చేరినాను. నడివూళ్ళు; నెం.12. చెక్కాం జాకాహి 1 సభాగంజు 1 సయగాం 1 గుణవారా 1 - 5

సదరహి మురువారా వద్ద ఒక నదిని దాటవలెను. నేను దోనెలున్నా వాటితో దాటితే కాలమాన మవుచున్నదని మొలలోతు నీళ్ళలో కాలినడకగానే దాటినాను. దారి నిన్నటిదారివలెనే సడక్కువేసి చక్కబరచి యున్నది. అయితే కొంతమేర యెర్రగులక దొరకనందున బంకమట్టితో గట్టించియున్నది. తడిసినతావులో అడుసుగా నుంచున్నది. అయినా కాలు దిగబడడము, జారడమున్ను లేదు. చెక్కా అనే గ్రామము మొదలుగా గుణవారా మజిలీవూరువరకు దారికి నిరుపక్కల సమీపమందు సుందరము లయిన కొండలున్నవి. అవి యథోచితమైన నునుపుగలిగి అందముగా నున్నవి. కుడిచేతిపక్క కొండ బురుజుకు వెంబడి బురుజును కట్టినట్టు యేర్పడియున్నది. మనుష్యులు సకల స్వరూపాఅలున్ను ఏర్పరచడానకు ఈశ్వరుడు ఒక మాదిరిని సృష్టించుచు వచ్చుట సిద్ధము గనుక కోట బురుజులను మనుష్యులు కట్టను ఈ కొండను సృష్టించి చూపించినట్టు తొచుచున్నది. భాట కిరుపక్కల పొడిచెట్లుగాని అడివిలేదు. దారిలో విస్తరించి వరిపయిరు వేసియున్నది. పచ్చికె దట్టముగా కోమలముగా పొడుగుగానున్ను పెరిగేభూమి సారవత్తమయినది గనుక నిర్మల మొదలు శింధిఅనే వూరిదాకా భూమి పచ్చికబాగా పట్టివున్నందున నున్ను మృదువయిన తియ్యని నల్ల రేగఘమట్టి గలిగి యున్నందుననున్ను అంతమేరయున్ను సారవత్తయినదని చెప్పవలెను. పయిగా ఆ భూమి చెట్లబలం ఇతరభూమి చెట్లకులేదు. అయితే వానకాలమున అక్కడ వసించేవారికి కాలు దిగబడుచున్నది గనుక ప్రయాస విస్తారము. ఒక విధమయిన సౌఖ్యము ఈశ్వరుని కృపవల్లకలిగితే ఒక విధమయిన కష్టమున్ను కలిగి యుంచున్నది.

సభాగంజు అనే గ్రామము మజిలీస్థలము. దిగను అంగళ్ళు వసితిగా వుండవు. అన్నిపదార్ధాలున్ను దొరుకుచున్నవి. గుణవారా అనేవూరిలో అంగళ్ళు దిగను మంచి వసతిగా నున్నవి. చెక్కాఅనే వూరు మొదలుగా మయిహరు రాజు రాజ్యము. అతనికింది అధికారస్థులు గొప్ప ముసాఫరుల సరఫరాయి నిమిత్తమై కొత్తవాలు మొదలయిన మనుష్యులను వుంచియున్నారు. ఈ గుణవారాలో ఆరాత్రి వచించినాను.

17 తేదీ ప్రొద్దున 6 ఘంటలకు లేచి 10 ఘంటలకు 4 కోసుల దూరమందుండే మైహరు అనే రాజధాని చేరినాను. మధ్యనున్న యూళ్ళు. నెంబరు 13; గురయ్యా 1. మైహరు - 1.

