Jump to content

కాశీయాత్ర చరిత్ర/తొమ్మిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

ఏనుగుల వీరాస్వామయ్య గారి

క్షత్రియజాతి. వీని రాజ్యము సాలుకు లక్షరూపాయలు యెత్తేది. యితడు రీమారాజుకు సాలుకు 17500 రూపాయిలు కట్టేవాడు. కొన్ని సంవత్సరముల రూకలు కట్టకపోయి బలహీనుడయి నందున రీమారాజు మూడు సంవత్సరములుగా రాజ్యము జప్తు చేసికొని దినానికి 4 రూపాయలు లెక్క యీరాజుకు బత్యఖరుచుకు యిస్తూ వున్నాడు. ఈ వూరు బస్తీ అయినది గనుక సకల పదార్ధాలు దొరుకును. జలవసతి గలది గనుక సుందరమయిన తామరకొలను వొడ్డున డేరాలు వేయించి దిగి యీ రాత్రి పగలున్ను యిక్కడ వసించినాను.

తొమ్మిదవ ప్రకరణము

26 తేది ఉదయాన 4 ఘంటలకు లేచి యిక్కడికి 6 కోసుల దూరములో వుండే హనుమాన్యా అనేవూరు 10 ఘంటలకు చేరినాను. మధ్య నున్న ఊళ్ళు: నెం.18. పటహారా 1.చావోరా 1. కటుకరి 1 - బిజాలి 1-గురుమానది 1. దారి నిన్నటివలెనే సడక్కువేసిన దని పేరు పెట్టుకొని వున్నా యెరుపుదాతు రేగడకలది గనుక మనుష్యులకు నడవడములో కాళ్ళు నిండా గుచ్చుకోలేదు. కొన్ని తావులలో వాగులకు కాలువలకున్ను వారధులు కట్టినారు, గాని మన్నువేసి శాలతో వాటిని సమయముచేసిన వారుకారు. వరిపంట భూమి నిన్నటివలె సారవత్తయినది కాదని తొస్తున్నది. దారిలో వుండే కటుకరి అనెవూరు నిండా బస్తీ అయినది. సకల పదార్దాలున్ను దొరుకును. నేను దిగిన హనుమాన్యా అనే మజిలీ వూరు చిన్నదయినా దుకాణాలు విశాలముగా వున్నవి. డేరాలు వేసి తీసే ప్రయాస లేకుండా వుండును గనుకనున్ను, చెరువుగుంటలు వసతి అయినవి లేనందుననున్ను, దుకాణాలలోనే దిగినాను. డాకు చౌకీ హరకారాల కుమ్మక్కువల్ల అన్ని పదార్దాలున్ను దొరికినవి.

మైహరు మొదలుగా నేనుమజిలీ చేసె ప్రతివూళ్ళోనున్ను జ్వరాలతో శానామంది హింసపడు చునున్నారు. నాసోబతు కోరి వచ్చేవారికి అదే గతిగా వున్నది. నా పరివారజనము సుమారు నూరుమంది. వీరిలో కాశీయాత్ర చరిత్ర

15 మందికి జ్వరాలు తగిలి ప్రతిదినమున్ను మజిలీ చెసిన వనక ఆసుపత్రిలో డాక్టరులు వరుసగా చికిత్స చేస్తూవచ్చేటట్టు నాడేరాలవద్ద వీరి కందరికిని చికిత్స జరుగు వచ్చినది. యిదివరకు శ్రీరామకటాక్షముచేత అందరికి అనుకూలముగానే ఉన్నది. యీ వూరిలో యీ రాత్రి పగలున్నూ వసించడమయినది.

యింతకుముందు నేను మజిలీ చేసిన సత్తిని అనేగ్రామమువద్ద నుంచి ప్రయాగకు సూతియయినదిగా నాల్గుమజిలీలతో చేరతగ్గదిగా ఒక దారి వున్నది. ఆ దారి అడ్సున్ను కొండ యెక్కుడు దిగుడు ప్రయాసయున్ను కలది. చెన్నపట్టణము వదిలి పెదపాళెమురాగానే ఒక గయావళీ కలుసుకొనెను. వానిని విదిలించుకోను బహుకష్టమైనది. అలాగే ఒక గయావళి తిరువళ్ళూరిలో కలిసి వదిలినాడు. కడపలో ఒక గయావళి తగిలి హయిదరాబాదు దాకా చెంగి చెంగి కూడావచ్చి వదిలి పోయినాడు. నాగపూరులో కొందరు తగిలి చేరనేరక వదిలినారు. రామటెంకిలో ఒక గంగాపుత్రుడు జబ్బల్ పూరులో యిద్దరు ప్రయాగ వాళీలును యిద్దరు కాశీ రాణీ తెనుగు బ్ర్రాంహ్మణులున్నూ తగిలి నా వద్ద చేరడము ప్రయాస అయినా మజిలీ మరు మజిలీగా నాతోకూడా వస్తున్నారు. యీరాత్రి పగలున్ను ఈ వూరిలో వసించినాను.

27 తేది 8 ఘంటలవరకు పయిమజిలీ వూరిలోనే వుండి ఆవూళ్ళో యింటింట చలిజ్వరాలతో మనుష్యులు బాధపడుతారని తెలిసినందున యెండను లక్ష్యపెట్టకుండా బయలుదేరి యిక్కడికి 7 కోసుల దూరములో నుండే కట్రా అనిన్ని ద్రమ్మర్ గంజు అనిన్ని ద్వినామమయిన వూరు 1 ఘంటకు చేరినాను. హనుమాన్యా విడిచి నది మొదలుగా కట్రా అనేవూరు చేరేవరకు కొండ కొంచెముగా యెక్కి నిండా దిగుతూ రావలసినది. యీ దినము దారి యావత్తు కొందమీద అడివిమధ్యే నడుస్తూ రావలసినది. మృగభయము విస్తారము గనుక కూడావున్న తుపాకీలను నా జవానులు కాలుస్తూ వచ్చినారు. ఆధ్వనికి వృక్షాలుకూడా అదురునుగనుక మృగభయము మాకు యేమాత్రమున్ను లేక వుండినది. పూర్వకాలమందు ఈహనుమాన్యూవూరినుంచి కట్రా అనే వూరికి రావడానికి మనుష్యులు ఏనుగుల వీరాస్వామయ్యగారి

కష్టపడి నడిచేపాటిగా ఆకొండలమధ్యే ఒక చిన్నదారి వుండినది. యీ రాజ్యములో యింగిలీషువారి అధికార మయిన వెనక యీ కొండను కొట్టి దారియేర్పరచి యేడుతిరుగుళ్ళుగా దిగడానికి యెక్కడానికిన్ని దారియేర్పరచి యేడుగుళ్ళుగా దిగడానికి యెక్క దానికిన్ని బండ్లకు కూడా ప్రయాసలేకుండా వుండేటట్టు చేసి నారు. యీదినము నడిచినదారి రాతిగొట్టు వొకటే ప్రయాస గాని కడమ అన్ని విధాల అనుకూలముగా నున్నది. నేడు నడిచిన 7 కోసులమధ్యె ఉదక వసతి యే మాత్రమున్నులేదు. తపాలు మనుష్యులుకూడా వేసంగి కాలములో ఉదకము కూడా తీసుకొని వస్తూ పోతూవుంటారు. కొందరు ముసాఫరులు వేసంగి కాలములో దారిలో ఉదకము దొరక నందున దాహమును వొర్చుకొనలేక ప్రాణములు వదిలి నారట. గనుక యీ యేడు కోసులున్ను చల్లనివేళ నడవ వలెను. యీవూరు కొత్తగా బస్తీ అయినది. అంగళ్ళు మొదలయినవి వసతిగా కట్టివున్నవి. దగ్గిర ఒక నదివున్నది; బావులుకలవు. పశువులు మొదలయినవి నిలాడానికి వూరిముందర ఒక మర్రి చెట్టు తప్ప వేరే ఆసరాలేదు. ముసాఫరులకు కావలసిన పదార్ధాలు దొరుకును. యిక్కడ మరునాడు మధ్యాహ్న పర్యంతము నిలిచినాను.

28 తేది మధ్యాహ్నము మీద రెండు ఘంటలకు యీవూరు వదిలి యిక్కడికి 7 కోసుల దూరములో నుండే బాలుగంజు అనేవూరు రాత్రి 7 ఘంటలకు చేరినాను. దారిలో మూడునదులు దాటవలెను. వాటికి వారధులు కట్టడానికి కుంఫిణీవారు యత్నపడు చునున్నారు. సడక్కువేసి యున్నదని పేరేగాని నడిచేవారికి అనుకూలముగా ఘట్టన చేసి యుండలేదు. దారి మయిదానము మధ్యే పోవుచున్నది. దారిలో బరోడా అనెవూరున్ను మరికొన్నిచిన్నవూళ్ళున్ను వున్నవి. యీ లాలుగంజిలో డాకా అనే దొంగసమూహల భయముచేత కుంఫిణీవారు ముసాఫరులను దుకాణాలలో, ఇతరస్థళాలలోనున్ను రాత్రి దిగకుండా చేసి సరాయి అనే ఒక పెద్దచాడి నాల్గు పక్కలా ప్రహరీగోడ పెట్టి ఆగోడ ఆసరాచేసి చుట్టూ కొట్టాయి వేసి ఆ కొట్టాయిని అర లరలుగా వుంచి రెండు దరవాజాలు పెట్టి, కావలికి 25 ఠాణాజవానులను వుంచినారు. రాత్రి 10 ఘంటలకు ఈ సరాయి తలుపులు బిగించి, బీగాలు కాశీయాత్ర చరిత్ర

వేస్తారు. వెలుతుర అయ్యెదాక సామాన్యుల నిమిత్తము తలుపులు తెరవరు. ఈలోగా లోపలనుండే మనుష్యులకు దేహబాధ శానాగా వుంటున్నది. యీ వూరిలో సకల పదార్ధాలు దొరుకును బస్తీ అయినదేను. యీరాత్రి యీ సరాయిలోనే వసించినాను.

26 తేదు ఉదయాన 6 ఘంటలకు లేచి యిక్కడికి 6 కోసుల దూరములోవుండే మిరిజాపూరు అనే గంగగట్టు షహరు 12 ఘంటలకు ప్రవేశించి గంగా దర్శనము చేసి ఆనందించినాము. పరమాత్ముడు గంగానదిలో విస్తరించిన దీప్తితో ప్రతిఫలించి అనేక కోటి జనుల పాపములను వారి భక్తి ద్వారా పరిహరించి వారలను పావనులుగా జేసి యిష్టసిద్ధుల జేయుచున్నాడు. గనుక ఆమహానదీ దర్శనాపేక్షతులయి వచ్చిన మాకు ఆ గంగాదర్శనము కావడములో వున్న తృప్తి వ్రాసితీరదు. నేటి దారి శానాదూరము రాతి పొరగనుక వేసిన సడకు చెదరకుండా పాంధులకు హితముగా వున్నది. కట్రా వద్ద కొండ దిగినట్టుగా యీ దినమున్ను ఒక చిన్న కొండ దిగవలసినది. ఆ కొండ దిగుడు బహు వయిపుగా కుంఫిణీవారు బండ్లు కూడా చులకనగా దిగేటట్టు కొండ దారి చేసినారు. ఇది వింధ్యపర్వతము నుంచి దిగడమని తెలుసుకోవలసినది. దారిలో భగవ్రాతలావు, తులసీతలావు అనే చిన్న వూళ్ళూ కొన్ని వున్నవి. దారి వెల్లడి గాని అడివిలేదు. ఆ కొండ యేమి కట్రావద్ద కొండ యేమి దిగేటప్పుడు కిందవుండే భూమిని మీదినుంచి చూస్తే వుండే శృంగారము అనుఃభవవేద్యము కాని వ్ర్రాయశక్యము కాదు. దారిలో నాల్గు నదులు దాటవలెను. మయిహరు మొదలుగా దాటే నదులు పశ్చిమ వాహినులుగా కొన్ని ప్రవహిస్తూ వున్నవి.

యీ మిరిజాపూరు అనే వూరు గొప్ప షహరు. చెన్నపట్టణము వలెనే వీధులు తీర్చబడి అంగళ్ళు యిండ్లు మొదలయినవి బహు సుందరముగా నున్ను, వున్నతముగా నున్ను, కట్టబడి యున్నవి. యీ హిందూస్తాని కంతా యిక్కడి పాత్రసామాగ్రీలు ప్రసిద్ధమయినది. ఘనుక పాత్రసామానుచేసే కంచరవాండ్లు వెయుకడపదాకా అహోరాత్రిళ్ళు యీ వూళ్ళో పని చేస్తూవుంటారు. ఏనుగుల వీరాస్వామయ్య గారి

గంగగుండా అనేక సరకులు కలకత్తా ఢిల్లీ మొదలయిన స్థల ములకు పోతూ వస్తూవుంచున్నవి గనుక ఒంటి కంభం పెద్ద పడవలు చిన్నపడవలున్ను సుమారు 200 వురువులు సదా యీ మిరిజాపురము ఘాటున నిలిచివుంటున్నవి. యక్కడి గంగలో నాల్గు స్నానఘట్టాలు బహుసుందరములుగా కట్టివున్నవి. యీ స్నాన ఘట్టాలలో యీ దేశపు బ్రాహ్మణులు ఘాటు వారనేవారు పందిళ్ళు వేసుకొని స్నానము చేయవచ్చే వారికి సంకల్పము చెప్పి వారి వస్త్రములను కాపాడి, వారు వారు లలాటమందు వుంచుకోల్వడానికి గోపీచందనము స్త్రీలకు సింధూరము మొదలయినవి జాగ్రత్తచేసుకొని కూర్చుండి వుంటారు. యీ దేశస్థులు స్త్రీలు పురుషులున్ను స్నానముచేసి కాగానే మడుగుకు తెచ్చిన వస్త్రముమీద గంగ ప్రోక్షించి లలాట రేఖలు వుంచుకొని ఆఘాటు బ్రాహ్మణుల చేతిలో తాము చేసిన పాపమంతా యిచ్చి వేసినట్తు ఒకదుడ్డు ఒకర్భ పవిత్రముతో కూడా ధారపోస్తారు. ప్రతి దినమున్ను శిరస్నానము చేయని ప్రాణి యీ షహరులో వున్నట్టు నాకు తోచలేదు. బందేఖానాలోవుండే ఖయిదీలుకూడా బంట్రౌతుల కావలితొ వుదయానవచ్చి స్నానము చేసి ఒక గుంపుగా వెళ్ళి పోతారు. విటులుగావుండే స్త్రీలు పురుషులున్ను యెట్లా దేవాలయాలు ప్రబలించి వుండే ద్రావిడదేశములొ దేవాలయాల ఉత్సవ విభనాల సాకుపెట్టుకొని వారి వారికి కలిగిన అలంకారములతో బయట వస్తారో తద్వత్తుగా గంగా స్నాన వ్యాజము పెట్టుకొని యిక్కడి విటులు వుదయాన అగత్యముగా జమ అవుతూ వచ్చుచున్నారు.

ఈ ప్రాంతౌలో స్థలమును శుద్ది చేయవలిస్తే గంగాజలమునే ప్రోక్షించుచున్నాదు. గోమయమును ఆపేక్షింపరు. గంగాజలమును యే జాతి మనిషిచేతనున్నా పరిశుద్ధమని గ్రహింపుచున్నారు. ఇతర జలమును మాత్రము అలాగు గ్రహించరు. ద్ర్రావిడదేశములో మడుగు వస్త్రములను మడి సంచులలో దర్భాసనములలోనున్ను పెట్టుకొని వస్తే పవిత్రము లనుకొని స్నాననంతరము యేలాగు యెత్తి కట్టుచున్నారో అలాగే యిచ్చటివారు మడుగు వస్త్రములను కాశీయాత్ర చరిత్ర

చేతపట్తుకొని వచ్చి గట్టునవుంచి స్నానముచేసి తడిగుడ్డతో ఆ వస్త్రముమీద గంగను ప్రొక్షించి యెత్తి కట్టుకొనుచున్నారు. ద్రావిడ దేశస్థులకు గంగ పరమపావని యనే భక్తికలిగి యున్నా మడిసంచిలో మడుగువస్త్రమును వుంచుకోవలెనన్న బుద్ధి పుట్టుచున్నది. గాని యీ దేశస్థులవలె చేతపట్టుకొని పోయి గంగాజలముచేత పవిత్ర పరచే నమ్మికె పట్తుబడినది కాదు. మరిన్ని ద్రవిడదేశాములో మడుగు వస్త్రమును ఒక కొయ్యతొ యెత్తుకొనివచ్చి నా తాడుకు కట్టి ఆతాడు కొన పట్తుకొనివచ్చినా అది మడుగనే నమ్మికె కలిగి యున్నది. యీ దేశాచార భేదములను చూచి యోచించగా ఈ నియమాలంతా మనోబంధకాలేగాని వేరేగాదని రూఢిగా తోచుచు వచ్చుచున్నవి.

ఇది మొదలు కుంఫిణీవారి రాజ్యము గనక రహదారిలేక ఆయుధాలు పట్టనియ్యరు. ఇక్కడికి కాశి 22 కోసులు; వింధ్యవాసినీ స్థలము 2 కోసులు. ఇక్కడ గంగాదర్శనమయి నందున క్షౌరము తీర్థోపవాసము హిరణ్యశ్రాద్ధము మొదలయిన పితృక్రియలు చేసినాను. ఈషహరులో అన్నివిధాల పనివాండ్లున్ను వున్నారు. అన్ని పదార్ధాలున్ను దొరుకును. నాపరిజనానికి చింతపండు మిరపకాయ మొదలయిన ద్రవిడదేశపు వస్తువులు కూడా సమృద్ధిగా గొరికినవి. అరిటి చెట్లుమాత్రము ఈప్రాంతములలో లేవు. యింగిలీషు దొరలు గంగగట్టున యిండ్లుకట్టుకొని యున్నారు. ఈ షహరు చెన్నపట్టణమంత వుండునని తోచుసున్నది. ఇక్కడి తమలపాకులు రామటెంకి తమలపాకులకంటే బాగావున్నవి. నాపరిజనులకు జ్వరమువాశి అయ్యె దాకా ఇక్కడ వుండి ప్రతిదినమున్ను గంగాస్నానము చేయుచువచ్చినాను. నర్మదానదికి ఇవతల పున్నమిపోయిన పాడ్యమి మొదలుగా మాస ప్రవేశము గనుక ఇక్కడ నిన్న మొదలు కార్తిక మాసారంభమమయినది. కృత్తికాస్నానాలు గంగలో ముఖ్యము గనుక జగదీశ్వరుడు నాకు గంగలో ఆ స్నానాలు కలిగేలాగు కటాక్షించినాడు.

26 తేది మొదలు అకుటోబరు 7 డో తేదివరము మిరిజాపురములో నివాసముచేసినాను. కూడావఛ్ఛిన పరిజనులలొ 20 కి చలి ఏల్నుగుల వీరాస్వామయ్య గారి

జ్వరాలు తగిలినందున పదిహేనుమందికి నేను యిచ్చిన వాంతిభేది వాంతిమందులతో నున్ను బ్యారుకుపొడి లింగకట్టు మాత్రలతోనున్ను వాశి అయినది. చెన్నపట్టణమునుంచి కూడా వచ్చిన యొక కావటివాడు మాత్రము గంగతీరమందు దేహము చాలించినాడు. ఇంతకు లోగడ హైదరాబాదు దాటిన వెనక ఒక బంట్రౌతు వాంతి భేదుల ఉపద్రవము అకస్మాత్తుగా తగిలి నావద్ద ఔషధాలు సేవించను అవకాశము చిక్కక చనిపోయినాడు. ఇప్పటికి నలుగురికి మాత్రము తేలికెగా చలిజ్వరములు తగులుచుండుటచేత వారినికూడా నడిపించుకొని 9 వ తేది ఉదయమైన 8 ఘంటలకు బయలువెళ్ళీ యిక్కడికి అధికారస్థులయిన గురుదాసుబాబు వగయిగాలతో కూడా యిక్కడికి 2 కోసుల దూరములో వుండే వింధ్యవాసిని అనే దేవిక్షేత్రము 10 ఘంటలకు చేరినాను.

మిరిజాపూరువూరి తోటలు మొదలయినవి దాటి వెలిపడాగానే గంగలోకలిసే నొక వాగు దాటవలసినది. ఆ వాగునీళ్ళు తీసి పోయునా రొంపివిస్తారము గనుక మోకాలుదాకా దిగబడుచు వుంటున్నది. అందువల్ల గంగలోనే పడయెక్కి ఆ వాగు అవతలిగట్తుట్టు చేరవలసినది. దారి సడక్కు లేకపోయినా నడవడానికి తోటలపెరండ్ల మధ్య నున్నది గనుక వైపుగావున్నది. రేగడభూమి.

వింధ్యవాసిని వూరు గొప్పదే. అయితే వీధులు బహు కుసంది మిట్టలు పల్లాలుగా వుంటున్నవి. యీ దేవిని పూజచేశేవారు పండ్యావాండ్లనే బ్ర్రహ్మణులు. ఇక్కడికి బ్రాహ్మణులు పంచగౌడులతో చేరినవారు. కన్యాకుబ్జు లనిన్ని, సర్వర్యులనిన్ని, గౌడులనిన్ని, సారస్వతులనిన్ని, మైధిలులన్ని, అయిదు తతెగలుగా నున్నారు. అందులో యీ పండ్యాలకు కన్యాకుబ్జులని పేరు. వీరే కనోజా లనబడుదురు. మన దేశములోను బ్రాహ్మణులు పంచ ద్రావిళ్ళ వయన మేమంటే ఆంధ్రులు, ద్ర్రావిళ్ళు, మహారాష్ట్రులు, కర్నాటకులు, ఘూర్జరులున్నని తెలిసేది. వీరి దేశవిభాగాలు తెలిసియున్నవిగదా, యీ అయిదు తెగల కాశీయాత్ర చరిత్ర

వారికి ఆచారవ్యవహారాలు భేదించి వుండేటట్టుగా యీ దేశపు పంచగౌడులకున్ను బేదించియున్నది.

యీ పండ్యాలలో యెవడు ముందర యాత్రవారిని కనుక్కుంటే వారికి యీ దేవీస్థలములో ముఖ్యాశ్రితులయి యాత్రవారు దేవీ విషయముగా యిచ్చే వస్త్రాభరణ దక్షిణలు మొదలయినవి యావత్తున్ను తీసుకొని అనుభవిస్తారు. గనుక నేను మిరిజాపురము చేరగానే నన్ను అనుసరించ వచ్చిన పండ్యాలను లెక్కపెట్టను శక్తి లేదనుకోవలసినిది. గురు దాసు బాబు పండ్యాను నేను నిష్కర్ష చేసుకొని యీ స్థలములోనుండే రామనగరపు రాజు వుదయ నారాయణన్ తోట బంగాళాలో దిగినాను. యీతొట సకల ఫల వృక్షాలతో శాలలు తీర్చబడి బహు సుందరముగా గంగాతీరమందున్నది. అందులో గంగవొడ్డుగా రమణీయమైన బంగాళా కట్టియున్నది. వంటకున్ను పరిజనానికిన్ని చుట్టూ ఆవరణాలు యేర్పరచియున్నవి.

యీ మహాస్థలములొ రెండు తామస మహోత్సవాలు చైత్రశుద్ధములోను, ఆశ్వీజ శుద్ధములోనున్ను, జరిగి అందుకు లక్షోపలక్ష ప్రజలు వస్తున్నారు. దేవి ప్రీతిగా బలియిచ్చే సన్నజీవాలు లెక్కపెట్టను ఒకరికిన్ని తరము కాదు కనుక ఆపది దినములలో సంహారమయ్యే జీవాలంతా ఒక మిరాశి దారుని చేతిగుండా సమాప్తి కావలసినది గనుక వానికి అజము 1 కి వచ్చే ఒక పయిసా రుసుము ప్రకారము దినానికి, 25-30 ఫరకుబాదు రూపాయిలు వస్తూ వుంటున్నవి. అనేకులు యీ స్థలములో పునశ్చరణచేసి యిష్ట సిద్దిని పొందినారు.

యీ స్థలములో మూడు శక్తులు వసిస్తున్నవి. వాటికి యోగమాయా, భోగమాయా, కాళీ, అనే పేళ్ళు కలిగియున్నవి. యీభోగమాయ ప్రతిదినము అయ్యే పూజా నైవేధ్యాలను మిక్కటముగా వూరికి సమీపమున వుండుకొని ప్రతిరహింపు చున్నది. అక్కడికి రెండుకోసుల దూరములో పర్వతముమీద యోగమాయా అనిన్ని, అష్టభుజీ అనిన్ని పేరుగలిగిన శక్తి వసించి యున్నది. అక్కడికి సమీపముగానే ఒక పక్క కాళి అనే శక్తి వసించి యున్నది. యీ బలిప్రదా ఏనుగుల వీరాస్వామయ్య గారి

నాలు యేమి వున్నా కాళీ సన్నిధానమందు జరిగిస్తారు. పునశ్చరణలు యోగమాయ సన్నిధానమందు చేస్తారు. రాజోపచార పూజలు భోగ మాయ ముందుగా జరుగుచున్నవి. గుడి చిన్నది గాని ప్రసిద్ధికి తగ్గ బాహుళ్యము గలది కాదు.

యీ స్థల మహాత్మ్య మేమంటే యశోదాగర్బజనిత యయిన యోగమాయ కంసునివలన తప్పిందుకొని యీ పర్వతముమీద వసింది పిమ్మట శ్రీకృష్ణమూర్తి చేత సంహరింప బడక నిలిచిన రాక్షసులను జంపుటకై దేవతల ప్రార్ధనచేత మహాకాళీరూపము ధరించి భూభారాన్ని మాంపి మళ్ళీ సాంబమూర్తి సన్నిధాన ప్రాప్తిని గురించిన ఆపేక్షచేత ఆ ఉగ్రస్వరూపము వదిలి భోగశక్తి అయినట్టు చెప్పుచున్నారు.

యీ వింధ్యవాసినీ మహాత్మ్య మేమంటే యిటీవలనే కాశిలోనుంచి ఒక పురుషుడు తెచ్చి ఈ స్థలములో ప్రసిద్ధి చేసినాడు; ఈ వింధ్యవాసినికి సమీపమందు రామగయ అనే ఒక ప్రదేశమున్నది. అక్కడ పిండప్రదానాలు ముఖ్య మనిన్ని, యీ వింధ్యవాసినీ క్షేత్రముయొక్క పంచక్రొశము ముక్తిప్రదమనిన్నీ, యీ స్థల పురాణప్రసిద్ధము. ఈ శక్తికి నా వంటి వారు ఆరాధన చేయించ వలసితే వస్త్రమున్ను అంగుళీయకమున్ను వెండి చిన్న మధుపర్క పాత్రయున్ను యివి మొదలయిన అగత్యముగా ఇయ్యవలసినవి. బ్ర్రాంహ్మణ భోజనము చేయించడమని ఒక సంప్రదాయము ఇక్కడ కలదు. అది యేలాగంటే మిఠాయి వాండ్లను పిలిచి కచ్చారసూయి అనే పూరీలు చేయించి దూదుఫేడాలు బరిఫీలు బత్తాసాలు తీసి ఈ పండ్యాబ్రాంహ్మణులకు ఆకులు వేసి వడ్డిస్తే మనము దిగివుండే తావుకువచ్చి తింటున్నారు. గట్టిపెరుగుకూడా వడ్దించవలసినది. మనిషికి ఒక కొత్త పిడత రాహము పుచ్చుకొవడానికి తీసి యివ్వవలసినది. నూటికి సుమారు 20 రూపాయిలు పట్టుచున్నది. భోజానంతరము ఒక పట్టి తాంబూలము రెండేసి అణాలు ఇస్తే ఆనందింపుచున్నారు.

ఈ దేవిని వారు తాకి పూజచేయవచ్చును గనుక నా కాశీయాత్ర చరిత్ర

పురోహితునిచేత మన దేశాచారప్రకారము స్త్రీ సూక్తప్రకారముగా యధోచితముగా షోడశోపచార పూజ చేయించి కుంకుమతోను, పుష్పాలతోనున్ను, అర్చన చేయించినాను. పూజాకాలమందు అయిన నామోచ్చారణలు బాగావున్నవని యిక్కడివారు ఆనందించినారు. ఆదేవీ నివేదనానికి గుడికి తీసుకపోయిన పదార్ధాలు మళ్ళీ బయటికి తేనియ్యరు. బ్రాంహ్మణభోజనాని కని చేయించే పదార్ధాలు విడిదిలోవుంచి మితముగా నివేదనార్ధమై గుడికి తీసుకపొవలసినది. యీవూరిలో బజారు వీధి వున్నది. సకల పదార్ధాలు దొరుకును. ఈ పండ్యాలు వెయ్యింటిదాకా వుంటారు. వీరుగాక యాచకులు అనేకులు గలరు. యీ మహాస్థలములో యీరాత్రి వసించినాను.

