కాశీయాత్ర చరిత్ర/ఇరువది రెండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

గనుక దాన్ని సమస్తవిధాలా యిక్కడ పూజితపరచి అన్నము యెట్టిగతిని పొందినా నిషిద్ధముకారని యేర్పరచి ప్రపంచము యావత్తు పైన వ్రాసిన అయిదు పదార్ధాలకు అంతర్భూతము అయినది గనుక నేను యెక్కువ, నీవు తక్కువ అనే బుద్ధి లేకుండా జాతి నియమాదులు కూడా మరిచిపోయి ప్రవర్తించేటట్టు ప్రసాదస్వీకార విషయములో వొకనిర్ణయము గలగచేసి అందుకు కొన్ని పురాణాలున్ను ప్రసిత్థ పరచినట్టు తోచుచున్నది. అటువంటి సారవత్తైన పురాణాలున్ను ప్రసిద్ధ పరచినట్టు తోచుచున్నది. అటువంటి సారవత్తైన పురాణములు ఇక్కడ దొరకకపొయినా వాటి కధాక్రమము యెవరికైనా యిక్కడ జ్ఞాపకము వుండునా అని విచారిస్తే యెటువంటి పండితునికిన్ని నాకు తోచినకధ వినికిడి అయివుండేటట్టు తోచలేదు. అయితే పరబ్రహ్మ నాలుగాకృతులతో యీ స్థలమందు ప్రకాశింపు చున్నా డని వొక మాట స్థూలముగా పండితుల వాక్కున ప్రచురముగా వినపడుచున్నది. వాటి క్రమ మేమని అడిగితే ధోరణిగా చెప్పను వారికి వినికిడి లేకుండావున్నది. యిటువంటి మహాస్థలములో జూన్ నెల 26 తేది వరకు వసించినాను.

Kasiyatracharitr020670mbp.pdf

ఇరువది రెండవ ప్రకరణము

27 తేది భోజనోత్తరము 11 ఘంటలకు బైలుదేరి యిక్కడికి 4 కొసుల దూరములో వుండే సరసింగఘాటు అనే వూరు 3 గంటలకు ప్రవేశించినాను. యీ వూరు చిన్నదైనా ముసాఫరులకు కావలసిన సామానులు అన్ని యిచ్చేపాటి కోమట్లున్నారు. యిక్కడ కోమట్లు రెండుతెగలు. కళింగ కోమట్లని వొకతెగ, గౌరకోమట్లని వొక తెగ. దక్షిణదేశములో వుండే తెగ గౌరకోమట్లు. యిక్కడగౌరకోమట్లు నిండాలేదు. యీవూళ్ళోదక్షిణదేశస్థుడు ముద్ధుకృష్ణ పిళ్ళ అనేవాడు గంజంలో వుద్యోగముచేసి వొక డాబా అనే సత్రము చుట్టు మిద్దెవేశి కట్టి మధ్యేజగనాధస్వామికి వొక మందిరముకట్టి వొక తటాకము వొక వనప్రతిష్ట చేసి భూస్థిరులు సంపాదించి అతిని ఆచార్యపుషుడు జగన్నధ నివాసియై వుండగా అతనికి దానము యిచ్చినాడు. ఆ డాబా యేనూటికి దైగేపాటి విశాలముగా వున్నది. గుళ్ళో వొఢ్ర బ్రాంహ్మణుని గుండాపూజ నడిపింపుచు అప్రతిగృహీత సంతతివారు యిప్పటికి వుంచుకొని వుండేటందున అందులో దిగినాను. యీవూరికి సమీపముగా జగన్నాధ క్షేత్రములో వుండే పండ్యాలు మొదలైన వారికి ముఖ్యమైన యిష్టదేవత అయిన వొక చండీదేవి ప్రతిమ వొక చిన్న కొండమీద ప్రతిసంవత్సరము తామరసపూజలు అంగీకరింపువువున్నది. నేటిరాత్రి సముద్రతీరమందు యిసుకలో నడిచివచ్చినాము. యెండ కాలములో దారి యిక్కడ నడవడము ప్రయాస అనిపించును. చెట్లనీడకూడా లేదు. యీ 4 కోసులదారికి చెరిసగములో వొక మంచి నీల్లబావి నొక బోగంది తొవ్వించినది వున్నది.

28 తేది వుదయాత్పూర్వము 3 గంటలకు లేచి యిక్కడికి 9 కోసులదూరములో వుండే మాణీక్యపట్టణము 7 గంటలకు చేరినాము. నిన్నదిగిన మజిలీపూరివద్ద వొక వుప్పుటేరు వున్నది. పాటుపోటు కాలాలు చూచి దాటవలెను గాని పడవలువుండే పాటి లోతు కలది కారు. నేటిదారి సముద్రతీరము. యిసుకలో చిలక సముద్రము అనే వుప్పుకయిదారిగా నడిచివచ్చినాము. మాణిక్యపట్టణములో పోలయిసుదారోగా వుంటాడు. యీ వూరు మొదలుగా మూలఝూ అనేవూరువరకు వొక తురకవానికి జాగీరు. యిక్కడా సమస్త పదార్ధములు అంగళ్ళలో దొరుకును. యీవూరివద్ద చిలకసముద్రము దాటవలసి వున్నది గనుకనున్ను యాత్రవారికి దిగడానకు స్థలములేక ప్రయాసపడుతూ వుండినారు గనుక గంజాం కలకటరువద్ద శిరస్తాగా వుండే వెంకన్నపంతులు జాతి విభజనగా దిగడానకు వసతిచేసి సుందరమయిన ధర్మశాల కట్టి సదావృత్తి అందరికి యిస్తూ వున్నాడు. యీ ధర్మశాలలో యీ దినము వసించినాను.

