కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/337వ మజిలీ

వికీసోర్స్ నుండి


గీ. సుదతి నెఱిఁదినకతన సమ్మదరసంబు
   నామెఁ గాంచక కడువిషాదాతిశయము
   రెండును విరుద్ధగతిఁ బ్రసరించి వాని
   నిద్రను హరింపగా శయనించె నతఁడు.

337 వ మజిలి


ఇంతలోఁ దెల్లవాఱెను. అతివికట కుక్కుటకుటుంబ కటురవంబున మేల్కొన్న విలాసవనవిహంగమశ్వ్రేణుల కలకలం బతిశయింప, దేవాలయమందిరంబుల మ్రోగింపఁబడు నవసరవాదిత్ర సమూహధ్వనులు జెలంగ, విబుర్ధసింధురనియంత్ర మునకై హస్థిళారాంతరాళంబులకుఁ గొనిపోఁబడిన శృంఖలాక్వణత్వారరవంబు మిగులఁ, గలళంబులం బితుగఁబడుచున్న క్షీరధారల మూత్కారడంబరం బడరఁగుల కాంతలు దధిమధనం బొనర్పఁ బెరుకుకుండల మధ్యంబునఁ బెట్టి వడివడిగాఁ ద్రిప్పు కవ్వముల ధరత్కారంబు నివ్వటిల్ల, నదీస్నానోపకరణంబులఁ గానక కలవరంపడు శ్రోత్రియద్విజుల కోలాహలంబు బెంపెక్కఁ, బాంధుల ప్రయాణసన్నాహనిస్వనంబతి శయింప, రాత్రియెల్ల మేల్కొనియుండుటచేఁ దూలుచు నిజగృహంబుల కేఁగు యామిక జనులసందడి మీఱ, రతిరస నిద్రాల సవిలోచనలై బిరబిర పూఁదోటలకు బరువెత్తు మాలాకారతరుణుల పదఘట్టనలు మితిమాఱ, నిద్రం జొక్కియునప్రగల్భతర భుజంగ సంఘమును మేల్కొల్పు వేశ్యాంగనల హుంకారధ్వనులు బెచ్చు పెఱుగ, నన్యకాంతా సక్తుఁడై ప్రియుం డరుగ వలవంతంబడి యతం డరుదెంచినతోడనే కలకలఁదేరి ఎదురు వచ్చు మానివతుల సాధువచనంబులు జెలరేగ, గృహజనుల మొదట మేల్కొల్పు పంజరస్థశారికానికరములపలుకుల రొదల ప్రబలమగుచుండ, మిధునవృత్తి నుదీర్ణములై నిద్రాంతోన్మిషితసంస్కారములైన క్రీడాశుకములకలకలంబతిశయింప, బుణ్యపధాను వృత్తులై హరికీర్తనలఁ బాడువృద్దులపాటలసవ్వడి బెంపెక్క ఱుఁగ, ధర్మక్రమాను లగ్నులై దేవస్తుతులఁబఠించు మునిమాణవకో త్తముల సందడి యలరారఁ, గ్రమక్రమ ముగా నిద్రనుండి లేచి ప్రాతఃకృత్యంబులఁ బ్రవర్తించు సకలజనపదాలాపనిస్వనంబు మితిమీఱ, దిగ్ముఖములం దతిపృధుప్రభాటల సముదయోదయంబై శుభమయారంభ సంరంభమై ప్రభాతం బతిమనోహరంబయ్యెను.

అప్పుడు దినరాజలప్రవేశంబునకు జేయఁబడిన సముచిత శుభసత్కారముల లీలఁ బ్రతిగృహంబుముంగిటను గలయంపులుజల్లి మనోహర రంగావళులు దీర్పబడి యుండెను. సాయంకాలమున వికసించి తెల్ల వారుసరికి తొడిమలపట్టువదలి నేలరాలి యున్న మాలతీకుసుమ నికురుంబమువలన నతిమనోహరంబుగఁ బుడమియెల్ల నలంక రింపఁబడి యుండెను. మేల్కొన్న యన్ను మిన్నల వదన సరోజామోదమునకు

----- మధుకరశ్రేణు లడుగడునకుఁ గట్టఁబడిన తోరణములవలె నలరారుచుండెను. వికసితనదకుసుమలాటికలఁ జెలంగు మాలినీలతా సీమంతసిందూరధోరణి విపంచిత

మహోత్సవాచారము లీల భాసిల్లెను. క్రీడాసరో‌వరంబులఁ బుండరీకమును జెలఁగి యుండెను. సహజశీతలంబగు ప్రభాతమందమలయానిలయంబు హృదయంగమమై యొప్పియుండెను. కాలక్రమంబున గతించిన నిశీధివీకపాలములీలఁ దెల్లనగు హిమాంశు బింబమస్తశైలకూలంబునఁ గూలిపోయెను. అంత--


ఆ. వె. ఉడుగణంబు విడువకుండె నిప్పటికైన
        భృగుగురుప్రధానవిబుధుల నని
        తీవ్రకోపమూను దినకటాక్షచ్ఛాయఁ
        బుట్టై నరుణ రేఖ పెడుపుగొండ.