9 తేదీ ఉదయాన 5 ఘంటలకు లేచి యిక్కడికి 4 కోసుల దూరములో వుండే గోపీగంజు అనేవూరు 11 ఘంటలకు చేరినాను. వింధ్యవాసిని వూరిముందరనే గంగదాటవలసినది. దారికి సడక్కు లేదు; పాలరేగడిభూమి. అడుగడుగుకు వూళ్ళు కలవు. మెరికపయిరు భూమి. యిక్కడ గంగ దాటే తావున ఒక పెద్దవాగు గంగలోవచ్చికలుస్తున్నది. యీవాగు వొడ్దుగానే కొంతదూరము దాటిన వనక భాట పొవుచున్నది. యీ గొపీగంజు అనేవూరు రమనగరపు రాజుది. యీవూళ్ళో ముసాఫరులు దిగడానకు ఒక సరాయి కట్టియున్నది. యిదిగాక యీ రాజుకింది తాశ్శీలుదారుడు ఒక గుంటతవ్వి ఒక బంగాళా కట్టి దానిచుట్టూ సరాయిచట్టముగా అరలు కట్టినాడు. నేను అక్కడ దిగినాను. యిది మొదలుగా హిందూస్తాను తుదవరకు అక్క డక్కడ సరాయీలు కట్టి వున్నదట. ఆ సరాయీలకు తురకలేగాని యితరులు ఖావందులు కాకూడదట. అందుకు పాధుషా హుకుము వున్నదట! యీసారాయిలు కల తురకలు, దిగే మనుష్యులవద్ద వర్షాకాలములొ ఎక్కువగానున్ను, ఎండాకాలములొ తక్కువగానున్ను, మనిషికె సుమారు ఒకటి రెండు పయిసాలవంతున బాడిగె పుచ్చుకుంటారు. యీ సరాయీలు లాలుగంజులొ వుండే సరాయివలెనే కట్టియున్నవి. సర్కారుతరపున రాత్రిళ్ళు యిక్కడ యిద్దరేసి ఠాణావాండ్లు పారాయిస్తూ వుంటారు. యీ గోపీగంజు ఏనుగుల వీరాస్వామయ్యగారి

గొప్పవూరు. సకలపదార్ధాలు ముసాఫరులకు కావలసినవి దొరుకును.

యీవూరినుండి ఒక గుంటవద్ద నేను దిగినంతలో ఒక సమూహముగా స్త్రీలు పురుషులున్ను సుమారు యిన్నూటిదాకా ఒక చెట్టు నీడలొ నిశ్చబ్దముగా కూర్చుండి ఒక పురుషుణ్ణి సమూహముమధ్యే వున్నతాసనము మీద కూర్చుండబెట్టి వాడు చదివిచెప్పే అర్ధాన్ని వింటూ వున్నారు. ఏమని విచారించగా భాగవత గ్రంధ కాలక్షేపము జరిగేటట్టు తెలిసినది. యిదేప్రకారము మిరిజాపూరులోను జరిగేటట్టు వినివున్నాను. ఇంత సమూహములో ఒకరయినా యిన్ని పల్లకీల గుంపుతో వచ్చి నన్ను తిరిగి చూచినవారు కారు. తదేక ధ్యానముగా పురాణశ్రవణమే చేస్తూ వచ్చినారు. యింత యెండలో నియమముగా ఉపవాసముతో చిత్తాన్ని తదేకాగ్రముగా వుంచి భగవత్కధాశ్రవణము చేసే క్రమములో నిశ్చలమయిన మనస్సు కలవారికి ఉత్సవ విభవాలు జరిగే దేవాలయాలు భక్త్యాకర్షణ నిమిత్తమయి యేమిజరూరు? అందునుంచే శీతభూమిని నివసించే వారికి యధోచితమయిన చిత్తస్తాస్థ్యము కద్దని లోగడ నేను వ్రాసిన ప్రకారము, ఈదేశములొ ఉత్సవవిభవాలు జరిగే దేవాలయాలు విశేష ధనవ్రయాలుచేసి పూర్వీకులు కట్టినవారుకారు. తదనుసారముగా యిప్పటివారున్ను కట్ట నిచ్చయించిన వారు కారని తోచుదున్నది. యీవూళ్ళో యీరాత్రి పగలున్ను వసించడ మయినది.,

10 తేది ఉదయాత్పూర్వము 3 ఘంటలకు లేచి యిక్కడికి 6 కోసుల దూరములోవుండే అండ్యాసరాయి అనే వూరు 3 ఘంటలకు చేరినాను. దారి రమణీయమయిన సడక్కువేసి కాలువలకు పూలు(వంతెన) అనే వారధులు కట్తి మయిలుకు వకరాయి వంతున కుంఫిణీవారు రాళ్ళువేసినారు. గులక లేకపోయినా ఘట్టన బాగా పడివున్నది. యీ సడక్కు ప్రయాగకున్ను కాశికిన్ని వేసివున్నది. యీ గోపీగంజు మొదలు యిదే ప్రకారము కాశివరకు సడక్కువేసి వున్నదట. జబ్బల్ పూరు వదిలినవెనుక యెండలు కొంచెము కొంచెముగా తీవ్రములు అవుచు వచ్చి మిరిజాపురము చేరేటప్పటికి పడమటిగాలి సమేతముగా అతి తీవ్రములయినవి. 9 ఘంటలమీద కాశీయాత్ర చరిత్ర

పూరినుంచి గంగ దాటేటప్పుడు ప్రవాహము తీసి వుండేయిట్టికాలాలలో నడమ మిట్ట పెట్టి వుంటున్నది గనుక నడమ పడవదిగి మిట్టకవతల మళ్ళీ పడవ యెక్కి ప్రయాగలో దిగవలసింది. రెండుమాట్లు యెక్కి దిగే ప్రయాస లెకుండా యీవూరునుంచే యమునానదిలో నా పడవలు పొయ్యేటట్టు చేసి ఒకసారిగానే ప్రరయాగలో పెరిమిట్టు ఘాటులో దిగినాను. యిక్కడ మనిషికి 1కి పయిసావంతున ఘాటుసుంకము పడవ దాటడానికి యియ్యవలసినది. యీ ఘాటుసుంకము సాలుకు 26.000 రూపాయిలు లెక్క యిజారాకు యిచ్చివున్నారు. 12 ఘంటలకు త్రివేణి దర్శనమిచేసి స్నాన క్షౌరాదులు చేసుకోవడమయినది.

యీ ప్రయాగ మహత్మ్యమేమంటే జగత్సృష్టికి ముందు పరమాత్ముడు బాలరూపాన్ని ధరించి యీస్థళమందున్న అక్షయవటవర్ణ ముమీవసింది వుండినాడు. యీమూల వటము యెన్నటికి క్షయమును పొందనిది గనుక అక్షయవట మనే నామము కలిగినది. ఈ అక్షయవటమే బ్రహ్మస్వరూపమని పొరాణసిద్ధము. పిమ్మట జగత్సృష్టి అయిన వెనకకూడా ఈ అక్షయవటము సువర్ణమయమై బహుకాలముశోభిస్తూ వుండినది. మాధవమూర్తి కూడా యీ వటవృక్షాన్ని అనుసరించి యిక్కడ విరాజమానుడయి వున్నందున యీ స్థళము బహు పుణ్యస్థల మయినది. తద్ధ్వారా యీ పుణ్యస్థలములో చేశే సుకర్మాలు అక్షయఫలప్రదములౌననే తాత్పర్యముతో పూర్వము బ్రహ్మ యిక్కడ దశాశ్వమేధాలు జేసినాడు. ఆ ప్రదేశము యిప్పటికి యిక్కడ దశాశ్వమేధఘట్ట మని ప్రసిత్థి పడి వున్నది. ఈ దశాశ్వమేధాలు చేసినంతలో మాధవమూర్తి బ్రహ్మకు ప్రసన్నుడయి యిచ్చయించిన వరమిస్తానని వాగ్దత్తము చేసినాడు. గనుక బ్రహ్మ యీ మహాస్థలము విష్ణు క్షేత్రమని యిదివరకు ప్రసిద్ధమై యున్నదికదా; యికమీద నాపేరుకూడా యీస్థళానికి సంబంధించి వుండేటట్టు చేయవలెనని ప్రార్దించినాడు. మాధవమూర్తి అదేప్రకారము కటాక్షించి యికను లోకులు యీ క్షేత్రాన్ని విష్ణు ప్రజాపతి క్షేత్రమని వాడుకుందురుగాక అని నియమించినాడు. అది మొదలుగా యీస్థళాని విష్ణుప్రజాపతి క్షేత్రమని వాడు కుంటున్నారు. ఏనుగుల వీరాస్వామయ్యగారి

యిట్లా వుండగా సూర్యభగవానుడు చాయాదేవికి గర్భోత్పత్తి అయ్యేటట్టు చేసెను. తదనంతరము ఆమె తపస్సు చేస్తూ వుండెను. మళ్ళీసూర్యుడు ఆమెతోసంగమము యిచ్చయించి నంతలో ఆమెగర్భావస్థలో సంగమము విధివ్యతిరిక్తమని సమీపానికి రాక పోయినది. సూర్యుడు మోహావేశ యుక్తుడయి చాయాదేవి సమీపానికి పచ్చినాడు గనుక వెంబడిగానే అతని తేజోవేగానికి ఆమగర్భమునిలవలేక విచ్చిత్తి అయిపోయినది. ఆ చొప్పున విచ్చిత్తి అయిన గర్భము కొంతమట్తుకు ఒక పిండాకృతిగా నున్ను కొంత వుదకముగా నున్ను స్రవించి నందున చాయాదేవి సహితముగా సూర్యుడు విస్మయాన్ని పొందినాడు. వెంబడిగానే హరిరుద్రాదులు ప్రసన్నులయి రుద్రుడు తన శక్తిని ఆ పిండములొ ఆవాహనచేసి యమధర్మరాజు అనే ఒక పురుషుణ్ణి ఆ పిండముద్వారా వుత్పత్తిచేసి అతణ్ణీ భూమిలో దక్షిణభాగమందు వుండేటట్టు నీమించి పాపులను విచారించి శిక్షింఛేటట్టు నీమించినాడు. విష్ణువు తత్ప్రతిగా స్రవించిన వుదకములో తన శక్తిని ఆవహింపచేసి యమునా అనే స్త్రీ నదీస్వరూపముతొ యీ పుణ్యక్షేత్రానికి ప్రవహించి వచ్చినది. యిక్కడ విరాజమాన్యుడుగా వుండే మాధమూర్తి ఆ స్త్రీ సౌందర్యము చూచి మోహితుడై భార్యలా వరించినాడు.

యిట్లుండగా రామాయణములో వివరించిన హేతువులచేత భగీరధుడు గంగను కూడా భూలోకమునకు తీసుకొని వస్తూవుండగా గంగ యీ క్షేత్రములో ప్రవేశించగానే యమునకు సమాచారము తెలిసి యెదురుకొని పోయి ఆరాధించి తనతో కూడా కలిసి ప్రవహించాలనని ప్ర్రార్ధించినది. అందుకు గంగ చెప్పిన దేమంటే నీవు మహా ప్రసిద్ధురాలయితివే. నేతోకలిస్తే నా పేరే లెకపోనేమో అని సందేహించి నంతలో యమునానరి గంగా సహవాసాపేక్షితురాలై యీ క్షేత్రము మొదలుగా నీవు నాతో కలిసి ప్రవహిస్తే పేరు నీదేను. నాప్రవాహ స్వరూపముమాత్రము వేరుగా వుండతగ్గదని కాశీయాత్ర చరిత్ర

వరమిచ్చినందున గంగ యమునతో యిక్కడ సంగమమైనది. యీస్థలము యాగాలుచేయు నిచ్చయించిన బ్రహ్మదేవుడు మొదలుగాగల పెద్దలను ఆకర్షింపుచు వచ్చినందున ప్రయాగ అనె పేరు యీస్థలానికి కలిగినది. యీ ప్రయాగక్షేత్రములో గంగ యమునతో సంగమ మయినది మొదలుగా సాగరసంగమ పర్యంతము రెండునదులు సమష్టి జలము ఒకపక్క యమునా సంబంఢమైన నైల్యవర్ణము కలిగి గంగా అనే పేరుతో ప్రవహిస్తూ వున్నది.

యిట్లుండగా బ్రహ్మ అశ్వమేధాలు చేసిన వెనక యీస్థలాన్ని స్తుతి చేయును మొదలుపెట్టి సమాప్తి చేయడానకు శక్తుడుగాకపోయెను. బ్రహ్మపుత్రి అయిన సరస్వతి నేను సమాప్తి చేయగలను గాని నీచేత వచ్చునా యని స్తుతిచేయను ఉపక్రమించి ఉపసంహారము చేయునుశక్తురాలు కాకుండా పోయి లజ్జతురాలయి వుండెను. యిట్లుండగా బడబుడు అనే ఒక రాక్షసుడు భూలోకమందు పుట్టి అతి క్షుత్తుచేత లోకాన్ని హింసిస్తూ వచ్చినందున త్రిమూర్తులు లోకరక్షణార్ద మయి ఒకటిగా కూడి యోచనచేస్తు వున్నంతలో లజ్జితురాలయిన సరస్వతి యేసాకుచేత నయినా బ్రహ్మముఖము చూడక తప్పించుకొని పోవలెననే యిచ్చచేత నేను ఆరాక్షసుని ఉపద్రవము జగత్తునకు లేక చేస్తున్నానని ప్రతిజ్ఞచేసి బ్రహ్మలోకము వదిలి వారి అనుజ్ఞమీద భూలోకానికి వచ్చి అతి సుందర రూపములో వీణాగానము చేస్తూ ఆ రాక్షసుని సన్నిధానానకు వచ్చినది. ఆ రాక్షసుడు ఆమె సుందరాకృతికి మోహితుడయి క్షుద్బాధనుకూడా సహించి కొంతసేపు లోకాన్ని ఉపద్రవవ పెట్టనివాడయి సరస్వతిని చూచి నిన్ను వివాహము చేసుకోవలనని మనసు వున్నదని చెప్పినాడు. ఇంత క్షుత్తుగల నిన్ను పెండ్లి ఆడితే భోగాలకు సావకాశము వుండనేరదే! ఒకవేళ నీవు నన్ను భక్షించివేతువనే భయము నాకు జనింపుచున్నది గనుక క్షుత్తు నివర్తింఛే పని ముందర విచారిస్తే వెనక వివాహసంగతి మాట్లాడుకొందామని సరస్వతి చెప్పెను. నాక్షుత్తు నివృత్తి అయ్యేమార్గము నీవే విచారించవలనని ఆ రాక్షసుడు సరస్వతిని ప్రార్ధించి నందున సరస్వతి బడబాసురుని మంచిదని వెంట ఏనుగుల వీరాశ్వామయ్య గారి

పెట్తుకొని సముద్రమధ్యే తెచ్చి సముద్రోదకాన్ని పానము చేయుము, నీ క్షుత్తుతీరిన వెనక వివాహము చేసుకుంటానని చెప్పెను. మంచిదని అద్యాపి బడబుడు అగ్నిస్వరూపముగా బడబాగ్ని యనే పేరు పెట్టుకుని సముద్రోదకాన్ని పానముచేస్తూ వున్నాడు.

యీ రీతిగా ఆ రాక్షసుణ్ణి నివృత్తి పొందించి నాకుకూడా సమాప్తి చేయను అశక్యమయిన స్తుతికి పాత్రభూతమైన యీ ప్రయాగను కండ్ల చూదామని సరస్వతి యిక్కడికి వచ్చినది. ఆ సమాచారము గంగా యమునలకు తెలిసి సరస్వతిని ప్రార్ధించి తమతో కూడా యీ స్థలమందు క్రీడింపుచు వుండవలెనని చెప్పినారు. సరస్వతి ధన్యురాల నయితి నని యెంచుకొని వారి ప్రార్షనను అంగీకరించి అయితే నేను ప్రకాశముగా మీతో క్రీడింపుచు నుంటే బ్రహ్మ యేమే సరస్వతి, ప్రయాగ మహాత్మ్య స్తుతిని సమాప్తిచేయక పోతినని నన్ను అడుగును; గనుక గుప్తగామినై మీతో కూడా వుంటానని, అద్యాపి క్రీడింపుచు నున్నది. వారు ముగ్గురున్ను యీరీతిగా యిక్కడ సంగమ మయినందున త్రివేణీ అనే మూడు పాయలుగల జడి అయినారు. ఈత్రివేణికి పయిన వ్రాసిన అక్షయవటమనే వృక్షము కుచ్చుగా ప్రకాశింపుచున్నది. గంగ యమునతో సంగమ మయినది మొదలు లోకుల పాపాలను కత్రించను ఈ రెండునదులు మంచి కత్తెర అనే ఆయుధముగా నున్నా ఆకత్తెరకు నడుమ బిగించే చీల లేకున్నందున బలము తక్కువబడి వుండెను. ఈ సరస్వతి గుప్తముగా ఆ చీల స్థానమును పొంది వున్నందున ఈ మూడునదులున్నూ అది మొదలుగా లోకుల పాపాలను వహించి నదరహి ముగ్గురు స్త్రీలున్ను ఇచ్చట ఒక నదీరూపమున వహించి ప్రవహింపు చున్నారు.

ఇచ్చట క్షౌరము, గోదానము, త్రివేణీదానము, తిలదానము, కించిద్దానమనే ఉపాయ దానమున్ను, ముఖ్యములని చెప్పబడియున్నవి. ధైర్యముచేత ప్రాణదానము ఇచ్చట చేస్తే వాడు జన్మాంతరమందు దారి నడవ కూడలేదు. మిరిజాపురము మొదలుగా భూమి పాల రేగడ గనుక భూమియొండి మనుష్యుల పాదఘట్టన అయ్యే కొద్ది గంధపొడి కన్నా సన్నమయిన యొక దినుసు ధూళి ఉత్పత్తి అయి మనుష్యులకు బహు ప్రయాసగా వుంటున్నది. మిరిజాపురము మొదలు యిక్కడ చెప్పే కోసులు మన దేశపు కోసులో ముక్కాలుకు తక్కువగా వుంటున్నది. యీ అండ్యాసరాయి అనేవూరు నాలుగు భాగములుగా నాల్గు పక్కలా కట్టి వున్నది. అన్నిపదార్ధాలు దొరుకను. నేను సరాయిలో దిగినాను. జలవసతి కద్దు. గుంటలవద్ద చెట్లనీడ బాగాలేదు. ఈ వూరిలో యీరాత్రి నిలిచినాను.

11 తేది ఉదయత్పూర్వము 3 1/2ఘంటలకు లేచి యిక్కడికి 6 కోసులదూరములో వుండే జూసీ సరాయి అనే వూరు 8 ఘంటలకు చేరినాను. దారి నిన్నటివలెనే సడక్కు వేసి మయిలు రాళ్ళూ వేసి వున్నవి. వర్షాకాలములో మన్ను పాలరేగడ గనుక యెంత ఘట్టనపడి మనుష్యుల పాద ఘట్టన బండ్ల రాపుడు విస్తారమయి వుండినప్పటికీన్ని కాళ్ళు ఒక మాత్రముగా దిగబడుతూ వచ్చునని తోచుచున్నది. మిరిజాపూరు మొదలు వూళ్ళు బహు దగ్గిర దగ్గిరగా దారిలో వుంటూ వచ్చినందున అనేక చిన్న గ్రామాల పేళ్ళు వ్రాయడము విస్తరిస్తున్నదని వ్రాయలేదు. వింధ్యవాసిని కొండ అదృశ్యమయిన వెనుక చూపు మేరలో యెక్కడా కొండలు అగుపడడములేదు.

యీ జూసీనరాయి అనే ఊరు గొప్పది. గంగవొడ్డున వున్నది. గనుక గంగకు అటు పక్క వుండే ప్రయాగకోట ఊరున్ను, త్రివేణీ సంగమమున్ను, తెలుస్తూ వుంచున్నది. యిక్కడ గంగ దక్షిణ వాహిని. యమున కలియని శుద్ధగంగలో యీవూరి ఘాటువద్ద స్నానము చేయవచ్చును. యీ ఘాటున మళ్ళీ గంగదాటి ప్రయాగ చేరవలసినది. యిక్కడ గంగ కోసెడు దూరము వెడల్పు కలిగి వున్నది. ప్రవాహవేగము బహు విస్తారము. గంగ ప్రవహించే దేశము, ఇక్కడ ఆభ్రక సంబంధమయిన భూమి గనుక గంగాజలము మెరుస్తూ వున్నది. ఈ వూరిలో ముసాఫరు లాయఖు పదార్ధములన్ని దొరుకుచున్నవి. వూరినుంచి గంగ దాటేటప్పుడు ప్రవాహము తీసి వుండేయిట్టి కాలాలలో నడమ మిట్ట పెట్టి వుంటున్నది గనుక నడమ పడవ దిగి మిట్టకవతల మళ్ళి పడవయెక్కి ప్రయాగలో దిగవలసినది. రెండుమాట్లు యెక్కి దిగే ప్రయాస లేకుండా యీవూరినుంచే యమునానదిలో నా పడవలు పొయ్యేటట్టు చేసి ఒకసారిగానే ప్రయాగలో పెరిమిట్టు ఘాటులో దిగినాను. యిక్కడ మనిషి 1కి పయిసా వంతున ఘాటుసుంకము పడవదాటడానికి యియ్యవలసినది. యీ ఘాటుసుంకము సాలుకు 23000 రూపాయిలు లెక్క యిజారాకు యిచ్చివున్నారు. 2.3 ఘంటలకు త్రివేణి దర్శనముచేసి స్నానక్షౌరాదులు చేసుకోవడమయినది.

యీ ప్రయాగ మాహత్మ్యమేమంటే జగత్సృష్టికి ముందు పరమాత్ముడు బాలరూపాన్నిధరించి యీ స్థళమందున్న అక్షయవటపర్ణముమీదవసించి వుండినాడు. యీ మూలవటము యెన్నటికి క్షయమును పొందనిది గనుక అక్షయవట మనే నామము గలిగినది. ఈ అక్షయవటమే బ్రహ్మస్వరూపమని పురాణసిద్దము. పిమ్మట జగత్సృష్టి అయన వెనకకూడా ఈ అక్షయవటము సువర్ణమయమై బహుకాలము శోభిస్తూ వుండినది. మాధవమూర్తి కూడా యీ వటవృక్షాన్ని అనుసరించి యిక్కడ విరాజమానుడయి వున్నందున యీ స్థళము బహు పుణ్యస్థల మయినది. తద్వారా యీ పుణ్యస్థలములోచేశే సుకర్మాలు అక్షయ ఫలప్రదము లౌననే తాత్పర్యముతో పూర్వము బ్రహ్మ యిక్కడ దశాశ్వమేధఘట్ట మని ప్రసిద్ధి పడి వున్నది. ఈ దశాశ్వమేధాలు చేసినంతలో మాధవమూర్తి బ్రహ్మకు ప్రసన్నుడయి యిచ్చయించిన వరమిస్తానని వాగ్దత్తము చేసినాడు. గనుక బ్రహ్మ యీ మహాస్థలము విష్ను క్షేత్రమని యిదివరకు ప్రసిద్దమై యున్నది కదా; యికమీద నావేరుకూడా యీ స్థళానికి సంబంధించి వుండేటట్టు చేయవలెనని ప్రార్ధించినాడు. మాధవమూర్తి అదేప్రకారము కటాక్షించి యికను లోకులు యీ క్షేత్రాన్ని విష్ణు ప్రజాపతి క్షేత్రమని వాడుకుందురు గాక అని నియమించినాడు. అది మొదలుగా యీ స్థళాన్ని విష్ణుప్రజాపతి క్షేత్రమని వాడుకుంటున్నారు. యిట్లావుండగా సూర్యభగవానుడు చాయాదేవికి గర్భోత్పత్తి అయ్యేటట్టు చేసెను. తదనంతరము ఆమె తపస్సు చెస్తూ వుండేను. మళ్లీసూర్యుడు ఆమెతో సంగమము యిచ్చయించి నంతలో ఆమెగర్బావస్థలో సంగమము విధివవ్యతిరిక్తమని సమీపానికి రాక పోయినది. సూర్యుడు మోహావేశ యుక్తుడయి చాయాదేవి సమీపానికి వచ్చినాడు గనుక వెంబడిగానే అతని తేజోవేగానికి అమెగర్భము నిలవలేక్ విచ్చిత్తి అయిపోయినది. ఆ చొప్పున విచ్చిత్తి అయిన గర్భము కొంతమట్టుకు ఒక పిండాకృతిగా నున్ను కొంతవుదకముగా నున్ను స్రవించి నందున చాయాదేవి సహితముగా సూర్యుడు విస్మయాన్ని పొందినాడు. వెంబడిగానే హరిరుద్రాదులు ప్రసన్నులయి రుద్రుడు తన శక్తిని ఆ పిండములో ఆవాహనచేసి యమధర్మరాజు అనే ఒక పురుషుణ్ణి ఆ పిండము ద్వారా వుత్పత్తిచెసి భూమిలో దక్షిణభాగమందు వుండేటట్టు నీమించి పాపులను విచారించి శిక్షింఛేటట్టు నీమించినాడు. విష్ణువు తత్ప్రతిగా స్రవించిన వుదకములో తన శక్తిని ఆవహింపచేసి యమునా అనే నామముతో ఒక స్త్రీని ఉత్పత్తిచేసి నదీరూపముతో భూమిలో లోకుల పాపాలను పోగొట్టుచు రమ్మని నీమించినాడు. అప్పుడు ఆ యమునా అనే స్త్రీ నదీస్వరూపముతో యీ పుణ్యక్షేత్రానికి ప్రవహించి వచ్చినది. యిక్కడ విరాజమాన్యుడుగా వుండే మాధవమూర్తి ఆ స్త్రీ సౌందర్యము చూసి మోహితుడై భార్యగా వరించినాడు.

యిట్లుండగా రామాయణములో వివరించిన హేతువులచేత భగీరధుడు గంగను కూడా భూలోకమునకు తీసుకొని వస్తూవుండగా గంగ యీ క్షేత్రములో ప్రవేశించగానే యమునకు సమాచరము తెలిసి యెదురుకొని పొయి ఆరాధించి తనతొ కూడా కలిసి ప్రవహించనలెన్ని ప్రార్ధించినది. అందుకు గంగ చెప్పిన దేమంటే నీవు మహా ప్రసిద్ధురాలయితివే. నీతో కలిస్తే నాపేరే లేకపోనేమో అని సందేహించి నంతలో యమునానది గంగాసహావాసాపేక్షితురాలై యీ క్షేత్రము మొదలుగా నీవు నాతో కలిసి ప్రవహిస్తే పేరు నీదేను. నాప్రవాహ స్వరూపము మాత్రము వేరుగా వుండతగ్గదని వరమిచ్చినందున గంగ యమునతో యిక్కడ సంగమమైనది. యీ స్థలము యాగాలుచేయు నిచ్చయించిన బ్రహ్మదేవుడు మొదలుగాగల పెద్దలను ఆకర్షింపుచు వచ్చినందున ప్రయాగ అనే పేరు యీస్థలానికి కలిగి నది. యీ ప్రయాగక్షేత్రములో గంగ యమునతో సంగమమయినది మొదలుగా సాగరసంగమ పర్వంతము రెండునదుల సమిష్టి జలము ఒకపక్క యమునా సంబంధమైన నైల్యల్వర్ణము గలిగి గంగా అనే పేరుతో ప్రవహిస్తూ వున్నది.