29 తేది వేకువనే 3 గంటలకు లేచి అక్కడికి 4 కోసుల దూరములో నున్న మిఠాగువ్వ అనేవూరు 12 గంటలకు చేరినాను. ఇంత ప్రొద్ధుపోను కారణమేమంటే, బయిలు దేరిన వూరిముందర చిలకసముద్రమనే నది దాటవలెను. అది 2 కోసుల వెడల్పు కద్దు. దాన్ని దాటింఛే హక్కు యిచ్చటి జాగీరువారు డయిన తురకకు యివ్వబడి వున్నది. ఆ తురక యీనదిలొ పడవలను పురుగులు తూట్లుపడేటట్లుగా తినివేస్తున్నవని నలుగు యెక్కేపాటి వొంటికొయ్య దోనెలు నాలుగయిదు చెయించివున్నాడు. మనిషికి అణా 1 బండికి ర్పు 4 (0-8-0) గుఱ్ఱానికి ర్పు 1 (0-4-0) యీలాగు కూలితీసుకుని దాటింపుచున్నాడు. ఆ చిన్నదోనెలతో నా పరిజనము నూరుమందిన్ని, మూడుబండ్లున్ను, మూడు సవరీలున్ను దాటను అక్కడనే వుదయమయిన 7 గంటలదాకా పట్టేను. నాకు సర్కారుకుమ్మక్కు వున్నందున అంత త్వరగా దాటినాను. సాధారణమైనవారు రెండు మూడుదినాలు కాచివుండవలెను.

యీ మిఠాగువ్వలో వుప్పుకొఠారులు వున్నది గనుక వాటి అధికారస్థులు ఇండ్లుకట్టుకుని వున్నారు. జాగీరుదరుడు కట్టించిన డాబా సముద్రపు యిసుక పెట్టి పూడిపోయినది. యిప్పుడు త్రొవ్వి బయటికితీసినా దిగను వసతిగావుండలేదు. వొక్కమర్రిచెట్టు తప్ప వెరే చెట్టునీడకూడా లేదు. వొక్కటే అంగడి వున్నందున అక్కడ వొక బావివొడ్డున చెట్టునీడలో వంటభోజనము కాఛెసుకుని 2 గంటలకు బయిలుదేరి రాత్రి ఆరు గంటలకు యిక్కడికి ఆరుకోసులదూరములో వుండే మాలుఝూ అనేవూరు చేరినాము.

యిక్కడ జాగీరుదారుడు కట్టిన డాబా పనికిరాక వున్నది. వూరు పెద్దది అయినప్పటికి యాత్రవాండ్లు దిగడానకు స్థలము లేదు. వూరిముందర వొక పెద్ద వటవృక్షమున్ను అమృతతుల్యమైన జలము గలిగి మంచివూటగల బావి వొకటిన్ని వుండగా వాటివద్ద డేరాలు వేశి దిగినాను. యిక్కడ పోలీసు జమేదారుడు వుండే స్థలము గనుక తాత్రిపారాచౌకీ యివ్వడానకు నలుగురు చౌకీదార్లను పంపించినాడు.

కలకత్తా మొదలుగా ప్రతిగ్రామములోనున్ను దక్షిణదేశములోని తలారులు వలెనే యిక్కడ నాయకు లని కొందరు వుంటారు. యిదిన్నిగాక చౌకీదార్లని సరకారువారు యేర్పరచిన వారు కొందరు ప్రతివూరికి వుంటారు. అందరున్ను పోలీసు నౌకరుల అధీనమయి వుంటారు. ఈ మాలుఝూ అనే వూళ్ళో 10 అంగళ్ళదాకా వున్నవి. సమస్త పదార్ధాలు దొరుకును. నేటిదారి చిలక సముద్రము మూలుఝూ యీరెంటి మధ్యే యీ దినమంతా నడిచినాను. దారి శుద్ధ యిసక, నిలవ నీడలేదు.

30 తేది ఉదయాత్పూర్వము 4 గంటలకు లేచి యిక్కడికి 5 కోసుల దూరములో వుండే ప్రయాగ అనేవూరు 2 గంటలకు చెరినాను. యీవూరు మొదలుగా మదిరాసు గౌర్నమెంటు యిలాకాతో చేరినది. వూరుగొప్పదేను. అన్నిపదార్ధాలు దొరుకును. యిక్కడ వొకతపాలా రైటరు గంజాం కలకటరుకింద వున్నాడు. సుంకంచావడి వొకటి వున్నది. వచ్చేపొయ్యేవారి మూటముల్లెలు సరిహద్దుజాగా అయినందున ఆ సుంకరులు శొధించి చూస్తారు. యీవూరు మొదలుగా చెన్నపట్టణపు రూకలు చెల్లుచున్నవిగాని యీ ప్రయాగలో పట్టరు. యీ హద్ధుమొదలుగా పిచ్చశేరులు. శేరు 1 కి యిరవై రూపాయల యెత్తు.; శేరు యిన్నిరూకలని వెలగాని యిన్నిఅణాలు పయిసాలు అనుకోవడము లేదు. గంజాములో వుండే వొక గౌరకోమటి యిక్కడ విశాలముగా డాబాకట్టి వొక వనప్రతిష్ట, తటాక ప్రతిష్టయున్ను చేసి భూస్థితికూడా వాటి పరిపాలనకు సంపదించినాడు.