యీ మైహరు యధోచితముగా బస్తీ అయినది. దారి నిన్నటి దారివలె సడక్కు వెసి యున్నది. వానవల్ల అక్కడక్కడ దారి చెడిఉన్నందున మనుష్యులు మరామత్తు చేయుచున్నారు. నిన్నటివలె కొండల నడుమ దారి పోవుచున్నది. అడివిలేదు. ఈమైహారులో జబ్బల్ పూరు యిలాకా రహదరుల విచారింఛే దొర ఒక బంగాళాకట్టి తన ఠాణాను ఒక డభేదారునితో కూడా వుంచి యున్నాడు. రాజు కోట, కాశీయాత్ర చరిత్ర

లోపల వున్నాడు. ఉత్తరువు లేకనే ముసాఫరులను కూడా లోపల పోనివ్వరు. వూరి చుట్టూ మంచి చెరువులున్ను గుంటలున్ను ఉన్నవి. అందులో దామరవేసి యున్నది. ఊరివద్ద పర్వతాగ్రమందు ఈ రాజు తన యిష్టదేవత యయిన శక్తికి గుడి కట్టించి యున్నాడు. ముసాఫరులకు గాను సదరహిబంగళాదగ్గిర ఒక చెరువు కట్టమీద సరాయి అనే ఒక పెద్ద కొట్టాము కట్టించి యున్నాడు. అందులో నొక అంగడి యున్నది. అందులోనే ముసాఫరులు దిగవలసినది. మరియొక గుంట గట్టున ఒక పెద్ద శివాలయ మున్నది. అందులో ఒక మధ్యరంగ మున్ను చుట్టూ తాళ్వారము (మండువా వసారా)న్నూ నయిన అంతస్థులతొ రెండుస్తూపీలున్ను అందులో రెండు అరలున్ను నాల్గు దిక్కులలో నాల్గు జపమంటపాలున్ను కట్టి యున్నవి.

నేను కన్యాకుమారి మొదలుగా ఇదివరకు దేశసంచారము చేసి నంతలో దాక్షినాత్యులకున్ను ఉత్తర దేశాస్థులకున్ను ఆహారాదులున్ను ధైర్యస్థైర్యములున్ను బింబారాధనలున్ను వీరందరున్ను శ్రుతిస్కృతి పురాణములను అనుసరించిన వారైనా, భేదించి యుండుటకు కారణమేమని యూహించగా నా బుద్దికి తోచినది యేమంటే యీ బ్రహ్మాండము కోడిగుడ్డు చందముగా పరబ్రహ్మ యాజ్ఞచేత రజ్జువుచేత విడబడ్డ బొంగరమువలెనే కొన్ని బ్రంహ్మాండాలకు జ్యోతిర్బూతముగా యేర్పరచబడి యుండేసూర్యునికి ఒక ప్రదక్షిణము 36.4 దినములు చిల్లర గడియలకు చేసేది గనుక ఆ సూర్యునికి ఈబ్రంహ్మాండములో అభిముఖ ప్రదేశముగా వుండేదాన్ని మనవారు నిరక్షదేశమని చెప్పుతారు. యింగిలీషువారు దానినే లయను అని చెప్పుతారు. అక్కడ మధ్యాహ్న కాలానికి ఆయా వస్తువులమీద వాటి గాత్రము లో లయింపుచున్నది గనుక ఆప్రదేశము మిక్కిలి ఉష్ణకరమైనది. ఆ ప్రదేశము మొదలు ఉత్తరధృవుని పర్యంతము 90 భాగలుగా యీ గణితజ్ఞులు భాగించి యున్నారు. ఆవుత్తర ధ్రువుణ్ని యింగిలీషువారు నార్త్ పోల్ అను చున్నారు. ఆ నిరక్షదేశంకు మొదలు భాగకు భాగకున్ను ఉష్ణము తగ్గుచు వచ్చుట వలన అక్కడికి నిండా దూరపు ప్రదేశము శీతము ఏనుగుల వీరాస్వామయ్య గారి

