కాశీయాత్ర చరిత్ర/ఆఱవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తీర్ధ హీనముగా ఎన్నటికిన్ని కాతగ్గదిగా నుండలేదు. ఆతీర్ధము పాతాళలోక జనితమయిన దనిన్ని యేట్లా ఊర్ధ్వలోకానికి భాగీరధిన్ని ఉన్నచో తద్వత్తుగా పాతాళలోకానికి భోగవతి అనే తీర్ధమిది యని పురాణ నిశ్చితమైయున్నది. అంబరీష మహారాజు అతిధిరాకను నిరీక్షించనందున దుర్వాసుల శాపగ్రస్తుడయి యుండగా ఈతీర్ధము ఆశాపమును నివర్తింపచేసినది. అంబరీష మహారాజు ఇక్కడికి 4 కోసుల దూరములో నుండే నంది గ్రామములో రాజధాని కలగ చేసుకొని దొరతనము చేసినాడు. రుక్మాంగదుని రాజధాని యెంత విచారించినా ఉయిదివరకు తెలిసినది గాదు.

ఈ పర్వతము పేరు సింధురాజ పర్వతము. శ్రీరాములు తన దొరతనములొ బ్రాంహ్మణ శిశువూయొక్క మరణ హేతువుని కనిపెట్టే కొరకు వెతకగా శూద్రుడు తపస్సు చేయుచు నుండను గనుక వాని సంహరించిన వెనుక వాడు నమ్రతను పొంది ప్రార్ధనచేసి నందున వాని లింగాకృతి చేసి తాను సీతాలక్ష్మణ, హనుమత్సమేతుండై యిక్కడ వసింపు చున్నాడు. యిది యీస్థల మహాత్మ్య పురాణ బోధితముగా నున్నది. ఈ స్థలమందు 28 తేది రాత్రి వరకు ఉందినాను.


ఆఱవ ప్రకరణము

29 తేది ఉదయమున 6.4 ఘంటకు లేచి అక్కడికి 6 కోసుల దూరములో నుండే దొంగల తళావు అనే వూరు 1 ఘంటకు ప్రవేసించినాను. ఈదినమున్ను కొంచెము త్యాజ్యశేషము ఉండగా ప్రయాణ మయినందున చెన్నపట్టణము వదలిన యిన్ని దినములు వర్షాకాలములో ప్రయాణ మయి నడిచి నందుకు సెలవుగా నేటి దినమున అడవిమధ్యే ఒక ఘంటసేపు నంతతొద్ధారమయిన వర్షములో తడియడ మయినది. దారి బహుబాగా ఉన్నది. నిర్మల నది కాశీయాత్ర వచ్రిత్ర

లిన వనక ఈ సొఖ్యకరమయిన యెర్రగులక యిసక గల భూమిని ఒక కోసెడు దూరమయినా చూచినది లేదు. దట్టమయిన అడివి మధ్యే భాట. గొప్ప వాగులున్ను మరికొన్ని చిన్న వాగులున్ను దారిలో దాటవలసినది. దొంగలతళావు అనే ఊరు చేరగానే జాగాకు నిర్వ్యసనముగా దుకాణాలవారు తమ తమ యంగళ్ళకు చేరి నట్టుల్గా 40 అడుగుల నిడివిన్ని 14 అడుఇగుల వెడల్పున్ను గల కొట్టాయీలు కట్టి, పొయిలువేసి ప్రతిదినమున్ను గోడలు సమేతుగా గొమయముతో శుద్ధి చేసి, కొట్టాయీల ముందర గుర్ర్రాలున్నూ పశువులున్నూ కట్టడానికి మేకులుపెట్టి కొట్టి యున్నారు. ముసాఫరులు సమ్మతమయిన కొట్టాయిలో దిగవచ్చును. అయితే కావలసిన భోజనసామగ్రీలు కొట్టాయి ఖామందువద్ద పుచ్చుకోవలసినది. ఒకటిన్ని కొనకపోతే పేదలను కొట్టాయిలో నిలవనియ్యరు. ముసాఫరులకు కావలసిన సామగ్రీలు అహంపూర్వ మహంపూర్వ మని యిచ్చుచున్నారు. యీ కొండమార్గములో కృష్ణమొదలుగా స్థలమునకి శ్రమపడుచు వచ్చినవారికి ఈ విశాలము లయిన స్థలములు ఆయాచితముగా దొరకటములో నుండే ఆనందము చ్ఫెప్పితీరదు. అయితే యీ కొట్టాయీలు వీధికి యెదురుగా నిరుపక్కల వేసియుంచున్నవి. పరదా కట్టివేస్తే యింతకుమిక్కిలి అనుకూలమయిన స్థలములేదని తోచబడును. గుర్రాలకు పచ్చికసువు మోపులుగా తెఛ్ఛి ఉంచి ప్రార్ధించి తీసుమను చున్నారు. కృష్ణదాటినది మొదలు సెనగలు అతినయము గనుక గుర్రాలదాణాకు చింతలేదు.