యీ ప్రాంతములలో కొండలు గుహలు అడువులు కల ప్రదేశాలను మన్యా లంటారు. ఆ మన్యాల యజమానులను మన్యదొర లని చెప్పడము, వారి తమకు యిష్టములేనివారి యిండ్లను కలిమిగలవారి యిండ్లనున్ను మనుష్యులకు రాత్రిళ్ళు దివిటీలు యిచ్చి పంపించి కొళ్లపెట్టించి మనుష్యులను నరికించి యిండ్లను కాల్పిస్తూ రావడము సహజముగనుక అదేరీతుగా యీవూరి తపాలారైటరు యిల్లు మరివొకరిద్దరి వర్తకుల యిండ్లున్ను 15 రోజులకిందట యీ ప్రాంత్యపు జమీదారుడు దోపించినాడు. యీ దేశపుజమీదారుడు డాబాభూస్థితిని కప్తీ చేసుకొన్నందున డాబా బేమరామత్తు కింద వసతి తప్పివున్నది. సమీపమందుండే టెంకాయతోపులో డేరాలు వేయించి వంట భోజనము చేసుకొని 1 గంటకు బయలుదేరి యిక్కడికి 7 కోసుల దూరములో వుండే గంజాం అనే షహరు 9 గంటలకు చెరినాను.

వుదయాన నడిచినదారి సముద్రతీరమైనప్పటికి యిసక వొక మాత్రముగా వుండినది. భోజనాత్పరము నడిచినదారి యేనుగపొడుగు యిసక దిబ్బలమధ్యే వొకపక్క సమద్రము, కుడిచేతిపక్క అంది పుచ్చుకున్నట్టు మింధ్యపర్వతము వుంచూ వచ్చినది. యిక్కడ వింధ్యపర్వరము సముద్రములో కలిసినట్టు తోచుచున్నది. యిక్కడ యెప్పుడున్ను దొంగలు కొట్టి దోచడము వాడికె యని తెలిసినది. నిలవనీడ, తాగ నీళ్లున్ను దొరకవు. ప్రయాగకు గంజానికి చెరిసగములొ వొకబావి. వొక చిన్న శివాలయమున్నున్నది. ఆగుడిచుట్టూ యీశ్వరాజ్ఞ చేత వొక మర్రిచెట్టు ఆవరించినట్టు అల్లుకుని యేనూటికి చాలేపాటి చల్లని నీడ గలిగివున్నది.

గంజాం షహరు 15 యేండ్లకిందట మల్లాడి యనే జ్వరముచేత హతమైనది గనుక నున్ను మిగిలినవారు బురంపురమునకు వలసవెళ్ళి అద్యాపి అక్కడి నివాసులై యున్నారు గనుక షహరు పాడుపడ్డట్టుగా కనుబడుచున్నది. యిక్కడ వాడలు మరామత్తు చెయ్యడానకు గంగాతీరమందు కలకత్తాలోనుంచి వుడిబడియాకు నావలమీద వచ్చే దారిలో బాందలు అమితముగా చేసి పగిలిన వాడలు వుంచివుండేటట్టు యిక్కడ సముద్రతీరమందు గదులు చేసి వాడలు వుంచివున్నది. అనేక గొప్పయిండ్లు ఖాలిగా వున్నవి గనుక అందులో వొక యింట్లో దిగినాను. యిక్కడ వొక రేవుదొర, వొక కొత్తవాలు న్ను న్నారు. మొసాఫరులకు కావలసిన పదార్ధాలు ఆని దొరుకుచున్నది.

యీ గంజాం పట్టణము ఋషికుల్య అనే నదితీరము. వింధ్యగిరి యిక్కడనే సముద్రగామి యయినందుననున్ను, యీ గంజాము వింధ్యకు దక్షిణదేశ మనిపించుకోబడి యిక్కడివారు యీ ఋషి కుల్యనది మొదలుగా చాంద్రమాన రీత్యా అయ్యే ప్రభవాది సంవత్సరములను సంకల్పములో చెప్పుతారు. ప్రయాగ యనే వూరివరకు బృహస్పతి మానము, గంజాం మొదలుగా చాంద్రమానము. గంజాం మొదలుగా యీశ్వర నిర్ణయ ప్రకారము కళింగదేశము ఆరంభమవుటఛేత యిండ్లు మనుష్యుల అలంకారాలు దృష్టిదోషపు పాటింపులు దక్షిణదేశము వలెనే యావత్తు కలిగివున్నవి. చిన్నయిండ్లకు కూడా వాకిట పంచవన్నెలు పెట్టేకట్టినారు. ప్రతిస్త్రీలు బులాకులు ముక్కర ధరించివున్నారు. సమీపమున వుండే మాలుఝూ అనేవూరిలో యెవరికి రాని తెనుభాష యిక్కడ అందరికి వచ్చివున్నది.

జూలాయినెల 1 తేదీ వుదయాత్పూర్వము మూడుగంటలకు లేచి యిక్కడికి 4 కోసుల దూరములోవుండే నాయడిపేట అనేవూరు యేడుగంటలకు చేరినాను. యీ దినము దారి మదరాసు గౌర్నమెంటువారి హుకుము లోబడ్డభూమిలోది గనకనున్ను యీ గౌర్నమెంటువారి యోచన లగాయతునుంచి హిందువులను చలిపురుగులకు సములనే అగౌరవబుద్ధితొ ఆత్మార్ధమైన పనులలో సర్వకృషిచేసి పరార్ధమైన పనులుమాత్రము యీశ్వరాధీనముచేసి వుండడము సహజము గనుకనున్ను కలకత్తా గౌర్నమెంటువారి వలెనే లోకోపకారమైన దారులను గురించి సడక్కువేశే ప్రయాస వీరు విశేషము పుచ్చుకోకుండా వున్నందున యశోవిలాసముగా అడివి యీజిల్లాలొ బలిసివున్నది గనుక ఆ అడివిలో సూటిగా లయనువేసి నూరడుగుల వెడల్పుకు అడివికొట్టి శాలచెట్లు పెట్టినారు. ఆ చెట్లుమాత్రము అక్కడక్కడ వొకటొకటి జీవించివున్నది. భూమిని చదరంగానైనా చేసినవారుకారు గనుక లయనుకు చుట్టూవుండే చదరపు భూమిని వెతుక్కుని దారినడిచేవారు తాము దారులు కలగజేసుకుని నడుస్తూ వున్నారు.