శీతతరము అతిశీతతరము న్నవుచు వచ్చింది. ఆ ప్రకారము భూమిని భాగించి నంతలో కన్యాకుమారి తొంమ్మిదో భాగలోవున్నది. చేన్నపట్టణము 14 భాగములోనున్ను హయిదరాబాదు 18 భాగలలోనున్ను నాగపూరు 22 భాగలోనున్ను అగరా(ఆగ్రా) 26 భాగలోనున్ను డిల్లె 29 భాగలోనున్ను వున్నవి. గనుక కన్యాకుమారి మొదలు సుమారు 15 భాగలోనుండే నెల్లూరి వరకు భూమి ఉష్ణకరమయిన వెన్న యెట్లా ఉష్ణానికి క్రమక్రమముగా పలచన అవుచున్నదో తద్వత్తుగా ఆయుష్ణ భూమిలో వసించే వారి హృత్కమలము మృదుభావమును పొందే కొద్దిన్ని వారియొక్క ధైర్య స్థైర్యాలు జాఠరాగ్ని, బలహాని ద్వారా తక్కువ అయివుంటున్నది. 'ఉష్ణముష్ణేన శీతలా అనే న్యాయప్రకారము జాఠరాగ్నికి ఉష్ణభూమిలో దీపనశక్తి మట్టుబడ వలసినది సహజమేగదా? జాఠరాగ్ని మందగతిని పొందియుండుట చేత కన్యాకుమారి మొదలుగా నెల్లూరి వరకు వసింఛేవారు త్వరగా జీర్ణదశను పొందతగిన తేలికె ఆహారాలైన తమిదెల పుల్లటి యంబలి సద్దిఅన్నము కూటినీళ్ళు గంజి, మజ్జిగతేట, మిరియాల చారు మొదలయిన బక్ష్యములను పుచ్చుకొనుచు వస్తారు. యీభక్ష్యములు బలకరములు గానందున హృత్కమలాన్ని దృఢతరము చేయనేరక యున్నవి. హృత్కమలము దృఢకరము కానందున బిడ్డపాపలను విడచి ఎట్లా దూరసంచారము పోయ్యేది? పోతె మనగతి అక్కడ యేమవునో; యిక్కడ వీరిగతి యేమవునో అని భయపడి దేశ సంచారమును దాక్షిణాత్యులు బహుశ: మానుకొను చున్నారు; ఇంతేకాకుండా యెప్పుడు ధయిర్యము కొంచమవుచున్నదో అప్పుడు చంచల్యము జనింపుచున్నది గనుక చాంచల్యము ద్వారా వస్తు విషయములుగా నున్ను స్త్రీ బోగాలు మొదలయిన వాటి విషయముగానున్ను నిండా భోగింఛే శక్తిలేక పోయినా అలాటి విషయములను భోగించవలె నని తత్సంబంధమయిన అఫెక్ష యెక్కువ అవుచు వచ్చుచున్నది. అటివంటి వారున్ను ఒక పద్దతిని పొంద వలసినది. యీశ్వరునికి అగత్యము గనుక అతడు తన చైతన్యము యెక్కువగా ప్రతిఫలించిన అప్పయదీక్షితులు రామా కాశీయాత్ర చరిత్ర