యిట్లుండగా బ్రహ్మ అశ్వమేధాలు చేసిన వెనక యీస్థలాన్ని స్తుతి చేయను మొదలుపెట్టి సమాప్తి చేయడానకు శక్తుడుగాక పోయెను. బ్రహ్మపుత్రి అయిన సరస్వతి నేను సమాప్తిచేయ గలను గాని నీచేత వచ్చునా యని స్తుతి చేయను ఉపక్రమించి ఉపసంహారము ఛేయను శక్తురాలు కాకుండా పోయి లజ్జితు రాలయి వుండెను. యిట్లుండగా బడబుడు అనే ఒక రాక్షసుడు భూలోకమందు పుట్టి అతి క్షుత్తిచేత లోకాన్ని హింసిస్తూ వచ్చినందున త్రిమూర్తులు లోకరక్షణర్ధ మయి ఒకటిగా కూడి యోచన చేస్తున్నంతలో లజ్జితురాలయిన సరస్వతి యేసాకుచేత నయినా బ్రహ్మముఖము చూడక తప్పించుకొని పోవలెననే యిచ్చచేత నేను ఆ రాక్షసుని ఉపద్రవము జగత్తునకు లేక చేస్తున్నానని ప్రతిజ్ఞచేసి బ్రహ్మలోకము వదిలి వారి అనుజ్ఞమీద భూలోకానికి వచ్చి అతి సుందర రూపముతో వీణాగానము చేస్తూ ఆ రాక్షసుని సన్నిధానానకు వచ్చినది. ఆ రాక్షసుడు ఆమె సుందరాకృతికి మోహితుడయి క్షుద్బాధను కూడా వహించి కొంతసేపు లోకాన్ని ఉపద్రవ పెట్టని వాడయి సరస్వతిని చూచి నిన్ను వివాహము చేసుకోవలెనని మనసులో వున్నదని చెప్పినాడు. ఇంత క్షుత్తుగల నిన్నుపెండ్లి ఆడితే భోగాలకు సావకాశము వుండ నేరదే... ఒక వేళ నీవు నన్ను భక్షించి వేతువనే భయము నాకు జనింపుచున్నది గనుక క్షుత్తు నివర్తింఛే పని ముందర విచారిస్తే వెనక వివాహసంగతి మాట్లాడు కొందామని సరస్వతి చెప్పెను. సాక్షుత్తు నివృత్తి అయ్యేమార్గము నీవే విచారించ వలనని ఆ రాక్షసుడు సరస్వతిని ప్రార్ధించి నందున బడబాసురుని మంచిదని వెంట పెట్టుకొని సముధ్రమధ్యే తెచ్చి సముద్రోదకాన్ని పానము చేయుము, నీ క్షుత్తుతీరిన వనక వివాహము చేసుకుంటానని చెప్పెను. మంచిదని ఆద్వాసి బడబుడు అగ్ని స్వరూపముగా బడబాగ్ని యనే పేరు పెట్టుకుని సముద్రోదకాన్ని పానముచేస్తూ వున్నాడు.

యీ రీతిగా ఆ రాక్షసుణ్ణి నివృత్తి పొందించి నాకు కూడా సమాప్తి చేయను అశక్యమయిన స్తుతికి పాత్రభూతమైన యీ ప్రయాగను కండ్ల చూతామని సరస్వతి ఇక్కడికి వచ్చినది. ఆ సమాచారము గంగా యమునలకు తెలిసి సరస్వతిని ప్రార్థించి తమతో కూడా యీ స్థలమందు క్రీడింపుచు వుండవలనని చెప్పినారు. సరస్వతి ధన్యురాల నయితి నని యెంచుకొని వారి ప్రార్ధనను అంగీకరించి అయితే నేను ప్రకాశముగా మీతో క్రీడింపుచు నుంటే బ్రహ్మ యేమే సరస్వతి, ప్రయాగ మహాత్మ్య స్తుతిని సమాప్తిచేయక పోతివని నన్ను అడుగును; అప్పుడు నేను మిక్కిలి లజ్జించ వలసి యుండును; గనుక గుప్తగామినై మీతోకూడా వుంటానని, అద్యాపి క్రీడింపుచు నున్నది. వారు ముగ్గురునున్ను యీరీతిగా యిక్కడ సంగమమయి నందున త్రివేణి అనే మూడుపాయలు గల జడ అయినారు. ఈ త్రివేణి పయిన వ్రాసిన అక్షయ వటమనే వృక్షము కుచ్చుగా ప్రకాశింపు చున్నది. గంగ యమునతో సంగమ మయినది మొదలు లోకులు పాపాలను కత్రించను ఈ రెండు నదులు మంచి కత్తెర అనే ఆయుధముగా నున్నా ఆ కత్తెరకు నడుమ బిగింఛే చీల లేకున్నందున బలము తక్కువబడి యుండెను. ఈసరస్వతి గుప్తగామినిగా ఆఛీల స్థానముని పొంది వున్నందున ఈ మూడు నదులున్నూ అది మొదలుగా లోకుల పాపాలను కత్రించను శక్తిగల చురుకయిన కత్తెర అయి త్రివేణి నామమును వహించి సదరహి ముగ్గురు స్త్రీలున్ను ఇచ్చట ఒక నదీరూపమును వహించి ప్రవహింపుచున్నారు.

ఇచ్చట క్షౌరము, గోదానము, త్రివేణీదానము, తిలదానము, కించిద్దానమనే ఉపాయ దానమున్ను, ముఖ్యములని చెప్పబడియున్నవి. ధైర్యముచేత ప్రాణదానము ఇచ్చట చేస్తే వాడు జన్మాంతరమందు ఇహసుఖమును కోరిన ప్రకారముగా అనుభవించి మళ్ళీ యీ క్షేత్రమందే మరణము కలిగి అవతల జన్మమము లేకుండా ముక్తిని పొందునని పురాణమందు చెప్పబడియున్నది. యీస్థల మహాత్మ్యము ద్వాదశాధ్యాయములు గలది ఒకటిన్ని శతాధ్యాయములు గలది ఒకటిన్ని యిచ్చట శ్రవణము చేయబడుచు నున్నది. ఈ క్షేత్రమందు స్నాన దానాలకు మకర మాసము ముఖ్యము. అప్పట్లో లక్షోపలక్ష ప్రజలు వచ్చి యాత్ర చెసుకొని పోతారు.

యిక్కడ స్వేచ్చా మరణము వల్ల యిష్టసిద్దిని జన్మాంతరములో పొదుటచేత ముచికుంద బ్రహ్మచారి అనే తపస్వి సార్వభౌమత్వము కోరినవాడై నడుము దాకా దేహాన్ని బద్దలుగా కోసి అహుతులు చేసి యిక్కడ దేహము చాలించినాడు. అతని శిష్యులు జన్మాంతరములో అతనికి పరిచారకులుగా వుండవలెననే ప్రార్ధనతో ఆ హోమాగ్నిలో ధుమికి దేహాలు విడిచినారు. వీరి కందరికిన్ని జన్మాంతరములో పూర్వ జన్మజ్ఞానము వుండవలె ననే ప్రార్ధనకూడా వుండినందున యీ స్థల మాహాత్మ్యాన్ని ప్రస్తుతి చేసినట్టుగా యెనిమిది శ్లోకాలు వ్రాసి బొరుగులు వేయించి అమ్మే ఒక స్త్రీ వశముచేసి చనిపొయినారు గనుక ఆ బ్రంహ్మచారి ఢిల్లికి అకుబరు ఫాదుషాగా నున్ను శిష్యులు మంత్రులుగా నున్ను అయిన వెనక జన్మాంతరజ్ఞానము వున్నందున మళ్ళీ ఈ స్థళానికి వచ్చి తాము శ్లోకాలు వ్రాసివుంచిన స్త్రీ బ్రతికి వుండగా ఆపెవద్ధ పూర్వము వ్రాసివుంచిన శ్లోకాలు తీసి చదువుకొని ఆశ్చర్యపడి స్వేచ్చా మరణము కోరినవారికి యిక్కడ అనుకూలముగా మెడయిస్తే తృటికాలములో అనాయాసముగా తెగకోసే యంత్రము ఒకటి వుండగా తమకు బాధగా వుండుననే వెర్రి తాత్పర్యముతో ఆ యంత్రాన్ని యెత్తి పారవేసి త్రివేణీ సంగమము వద్ద అత్యద్భుతమయిన కోట వకటి కట్టినారు. ఆ కోట యెంత ప్రవాహాలనున్ను ధిక్కరించి అత్యంత బలముగా యిదివరకు ఉన్నది.

ఆ సువర్ణాక్షయపటము కలి సామ్రాజ్యకాల మయినందున త్రివేణీసంగమము వద్ద వున్నా యిప్పట్లో ఆదృశ్యమయి యున్నది. దానికి ప్రత్యామ్నాయముగా కోటలో ఒక నేలమానికెలో ప్రయాగేశ్వరుడు మొదలయిన లింగాలు బింబాలున్ను ఉండే తావున ఒక లావు మర్రికొమ్మను తెచ్చి యీ స్థళజ్ఞులు పాతివున్నారు. వాటిని లోకులు ఆరాధిస్తారు. "త్రివేణీ మాధనం సోమం భరద్వాజం చవాసుకిం, వందే ఒక్షయవటం శేషం ప్రయాగం తీర్ధనాయకం" అనే శ్లోకప్రకారము ఆ యెనిమిది తావులకు వెళ్ళి యిక్కడ దిన యాత్ర చేయవలసినది. గనుక ప్రత్య్హామ్నాయ మయిన అక్షయవటపూజ యిక్కడ అగత్యమయినది. అందులో సోమేశ్వరుడిగుడి మాత్రము యమునకు అవతలిగట్టున వున్నది. కడమ అన్ని గుళ్ళు ప్రయాగ క్షేత్రమందే వున్నవి; గనుక నిత్య యాత్ర రవంత ప్రయాసతో చేయవచ్చును.

యీ స్థళమాహాత్న్యములో యీ త్రివేణీతీరమందు ప్రతి గ్రహానకు బహు ప్రత్యచాయము చెప్పి వున్నది. గనుక భిక్షాటన మే స్వధర్మ మయిన బ్రాంహ్మణులు యిక్కడ వాసము చేయడానికి భయపడి యీ స్థళవాసమే మానినారు. యింత పుణ్యతీరమందు బ్ర్రాహ్మణులు లేకపోతే లోకులు కడతేర రనే తాత్పర్యము చేత లోగడ డిల్లీ పాదుషా కింది అధికారస్థులు కొందరు కనోజా బ్రాహ్మణులకు భూస్థితు లిచ్చి యిక్కడ యెల్లప్పుడు తీరవాసులుగా వుండేటట్టున్ను యీ తీరములో వారికి స్థలాధికారాన్నిన్ని కలగచేసి కొందరిని స్థాపించినారు. వారు ప్రయాగవాశీలని పేరు పెట్టుకొని యిప్పటికే 200మంది, 124 ఝండాలు వేసుకొని స్నానఘట్ట మందు బలంపీటలువేసిస్నానము చేయవచ్చే వారికి ఉపకృతులు చేస్తూ ఆయాచిత జీవనము యాత్రవారిగుండా చేస్తూవున్నారు. వీరుగాక పంచ ద్రావిళ్ళతో చేరిన మహారాష్ట్రులు 10 యిండ్లవారున్ను తెనుగు వారు మూడిండ్లవారున్ను నూరు యేండ్లుగా ఠాణాలనే పేరుపెట్టుకొని యిక్కడా వసిస్తూ వున్నారు.

ఒకటి రెండు ధర్మ శాలలు ద్వారకాదాసు లక్కునో నవాబు మంత్రి కట్టించినవి యీ స్థళములో వున్నవి. దేశాంతరస్థులకు అన్నము అహల్యాబాయి సత్రము నిలిచి పోయినది మొదలుగా శుద్ధముగా లేకవున్నది. త్రిస్థళయాత్ర చేసేవారు అందరున్ను యెట్లా? కాశిలో మాత్రము అన్నపూర్ణ ఆజ్ఞచేత ద్రావిడ దేశస్థులకు యిక్కడి వారికి బుద్ధి ప్రేరితమయి అనేక సత్రాలు యేర్పడి వున్నవేగాని యిక్కడ ఒక సత్రమయినా లేక వున్నది.

యీ క్షేత్రములో యమద్వితీయమనే కార్తిక శుద్ధ విదియ నాడు యమునాస్నానము బహు ముఖ్యము. యమధర్మరాజు ఆదినము తన తోడబుట్టు అయిన యమునను జూచే నిమిత్తమై యిక్కడికి వచ్చి ఆ దినము యమునలో స్నానముచేసేవారి వంశస్థుల కంతా యమదండన లేకుండా వుండేటట్టుగా వర మిచ్చినాడాట. ఆ దినము యమునా స్నానము నాకు రామబ్రహ్మము కలిగేటట్టు కటాక్షించినాడు.

యీ ప్రయాగ వూరు ఫాదుషా కోటకట్టిన వెనక బహు బస్తీ అయినది. ఇప్పుడు (ఊరు) కట్టి సుమారు నాలుగువేల యేండ్ల దాకా అయినది. లక్కునో నబాబు డిల్లి పాదుషాను స్వామిద్రోహము చేసి లక్కునో రాజ్యముతోకూడా యీ ప్రయాగను స్వాధీనపరచుకొని ప్రయాగ వాళీలకు పాదుషా యిచ్చిన మాన్యపు భూములు యావత్తు కట్టుకున్నాడు. పిమ్మట 30 సంవత్సరముల కింద కుంఫిణీవారు స్నేహపూర్వకముగానే యీ ప్రయాగను దీని చుట్టు ఉండేభూమితోకూడ తీసికొని త్రివేణి సంగమమువద్ధ వుండే కోటను బహుబలముచేసి భరతపురపు రాజు మొదలయిన గొప్పవారిని భద్రపరచడానికి తగుబాటిగా మిక్కటమయిన రస్తుతో కూడా కోటను కాపాడుతూ వున్నారు. కోట బహు ముచ్చటగా బయిటికి కనబడుచున్నది. ప్రత్యామ్నాయ పటవృక్షాన్ని కొటబురుజుకింద వుండే సరస్వతి తీర్ధానిన్ని దర్శనము చేసినాను. యీ ప్రయాగకు మొగలాయీలలో అలహాబాదు అని పేరుపెట్టినారు. ఆధికారస్థులు అదేప్రకారము యిప్పటికిన్ని వాడుకుంటారు. యీ అలహాబాదులో ఒక రెవెన్యూ కల్కటరు ఒక కస్టం కల్కటరు ఒక మేజస్ట్రేటు ఒక జడిజీయున్ను వుండివున్నారు. వీరికందరికి అధికారిగా ఒక కమిస్సనరును యేర్పరచి పెట్టినారు. మిరిజాపూరు దొరలు యిచ్చిన ప్యానుపోట్రులను యిక్కడి దొరలు కాయముచేసి వేరే ప్యానుపోట్రులు తాము ఇచ్చి కాశిదాకా కూడావచ్చేటట్టు బరక్రదాసు అనే ఒక పోలీసు బంట్రౌతును నా తయినాతీచేసి జూసీనరాయిలో ఫరవానాకు వ్యతిరిక్తముగా నా మూట ముల్లెలను శొధించి పెరిమిట్టు మనుష్యులను కొలువు తీసివేసేటట్టు నిశ్చయముచేసినారు. వారున్ను భగత్సృష్టితోచేరినవారయి తద్వారా నా సహోదరు లయినందున వారికి నావల్ల హింసకావడము యుక్తము కాదనిన్ని క్రోధము పాపకారి అనిన్ని యీశ్వరుడు నాబుద్ధికి తోపింపఛేసిన వాడయి నాకుండా ఆదొరలను మళ్ళీ ప్రార్ధించబడేటట్టు చేసి వారి జీవనాలు కాపాడినాడు.

యిక్కడ వేణీదానము పెనిమిటి సహితముగా వచ్చిన స్త్రీలున్ను పితృసహితముగా వచ్చిన వివాహముకాని కన్యలున్ను చేల్యవలసినది. యీ వేణీదాన మనగా జడ కత్రించి దాన మియ్యడము ముఖ్యమా, లేక తల వెంట్రుకలు యావత్తు కత్రించి యియ్యడము ముఖ్యమా అనే వివాదము, మనదేశములో రామానుజ దయాపాత్రము వారున్నూ శ్రీ శైల దయాపాత్రము వారున్ను నాసాగ్రము యేది అని వివాదపడ్డట్టుగా పడి, మనవారు ఏకవాక్యత పడనట్టు వీరున్ను యీ విషయములో ఏకవాక్యత పడక కొందరు స్త్రీలకు జడవేసి కొంతమట్తుకు కత్రించి దానము చేస్తారు; కొందరు తలవెంట్రుకలు యావత్తు కత్రించి యిస్తున్నారు. నేను సమగ్రముగానే దాన మిప్పించినాను.

ముందు కాలాలలో యిక్కడ వచ్చి క్షౌరము చేసుకొని యాత్ర చేయడానికి మనిషికి 7 రూపాయల వంతున దొరతనము చేసేవారు హశ్శీలు పుచ్చుకొనుచు వచ్చినారు. యిప్పట్లో మనిషికి కుంఫిణీవారు ఒక రూపాయ వంతున నిష్కర్షచేసి త్రివేణీ సంగమము ఎక్కడ అవుచున్నదో అక్కడ పాటక్కు అనే ఒక చావడివిడవలి (పూరి)తో కట్టివుంచినారు. ఆ పాటాక్కులో 12 బంట్రౌతులతో ఒక జమీదారుణ్ని ఉంచి యున్నారు. ఆ పాటక్కుకు కొన్ని బారలకు ముందుగా ఒక దారోగా కచ్చేరిని ఉంచుయున్నారు. ఆరాధనను విధిగా యేర్పరచినారో యెట్లా వైష్ణవ మతస్థులలొని మద్యపాయలు తరించడానికి రహస్య రామానుజకూటారాధనను నియమించినారో తద్వత్తుగా లోకముమీద విసుకుచేత దేహమును బలాత్కారముగా త్యజించడానికి నిశ్చయించినవారు తరించడానికికూడా యీ ప్రయాగ మహాత్మ్యద్వారా దేహత్యాగము విధిచోదితముగా చేసినట్టు తోచుచున్నది. మెట్టుకు యీ కర్మభూమిని జనియించిన తిర్యగ్జంతువులు కూడా ఒక విధమైన భక్తి యీశ్వరుని యెడల కలిగి తరించవలసిన అగత్యము పూర్వీకులకు కలదు గనుక వాని వాని శక్తికి, ఇచ్చకున్ని, యెక్కువగా పనులు నియమిస్తే చెయక తద్ద్వారా యీశ్వరభక్తి లేక ముణిగిపోదురు గనుక వారి వారి ఇచ్చకు, శక్తికిన్ని, అనుకూలమయి నట్టుగా; సారాయి తాగితే తాగినావు యీశ్వరాప్రణమని ఒక విధమయిన ఆరాధనతో తాగు అన్నట్టు; ఆత్మహత్య చేసుకుంటే చేసుకున్నావు; యీశ్వరార్పిత మని శ్రద్ధతో ఫలాని తావుకుపోయి విధి పూర్వకముగా చేయుము అనేటట్టుగా యిక్కడ నియమించినారని నాకు తొచుచున్నది.

త్రివేణి గర్భములో కోటగోడకింద నాకోసరము తత్పూర్వమే చప్పరాల కొట్టాయీలు వేయించి వున్నందున అందులో తీర్ధశ్రాద్ధాదులు పెట్టించినాను. బ్రాహ్మణుడు 1 కి రూపాయి వంతున దక్థిణ యిచ్చినాను. ఆ బ్రాహ్మణులున్ను, అందుకు సంతొషపడిరి. ప్రయాగవళీల స్త్రీలు రాణివాసము గలవారు గనుక తెనుగు మహారాష్ట్ర ముత్తయిదువలు 12 మంది దొరికి నందున వారికి మాయింటి స్త్రీలతొ కూడా ఆ చప్పరాలలో ముందుగా యిక్కడి వాడికె ప్రకారము గాజులు తొడిగించి అభ్యంగనాలు చేయించి నూతన వస్త్రాలను ధరింప చేసి మేళతాళాలు స్వస్తి వచనములతో కూడా త్రివేణీ సంగమము వద్దికి వెళ్ళి వేణీదానము యిప్పించినాను.

యీ చప్పరాలు 16 రూపాయల బాడిగెకు బనయావాడి (కోమటి) వద్ద నిష్కర్షచేసుకొని పయిన 10 రూపాయిలు ఖర్చు చేసి అరవ భాష - పఆన (--- అను అక్షరస్వరూపము) అందముగా కొట్టాయీ 1 కి 40 అడుగుల నిడువున్ను 16 అడుగుల వెడల్పున్ను పెట్టి 3 కొట్టాయీలు వేయించినాను. బహు రమణీయముగా వుండినవి. ఆచప్పరాలు బాడిగెకు యిచ్చిన బనయావాడు అక్కడనే ఒక అంగడి తెచ్చిపెట్టినాడు. సకల సమానులున్ను వాడివద్ద పుచ్చుకొన్నాము. మకర మాసంలో వచ్చే జనము దిగడానికి బనయావాండ్లు వేలపర్యంతము చప్పరాలు కట్టి యీలాగంటి కొట్టాయీలు వెసి అడుగుకు పావులావంతున బాడిగె తీసుకొని మీది మిక్కిలి ఆ దిగిన వారిని మరియొక తావున సౌదా అనే సామాను కొనకుండా నిర్బంధపెట్టుతారు. అయితే యిటువంటి చప్పరాలు కావలసినన్ని బాడిగెకు దొరుకుచున్నవి.

నేను యెల్లప్పుడున్ను త్రివేణీదర్శనము కాగల ద్వారకాదాసు ధర్మశాలలో దిగినాను. యీ స్థలములో వశించినన్ని దినాలున్ను ప్రతిదినమున్ను ఉదయాన యీ చప్పరాలకు వచ్చి సాయంకాల పర్యంతమున్ను యిక్కడనే వుండి రాత్రి పడకకు ధర్మశాలకు పోవుచు వచ్చినాను. ప్రయాగవాళీలకున్ను ఘాటీ వారికిని యింటికి రెండేసి అణాల వంతున సుమారు 1100 ఇండ్లకున్ను, ముట్టచెప్పినంతలో వారందరున్ను సంతొష పడిరి. యిక్కడికి గొప్పవారు వస్తే స్నాన ఘట్టములో ఒక బలంపీట నున్ను ఒక జండానున్ను వేయడం వాడికె గనుక పదిరూపాయలలో రెండున్ను నన్ను అనుసరించిన శంకర ఘాటీకానును తెమ్మని స్నాన ఘట్టములో వేసి అతని అధీనము చేసినాను. క్షౌర గనమున్ను, వేణీదాన దినమున్ను, భూరి యివ్వడములో 14 రూపాయల పయిసాలు తగులుచున్నవి. అందులో అన్ని జాతులు చేరుతారు. త్రివేణిదానానికి మరునాడు నా ప్రయాగవాళీ యింట్లో ప్రయాగవాళీలకు నూరుమందికి సంతర్పణ చేసినాను. దక్షిణ సహితముగా 24 రూపాయలు మట్టుకు ముట్టచెప్పినంతలో ఆనందించి నాతోకూడ వచ్చిన ప్రతి శూద్రుని చేత నేను మనిషి 1 కి యిచ్చిన రెండేసి అణాలు తీసుకొని తీర్ధవిధి పిండప్రదాన సహితముగా చేయించినాడు. పంచద్రావిళ్ళుపెట్టే శ్రార్ధాలజోలికి వారు రావడములేదు. పిండ దక్షిణ అనే పేరుతో బ్రాహ్మణార్ధము చేసే ఒక బ్రాహ్మణునికి యిచ్చే దక్షిణంత ప్రతి శ్రార్ధానికిన్ని ప్రయాగ వాళీ తీసుకొంటాడు. యీపాటి, నాకుండా యీ స్థలములో యీశ్వరుడు జరిపించడము వల్ల చెన్నపట్నానికి యశస్కరుముగానే వుండినది.

నేను ప్రయాగవాసము చేసినన్నిదినములు వైదికుల సమూహము తోనే కాలము తోయడమయినది గాని హయిదరాబాదు వగయిరా షహరుల వలెనే లౌకిక సహవాసము నేను త్రివేణీతీరమునందు దిగినందున నిండా తగిలినది కాదు. యీ ప్రయాగలో నాలుగు పటాలాల బారూన్నది. ఆ దండు వుండే స్థలము బస్తీకి రెండుకోసుల దూరము. నా మీద దయచేసి నేను సేవచేసిన సర్ జాన్ న్యూబోటు, (Sir John Newbolt)* సర్ చర్లీనుగ్రే మదలయిన దొరలు వ్రాసి యిచ్చిన క్యారకటరులు యీ పరస్థలాలలో నున్ను యింత గొప్ప చేస్తున్నవి.

సర్వాంతర్యామిగా వుండే పరమాత్ముడు యేలే స్వామిలో యేలబడే వారి యాత్మలలో దీపించుటకంటే యెక్కువ దీప్తితో ప్రకాశించుచున్నాడు. గనుక స్వామిభృత్యన్యాయముగా మనుష్యుడు నడుచుకొంటే పరమాత్ముడు ఆనందించి ఆ నడిచిన వానికి సకలేష్టసిద్ధులు కలగచేయు చున్నాడు. యిందుకు యే మాత్రమున్ను సందేహములేదని తోస్తున్నది.

బంగాళా గౌర్నమెంటువారు పినాన్సుకమిటీ అనే సెలవులు తగ్గించే సమూహము వారి తాత్పర్యము మీద అక్కడక్కడ ఉండే కష్టం హవులనే సాయరు చావిళ్ళు యెత్తివేసి చెన్నపట్టణమువలెనే కష్టం అనే సుంకమును యీజారాకు యివ్వవలె నని యత్నముచేసినారు. యీ రాజ్యములో వుప్పుకు తీరువగాని చెన్నపట్టణమువలె మొనాపొలీ చేసి సుంకము యీజారాకు యివ్వడములేదు. చెన్నపట్టణమువలె జరిగించడము యీ దేశస్థులకు సమ్మతము లేక నున్నది. అందువల్ల సుంకము యీజారాకు యివ్వడములో యిటీవల చెన్నపట్టణములో తూకున (ఉరి) తీయబడిన అణ్నాసామి వగయిరాలకంతా కలిగిన


  • న్యూబోల్ టు గారు చెన్నపట్టనములో 1815 నుండి 1820 వరకు సుప్రీము కోర్టు ప్రధమ న్యాయమూర్తిగా వుండేవారు. ప్రమాదాలనున్ను, యింకా కలగ గల ప్రమాదాలనున్ను, నాకు తొచిన మట్టుకు తెలిశేటట్టు ఒక యాదాస్తు శీకష్టం కలకటరు మేస్తరు నీపన్ (Mr.Nepean) దొర కోరినమీదట వ్రాసియిచ్చినాను.

మేస్తర్నీపన్ దర నాతో మత సంబంధమయిన ప్రసంగము వచ్చినప్పుడు యీ నదులను యీ గుళ్ళను యీశ్వరుడని నమ్ముతావా అని ప్రశ్నచేసెను. చెన్నపట్టణంకు చూడని మీకు, హిందూస్తాన్ ప్లాన్ యెత్తి యిదుగొ చెన్నపట్టనమని చూపిస్తే అది చెన్నపట్టణమౌనా? చెన్నపట్టణము ఫలాని తావున వున్నదని బోధ చేయవలసినవారికి వారిని చెన్నపట్టణానికి పిలుచుకుని పోయి ప్రత్యక్షముగా చూపించను వల్ల లేని పక్షమందు, ప్లాన్ గుండా నయినా చూపించవలసినది అగత్యము గనుక, యెట్లా ప్లాన్ వ్రాసి మీరు యెరుగని దేసాలను ప్రకటనము చేయుచున్నారో తద్వత్తుగా జ్ఞానముచేత యీశ్వరుని తెలుసుకో లేని వారికి ఈ కర్మస్థలముల మూలముగా యీశ్వరుని యెడల భక్తి కుదిరేటందుకు యిటువంటి స్వరూపాల యెడల యీశ్వరజ్ఞానము ఆరోపితము చేసి ఆరాధనోపాయములు మాపెద్దలు చేసినారు, అని ప్రత్యుత్తర్వు యిస్తిని. అయితే నీవు క్రీస్తు మతస్థుడవేకదా! అని చెప్పి సమ్మితి పడినాడు.