యా దినమంతా భాట అడివి దారిలో చత్రపురమనే వూళ్ళో కలటరు స్థలవసతినిమిత్తము వసింపుచున్నాడు.*[1]

యీనాయుడిపేట యనే వూరు అడివిమధ్యే వున్నది. ఆవూరి వద్ద అడివికొట్టి బందా చలమయ్య యనే కోమటి వొక డాబా కట్టించి గుంటబావి తొవ్వించినాడు. వొక అంగటివాడు వున్నాడు. అక్కడ పదార్ధాలు మృగ్యముగా దొరికినవి. అక్కడ భోజనము కాచేసుకుని అక్కడికి మూడుకోసులదూరములో వుండే బురంపురమనే బస్తీ నాలుగు గంటలకు బయిలుదేరి యేడు గంటలకు చేరినాను. దారి తెల్లవారి వలెనే వున్నది.

బురంపురము బస్తీవూరు. గంజాంలో మకారత్రయమనే మల్లఛి మార్తా మరాహి అనే జ్వరములవల్లనున్ను కొండపాళెగాండ్ల బందిపోటువల్లనున్ను మరాటీల కొళ్ళగుర్రాలవల్లనున్ను అర్ధములు ప్రాణాలున్ను పోయి బేజారయిన వెనక కలకటరు మొదలయిన ధైర్యము గల యింగిలీషుదొరలు సమేతముగా ఋషికుల్యానది దాటడానకు సందుచిక్కకుండా వలస వచ్చి ఈ బురంపురము ప్రవేశించినారు గనుక అదిమొదలు యీవూరు వొక పటాలముదండు కూడా వుండబట్టి బహు బస్తీ అయివున్నది.

యీవ్చూళ్ళో కొద్దిదినములకు ముందు సర్వతోముఖమనేక్రతువు నడిచి ఆక్రతువు నిమిత్తము నన్ను యెరిగిన గోదావరీతీరపు బ్రాహ్మణమండలి నూటిదాకా యిక్కడ వచ్చివున్నది. ఆ బ్రాహ్మణులందరున్ను శ్రౌతవిషయము బాగా తెలిసినవారు గనుక అధర్వణ వేదము మూలమా లేక కడమ మూడు వీడాలసంగ్రహమా అని నాకు బహుశ: వున్న సందేహము వారివల్ల తీరు నని వారిని విచారించినంతలో సంగ్రహమేనని తీరినది. అందుకు ఆకరము సర్వతోముఖ యాగములో కడమ మూడు వేదాలవలెనే అధర్వణానకు ప్రత్యేల్కాధ్యరము లేదు. పయిగా లోకప్రకటనకు భారద్వాజులు మూడువేదాలే తెచ్చి యీ మూడింటిలోనుంచి అస్త్రప్రయోగ నిమిత్తము మంత్రమగ్రహము చేసిక్షత్రియులకు అధర్వణమని పేరుపెట్టి వొక వేదము చేసియిచ్చినారు. పంచగౌడులలో గాని పంచద్రావిళ్ళలో గాని మేము అధర్వణుల మని చెప్పేవారు యెవరున్ను లేరు.

కలకత్తాలో నుంచి జగన్నాధమువరకు బోయీలకు జనము వొకటింటికి యేడురూపాయలు లెక్కను, బండి వొకటింటికి యిరువై యెనిమిది రూపాయలు లెక్కను తెచ్చి జగన్నాధమునుంచి మళ్ళీ బురంపురమువరకు వేరేబోయీలను, కావడివాండ్లను జనము వొకటింటికి ర్పు2 (2-4-0) వంతున బండి 1 కి 7 ర్పు లెక్కనిష్కర్షచేసి తెచ్చి నాను గనుక వారికి యివ్వవలసినది తీర్చియిచ్చి వేరేబోయాలను, వస్తూ వుంచున్నవి. యిక్కడి నేతగాండ్లను దేవాందులంటారు. యీ దినపుదారిలో వున్న అడివి బలిశివున్నది. బహుశా భూమి నల్లరేగడ. దారిలో మంత్రిరెడ్డి అనే వూరు వున్నది.

4 తేది వుదయ మయిన 5 ఘంటలకు లేచి యిక్కడికి 5 కోసుల దూరములో వుండే కంతర్ల అనే వూరు 10 గంటలకు చేరినాను. యిక్కడా అయిపోలు (అయిపోలు?) వారు అనే యీ దేశపు వర్తకులు వొక సత్రముకట్టి తటాకప్రతిష్ట, వనప్రతిష్టలు చేసి వొక గోసాయి అధీనము చేసినందున ఆ ధర్మశాలను గోసాయీలు వారి నివాస మఠముగా చేసుకుని అందులో వొక మూర్తిని పెట్టి అరాధన చేయుచూ సత్రానికి వుండే భూస్థితిని తమ అనుభవములోకి తెచ్చుకొని సదావృత్తిని నిలిపివేసి ఆధర్మశాలలో భాటసారులను ప్రవేశించనియ్యకుండా నిర్బంధము పెట్టుతూ వచ్చినారు గనుక యీ జిల్లా శిరస్తా వెంకన్నపంతులు యిక్కడనున్నూ, వేరే ధర్మశాల విశాలముగా కట్టింపుచున్నాడు. యిక్కడవుండే కోమట్లు యిటీవల బందిపోటువల్ల వొచ్చిపోయి విడవలి యిండ్లు బందిపోటువారి దీపారాధనకు అనుకూలముగా మళ్ళీ కట్టుకుని, వచ్చినవారికి కావలసిన సామాను యిస్తూవున్నారు. యీవూళ్ళో గుంటవొడ్డున వంట, భోజనాలు కాచేసుకొని 3 ఘంటలకు బయిలువెళ్ళీ యిక్కడికి మూడుకోసుల దూరములో వుండే కొత్తపల్లియనే వూరు 4 గంటలకు చేరినాము.

