కాశీయాత్ర చరిత్ర/ఎనిమిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వులతో ప్రత్యేక ప్రత్యేకముగా కలుసుకొన్నప్పుడు ఆ యా గుణములతో తాను ప్రకోపింవుచున్నది. అది యెట్లానంటే శీతదేశస్థులకు శ్లేష్మవాయువు ప్రకోపిమయి వేదించినట్టున్ను ఉష్ణదేశస్థులకు ఉష్ణవాయువు ప్రకోపించి వేధించినట్టున్నేగాని శుద్ధవాయువు ఎక్కడా ఒక ప్రకోపాన్ని పొందడములేదని తోచుచున్నది.

ఎనిమిదవ ప్రకరణము

యీ మైహరు అనే ఊరు బొందిలీ ఖండము మధ్యేఉన్నది. దీని చుట్టూ 10 ఆమడదూరపు భూమిని బొందిలీఖండ మంటారు. యీ మైహరు రాజుపేరు 'బిష్మశింగు ' వీని తాత పర్నా దేశపు రాజు కింద సరదారుగా వుండే పర్నారాజు తమ్ముణ్ణి యుద్ధములో చంపి నందున చెయి పట్టుగా పట్టి నాకు ఒప్పగించక నాతమ్ముని చంపితివే అని షరాపెట్టి పర్నారాజు యీరాజును తలకాజ్ఞచేసి అయినా తనకు నుపకారము చేసినందున సంత్సరము 1 కి లక్ష రూపాయీలు యేత్తే యీ మయిహరు రాజ్యాన్ని యీ రాజు తండ్రికి జాగీరుగా యిచ్చినాడు. అద్యాసి ఆ ప్రకారమే అనుభవింపుచు కుంఫిణీ వారికి చాలా విహిరముగా నడుచుకొను చున్న ఈ దారిని వచ్చిన దొరలకు కావలసినట్టు సరఫరాయిచేసి సంతోషపెట్టి యీరాజు బహు యోగ్యుడని వారివద్ద క్యారకటరు పూనుకొనుచున్నాడు. భగవంతుడు నాయందున్న ఆప్రకారమే గౌరవము కలగచేసి నందున ఆరాజు సకల విధాలను నాకు ఉపచరించి వెనక నావద్దనున్ను క్యారకటరు పుచ్చుకొన్నాడు. కొన్ని సంవత్సరములు కిందట యీ బిష్మశింగు తమ్ముడు ప్రయాగదత్తు అనేవాడు అన్నతో కలహపడి జబ్బల్ పూరు యేజంటుగా రాజ్యమును పంచుకొన్నాడు. ఈబీష్మశింగు కింద యిపుడ తని సగానికి వచ్చిన 40000 రూపాయీల రాజ్యమున్ను ఉన్నది. ఇతని రాజధాని నిండా బస్తి అయినదికాదు.

ప్రయాగకు సిహోరానుంచి బలుహోరా మీదుగా ఒక దారిన్నీ మైహరునుంచి చిత్రకూటము మీదుగా ఒకదారిన్ని పోవు ఏనుగుల వీరాస్వామయ్యగారి

చున్నది. ఆరెండు దోవలున్ను దగ్గిరైనా సడక్కు వేసివున్నందుననున్ను అన్నివిధాలా ప్రయాస నిఛ్ఛే మార్గములు గనుకనున్ను ఆరామడచుట్టయినా సడకువేసిన దారిగుండా మిరిజాపురానికి వెళ్ళేటట్టు నిశ్చయించినాను.