ఈదేశములో మహారాష్ట్రులు మొదలయిన ద్రావిళ్ళును, ఘూర్జరులతో భోజనప్రతి భోజనాలు చేయడము లేదు. అందుకు కారణము ఘూర్జరులు శంకరాచార్యులవారి శాపగ్రస్తులని చెప్పుచున్నారు. యిక్కడ వాసమి చేసే పంచ గౌడస్త్రీలు రవికెలు తొగడములేదు. తురకసంప్రదాయ ప్రకారము ప్రతిస్త్రీలున్ను ముసుకులేకనే బయటరారు. ఆరుమూర నిడివి, నాల్గు మూర వెడల్పులో చంగావివేసిన మంచిరేకు విత్తముకొద్దీ తీసి ముసుకుగా ముఖముకూడా తెలియకుండా దేహ మాద్యంతము కప్పుకొనుచున్నారు. గంగారీరందు వసించే సకలజారులు స్నానము శివపూజ చేయకనే జలపానము చాయడములేదు. పుణ్యనదుల తీరములలో వుండే వారి కంతా యిదే షాననియమము కలిగినట్లు నా అనుభవము నాకు తోపచేయుచున్నది. స్త్రీలు అందరు వుదయా త్పూర్వము గంగాస్నానముచేసి యిండ్లకు పోతారు. పిమ్మట పురుషులు స్నానానికి పోతున్నారు. యిక్కడి స్త్రీలకు స్వరూప సౌందర్మమే కాని ఆభరణాపేక్ష విస్తారము మనదేశమువలె కలిగిన వారు కారు.

మిరిజాపురము మొదలు ప్రతి మజిలీ వూరిలో బాడిగెకు గుఱ్రాలు కోసుకు ఒక అణావంతున కావలసినన్ని దొరుకుతున్నవి. తిరుల్వలిక్కేణి గాడీలవంటి గాడీలకు ఒక తట్టువాని గుర్రాన్ని కట్టి యెక్కా అని పేరు పెట్టి వారు వారు యెక్కడము మాత్రమే గాక కావలసినన్ని బాడిగకున్ను యిస్తూవున్నారు. ఆ యెక్కా అనే సవారీ దినానికి 10 కోసుల సాధారణముగా పొవుచున్నది.

దక్షిణదేశములో వస్త్రాలు ఆ దేశస్థులు బహుశ: ప్రయాసపడి ఉతికి శుభ్రముగా వుంచుకొని వుండేటట్టు, ఈ దేశాస్థులు వాడుకునే పాత్రసామాను శానాసేపు ప్రయాసపడి తోమి బహు శుభ్రముగా వుంచుకొనుచున్నారు. యీ దేశస్థుల పస్త్రాల నైల్యమున్ను, మనదేశస్థుల పాత్రల నైల్యమున్ను, సమముగా ఉన్నది. యిందుకు కారణము నాబుద్ధికి తోచడ మేమంటే దక్షిణదేశస్థులు భొగప్రియులు గనుక వస్త్రసౌందర్యము కలవారయినారు. ఉత్తరతేశస్థులు భుక్తి ప్రియులు గనుక భక్షణోపకరణాలు శుభ్రముగా వుంచుకొనుచున్నారు. ఈదేశస్థులు యెనిమిదిమంది చేరితే తొమ్మిది పొయిలని ప్రసిద్ధిగనుక, వంటలు వారువారు దేహసంబంధికులయినా ప్రత్యెకముగా చేసుమొని మనదేశపు వైష్ణవులవలె దృష్టి దోషము మాత్రము పాటించకుండా భోజనము చేస్తారు.

మిరిజాపూరు మొదలు ప్రయాగవరము భూమినిండా సారవత్తు కాకపోయినా గంగవొడ్డు భూమిగనుక ప్రవాహము తీసిన కాలాలలొ దున్ని పయిరు పెట్తుచున్నారు. గంగవండలి మన్ను అతి సారవత్తు అయినది గనుక అమితముగా గోధుమలు వగయిరా పుంజధాన్యములు పండుచున్నవి. ఈదేశములో వేదపాఠము లేకునున్ను, వేదపారాయణము లేకనున్ను, ఉండడానికి కారణమేమని నా బుధ్యా ఊహించగా అర్ధము తెలియని వేదపాఠము యేమివున్నా శ్రౌత పురస్సరముగా యాగము మొదలయిన కర్మాలకు ఉపయోగమే గాని జ్ఞానానికి ప్రత్యక్షమైన సాధనము కాదు గనుక నున్ను, యీ భూమి మ్లేచ్చా క్రాంతమై పోయిన వెనక గంగాయమునల మధ్యే నివసింపుచు నున్న కర్మఠులయిన ద్రావిళ్ళు శుద్ధ ద్రవిడ దేశములయిన కావేరీ తామ్రపర్ణీ తీరములలో ప్రవేశించినందున అక్కడి వారు కర్మోపయోగిగా వేధాంతము తెలియక పోయినా వేద పారాయణము చేయడములో ఫలము కలదని ఫలశృతులు కలగచేసి బహుశ: వేదపాఠము పారాయణానకు ఉపయోగముగా జరిగిపుంచు వుండేటట్టు తోచుచున్నది.

యిప్పుడు పంచగౌడులని యిక్కడ వసింఛే వారికి గౌడులని పేరు రావడానకు కారణమేమంటే కర్మకులమయిన ద్రావిళ్ళు యీ గంగాయమునలమధ్యే వసింఛే కాలములో కర్మములయెడల శ్రద్ధ తక్కువైన వారైనందున వీరిని గౌణులు అంటూ వచ్చినారు. ఆనామమే యిప్పుఛు గౌడులని ప్రసిద్ధమైనది. కర్మఠులు యీ రాజ్యము వదిలి పోయి ఢిల్లీనుంచి వచ్చిన తురకలచేత ఈ రాజ్యమంతా నిండిపోయినందున నిండా కర్మకులు కాకుండావుండే గౌడులకు ఆ తురకలటో సహవాసము కలిగి నందున ఉచ్చారణలుకూడా ఆ తురకభాషను అనుసరించినవి. ఆచారాలు కూడా తద్ధ్వారానిండాభేదించి పొయినట్టు చెప్పుచున్నారు. ఈ దేశము తురకదేశమునకున్ను, హిందూ దేశమునకున్ను, నడుమనుండే సింధునదికి సమీప మయినది గనుక తురకలు ఢిల్లీ ప్రవేశించగానే వారు ఈ దేశాచార విరుద్ధ కర్మకు లయినందు వారివల్ల ఉపద్రఫము కలగ పోవుచున్నదని భయపడి యిక్కడి కర్మకులయిన ద్రావిళ్ళు పయిన వ్రాసిన ప్రకారము శుద్ధ ద్రవిడదేశములో ప్రవేశించినారు. అదినుంచి కర్మకులు గాని గౌడులు,యిప్పటికి ముక్తికి తగ్గ దారియయిన జ్ఞాన సంపాదనార్దమై తర్కము, మీమాంస మొదలయిన శాస్త్రములను అభ్యసింపు చున్నారు.

కర్మద్వారా, జ్ఞానమనే న్యాయ మార్గమును బట్టి కర్మమనే మజిలీయూరి మెదుగా జ్ఞానమనే పురమునకు పోతే దేహాన కున్ను, ప్రాణాలకున్ను, ప్రయాస యియ్యదు. కర్మమనే మజిలీలో నిలిచి ఆసోదా చేసుకోకనే జ్ఞానమనే పురమునకు ఒక్కసారిగా వేరే అగుపడలేదు. యిది గాక శ్రీమచ్చంకరాచార్య భగత్పాదులవారు దిగ్విజయార్ధముగా ఈ దేశానికి వచ్చిన కాలములో యిక్కడ సన్యాసమును స్థాపించిన వెనక ఈ గౌడులలో కొందరు సన్యసించి వారికి సిష్యభావమును వహించి ఉంటూ వచ్చినారు. భగత్పాదుల వారికి కొందరు మద్య మాంసాదులతో భిక్షచేసినప్పుడు గురువు స్వీకరించగా మేము యెందుకు విడిచి పెట్టవలసిన దని వారితో పాటుగా ఈ దేశపు శిష్యులు మద్య మాంసాదులను భక్షించినారు. పిమ్మట వారి పరిక్షార్ధమై ఒక కంచరవాడు సీసమును కరిగి ఆయుష్ణముతో భిక్షాకాలమందు భగత్పాదుల వారికి పాత్రతో సమర్పించగా దాన్ని భగవత్పాదులవారు సమదర్శను లయినందున ఉదక ప్రాయముగా పుచ్చుకొన్నారు. ముందు వారితోటి పాటుగా మద్య మాంసములను పుచుకొన్న గౌడ సన్యాసులు యిది మేము పుచ్చుకో గలమా అని కరిగించి పోసిన సీసమును తాగలేక త్యజించి నందున భగవత్పాదుల వారికి వారి యెడల ఆయానముతోచి, బుద్ధి స్ధైర్యమును పొందేవరకు లోకదృష్టితో మంచిచెడు తారతమ్యములను విచారించక నాయందు గౌరవమున్ను లేకుండా అవాంకృతిని వహించి నందున మీరు భ్రష్టులై పోదురు గదా యని శపించినారు.

అప్పట్లో శాపగ్రస్తులయిన పదిమంది సన్యాసులున్ను దశనామములు కలిగి శిష్యప్రశిష్య పరంపరగా యీ దేశములో గోసాయీ లనే పేరు తమది సన్యాసాశ్రమమైనా వర్తకవ్యాపారాలు చేసుకొంటూ యిక్కడ మహాజనులనే సాహుకారులుగా నటింపుచున్నారు. ఆతొసాయీలు సిష్యపరిగ్రహము చేసేటప్పుడు ఒక విధమయిన హోమముచేసి కొంత ఆగమము జరిపించి శిష్యపరిగ్రహము చేయుచున్నారు. ఆ శిష్యుడు గురువుయెక్క ధన ఋణాలకు బాధ్యుడవుచున్నాడు. యిట్లా మునుపు గోసాయీలు బ్ర్రాహ్మణవ్యతిరిక్త జాతులను కూడా శిష్యులుగా పరిగ్రహింపుచు వచ్చినారు. అయితే యిప్పుడు కొంతకాలముగా కుంఫిణీవారు ఆ యాచారమును నిలిపి బ్రాహ్మణులనే శిష్యులుగా పరిగ్రహించేటట్లు ఆగోసాయీలకు నియమముచేసి యున్నారు.. ఆగోసాయీలకు యెవరు నమస్కారము చేసినా యిప్పటికిన్ని నారాయణ స్మరణ చేయుచున్నారు. యీగోసాయీలందరున్ను, వనా, రణా, గిరి , పర్వత్, సాగరా, భారతీ, పురీ, సరస్వతీ, తీర్ధ, ఆశ్రమ, యీ పది నామధేయములకున్ను అంతర్భూతులయి యుంటారు గాని వేరేయుండరు.

యీ తెగలు గాక బయిరాగులని కొందరు విరక్త్యభినయాలు బహుశా కలిగి తెంగల నమధారులయి సంచరింపుచు నుంటారు. వారికి గురుపీఠముగా మన ద్రవిళదేశము నుంచి కొంతమంది వైష్ణవులు కొన్ని కాలములలో అచ్చి సమశ్రయణము చేసి వారిగుండా బహుధనమును సంపారించుకొని పోవుచున్నారు. వారు విష్ణుభక్తులయినా ద్రవిడ దేశములో అద్యైతులకున్ను, విశిష్టాద్వైతులకున్ను, సగుణనిర్గుణ వివాదము పడినట్టు యిక్కడ లేదు.

యీ దేశము యావత్తున్నూ తరుచుగా శ్రీమచ్చంకరాచార్యులవారు స్థాపించిన అద్వైత మతము చెతనే వ్యాపింపబడి యున్నది గాని పిమ్మట రామానుజాచార్యులు వారున్నూ, మధ్యాచార్యులవారున్ను, అవతరించి స్థాపించిన విశిష్టాద్వైత ద్వైతాలు యీ సరికి నకృచ్చముగా నెగబడినదికాదు. సకలమైన వారున్ను ఏమిన్ని భేదములేకుండా విభూతిన్నీ, గోపీచందనమునున్ను చందనమునున్ను లలాట మందు ధరింపుచున్నారు. బయిరాగులు మాత్రము తిరునామమును పయిన వ్రాసినట్టు ధరింపుచున్నారు.

శైవ వైష్ణవ పౌర శాక్తములు మొదలయిన మతాలన్ని అద్వైత విశిష్టాద్వైత మతాలకు అంతర్భూతము లయినవే గనుక యీ మూడు మతస్థులున్ను శైవవైష్ణవములు మొదలయిన ఆరాధనలు ఏవి చేసినా చేయవచ్చును. ఈ ఆరాధనలన్ని కర్మాలకు అంగుములే కాని వేరేకావు. మత రహస్య మనే వృక్షమూలము గురుముఖముగా తెలియవచ్చినప్పుడు కర్మాంగములయిన ఆరాధన లన్నియు తమకు తామే నివర్తించి పోవుచున్నవి. మత రహసమనగా ఆయా మతము యొక్క తత్వము, అద్వైతమతముయొక్క తత్త్వమేమంటే సృష్టికిన్ని సృష్టికర్తకున్ను, దీపికా న్యాయముగా భేదములేదనుట. విశిష్టాద్వైత తత్వమేమంటే సృష్టికిన్ని సృష్టికర్వకున్ను పాలతో కలిసి వుండే నెయ్యివలెనే కించిత్తు భేధము చెప్పడము. ద్వైత తత్త్వమేమంటే పాలు పెరుగు మజ్జిగె మజ్జిగెతేట నెయ్యి యివి భేదిస్తే భేదపడు చున్నవి గనుక వీటివలెనే యీశ్వరునికిన్ని జీవునికిన్ని భేదము ఉండడము మాత్రమే కాకుండా అనేక భేదాలు జీవులలో కూడా కల వనడము యీ మూడే యిదివరకు తీరని వివాదాలుగాని శివుని కన్నా విష్ణువు సర్వోత్తముడని వైష్ణవులున్ను, శివుడే వుత్తముడని శైవులున్ను వీరిద్దరికన్న శక్తి యెక్కువని శాక్తులున్ను, వివాదపడడమున్ను అందరికి యెక్కువ గణపతి అని గాణపతులు వగయిరాలు వివాద పడదమున్ను స్వప్రయోజనకారి కాదు. యేలాగంటే విందుకు వండిన కూరలు మొదలయిన వ్యంజనాలలో యెవరికి లేహ్య భక్ష్య బోజ్య చోష్యములలో యేది సమ్మత మయితే వారు అది యెత్తి భక్షించ వచ్చును; విందు చేసేవానికి కావలసిన ప్రయోజనము బోజనము చేసిన వారికి యెట్లాగయినా కడుపు నిండవలసినది. శైవ వైష్ణవరాధనలను కలగచేసిన మతోద్ధారకులకున్ను అదేప్రకారము తమతమ మత ప్రవిష్ణులు తత్వము తెలుసుకొనేవరకు ఒక విధమయిన నామ రూపాలు యేర్పరచుకొని ఈశ్వర జ్ఞానముతో ఈశ్వరుని యెడల భక్తికలిగి గుండవలేననిగాని వేరే కాదు. జ్ఞానోదయము కావడానికి శాస్త్ర నిచారణమాత్రము చేసి యిక్కడి సమస్తజనులున్ను, బహుశ: అద్వైతద్వైతమత ప్రవిష్ణులుగానే వున్నారని నాకు తోచబడుచున్నది. మనదేశములో వుండే ద్వైత మతస్థులయిన మాధ్యులు ధరింఛే చక్రముద్రలు మాత్రము యీ దేశములో బహుమంది గోపీతో వేస్తారు.

క్రీశ్తు మతస్థులలో ప్రోటెష్ట్యాంట్సు అనే జాతులవారు విశిష్టాద్వైత మతాను సారముగా సృష్టికర్త అయిన యీశ్వరుడు చేతనా చేతనాత్మక మయిన అనేక జీవులను సృష్టించినాడు; కర్మలు తదంగమయిన ఆరాధనలవల్ల యీశ్వర దృష్టి అల్ప వదార్దాలమీద కలిగెతే ప్రమాదాన్ని యిస్తున్నవి గనుక, కర్మాలున్ను, తజ్జనితమయిన ఆరా ధననున్ను యేమి వద్దు, మనసా యీశ్వర భజన చేస్తూ వుండవలసినదని చెప్పుతారు. తురకలున్ను, అందు కనుసరణగా అనేక ప్రకారములయిన కర్మాలు తజ్జనిత మయిన ఆరాధనలున్ను వుంటే బుద్ల్ధి నిశ్చయము తప్పి పోతున్నది గనుక, ఒకటి రెండు విధములయిన కర్మాలను ఆరాధనల నున్ను యేర్పరచుకొని ఆమూలగముగా యీశ్వర భజన చేస్తున్నారు. తురకలకున్ను క్యాధేలిక్సులకున్ను తాము చేసే కర్మారాధనలలో వివాదమే కాని తత్త్వములో వుండనేరదని తోస్తున్నది.

భగవత్పాదు లయిన శంకరాచర్యులవారు అవతరించి దిగ్విజయము చేయక ముందర యీ కర్మభూమిలో దేహమే బ్రహ్మమని వాదించే ఒక ప్రమాదమయిన బౌద్ధమతము ప్రసిద్ధముగా వుండెను. యిప్పుడు ఆ మతము యీ దేశమందు ఖిలమయినా అంకురాలు మాత్రము అక్కడక్కడ ఉన్నవి. ఆ మతము పాలునే నెయ్యి అన్నట్లు స్థూల దేహాన్ని బ్రహ్మముగాను, యీశ్వరుడుగాను, అనేక దృఢయుక్తులతో వ్యవహరిస్తున్నది.

సచ్చిదానందమయిన పరబ్రహ్మ సంకల్పమనే మాయతో యుక్తుడయి సృస్టించిన అనేక బ్రహ్మాండములలో వసించే సృష్టి సంబంధమయిన యావజ్జనులున్ను అద్వైత విశిష్టాద్వైత ద్వైత దేహబ్రహ్మవాద మతాలకు లోబడి వుండవలసినదే కాని యితరముకాదని తోస్తున్నది. లేనిపక్షమందు దైవము గలదనే జ్ఞానలేశము లేకుండా ద్విపాత్పశువుల వలెనే ప్రవర్తింపుచు ఉండవలసినది. యింత కెక్కువ వేరేవుండనేరదు.

జ్ఞానజంతువు లయిన మనుష్యులకు ఆజ్ఞాన జంతువులయిన మత్వాదులకున్ను భేదమేమని విచారిస్తే యెట్లా అద్దాలంతా ఒకటే జనుసో తద్వత్తుగా జంతువులంతా ఒక దినుసేగాని వేరుకాదు. అయితే మన ప్రతిభాతి పుట్టవలసిన అద్దాలకు వనకతట్టు యెట్లారసము పూస్తామో తద్వత్తుగా యీశ్వరుడు తన ప్రతిభాతి కలిగే కొరకు బుద్ధి అనే రసాన్ని మానుష కోటికి వెనకతట్టు పూసి యున్నారు. అటువంటి రసము పూసిన అద్దాలకు కూడా యెట్లాచూచే పక్కముందుగా దుమ్ము అనే కల్మషము కప్పివుంటుంతో తద్వత్తుగా మౌఢ్యమనేమాలిన్యము మనుష్యులకు కమ్మిఉంటున్నది. ఆఅద్దాలపై కల్మషాన్ని మనుష్యులుతుడిస్తే యెట్లా తమప్రతిభాతి స్పష్టముగా తెలుస్తున్నదో తద్వత్తుగా సత్సంగతి కల్గడమువల్ల మనుష్యుల మౌఢ్యము వదిలి యీశ్వరాభాతి మనుష్యులబుద్ధిలో సంపూర్ణముగా కలగడానికి హేతువవుచున్నది.

బహుదినములుగా స్త్రీలు తిర్యగ్జంతువులవలెనే మోక్షార్హులు కాక నున్నారే! పుల్రుషులకు భోగార్హలా లేక పురుషులవలెనే వీరున్ను జ్ఞానవంతులయి మోక్షార్హులా? అనే శంక నాకు కద్దు. తిరువళ్ళూరి మహాముని రఘునాధాచార్యులు మొదలయిన పెద్దలను గురించి స్త్రీలు మోక్షసాంరాజ్యాన్ని పొందినట్టు భారత భాగవతాది సారవత్తు లయిన యితిహాస కధలలో యెక్కడనైనా వున్న జ్ఞాపకము గాని వున్నదా? తుదను స్వర్గాది భోగాలయినా వారు అనుభవించినట్టుగా గాని వున్నదా? తుదను స్వర్గాది భోగాలయినా వారు అనుభవించినట్టుగా గాని వున్నదా? అనిన్ని యితిహాసాదులలో పురుషులకు ఫలాని ఫలాని సుకర్మమును చేస్తే స్వర్గములో అనుభవించడానికి రంభాద్యప్సరసలు వున్నారని ఆశ చూపించియున్నిదిగాని ఫలాని మంచి కర్మము స్త్రీలు చేసుటవల్ల ఫలాని దెవతలతో స్వర్గములో క్రీడిస్తూ వుండవచ్చునని ఆశకూడా చూపలేదే! స్త్రీలు జ్ఞానవంతులయి మోక్షార్హులు యెట్లా అవుదురని ప్రశ్నచేస్తూ వచ్చినాను. వారువారు శానా ప్రయాసపడి స్త్రీలను పు;రుష సమానులుగా స్థాపించవలెనని యుక్తులు చెప్పినా దేవహుతి మొదలయిన తత్వబోధగల స్త్రీలనుగూడా వివాదములో దృష్టాంతములుగా తెచ్చినా తుదను నాసందేహమే వారినిన్ని పట్టుకున్నది గాని తేరుగడ అయినదికాదు.

నా బుద్ధిద్వారా నిశ్చయము చేసినది యేమంటే స్త్రీలకు పురుషులకున్ను హృత్కమలములు ఊర్ధ్వాధోభాగములయందు రెండేసి గ్రంధులనే ముళ్ళుగలిగి వుండేది నిశ్చయము. ఆధోభాగమందుండే గ్రంధి పరమాత్మ సంబంధమయిన దిన్ని ఊర్ధ్వభాగమందుండే గ్రంధి సంకల్పరూపం బయిన మాయా సంబంధ మయినదిన్ని ఔను. స్త్రీలకు గర్భధారణ నిమిత్తమయి ఆధోభాగమందుండే గ్రంధి ఫల కాలము రాగానే వీడబడి ఋతువనే సంజ్ఞను పొందుచున్నది. పురుషులకు మాయా సంబంధమయిన పూర్ధ్వ భాగమందుండే గ్రంధి ఫలకాలము రాగానే జ్ఞానోదయ సామాగ్రిని చేయడానికి వయిపుగా వీడబడిపోవుచున్నది. యిందుకు దృష్టాంత మేమంటే పురుషులకు యౌవనప్ర్రారంభమయిన వెనక బాల్యమునందుండే కంఠధ్వని సౌషవము వుండేదిలేదు; భేదింపుచున్నది. స్త్రీలకు మాత్రము జననాదారభ్య కంఠధ్వనియొకటే రీతిగా పురుషులకంటే హెచ్చుగా యధోచితమయిన శ్రావ్యతికలిగి ఉంటున్నది. యీరీతిని స్త్రీలకు పరమాత్మ సంబంధమయిన గ్రంధి వీడ బడి మాయా సంబంధమయిన గ్రంధి నిలిచి యుండడముచేత యెన్నటికిన్ని జ్ఞానోదయ మయ్యే పాటిబుద్దిన్ని స్థైర్యమున్నులేక మాయాసంబంధమయిన చాంచల్యముతో మనస్సు తల్లడింపుచున్నది; తద్వారా జ్ఞానమునిగా ముక్తిలేదు; గనుక స్త్రీలు ముక్తికి అర్హులుకారు; యధోచితముగా అజ్ఞాన జంతువులతో చేరినవారేను.

జ్ఞానార్హులు కాకపోతే అట్టేపోయెను కర్మభూమియందు ఉత్త్పత్తిఅయిన స్త్రీలకు మంచి కర్మాలు చేయు నిచ్చ పుట్టేటట్టుగా స్వర్గాది భోగాలనే మీది ఫలము కలదని తద్ద్వారా దేవతలతో సంభోగము కలుగుననే ఆశైనా వుంచరాదా అని యోచిస్తే అటువంటి ఆశపెట్టితే స్వకీయ పురుషుల యెడల భక్తిని వదిలి అటునియమించిన కర్మములే చేస్తూవుందురనే భయముచేత మన పూర్వీకులు ఆయాశకూడా పెట్టక వారికి చెప్పిన కర్మాలు యేమి ఉన్నా ఐహిక సంబంధమయిన అష్టపుత్ర బహుధనములున్ను భత్ర్రార్హనహ ఆయురారోగ్యములున్ను మాత్రమే సకల పురాణాదులలో చెప్పియున్నవి; తద్ద్వారా స్త్రీలు తిర్యగ్జంతువుల వలెనే యధోచితముగా పురుషులను భోగార్హలే కాని యితరము కాదని తొచుచున్నది.

యీ ప్రయాగ మహాక్షేత్రములో ఉండే పౌరాణికు డయిన మధురానాధు అనే మహారాష్ట్ర బ్ర్రాహ్మణుని స్త్రీలకు యేసుకృత కర్మముచేతనైనా పురుషజన్మము కలిగినట్టు పురాణేతిహాసములలో కద్దా? అని ఆదిగినాను. కొన్నికొన్ని పురాణాదులలో పుత్రులు సన్యసిస్తే పురుష జన్మము కలిగేటట్టు ఉన్నది, కొన్నిపురాణాదులలో సర్వధాయెప్పుడున్ను స్త్రీలకు పురుషజన్మము లేదని పరిష్కారముగా వున్న దని చెప్పినాడు గనుక యీ యుక్తుల ద్వరా విచారించగా స్త్రీలు లేని పోని పురుష యోగ్యము లయిన కర్మముల జొలికి పోక వేదాంతాలు విచారించి శుష్కవేదాంతలు కాక, పతిశుశ్రూష కుటుంబ సంరక్షణ మొదలయిన ఐహికపు పనుల యెడలనే ప్రవిష్టులుగా ఉండుట యుక్తముగా తోచుచున్నది.

ఈ ప్రయాగలో సకల పదార్ధాలు దొరుకును. సకల విధమయిన పనివారున్నున్నారు. సీమసామానులు అమ్మే యింగిలీషు షాపుకూడా ఒక బంగాళీ వేసుకొని ఉన్నాడు. యీ ప్రయాగలో అక్టోబరు నెల 12 తేది మొదలు 22 తేది రాత్రి వరకు వసించి 23 తేది ఉదయాన బజిరా అనే యిల్లుగల పడవ ఒకటిన్ని. నావా అనే సాధారణపు పడవ ఒకటిన్ని బాడిగెకు తీసుకొని గంగగుండా ప్రయాణమై సాగివచ్చినారు. యీ బజరాలనే పడవలు సుమారు 60 అడుగుల నిడివిన్ని, 20 అడుగులు వెడల్పున్ను కలిగి ఒకటి వెనక ఒకటిగా మూడు అరయిండ్లు యేర్పడి ఉంటున్నవి. ఆ యిండ్లు మంచి పలకలతో కట్టి సుందరమయిన రంగువేసి యున్నవి. కడావటిది మరుగు అర. నడిమిది పడకటర. మొదటిది కచ్చేరి కూటముగా ఉంటున్నది. యీ అరల కింద సామాను ఉంచడానికి ఒక అంతస్తు ఉన్నది. ఈ మూడు అరలమీద సవారీలు మూడువుంచి 30 మంది బోయీలు వుండవచ్చును. దీనికి కొయ్యలతో నీళ్ళు తోసేవారు మాలీలు అని 14 మంది మాంజీ అనే చుక్కాణి తిప్పేవాడు ఒకడున్ను ఉన్నారు. యిటువంటి బజరాకు సాధారణ మయిన బాడిగె దినానికి 7 రూపాయిలు. ఇక్కడకలదారలని, శిక్కారూపాయిలని చెలామణీ అవుచున్నవి. ఈ రూపాయలు మన దేశపు రూపాయి 1 కి ఒక అణాయెక్కువ అనుకోవలసినది. యీబజరాలు ఫలాని ఊరికి వెళ్ళడానకు యిన్ని దినము లని సర్కారువారు నిరుకుచేసి ఉన్నారు. యీ పడవ ఒకరికి ఒక తావుకు బాడిగెకు వచ్చి మళ్ళీ వచ్చిన తావుకు పొయ్యేట ప్పుడు మరిఒకడు బాడిగకు మాట్లాడుకుంటే ఆ నిరుకు దినాలలో సగము దినాలకే బాడిగయియ్య వలసినది. బజరాచేరే నిరుకుదినాలకు ఎంత తక్కువగా స్థలము చేరినా ఆ నిరుకుదినాల బాడిగె పూర్తిగా యివ్వవలసినది. అది యెట్లానంటే కాశికి ప్రయాగ నుంచి యీ కాలములొ బజరా 3 దినములకు చేరుతున్నది. అయినప్పటికిన్ని నిరుకయిన 15 దినాలకున్ను బాడిగె యియ్యవలసినది.