యీ వూరివద్ద మహేంద్రతనయా అనే నది వొకటి వున్నది. యీవూరు బ్రాహ్మణ అగ్రహారము. యిది మొదలుగా వింధ్య దక్షిణదేశమయినందున అవశాత్తుగా గంగా యమునా మధ్యప్రదేశమునుంచి వచ్చిన బ్రాహ్మలను యిక్కడిరాజులు ఆదరించి బ్రాహ్మలు దేవమందిరాలు గల వూరే శ్రేష్టమని అక్కడక్కడ బ్రాహ్మలను ప్రవేశపెట్టుతూవచ్చినందుననున్ను 'యధారాజా తధాప్రజా:'అనే వాక్యప్రకారము ఒక పాటిభూస్వాతంత్ర్యము కలవారుకూడా తమతమవూళ్ళల్లో బ్రాహ్మలకు వసతులు చేసియిచ్చి యిండ్లుకట్టి యిస్తూవచ్చినారు గనుకనున్ను యిదిమొదలుగా కన్యాకుమారి పర్య్హంతము బ్రాహ్మణాగ్రహారాలు చూస్తూ రావచ్చునని తోచినది. కొండమార్గములో గోదావరి దాటినది మొదలు యీవరకు అగ్రహారమనే మాట వినలేదు. పంచద్రావిడబ్రాహ్మలు వొక సమూహముగా వున్నవూరు వొకటిన్ని లేదు. వోఢ్రదేశములోని మనుష్యులు మూర్ఖులున్నూ హఠవాదులున్ను కృత్రిమముచేత హఠము సాధింఛేవారుగానున్ను నాకుతోచబడ్డది. యీబరంపురపు షహరుతో వోఢ్రదేశస్థుల ప్రచారము నిలిచిపోయినది. యిక్కడ అందరు తెనుగువాండ్లేగాని వోఢ్రదేశస్థులు అతిస్వల్పముగా నున్నారు. యీ బ్రాహ్మలయిండ్లు చిన్నవైనా అందులోనే దిగినాము.

5 తేది వుదయాత్పూర్వము 3 గంటలకు లేచి యిక్కడికి 5 కోసుల దూరములోనుండే పలాశీ యనే వూరు 7 గంటలకుచేరినాను. యూవూరు గొప్పదేను. వొకమఠము కొన్ని బ్రాహ్మణయిండ్లునున్నవి. మఠములో దిగినాను. యీవూళ్ళూన్ని జమీందారులవి. యీ గంజాం జిల్లాలో సరకారుకు 12 లక్షలరూపాయిలు వసూలవుచున్నవి. అందులో జామీందారులవశముగా వుండేభూమి ఆరులక్షలరూపాయలది గాక మలకు రాజీలని కొన్ని ముఠాలు లోకులు చేసి లాలుకు కిస్తీలప్రకారము సరకారు రూకలు కట్టుతూ వుంటారు.

ఈదేశాస్థులకు బహుమందికి అర్ధలోభము చాలాకలిగి సుషుప్తి కాలాలలో యిండ్లమీద పడి మనుష్యుల అర్ధప్రాణాలు హరింఛే బుద్ధులు పుట్టడముచేత మల్లడియనే వింతజ్వరము యీశ్వరుడు వీరి శిక్షనిమిత్తము ఈ దేశాములో పుట్టించి లక్షావధి ప్రజలను యీలోకము వదలపెట్టినట్టు తోచుదున్నది. అయితే అందులో సాధువులుకూడా కొందరు లయించి యుందురే అని శంక తోచితే అందుకు సమాధానము(ఏక: పాపాని కురుతే ఫలం భుంజ్తే మహాజన:) అనే వచనము. యీ వచనానకు దృష్టాంత మేమంటే వొకగురువు, వొక శిష్యుడున్ను సముద్రతీరమందు సంచరింపు చుండగా వొకగొప్పవాడ ముణిగి పోయినది. శిష్యుడుచూచి అనేకవేల జనము వాడతోకూడా ముణిగి పోయినదిగదా యిందుకు కారణమేమన గురువును అడిగినాడు. గురువు ఆవాడలో ఒక పాపిష్ఠుడు వుండబట్టి వారిగతి అట్లా అయినదని చెప్పినాడు. శిష్యుడు యింత అన్యాయము యీశ్వరుడు చేయవచ్చునా? వొకపాపి నిమిత్తము వెయ్యింటిని చంప నిచ్చయించడము యుక్తమా అని ప్రశ్నచేసినాడు గనుక గురువు అందుకు మౌనధరుడై యుండేను. కొంతమేర యీశిష్యగురువులు వెళ్ళేలోపలనే సుర్ణ రేఖలు గల వొక సుందరమయిన దక్షిణివర్త శంఖము శిష్యునికి ఆ సముద్రతీర మందు దొరికి నంతలో యెత్తిపూజ్యముగా వక్షస్థలమందు ధరించినాడు. ఆ శంఖములోపల అనేక లక్షల చీమలు శంఖములోని మాంసము భక్షించేకొరకు పుట్టపెట్టి వుండినది. ఆ సమూహములోని ఒక చీమ బయిలువెళ్ళి శిష్యుణ్ణి కరవగానే శిష్యుడు ఆ శంఖముతీసి అందులో చీమల గుంపు చూచి దాన్ని విశిరిపుచ్చి సముద్రములో పడవేసినాడు. యీనడితి గురువుచూచి యేమబ్బా వొకసాఫీనిమిత్తము వెయ్యింటిని యీశ్వరుడు వాడతోకూడ సముద్రములో ముంచినందుకు యీశ్వరుణ్ని దూషించితివే, వొక చీమ నిన్ను కరిచినందుకు అనేకలక్షల చీమలు చచ్చేటట్టు యేల మంచిశంఖమును న్యాయ క్రమ మెరిగిన నీవు సముద్రములో పడవేస్తివని అడిగినాడు.