పిమ్మటఁ బ్రభాత లక్ష్మీసింధూరతిలకంబులీల నంబరంబున నర్కబింబము బొడసూపెను.


గీ.‌ సర్వజగదుగ్రరోగముల్‌ సంహరించు
    సూర్యభగవానుఁ డుదయింప జుక్కలనెడి
    కుష్టరోగంపుమచ్చ లకుంఠగతిని
    నంతమొందెను నంబర మందునెల్ల

అంత దిక్కు నెల్లనహస్కరుకిరణసహస్రంబులఁ బ్రకాశించుచుండెను. జలాశయంబులఁదమ్ములు వికసించుచుండెను. నికేతనంబులఁ దల్చంబులనుండిలేచిన మానినుల కటాక్షములు విలసిల్లుచుండెను. అట్టి ప్రభాతసమయంబున వందిమాగధుల స్తోత్రపాఠంబులను, మంగళతూర్యనాదంబులను బుండరీక రాజేంద్రుండు నిద్ర మేల్కొని శయ్యనుండి లేచివచ్చి ప్రాతఃకృత్యముల నిర్వర్తించుకొని ప్రియమిత్రుం డగు కుమారకేసరిం బిలిపించి వానితో రాత్రిజరిగిన వృత్తాంతమెల్లఁజెప్పి యుచితరీతిని దరుణేందు శేఖరు నతిభక్తినిత్యానుక్రమణికంబుగ నర్చించెను. మదనమోహితుండగు నతండు రాత్రిజరిగినదియెల్లఁ గలలోనివార్తవలెఁ దలంచుచు నిజమెఱుంగ వెండియుఁ దారావళిని దర్శించి యామెకుఁ జిత్రపటమును‌ జూపించి యుదయసుందరీకథావర్ణన రసైక సౌఖ్యం బనుభవించుచు ననంగమార్గణోదగ్రవేదనాదుఃఖమును బోఁగొట్టుకొన నెంచి యీశ్వరాయతనవృత్తాంతము నెఱింగించిన కుమారకేసరితో భద్రదంతావళము నెక్కి విశ్వభూతిమఠమున కరిగెను. మఠద్వారప్రదేశమునందే పరిజనులనెల్లనుండ నియమించి తాను గుమారకేసరితో విశ్వభూతి శిష్యవర్గము దారిఁజూపుచుండ లోనికరిగి యందుచితస్థానంబున నాసీనుఁడై యుండెను. వానిరాక నెఱింగి విశ్వభూతి తారావళితో నటకేతెంచి నాఱేఁ డాతపస్వినికిఁ బ్రణమిల్లి యాశీర్వాదములఁ బడసి యామె యొసం గిన కుసుమదామమున వినయంబున గ్రహించెను. పిమ్మట విశ్వభూపతి వచ్చా ! షి ఒఆంపోజ ము న్‌ంచుక యవిష్టమున్నది. దానం వాస నాంతలను అంతవరకు దారావ? మీసన్సి తనుండ్‌ యఖీష్షకథా ప్రసంగమునఁ బ్రొద్దుపుచ్చఁగలదని వచించి లోనికఱిగెను. పిమ్మట రాజేంద్రుండు తారావళితో సగౌరవంబుగ రాత్రి సుఖముగా నిద్రించితివాయని ప్రశ్నించుచు గను సన్న నామెకుఁ గుమార కేసరిం జూపి భగవతీ ! ఈతఁ డెవ్వఁడో జ్ఞాపకమున్నదా? యని యడుగుటయును నామె వానింజూచి మందహాసభాసురముఖారవిందయై దేవా ! ఎఱుంగుదును. సముద్రాంతరమందలి శంకరాలయమున మా యుదయసుందరికిప్రాణ ప్రదంబైన చిత్రపటముతో శాపోపహతుండైన మహాత్ముఁడే యీతఁడు ఈతఁడెప్పగిది స్వస్వరూపమునుబొంది మిమ్ముగలసికొనఁ గల్గెనోయెఱుంగఁ గుతూహలపడుచుంటినని పలుక నా రాజేంద్రుఁ డావృత్తాంతమెల్ల నామూలచూడముగా నామెకుఁ దెలిపి తాంబూలకరండ వాహిని చేతియందున్న యాచిత్రపటమును స్వయముగాఁ గైకొని తారావళి కందిచ్చెను.