ఈప్రకారము దండు తీసుకొని అనేక పడవలు బంగాళానుంచి ప్రయాగకు వచ్చివుండి మళ్ళీ పొవుచుండగా ఒక బజరాను బాడిగెకు మాట్లాడి నిశ్చయము చేసుకున్నాను. యిది ఒకటే నాసల్తనకు నేను యిక్కడ ఉంచుకున్నంత మటుకు చాలును. అయితే దేశానికి పట్టుకుని పోవలసిన గంగాజలము యమున కలియకుండా ఇక్కడ దశాశ్వమేధ ఘట్టములోనే పట్టవలసినది నియమము గనుక సుమారు 400పళ్ల *గంగ 40 బానలలో పట్టియుంచినాను. ఆ గంగ కాశికి తీసుకురాగలందులకయి ఒకనావా 27 రూపాయిలకు మాట్లాడి కుదుర్చుకున్నాను. మెరకను నాలుగు దినాలకు కాశికి పోవచ్చును. ప్రవాహము తీసిన దినాలు గనుక గంగకుండా పోతే 6 దినములు పట్తునని యిక్కడివారు చెప్పినా పరీక్షార్దముగా నున్ను కూడావచ్చిన వారి అసోదా (విశ్రాంతి) నిమిత్తమున్ను ఊహించి గంగకుండా రావడ మయినది.

గంగా ప్రవాహకాలము ఇక్కడ శ్రావణ భాద్రపద మాసాలు. యిప్పట్లో తూర్పుగాలి కొట్టుచున్నది. ప్రవాహపు వడి ముందర గాలికూడా నిండా పనికిరాదు. యీ బజరాలకు మూడేసి చాపలు ఒక స్తంభమునకు కట్టుచున్నారు. నేను పోవడము తూర్పు గనుక నాకు గాలి యెదురయి యున్నది. యిక మంచుకాలము వచ్చే నెల మొదలు ఇక్కడ ఆరంభ మవుచున్నది. చైత్రమాసమునందున్ను, వైశాఖ మాసమునందున్ను, ఈ కార్తీకమాసమునందున్ను ఇక్కడ ఎండ తీష్ణముగా కాయుచున్నది. నాతో కూడా వచ్చిన సామగ్రిని మిరిజాపురమునుంచి కాశికి లొగడనే పంపించివేయగా మిగిలిన నాతో


  • చెన్నపట్నములో పాలు మొదలగు ద్రవములు కొలుచు కొలమానము ఒక పడి రమారమి ఒకటిన్నర సేరులు. కూడావున్న కంబళిదేరా ఒకటిన్ని, శిఫాయిడేరా ఒకటిన్ని ఒక కళాసునున్ను కూడా పడవలమీద ఉంచుకుని, గుర్రాలను, ఒక జత బోయీలను, కావడివాండ్లను, కాయలా మనుష్యులనున్ను మెరకను పంపించి బయలు చేరినాను.

గంగలో రాతిగొట్టులేదు. గంగాతీరమునందు వసతి అయిన ప్రదేశములో దిగి రాత్రి పగలున్ను వంట చేసుకొని తర్లిపోవుచు వచ్చినాము. ప్రవాహపు వడిచేత గంగమధ్యే మిట్టలు పెట్టుచున్నవి గనుక పడవలు, బజరాలున్ను మిట్టతగిలి పగిలిపోతున్నదనే భయముచేత రాత్రిళ్ళు పడవలు ఇక్కడ నడిపించరు. చేకటిపడగానే ఒక తావున పడవలు నిలుపుతారు. గంగలో సాయంకాలమునందు పరంగి కొండశాలలో గుఱ్ఱపుబళ్ళు నడిచేటట్టు *పడవలు బజరాలున్ను వచ్చుచుపోవుచున్నవి. గాలిలేక ప్రవాహానికి యెదురుకొని పడవలు పోవలసినప్పుడు పడవలకు తాళ్ళుగట్టి గట్టుననుండే మనుష్యులు యీడ్చుకొని పోతారు. ప్రవాహపు దారిగా గాలికి యెదురుకొని పొయ్యే టప్పుడు కొయ్యలతో నీళ్ళు తోస్తూ పోతారు. గాలి అనుకూలించి నప్పుడు ప్రవాహపుజోరు కలిగిన తావులలో చాపలుకట్టి మాలీలు వూరికే కూర్చుంటారు. చుక్కాణివాడి జాగ్రత మాత్రము సర్వకాలమందు న్నుండవలసి యుంచున్నది.

గంగ భూమి మట్టానికి బహు లోతుగా ప్రవహింపుచున్నది గనుక ఊళ్ళు నిండా గంగ సమీపమునందు ఉండకపోయి నప్పటికిన్ని గంగకు యిరుపక్కల అడుగుకు ఒక ఊరు వున్నట్టుగా దగ్గిర దగ్గిర ఊళ్ళు వుండి వున్నవి. వాటి పేళ్ళు విచారించడానికి గంగలో రావడముచేత పయిపు లేకపోయెను. వాటి పేళ్ళు పడవతోశే మాలీలకు కూడా తెలియదు. గంగలో రాగా కనుపడ్డ ప్రసిద్ధ స్థలాలు యేవంటే వింధ్యవాసిని 1, మిరిజాపూరు 2, చెన్నాడుగడ అనే బస్తీకోట కలిగిన షహరు 3, చోటా కలకత్తాయనే దండు 4, రామనగరము వ్యాసకాళి అనే ద్వినామములు గల బస్తీ షబరు 5.


  • చెన్నపట్టణములో ఆనాడు దొరలు విహరించు స్థలము మౌంటు రోడ్దులో నీడకోసం రెండుపక్కలా వెయబడిన చెట్ల బజారులోనే. చెన్నాడుగడ వద్ద ఒక కొండవున్నది. ఆ కొండమీదనే గంగ ఒడ్దుగా ఒక కోట యున్నది. దాన్ని యింగిలీషువారు ఇప్పటికి బహు బస్తీగా ఉంచుమొన్నారు. కాశికి యెదట గంగకు ఇవతలి పక్కనుండే వ్యాసకాశీలో 26 తేది రాత్రి 8 ఘంటలకు ప్రవేశించినాను. ఇక్కడికి కాశీపట్టణము తెలియుచున్నది. నిత్యము చంద్రాస్తమయమయ్యేవరకు నా పడవలు తోయిస్తూ వున్నాను గనుక అదేరీతిగా యింకా రెండు గడియలు తోయిస్తే కాశి చేరుదును. అయితే ఉప వాసముతో మహానగరము చేరవలసిన నియమము గనుక యిక్కడనే ఈ రాత్రి వసించడమైనది.

గంగలో బజరాలమీద వెళ్ళే సౌఖ్యము అనుభవ వేద్యము గాని వ్రాయ శక్యము కాదు. దిగిన తావున పారా యియ్యడానికి మాత్రము మనవంటి వారికి మనుష్యులు చాలివుండవలసినది. సామాన్యపు ముసాఫరులు పడవలమీద వస్తే పెరిమిట్టు మనుష్యులనే సుంకం బంట్రౌతులు సోదా యియ్యవలె ననే బహనా (వంక; నెపము) ప్రతి వూరిదగ్గర పెట్టి యేమైనా లంచము యియ్యకపొతే మూట ముల్లెలు నిచ్చి అభాసు చేసి పడవలను నిలిపి బహు తొందర పెట్టుతారట. పేదలకు ప్రయాగనుంచి కాశికి రావడానికి పడవకు యిచ్చే బాడిగె గాక మనిషికి 1 కి రూపాయి వంతున లంచాలకింద తగులుతున్నదట. యీ లంచాలు మూలకముగానే యీ ఘాట్లు సుంకపు దారొగాలకు జీతము పదిఅయిదు రూపాయలు అయినా యిన్నూరు మున్నూరు రూపాయలు నెల 1 కి సంపాదించేటట్తు మిరిజాపూరులో నాకు తెలిసినది. ప్రయాగలో జూసీసరాయి సుంకము వారికి నా మిత్తమై జరిగిన దాపువల్లను, ఆ జిల్లా బంట్రౌతులు కూడావున్నందుచేతనున్ను అటువంటి శ్రమ నాకు యెక్కడా కలిగినది కాదు.

హయిదరాబాదు మొదలు యింగిలీషుదొరల వద్దికి మనవంటి వారు పోయి రాగానే కొంచెములొ తృప్తిలేని ఆదొరలవద్ది నకీబులు చోపుదార్లు వగయిరాలు యినాములకు వచ్చుచున్నారు. యీ దుబారు ఖర్చు విస్తారముగా అక్కడక్కడ తగులుతూ వచ్చినది. యీ ప్రయగలో పైన వ్రాసిన దాపువల్ల అటువంటి ఖర్చు ఒక గవ్వ అయినా తగిలినది కాదు. ప్రయాగలో స్నానఘట్టపు బంట్రౌతులు నిత్యము నా సేవచేస్తూ వచ్చినందున వారికిన్ని నా తయినాతి బరక్రదాసు బంట్రౌతులకున్ను మాత్రము నేను వచ్చేటప్పుడు కొంచెము యినా మిచ్చినాను.

ప్రయాగ యిండ్లు, అంగళ్ళు యధోచితమైన వెడల్పు గలవిగానే కట్టివున్నవి. ప్రయాగలో చెప్పే సంకల్పక్రమము మన దేశమువలెనే 'భరతఖండే' అనే మట్టుకు చెప్పి అటుతర్వాత 'ఆర్యావత్రాంతగ్రత బ్రహ్మకైవర్తె కదేశే, విష్ణు ప్రజాపతి క్షేత్రే, షట్కోణమధ్యే, అంత ర్వేద్యాం, భాగీరధ్యా: పశ్చిమే బాగే, కాలింద్యా: ఉత్తరే తీరే, నటస్య పూర్వదిగ్భాగే, విక్రమశకే, బౌద్ధావతారీ, ప్లవనామ సంవత్సరే' అని పిమ్మట మనదేశరీతిగా మాసము తిధి మొదలయినవి చెప్పవలసినది. కాశిలో చెప్పే సంకల్పక్రమమేమంటే 'ఆర్యావత్రైకదేశే, అవిముక్త వారణాసీక్షేత్రే, అసివరణయోమ్ర ధ్యే:, మహాశ్మశానే, అనందమనే, గౌరీముఖే, త్రికంటకవిరాజతే, భాగీరధ్యా: పశ్చిమేతీరే, బౌద్ధావతారే, విక్రమశకే, ప్లవనామసంవత్సరే' అని చెప్పవలెను. ఇటువంటి కాశీమహాక్షేత్రమును అకుటోబరు 27 తేది ఉదయమయిన 8 ఘంటలకు శ్రీరామకటాక్షముచేత చేరినాను.

పండ్రెండవ ప్రకరణము

కాశీపట్టణములో నిండా జనసంఘము కలిగివుండును గనుక వూరికి బయట అసివద్దవుండే తోటలలో ఒక తావున దిగవలెనని యోచిస్తిని. వాట్లలో స్థలము సంకుచితముగా వుండినందున నున్ను మణికర్ణిక మొదలయిన స్థలాలకు దూరమవుట చేతనున్ను కాశీతంబురాయనియొక్క కేదారఘట్టములో వుండే రెండు అంతస్థులు నాలుగు ముంగిళ్ళు కల ఒక పెద్దయింట్లో దిగినాను. నాకోసరమై ఆస్థలము ముందుగా ఖాళీచేసి శుద్ధి చేసివుంచియున్నందున బహుసౌఖ్యముగానే వుండెను. ఆయిల్లు గంగ యొడ్దుగానే వున్నందున సమ్మతి అయినప్పుడు మిద్దెమీదినుంచి గంగా దర్శనము చేయాడానికి అనుకూలముగా వుండినది. ఈ కాశీస్థలానికి బాధ్యులుగా గంగాపుత్రులనే వారు 1200 యిండ్లువారు ఉన్నారు. వారు క్షాత్రశౌర్యాల చేత దొరతనము చేసే వారని, గంగాయాత్ర చేయ వఛ్ఛేవారివద్ద గుఱ్ఱానికి 12 రూపాయల వంతున నున్ను, మనిషికి 4 రూపాయల వంతుననున్ను, గాడీకి యాభై రూపాయల వంతున నున్ను యాత్రవచ్చే వారిని ముందుగా చూచిన గంగాపుత్రుడు తీసుకొని మణికర్ణికలో స్నానము చేయింపుచు, యివ్వక స్నానముచేసి మొండాటలాడితే కొట్లో వేసి కోర్టు సెలవులతోకూడా తీసుకుంటూ, బహుశా యియ్యని వారిని యియ్యచాలని వారినిన్ని తమ పోకిరితనము చేత మానభంగమున్ను, దేహబాధయున్ను పెట్టుతూ వచ్చుచున్నారు. వీరికి భయపడి శరభోజీ మహారాజు *అంతటి వాడు, కేదార ఘట్టమే వృద్ధమణికర్ణికయని ఒక పురాణ ప్రమాణమును పట్టి క్షౌర శ్రాద్ధాలు కేదారఘట్టలో గడిపినాడు. విజయనగరపు రాజు కాశికి వచ్చిన్ని ఒక సంవత్సరము మణికర్ణిక స్నానము లేక నుండినాడు. యిక పేదల గతి చెప్పవలసినది లేదుగదా! యిటువంటి సమూహమువల్ల నాకు ఒక అభ్యంతమున్ను లేకుండా నన్ను రామటెంకివద్ద యెదురుకున్న రామరహల్లు అనే గంగాపుత్రుడు గోపీగంజులోనే నేను యిచ్చినది తీసుఒని యాత్ర చేయించేటట్టు దస్తవేజు వ్ర్రాసియిచ్చి ప్రయాగ వరకు కూడావచ్చి నా సహితముగా కాశి ప్రవేశించి నందున యధాశాస్త్ర ప్రకారము మహా స్థలము చేరిన మరుసటి గడియకే మణికర్ణికకు వెళ్ళి అక్కడ చక్రతీర్ధములో భేటికి అని ఒక మొహరు ఫలపుష్ప సహితముగా నుంచి ముందర స్నానము చేసి పిమ్మట క్షౌరానికి సంకల్పము చేసుకొని క్షౌరానంతరము మణికర్ణికలో స్నానముచేసి గంగాపూజ చేసి గంగాపుత్రుల సమూహానికి భూరి దక్షిణ అని పదిహేను రూపాయలు, ఘాటీయాలనే గంగాతీర స్నాన ఘట్టమునందు వుపచరించేవారి కని, పదిరూపాయలు, కంగాళీల


  • ఈయన తంజావూరి మహారాజు, 1788 లో తండ్రి చనిపోవునాటికి 9 ఏండ్లవాడు. పినతండ్రి రాజ్యాక్రమణ చేయిగా కుంఫిణీవారి నాశ్రయించి 1797 లో రాజ్యము పొందెను గాని రెండేండ్లలోనే పించనుదారు డయ్యెను. ఈయన 1833 లో చనిపోయినాడు. బిషప్ హేబరు 1826 లో ఈయనను దర్శించినాడు. కని అయుదు రూపాయలున్ను భూరి యిచ్చి నేను దిగిన స్థలము ప్రవేశించినాను. ఆ మరునాడు నాతో కూడావచ్చిన బ్రాహ్మణులందరిచేత తీర్ధశ్రాద్ధాలు పెట్టించడ మయినది. నాలుగొ దినము నేను తీర్ధ శ్రార్ధము పెట్టడమయినది. యీ మహా స్థలములలో అన్ని శాఖల బ్రాహ్మణులున్ను సమూహాలుగా వున్నందున శాఖకు యాభై మంది వంతున అధిశ్రవణనకున్ను, యిష్టబంతికిన్ని పిలిపించినాను. పావులా దక్షిణతో వారు సంతోషించినారు.

యీ కాశిలొ మణికర్ణికకు మహాత్మ్యము వచ్చినందుకు కారణ మేమంటే విష్ణువు చక్రము చేత తీర్ధము కల్పించుకొని తపస్సు చెస్తూ వుండగా పార్వతీసమేతముగా శివుడు అక్కడికి వచ్చినంతలో పార్వతియొక్క కర్ణికామణి ఆ తీర్ధములో పడిపోయెను గనుక శివుడు వెతికినట్టున్ను, విష్ణు మాయచేత దొరకనట్టున్ను, తదనంతరము విష్ణువు బావమరిది వొప్పారితో హాస్యముచేసినట్టున్ను, తదనంతరము ఆ చక్రతీర్ధము పార్వతీకర్ణికామణినిన్ని శివుని మానసమునున్ను, ఆకర్షించి విష్ణుచక్రోద్భవమున్ను అయినందున గంగ భగీరధుని నిమిత్తము భూలోక ప్రవేశమయినప్పుడు యీతీర్ధమహాత్మ్యము తెలిసి యీతీర్ధ సంగమము చేసినది గనుక యీ మణీకర్ణికా ఘట్టము యీస్థలానికి అతి ముఖ్యమయినది. ఆ చక్ర తీర్ధములోనే ప్రధమస్నానమును కాశి ప్రవేశించగానే అందరున్ను చేయవలసినది. ఆ చక్రతీర్ధము మణికర్ణికా ఘట్ట సమీపమునందు ఒక చిన్నగుంటగా యున్నది. ఆ తీర్ధాన్ని గంగాపుత్రులు అక్తమించుకోవడముమాత్రమే గాక సదా ఆవరించుకుని వుంటున్నారు.

యీ కాశికి బహుపుణ్య కాలమున్ను, బహు మహోత్సవ కాలమున్ను, బహు జనాకర్షణ కాలములమున్ను యేదంటే కార్తీకమాసము. ఆ కార్తీకమాసములోను శుద్ధైకాదశి మొదలు పున్నమవరకు పంచదినములు పంచరత్నాలని పేరు వహించివున్నవి. యీకార్తీకమాసము మొప్పైదినములు లక్షావధి ప్రజలు కాశికి స్నానాల నిమిత్తముగా వస్తారు. కృత్తికా నక్షత్రము అదర్శవము కాక మునుపే అందరునున్ను పంచగంగా ఘట్టమందు స్నానమి చేస్తున్నారు. శ్రీరామ కటాక్షము యీ పంచరత్న దినములొనే నన్ను యీ కాశిలో ప్రవేశింప చేసినందున పున్నమస్నానము ఆ పంచగంగా ఘట్టములో చెయ్యడమయినది. యీ పంచగంగా ఘట్టము పంచపాండవుల తపోబలముచేత యింత ప్రసిద్ధమయినట్టు పురాణ సిద్ధము.

కాశి పట్టణమునకు ఉత్తరమున 'వరణ ' దక్షిణమున 'అసి ' అని రెండు నదులు కాలువలుగా గంగలో సంగమ మవుచున్నవి. అసి అనే కాలువ అతి స్వల్పము. యీమధ్యేవుండే భూమి వారణాసి అనే పుణ్య క్షేత్రమయినది. యీ అసివరణల మధ్యే గంగ ధనురాకరముగా ప్రవహింపువున్నది. గంగకు పడమటి యొడ్డున కాశీపట్టణము యేర్పడి యున్నది. అసివరణల మధ్యము అవిము క్తక్షేత్రము గనుక యిక్కడ దేహము వదలిన జీవాత్మునికి తారకోపదేశము అవుచున్నదని పురాణ ప్రసిద్ధము. గనుక గంగాతీరము నందు యిండ్లు స్నానఘట్టాలున్ను నారు పోసినట్టు వీధులకు కూడా యెనిమిది అడుగుల భూమి విడువ కుండా జానడు జానెడు భూమికి వేలమోడిగా రూపాయలు యిచ్చి స్థలము విశాలముగా కావలిసివస్తే మిద్దెమీద మిద్దెగా యేడేసి అంతస్థులు కూడా కట్టుకుని కాపురము చేస్తూవున్నారు. యీ అసి-వరణల మధ్యే గంగాతీరమందు భూమి కొనవలస్తే పూనా శ్రీమంతుడు *వగయిరాలకు శక్యమేగాని సామాన్యులకు వయిపులేదు. అసివరణల మధ్యే కేదార ఘట్టము మొదలు రాజఘాటు వరకు అహల్యాబాయి, !నాగపూరిరాజు, శింధ్యావగయిరాలు అనేకలక్షలు వ్రయముచేసి కాపురానికి యిల్లున్ను


  • పీష్వా అని చరిత్రలో ప్రసిద్ధిజెందిన మహారాష్ట్ర ప్రధానమంత్రి, తరువాత కొంతభాగము నకు రాజయ్యెను. పునహా అరని రాజధాని.

!అహల్యాబాయి ఇందూరు రాజగు మలహల్ రావు హోల్కారు భార్య ఈమె 20 అ ఏటనే భర్త మరణించాడు. కొమారు డప్రయోజకు డైనాడు. ఈమె సహగమనం చేయదలపగా ప్రజలు వారించి రాజ్యాధికారం వహించ మని ప్రార్ధించారు. 1765 మొదలు 30 సంవత్సరా లీమె ఇందూరును అతి సమర్ధతతో పరిపాలించింది. ఈమె సద్గుణములను, దాతృత్వమును, తెలివితేటలను ఇంగ్లీషువారు కూడా మెచ్చుకున్నారు. ఈమె హిందూదేశములో అనేక పుణ్యక్షేత్రాలలో గొప్ప దాన ధర్మాలు చేసి 1795 లో స్వర్గస్థురాలైంది. స్నానానికి ఘట్టమున్ను శివప్రతిష్టకు గుడిన్ని ఒకటిగా కలిపి కట్టుతూ వచ్చినారు.

సవారీలలో స్నానానికి ఒక ఘట్టమునుంచి ఒక ఘట్టానికి పోవడము వీధుల కునందిచేత ప్రయాస గనుక చిన్నపడవలమీద పరువుగలవారు గంగగుండాపోతూ వస్తూ వుంటారు. ఆ ప్రకారము పోయి వచ్చేటప్పుడు చూడడమునకు ఆ పట్టణము అతిసుందరముగానున్ను అత్యద్బుతముగాను న్నుంచున్నది. అందులో శ్రీధర మునిషి అనే వాడు కట్టిన ఘట్టము, అహల్యాబాయి కట్టిన ఘట్టము మరికొందరు గోసాయీలు కట్టిన ఘట్టలున్ను సుందరముగా నున్నవి.

ఆ అసి-వరణల నడిమి పుణ్యఘట్టము లేవంటే పరణాఘట్టము, రాజఘట్టము, త్రిలోచన ఘట్టము, దుర్గాఘట్టము, పంచగంగా ఘట్టము, మణికర్ణికా ఘట్టము, దశాశ్వమేధఘట్టము,కేదారఘట్టము, హనుమద్ఘట్టము, అసిఘట్టము న్నునవి. త్రిలోసన ఘట్టమువద్ద చెన్నపట్టణములో కష్టం హవుసురేవు వలెనే సకల ధాన్యాలు భోళా అనే పెద్ద అంగళ్ళు పెట్టి మొత్తపు విక్రయాలు చేయుచు వున్నారు. రాజ ఘాటులొ ముఖ్యమయిన సుంకపు చావిడి వుంచున్నది.

కాశీవాసము యధావిధిగా చేశేవారు యీ అడుగున వ్రాసిన శ్లోక ప్రకారము ఆయా ఆలయాలకు వెళ్ళి అయా మూర్తులను ఆరాధించి రావలసినది. శ్లో|| విశ్వేశం మాధనం ధుండిం దండ పాణించ భైరవం | వందే కాశీం గుహాం భవానీ అనే అన్నపూర్ణ ఆలయము, ధుండి వినాయకుడి ఆలయమున్ను కేదారఘట్టానికి సమీపముగా మణికర్ణికకు పొయ్యె దోవలోనే యున్నవి. అటువెనుక దుర్గాఘట్టమువద్ద కాలభైరవుడి ఆలయము దండపాణి ఆలయము వుండియున్నది.

పంచగంగా తీమునందు బిందుమాధవుడి ఆలయము వున్నది. అక్కడికి సమీపముగా తురకల మశీదు ఒకటి ఆశ్చర్యకరమయిన యున్నతము కలిగి రెండు స్తూపీలతో నిర్మించపడి యున్నది. ఆ రెండు స్తూపీల కొనకు పోవడానికి లోపలనే మెట్లు కట్టియున్నది. ఆ రెండు స్తూపీలు సుమారు యేనూరు అడుగుల పొడుగు వుండవచ్చును. తొలుకాలమందు అకబరు పాదుషా కాశీ యావత్తూ తురకాణ్యము చెయ్యవలె నని తలచి ముఖ్య మయిన గుళ్ళు యావత్తు కొట్టి పాడుచేసినప్పుడు యీ మసీదును కట్టినాడట *అద్యాది అది నిర్మించబడి యుండే శృంగారము యింగిలీషువారిని కూడా మరామత్తు చేశేటట్టు ప్రేరేపణ చేసినది. యిప్పుడు వుండే విశ్వేశ్వరుడి ఆలయము మొదలుగా అనేకములు నూతన నిర్మాణములై వున్నవి.

పయి శ్లోకములో నుండే గంగా అనే తీర్ధము ఒక కొలను స్వరూపముగా పట్టణమునకు పశ్చిమ భాగమందు యుండి యున్నది. కాశీ దేవి అనే త్రిలోచనేశ్వరుడి ఆలయము వద్ద దుర్గాఘట్టములో యున్నది. గుహా అనే ఒక బిలము కాశీ పట్టణమునకు దక్షిణభాగమందున్నది. యీ కాశీ ఖండములో విష్ణుసాదిగా త్రిమూర్తులులేమి యింద్రుడాదిగా దేవతలేమి ధృవుడాదిగా తేజస్వరూపాలేమి సూర్యుడాదిగా గ్రహాలేమి అగస్త్య్లుడాదిగా ఋషులేమి ఈ అవిముక్త క్షెత్రమందున్న ఆనందవనములో లింగప్రతిష్ట చేసి ఆరాధన తపస్సు పురస్సరముగా ఆ యా విభూతులను సంపాదించుకొన్నట్టు యున్నది. గనుక ప్రతిలింగానికి అగస్త్యేశ్వరుడని, రామేశ్వరు డని ఒక్కొక్క పేరుగలిగి అవి వొకానొక దినమున అక్కడి ఆరాధన ప్రాబల్యము కలగచేసుకొని ఉండియున్నది. ఆ యా నియమింప బడిన దినములలో ఆ యా స్థలాలలో జనసంఘము మిక్కటముగా నుంచున్నది.

ఇక్కడ నుండే ఆలయాలు అన్ని సంకుచితములుగా నున్ను అరిటిపువ్వందముగా సాదాస్తూపీలు కలిగి అర్చకులపట్ల నిండా కాపులేకుండా నున్ను వృషభముల చేత ఆవరింపబడిన్ని యుంచున్నవి. ఆరాధనచేశేవారు పత్రపుష్పఫలతోయములతో తామే, శక్తి కలిగి నంతమట్టుకు ఆయా ఆలయములలో మూర్తులను జాతినియమము లేకుండా ఆరాధనచేయుచు వచ్చుచున్నారు. కాచియుండే


  • ఇది పొరబాటు ఈ మశీదుకట్టినది జౌరంగజేబు చక్రవర్తి. విశ్వేశ్వరాలయం క్రీ. శ. 1669 ఏప్రిలులో నాశనం చేయబడింది.

అర్చకులు, వచ్చిన ఉపపన్నులను యాచిస్తూ పేదలు ఇచ్చేదాన్ని పుచ్చుకొంటున్నారు.

యీక్షేత్రములో పర్వత ఆలయములలోని అర్చకులు పంచగౌడులతో చేరినారు. కాలభైరవుని అర్చకులుమాత్రము కానుపడాలని ఒక వింతజాతివారు. చెవులు మధ్యప్రదేశములో బొందచేసుకొని స్ఫటిక బిళ్ళలను ధరించియున్నారు. మణికర్ణికా ఘట్టమునందు గంగాపుత్రులున్ను ఘూర్జరులున్ను వసింపుచున్నారు. దుర్గాఘట్టాములో మహాజను లనే సాహుకారులు పూర్వీకులైన స్థలజ్ఞులున్ను వసింపుచున్నారు. కేదారఘట్టములో కంగాళీలనే దక్షిణదేశస్థులు యాత్రార్ధముగా వచ్చినవారు మిక్కటముగా వసింపుచున్నారు. దుర్గాఘట్టములో ఇండ్లు వున్నతములుగా అంతస్థులు యెక్కువగా కలిగి యున్నవి.