ఈ మైహరులొ 20 తేది మధ్యాహ్నము వరకువుండి మూడు ఘంటలకు బయలుదేరి 6 కోసుల దూరములోనున్న అమరాపాట్ర అనేవూరు రాత్రి 9 ఘంటలకు చేరినాను. నడిమివూళ్ళు; నెంబరు 14. బ్రహ్వ - 1 - అమరాపాట్ర - 1 దారి ముందరి మజిలీవలె సడక్కువేసియున్నా యెర్రగులకవేసి గట్టించి నందుననున్ను వర్షాకాలము గనుకనున్ను భూమి గౌరవర్ణపు రేగడ అయినందుననున్ను నడవను అనుకూలముగా నుండలేదు. మైహరు వూరికి కోసెడుదూరాన తమసానది దాటవలెను. అమరాపాట్ర వూరిముందర జింజిరీఅనే కాలవ యొకటి దాటవలెను. ఆ కాలువ వరకు మైహరు రాజ్యమునది. దానికి ఇవతల రీమారాజు రాజ్యము. అమరాపాట్రవూరు గొప్ప బస్తి అయినది. అంగళ్ళు విస్తరించి వున్నవి. అన్ని వస్తువులు దొరుకును. రీమారాజు తన తరఫున గొప్ప ముసాఫరుల సరఫరా నిమిత్తమై ఒక కొత్తవాలును వుంచియున్నాడు. మైహరునుంచి అమరాపాటనుకు వఛ్ఛేటప్పుడు మార్గములో కుడిచేతితట్టు మాత్రము కొంతదూరములో కొండ అగుపడుచు వచ్చుచున్నది. ఎడమ చేతిపక్క కొండలు అక్కడక్కడ తునిగి సంక్షేపబడుచు వచ్చుచున్నవి. వాటిలో రెండుకొండలు- ఒకటి ఫిరంగిగుండ్లు రాశిపోసి అతికిన చందముగానున్ను, ఒకటి ఒంటి కంభము డేరాచందముగా నున్ను వున్నవి. యీవూరిలో అంగళ్ళలొ యీ రాత్రి వసించినాను.

21 తేద ఉదయమయిన 6 ఘంటలకు లేచి యిక్కడికి 3 కోసుల దూరములోవుండే పల్నా అనేవూరు 8 ఘంటలకు చేరినాను. జబ్బల్ పూరు దాటిన వెనక కూడా కొందరు బోయీలు కావటివాండ్లు బంట్రౌతులున్ను అటు ముందు దాటివచ్చిన అడివిగాలి సంబంధమయిన చలిజ్వరాలతో పడ్డందున కొందరిని దోలీలలో వేసి కూడా తేవలసివచ్చినది; గనుక వారు వచ్చి కూడా కలుసుకొనే నిమిత్తమయి కాశీయాత్ర చరిత్ర

యింత చిన్న మజిలీ చేసినాను. డోలీ అనగా ఒక చిన్ననులకమంచానికి బొంగు కట్టి యిద్దరు మోసేది. యిక్కడి బోయీలను డీమర్లు అంటారు. వారిద్దరు అటువంటి డోలీని సాధారణముగా నా సవారితో కూడా మోసుకొని వచ్చిరి. దారి నిన్నటి దారివలెనె అనుకూలమయినది కాదు. ఈవూరు చిన్నది. జలవసతి కద్దు. దీన్ని యీ దేశపు బ్ర్రాంహ్మణునికి రీమారాజు యీనాంగా యిచ్చినాడు. మజిలీవూరు కాదు గనుక ప్రయత్నము మీద బియ్యము మొదలయిన సామానులు అందిరికిన్ని దొరికినవి. యిక్కడ యీరాత్రి డేరాలలొ వసించినాను.

22 తేది ఉదయాత్పూర్వము 3.4 ఘంటకు లేచి యిక్కడికి 3 కోసుల దూరములో వుండే రీమారాజుయొక్క రాజధానిని (రీమా) చేరినాను. నడిమివూళ్ళు. 14 వుమరి - 1 - రీమా 1.