చిత్రగతమైయున్న యుదయసుందరీ స్వరూపమును జూచినతోడనే తారా వళి విరహవ్వధాగాఢపీడనంబున నంతఃకరుణయంత్రమునుండి వెల్వడుచున్నట్లునయన ద్రోణులనుండి బాష్పధారలు గారుచుండ జాలిమొదవురీతి హా ! ప్రియసఖీ! యుదయ సుందరీ ! చిరకాలమునకు నిన్ను జిత్రముననైనఁ జూడఁగల్గితిని. అభీష్టజనుల నెల్ల విడిచి నీ వెచ్చట కాలముగడుపుకొనుచుంటి వని విషాదమేదుర హృదయారవిందయై మైమరచి చేతనున్నపటమును జారవిడచి కరయుగంబు ఫాలతలంబునఁ జేర్చుకొని మోమువంచి కన్నీరు కాల్వలై పారఁ బెద్దయెలుంగునఁ రోదనం బొనర్పసాగెను.

అట్లు రోదనంబొనర్చుచున్న యామెంగాంచి యా రాజమార్తాండుండు మారాడఁజాలక కరుణాకటాక్షములఁ గుమారకేసరిపైఁ బరగించుటయును నతం డేలిక యభిప్రాయమెఱింగి తారావళి నిట్లని‌ యూరడింపఁదొడంగెను. భగవతీ ! అభీష్టవస్తు వియోగంబున హృదయవిదారకంబుగ విలపింపని ప్రాణి యెందును నుండడుగదా ! అందును స్త్రీలు దుఃఖమాపుకొనఁజాలరు. ధీమంతులు జిత్తమును స్వాయత్తముగ నొనర్చుకొనవలెను. విధినియోగంబున నెప్పుడేది సంభవించినను దానినెల్ల నోర్పున ననుభవించుటయు కర్తవ్యము. సర్వతత్వవిశేషంబుల నెఱింగిన నీకు నే నేమని యుప దేశింపఁగలను ! నీ హృదయంబును బాధించు ప్రేమబంధమును ద్రెంపివేయుము. ఉదయసుందరి నేరీతిఁ గనుంగొనవచ్చునో యాలోచించి యట్టి ప్రయత్న మొనరించు టయే యిప్పుడు జేయవలసిన కృత్యమని కుమారకేసరి బోధించుచున్నసమయంబున విశ్వభూతి తారావళి యాక్రందనము విని యం దేతెంచి సాదరవాక్యంబుల నామె నోదార్చెను. వారి యనునయవాక్యంబుల సేదదేరి తారావళి విశ్వభూతి యొసంగిన గమండలూదకముచే ముఖకమలసమ్మార్జనం బొనర్చుకొని యెఱుపెక్కిననాసాపుటంబు లమర నీరెలుంగున నిట్లనియె. రాజచంద్రమా ! నీయంతికమున నా ప్రియసఖిం గాంచక నిముసమైన నేనిందు నివసింపఁ జాలను. ఈ చిత్రపటమును జూచుచున్న కొలఁది నా హృదయానుతాప మభివృద్ధి జెందుచుండెనని పలుకుచు విచారోద్రేకంబున నింకేమియు మాటాడఁజాలక మిన్నక గన్నీరు విడువఁదొడంగెను.

తారావళి దుఃఖమును గాంచి పుండరీకుండును దన కుదయసుందరియందుఁ గల యనురాగంబుకతన బుట్టినవిచారము నెడద నడంచుకొని దీర్ఘ నిశ్వాసంబులవిడుచు చుండఁ దిలకించి కాలోచితంబుగ విశ్వవిభూతి వాని కిట్లనియె వత్సా ! నీవేల నట్లుం డెదవు ? సంవియోగంబున నతిచంచలహృదయైయున్న యామె చిత్రప్రదర్శనంబున విచారాంబుధి మునింగియున్నది. ధీరోదాత్తుండవగు నీవు ముందుచేయఁదగిన కృత్య మేమో యెట్లాయుదయసుందరిని గనుంగొనవలెనో, యిందుల కెవరిసహాయము గావ లెనో, యెచ్చటెచ్చటి కెవరెవరిని బంపించవలెనో, యాలోచింపుము


చ. సకలసముద్రముద్రితవిశాల ధరాతల చక్రమందునన్‌
    బ్రకటమహాహిలోకమున స్వర్భువనంబున‌ నెందునున్నఁ గొం
    కక వెదకించి యాతరుణిఁగాంచి రయంబున నిందుఁదెచ్చి ము
    ద్రికగతి హస్తమందుఁ గడుప్రీతిధరింపుమ ధర్మసిద్ధికై.