మణికర్ణికకు దక్షిణమున సమీపముగా చౌకంబా అనే గుజరీ అంగడి యున్నది. యీపట్టణములో పీతాంబరాలేమి సకల విధములయిన వస్త్రములేమి అపూర్వము లయినవి కావలసినంత మట్టుకు దొరుకును. పాత్రసామానులు అపారముగా అమ్ముతూ ఉన్నారు మహాజనులు రత్నాలు మొదలయినవి అమ్ముతూ వున్నారు. లక్కునో *మొదలయిన సమస్థానములకు కావలసిన ఆభణాలు రత్నములున్ను యిక్కడి నుంచి పోవుచున్నవి.

పట్టణానికి వుత్తరముగా గంగా సంగమము అయ్యే వరణ పట్టణమును చుట్టుకొని పడమరగా ప్రవహింపుచు దక్షిణమున అసితో


  • లక్కునో అయోధ్య నవాబు రాజధాని.

ఈనవాబు మొగలాయి చక్తవర్తికాలములో రాజప్రతినిధి తరువాత స్వతంత్ర రాజు. ఇంగ్లీషువారు ఇతనితో స్నేహంచేస్తూ ఇతనివల్ల చాలా సొమ్ము సంపాదించారు. ఇతని దర్భారు అతివిభవంగా వుండేది. ఇతడు దొరల మెప్పుకోసం అమితసొమ్ము ఖర్సుపెట్టి అప్పులపాలైనాడు. అత్యధికవడ్డీలతో ఇతనివల్ల దొరలు చాలా పత్రాలు వ్రాయించుకొన్నారు. అయోధ్యరాజ్యం పాడిపంటలతో తులతూగుతూ సుభిక్షంగా వున్నందువల్ల ఎలాగైనా దీన్ని కాజెయ్యాలని కంపెనీవారితని పరిపాలన బాగులేదని ప్రజలు భాధపడుతున్నారని దుష్టప్రచారంచేస్తూ చివరకు 1857 లో ఇతని త్రోసి రాజన్నారు. ఈ నవాబు సద్గుణాలను విభవాన్ని బిషప్ హవరుగారు 1821 లో వర్ణించారు. కలిసి వుంచున్నది గనుక ఆవరణకు బహి: ప్రదేశములో జాతులవారు సిక్కులూరు అనే ప్రదేశములో ఇండ్లు తోటలు కట్టుకొని వసింపుచున్నారు. ఇక్కడ ఉండే అధికారస్థులు గౌనరు జనరల్ యేజెంటు అనే సర్వాధికారి ఒకడు, అప్పీల్ కోరటు జడ్జీలు ముగ్గురు, కష్టం కలకటరులు యిద్దరు, జడ్జీ ఒకడు, మేజస్ట్రేటు ఒకడు; వీరుగాక రెండుమూడు పటాలాలు ఇక్కడ వునికిగా ఉంచున్నవి గనుక వాటిలో చేరిన దొరలు ఒక జనరల్ సహితముగా వసింపు చున్నారు. లోగడును యీ పట్టణములో టంకసాల ఉండెను; ఇప్పుడు యెత్తివేశినారు. యీ దొరల కచ్చేరీలు అన్ని శిక్కులూరిలో ఉన్నవి.

యీపట్టణములో కొత్తవా లనే ఒక పెద్దఉద్యోగస్థుని కచ్చేరీ యున్నది. ప్రతి వీధికి ఠాణా లున్నవి. యిక్కడి వీధులకు గళ్ళీలని పేరు. ప్రతి గల్లీకి పాటక్కు అని తలుపులు ద్వారబంధనాలు పెట్టివున్నవి. ప్రతిపాటక్కునున్ను రాత్రి 10 ఘంటలకు బిగింపుచున్నారు. అవతల జనులు తిరుగులాడడము ప్రయాస. ఠాణా బంట్రౌతులు బరక్రదాసులనే పేళ్ళతో రాత్రిళ్ళు గస్తు తిరుగుతూ వున్నారు. వీరందరున్ను కొత్తవాల్ ఉత్తరువుకు లోబడి వున్నారు.

సమస్తమయిన కూరకాయలున్ను ఫలాలున్ను అపరిమితంగా దొరుకుచున్నవి. అందులో ఇక్కడి ముల్లంగిగడ్డల గాత్రమున్ను పొడుగున్ను నేను యీసరికి యెక్కడ చూచినవాణ్ని కాను. కూరగడ్డలని వేలెడులాఫు గల గడ్డలు వాటి ఆకు సహితముగా అమ్ముతూ వున్నారు. కిచ్చిలి మణీలా పండ్లు, కిచ్చిలి కమలాపండ్లున్ను చెట్లకింద రాలి యెత్తేవారు లేక నున్నవి.

గొప్పయిండ్లు పట్టపగలే చీకటిగా ఉంచున్నవి. ఘాటేయా లనే స్నానొపచర్యలు చేసేవారు అనేక జాతులుగా కలిసి యుంచున్నారు. అసివరణల మధ్యే 1200 మంది ఆయా స్నానఘట్టాలలో పలకలు వేసుకుని ఉపచర్యాద్రవ్యా లయిన విభూతి గోపీసందనము మొదలయినవి ఉంచుకొని యున్నారు. స్నానఘట్టములలో వారి యధికారము ఎక్కువ. యీ గంగా పుత్రులు ఘాటియాలు కాక ఠాణీలని పంఛ పూజలని ప్రసిద్ధముగా చేయుచున్నారు. 30 రూపాయలలో ముఖ్యమైన స్థలములలో మహాపూజలు జరుగుచున్నవి.

పట్టణమునకి దక్షిణ భాగమున అసీతీరము నందు దుర్గాగుడి ఒకటి యున్నది. ఈ దేవత ఈ పట్టణమునకు కావలిగా వుండే శక్తియని పురజనులు మెండుగా ప్రతి మంగళవారమున్ను వెళ్ళి ఆరాధింపు చున్నారు. ఈగుడి తక్కిన గుళ్ళకన్నా విశాలముగా నున్నది. సమస్త మయిన గుళ్ళున్ను యెక్కడ చూచినా నిత్యయాత్రచేసేవారు అభిషేకనిమిత్తమైపోశే ఉద్దరిణి నీళ్ళతోనున్ను బిల్వదళములతో నున్ను తిలాక్షతలతోనున్ను నిండియున్నవి. యీబిల్వపత్రములు తిలాక్షతలున్ను తినడమునకు వృషభములు లోగా సంచరింపు చున్నవి. కాబట్టి పూజించ పొయ్యేవారు పుష్పమాలికలున్ను, బిల్వదళములున్ను, చేతులో తెలిసేటట్ట్లు యుంచుకుంటే ఈ వృషభములు పయిన పడుతున్నవి. నిత్య యాత్ర చేసే నిమిత్తముగా వేలపర్యంతము స్త్రీలు, పురుషులున్ను, పిడికిలి కణిగిన బుట్టలలో డబ్బిలలో నున్ను బిల్వపత్రము, తిలక్షతలున్ను ఉంచుకొని, మరియొకచేత ఉదకము తీసుకొని, చూచిన లింగానికిన్ని లింగము ఉండే ఆలయ ద్వారము మూసియుండే పక్షమందు ఆ ద్వారపు కడప మీద ఒక ఉద్ధరిణీ ఉదమకుతో అభిషేకము చేసి ఒక బిల్వపత్రము వేసి కొన్ని తిలాక్షతలు చల్లుచు వచ్చుచున్నారు. స్నాననియమము ప్రతి మనిషికిన్ని కలిగియున్నది. శూద్రులుకూడా శిరస్నానము చేయక భోజనము ఛేయరు. ఈ దేశపు బ్రాహ్మణులు ఇతర వర్ణాలను నిండా అనాదరణ చేసి అగౌరవ పరచనందున కర్మహీనులుగా చేయవలెననే క్రీస్తు మతస్థులు ప్రయత్నము ఈ దేశములో ఈ సరికి మిక్కిలి సాగలేదు.

ద్రావిడ దేశములో శూద్రులనున్ను, ముఖ్యముగా చండాలులనున్ను అగౌరవ పరుస్తూ, శూద్రుల దృష్టిన్ని చండాలుల సమీప వర్తిత్వమున్ను కూడని నిండా అగౌరవ పరచడము చేత, వేల పర్యంతము ప్రజలు క్రీస్తు మతస్థులుగా పెదపాళెము మైలాపూరు క్రీస్తుగుళ్ళ వుత్సవాదులలో చూడబడుచున్నారు. భ్రాహ్మణులకు శ్రుతి చోదితములయిన కర్మాదులను చేసుకొనుచు "స్వస్తి ప్రజాభ్యం ద్రావిళ్ళు పంచగౌడులతో చేరిన యాచకులు 15000 మంది దాకా వున్నారు. అందులో పంచద్రావిళ్ళు సగమని చెప్పవచ్చును.

ఈ కాశిలో వుండే వుపద్రవాలు మూడని చెప్పుకొనుచున్నారు. అవి యేవంటే - 'రాండు - సాండు - చీడీ' అని మూడు వుపద్రవాలు కలవు. రాండు అనగా విధవస్త్రీలు, సాండు అనగా వృషభములు, చీడీలు అనగా మెట్లు. విధవలు నిండా యాచించడము చేతనున్ను,దుర్మార్గపు బాలవిధవలు ఇతర నడతలు కలిగి యుండుట చేత నున్ను వారివల్ల బహు పీడ లోకులకు కలిగి యున్నది. వృషోత్సర్జనము చేసి లోకులు అనేక వృషభములను పట్టణములో విడిచి పెట్టినందున యీ గల్లీలలో మనుష్యులతోటి పాటు మెలగి సంచరింపుచు ఉంచున్నవి. ఇట్లా నుండగా వాటికి రంధి పుట్టినప్పుడు మనుష్యులను చాలా హింస పెట్టుచున్నవి. చీడీలని ప్రతి గల్లీలలో మెట్లు యెక్కి దిగవలసినది. వైపు తప్పి పడ్డవారికి కాళ్ళు చేతులు విరగడము కద్దు.

గొసాయీలు ధనికులుగా మహాజనాలనే పేరు పెట్తుకుని సాహుకారు పనులు చేయుచున్నారు. భిక్షాటకులుగాను బహు మంది బయిరాగులతోటి పాటు సంచరింపుచు ఉన్నారు. కంగాళీలనే భిక్షాటకులకు లెక్కలేదు. సవారీ సమేతముగా యాత్ర వచ్చేవారిని యాచించే కంగాళీలు పక్కీతులు గల్లీలలో సవారీని సాగనియ్యరు.

ఈ కాశీ మహా క్షేత్రములో అధర్వణ వేదమును కొందరు ఘూర్జరులు అధ్యయనము చేసి యున్నారు. ఆ వేదస్వరము ఋగ్వేదస్వరమునకు సమీపముగా నున్ను, ఉదృతముగా నున్ను, యున్నది. యజుర్వేద్ములో మాధ్యందినశాఖ యని శుక్లయజుశ్శాఖ యని ప్రధమ శాఖ యని తైత్తిరీయశాఖ యని సర్వభేదములతో అధ్యయనము చేయుచున్నారు. ఇక్కడ సామగులు నూటిదాకా యున్నా స్వరము దక్షిణ దేశమునకు బహు భేదముగా నున్నది; గాన సౌష్టవము విస్తారములేదు. పంచద్రావిళ్ళలో పంచగౌడులలో నున్ను ఒకటి రెండు శాస్త్రాలు చదివిన పండితులు వెయిమంది దాకా ఈ కాశీలో యున్నారు. న్యాయశాస్త్రము ఇక్కడ నిండా ప్రచురము. బంగాళీ బ్రాహ్మణులు బహుమంది యిక్కడ పండితులయి యున్నారు. వారు ఉత్కలగౌడులు. ఉత్కలదేశములో మత్స్యభక్షణ, ద్రావిడ దేశములో మాతులకన్యా వివాహము, మాగధదేశములో మద్యపానము, మైధిలదేశములో దేవరేణ సుతోత్పత్తిన్ని, అద్యాపి నిషిద్ధము కాదని ప్రసిద్ధము.

ఈ గంగాపుత్రుల ఉత్పత్తి హేయముగా కొన్ని పురాణాదులలో చెప్పియున్నది. వారు చెప్పడ మేమంటే భీష్మాచార్యులకు పూర్వము గంగ కన్నకొడుకులను తనలో ఐక్యము చేసుకొని యుండగా అటుతర్వాత భీష్మాచార్యుల తండ్రిని గంగ వదలిన వెనక, లోగడ తనలో కలుపుకొన్న పుత్రులను మళ్ళీ భూమిలో ఉద్ధరించినట్టున్ను, తాము వారి వంశస్థులనిన్ని వాదింపుచున్నారు. వారు ఇప్పట్లో కాన్యకుబ్జులతో సంబందములు చేయుచున్నారు. గంగాతీరమునందు ఏదానమున్ను వారిని మినహా మరి ఒకరికిన్ని యివ్వకూడదు. ఠాణీబ్రాహ్మణులు వచ్చినవారికి తీర్ధ పురోహితము చేసినా యిండ్లలో యిచ్చే దాన్ని ప్రతిగ్రహించ తగ్గవారేగాని బాహటముగా గంగాతీరమునందు తీసుకోలేరు. ఘాటియాలకు ఠాణీలకు గంగాపుత్రులు తమ రహితులని అధికారమును ఆ యా కాలములలో చెల్లింపుచు వచ్చుచున్నారు.

ఇక్కడి రూపాయిలకు చెన్నపట్టణపు రూపాయలకున్ను ఒక అణా భేదమున్నది. మన రూపాయలు చిన్న. రూపాయి 1 కి 16 గండులనే 64 పయిసాలు. అన్ని భక్షణయోగ్య పదార్ధాలున్ను నయముగా అమ్మినా రుచికలిగీ యుండడములేదు. చూపుకుమాత్రము బహుబాగా యుంచున్నవి. నీళ్ళున్ను ఉప్పున్నూ కలియని మిఠాయిన్ని పక్వాన్నాలున్ను సకలమయిన బ్రాహ్మణులున్ను కొని భక్షింపుచున్నారు. చేసే వారిజాతి విచారణ అక్కరలేదు. పుష్పాలలో జాజి పూలుతప్ప యితర సుగంధ పుష్పాలు దొరకవు. మన దేశములో తురక పూలని నిషేధముగా యెంచేపుష్పము లంతా యిక్కడ దేవతారాధనకు పరిగ్రహింపుచు నున్నారు. యిక్కడి గుళ్ళలో మహా పూజలని ప్రసిద్ధముగా ఛేయుచున్నారు. 30 రూపాయలలో ముఖ్యమైన స్థలములలో మహాపూజలు జరుగుచున్నవి.

పట్టణమునకి దక్షిణ భాగము అసీతీరము నందు దుర్గాగుడి ఒకటి యున్నది. ఈ దేవత ఈ పట్టణమునకు కావలిగా వుండే శక్తియని పురజనులు మెండుగా ప్రతి మగళవారమున్ను వెళ్లి ఆరాధింపు చున్నారు. ఈ గుడి తక్కిన గుళ్ళకన్నా విశాలముగా నున్నది. సమస్త మయిన గుళ్ళున్ను యెక్కడ చూచినా నిత్యయాత్రచేసేవారు అభిషేకనిమిత్తమై పోశే ఉద్ధరిణి నీళ్ళతోనున్ను బిల్వదళములతో నున్ను తిలాక్షతలతోనున్ను నిండియుంచున్నది. యీబిల్వపత్రములు తిలాక్షతలున్ను తినడమునకు వృషభములు లోగా సంచరింపు చున్నవి. కాబట్టి పూజించ పొయ్యేవారు పుష్పమాలికలున్ను, బిల్వదళములున్ను, చేతులో తెలిసేటట్టు యుంచుకుంటే ఈ వృషభములు పయిన పడుతున్నవి. నిత్యయాత్ర చేసే నిమిత్తముగా వేలపర్యంతము స్త్రీలు, పురుషులున్ను, పిడికిలి కణిన బుట్టలలో డబ్బిలలో నున్ను బిల్వపత్రము, తిలాక్షతలున్ను ఉంచుకొని, మరియొకచేత ఉదకము తీసుకొని, చూచిన లింగానికిన్ని లింగము ఉండే ఆలయ ద్వారము మూసియుండే పక్షమందు ఆ ద్వారపు కడప మీద ఒక ఉద్ధరిణి ఉదకముతో అభిషేకము చేసి ఒక బిల్వపత్రము వేసి కొన్ని తిలాక్షతలు చల్లుచు వచ్చుచున్నారు. స్నాననియమము ప్రతి మనిషికిన్ని కలిగియున్నది. శూద్రులుకూడా శిరస్నానము చేయక భోజనము చేయరు. ఈ దేశపు బ్రాహ్మణులు ఇతర వర్ణాలను నిండా అన్నదరణ చేసి అగౌరవ పరచనందున కర్మహీనులుగా చేయవలెననే కీస్తు మతస్థుల ప్రయత్నము ఈ దేశములో ఈ సరికి మిక్కిలి సాగలేదు.

ద్రావిడ దేశములో శూద్రులనున్ను, ముఖ్యముగా చండాఆలులనున్ను అగౌరవ పరస్తూ, శూద్రుల దృష్టిన్ని చండాలుల సమీప వర్తిత్వమున్ను కూడదని నిండా అగౌరవ పరచడము చేత, వేల పర్యంతము ప్రజలు క్రీస్తు మతస్థులుగా పెదపాళెము మయిలాపూరు క్రీస్తుగుళ్ళ వుత్సవాదులో చూడబడుచున్నారు. బ్రాహ్మణులకు శ్రుతి చోదితములయిన కర్మాదులను చేసుకొనుచు "స్వస్తిప్రజాభ్యం: పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాఖ అనే శ్లోకప్రకారము సమస్త లోకుల క్షేమము కొరకు ఈశ్వర ప్రార్ధన చేయుచున్న తమ కర్మాదులకు విరొధము లేక క్షాత్రధర్మముతో తంమును కాపాడే క్షత్రియ జాతిని గౌరవ పరచుచు, తమకు దొరకని దేశాంతరాలయందుండే పదార్ధాలను వాణిజ్యమూలకముగా తెచ్చి యిచ్చే వైశ్యులను లాలించి, తమకు ఉపచరించి సేవ చేసే శూద్రులను ఆదరింపుచు రమ్మని శాస్త్రనియమ మున్నది గాని వండేపెట్టడానకు అర్హుడయిన శూద్ర దృష్టే మనకు కూడదు; బ్రాహ్మణ వీధి లోనే శూద్రుడు రాకూడ దనే ఆచారము మూల స్మృతులలో ఇటువంటి అగౌరవాలకు ఆకరము పుట్టియున్నది గనుక ద్రావిడ దేశస్ధులు భూరూప మయిన జీవనాలు పుష్కలముగా కలుగుటచేత కర్మాదుల విషయ మయిన ఆచారాలు మెక్కుట మయి శూద్రులను నిండా తృణీకారము చేయుచు రావడముచేత, వారికి మాంసభక్షణ మొదలయిన దుర్మార్గములో బుద్ధితగిలి, స్నానాది కర్మములను వదిలి నికృష్టు లయి వారున్ను వారికి తక్కువ తెగ అయినవారున్ను ఈ నికృష్టములో పడి అవమానపడడ మేమి? సమానత్వము పొందగల మతములోనే ప్రవర్తింపుచున్నామని, క్రీస్తుమతస్థుల ప్రేరేపణకు లోపడుచున్నారు.

ఈ బ్రహ్మాండములో కన్యాకుమారి మొదలు కాశ్మీరమువరకు నుండే దేశము సర్వోత్తమ మయిన కర్మభూమియై, రామకృష్ణాద్యవతారములకు పాత్రభూతమయి, శాపానుగ్రహ శక్తులయిన అగస్త్యాది ఋషులకు వాసయోగ్యమయి యుండిన్ని, ఈ బ్రహ్మాండముయొక్క చివరను వసింపుచు పూర్వకాలమునందు పశుప్రాయులుగా నుండిన యింగిలీషువారిచేత యిప్పుడు యేలబడి యున్నది. నరుబ్బు ఇప్పుడు కర్మశూనులయిన ఆ యింగిలీషువారు ఈశ్వరకటాక్షమునకు ఈ కర్మదేశస్థులకంటే యెక్కువగా పాత్రులై ఉండవలసిన కారణ మేమని యోచించి నంతలో నాకు శ్రీరాములతోపచేసిన యుక్తి యేమంటే; తత్వబోధసాధన మయిన విద్యాబుద్ధి లేనివారికిన్ని స్త్రీ బాలుల కున్ను భక్తిజనితమయ్యే నిమిత్తముగా ముఖ్యముగా కర్మాదులనున్ను బింబారాధనలనున్ను ఉద్ధరించిన పూర్వీకులయిన స్మర్తలు బింబాలకు మనోజ్ఞమయిన మధుఘృతాదూలతోనున్ను ఫలరసాలతొనున్ను అభిషేకము చేసి ఆలయాలు కట్టియుంచి అలంకరించి అర్చనచేసి రాజోపచారలాంచనలు జరగవలసిన వని వ్రాస్తే ఇటీవల ఉపస్మర్తలు భక్తినివృద్ధి పొందింప చేయవలెననే వెర్రితాత్పర్యముతో యెంత తేనె అభిషేకము చేస్తే అంత మంచిది, యెంత పెద్దగుడి చిత్రాలతో కట్టితే అంత పుణ్యము, యెన్ని విచిత్రాలతో అలంకరించితే అంత శ్రేష్టము, యెందరిని రూపవతులయిన దాసీలను రాజోపచార నిమిత్తముగా గుడిలో వుంచితే అంత గుణ మని వ్రాసినందున యధోచితము లయిన పంచామృతాభిషేకములను వదిలి అంతర్యామి రూపముతో పరమాత్మ వసింపుచు నుండే దేహములకు భొజ్యములయిన వస్తువులను విస్తరించి బింబముల మీద పోయుచు వ్యర్ధ పరచుచు రాసాగి దర్శనమాత్రము చేతనే కామవికారములను కట్టసాగిరి. మరిన్ని సాధారణపు స్త్రీపురుషులు ధరించే వికార వేషములతోనున్ను వికార చర్యలతోనున్ను బింబాలను అలంకరించసాగిరి. మరిన్ని ఆ గుడికంటె యీగుడిలో విభవము యెక్కువ అనిపించవలెనని పైపోటీలతో వ్యర్ధముగా ద్రవ్యవ్యయము చేసి పయిన చెప్పిన పనికి మాలిన పనులు జరిగించి అలాటి అలంకార విభవముల గుండా లోకులకు భక్తిని కలగజేయ సంకల్పించినందున సర్వాంతర్యామి యైన భగవంతునికి అది విరుద్ధముగా తోచినది.

ఆ ప్రకారమే బ్రాంహ్మణులను సత్కర్మముల నాచరింపుచు లోకుల శ్రేయస్సును ప్రార్ధింపుచు అందరినిన్ని ఆశీర్వదింపుచునుండు డని చెప్పితే మేము సర్వోత్కృష్టులమని అహంకరించి ఇతర వత్ణములను తృణీకరించ సాగిరి. అదిన్ని భగవంతునికి అసహ్యమయినట్టు తోచుచున్నది. సగుణ బ్రహ్మారాధన విషయమయి చిత్తము భక్తి కలిగి తదేకనిష్టతో ఉండేకొరకు ధ్యానారంభకాలము నందు, యధోచితముగా తగుపాటి మత్త ద్రవ్యమును సకృదావృత్తిపుచ్చుకొను మన పూర్వీకులు దోవచూపితే, సారాయి పీపాయిలను ఖాలీచేయ సాగినారు. గొ బ్రాహ్మణుల పోషణ ప్రకటనమయ్యే కొరకై వారి పోషణ విషయమై అబద్ధమయినా ఆడవచ్చునని పూర్వీకులు వారికి పక్షముగా వ్రాస్తే, అపద్దముతోనే జీవనము ఛేయసాగిరి. వృద్ధ మాతాపితృపోషణ ముఖ్యమని తెలియపరచను 'అస్యకార్యశతం కృత్వా' అని మనువువ్రాస్తే పరద్రవ్యమును పేలపిండి వలెనే భుజింపసాగిరి. యీ రీతిగా పూర్వీకులు కడతేరేటందుకు వేశిన మొలకలను విషధారలతో పెంచినందుచేత విషజ్వాలా సహితము లయిన ఫలములే ఫలించినవి.

కలిలో భావిఫలములను పూర్వీకులు ఊహించినట్టు ఈకర్మతులు బహు మంచిది బహుమంచిది అనిచేసే పనులంతా యీశ్వరదృష్టికి అపరాధములుగా తోచి ఈ విపరీతము లయిన ఆచారములనున్ను అర్చనలనున్ను బ్నొత్తిగా నిలపదలచి యిప్పుడు ఈ బ్రహ్మాండములో యధోచితముగా పదవాక్య ప్రమాణ్యముగల యింగిలీషువారిని యీ కర్మభూమిని యేలేటట్టు చేసినాడు. యీ ఇంగిలీషువారికి అనుగుణము వుండడము మాత్రమే కాకుండా భూతదయ పశ్చాత్తాపము తారతమ్య జ్ఞానము శుచిరుచి సాత్విక గుణము ఉపశాంతి ఈశ్వరభక్తి యిది మొదలయిన సుగుణాలు శావావున్నట్టు తోస్తున్నది. తద్ధ్వారా వారు సర్వాంతర్యామి కటాక్షానికి పాత్రులయి సర్వోత్తమ మయిన యీ కర్మ భూమికి సార్వభౌములయినారని తోచు చున్నది.*

యీ కాశీపట్టణ మందువుండే సమస్త బ్రాహ్మణులు స్తోమాలని తడలనిపేళ్ళు వహించి ప్రత్య్హేకము ప్రత్యేకు లయిన గుంపులుగా నొక్కొక్క గుంపుకు ఒక అధిపతిని యేర్పరచుకొని యిది జాలంభొట్లస్తోమ మనిన్ని, యిది రాజేంద్రబాబు తడయనిన్ని యిట్లా చెప్పబడుచు కొంతకాలము ఒక గుంవు మరియొక గుంపుతో విహితముగానున్ను మరికొంతకాలము ద్వేషరీతిగానున్ను విద్వత్ గ్రామము గనుక


  • వీరాస్వామయ్యగారి కాలంలో ఈ దేశంలో ఉద్యోగాలుచేసిన దొరలలో సర్ తామస్ మన్రో, విలియం బెంటింకు గార్ల వంటి సత్పురుషులు, స్నేహపాత్రులు చాలామంది వుండేవారు. అందువల్లనే ఆంగ్లేయులయందు వీరి కంత అభిప్రాయం కలిగింది. ఆచార వ్యవహారములను గురించి తాత్పర్య భేదము కలవారము ప్రవర్తింపుచు వుంటారు. వీరిని ఆరాధన చెయ్యడములో ఉపాయము తెలిసి కొంత గుంపులకు ముందుగా కొంతగుంపుకు వెనక కొంత గుంపుకు సమకాలములో ప్రత్యేక స్థలాలలోనున్ను యీ ప్రకారముగా సభాపూజలు ఛేయుచు రావాలసినది. సుమంగలీపూజకు వేయి మంది స్త్రీలు వత్తురు. భిక్షము పెట్టేవారు కలిగితే రెండువేలమంది అనాధ స్త్రీలు జమ అవుతున్నారు. యిందరికిన్ని అన్నపూర్ణ కటాక్షముచేత పుష్కళమయిన అన్నము దొరుకుచున్నది. పిలువకనే వచ్చే పరదేశులలో స్త్రీలు పురుషులుగా 2000 మంది పంచ ద్రావిళ్ళలో వున్నారు. వీరి కందరికి అన్నపూర్ణ సత్రములో పూనా శ్రీమంతుని తమ్ముడైన అమృతరాయడు 2400 మందికి ప్రతిదినమున్ను అన్నము పెట్టుతాడు *మన దక్షిణదేశస్థులు బహుమంది కాశీ తంబురాయడనే పండారముగుండా 1000 కి అన్నము ప్రతిదినము కలగచేసియున్నారు. మయిసూరు రాజు మొదలయిన గొప్పవారు యింకా అనేకులు అన్నముగానున్ను శీదా (స్యయంపాకము) లుగానున్ను ప్రతి దినమున్ను యిచ్చుచున్నారు. విశ్వేశ్వరుడు యిక్కడ చనిపొయ్యే వారికి తారకనామ ఉపదేశము చేస్తానని ఆచొప్పున అన్నపూర్ణయిక్కడ వసించే వారికి అన్నము సమృద్ధిగా కలగచేస్తాననిన్ని ప్రతిజ్ఞ చేసినట్టు పురాణ మందు చెప్పియున్నది. అన్నపూర్ణ ప్రతిజ్ఞ ప్రత్యక్షముగా వున్నది.