నుజాచార్యులు ఆళ్వారాదులు అప్పర సుందర మాణిక్యవాసులు మొదలయిన వారిగుండా ఆ దేశపు 'యద్వద్విబూతి మత్సత్వం' అనే సాటిరాజులగుండానున్ను ధనికులగుండానున్ను వారున్న భూమిలో వూరూరికి సమీప వత్రిగా ఒక్కొక్క ప్రదేశాన్ని పుణ్యభూమియని యేర్పరచి ఆ ప్రదేశాలలో మనుష్యుల భక్తిని ఆకర్షింఛేపాటి దేవాలయాలను బహు ద్రవ్యవ్వయముతో అమానుష కృత్యముగా వుండే టట్టు కట్టించి అందులో బింబాలకు మంత్రమూలకముగా మహత్యమును కలుగజేసి ఆ బింబాలకి చేసే రాజోపచారములు మొదలయిన ఆరారాధనలు యీ చాంచల్యము కలిగిన జనులకు సుఖకరములుగానున్ను ఉత్సాహకరములుగా నున్ను ఆపేక్షితములుగానున్ను వుండేటట్టుచేసి యీ సుఖాపేక్షగుండానయినా అట్టిదేవాలయాలకు మనుష్యులుపోవుచు ఉపచరింపుచు అక్కడక్కడి విభవాలను ధనవ్రయము గుండా వృద్ధిపొందింప చేయుచురాగా వారికి ఒక భక్తిజనితమై తరించడానకు హేతువు అయివుంటున్నదని చేసినాడు. ఉత్తరదేశమున 14 నోల్ల్ భాగమొదలు సుమారి 30 యేభాగపర్యంతము వసింఛేవారు, తత్పూర్వ దేశాస్థుల ఆపేక్షయా వుష్ణశల్మనమైన భూమిలో వశించేవారు గనుక నెల్లూరు మొదలుగా ఢిల్లీపర్యంతము వుండేవారికి జాఠరాగ్ని క్రమక్రమముగా పటుత్వముకలిగి వుండేటందున రొట్టె, నెయ్యి, పాలు, దూదుఫేడాలు పప్పు చక్కెర ఘనీభవించిన పెరుగు మొదలయిన దీఘ్రముగా జీర్ణము కాదగ్గ బలమయిన ఆహారాదులు పుచ్చుకొనుచున్నారు. తద్ధ్వారా హృత్కమలము యధోచితమయిన దృఢభావాన్ని పొంది ఉష్ణదేశస్థుల ఆపేక్షయా ధైర్యస్థైర్యాలు యెక్కువ కలవారై దేశాతనము చేయడానకున్ను గురుకుల వాసముచేసి శాస్త్రవిచారణ చేయునున్ను సామర్ధ్యము కలవారై యున్నారు. గనుక శాస్త్ర విచారణద్వారా జ్ఞానము ఉదయించక పోయినా భక్తి మాత్రము సహజముగా ఈశ్వరునిపట్ల ఉదయించ వచ్చును గనుక మూఢులకు ఉత్సాహాకరములైన నృత్యవాద్యగీతాలు రుచికరములయిన ప్రసాద తీర్ధాలున్ను లభ్యములు కాగల దేవాలయాలు ఉత్తర దేశములో ఏనుగుల వీరాస్వామయ్యగారి