ఈ నాగపూరు రాజ్యములో దక్షిణదేశమువలె, యర్రకందులు, నల్లనువ్వులున్ను దొరకవు. అందుకు ప్రతి తెల్లకఁదులు తెల్లనువ్వులున్నూ సమృద్ధిగా అమ్ముతారు. తిలతయిలము దొరకడము అరుదు. ఆముదము శుద్ధముగా దొరకదు. అవిశలని నువ్వులవంటి గింజలు పండుచున్నవి. వాటినూనె విప్పనూనెయున్ను దీపాలకు పోయుచున్నారు. సకల ధాన్యాలున్ను అమ్మడముగాక అన్నిటినిన్ని పిండిగా విసిరి అంగడిలో పెట్టి ప్రతియూరిలోనున్ను అమ్ముచున్నారు. ఏనుగుల వీరాస్వామయ్యగారి

ఈరామటెంకికి ఉత్తరము బంగాళా గౌనరుమెంటులో చేరిన శిమిని తాలూకాతో చేరినిది. ఈ రాజ్యము కుంఫిణీవారికి స్వాధీన మయిన వెనక గవనర్ జనరలువారు జబ్బలపురిలో ఒక ఏజంటును సాగరులో ఒక ఏజంటునున్ను ఉంచి వారికింద కొందరిని ప్రింసైపాలు అసిస్తాంట్సు అని యేడుగురు దొరలను ఏర్పరచినారు. ఇంగిలీషువారి ఆధీనముగా ఈరాజ్యము కాక మునుపు యీ యడవిలలో దొంగలభయము విస్తారముగనుక ఇప్పుడు ఊరికి మూడేసి గుర్రపుసాలాలను ఠాణాలుగా ఉంచి బహుమమందిని పట్టి శిక్షించి కొందరిని దారులలో తూకుతీసి(ఉరితీసి) ఆ కళెబరాలు శిధిలము లయ్యే దాకా వ్రేలుకాడుచు నుండేటట్టు చేసినారు. మజిలీ యూళ్ళలో పరువుకల ముసాఫరులు సరఫరా నిమిత్తము ఒకకొత్తవాలునున్ను యిద్దరేసి సరఫరా బంట్రౌతులునున్ను ఉంచియున్నారు. ఇప్పట్లో మృగ భయము ఒంటిగా వఛ్ఛేవారికి మాత్రము ఉండవచ్చును.

యీ దొంగల తాళవు అనే యూరు బహు జలవసతి కలది, దొంగలు వేసేతళావు కలది గనుక దొంగలతళావు అని పేరువచ్చినది. యీ శిమినీ తాలూకా కిందవుండే గ్రామాలు యిజారాలకు తీర్చియిచ్చినారు. ఆ యిజారాదారులను పట్టేలు అని వాడు కొనుచున్నారు. యీ యూరు చిన్నదయినా ముసాఫరులకు సౌఖ్యప్రదముగా నున్నది. ఆ రాత్రి అక్కడ వసించినాను. మోది అనేఊరు ఒకటి దారిలోనున్నది. అక్కడ నాగపూరు రాజు చౌకీ ఒకటియున్నది.

30 తేది ఉదయాన 6.4 ఘంటకు లేచి యిక్కడికి 7 కోసుల దూరములో నుండే కురాయి అనేవూరు 1 ఘంటకు చేరినాను. నడిమివూళ్ళూ; నెంబరు 2 గర్ర 1 కవాసా 2 రెల్లి 3 రంని 4 కురాయీ5/

దారి నిన్నటి దారివలెనే బహు అనుకూలముగా నున్నది. దట్టమయిన అడివి మధ్య భాట. 6 వాగులు గొప్పవిన్ని; చిన్నవిన్ని దాటవలెను. మధ్య గర్ర అనే యూరివద్ద సుందరమయిన తామరకొలను ఒకటి వున్నది. అక్కడక్కడ 50 బారల దూరముకదాచిత్తుగా నల్లరేగడ భూమి తగులుచువచ్చును. అదిన్ని గట్టిరేగడగాని, కాలుదిగిపడే అడుసు కాదు. కురాయి అనే ఊరిళో కాశీయాత్ర చరిత్ర

నిన్నటివలెనే కొఠాయిలు, చావిళ్ళున్ను కట్తియున్నవి. రమటెంకి మొదలుగా ఉండే టప్పమనుష్యులు శిమినీ టప్పారయిటరు యొక్క ఉత్తవుకు లొబడ్డవారైనా నాగపూరి యిలాకా టప్పా డభేదారులు ఇద్దరు నాతోకూడా వచ్చినారు గనుక వారి పెత్తనమవల్ల కురాయి దాకా టప్పా మనుష్యులను మజిలీ మజిలీకిన్ని తెచ్చినాను. రామటెంకి మొదలు కొండ్కోసులను పక్కాకోసులని చెప్పుతారు. ఒక పక్కా కోసుము మూడు కచ్చాకోసులు. ఒక కచ్చాకోసుకు 2 మయిలు లని యిక్కడివారు చెప్పినారు. ఈ యూరున్ను నిన్నటి యూరివలెనే నిండా బస్తీకాకపొయినా ముసాఫహరులకు సౌఖ్యము కలుగచేయడానకు సకల విధాలా చాలియున్నది. యీ నాగపూరి రాజ్యము ప్రవేశించినది మొదలుగా ప్రతియూరిలో నున్ను చెరువు కలదు గనుక జలవసతి అయిన గ్రామమే. యిక్కడి చెరుఫులలో శింగాడి కాయలని పయిరుపెట్టుతారు. ఆ కాయలలో బాదంపప్పుజాడగా విత్తులు ఉన్నవి. ఆవిత్తులను పిండిచేసి ఉపవాస దినాలలో పూరీలుగా కాల్చి ఫలహారము చేస్తారు. యధోచితమయిన తీపుకలిగి ఉన్నది. ఆ పిండి ఆరొగ్యకరమయిన దని చెప్పుతారు. ఆ యూరిలో ఆ రాత్రి వసించినాను.