శ్రీరాములుయొక్క అవతారానికి పూర్వమే అనాదిగా రామనామము తారకమయి యున్నది. అది తెలిసి శ్రీరాములకు ఆనామము తోనే వసిష్ఠులు నామకరణము చేసినారు. ఈహేతువుచేత యీ పట్టణములో యెవరు చనిపోయినా శ్మశానానికి శవానికి శవానుగమనము చేశే వారు 'రామ నామసత్తుహే' అంటు నడుస్తారు. తద్ద్వారా తద్వ్యతిక్తమయిన దంతా అనృతమని అర్ధమవుతూ వున్నది. యీ మహా స్థళానికి శ్రీమంతులు అనేకులు వచ్చి లక్షల మోడి సెలవు చేసినారు. స్థళమహాత్మ్యమేమో కాని, యే బహనా (నెపము)చేతనయినా నెలకు


  • పీష్వా అమృత రాయని దానదర్మములను గూర్చి బిషప్ హెబరు చక్కగా వర్ణించి యున్నాడు. ఈ అమృతరాయడు 1824 లోనే దివంగతుడైనాడు. నాలుగయిదు లక్షలు సెలవుచేసేపాటి ఆసామి ఒకడు యీస్థళమందు వసింపుచున్నే యుంటాడు. ఇప్పట్లో శ్రీమంతుని తమ్ముడు బిమ్మాజీ అనే అతను నెలకు మూడు లక్షల రూపాయలు ఖర్చు ఛేసుకుంటూ అసి తీరమందు యున్నాడు. యింకా యీదేశపు బహు ధనికులు విరామదశను పొంది కాశీవాసము చేయుచున్నారు. యీక్షేత్రాన అవశ్యముగా చెయ్యవలసినపనులు వాసము ఒకటిన్ని వర్షాశనదానము ఒకటిన్ని ముఖ్యములు.

కాశీ పట్టణములో పదివేల యిండ్లున్ను, లక్షప్రజలున్ను వుందురని తోచుచున్నది. *యిక్కడ దొరకని పదార్ధము వకటిన్ని లేదు. అందరు దేశభాష అయిన హిందూస్థాన్ మాటలాడు చున్నారు. బాహాటమయిన సంత అంగళ్ళను బాళాలని వ్యవహరింపుచున్నారు. ఉత్సవాదులను మ్యాళా అనిన్ని, పల్లకీలను కడుకడియా అనిన్ని, బోయీలను కారులోకు అనిన్ని వాడుతారు. బొందిలీ ఖండములో బోయీలను డీమరు అంటూవచ్చిరి. సామాన్య నౌకరుల జీతము నెలకు 4 రూపాయలకు యెక్కువ లేదు.

యీ స్థల మాహాత్మ్యము స్కాందపురాణాంతర్బూతముగా వుండే కాశీ ఖండములో 100 అధ్యాయాలుగా విస్తరించి చెప్పబడుతునున్నది. యిదిగాక సూక్ష్మముగా 5 అధ్యాయాలు గల కాశీ మాహాత్మ్య మనే గ్రంధమున్ను విస్తరించబడి యున్నది. వాటి సార


  • బిషప్ హెబరుగారు 1824 లో కాశిని దర్శించి తన దినచర్యలో చక్కగా వర్ణించియున్నారు. అదిచాలా విషయములలో వీరస్వామయ్యగారు వ్రాసినదానికి సరి పోతున్నది. జనసంఖ్య విషయంలో మాత్రం వీరాస్వామయ్యగారు పొరబాటుపడినట్లు కనబడుతూవుంది. హెబరుగారు వ్రాయడంలో 1808 లో వేయబడిన ఒక జనాభా లెక్క ప్రకారం కాశీలో 5,82,000 ప్రజలు వున్నట్లు తేలిందనిన్నీ దానిలో కొంతమంది అతిశయోక్తి వున్నదనుకున్నా, ఉన్న లెక్క అది ఒక్కటేననిన్నీ, పట్టణ వైశాల్యము బట్టిన్నీ క్రిక్కిరిసియున్న కట్టుడును బట్టిన్నీ ఆ అంచనా యించుమించుగా సరియైనదేనని తొస్తూ వున్నదనిన్ని, లండన్, ప్యారిస్ నగరాలు తప్ప ఐరోపాలోని తక్కిన అన్ని నగరాలు కన్నా యీ కాశీనగరం ఎక్కువ జనాకీర్ణంగా వున్నదనిన్నీ వ్రాశారు. చూడు. బిషప్ హెబర్సు జర్నల్ 1 వ సంపుటము, పుటలు 370-400. మేమంటే నిర్గుణ బ్రహ్మము సృష్టి సంకల్పము కాకమునుపు జ్యోతిర్మయకారముగా యీ స్థలములొ మిక్కిలి జ్వలిస్తూ వున్నట్టున్ను బ్రహ్మకు, విష్ణువుకున్ను అహంపూర్వ మహంపూర్వ మని వివాదము పొసగినట్టున్ను జ్యోతిర్మయాన్ని చూచి ఆ యుభయులున్ను పరమయిన వస్తువు యీజ్యోతిస్సని తెలుసుకొని తాము శాంతిపడ్డట్టున్ను, సాంబమూర్తి ఈ స్థలము అనుపూర్విక మయినందున యిక్కడ వసించసాగినట్టున్ను, తద్ద్వారా మహాశ్శశాన మయినదనిన్ని ఆ జ్యోతిర్లింగము యిప్పటికిన్ని యిక్కడ పంచకోశాత్మకముగా యున్న దనిన్ని అదిని యీ భూమి జ్యోతిర్భూతానికి వాసయోగ్యమయినందున బ్రహ్మాదులు యిక్కడ తపస్సుచేసి సకల సిద్ధులు పొందినారనిన్ని, అగస్త్యాది ఋషులు అదేప్రకారము యుక్కడ తపస్సు చేసి సచ్చిదానందమును అనుభవించినందున యీ స్థలము ఆనందవనమనే పేరు వహించినదనిన్ని, మహాప్రళయాదులలో జ్యోతిర్భూతానికి యీ భూమి వాసయోగ్యమైనందున త్రిగుణాత్మకమయిన మూడు ముండ్లవంటి కొనలు కల ఆయుధముతో యీ భూమి యెత్తబడి వుండినందున త్రికంటక విరాజితమనే బిరుదు యీస్థళానికి కలిగినదనిన్ని, మిక్కిలి ముఖ్యముగా చెప్పి అటుతర్వాత పరాపరఫస్తువు సర్వాంతత్యామి గనుక యెవరియందు ఆ వస్తువును ఆరొపితము ఛేసినా ఛేయవచ్చును గనుక స్కాందపురాణ కారకుని ఇష్టప్రకారము అపరాపర వస్తువునే శివుడని సిద్ధాంతపరచబడిన ఆ సాంబమూర్తి తద్ద్వత్తుగా జ్యోతిర్మయముగా ప్రకాశించి నాడనిన్ని, ఆయన కటాక్షము సంపాదించి బ్రహ్మాదులు వారివారి అధికారాలు పుచ్చుకున్నారనిన్ని విస్తరించి

యున్నది.

యింతటికి యిక్కడి యీశ్వరుని పేరు విశ్వేశ్వరుడు. ఇది సమష్టివాచకము. లింగమున్ను సమష్టిరూపమేగాని పార్వతిసహితముగా వృషభారూఢుడయిన సాంబమూర్తి రూపముకాదు; లక్ష్మిని వక్షస్థలమందు వహించిన మహావిష్ణు రూపమున్ను కాదు; అయితే శైవులు ఆ లింగారాధనను చేయుచు వచ్చుచున్నారు. అందువల్ల వైష్ణవులు ఆ రూపము యొక్క ఆరాధనను వదిలినారు. యీస్థలములో జ్యోతిర్భూతమ్మ జ్వలిస్తూ యుండినందున ముక్తిక్షేత్ర మయినది. ఈ క్షేత్రములోని పాపులకు ప్రకారాంతరముగా కాలభైరవ దండన మూలకముగా పాపానుభవము చెప్పి అటుతర్వాత విశ్వేశ్వరుడివల్ల తారకమంత్రము వుపదేశమయి ముక్తిని పొందేటట్టు పురాణసిద్ధ మయి యున్నది.

యీ స్థలము అవిముక్త క్షేత్రమయినందున గంగ విశ్వేశ్వరుడి అనుగ్రహము సంపాదించి అసి-వరణల మధ్యే తనలోని జంతువులగుండా యెవరికిన్ని ఉపద్రవము చేసేది లేదని ఖరారుచేసి ఇక్కడ ప్రవహించసాగినది. ఈ కలియుగములో పాపాలను పోగొట్టడానకు గంగకు మించిన పదార్ధములేదని కంఠోక్తిగా కాశీఖండములో చెప్పియున్నది. ఆటువంటి గంగ ఇటువంటి క్షేత్రములో ఇక్కడ జతపడినందున ఈ రెంటిమూలకముగా పరమాత్మడు అనేకుల భక్తిని ఆకర్షించి తరింపచేయుచున్నాడు. ఇటువంటి మహాస్థలములో డిసంబరు నెల 16 తేది రాత్రివరకు వసించినాను.

పదుమూడవ ప్రకరణము

17 తేది ఉదయాన 4 ఘంటలకు ధనుర్లగ్నములో 12 దాండ్లుగల బజరాలోయెక్కి గయకు తరలి వచ్చినాను. నాబోయీలు మొదలయినవారు ఉండడానికి పట్టేలు అనే తడికెలు కట్తిన పడవను ఒకదాన్ని కూడా తేవడమయినది. ఈ బజరాకు పట్నా అనే షహరు వరకు బాడిగె యాభై యైదు రూపాయలున్ను, పట్టేలు అనే పడవకు ముప్పై రూపాయలున్ను యిచ్చినాను. కార్తీకశుద్ధ పున్నమివరకు యీ ప్రాంతమందు శీతకాలము ప్రవేశించలేదు. అదిమొదలు చలి దినదిన ప్రవర్ధమాన మయినందున యెండను మనదేశములొ వసంతకాలపు వెన్నెలవలె అతిప్రియముతో అనుభవింపుచు నున్నారు.

కాశీపట్టణ్ము గంగయెడ్డు అయినందున గంగ ధనురాకారముగా ప్రవహింపుచు గట్టునుకోసి వొత్తిరాకుండా బలమయిన గట్టములను వొడ్డున కడాకున్ను కట్టియుంచుట చేత, వొడ్డు కోశేదానికి బదులు ప్రవాహముయొక్క జోరు భూమిని కోశి లోతు అవుతూ వచ్చినది. గనుక ఆ చొప్పున లొతు కావడమువల్ల వడ్డున వుండే భూమి వూటపారి యీ శీతాకాలములో అతిశీతలమయి పయిగా జనసమ్మర్ధము విస్తారమయి నందున జ్వరాలు మొదలయిన అనేక రోగాలను ఉత్పత్తి చేయుచున్నది. మిక్కటముగా భూమి కొత్త అయినవారికి వుపద్రవము యెక్కువగా వుంచున్నది. కాశీలో ప్రవేశించిన వెనక యికను సుభిక్ష రాజ్యములో ప్రవృత్తి కలుగు చున్నదనే తాత్పర్యము చేతనున్ను కలకత్తా పర్యంతము నావల మీద పోవలెననే యిచ్చచేతనున్ను కాశెలో కొన్ని దినములు వసించవలసియున్నదనిన్ని హయిదరాబాదులో కొలువుపెట్టిన ఒక జత పండ్రెండు మంది బోయీలనున్ను, ఆరుగురు బంట్రౌతులనున్ను పట్నాంన్నుంచి వచ్చిన ఆరుగురు కావడి వాండ్లనున్ను కొలువు తీసి వేసినాను. మిగిలియున్న వారిలో నలుగురికి కుదురుతువస్తే ఆరుగురికి జ్వరాలు మొదలయిన యుపద్రవాలు తగులుతు వచ్చుచున్నవి. యిక్కడి స్థలజ్ఞులు అదేప్రకారము రోగపీడితులుగానే వున్నారు. యిక్కడి చలి మన దేశస్థులకు అసహ్యముగా నున్నది. నాపరివారానికంతా ధగళాలు, కుళ్ళాయిలు, చావళ్ళు, లుంగీలున్ను తీసియిచ్చిన్ని కుంపట్లు ఆపేక్షింపుచున్నారు. నేను ప్లానుల(ఫ్లాన్ల్)తో అన్ని వస్తువులున్ను వారివలెనే కుట్టించుకుని ధరించినాను. యెండకాలములో వుష్ణము అదెప్రకారము అతిమిక్కటముగా నుంచున్నదట. అందుకు కారణము అప్పట్లో గంగ లోపలికి పోవడము ఒకటే గాని వేరే తొచలేదు. ఇప్పట్లో ఇక్కడ అహస్సు 26 గడియలు. యీ వాశి రాత్రి వృద్ధి అయి వుంచున్నది.

కాశీక్షేత్రము సకల స్థలములలోనున్ను చేసిన పాపములను పోగొట్టుచున్నది. యీ కాశీ మహాస్థలమందు లోకులు చేసే పాపములను యావత్తున్ను పోగొట్టడానికి జ్యోతిర్లింగ ప్రదక్షిణార్ధము పంచక్రోశయాత్ర అని యొకటి చేయవలసినది. ఆ యాత్ర చేసిరావడానకు అయిదు దినములు పట్టుచున్నది. ప్రధమ దినము మణికర్ణీకలో స్నానము చేసుకొని సంకల్ప పురిసారముగా ప్రయాణమయి మొదటి దినము కద్రమేశ్వరము అనే యూళ్ళో నిలిచి అక్కడ కర్దమతీర్ధ ములో స్నాన తీర్ధశ్రాద్ధాదులు చేసి కద్మమెశ్వరుని అర్చించి రెండో దినము భీమచండీ అనే స్థలము చేరి అక్కడ మొదటి దినము వలెనే గడిపి మూడో దినము రామేశ్వరము చేరి అక్కడ వరణ ప్రవహింపుచున్నది గనుక అక్కడ వరణా తీరమందు తీర్ధనిధి చేసి రామేశ్వరార్చన చేసి, నాలుగో దినము కపిలధార అనే స్థలము చేరవలెను. అక్కడ లోగడి మూడు దినముల వలెనే గడిపి అయిదో దినము మణికర్ణీక చేరి అక్కడ తొలు నాలుగు దినములవలెనే గడిపి స్వస్థలము చేరవలెను. యీ యాత్ర తిరగడము 26 కోసులు కద్దు. ప్రతి మజిలీస్థలములో నున్ను విశాలమయిన ధర్మశాలలు కట్టి యున్నవి. యిదిగాక అంగళ్ళు యిండ్లు, తొపులు అక్కడక్కడ కలిగి వున్నవి. దారిపొడుగునా శాల (నీడకొరకు వేసిన చెట్లవరస) యుంచి యున్నారు. ప్రదక్షిణానికి ఆరంభము అసిమొదలుగా చేయవలసినది.

కాశీయాత్ర చేసేవారు వారానికి ఒకసారి మసోపవాసి అనేనక దేవి దుర్గా గుడికి సమీపముగా నున్నది. అక్కడికి వెళ్ళి కొన్ని గవ్వలు వేయవలసినది. వేయనివారి యాత్రాఫలము ఆమె అపహరించేటట్టు ఒక వదంతి కలిగి యున్నది. యీ పంచక్రోశయాత్ర చేసే టప్పుడు భిక్షకులకు, గలిగినవారు నిండాగా నుపచరింప వలసియుంచున్నది. యీ కాశీక్షేత్రమందు గంగలో పూజచేసే బిల్వము ముణిగి పోవుచున్నదని ప్రసిద్ధి కలిగియున్నది. ప్రయాగలో స్త్రీలు యిచ్చేవేణిన్ని అదే ప్రకారము మణిపోతూ వుంచున్నది. యేస్థలములో నున్ను సన్యాసులు త్రిరాత్రానికి అధికముగా వాసము చేయకూడదని విధియేర్పడి యున్నా, విశ్వేశ్వర స్మృతి ప్రకారము ఈ కాశికి వచ్చిన యతులు యీ స్థలము వదలి పోకూడదని యేర్పరచి యున్నందున పంచగౌడులు పంచద్రావిళ్ళలో సుమారు వెయ్యింటికి యతులు యీ మహాస్థలములో నివాసముగా యున్నారు.

ఆంధ్రులలో వెలనాడు, కాసలనాడు, మురికినాడు అని వున్నట్టున్ను ద్రావిళ్ళలో వడమలు, కండ్రమాణీక్యము, యెణ్నాయిరము అని వున్నట్టున్ను ప్రతి గౌడ తెగకున్ను అనేక చీలికలున్నవి. బహు సావకాశముగా విచారించక గాని వాటి ఖుల్లస్సు బోధపడదు. బంగాళీ బ్రాహ్మణు లయిన ఉత్కల గౌడులలో ఒక అన్యాయము జరుగు తున్నది. అది యేమంటే లోగడ వారి తెగలో కొంత విపత్తులు వచ్చినప్పుడు కొందరు యధాశాస్త్రముగా ప్రవర్తింపుచున్నట్ట్లున్ను, అద్యాపి వారి సంతతి ద్వారా కులీనులయినట్టున్ను, అటు కులీనుడికి కన్యకును వివాహము చేసి యిస్తే కులము పవిత్రమవుతున్న దని ఒక బోధ తోచి యుపపన్నులు అందరున్ను అటువుండే బహు కొద్దిమంది కులీనులకు బహుద్రవ్య మిచ్చి వొప్పచేసి కన్యమీద కన్యను యిరువై ముప్పైయింటిగాకా యిచ్చి వివాహము చేయుచున్నారు. ఆ ప్రకారము వివాహము చేసుకొన్న కులీనుడు తదనంతరము నూరాగులు యిస్తేగాని ఒక రాత్రి ఆప్రకారము వివాహమయిన స్త్రీలతో వసించేదిలేదు. అటుగనుక అటు వివాహమయిన స్తీలు చాపల్యము లేనివారు హింసపడుతూ, చాపల్యము కలవారు వ్యస్థ తప్పి నడుచుచున్నారు.

యీదేశములో వసింఛే ఘూర్జర దేశాస్థులు అనేక తెగలుగా భేడా వారని, నాగరీ లని ప్రత్యేకగుంపులుగా ఒకరి యింట్లో ఒకరు భోజనము లేక నియమము కలిగియున్నారు. యీ దేశములో దృష్టి దోషవిచారము లేకపోయినా కచ్చారసూయి, పక్కారసూయి అనేపాక నియమాలు బహుశా పాటింపు చున్నారు. పక్కరసూయి ఒకడు పాకము చేసినది మరి ఒకడు సంప్రదాయము విచారించక శూద్రుడయినా బ్ర్రాహ్మణునిచేత కూడా తినడు. శూద్రులు బహుశా మాంస భక్షణము చేయడములేదు. కొన్ని సంఫత్సరముల కిందట దక్షిణ దేశములో నుంచి గూపాలకజాతి యయిన ఒక గొప్ప మనిషి కొమార్తె ఇక్కడికి యాత్ర వచ్చి స్వకులస్థులను యిక్కడ పరిచర్యకు కొలువు వుంచినది. అటు కొలువువున్న స్త్రీలు పురుషులున్ను వచ్చిన స్త్రీ మాంస భక్షణము చేయడము చూచి, నిండా నిందించి కొలువు వుండమని చాలించుకొన్నారు. యీదేశములో గోపాలకులు తులసీమణి ధారము చేసినట్టయితే ఆచార సంపన్నులని వారి చేతి గంగను ధారాళముగా యీ దేశపు సర్వజనులున్ను పుచ్చుకొంటారు. వారిని సచ్చూద్రులని చెప్పుతారు. కాశీలో సకల గ్రంధమలున్ను సంగ్రహింపబడి వున్నవి. కుంఫిణీవారు బహు దినములుగా ఒక పాఠశాలను వుంచి సమస్త గ్రంధాలు సంగ్రహించి యుంచి పాఠము చెప్పను మనిషికి 30 రూపాయీలు జీతము ఛేసి పదిమంది పండితులను వుంచి చదవడానకు 100 మంది విద్యార్ధులకు మూడేసి రూపాయలు లెక్కని జీతమును చేసియుంచినారు.* యింకా రాజాధిరాజులు గ్రంధ సంగ్రహము కావలసినప్పుడు లక్షావధి రూపాయలు కాశికి పంపించి గ్రంధ సంగ్రహము చేయుచు నున్నారు. గనుక బహుమంది పెద్దలు తమ సోధనార్ధమున్ను అట్టి తరుణాలలో రాజాధిరాజులకు పనికి వఛ్ఛేటట్టు చాయడానికిగాను అనేక గ్రంధాలు సంగ్రహించి అపారముగా వుంచి యున్నారు.

కాశికి సుమారు యిరువై మజెలీలలో గోకుల బృందావనము యుండి యున్నది. హరిద్వార మనే పుణ్యభూమి 20 మజిలీలలో నున్నది. ఆ హరిద్వారమునుండి గంగోత్తరికిన్ని బదరీకేదారానికిన్ని బదరీ నారాయణానికిన్ని జ్వాలాముఖి కిన్ని దారిపోతున్నది. హరిద్వారము వెళ్ళకనే పయిన వ్రాసిన స్థలములకు యెక్కడికిన్ని పోను ఆయత్తు కాదు. హరిద్వారమునుంచి పయిన వ్రాసిన స్థలములలో యే స్థలానికి పోవలసినా ఈశ్వరేచ్చ యేమోగాని పదిహేనేసి దినాల మజిలి ఆయూస్థలములకు సరిగా నున్నది. అందుకు ఒక స్థలమునుంచి ఒక స్థలానికి వెళ్ళడానికి వేరేదారిలేదు. గంగోత్తరినుంచి బదరీకేదారము వెళ్ళవలసివస్తే హరిద్వారానికి వచ్చి పోవలసినది. అయోధ్య అతి సమీపము. ప్రయాగకు 12 ఆమడ వున్నవి.

పయిన వ్రాసిన గంగోత్తరి మొదలయిన మహాస్థలములు అన్ని నీలకంఠనేపాళరాజుయొక్క రాజ్యములొ యున్నవి. ఆరాజు నేపాళములో వాసముచేయుచు యింగిలీషువారికి లోబడియున్నాడు. ఆ నేపాళము వద్దనే మూరంగి అనే యూరున్నది. అందులో ద్రాక్షలు ఫలింపుచున్నవి. ఆ గ్రామము కాశీతంబురాయడనే పండారానికి


  • ఈ విద్యాలయమును గురించి బిషప్ హెబరు చక్కగా వర్ణీంచినాడు. బదరీ కేదారేశరుని పూతానైవేద్యాల కొరకు నేపాళరాజు జాగీరు యిచ్చియున్నాడు. ఆ ప్రాంతములలో మంచు అపారముగా నున్నది. కేదారేశ్వరునికి ఆరునెలలు పూజలేదట. మంచుకాలము యొక్క ఉపక్రమణలో ఒక పెద్ద కొడి స్తంభము నాటిపెట్టి మంచు గుడిని మూసుకునిపోతే మంచుకాలము తీసినవెనక ఆ కొడి స్తంభము గుర్తుపట్టుకొని మంచుగడ్డలు తొవ్వి యెత్తి గుడిని కనుక్కోవలసినదని చెప్పినారు.

ఈశ్వరుడు నీళ్ళలోని చేపలకు జలాధివాసము సహజము చేసి నట్టు ఆయాస్థలస్థులకు ఇటువంటి తనరూప మయిన కాలాలను సహజము చేయుచు వచ్చినాడు. కాలాన్ని అనుభవింఛే వ్యక్తిలోనున్ను కాలములోనున్ను యీశ్వరుడు అంతర్యామి అయినప్పటికిన్ని అభ్యాసము వల్లనున్ను యిచ్చవల్ల నున్ను యిటువంటి కాలభేదములు కొన్ని వ్యక్తులకు సరిపడక వుంచున్నవి. యెట్లా అత్తిచెట్టుయొక్క అనేకపండ్లలోని ఒక క్రిమిగాని ఆ ఛెట్టుయొక్క గాత్రమునున్ను శక్తినిన్ని యెట్లా తెలుసుకో నేరదో తద్వత్తుగా అనేక బ్రహ్మాండాలు ఉత్పత్తి ఛేసిన యీశ్వరునియొక్క చిద్విలాస మహిమను ఒక బ్రహ్మాండములోని ఒకా నొక ప్రాణి తెలిశి ఆశ్చర్య పడడానకు శక్తుడు కాడు.

యీ కాశీ మహాపట్నము యొక్క వేడుకను చూచి ఆనందించి, కపిల మహాముని యించుకు అధికముగా తనతప:ప్రభాముచేత యీ కర్మభూమికి చివరను గంగాతీరమునందు కాశ్మీరము అనే పట్నాన్ని ఉత్పత్తి చేసి సకల విధాలా బాగాచేసి కాశీవిశ్వేశ్వరునికి యెరుకచేసి అక్కడికివచ్చి చూడుమని ప్రార్ధించి నంతలో విశ్వేశ్వరుడు ఆ కపిలుని మాట నిజమేనని తెలుసుకున్నవాడై అప్రతిద్వంద్వముగా కాశి యుండవలసిన సంకల్పము పరమాత్మునికి నుండగా గర్వము చేత కపిలుడు యీప్రకారము ఛేసినాడు గనుక ఆ కాశ్మీర పట్నము అతని గర్వభంగము అయ్యేకొరకు వెంబడిగానే మ్లేచ్చాక్రాంతమయి మ్లేచాభూయిష్టమయి పోగాకా అని శపించినాడట. అదిమొదలు అద్యాపి యెంత అక్కడ శంకరాచార్యులవారు దిగ్విజయము చేసినా సరస్వతీపీఠమున్నా అక్కడ ప్రవహింఛే గంగ సస్యాదులకు కూడా వుపయోగింపుచున్నా అక్కడవున్న బ్రాహ్మణులు అందరు బలాత్కా రముగా తురకలలోకలిసి బ్రాహ్మణుడు అప్ర్రాంత్యాల తలచూపడము అద్యాసి ప్రయాసగా నున్నది.

ఇప్పట్లో ఆ రాజ్యము రణజిత్తు సింగు* అధీనముగా యున్నది. ఆకాశ్మీరములోనే కుంకుమపువ్వు అవుచున్నది. శాలూలు నేయడానికి యోగ్యమయిన వెంట్రుక లయ్యే మృగాలు ప్రత్యేకముగా ఉత్పత్తి అవుచున్నవట. కాశ్మీరశాలూలు బయటికి విస్తారము రావటములేదట. అందుకు నకలుగా లాహోరులో నేసిన శాలూలు బయటికి విక్రయయానికి వచ్చేటట్టు విన్నాను. నిరక్షదేశము మొదలుగా 23 భాగల దూరము లో నుండే కాశీ లొగానే కాలము మొదలుకొని ఆచారవ్యహారములు యింత భేదించి యుండగా యికను ఉత్తరోత్తరా యేమి వింతగా నుండునో తెలిసినది కాదు; వీపుమీద నుండే మచ్చ చూడడానకు కూడా మనుష్యుడు శక్తుడుకాడు. మాయావృతజ్ఞానము కలిగి వుండుట మిక్కటముగా యీ ప్రకారము మాయామగ్ను లయిన అస్మదాదులను కాపాడ వలసినది.