దారి నిన్నటివలెనే వున్నది. రీమా అనేవూరిముందర తమసా అనే నది మళ్ళి దాటవలసినది. ఈనది గంగలోనుంచి చీలివచ్చేదిగా చెప్పుతారు. రీమా బహు గొప్పవూరు. కోటలోపల రాజు వుంటాడు. కోటకు బయిట అంగళ్ళు మొదలయినవి వున్నవి. వూరిచుట్టు తొటలు గుంటలున్ను కొన్నివున్నవి. సకలమయిన పదార్ధాలున్ను దొరుకును. చింతపండుకూడా బహు ప్రయత్నముమీద ఒక శేరు యిక్కడ దొరికినది. నాతో కూడా వచ్చిన స్వదేశపు పరిజనులు మిరపకాయలు చింతపండు తిననందున మాకు రోగాలు వస్తున్నవని భ్రాంతిపడి చెప్పుతారు. వారికి చింతపండుకు బదులు గోగుకూర చింతాకు చింతపెందెలు దొరుకుచు వస్తున్నవి. ఉపపన్నులయిన యాత్రవచ్చేవారు నా వలె మోసపోకుండా స్వదేశ పరివార రక్షణ నిమిత్తమై 2 నెలలకు చాలేపాటి చింతపండు మిరపకాయలు మిరియాలు ఆవాలున్ను నాగపూరులొనే జాగ్రత్తచేసుకొని కూడా తీసుకొని రావలసినది. లోగడ నేను వ్రాసిన ప్రకారము కోసుకు మూడుకోసులుగా వుండే కొండకోసులు నర్మదానదితొసరి. జభ్భల్ పూరు మొదలుగా అనుకొనే కొసులు కొంచమెచ్చుగా మనదేశపు కోసులకు సరిపడుచున్నవి.

నాగపూరు మొదలుగా వక్కలులేవు. పోకలు వొత్తికాచుతో ఏనుగులవీరాస్వామయ్యగారి

కూడా వేసుకొనుచున్నారు. యీ సంగతి నాగపూరిలో తెలసి నందున నా దేహ సంబంధికులకు మాత్రము కాశివరకు చాలే పాటిగా నాతో కూడా వచ్చినవారు వక్కలు కొనితెచ్చినారు. యీదేశస్థులు హుక్కాతాగడము చేత పొగాకు సాథారణముగా దొరుకుచు వచ్చుచున్నది. తమల పాకులు జబ్బల్ పూరు మొదలు అతినల్పువర్ణముతొ బ్నిల్వపత్రివలెనే వుండేవి దొరుకుచున్నవి. మిక్కిలి ప్రయత్నము మీద అలాటి నల్లని వర్ణముగల తమల పాకులే పెద్దవిగా దొరుకు చున్నవి. హయిదరాబాదు మొదలుగా అమ్మేనెయ్యి మంచిది కాదు, గనుక నాగపూరు వరకు ఎన్నతీసి నెయ్యికాచుకుంటూ వచ్చినాము. పిమ్మట జబ్బల్ పూరు వరకున్ను అటు యివతలనున్ను వెన్న మజ్జిగె దొరకడము ప్రయాస అయినా నాకు యీ రాజ్యములో అక్క డక్కడ గొప్పవారిని శ్రీరాములు విహితము చేస్తూ వస్తాడు గనుక దొరికే తావులోనుంచి దొరకనితావుకు వెన్న మొదలయిన పదార్ధాలు నాకు ముట్టుచున్నవి.

ఆగామి సంచిత ప్ర్రారబ్ధ కర్మాలలొ మూటిలోనున్ను "అవశ్య మనుభోక్తవ్యం కృతం కర్మశుభాశుభమ్" అనేవచనము ప్ర్రారబ్ధకర్మ విషయమై సత్యమై వుండగా ఈశ్వరకటాక్ష మేమి చేయగలదు? మనము చేసినంత అనుభవించవలసిన దాయెనే అని సందేహపడి యీశ్వర భజన చేసి యీశ్వర ప్రియములయిన పనులు చేసినంతలో అది పయివాక్యాన్ని అనృతపరచ కుండానే ఆ ప్రారబ్ధకర్మఫలము దు:ఖమయిన పక్షమందు దు:ఖఫలమును పొందకుండా చేసి అభ్యుదయాన్ని నిస్సందేహముగా పొందింప చేస్తున్న దనేటందుకు సాధనములయిన వచనములు "కోటయో బ్రహ్మహర్యానా మగమ్యాగం కోటయ సద్య: ప్రళయ మాయాంతి మహాదేవేతి కీర్తనాత్" ఇది మొదలయినవి అనేకములున్నవి. యీ వచనములు సత్యములయితే అవశ్య మనుభోక్తవ్యం అనే వచనము అబద్ధము కావలసిన దాయెనే, యిందులో యేది సత్యము యేది అబద్ధము? లేక రెండున్ను సత్యములు కానేరవే; అనే తాత్పర్యము బహు దినములుగా నాకు కలిగి వుండి, నెను పెద్ధలని తోచిన కాశీయాత్ర చరిత్ర