యీదినము నడిచినదారి దట్టమైన అడివిమధ్యేవున్నది. వెదుళ్లు విస్తారముగా యీఅడివిలోవున్నవి. బురంపూరు మొదలుగా పర్వతసమూహాలు దారికి కుడిపక్క సమీపమందే వున్నవి. జగన్నాధము మొదలుగా భూమి సముద్రతీరమై యిసకైనందున ముంతమామిడి చెట్లు ముంతమామిడిపప్పున్ను ఈ ప్రాంతాల వెశేషముగా కలవు. చెన్నపట్ట్సణము వదిలినవెనక ఈ చెట్లున్ను తమిదె పయిరున్ను చూచిన వాడనుకాను. గంజాం మొదలుగా బురంపురమువరకు భాట పశ్చిమాభిముఖముగా వచ్చి యిచ్చాపురము మొదలు కొండలకిందుగా దక్షిణాభిముఖ మవుచున్నది.

యీదేశములో కర్ణాలు తక్కువజాతివారు. బ్రాహ్మణవేషధారులు వారిని శిష్టుకరణాలంటారు. వేశ్యాస్త్రీలను సాండీ లంటారు. బ్రాహ్మణాగ్రహారప్రవత్రకులను భుక్తు లంటారు. శూద్రగ్రామ ప్రవర్తకులను నీయిం డ్లంటారు. తలారులను చారకు లంటారు. పల్సాళిలో అంగళ్ళు వున్నందున సమస్తపదార్ధాలు దొరికినవి. యిక్కడ వంట, భోజనము కాచేసుకొని యిక్కదికి 7 కోసుల దూరములో నుండే రఘునాధపుర మనే గొప్పవూరు రాత్రి 9 గంటలకు చేరినాను.

దారి వుదయాన నడిచినంత వసతికాదు. అంత దట్టమయిన అడివి ఇరుపక్కల లేదు. కొండలుమాత్రము దారికి సమీపముగా వున్నవి. దారిలో కొత్తాగ్రహార మని వొకవూరు వుండగా దానివద్ద కొంతసేపు ఆసోదా చెసుకొని అక్కడి బ్రాహ్మలను పూజించి సాగివచ్చినాము.

రఘునాధ పురములో యిక్కడి జమీదారుడు వొక గొప్ప గుడి రెండు అంతస్తులుగా కట్టి రాధాకృష్ణులను ప్రతిష్టచేసి పూజ నైవేద్యాలకు వసతులు యేర్పరచి బైరాగుల అధీనము చేసియున్నాడు. బ్రాహ్మల యిండ్లున్నా రాత్రి అయినందున స్థలము విచారించుకోలేక ఆగుడివద్ద దేరాలు వేసుకొని దిగి రాత్రిభోజనాలు మొదలయినవి గడిపినాను. గుడి మహాసుందరముగానేవున్నది. యీవూరిలో సమస్తమయిన పదార్ధాలుకలవు. మా డేరాలవద్ద అంగళ్ళు తెచ్చి వేయించి కావలసిన సామానులు తీసుకొన్నాము.

6 తేది ఉదయాత్పూర్వము నాలుగు గంటలకు లేచి యిక్కడికి అయిదుకోసుల దూరములో నుండే హరిశ్చంద్రపురము పదిగంటలకు చేరినాము. దారిలో కుంఫిణీవారి వేశిన లయను చుట్టు గనుకనున్ను, ఆ లయను మిట్టాపల్లాలుగా వున్నది గనుక, చిన్నగ్రామముల మీద పొయ్యే పూర్వము కలిగివుండే దారే యిప్పటికి నడుస్తూ ప్రసిద్ధి కలిగి వున్నది. అయితే లయనుదారి అనే మాటమాత్రము వొకటి యిక్కడా వినికిడిలోకి వచ్చియున్నది.

ఈవూరు 40 యిండ్ల బ్రాహ్మణాగ్రహారము. గంజం మొదలుగా బ్రాహ్మలలో వెలనాడు, కాసరనాడు, నియ్యోగు లనే వ్యస్థలు కద్దు. యీ అగ్రహారాల కన్నిఛికి జమీనుదారులు భూవసతులు చేసి వున్నాదు. హరిశ్చంద్రపురములోను అంగళ్ళున్నవి. సమస్త పదార్ధాలు దొరికినవి. బ్రాహ్మణయింట్లో దిగి వంట భోజనములు కాచేసుకొని నాలుగుగంటలకు బయిలువెళ్ళి యిక్కడికి 3 కోసులదూరములోనుండే నరసన్నపేటవద్దవుంఛే రావులవలస అనే వూరు ఆరుగంటలకు చేరినాము. దారి పొడిచెట్లు అడివి. కాలిబాట రేగడభూమి. యీవూళ్ళో కొరివి రామన్నపంతులు అనే జమీందారుడు నివాసము చేయుచూ వచ్చినాడు. వారియింట్లో దిగినాము. అంగళ్ళు వూళ్ళో లేకపోయినా నాపరివారానకు కావలసిన బియ్యము పప్పు యావత్తు ఆ జమీందారుగారు యిచ్చినారు గనుక రాత్రి సుఖోపాయముగా గడిచినది.