1830 వ స|| డిసంబరు 28 తేది పట్నా అనే షహరు ప్రవేశించినాను. గంగలో పదిదినములు బజరా పట్టేలు అనే పడవల గుండా నడవడమయినది. దారిలో గంగ కిరుప్పక్కలనున్న వూళ్ళ పేళ్ళు ఈ అడుగున వ్రాయుచున్నాను. నెం.21.కబారా 1 మంజీ 1 ఛోటక్పూరు 1 కనాలుగంజి 2 సయత్పూరు 1 మాంజీ 1 చోబక్పూరు 1 రోజా 1 జిమ నియ్యాం 1 రాంపూరు 1 మదనా పూరు 1 గాజీపూరు 1 కాతిసుపూరు 1 నెరువూరు 1 బకుసరు (బక్సార్) 1 నిక్కావూరు 1 బుదాగా 1 కట్రాజిగంజి 1 బిసన్ పూరు 1 ఆరా 1 నవరంగా 1 రామనగరము 1 శిరువూరు 1 శిరంపూరు 1 చప్రా 1 రస్తాన్ గంజి 1 దానాపూరు 1 బాకీపూరు 1 పట్నా 1.


  • రంజితసింగు శిక్కుల రాజు. 1780 లో జన్మించి 1839 లో దివంగతుడైనాడు. పెరుగు, పాలు, కూరగాయలు - ఇత్యాది అనేక దినముల పరియంతము బాగావుండని పదార్ధాలకు గాను ఒకవేళ గంగకు ఇరుపక్కలావుండే వూళ్ళలోకి వెళ్ళితే మనుష్యులు వెళ్ళీ రావలసినది. సుఖహేతువులంతా కష్టసాధ్యములు గనుక యీ గంగా తీర సంచారసుఖానుభవములో పడవలోకి నీళ్ళు వూరి వచ్చిన దనిన్ని పడవ తోశే వాండ్లు చెప్పినట్టు వినలేదనిన్ని కూడా వుండే పరిజనుల ప్రకృతులు భిన్నాలు అయినందున వాండ్లు ఒకరితో నొకరు కలహము పడడము వల్లనున్ను, వద్దవుండే స్థితికి చోరులవల్ల అపాయము వచ్చునేమో అనే భయముచేతనున్ను, మనస్సుకు అప్పుడప్పుడు ప్రపంచదృష్టి పూరా కలిగిన దేహాధీన మయినందున వికల్పము కలుగుచున్నది. అప్పట్లో జగము యావత్తు పరబ్రహ్మ ఆడించే బొమ్మలుగాని, వేరే కాదనిన్ని తృణాగ్రమయినా యీశ్వరాజ్ఞ చేతనే కదల వలసినదిగాని మరిఆన్యధా కాదనే తెలివితోనున్ను మనస్సునిండా ఖేదాన్ని పొందనియ్యకుండా బుద్ధిద్వారా శిక్షించి నట్టయితే పయిన వ్రాసిన స్థలజల సౌఖ్యములు మిక్కిలి ఆనందములుగా తేటపడు తున్నవి.

యీ గంగలో నడిచే అనేకపడవలు అనేక భేదములు కలిగి యున్నవి. అందులో విచారించగా తెలియవచ్చిన వాటిని అడుగున వ్రాసినాను. నావల భేదక్రమము బజరా 1. అది ఒంటికంభము కలది. వెడల్పుయెక్కువ. తలపక్కచుక్కాణి, చుక్కాణి మొదలు పొడుగున తగ్గుచూవచ్చు చున్నది. పిన్నిస్సు 1. అదిరెండు కంభాలుకలది. నిడువు యెక్కువ. మొనను చుక్కాణీ. యిల్లు మధ్యే వుంచున్నది. పొడుగు కొనా మొదలున్నుసమము. కటరు 1. అది పిన్నిసుజాడ; గాలిని చాపలచేత వైపు (వీలు) చేసుకోవచ్చును. బవులియ్యా 1. అదిబజరాజాడ; గాలిని చాపలచేత స్వాధీనము చేసుకోవచ్చును. డోంగా 1. అది చిన్నయిల్లు గలతేలిక పడవ. బాలిబోటు 1. అది చెయిపడవ. పయిన వ్రాసిన ఆరుదినుసులు సవారీలాయఖు. సర్కు మోసే నావలు పట్టేలి 1. అది మిరిజాపురపు శాత. పొడుగు తక్కువ. వెడల్పు యెక్కువ. వులాకు 1. అది పట్నాశాత.

పట్నా మధ్యే గంగకు యిరుపక్కలా వుండే వూళ్ళలో గాజీ గంగలో కలియుచున్నది. చప్రావద్ధ కర్మనాశినీ అనే నది దక్షిణము నుంచి వచ్చి గంగలో కలియుచున్నది. యీ కర్మనాళిని నదిలో యెవరు కాలుపెట్టినాగాని సుకర్మాలు నశించుచున్నదనే తాత్పర్యముచేత కర్మఠులు యెవరున్ను యీనదిలో కాలు పెట్టరు. యీనది దాటడానకు కాశీనుంచి గయకు వచ్చే దోవలో అహల్యాబాయి అనె యశ:కాయము గల పుణ్యాత్మురాలు వారధి కట్టడానకు శానా యత్నము చేసినది. యిప్పటికి ఆమె చేర్చిన సామానుతో కట్టాడానకు అనేకులు యత్నము చేసినా కొనసాగలేదు.

యీ పట్నాషహరువద్ద పునఃపునః అనే నది దక్షిణమునుంచి వచ్చి గయవద్ద వచ్చే ఫల్గుని నదివలెనే గంగాసంగమ మయినది. యీ పున:పున: అనేనది గయా క్షేత్రమునకు ప్రదక్షిణముగా ప్రవహింపుచున్నది గనుక యెటువంటి గయకు వచ్చే వారున్ను యీ పున:పున: నదివద్ద క్షౌరము చేసుకొని తీర్ధశ్రాద్ధము చేసి గయావ్రజనము చేయడానకు నియమము ధరించవలసినది.

దక్షిణమునుంచి వచ్చే పయినదు లంతా నర్మదానదివలెనే వింధ్య పర్వతములొ ఉత్పత్తి అయినవి. శోణభద్రా నదిన్ని, నర్మదానదిన్ని ఒక్క ప్రదేశములోనే ఉత్పత్తి అయి రెండు ధారలుగా చీలి ఒకటి లింగాలనున్ను, మరి ఒకటి వినాయకశిలలనున్ను జగత్తుకు కలుగ ఛేసి యున్నవి. యిదిగాక పేరు ప్రశస్తములేని కొన్ని నదులు ఉత్తరము నుంచి వచ్చి కాశీ పట్నాలమధ్యే గంగలొ కలియు చున్నవి.

కాశి మొదలు పట్నాషహరు వరకు గంగకు ఇరుపక్కలా సరసు అనే పెద్ద ఆవాలున్ను, రాయి అనే చిన్న ఆవాలున్ను, బూటి అనే శనగలున్ను, పటానులున్ను, కందులున్నూమితముగా పయిరు చేసి యున్నారు. యీ పెద్ద ఆవాలు చెట్లు ముల్లంగి చెట్లవలెనే ప్రధమములో పయిరు అయి యెన్నుతీసి పచ్చని పూలు పూచి, గోరుచిక్కుడు కాయలవలె కాయలు కాయుచున్నవి. యీ ఆవకూర యీమంచు దినములలో పుల్లకూరవండి యీ దేశస్థులు అవశ్యముగా పుచ్చుకొను చున్నారు. పుల్లకూర బహురుచిగా వుంచున్నది. మంచు కాలములొ దేహానికి లేపనము చేసేటందుకు నాలుగు ' విధాలు పరిమళ శైలములు యిక్కడ తయారు అవుతున్నవి. వాటి పేళ్ళు సుగంధరాజతేలు అనేది ఒకటి, బేలా అనేదిఒకటి, చెంబెలిఅనే నూనె ఒకటి, పూలేది అనేనూనె ఒకటి, ఇవి వుపపన్నులు చేసుకొనేవి. పేదలు పెద్ద ఆవాలనూనె పట్టించుకొను చున్నారు. యీ తైలాలతో అంగమర్ధనము చేయకపోతే చర్మములో ల్నుంచి సూదితో కుట్టి నట్టు బెజ్జాలుపడి నెత్తురు చెమ్మగింపు చున్నది. యీ ప్రకారము నాపదిజనానకు నడిచేటప్పుడు కాళ్ళలో కొందరికి నెత్తురు చెమ్మగించి నందున భయపడి వారు యిందుకు వైద్యము ఆవనూనె పట్టించి వేన్నీళ్ళు పోసి కడిగితే వెంబడిగానే వాశి అయిపోతున్నది. చిన్నఆవాలలో నూనె నిండా రావడము లేదు గనుక చిన్న ఆవాలను భక్ష్యయోగ్యముగా వాడుకొని, పెద్దఆవాలలో మాత్రము నూనెను గానుగ ఆడి తీయుచున్నారు.

యీ మంచుకాలములో బ్రాహ్మణ సంతర్పణలు కాశిలో నావల్ల యీశ్వరుడు జరిపినప్పుడు యీ దేశములో నివాసముగా నుండే పంచద్రావిళ్ళకు దృష్టిదోషము అక్కరలేనందున ఆ బ్ర్రాహ్మణులు ఆవరణలోపలను భోజనము ఛెయడానకు చలి యుపద్రవముగా వుంచున్నదని పగలు రెండుజాములవేళ మెద్దెమీద పయిదళములో యెండలో ఆకులు వేయించుకొని కాకుల బాధలేకుండా నాలుగు పక్కలా నలుగురు శూద్రులు తుపాకులు కాలుస్తూ యుండేటట్టు యేర్పరసుకొని యెండ సౌఖ్యముగా వున్నదని భోజము చేసినారు.

కాశివరకు తాటిచెట్లు కండ్లపడక పోయినా, గంగకు యిరుపక్కలా అనేక గ్రామాదులలో తాటిచెట్లు కలిగి యున్నవి. యిరువై యేండ్లకు మునుపు జాతులవాండ్లు పొట్టేటసు అనే గడ్డలు (బంగాళాదుంపలు) యీ దేశానికి తెచ్చి పయిరుపెట్టే క్రమమును యీదేశపు జనులకు నేర్పించినారు. అది మొదలుగా యీ దేశములొ యెక్కడ చూచినా వాటికి ఆలి అనే పేరు పెట్టి అమోఘముగా పయిరు పెట్టుచున్నారు. ఆ గడ్డలు పెద్దదినుసు నిమ్మకాయలంతేసి, చిన్నదినుసు గచ్చకాయలంతేసిగా అనేక రాసులుగా పన్నీరు పూలవర్ణముతో ఫలించి యెక్కడ చూచినా యీ ప్రాంత్యములలో అమ్ముచున్నారు. గంగలో పడవలు యెల్లప్పుడు వస్తూపోతూ వుండడముచేత యీ పడవలు వాడికెగా నిలిచే ఘాట్లవద్ద యిటువంటి భక్ష్యయోగ్య మయిన వస్తువులు తెచ్చి పెట్టుకుని అమ్ముతూ వుంచున్నారు. కాశిలో అమ్మే గొయ్యా పండ్లు (జామపండ్లు) మిక్కిలి గొప్పలుగా, విత్తులు శానా తక్కువగా యుంచున్నవి. ఈ దేశములో కాలము యెరిగి కూరకాయలు వేయుచున్నారు గనుక ఒక కాలములో అయ్యేవస్తువులు మరియొక కాలములో మన దేశములో అకాలములో కూడా దొరికేటట్టు చిక్కదు.

పట్నా అనే షహరు దానాపూరు మొదలుగా ఆరుకోసుల దూరమునకు ఒకే షహరుగా నున్నది. పట్నా షహరులో కలకటరు జడిజీ మెజిస్ట్రేటు ఉండడము మాత్రమేగాక ఒక అప్పీలు కోరటు రివిన్యూ క్రిమినాలు సంగతులు విచారించడానకు ఒక కమిసనరు వున్నాడు. యీ షహరు మ్లేచ్ఛమయముగా నున్నది. లోగడ యెల్లీసు దొర యీ దేశము చూసే నిమిత్తము వచ్చియుండి యీ షహరులో గోమాంసము బహిరంగముగా బజారులో పెట్టి అమ్ముచున్నారు, యీ వింత నేను హిందూదేశములో యెక్కడ చూడలే దని వ్రాసినాడు. అటువంటి వస్తు విక్రయము నా కండ్ల పడకపోయినా అంతపని సాధారణముగా చేసేపాటి మ్లేచ్ఛ షహరు అనవచ్చును.

ఈ షహరులో రెండు దేవస్థలా లున్నవి. ఒకటి పట్నాదేవి మందిరము, మరియొకటి గోపీనాథుని మందిరము. రాజసపూజ వితరణగా జరుగుచున్నది. గాజీపూరు, ఆరా, చప్రా, వీటికన్నా యీ షహరులో యిండ్లమిద్దెలున్ను విస్తారముగా నున్ను, గొప్పలుగానున్ను కట్టియున్నవి. కాశీపట్నమువలెనే ప్రతిసందుకు పాటక్కులనే వాకిళ్ళు తలుపులతోకూడా కట్టియున్నవి. రాత్రిళ్ళుమూశి గడియలు బీగము వేయుచున్నారు. బాజారులను బహునిర్బంధము మీద యిటీవల జాతులవాండ్లు వెడల్పుచేసి చక్కపెట్టినారు. యిండ్లకు బాడిగె యీ షహరులో బహు అల్పము. నేను దినానికి ఒక రూపాయివంతున నిలిచిన దినమునకు బాడిగె యిచ్చుచు వచ్చినాను. సకల పదార్థాలు సకల విధములయిన పనివాండ్లు సమృద్ధిగా దొరుకుదురు. పనివాండ్లను యీ దేశస్థులు కాలీగర్లు అని అనుచున్నారు. యీ షహరులో యెక్కా లనే ఒంటిగుర్రపు గాడీలు బాడిగకు వేలాంతరాలు దొరుకును. యీ సహరులోవుండేపాటి యెక్కాలు యెక్కడా లేవని హిందూస్తాన్ లో ప్రసిద్ధము. ద్వీపాంతర పదార్ధాలుకూడా సమృద్ధిగా దొరుకును. యింగిలీషు షాపులు కొన్నియున్నవి.

షహరుకు మూడుకోసుల దూరములో జాతులవాండ్లు గంగాతీరమునందు యిండ్లు, తోటలు కల్పనచేసుకొని యున్నారు. సమస్తఫలవర్గాలున్ను దొరుకును. అరిటిపండ్లు దొరికినా బొంతపండ్ల జాతేగాని రస్తాళి మొదలయిన రుచికరమయిన జాతిపండ్లు దొరకవు. నాగపూవు వదిలిన వెనక మంచి అరిటిపండ్లు వెడల్పుగల అరిటి అకులున్ను చూచిన వాణ్నికాను. మెవావస్తువులని యీషహరులొ పిస్తా, బాదము, అగురోటు, మునక్కా అనే విత్తు కలిగిన విత్తు లేని ద్రాక్షయేమి పయిచెక్కు యెండి లొపల మాధుర్యము గలిగి విత్తు అతిహ్రస్వముగా కండకలిగిన అనారు అనే దాడింమపండ్లున్ను యెండి అత్తిపండ్లున్ను సమృద్దిగా అమ్ముతారు. సెబుభి యివి మొలయిన శీమ అప్పీల్సు యీ దేశములో అవుతున్నవి. కాశీలో హుక్కాబుర్రలు అమ్మేటందుకు ఒక వీథి ప్రత్యేకముగా యున్నట్టు యీషహరులో యెక్కడ చూచినా నానావిధాలయిన పాదరక్షలు, హుక్కాబుర్రలు మొదలయినవాటి సామానులు అమ్ముతువుంచున్నవి. చలికాలములో రజాయి దుప్పట్లు, రజాయి చొక్కాలు అమితముగా తయారు చేసి అంముతారు.

యీ షహరులో హయిదరాబాదు వలెనే ఆయుధములే ఆభరణాలుగా యుంచే స్వభావము కల మనుష్యులు సమృద్ధిగా వున్నా యింగిలీషువారి అధికారము పూర్తిగా యిక్కడ జరగసాగిన వెనక లక్షాంతరాలు ఆయుధాలు నిర్బంధము మీద లోకులవద్ధ తీసి విరిచి గంగలో వేసినారు. అట్లా చేసిన్ని యింకా యెవరిచేత చూచినా ఆయుధాలున్ను నిర్నిమిత్తముగా ఒకణ్ని ఒకడు నరుక్కోవడాలున్ను గలగి యున్నది.

యీ దేశములో చక్కెర కాచి పోసే కలకండ, చీనా కలకండ పచ్చకర్పూరమున్ను యెంత మాత్రము దొరకదు. నేపాళ దేశము యిక్కడికి సమీపము గనుక అక్కడ అయ్యే కస్తూరి అమ్ముతారు. అందులో కృత్రిమము బహుశ: జరుగుచున్నది. కుంకుమ పువ్వు అయ్యే కాశ్మీర దేశము దక్షిణదేశము కన్నా యీ దేశానికి సమీపముగా వున్నా మనదేశములో దొరికేపాటి మంచి విడి కుంకుమపువ్వు యిక్కడ దొరకదు. వస్తువులు అయ్యే దేశాలనుంచి అన్య దేశాలకు ప్రియమయిన దినుసులను తమ దేశములో వాడీకెలోకి తేకనే పంపించేటట్టు తోచుచున్నది. యీ దేశస్థులు యిక్కడి శీతము యేపాటి? నేపాళ దేశములో కలిగే చలికి సహస్రాంశములలో ఒక అంశ యిక్కడ లేదని చెప్పుతారు. సాల గ్రామాలు ఉత్పత్తి అయ్యే కొండ భూమి నేపాళ దేశములోనే వుండియున్నది. ఆ కొండ మీదుగా గండకీనది ప్రవహింపుచున్నది. ఆ నదిలో సాలగ్రామాలు యెత్తడము నర్మదా శోణభద్రా నదులవలె పట్నావద్ద కలిసే గండకీ నదిలో పట్టిన తావున సాలగ్రామాలు దొరకవు; ఆ కొండ ప్రదేశములోనే ఆ నదిలోనే సాలగ్రామాలు కలిగి వున్నవి.

                                         ------------

పదునాలుగవ ప్రకరణము

యీ హిందుస్తాన్ లో యింగిలీషు వారికి అధీనము కాకుండా యికను నిండా ప్రయత్నము మీద స్వాధీనము కావలసిన రాజ్యము రణజిత్తుశింగుదీ ఒకటేను. వాడి రాజ్యము హిందూస్తాన్ కు చివర కాశ్మీర ఖండమున్ను, లాహోరు అనే షహరున్ను, మూడు లక్షలమంది మార్బలము కలిగియున్నాడు. హయిదరాబాదు చట్టముగా యింగిలీషు వారిని ఉపసర్పించుకొని రాజ్యము చేయుచు నుండే వారు జోతీపురపు రాజు, జయపురపు రాజు, బిక్కనెరి (బికెనీరు!) రాజు, నేపాళపురాజు లక్కునో నబాబు, శింధ్యా, హోలుకరు, వీరు తప్ప మరి యెవరున్ను రాజ్యాధిపతి అని పేరు పెట్టి పిలవడానికి హిందూస్తాన్ లొ లేరు. హోలుకరు,వీరు తప్ప యెవరున్ను రాజ్యాధి పతి అని పేరు పెట్టి పిలవడానకు హిందూస్థాన్ లో లేరు. హోలుకరు గడిచి పోయిన వెనక రాజ్యము బహుశ: యింగిలీషువారి అధీనమయి హోలుకరు కొడుకు యింగిలీషువారి ఆజ్ఞాబద్ధుడుగా నున్నాడు . హోలుకరురాజధాని హిందోలి అనే షహరు. శింధ్యాపడిపోయిన వనక వాడికి వున్నలక్షమంది మార్బలము చేదరనియ్యకుండా పట్టుకొని దత్త పుత్రిడితొ హింసపడుతూ శింధ్యాబార్య కాలము గడుపుతూన్నది. ముందరి శింధ్యారాజధాని హుజనీపట్నము. యిప్పట్లో గవాలియ్యరులో దండు సమేతముగా అతని కుటుంబము వాసము చేస్తూవున్నది. లక్కునో నవాబు ధనము విస్తారముగావున్నా లక్షపౌజు వున్నా ప్రజలను హింస పెట్టుతూ* పేరుకు నవాబుగా వున్నాడు. జోతీపురము జయపురము బిక్కానెరి రాజులు మారువాడీలు గనుక యీశ్వరుడు వారికి యిచ్చిన సిర్జల భూములలో యున్నారు.

జ్వాలాముఖి యనేస్థలము రణజిత్తుశింగు రాజ్యములో వున్నది. ఆదేవిని అతడు బాగా ఆరాధింపు చున్నాడు. అతని రాజ్యములొ యిప్పటికిన్ని న్యాయము బాగా జరుగుతూ ప్రజలు బాగా పరిపాలింపబడుతూ యున్నారు. యీదేశము మొదలు కాశ్మీరములొగా సారా అనిన్ని, బరువు అనిన్ని మంచుగడ్డలు పడుచున్నవి. యింతమంచు నీభూమికి పెట్టిన ఈశ్వరుడు ఈ భూమినివాసుల క్షేమముకొరకు ఉష్ణోదకపు పూట కలిగిన గుండములు కొన్ని నిర్మించి ఉన్నాడు. అవియెక్కడ వంటే గయనుంచి జగన్నధానికి పొయ్యేమార్గములో బలుబలు అనేవూళ్ళో వొకటి; గయకు కొంతదూరములో రాజగృహీ అనేవూళ్ళో ఒకటి; మూంగేరి అనేముంగా చీరలు అయ్యే గంగవొడ్డుషహరుకు సమీపముగా సీతాగుండ మనేది వొకటి; హుజ్రి దేశములో తప్తమణికర్ణిక అనే గుండాము వొకటి; డాకాదేశములో బాలవాగుండ మనేది ఉదకము మీద జ్వాలలు లేస్తూవుండే గండము వొకటి; బదరీ నారాయణమువద్ద వుండేది వస్తువులను వేడిచేసే గుండము వొకటి, యీప్రకారము ఈశ్వరుడు సృస్టించి వున్నాడు. తప్రమణికర్ణికలో బియ్యము మూటకట్టి వేస్తే అన్నముగా పచనమవుచున్నదట. ఈ వుష్ణగుండముల వుదకము యావత్తు గంధకపు వాసన కలిగి వున్నట్టు విచారణమీద తెలిసినది. సదా జ్వాలలు


  • ఇది ఇంగ్లీషువారు వ్యాపెంప చేసిన వదంతి యని బిషప్ హెబరుగారు 1824లో స్వయముగా చూచి వ్రాసినారు. కలిగి వుండే జ్వాలాముఖి గుళ్ళోనున్ను ఆ ప్రకారమే గంధక పరిమళము సదా కలిగి వున్నట్టు తెలియవచ్చినైది. నాయిక్తితో విచారించగా పయి భూములలో శీతము కలుగ చేసిన ఈశ్వరుడు భూమి కింద వుష్ణంకు కలిగివుండే కొరకు గంధమము విస్తారముగా వుత్పత్తి చేసినాడనిన్ని, అగ్ని గంధములో పుట్టడము సహజము గనుకనున్ను యీ గంధకము కలిగిన ప్రదేశములలో పుట్టే వూటజలము సహజముగా ఉష్ణముగా వుండేటట్టు తోచుచున్నది. జ్వాలాముఖిప్రదేశములొ ఆరాధన నిమిత్తమయి గంధకద్వారా భూమిలో జ్వాలను ఈశ్వరుడు సదా కలగచేసినట్టు తొచుచ్ఫున్నది. జ్వాలాముఖి స్వారూపముగా వుండే మహామాయ రణజిత్తుశింగుకు ప్రత్యక్షముగా యిష్టసిద్ధులు చేయుచూ యున్నది.

జ్వాలాముఖికి కొంత దూరములో రేవాలేశ్వర మనే తటాకములో అద్యాసి రెండు పెద్ద గుండ్లు పర్వతాకారముగా తేలుతూ లోకుల యారాధనలను అంగీకరింపుచు సంచరిస్తూ వుండేటట్టు నిశ్చయముగా తెలిసియున్నది. ఆ శిలల స్వభావము యెటువంటిదో తెలిసినదికాదు. కాలక్షేప నిమిత్తమయి సృష్టించిన యీ సృష్టిలో అటువంటి ఉదకము మీద తేలే శిలలు వుంటే యేమి వింత! అయితే దానికిన్ని హేతువు గర్భములో వున్నదని తొచుచున్నది.

నేపాళ దేశములో దేవప్రయాగ అనే వూరు వొకటి వున్నది. అందులో భగవత్పాదులవారు శ్రీరామమూర్తిని యంత్ర సహితముగా స్థాపించి కర్మకులుగా వుండే ద్రావిళ్ళు ఆ మూర్తిని ఆరాధన చేసేటట్ట్లు నియమించి ద్రావిళ్ళను కొందరిని అక్కడ వుంచినారు. ఆద్యాపి వారు అక్కడ వుండి పుట్టే ఆడబిడ్డలను యీ దేశములో నుంచి వచ్చే ద్రావిళ్ళకు స్థితులు వ్రాసియిచ్చి వివాహము చేసియిచ్చి అక్కడనే వుంచుకుంటూ వచ్చుచున్నారట. ఆటు జరగడమువల్ల ద్రావిడ దేశస్థుల యిండ్లు యిన్నూరుదాకా ఆ దేవప్రయాగలో యేర్పడి వున్నవి.

ద్రావిళ్ళ ప్రవేశము కావడములో యీ దేశములో యింతే కాకుండా మొన్నూరుయేండ్ల కిందట ద్రావిడి యయిన యొక వెలనాటి నాడు దేశములో భార్యను వదిలి బృందావనానికి వచ్చి వరక్తుడయి సన్యాసము తీసుకొన్నాడు. కొన్నిదినములకు పిమ్మట భార్య వెతుక్కొనుచు ఆ పురుషుని వద్దికి వచ్చి తన్ను పరిగ్రహించక పోయినంతలో ఆపె నిండా నిర్బంధపెట్టి కృష్ణమూర్తి ఆజ్ఞ అయితే నన్ను పరిగ్రహిస్తావా అని అడిగి నట్టున్ను, మంచిదని అతను కృష్ణమూర్తి యుపాసకు డయినందున చెప్పినట్టున్ను పిమ్మట కృష్ణమూర్తి ప్రత్య్హక్షమయి భార్యను స్వీకరించమని ఆజ్ఞ యిచ్చినట్టున్ను అటుపిమ్మట ఆ సన్యసించిన పురుషుడు భార్యను అంగీకరించి యేడుగురు కొడుకుల కన్నట్టున్ను ఆ యేడుగురున్ను యేడుపీఠాలను యేర్పరచుకొని వల్లభాచార్యులని పేరుపెట్టుకొని కృష్ణమూర్తి యుపాసకులై ద్వారక మొదలుగా యీ హిందూస్తాన్ లో వుండే బనయా అనే వైశ్వెజాతి వారికంతా ఆచారవ్యహారాదు ఉపదేశించి అటుయేర్పడ్డ శిష్యులకు తులసీ మణులు ధారణ చేసి అతిప్రబలులుగా వున్నారు. వారు ద్రావిడ దేశపు వెలనాటి వారితో సంబంధములు చేయుచూ వృద్ధిపొందినారు. ఆయేడు పీఠాలలో నాధద్వారములో ఒక పీఠము వున్నది. అది ముఖ్యపీఠమని చెప్పుకోవడము. దక్షిణదేశములో వారికి శిష్యులు కోటిమంది గుజరాతీ వాండ్లు ఆ యేడుపీఠస్థుల యొక్క వంశస్థులు హిందూదేశము యావత్తున్ను శిష్యయాత్ర చేస్తూవుంటారు.

యీ వల్లభాచార్య పీఠస్థులు గోపీకృష్ణోపాసకులు. వారికి బనయా జాతికాక ఇంకా అనేక శూద్రజాతివారు గూడా శిష్యులై యున్నారు. యీ వల్లభాచార్యుల పీఠముగాక హితహరి వంశాచార్యులని యీ దేశపు బ్ర్రాహ్మణుడు వొకరు రాధాకృష్ణోపాసన చేసి బృందావనములో వక పీఠమును యేర్పరచుకొని వారికి తులసీమణి ధారణచేసి ఆచారవ్యహారాలు నియమించి వున్నాడు. యీ పీఠస్థుని వంశస్థులకు ఏకాదశినాడు తాంబూల చర్వణము చేయడానికి శ్రీకృష్ణమూర్తి అనుజ్ఞ యిచ్చి వున్నాడని అపశక్యముగా అతని శిష్యజనులున్ను ఏకాదశినాదు ఆద్యాపి తాంబూల చర్వణము చేయుచూ వుంచున్నారు. హిందూస్తానులో ఏకాదశినాడు విష్ణుభక్తులు