వారినంతా యీ సందేహమును నివృత్తి చేయవలసిన దని అడుగుచు వచ్చినంతలో వారు వారు యథోచితమయిన సమాధానాలు చెప్పుచు వచ్చిరిగాని, నిస్సందేహమును పొందచేసిన వారుకారు. అయితే పరబ్రహ్మమే గురువు గనుక పరబ్రహ్మ ప్రతిమానుష దేహములో ప్రతిఫలించేటట్టు నాదేహములోనున్ను ప్రతిఫలింపు చున్నాడు. గనుక నాయొక్క అంతర్యామిగా వుండే పరబ్రహ్మ యీ విషయములో నాకు ప్రత్యక్ష గురువయి, నాబుద్ది ద్వారా నాకు సందేహ నివృత్తి చేసిన క్రమ మేమంటే, క్రమమనిన్ని పరబ్రహ్మమనిన్ని రెండువస్తువులు శిశువును తల్లితండ్రులు పోషించేటట్టు అప్పటప్పటికి మనుష్యుణ్ని శిక్షించి రక్షింపు చున్నననిన్ని కర్మము సదా తల్లివలేనే శిశువు మంచి పనులుచేస్తే లాలించి చెడు పనులు చేస్తే శిక్షించినట్టు మహుష్యులు చేసిన శుభాశుభకర్మములకు తగ్గ ఫలమును సిద్దముగా క్రమము అనుభవింప చేయుచున్న దనిన్ని అయితే శిశువుకు తండ్రిగావుండేవాడు శిశువు చేసిన దుర్మార్గాన్ని గురించి తల్లి దండించి శిశుకు ఏడ్చేపాటి తాపత్రయము పుట్టినప్పుడు శిశువు తండ్రిని తలచి నాయనా అని పేరుపెట్టి తిల్లిచేసే శిక్ష తాళలేక నివృతిని పొందించమని యేడిస్తే యెట్లా తండై మంచిదిపో ఆ చేష్ట చేస్తే చేసినాడు; వాణ్ని కొట్టక తిట్టక వానికి పాలు నెయ్యి అన్నమున్ను పెట్టుము, ఇకను అట్లా చేయడని ఎట్లా తల్లి చేయతలచిన శిక్షను పూర్తిగాకుండా శిశువును విడిపిస్తాడో తద్ద్వత్తుగా మనుష్యులు దుష్కర్మము చేసినా దుష్కర్మ ఫలానుభవము వచ్చినపుడు ఈశ్వరుని గురించి భజనచేసి ఈశ్వరప్రీతి సంపాదకములయిన పనులు చేసి నట్తయితే తల్లిచేత శిక్షింపబడిచు నుండే శిశువును తండ్రి విడిపించినట్టు మనుష్యుని ధుష్కర్మ ఫలానుభవములో నుంచి యీశ్వరుడు సిద్ధముగా విడిపించగలడు. అయితే కొన్ని వేళలలో దుష్కర్మ ఫలానుభవము వచ్చినప్పుడు యెంత ఈశ్వరభజన చేసినా ఈశ్వరప్రీతి సంపాదకము లయిన జపహోమసురార్చనాదులు అనేకములు చేసినా దుష్కర్మ ఫలానుభల్వమే ఘటిస్తున్న దే అది యేమి? అని శంక తోచును. దానికి సమాధాన మేమంటే శిశువు ఏనుగుల వీరాస్వామయ్య గారి