31 తేది ఉదయాన 6 ఘంటలకులేచి అక్కడికి 6 కోసుల దూరములో నుండే చావిడి అనే ఊరు 12 ఘంటలకు చేరినాను. నడిమె ఊళ్ళు. నెంబరు3 - మొహగాం- 1 సూకుతలా 2 - గోపాల పూరు 7. ఆ యూరిలొ నున్ను ఆరీదిగానే కొట్టాయీలు దుకాణపు దారులు కట్టి యుంచినా బస్తి అయిన వూరుగనుక బజారు వీధులలో జనసమ్మర్ధముగా నుండుటచేత మనసుకు రమ్యముగా నుండలేదు. కురాయిపూరు దాటగానే కొండయెక్కి దిగవలసినది. ఇక్కడ వింధ్యపర్వతమును ఆరోహణము చేయవలసిన దనేది ప్రసిద్దముగా నున్నది. భాటరాతిగొట్టు; నల్లరేగడ కొంతమేర కొండదిగగానే యెర్రరేగడగా నున్నది. ఆడివి మధ్యేభాట. దారిలో కొన్ని వాగులున్ను దాటవలెను. ఈ కొండ యెక్కగానే యాత్ర వెళ్ళేవారు వింధ్యవాసినికి ప్రీతిగా కొన్ని టెంకాయలు కొట్టి చూరవిడుచు చున్నారు. ఏనుగుల వీరాస్వామయ్య గారి

ఎండు కొబ్బెరలోపల నుండే టెంకాయలు దొరుకుచున్నవి. యీ ప్రాంతములలో ఉప్పుడు బియ్యము, చింతపండున్ను ప్రియమయినా కావలసినది దొరుకును. రాతిఉప్పు విశేషముగా అమ్ముతారు. ఈయూరినుంచి శిమినీ అనే యూరిలో కేప్టన్ వాడున్ లో దొర వద్ద ముఖ్యుడుగా నుండేఋ బంగాళీ బ్రాంహ్మణుడయిన బాలకిసన్ బాబు అనే వానికి ఒక యుపచార మయిన యింగిలీషు జాబు వ్రాసి నా తయినాతిగా నర్మదవరకు ఒక బిళ్ళ బంట్రౌతున్ను, ఒక టప్పామనిషిన్ని మజిలీల ప్రకారము కూడావచ్చేటట్టు శ్రీరామ కటాక్షముచేత ఉత్తరువు తెప్పించుకొన్నాను. చావడి అనే ఊరు గొప్పది. ఆ రాత్రి అక్కడ వసించినాను.

శప్టెంబరు నెల 1 తేది ఉదయాన 3 ఘంటలకు లేచి యేడు కోసుల దూరములో నుండే నారాయణగంజు అనే ఊరు 12 ఘంటలకు చేరినాను. నడిమివూళ్ళు, నెంబరు 4. పిండిరి. 1 - లక్కుగోవాడ. 1. శింగపూరు 1. హోరా 1. చౌకి, 1. నారిల్లి, 1. గంటియా, 1 నారాయణ గంజు 1.

దారిలో అదివి లేకపోయినా బహుశా నల్ల రేగడ. శానా పశ్చిమ వాహిను లయిన వాగులను దాటవలెను. కొంత దూరము రాతిగొట్టుగా నున్నది. యీ యూరు యడారిమధ్యే ఉన్నది. దుకాణపు దారులు పేదలు గనుక పనిగడుపుకొనే పాటిగా కొట్టాయిలు కట్టియున్నారు. ముసాఫరులకు కావలసిన సామానులు ఒక్కటిన్ని తక్కువ లేక దొరుకును. చెరువు కలదు. జలవసతి అయిన గ్రామ మేను. ఇక్కడ యీరాత్రి నిలిచినాను.

2 తేది ఉదయాన 5 ఘంటలకు లేచి 8 కోసుల దూరములో నుండే గణెశగంజు అనే ఊరు చేరినాను. నడిమి వూళ్ళు. నెంబరు 5. బండోలు - 1 - సాదక్కునూని -1- చప్పారా -1- గనికెతాలు - 1- కుయ్యో - 1- గణేశగంజు -1.

ఆవూరు కొండ కిందనున్నది. దారిలో చప్పారా అనే కనుబాబస్తి యూరివద్ద భానుగంగా అనే నది దాటవలసినది. చప్పారా అనే యూరి వరకు భాట నల్లరేగడ, రాతిగొట్టు. ఆయూరికి ఇవతల కొండలు కాశీయాత్ర చరిత్ర

యెక్కి దిగవలెను. ఇవతల గణేశగంజు చేరేవరకు ఇరుప్రక్కల పర్వతములు కలిగి వున్నది. భాట రాతిగొట్టు; ఈవూరిలో కొట్టాయీలు యధోచితమయిన వసతిగా కట్టియున్నారు. కావలసిన సామానులు దొరుకును. ఈ యూరికి సమీపముగా ఒక నిర్మలమయిన జలముగల వాగు పారుచున్నది. ఇటువంటి వాగులు కొన్ని దారిళొ దాటవలసి యున్నవి. ఆ రాత్రి అక్కడ వసించినాను.

3 తేది 7 ఘంటలకు బయలు దేరి యిక్కడికి 20 కోసుల దూరములోనుండే ధూమా అనే వూరు 3 ఘంటలకు ప్రవేశించినాను. నడిమి వూళ్ళూ నెంబరు -6 - లక్కనోడాన్ -1- మకరాచౌకీ -1- నెడునది-1- జూబా-1- ఘాఘురీ-1- ధూమా-1-.