అడుగడుకు విశేష ద్రవ్యవ్రయముచేత సృష్టించవలసిన అగత్యము లేదని ఉత్తరదేశపు పూర్వీకులైన ఉత్కృష్ణులు నియమించినవారు కారు; కాని ఒకవేళ శాస్త్రవిచారాణచేసి అందువల్ల భక్తి మాత్రము సంపాదించడము కూడా అందరికి సాధ్యము కాదని ఊహించినవారై యిక్కడి మూఢులు తరింఛే నిమిత్తమై యీ ఉత్తరదేశములో నున్ను యధోచితమైన ద్రవ్యవ్రయముతో బహు దూరానికి బహుదూరమున ఒక్కొక్క నదియందు ఒక్కొక్క మహాత్మ్యము నిర్ణయముచేసి ఆనదీ తీరమందు కొద్ది అయిన దేవాలయాలు నిర్మింఛేటట్టుచేసి వాటిలోని బింబాలకు యధోచితమయిన పూజలు ఉపాయముగా జరిగించేటట్టు చేసినారు. గనుక అందువల్ల యీ శీతదేశపు మూఢులు కొంతదూరము కాయాన్ని క్లేశపెట్టి దేశ సంచారము చేయడానికి సమర్ధులు గనుక ఆ ప్రకారమే ఛేసి అట్టి నదులలో స్నానముచేసి అట్టి దేవాలయాలలోని బింబాలను ఆరాధించి కడతేరుచు వచ్చుచున్నారని తొచుచున్నది. అయితే మూఢవ్యతిరిక్తులుగా వుండే వారు ఈ నదుల స్నానాలున్ను చేయ నక్కర లేదే అని శంఖ తోచును. మూడ వ్వతిరిక్తులకు శాస్త్రమువల్ల కలిగే తెలివి పై పాచిని తొసిన జలమువంటిది గనుకనున్ను మళ్ళీ మూఢత్వము పాచివలెనే కమ్ముచూ వచ్చును గనుకనున్ను మూఢవ్యతిరిక్తులు మూఢుల అనే క్షయా పెద్దలు గనుకనున్ను మూఢులకు గతి కల్పించవలసినది మూఢ వ్యతిరుక్తులకు మిక్కిలి అగత్య మయినందుననున్ను తృణము మొదలు మేరువు వరకు పరబ్రహ్మచైతన్యము నిండి ఉన్నదనే నిశ్చయముతో పూర్వీకులైన పెద్దలు వ్రాసిన నిమిత్తములను బట్టి యేర్పరచి వుండేస్థలముల నేమి బింబాలనేమి తీర్ధాలనేమి వారి సంకేతానికి యెంత మాత్రమున్ను భంగము రాకుండా భక్తితో మూఢ వ్యతిరిక్తులున్ను ఆరాధింపుచు రావలసినది. తద్ద్వారా "యాదృశీభావనా, యత్ర సిద్ధిర్భవతి తాదృశీ" అనే సత్యవాక్యప్రకారము మూఢులను మూఢ వ్యతిరిక్తులనున్ను తరింపచేయుచు వచ్చుచున్నది.

ధైర్య స్థైర్యాలకు నెల్లూరికి దక్షిణములోనున్ను నెల్లూరికి కాశీయాత్ర చరిత్ర

ఉత్తరములోనున్ను వుండే భేదములు తెలియును ఇంకా యీ అడుగున వ్రాయుచున్నాను. తంజావూరు తిన్నెవల్లి సీమవారు 'గాయికి వందనం తగప్పన్ 'అనేవాక్యాన్ని వాడుచు ఊరికి వచ్చిన అధికారస్థుడు ఏమిచేసినా అంగీకరింపుచున్నారు. హయిదరాబాదు నాగపూరు రాజ్యములలో భిక్షకుణ్ని ఒక ముసాఫరులు దిగే స్థలములో నుంచి నాలుగు గడియలు అవతలికి లేచిపోయి ఉండుమంటే తనకు చేసిన ఆజ్ఞ న్యాయ విరుద్దము గనుక నా తలకాయ కొట్టిన వెనక నా కళేబరాన్ని యీస్థలములో నుంచి వొత్తించ వలసినదిగాని నేనుగా భయపడి లేవనని సర్వాధికారము కలవారిని నిగ్రహించి చెప్పుతాడు. దక్షిణదేశస్థులకు బెత్తపు దెబ్బపుట్టించే నొప్పి, కలగచేసే భయము ఉత్తరదేశాస్థులకు తల తెగడములో లేకుండా వున్నది. అయితే దక్షిణదేశస్థుల భయము భక్తిజన్యము కాదు గనుక నిలకడగా వుండేదిలేదు. ఉత్తర దేశస్థులు భయప్రేరణ లేకుండానే చేతనయి నంత మట్టుకు న్యాయముగా నటింపుచు వచ్చుచున్నారు. తమ తాత్పర్యము యెదటివారి తాత్పర్యముతో భేదించినప్పుడు పురుషవాహిని ప్రకారము అహంకారాన్ని వృద్ధిపొందించి నటింపుచున్నారు. యిటు నంటి మనోబుద్ధి హయంకారమాలు స్థూలదేహముతొ నెయ్యిపాలలొ కలసినట్టు వున్నందున బౌద్ధులు నెయ్యిని పాలలోనుంచి విడతీసే ప్రయాస పుచ్చుకోచాలక పాలనే నెయ్యి అని భావించినట్తు స్థూలదేహాన్నే పరబ్రహ్మ అని భావింపుచున్నారు. అటువంటి భావనకూడా ప్రత్య వాయమయినది కాదని తొచుచున్నది. కొండకొనకు పోవలస్తే మెట్టు మెట్టుగా యెక్కిపోవలసినది గనుక ఒకరు ఒకదారిగా మరియొకరు మరియొక దారిగా యెక్కుచున్నారు. యేరీతిగా నయినా ఏపదార్ధమందయినా పరబ్రహ్మను నిరూపించి ఆరాధనచేసి కడతేరవలసినది గనుక సర్వం విష్ణుమయం జగత్ అనే న్యాయప్రకారము యేవస్తువును యే నామ రూపాలతొ పరబ్రహ్మగా నిరూపించినా బాధకము గాదు. దాక్షిణాత్యులకు అతి సమీపములో అనేక దేవాలయాలు అతివిభవముతో ఉత్సవాలు జరిగేవిగా వుండిన్ని తమకు భోజనమజ్ఞ నాదులు ఉపచదించేవారు అక్కడలేని పక్షమందు ఆస్థలానికి వెళ్ళ ఏనుగుల వీరాస్వామయ్య గారి