చెడు చేష్టలే విస్తారముగా చేస్తూ వచ్చినా వాటి నంతా ఆ శిశువు నటింఛే కొన్ని మంచి నడతలవల్ల మన్నించి బుజ్జగిస్తూ వచ్చిన్ని చెడు చేష్టలు యెక్కువయి తల్లి శిశువును దండించ తలచి దండించే రెండు మూడు తరుణాలలో తండ్రి విడిపించి యుండాగా మళ్ళిన్ని శిశువు చెడు చేష్ట మానక తల్లిచేత శిక్షింపబడుచు నుండగా తండ్రిని తలచి యేడ్చినట్టయితే యెట్లా తండ్రి మన కెక్కడి జోలి? యీ శిశువును కాపాడవలసిన భారము తల్లిదేను; మన మెంత సేపు ఈ శిశువును తల్లి దండనకు లోబడకుండా కాపాడగలము; తల్లి తెలియక దండించునా? ఇట్లా మనము దండనకు లోబడకుండా విడిపిస్తే శిశువు మరిన్ని మకురు బట్టిచేడిపోను; తల్లికి శిశువుకున్ను బంధ మెక్కువ; మనము తల్లికి యజమానుడయినా శిశువుకు సన్నిహిత బంధురాలు తల్లిగాని మనముగాము; యీ వుభయుల దు:ఖము ఎన్నడికిన్ని యిట్లా వుండేదేను; శిశువుకు బుద్ధి వచ్చేటందుకే తల్లిదండిస్తున్నది; మంచిపనే; యీ శిశువు ప్రతి దినమున్ను పెట్టే మొర జోలికి మనము పోరాదని యెట్లా తండ్రి విరామమును పొందుతాడో తద్వత్తుగా పరబ్రహ్మదుష్కర్మ ఫలానుభవమును చేయుచునుండే మనుష్యుడు నిండా పాపి అయి కొన్ని ఆ వృత్తులు తన కృపవల్ల ఆ యశుభఫలానుభవము తేలికె చేయబడిన్ని మళ్ళీన్ని దుష్కర్మ పరంపరనే చేసి వుండి తత్ఫలితానుభవాలు వచ్చినప్పుడంతా యీశ్వరభజన చేసి ఈశ్వరకటాక్ష సంపాదకము లయిన పనులుచేసినా మనుష్యునికి నుత్తరోత్తర శ్రేయస్సు నిమిత్తమై దుష్కర్మఫలమే అనుభవానికి వఛ్ఛేటట్టు అవుచున్నది. గనుక 'అవశ్యమనుభోక్తవ్య ' మనే వచనము సత్యమే, 'కోటయో పరబ్రహ్మహత్యానా మిత్యాద ' వచనాలున్ను సత్యములేగాని ఒకటికి ఒకటి విరుద్ధముగాదు.