దాదిలో లక్కునోడాన్ అనే ఊరు ఉన్నది. అదివరకు కొండల మధ్యే మిట్టయెక్కుచు, పల్లానదిగుచు దారినడవనలెను. భాట నల్ల రేగడ, రాతిగొట్టు. చిన్నవాగులు అనేకములు దాటవలెను. జూబానది అనే ఒక పెద్దవాగు దాటవలెను. గణేశగంజువద్ద నుండే వాగున్ను పెద్దదేను. అదిదాటి కొండవంటి మిట్టయెక్కవలసినది. లక్కునోడాన్ మొదలుగా దారి కిరుపక్క్ల కొండలు లేవు. యడారిమధ్యే భాట, అడివిలేదు. ధూమా అనేఊరు కసుబాస్థలము, బస్తీ అయినది. దుకాణం దారులు సక్తులయినా బస్తీస్థలమందు వాసముచేసేవారు గనుక బేఫరాచేత ముసాఫరుల నిమిత్తమై యెంతమాత్రమున్ను వసతి అయిన కొట్టాయిలు కట్టినవారు కారు. నేను వూరికి బయట డేరాలు వేసి దిగినాను. నాలుగు శిపాయిడేరాలు, ఒక కంబళిడేరా, ఒక యెంటి కంభం డేరా అంతు ఆరుడేరాలున్ను వేయడానికి 40 బోయీలున్ను, ముగ్గురు కళాసులున్ను వుండిన్ని దిగిన వెనక 1 ఘంటసేపు పడుచున్నది. ఈయూరిలో బియ్యము తప్ప సకలపదార్ధాలున్ను దొరికినవి. యీదేశాస్థులకు పిండిజరూరే గాని బియ్యము నిమిత్తము సిద్ధముగా ఉంచడము లేదని చెప్పినారు. బహు ప్రయత్నముమీద నాపరిజనుల కందరికిన్ని చాలేటందుకు ఎక్కువగానే శ్రీరామ కటాక్షముఛేత బియ్యము ఏనుగుల వీరాస్వామయ్యగారి

తెప్పించినాను. ఈయూరు జలవసతి యయినది కారు. తమలపాకులు ఈ యూళ్ళో దొరకడము కష్టము.

శ్రీరామ కటాక్షమని అప్పుడప్పుడు నేను వ్రాయడములో పరబ్రంహ్మ యొకవస్తువే జగత్కారణమై యుండగా ఒకరొకరు ఒక్కొక్క అవరారముర్తి నామమును నావలేనే ఆశ్వయించి ఆరాధన చేయడమేమని శంక తొచును. అందుకు సమాధాన మేమంటే - పరబ్రంహ్మ సర్వాంతర్యామిగానున్నా చందన కాష్టములో ప్రవేశించిన అగ్ని పరిమళించినట్తు సృష్టిస్థితి సంహారాలకు కారణమయిన త్రిమూర్తులలో ప్రతిఫలింఛే పరమాత్ముదేమె లోకశిక్షార్ధమై అనేకావృత్తులు అవతరించిన సత్వగుణ ప్రధానుడయిన శ్రీమన్నారాయణ మూర్తిలో ప్రతిఫలింఛే పరమాత్ముడేమి, అస్మదాదులలో ప్రతిఫలింఛే పరమాత్ముడేమి, అంతా ఒక్క వస్తువయినా ప్రతిభాతిని ఇచ్చే వస్తువిశేషాలచేత ఒక ప్రకృతికి మరియొక ప్రకృతి పూజ్యమయినది. ఆ న్యాయప్రకారమే రామకృష్ణాద్యవతారాలు అస్మదాదులకంటె అతిపూజ్యము లయినవి గనుకనున్ను నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానంద స్వరూప మయిన పరబ్రహ్మము పూర్వన్యాయాలచేత బాధకమున్ను సాధకమున్ను వొక్కటే అయినందున రూపాంతర, నామాంతరాలను బట్టి ఆరాధన చేసుటఛేత బాధకను లేక సాధకముగానే యుండవచ్చును గనుకనున్ను ఈశ్వరలీలావతారకధలు శ్రవణము చేసుటలో ఏలీలచేత భక్తులను మిక్కుటముగా పరమాత్ముడు హర్షించి, పోషించి నాడని వారివారికి తోచబడుచున్నదో ఆయా యవతారనామమే మిక్కిలి ముఖ్యమని యెంచి దాన్ని వారు వారు వృద్దాచార ప్రకారము ఆశ్రయించి భక్తిపూర్వకముగా ఆరాధింపుచున్నారు. తామసగుణప్రధానుడయి త్రిమూర్తులలో ఒక్కడు న్నయిన సాంబమూర్తికి తమోగుణముచేత సంహారము చేయుచు రావలసినపని యొకటే మాయాయుక్త మయిన పరబ్రహ్మ వల్ల నియమింప బడ్డందున సంహారము చేయడానికి తా నున్న రీతి కాశీయాత్ర చరిత్ర

చాలు నని అవరారా లెత్తినాదు కాడని తోచుచున్నది. అందువల్ల అతనికి అవతారాలు, తత్సంబంధము లయిన నామాలున్ను లేవు. లీలా విశేషలు చేత కలిగిన నామాలు మాత్రము అనేకములుగా అతనికి కలిగి యున్నవి. రక్షించ వలసినపని సాత్విక మూర్తి యయిన శ్రీమన్నారాయణమూర్తికి నియత మయియున్నవి గనుకనున్ను అందులో దుష్టులకు శిష్టులను హించ పెట్టడము ఇష్టముగా నుంచున్నది గనుకనున్ను విష్ణువు మాత్రము అనేకవతారాలు లోకశిక్షార్ధమయి యెత్తి, సాధువులను రక్షించి తదపేక్షయా దుష్టులను పరిష్కార ముగా నిరూపింపుచు యధోచితముగా శిక్షించి శిక్షానంతరము మళ్ళీ రక్షింపుచు వచ్చినాడు గనుక అతనికి అనేకావరాతాలెత్తవలసి వచ్చినది. ప్రతియవతారానికిన్ని ఒక నామము గలిగిన దని నాకు తోచుచున్నది. రజోగుణముచేత సృష్టించడానికి నియమింపబడిన బ్రంహ్మకున్ను సాంబమూర్తి వలెనే అవతారాలు అగత్యము లేనందున ప్రపంచములో ఒక యవతారము నయినా వహించ లేదు. సాంబమూర్తి సంహార నిమిత్తమయి లేక పోయినది. తద్ద్వారా అతనికి నామాంతరముకూడా లేకపోయినదనిన్ని తోచుచున్నది. ఈరీతిగానే పరబ్రంహ్మ యీ బ్రంహ్మాండములో కొంత ప్రదేశమందు క్రీస్తు యెడల ప్రతిఫలించి ఆభాతి పాత్రద్వారా యెక్కువయి ఆ దేశస్థులకు అతను శిక్షకు డయినాడు. ఆ ప్రకారమే మహమ్మదు వగయిరాలు ఆయా దేశాలకు పూజ్యులయి యీశ్వరసమము లయినారు. మనము రామకృష్ణాద్యవరారాలను లోకశిక్షకములుగా భావించి ఆ నామోచ్చారణ చేసి ఆరాధించినట్టు ఇతరదేశస్థులు అక్కడ అవతరించిన వారిని ఆరాధింపుచున్నారు. ఏ పేదుతో ఏ మూర్తినిగాని, ఏవస్తువునుగాని యేరీతిగా ఆరాధించినా ప్రతిగృహీత అంతర్యామి యొక్కడే గనుక ఏమిన్ని బాధకము లేదు. ఈయుక్తిచేతనే "గురుబ్రంహ్మ గురువిష్ణు" అనే ప్రశస్త వాచకాలు ఏ ప్రకృతి పట్టితే ఆ ప్రకృతే ఆ ప్రకృతే సమస్త కాశీయాత్ర చరిత్ర