మధ్యాహ్నము దిగినవూరు మొదలుగా నరసన్నపేటవరకు రాత్రిళ్ళు నిద్రలేదని గ్రామస్థులు చెప్పుతూవచ్చినారు. దానికి కారణమేమంటే యిక్కడి జమీందారుడు కొన్ని బందిపోట్లకు ఆధారభూతుడైనందున సరుకోటు (Circuit) విచారణకు పెట్టినారట. ఆ కోర్టువారు పూర్తిఅయిన రుజుకాలేదని అతణ్ని వదిలినారట. యిప్పట్లో నామీద సాక్షి చెప్పినవారి వూళ్ళన్ని కొళ్లపెట్టి తగలపెట్టుతానని పౌరుషము పులికి వున్నాడట. అందునిమిత్తము నిద్రలేక బాధపడుతున్నామని చెప్పినారు. జగన్నాధములోను వొకసంగతి వినడములో యిదేప్రకారము హయిదరాబాదునుంచి ధర్మరూకలు తెచ్చే గుమస్తాలను యీదారిలో చంపినందుకు చచ్చినవాడివద్ద వున్న సామానులు కొన్ని దొంగలవద్ద దొరికిన్ని వారిని సరుకోటువారు వదిలినట్టు పండావాండ్లు చెప్పినారు. విజయనగరపు రాజు కాశిలో యిదే ప్రకారము దొంగలను సొమ్ముతోకూడా పట్టిన్ని సరుకోటువారు వదులుతారు గనుక నేను నిభాయించ లేక రాజ్యము కలకటరు అధీనము చేసి కాశీనివాసము చేస్తానని చెప్పినాడు.

యింగిలీషువారి న్యాయమేమంటే, పదిమంది దొంగలు శిక్షలేక తప్పిపోవడము మంచిది గాని, సందేహముమీద వొకగృహస్థుడు దండనకు లోబడడము యుక్తము కాదని లలితముగా న్యాయవిచారణ చేస్తారు. యీదేశములో చూస్తే వొకదుష్టుణ్ని రక్షిస్తే వెయిమంది శిష్టులను శిక్షించినట్టు అనేమాట ప్రత్యక్షముగా వున్నది. యెట్లానడిస్తే చెడ్డదో యీ ధర్మసూక్ష్మము తెలియడానకు యీశ్వరుడు సమర్ధుడుగాని యీశ్వరజ్యోతి దీప్తిగా ప్రకాశించే ప్రకృతి జనులు శక్తులు కారు. రావడముచేత కొన్నికొన్ని తావులలో పశ్చిమాభిముఖముగా వెళ్ళిమళ్ళీ దక్షిణాభిముఖముగా వచ్చుచున్నది.

యీ శ్రీకాకుళము బలరామక్షేత్రమని ప్రసిద్ధి. యీస్థలమహత్యము స్కాందపురాణాంతర్భూతమయిన కూర్మపురాణములో 30 అధ్యాలలో విస్తరించియున్నదట. యీవూరి వోరగా, లాంగూలనది అనే పేరుకల నది వొకటియున్నది. యీవూళ్ళో వీధులు నడమ ప్రవాహకాలాలలో నదిసంబధమైన వుదకము ప్రవహిస్తూ వుంచున్నది గనుక యిండ్లు పురుషప్రమాణము మిట్టవేశి ఆ మిట్టలమీద కట్టుకున్నారు. నదీతీరమందు కోటీశ్వరుడనే శివస్థల మొకటి పురాణసిద్ధమయినదిగా వున్నది. యీవూళ్ళో బ్రాహ్మణ గుజరాతి వాండ్లు 40 యిండ్లవారు రత్న వ్యాపారసాహుకారు పనులు చేయుచున్నారు. సమస్తమయిన పనివాండ్లు వున్నారు. యీవూళ్ళో 8 తేది పర్యంతము వెనక దిగబడిపోయిన బండ్లను కలుసుకొని వెరే బండ్లు యిక్కడ టీకా చేసేకొరకు నిలిచినాను. బండి 1 కి బురంపూరు నుంచి యిక్కడికి కూలి రూపాయిలు 74, యిక్కడినుంచి విజయనగనానకు బండి 1 కి రూపాయిలు 4 చొప్పున నిష్కర్ష చేసినాను.

9 తేది వుదయమయిన 5 గంటలకు లేచి యిక్కడికి అయిదు కోసుల దూరములో నుండే వెజ్జపురం 9 గంటలకు చేరినాను. యీ వూళ్ళో నాలుగు బ్రాహ్మణయిండ్లు వున్నవి. అంగళ్ళు కలవు. సమస్త పదార్ధాలు దొరుకును. ఆరునెలలుగా వర్షము లేక నిన్నరాత్రి మంచివర్షము కురిసినది. దారిలో యెక్కడచూచినా మడకలుకట్టిదున్నుతూ వున్నారు. శ్రీకాకుళము నుంచి విజయనగరానకు రెండుమూడు మార్గాలు వున్నవి. అందులో యీ మార్గము సమీపమనిన్ని, వసతి అనిన్ని తెలిసినది. యీవరకు నడిచిన దారి యిసక కలసిన రేగడ. నిండా మిట్టాపల్లాలు లేవు.

విజయనగరపురాజులు సంగీతసాహిత్య ప్రియు లయినందున కొందరు భోగస్త్రీలకు సంగీతరత్నాకరం భరతశాస్త్ర ప్రకారము శిక్ష చేప్పించి తయారు చేయించినారు. వారు కొందరు శ్రీకాకుళము వచ్చి వుండగా చింతా జగన్నాధ పంతులు నిన్నరాత్రి వారి విద్యాప్రకట యిక్కడ విజయనగరపు రాజు గురువు వశిస్తాడు. యీ రాజుయొక్క పూర్వీకులు వైష్ణవ మతస్థులయి దక్షిణదేశ సంచారము లోగడ చేసినందున శానామంది వైష్ణవులను ఈ దేశానకు పిలుపించి ఈ రామతీర్ధాలలో ప్రవేశపెట్టి వారికి పుష్కలమైన భూజీవనాలు యిచ్చినారు గనుక వారు సంతోషముగా యీ రాజ్య్హములో వశింపుచున్నారు. ఈ విజయనగరము యిప్పటి రాజుల పూర్వీకుల కింద 240 సంవత్సరములు గా వున్నట్టు తెలిసినది. ఈదేశము దేవబ్రాహ్మణ సమాగమద్వారా 100 సంవత్సరములుగా నిండార్లుగా కర్మభూమి అయినట్టు తోచినది. యీ బస్తీలో రాజు వశించే చిన్న కోట వొకటి వున్నది. కోటవలిగా యెయ్యిండ్లు కలవు. సమస్తమయిన పనివాండ్లు వున్నారు. బంగారుమీద పోగరపని చేసేవాండ్లు ఘట్టివాండ్లుగా శానామంది వున్నారు. సుందరమైన పాత్రసామానులు చేయగల కంచర వాండ్లున్ను, మంచి బట్ట నేసే నేతగాండ్లున్ను వున్నారు.