చెన్నపట్టణములో నేను వుండగా కొందరు ఫరంగివాండ్లతో మతానుసారము లయిన మాటలు మాట్లాడుచు నుండగా యిదే రీతిగానే డిష్టయిని (Destiny) అనే విధి బలమయినప్పుడు ఈశ్వర కటాక్షమేమి పనికి వస్తున్నదని ప్రస్తాపము వచెను. అప్పుడు నాకు తోచిన బుద్ధిప్రకారము నేను సమర్ధించిన వయిన మేమంటె డిష్టయిని అనేవిధిని మదరాసు సూప్రీంకోర్టుగా భావించ వలసిన దనిన్ని యీశ్వరుని సీమరాజుగా భావించ వలసిన దనిన్ని; యెట్లా సీమరాజుయొక్క ఆజ్ఞవల్ల లోకులుచేసే తప్పుకు సూప్రీంకోర్టు వారు తూకు(ఉరి) తీయగలరో తద్వత్తుల్గా డిష్టయిని అనేవిధి కర్మఫలానుభవమునిచ్చినా సీమ రాజుతో రూపురూపుగా చెన్నపట్టణములోనుంచి యెవరికయినా జాబులు నడుస్తూ వుండేపాటి విహితముండి తనకు తూకున తీసేటట్టు సుప్రీం కోర్టువల్ల కలిగిన ఆజ్ఞకు సీమ రాజుమన్నన నిమిత్తమై వ్రాసి పంపించి తెప్పించుకో గలిగితే యెట్లా సుప్రీంకోర్టు యొక్క దండన తప్పిపోవచ్చునో, అట్లా డిష్టయిని అనేవిధి యీశ్వరకటాక్షము ముందర నిలవనేరదని చెప్పి సమాధానపెట్టినాను. ఈయుక్తులచేత శిశువు చేసిన తప్పుచేష్టలకు తగినదండన చేస్తూవుండే కోపముగల తల్లికన్నా దూరముగా నుండిన్ని శిశువుచేసిన చేష్టలనున్ను అందుకు తల్లిచేసే దండననున్ను చూస్తూవుండే తండ్రై నిండా దయాళువు గనుకనున్ను తల్లి శిశువుల కిద్దరికిన్ని తండ్రి స్వామిగనుకనున్ను తండ్రియెడలనే శిశువు నిండా భయభక్తులతొ నడుచుకొంటే అది యెట్లా క్షేమకరమో తద్వత్తుగానే మనుష్యులు కర్మములు చేసుటకన్నా భక్తిపారంగతులు కావడమే మంచిది. యీ న్యాయమును పట్టేవిశిష్టాద్వైతులు 'సర్వధర్మాస్పరిత్యజ్య ' అనేవాక్యాన్ని పాటించిన వారివలె అభినయిస్తారు. అయితే తల్లి తండ్రికన్నా ఎక్కువగా యెప్పుడున్ను శిశువుతొ కిందను మీదను పడుచున్న పోషిస్తు న్నుండేది గనుక మంచి పనులుచేసి మంచిమాటలాడి నప్పుడంతా అతి త్వరగా మనస్సు కరిగి శిశువును తన చేతనయినంత మట్టుకు ఉత్సాహపరచడమే కాకుండా తండ్రికి ఫలానికి మంచిపని శిశువు చేసినాడు, ఫలాని మంచిమాటను ఆడినాడని తెలియచేసి యెట్లా తండ్రియొక్క మన్ననకూడా శిశువుకు సంపాదించి యిసుస్తున్నదో, తద్వత్తుగా మనుష్యులు చేసే శుభకర్మాలు ఈశ్వరకటాక్షాన్ని కూడా సంపాదించి యిస్తున్నది, యెట్లా శిశువు పెద్దవాడయ్యేదాకా శిశువు తల్లి యొక్క అనుసరణ మన్ననలు అగత్యమో తద్వత్తుగా మనుష్యుడు జ్ఞానముచచ్చే పర్యంతము కర్మబద్ధుడయి మంచి కర్మలు చేస్తూ తద్ద్వారా యీశ్వరకటాక్షాన్ని సంపాదించుకొనుచు జ్ఞానము పుట్టిన ఏనుగుల వీరస్వామయ్యగారి

వెనుక కూడా తానుగా కర్మలను విడవకుండా జ్ఞానప్రకాశముచేత అక్రమములు తన్ను వదిలిపోయ్యేటట్టు నటింపవలసినదని దోచబడు చున్నది.

ఈ రీమారాజు పారంపర్యముగా యీ రాజ్యమును యేలుచున్నాడు. ఇతడు బగ్గెలు అనే క్షత్రియజాతి. యీరాజు పేరు జయశింగదేవు. ఇతనికి ముగ్గురు కుమాళ్ళు, వారు విశ్వనాధశింగు, లక్షమణసింగు, బలభద్రశింగు అనే పేళ్ళుగలవారు. యీముగ్గురుకిన్ని రాజ్యము పంచిపెట్టి జ్యేష్టుణ్ణి తనకు బదులుగా పట్టాభిషేకము చేసి వుంచి యిప్పటికిన్ని తండ్రి సుఖముగా వున్నాడు. సంవత్సరము 1 కి పదిలక్షల రూపాయల యెత్తే రాజ్యము వీరికి కలిగియున్నది. యీ రాజు కుంఫిణీ వారిని నిండా లక్ష్యపెట్టడములేదు. యధోచితమయిన స్వతంత్రదశనుపొంది నటింపుచున్నాడు. కొన్ని కాలాలలొ దేవబ్రాంహ్మణపూజ బాగా చేస్తాడు. ఈ వూరిలో ఈ రాత్రి డేరాలలొ వశించినాను.