డము మాని ఉపచరించేవారు ఉండే మహాస్థళానికే చెన్నపట్టణపు శెట్లు తిరువట్టూరికిన్ని కోమట్లు తిరువల్లిక్కేణికిన్ని మొదలారులు మయిలాపూరికిన్ని వెళ్ళేటట్టు పోవుచు నుంటారు గాని ఒకపూట అన్నము తమ ప్రయాసతొ జాగ్రత్త పెట్టుకొనేపాటి ధైర్యముతో ఇతర స్థళాలకు వెళ్ళడములేదు. ఉత్తర దేశస్థులు సహజముగా తీర్ధయాత్రలకు అక్కడ యెక్కువ విభవాలు జరగకపోయినా యెరిగిన వారు యెవరున్ను లేకపోయినా బహుదూరానికి వెళ్ళుచున్నారు. మళయాళదేశాస్థులు సేతుయాత్ర వెళ్ళవలిస్తే వర్ త్త్ కొట్టి యమణల్ వెళ్ళీ కట్టియముళ్ దారిలో వున్నదని అద్యాపి జడుస్తారు. హిందూస్థాని దేశస్థులు మనోభీష్టాలు యీడేరవలిస్తే అనాయాసముగా గంగోత్తరి మొదలయిన పంచగంగ కావిళ్ళు తెచ్చి దాతా వైద్యనాధ స్వామికి అభిషేకము చేస్తూవస్తున్నారు.