వాగులు, నదులున్ను వివరించి వ్రాయుచు వచ్చినానుగదా! ఊరికే దాటవలెనని నేను వాయుచు వచ్చిన వాగులంతా కాలినడకగా దాటతగ్గవని తెలిసి యుండవలసినది. నిన్న దాటిన జూబా నదివద్ద ఇంరుపక్కల రెండు కొయ్యలు నాటి రెండు కొయ్యల తలలకు ఒక కప్పితాడు కట్టినారు. తపాలాకట్ట రాగానే ప్రవాహకాలాలలో పక్కకు ఒక హరకాతా వంతున ఇరుపక్కల కాచియుండి తపాలా కట్టను కప్పికి కట్టివేస్తే యివతలి పక్కవాడు యీడ్చుకొనేటట్టు చేసి నారు. రాయచౌడువద్ద ఒక కొండ యెక్కిదిగవలసినది. యీ రాయచౌడు జలవసతి కలది. పెద్ద చెరువు కొండను కట్టగా చేసుకొని యున్నది. యీకట్టమీదనే అప్పాసాహెబు అనే నాగపూరి రాజును కొంఫిణీవారు ఖయిదు చేసి తీసుకొని వచ్చుచుండగా తప్పించుకొని పరుతెత్తిపోయినాడు. ఇక్కడ దిగడానకి అంగళ్ళవాండ్లు, యధోచిత వసతి గలవిగా చావళ్ళు కట్టి పెట్టినారు. అందులోనే దిగినాను. సకల పదార్ధాలు ముసాఫరులకు దొరుకును.

ఇటువంటి కాలు దిగబడే అడుసు, రాతిగొట్టు, ముండ్లు, వొరుగుడు, కాలువలు, వాగులు, కొండలెక్కి దిగడము, వీటివల్ల కలిగే ప్రయాసను ఓర్చి అర్ధముకన్నా దేహముమీది యభిమాన మెంత జఘన్యునికిన్ని యెక్కువగా నుండవలసినది సహజమై యుండగా కొంచానికి ఒకరితో నొకరు కలహమాడే బోయజాతి ఒక జతగా కలిసి యేకవాక్యతను పొంది దోవ సాగించడము ఎందువల్ల నని ఊహించితిని. అర్ధాపేక్ష చేత ఓర్చుచున్నా రందామంటే లొభులవద్ద అర్ధము గుంజలి స్తే వారి దేహమును బాధించి అర్ధాకర్షణ చేస్తారు. అప్పటికి అర్ధాపేక్షచేత సామాన్యముగా మనుష్యులు దేహకష్టమును మిక్కుటముగా ఓర్చజాలరు గనుక ఒకరు కాకుంటే ఒకడు యిటువంటి మిక్కుటముగా ఓర్చజాలరు గనుక ఒకడు యిటువంటి మిక్కుట మైన కష్టము వచ్చినప్పుడు నాకు రూకవద్దబ్బా అని వెనక తీసిపొవును. రాజాజ్ఞచేత సహిస్తారందామంటే మిక్కుటమయిన కష్టవు మోత కలిగి నప్పుడు ఒకడుకాకుంటే ఒకడు ఇప్పుడు దేహానికి ఆశక్తి వచ్చినది, యీ కష్టపుమోత నేను మోయలేనని తిరగబడితే రాజయినా ఏమిచేయగలడు? గనుక అదిన్ని కారణముకాదని తొచినది. అప్పటికి ఏనుగుల వీరాస్వామయ్య గారి

నేను ఊహించిన కారణ మేమంటే సమానులలో ఉత్తమ కీర్తిగలవారు కావలెననే శ్రుతివాక్యర్ధ ప్రకారము ప్రతి పురుషునికిన్ని సమానులలో ఉత్తము డనిపించుకో వలెననే ఆసక్తి సకల విధాలా వుండును గనుక యీ బోయీలు ఒక జతగా కలిసి నప్పుడు మంచి మోతేగాడయితే వారిలో ఉత్తమకీర్తి జనింపుచున్నది, గనుక ఒకరు యీప్రయాసలకు ఓర్చనేరక వెనకబడ్డా, మోతలో జబ్బుపడ్డా జతలో నుండే యితరులు అప్పుడేచాలాగా వెనకబడ్డ వానిని నిందింపుచున్నారు. గనుక సమానులవద్ద విందింపబడే దాని కన్నా దేహము పపోవడము మేలని తోచి యిటువంటి ప్రయాసను ఓర్చి సమానులచేత స్తుతింపబడక పోయినా, నింద యయినా లేక నుండవలెననే తాత్పర్యముతో ఈ కష్టములను ఓర్చి యీబోయీలు మోత సాగింపుచున్నా రని నిశ్చయించినాను. యీకొద్ది పరువు కల మనుష్యులెకే సమానులలో యోగ్యుడనిపించుకోవలెననే అక్కడ యింత ఉండగా తదపేక్షయా ఉత్తములకు పరంపరగా ఎంత ఉండవలసినది? యిది యోచించి సమానులను నిష్కారణముగా అవమానపరచి నంతలో ప్రమాదము వచ్చుననిన్ని సమానులను ఆదరించి గౌరవము చేస్తేగాని తాను ఉత్తమశ్లోకుడు కానెరడనిన్ని, తెలిసి ప్రపంచములో ప్రవర్తింపుచు రావలసినది. యీ యూరిలో యీ రాత్రి వసించినాను.