23 తేది ఉదయాన 4 ఘంటలకు లేచి యిక్కడికి 8 కొసుల దూరములోవుండే రాయపూవు అనే వూరు 9 ఘంటలకు చేరినాను. దారి సడక్కు వేసినారనే పేరేగాని వేయనట్టే వున్నది. వుమరియనే వూరి పర్యంతము జబ్బల్ పూరు దారి విచారణకర్త అయిన కేపన్ నిక్కిల్సిన్ విచారణ అయినందున దారి యొక తీరుగా కాపాడపడి వున్నది. వుమరికి యివతల మిరిజాపూరు దారి విచారణకర్త కేపన్ ద్రమ్మన్ విచారణగనుక దారి విచారణ బహు తక్కువగావుండేటట్టు అగుపడుచున్నది. భాటకు యిరుపక్కలా చెట్లుకూడా పెట్టినట్టు అగుపడలేదు. భూమి యెర్రరేగడ గనుక యెండివుండేచోట గుచ్చుకొనుచున్నది. మైహరు మొదలుగా భూమి బాగా పచ్చికబట్టి వుండలేదు. పయిరున్ను వృద్ధికాకుండా వుండేటట్టు తోస్తున్నది. యీ రాయపూరు అనేవూరు గొప్పదేను. వూరిలో ఎక్కడ చూచినా మిట్టపల్లము, అడుసు కాలువలు మొదలయిన అపహ్యాములతో నిబిడీకృతముగా వున్నది. వూరిచుట్టూ నాలుగు తొటలు, పెద్దగుంటలు, చెరువులున్ను వున్నవి. సకలపదార్ధాలున్ను ముసాఫరులకు దొరుకును. అంగళ్ళు శానావున్నా వసతికావు గనుక దేరాలలో యీ దినమంతా వసించినాను. కాశీయూఅత్ర చరిత్ర

24 తేది ఉదయాన 4 ఘంటలకు లేచి యిక్కడికి 5 కోసుల దూరములోవుండే సత్తిని అనేవూరు 10 ఘంటలకు చేరినాను. మధ్యనున్న యూళ్ళు; నెం - 16 - మనగాం - 1 - సత్తిని -1.దారినిన్నటివలెనే అనుకూలముగా వుండలేదు. కొండల యడివి కొన్ని దినములుగా ఉపద్రవపెట్టడములేదు. యీ దినము 10 వాగులదాకా దాటినాను. ఆవాగులుదిగి యెక్కడానికి వయిపుగా (వీలుగా) రాళ్ళతో కట్టివుండలేదు. దారిలో మనగాం అనే వూరికి సమీపముగా ఒక వాగువద్ద ఒక మనిషిని చంపి పడవేసివున్నది. నాతోకూడా వచ్చే తపాలు మనుష్యులు కుంఫిణీ వారి యాజ్ఞ యీప్రాంతములలో కలిగిన వెనుక సడక్కమీద యిట్లా ఘాతలు నడవలేదు. యిప్పు డేమో ఆరంభ మయినదని వ్యసనపడు కొన్నారు. రీమాలో ఒక మనిషి జబ్బల్ పూరు యెజంటు రీమా అకుబర్లు (సమాచారములు) వ్రాస్తూ మిరిజాపురము వరకు తపాలు హరకారాల విచారణకూడా చేస్తూవున్నాడు. అతనితో స్నేహము చేసుకొని మిరిజాపురము దాకా తపాలు మనుష్యులు కూడావచ్చేటట్టు చేసుకొన్నాను. యీ వూరిలో ఈ రాత్రి పగలున్నూ వసించడ మయినది. అన్ని పదార్ధాలు దొరికినవి. చిన్న వూరు. జలవసతి కద్దు. గుంటగట్టున డేరాలు ఫేయించినాను.