ఆహారములు, స్త్రీ సంగమాలున్ను, దృఢతరముగ్తా చేసి ఉత్తర దేశాస్థులవలె దాక్షిణాత్యులు తృప్తిపొంది వాటివల్ల వెంబడిగానే విరామాన్ని పొందకపోయినా దాక్షిణాత్యులు దినానికి నాలు గవసరాలుగా భోజనముచేసి మధ్యే మధ్యే మజ్జిగె తేట మొదలైన పానీయాలు పుచ్చుకొని చూచిన భక్ష్య యోగ్య స్వల్ప పదార్ధాల నంతా చూచినప్పుడంతా తినకోరుచున్నారు. స్త్రీ సంగమాదులలో నున్ను అదేరీతిగా మనస్సున నిబ్బరముతో దేహధర్మాన్ని వుంచనేరక ధృఢముగా భోగించలేకపోయినా, చూచిన మిణుకుకత్తెల పయినంతా దృష్టిని పోనిచ్చి సంగమాదులలో అనేకావృత్తులు ప్రవర్తింపు చున్నారు. అందువల్లనే ఆ దేశస్థులకు త్వరగా వీర్యనష్టమయి అండవాయురోగము కల్గుచు వచ్చుచున్న దని యింగిలీషువారు తాత్పర్యము గలవారై వున్నారు. ఈ చాపల్యాలకంతా కారణము పిత్తోద్రేకమని తోచుచున్నది. యీపిత్తోపరి కావడానికి ఉష్ణమే కారణముగాని వేరేలేదు వాతము రజోగుణధాతువు; పిత్తము తమోగుణధాతువు; శ్లేష్మము శీతభూమిలో ప్రకోపమవుచున్నది; వాతము ఉభయమధ్యస్థముగా ఇతరములయిన రెండు ధాతు వులతో ప్రత్యేక ప్రత్యేకముగా కలుసుకొన్నప్పుడు ఆ యా గుణములతో తాను ప్రకోపింవుచున్నది. అది యెట్లానంటే శీతదేశస్థులకు శ్లేష్మవాయువు ప్రకోపిమయి వేదించినట్టున్ను ఉష్ణదేశస్థులకు ఉష్ణవాయువు ప్రకోపించి వేధించినట్టున్నేగాని శుద్ధవాయువు ఎక్కడా ఒక ప్రకోపాన్ని పొందడములేదని తోచుచున్నది.

ఎనిమిదవ ప్రకరణము

యీ మైహరు అనే ఊరు బొందిలీ ఖండము మధ్యేఉన్నది. దీని చుట్టూ 10 ఆమడదూరపు భూమిని బొందిలీఖండ మంటారు. యీ మైహరు రాజుపేరు 'బిష్మశింగు ' వీని తాత పర్నా దేశపు రాజు కింద సరదారుగా వుండే పర్నారాజు తమ్ముణ్ణి యుద్ధములో చంపి నందున చెయి పట్టుగా పట్టి నాకు ఒప్పగించక నాతమ్ముని చంపితివే అని షరాపెట్టి పర్నారాజు యీరాజును తలకాజ్ఞచేసి అయినా తనకు నుపకారము చేసినందున సంత్సరము 1 కి లక్ష రూపాయీలు యేత్తే యీ మయిహరు రాజ్యాన్ని యీ రాజు తండ్రికి జాగీరుగా యిచ్చినాడు. అద్యాసి ఆ ప్రకారమే అనుభవింపుచు కుంఫిణీ వారికి చాలా విహిరముగా నడుచుకొను చున్న ఈ దారిని వచ్చిన దొరలకు కావలసినట్టు సరఫరాయిచేసి సంతోషపెట్టి యీరాజు బహు యోగ్యుడని వారివద్ద క్యారకటరు పూనుకొనుచున్నాడు. భగవంతుడు నాయందున్న ఆప్రకారమే గౌరవము కలగచేసి నందున ఆరాజు సకల విధాలను నాకు ఉపచరించి వెనక నావద్దనున్ను క్యారకటరు పుచ్చుకొన్నాడు. కొన్ని సంవత్సరములు కిందట యీ బిష్మశింగు తమ్ముడు ప్రయాగదత్తు అనేవాడు అన్నతో కలహపడి జబ్బల్ పూరు యేజంటుగా రాజ్యమును పంచుకొన్నాడు. ఈబీష్మశింగు కింద యిపుడ తని సగానికి వచ్చిన 40000 రూపాయీల రాజ్యమున్ను ఉన్నది. ఇతని రాజధాని నిండా బస్తి అయినదికాదు.

ప్రయాగకు సిహోరానుంచి బలుహోరా మీదుగా ఒక దారిన్నీ మైహరునుంచి చిత్రకూటము మీదుగా ఒకదారిన్ని పోవు