5 తేది ఉదయాన 5.4 ఘంటకు లేచి యిక్కడికి 6 కోసుల దూరములో నుండే పిప్పర అనే ఊరు 12 ఘంటలకు చేరినాను. (మధ్యనున్న ఊళ్ళు)

నెం.8 జంజూరికే భావనా - 1 - చెన్రూ - 1 - రొతినాలా-1 దారి రాతిగొట్టు, నల్లరేగడ సాతుగడ అనే7 కొండలు ఎక్కి దిగవలసినది. మోతినాలా అనేవాగు మధ్యే ఉన్నది. ఆ వాగు ఇవతల యేడుకొండలు యెక్కి దిగేవరకు కొంత అడివి కలిగి యుంచున్నది. కురాయి అనే యూరు మొదలుగా లొగడ యింగిలీషు వారికి నాగపూరు రాజు యిలాకా దారులతో అనేకవృత్తులు యుద్ధ ప్రసక్తులు కలిగినది. గనుక అప్పట్లో విస్తారముగా అడివికొట్టి భాట వెడల్పుచేసి చక్కపెట్టినారు. అది యిప్పట్లో లొకోపకారముగా నున్నది. యీ కాశీయాత్ర చరిత్ర

పిప్పర అనే ఊరు మజిలీలాయఖు అయినదే. దుకాణందారుల కొట్టాయీలలోనే దిగినాను. బియ్యము అతి ప్రయత్నముమీద దొరికినది. చింతపండు ఎంత ప్రయత్నము చేసినా సాధ్యమయినది కాదు. రామటెంకి మొదలు రాతివుప్పు మాత్రము దొరుకుచున్నది గనుక మెత్తగా విసిరి శాకములలో కలపవలసినది. ఈదేశములొ చింతపండుకు బదులు ఆముచూరు అనే మామిడివరుగు వాడుకొనుచున్నారు. నింమపండ్లు మాత్రము పట్టితావున దొరుకుచున్నవి. యీయూరిలో యీ రాత్రి వసించినాను.

6 తేది ఉదయాన 5 ఘంటలకులేచి యిక్కడికి నాల్గు కోసుల దూరములో నుండే తిలవారా అనే ఊరును దారిలో నర్మదా మహానది దాటి 9 ఘంటలకు ప్రవేశించినాను. ఇక్కడ 200 మంది యెక్కే పడవ ఒకటిన్ని 50 మంది యెక్కే చిన్న పడవ ఒకటిన్ని ఉన్నది. ముందు యిటువంటివి ఈ నర్మదామహానది రేవులో అనేకములుగా నుండినవి. అయితే యిటు తర్వాతను 2 సంవత్సరముల కిందట అకస్మా త్తుగా ప్రవాహము వచ్చి రేవున నున్న పడవలన్ని కొట్టుకొని పోయినందున ఇప్పుడు కుంఫిణెవారు రెండు చేయించి వేసి ఘాటు సుంకము సంవత్సరము 1 కె 30 రూపాయీలకు ఒక ఆసామీకి గుత్తకిచ్చినారు. వాడు మనిషికి ఒక పయిసా, గుర్రానికి 1 అణా ఈవంతున హాశ్శీలు తీస్తాడు.

ఈనది పశ్చిమ వాహిని సుమతి అనే పశ్చిమ సముద్రతీరపు గ్రామమువద్ద సాగరసంగమవుచున్నది. యిక్కడికి ఆ సంగమప్రదేశము రెండు నెలల ప్రయాణ మున్నది. అమరకంటక మనే ప్రదేశములో వెదురుపొద మధ్యే యీనది పుట్టినది. ఆ మహాస్థలము ఇక్కడికి 20 దినాల ప్రయాణముంచున్నది. ఈనది మహిమ యేమంటే ధృవమహారాజు యాగము చేసినప్పుడు ఋత్విక్కులుగా వచ్చిన మహాపురుషులు యాచనమీద సాంబమూర్తిని తపస్సుచేత సంతొషపెట్టి భూకిలో ఎక్కడా నదులు లేక నుండగా పశ్చిమ వాహినిగా ఒక నది కావలె నని ప్ర్రార్ధించి సాంబమూర్తియొక్క అర్ధ దేహాన్నే ప్రవహించేటట్టు చేసుకొన్నారు. .'ఏనుగుల వీరాస్వామయ్య గారి