యిక్కడి రాజు రాజ్యము విశాఖపట్టణపు కలకటరు అధీనముచేసి కాశీ వాసము సహాకుటుంబముగా చేసుట ఛేత యీ రాజ్యనివాసులు తల్లిని కానని బిడ్డలవలెనే తల్లడింపుచున్నారు. యీ మొర ఆలకించగా హిందువులకు వర్ణాశ్రమధర్మముల ప్రకారము సమస్త తారతమ్యములు తెలిశిచేసే దొరతనమే మిక్కిలీ అనుకూలముగ తోచబడుచున్నది. యిక్కడి రాజు అయిన నారాయణబాబు ధనసంగ్రహ మయిన జాగ్రత విశేషముగా పెట్టక అప్పులపాలైనా ప్రజలవల్ల స్తుతి చేయబడుచున్నాడు.

యీ వూళ్ళొ బోయీలు బండ్లు మార్చుకునే నిమిత్తము సోమవారమంతా గొపాలస్వామి మఠములో నిలిచినాను. యీవూరి యిండ్లు యథోచితముగా బాగానే కట్టియున్నవి. రాజవీధులు మాత్రము విశాలముగానే కట్టియున్నవి. యీ సోమవారము జగన్నాధములో రధోత్సవము గనుక యెవూళ్ళోనున్ను ఒక జగన్నాధస్వామి గుడి వుండగా అక్కడ రథోత్సవము బహువిభవముగా జరిగినది. యీ రాజ్యము 9 లక్షల రూపాయల దని పేరు. 2 లక్షల యెత్తుతున్నది. సాలుకు 4 లక్షలు కుంఫిణీవారికి కట్టవలశినది. దేవాదాయము బ్రహ్మా దాయము యీరాజ్య్హములో 2 లక్షల దాకా వుండేటట్టు విన్నాను. యిక్కడానున్ను బందిపోటు వుపద్రవము చెన్నపట్టాణములో వారంటు తియ్యడాలు జడిజీకోటుకు యీడ్చడాలవలెనే వొకరి మీద వొకరికి కోపమువస్తే నిమిషములో జరిగింపుచున్నారు. ఆదివారము రాత్రి నేను దిగిన వూళ్ళో వొక బిందువు పడకపోయినా విజయనగరములో అమితమయిన వర్షము కురిసినది.

Kasiyatracharitr020670mbp.pdf

ఇరువది మూడవ ప్రకరణము

12 తేది వుదయాత్పూర్వము 3 గంటలకు లేచి యిక్కడికి 6 కోసుల దూరములో వుండే ఆలమంద యనే వూరు 2 గంటలకు చేరినాము. యీ విజయనగరము దేశపు బోయీలు బాగా నడుస్తారు. చెన్నపట్టణములో పల్లకీసవారీలయొక్క షోకు బహుశా అందరికి కలిగి వున్నందున గంజాము మొదలుగా వుండే బోయీలందరు చెన్నపట్టణము వచ్చుచున్నారు. చెన్నపట్టణములోనుంచి నాతోకూడా యాత్రవచ్చిన యాత్రబోయీలలో కొందరు యిండ్లు బురంపురము వద్ద వున్నందున వారు శలవుతీసుకొని వెళ్ళినారు.

నేను కన్యాకుమారి మొదలుగా కాశ్మీరమువరకు సంచరించిన ప్రదేశములలో వుప్పాడ బోయీలకు సమానమైన మోతగాండ్లు, చూపరులు, బలాఢ్యులు, అలంకారప్రియులు, ప్రయాసకు వోర్చగల వారు, బంట్రౌతుమానాగా ఆయుధధారణప్రియులు యెక్కడా వున్నట్టు తోచలేదు. అయితే దేశముకాని కొన్నిదేశాలకు వస్తే యీ వుప్పాడ బోయీలకు దేహదార్ఢ్యము తప్పి రోగిష్టులొవుతారు. వారిని జాగ్రత్తగా కాపాడుచూ వారి దేహములు వొచ్చిన కాలమందు ఆయా దేశస్థులయిన బోయీలతో పనిగడిపి వీరిని తీసుకొనివస్తే యీ వుప్పాడ బోయీలతో భూగోళ సంచారము యావత్తూ చేయవచ్చునని తోచుచుచున్నది. పాలకీలు మోశే వృత్తికి యీ వుప్పాడదేశస్థులనే ఈశ్వరుడు తగినవారినిగానే నియమించినట్టు తోచబడుచున్నది. అయితే వీరు మాంస, మద్య, మత్స్యప్రియులు మిక్కిలి అయినంచున వీరు తాగి

  1. * అరణ్యమార్గంగా చత్రపురానికి ప్రయాణము కలకటరుకచేరీలో ట్రాంసులేటరుగా వుండే కపిల రామదాసు పంతులుగారికి నేను ఒక వుత్తరంద్వారవ్రాసి వున్నంతలో ఆయన 40 కావళ్ళ 2 డలాయతులు ఒక గుమాస్తాను పంపి అరణ్యమార్గం సుళువు చేయించినాడు.(చూ. వ్రాతప్రతి పుట 419)