25 తేది ఉదయాన 4 ఘంటలకు లేచి యిక్కడికి 4 కోసుల దూరములో వుండే మౌగంజు అనె వూరు 9 ఘంటలకు చేరినాను. మధ్యనున్న ఊళ్ళు నెం.17. లవరుటిలావు 1- మాగంజు -1-దారి నిన్నటివలెనే వున్నది. శిలానాలా అనే వాగు ఒకటి దాటవలసినది. యింకా కొన్ని వాగులు దాటవలెను. శిలానాలా మొదలుగా శాలగా దారికి యిరుపక్కల కొన్ని చెట్లు పెట్టి వున్నవి. నిన్నటి మజిలీ మొదలుగా భూమి చెన్నపట్టణము చుట్టూవుండే భూమివలెనే కలిమెడుచల్లితే తూమెడు పండే పాటి చవుడు కలిసిన రేగడగా వున్నది. అందుకు తగ్గట్టే యీ భూమి నివాసస్థులు పందిళ్ళు చెక్కిళ్ళు చిక్కి స్వల్పగాత్రులుయి వున్నారు. యీ మౌగంజు అనే వూరు మౌగంజు రాజు రాజధాని. యిప్పటి రాజు పేరు అనిరుద్ధసింగు. సెంగెరు అనే ఏనుగుల వీరాస్వామయ్య గారి

క్షత్రియజాతి. వీని రాజ్యము సాలుకు లక్షరూపాయలు యెత్తేది. యితడు రీమారాజుకు సాలుకు 17500 రూపాయిలు కట్టేవాడు. కొన్ని సంవత్సరముల రూకలు కట్టకపోయి బలహీనుడయి నందున రీమారాజు మూడు సంవత్సరములుగా రాజ్యము జప్తు చేసికొని దినానికి 4 రూపాయలు లెక్క యీరాజుకు బత్యఖరుచుకు యిస్తూ వున్నాడు. ఈ వూరు బస్తీ అయినది గనుక సకల పదార్ధాలు దొరుకును. జలవసతి గలది గనుక సుందరమయిన తామరకొలను వొడ్డున డేరాలు వేయించి దిగి యీ రాత్రి పగలున్ను యిక్కడ వసించినాను.

తొమ్మిదవ ప్రకరణము

26 తేది ఉదయాన 4 ఘంటలకు లేచి యిక్కడికి 6 కోసుల దూరములో వుండే హనుమాన్యా అనేవూరు 10 ఘంటలకు చేరినాను. మధ్య నున్న ఊళ్ళు: నెం.18. పటహారా 1.చావోరా 1. కటుకరి 1 - బిజాలి 1-గురుమానది 1. దారి నిన్నటివలెనే సడక్కువేసిన దని పేరు పెట్టుకొని వున్నా యెరుపుదాతు రేగడకలది గనుక మనుష్యులకు నడవడములో కాళ్ళు నిండా గుచ్చుకోలేదు. కొన్ని తావులలో వాగులకు కాలువలకున్ను వారధులు కట్టినారు, గాని మన్నువేసి శాలతో వాటిని సమయముచేసిన వారుకారు. వరిపంట భూమి నిన్నటివలె సారవత్తయినది కాదని తొస్తున్నది. దారిలో వుండే కటుకరి అనెవూరు నిండా బస్తీ అయినది. సకల పదార్దాలున్ను దొరుకును. నేను దిగిన హనుమాన్యా అనే మజిలీ వూరు చిన్నదయినా దుకాణాలు విశాలముగా వున్నవి. డేరాలు వేసి తీసే ప్రయాస లేకుండా వుండును గనుకనున్ను, చెరువుగుంటలు వసతి అయినవి లేనందుననున్ను, దుకాణాలలోనే దిగినాను. డాకు చౌకీ హరకారాల కుమ్మక్కువల్ల అన్ని పదార్దాలున్ను దొరికినవి.

మైహరు మొదలుగా నేనుమజిలీ చేసె ప్రతివూళ్ళోనున్ను జ్వరాలతో శానామంది హింసపడు చునున్నారు. నాసోబతు కోరి వచ్చేవారికి అదే గతిగా వున్నది. నా పరివారజనము సుమారు నూరుమంది. వీరిలో