తద్ద్వారా యిది పురషనది అనిపించి కొనుచున్నది. యీ మహానది మహిమ పురాణములో 12 వేల గ్రంధములచేత విస్తరించి చెప్పియున్నది. యిందులో పుట్టే శిలలంతా లింగాలుగా ఆరాధింపుచున్నారు. ఈ లింగాలు హిందూస్తాని మాటతో "అర్మదు కాకంకరునబు శంకరు" అంటారు. బెడాఘాటులో కృష్ణవర్ణపు లింగాలు పుట్టుచున్నది. ఆ స్థలము ఇమ్మడికి 4 కోసుల దూరము. ఓంకారంఘాటులో శ్వేతలింగాలుపుట్టుచున్నవి. ఆ స్థలము ఇక్కడికి 12 దినముల ప్రయాణము. ఈ తిలవారాస్థలములో ఒక దృష్టాంతము నాకండ్ల చూచినాను. అది యేమమంటే వేసిన అస్థులు సగము ముక్కాలువాసి శిలామయము లవుచున్నవి. గనుక క్రమముగా అంతా శిలామయము లవుచున్న వనడానకు సందేహములేదు. ఈ మహానది పశ్చిమవాహిని కావడముచేత అత్యాశ్చర్యముగా పది యిరువై తాటిచెట్ల పొడుగు గల కొండల నడమను భేదిచుకొని ప్రవహించుచున్నది. యీ వేదుక బెడాఘాటుకు పోతే చూడవచ్చును. ఈ మహానది ఇక్కడ నిండా వెడల్పు లేదు. 30 సంవత్సరముల కిందట రఘోజీబాబాతల్లి బహుస్తొమముతో కూడా యిక్కడికి యాత్రకు వచ్చి ముందర నర్మదానదిని పూజచేసి దాటనలసిన దని ఘాటువారు చెప్పగా మా నాగపూరి వద్ద ఖనానా అనే నదిపాటి వెడల్పు లేదే పూజ యేమని అలక్ష్యపెట్టినందుకు, నాటి సాయంకాలమే యివతలి గట్టుకు వచ్చి నదివోరగా దిగివుండగా గడియలో అమితముగా ప్రవాహము వచ్ఫి ఆమె సర్వస్వాన్ని హరించి మరుసటి గడియలో ప్రవాహము తీసిపోయి యధాస్థితికి వచ్చినది.

ఈ తిలవారా అనె ఊరిలో 12 ఇండ్లవారు కృష్ణాతీర మందలి యాంధ్ర బ్ర్రాంహ్మణులు, ఇండ్లు కట్టుకొని బహుకాలముగా ఈ దేశపు బ్రాంహ్మణులతే సంబంధ బంధుత్వములు చేయకుండా అధ్యయనము చేయుచు పాఠము చెప్పుకొనుచున్నారు. రామటెంకి వదిలిన వనక ఈ యూరివరకు బ్ర్రాంహ్మణ దర్శనమే అయినది కాదు. ఈయూరిలొ వసతి అయిన కొట్టాయి కట్టియున్నారు. నేను బ్ర్రాంహ్మణ యింట్లో నే దిగినారు. సకల పదార్ధాలు దొరుకును. ఇక్కడ క్షౌరము మొదలైన కాశీయాత్ర చరిత్ర

పితృక్రియలు చేసినాను. నేటి దారి నల్ల రేగడయినా ప్రయాసకాదు, అడివి, రాతిగొట్టు, లేదు.

ఈ మబానది దాటిన వనక రంగిడి జాతి బ్రాంహ్మణులని ఒక సమూహమును చూచినాను. వీరికి గాయత్రీ జపము కలిగియున్నా వ్యస్థలేని నడితిని నడిచేవారు. ఈదేశపు కఠాడీ బ్రాంహ్యణులున్ను, చిత్వావనీబ్రాంహ్మణులున్ను వీరిని గర్హింపుచున్నారు. పిమ్మట వ్రాసిన రెండు తెగలవారితో మన దేశపు బ్ర్రాంహ్మణులు సాహచర్యము కలిగి సహపంక్తిగా భోజన మజ్జనాదులు గడుపుచున్నారు. చిత్పావనీవారు పునా శ్రీమంతుని జాతి. కరాడీవారు శక్తిపూజార్హులు. ఈ యిరుతెగలవారినిన్ని పరశురాముడు బ్రాంహ్మణుల యెడల జిహాస తోచి మశీదులలొవుండే శవాలను లేపి చిత్సావనీలను పుట్టించి కాష్టముల గుండా గడుపుకొన్నాడు. తెగకు 7 గోత్రాలవంతున వీరు 14 గోత్రాలవారు వీరిని కొంకణదేశస్థులని అనుచున్నారు.

నర్మదకు ఇవతలుగట్టు మొదలుగా విక్ర శకము ప్లవనామ సంవత్సరము బహుళ పాడ్యమి మొదలుగా పున్నమి వరకు మాసమనిన్ని వ్యహరింపుచున్నారు.

వింధ్య పర్వతమును కురాయి అనే వూరివద్ద ఆరోహణము చేసినట్టుగా లోగడ నేను వ్రాసినాను. అదే వింధపర్వతమునకి ఆరంభ మనిన్ని యీ భూమి యావత్తున్ను వింధ్యపర్వతము మీదిదే ననిన్ని చెప్పుతారు. రాయచౌడువద్దనున్ను పర్వతము మహాదేవ పర్వతమనిన్ని అచ్చట వరప్రసాదము చేయగల ప్రసిద్ధమయిన యొక శివస్థలము ఉన్నదనిన్ని చెప్పుతారు. యీ తిలవారాలో రెండుమూడు దేవాలయాలు చిన్నవయినా సుదరముగా కట్టియున్నవి. బ్రాంహ్మణ పూజ లేదు. గోసాయీల అధీనములో నున్నవి.

కురాయి అనే వూరు మొదలు నర్మదా నది పర్య్హంతము లోగడి కాలాలలో దారి నడిచి సురక్షితముగా చేరడము బహు దుర్లభము అందుకు దృష్టాంతముగా యిక్కడి దేశస్థులు సాహి ఏనుగుల వీరాస్వామయ్య గారి

త్యాలుగా ఈమధ్యవుండే ఊళ్ళపేళ్ళ కని కొన్ని చేసినారు. వాటి తాత్పర్యము ఈ యూళ్ళు గడిచి నర్మద చేరితే తల్లికడుపులోనుంచి మళ్ళీ పుట్టినట్తు అనుకోవలె నని యున్నది. ఆ భయాలు యింగిలీషు దొరతనము వచ్చినవెనకలేదు. ఈవిషయములలో వీరి దొరతనము మేలని అనిపించుకొన్నా, యిక్కడి బ్రాంహ్మణులు నాగపూరు రాజు సాగరారాజు మొదలయినవారు బాగా వుండగా మేము రాజాన్న భోజనము చేస్తూ వస్తిమి; వారున్ను వారికింది అధికారస్థులున్ను పుష్కల మయిన జీవనాలు మాకు కలగచేసి యిచ్చుచు వచ్చిరి; ఇప్పుడు పస్తుగానున్నా మంటారు. దొంగతనముపోతే దొంగను పట్టి శిక్షించే వరకు సొమ్ముపోగొట్టుకొన్నవారున్ను, సాక్షులున్ను ఇల్లు వాకిళ్ళువదిలి భత్యము కట్తుకొని తిరిగి చస్తాము. తుదకును శిక్షబలము లేదు. కొంతకాలము గిడ్డంగిలో దొంగనుపెట్టి వదలురారు. వారు మళ్ళివచ్చి కన్నమువేచి దొంగిలింపుచున్నే ఉంటారు; దొంగిలించిన దానికి సాక్షి తెమ్మంటే యెక్కడనుంచి తెఛ్ఛేది? అని యీ విషయాలలో ఇంగిలీషు దొరతనము బహు హింసగా నున్నదని వ్యసనపడు కొంటారు. యీ దృష్టాంతము చూడగా ఒక మంచి వూహించి పనిచేయ బోతే ఒక చెడు ఆ మంచిలోనే ఉత్పత్తికావడము నిశ్చయమేనని తోచుచున్నది.

హయిదరాబాదు మొదలుకొని తియ్ని దొండకాయలు విస్తారముగా దొరుకుచున్నదవి. యీతిలవారాఘాటు లోపల వరకాయ లని ఒకదినము కాయలు చూచినాను. పచ్చిపోకకాయలవలెనే ఆకారముకలిగి దొండకాయలవలె గీతలు తీరియున్నది. వంటచేసి బోజనముచేస్తే పువ్వులు రాలని లేతవంగ పిందెల రుచితో సరిపోలియున్నవి. ఈకాయలు బహు ఆరోగ్యకరములనిన్ని రుచిగానున్న వనిన్ని రాజాధిరాజులు నలభై, యాభై ఆమడదాకా విందులకు గుర్రపుసవారీలను తాపాలుపెట్టి తెప్పించు కొంటారు గాని తమ స్థలములో వృద్ధి అయ్యే యోచన చేయడము లేదు. యీ కాయలకు బీజము గడ్డలు, వాటిలో మొలక మొలిచి తీగెలు అల్లి కాయలు కాచుచున్నవి. ఆవాల నూనె నాలు గయిదు మజిలీలుగా దీపపుచమురుకు దొరుకుచు వచ్చు చున్నది. చింతకాయ తొక్కుకు నేను ఆవనూనె పోయించినంతలో అతి రుచికరముగా నున్నది. ఈయూరిలో 8 తేది మధ్యాహ్నపర్యంతము వుంటిని.

Kasiyatracharitr020670mbp.pdf

ఏడవ ప్రకరణము

8 తేది మధ్యాహ్నముమీద 3-4 ఘంటకు బయిలుదేరి యిక్కడికి 3 కోసుల దూరములోనుండే జబ్బల్ పూరు అనే షహరు ప్రవేశించినాను. దారి బాగా ఘట్టనచేసి కాలువలకు వరధులు కట్టియున్నవి. దారికి ఇంరుపక్కలా దూరాన చిన్న కొండ లున్నవి. చిన్న యీ గుళ్ళు, బావులు, గుంటలున్ను కొన్ని దారికి ఇరుపక్కలా కట్టి యున్నవి. యీ గుళ్ళూ స్తూపీలు చెరిసగానికి పగలగొట్టిన శిగ గల టెంకాయ చందముగా కట్టియున్నవి.

యీ జబ్బల్ పూరు అనే షహరు లోగ డిదినములలో యధోచిత మయిన కసుభాస్థళము. ఘర్డామండల మనే రాజధాని కింద నుందినది. ఆ రాజధాని నిజాంషాహు అనే కొండరాజుది. షుమారు 20 ఏండ్ల కిందట పూనా శ్రీమంతుడు భోసల వంశస్థులు సాధించిన రాజ్యములు గాక ఇంకా కొండరాజుల కిందనుండే ఘర్డామండలము మొదలయిన రాజ్యములను తియ్యవలెనని సర్వ ప్రయత్నమున్ను అప్పుడప్పుడు చేస్తూ వచ్చినందున బ్ర్రాంహ్మణ జాతిమీద ఒక ద్వేషము ఈకొండరాజుకు జనించి బ్ర్రాంహ్మణులని తన రాజ్యములో కనుపడ్డ వారి నంతా సంహరింపుచు వచ్చినాడు. ఈ నిజాంషాహు రాజును సాధించడము పురాశ్రీమంతునికి ప్రయాసగా నుంచు వచ్చినది.

ఆ కొండరాజుకు రాజధాని యయిన ఘర్డామండల షహరును చుట్టు కొని నర్మదానది ప్రవహింపుచు వున్నది. యీనది మహాత్మ్యమేమంటే గతకాలములో భృగు మహాముని యీ ప్రాంతమున తపస్సు చేయుచు నుండగా నది అతనికి కొంత దూరములో ప్రవహించినది. భృగుమహాముని నా సమీపముగా వచ్చిప్రవహించక వరగడగా పోవలసినదేమని మనసులో నొచ్చుకొన్నంతలో తత్పూర్వపు ప్రవాహమును