మర్త్యలోకమం దవతరించిన సువర్ణావాహనుండవగు నీరసాధ్యమెందును లేదు. కావున సత్వరమ యిందుండిలేచి పౌర్వాహ్ణికకృత్యంబులనెల్ల నిర్వర్తించు కొనుము వేళ యతిక్రమించుచున్నది అని తారావళి మొగంబై తారావళీ ! నీవిట్లేల యింకను పరితపించెదవు ? మహారాజు స్వయముగా నామెను వెదకించుటకుఁ బ్రయత్న మొనరింపఁగలఁడు విధికూడ వీనికి వెఱచును. కావున నవ్విధి యనుకూలుఁడై యచిర కాలముననే మీ కాయుదయసుందరిని సమకూర్పఁగలడు. అని విశ్వభూతి పలుకఁ దారావళి స్వస్థచిత్తయై పూజ్యురాలవగు నీమాటలు యధార్దములగుగాక యని వచించి రాజుతో వాని నివాసంబున కేగవలెనని దలంచియు నట్లొనర్చుట గౌరవలోపమనియెంచి విశ్వభూతి ననుసరించి పోయెను.

రాజును నిజనివాసంబున కేగి యధోచిత కాలకృత్యంబుల నిర్వర్తించు కొనుటయం దనాకులుఁడై యున్నను గుసుమశరశిలీముఖ పరంపరాఘాతముచే డెంద మునఁబడిన బెద్దగాయము తారావళినయన జలబిందువుల నీరుపట్టి బాధించుచుండ నిట్లు దీర్ఘ ముగ విచారింపఁ దొడంగెను. అన్నా ! ఆ మోహనాంగి నెందుఁగనుంగొన గలను ? సౌధశిఖరంబున నిద్రించు నామెను దద్రూపమోహంబున నెవ్వఁడో యపహ రించియుండును. అట్టి యువతీరత్నము నీక్షించి యెవఁడు గైకొనక విడిచిపెట్టఁ గలడు ? నిఖిలసులక్షణలక్షితమగు నామె కళ్యాణరూపమున కెన్నడు నపాయము గలుగనేరదు. ఈ బ్రహ్మాండగర్భమున నామె యెచ్చటనున్నదో యే యపాయంబుఁ దెలిసికొనఁగలను ? ఆమె జనకుండగు శిఖండతిలకుండు తదన్వేషణంబునకై పెక్కు మంది దూతలంబుచ్చెనని వింటినిగదా ? వా రామె నెందైనఁ గనుంగొని పాతాళము నకుఁ దోడ్కొనిబోయినచో నాకెట్లు గోచరముకాగలదు. అట్లు నిక్కముగఁ బితృ గృహంబునకుఁ గొంపోబడియున్నచోఁ దారావళి సహాయమున్నను నా కామె లభింపఁ గలదని యెట్లూహింతును ? ఇంతకు నామె యెచ్చటనున్నదో తెలియక నేనేమి చేయఁ గలను? ఎచ్చట వెదుకఁగలను? మనుష్యులకు నరలోకమును దాటి పోవుటకు శక్తిలేదు గదా? ఎల్లలోకములఁ దిరుగశక్తిఁగలవారు సురసిద్ద విద్యాధరోరగయక్షరాక్షసులని యావాక్యాంతమందలి రాక్షసశబ్దమున స్మృతినభినయించుచు బాగు బాగు చక్కఁగా జ్ఞప్తికి వచ్చినది మదీయ విక్రమైకలభ్యమిత్రుండగు మాయాబల నిశాచర వీరుండు కలఁడుగదా? వానిచేత నాయిందుముఖిని నెల్లలోకముల యందును వెదకింపవచ్చును. దీనికై యింక యలజడిం బడనేమిటికని తలంచి నిశ్చలచిత్తుఁడై యామాయాబలుని ధ్యానించెను.

అంతలో సౌమ్యుఁడగు విప్రుని యాకారంబున మాయాబలుం డేతెంచి దేవా ! నీ వెవనిని ధ్యానించితివో యతఁడే నీ ముందున్నవాఁడని యెఱుంగుము. ఎందుకొఱకు నన్ను దలంచితివో యా పనికి సత్వరమ నియోగింపుము. బ్రహ్మాండ శిఖరము మొదలు బాతాళము వఱకును దిరిగి యెట్టి దుర్ఘటకార్యమునై నను క్షణములో సాధింపఁగలనని చేతులుజోడించుకొని నమస్కరించుచు ఱేనియెదుట నిలువఁబడి యుండెను.

అంత నా రాజముఖ్యుండు జిత్రగతమైయున్న యుదయసుందరీ స్వరూప మును జూపించుచు వయస్యా ! ఈ యాకృతిఁగల లలనారత్నము త్రిభుజవనంబుల నెందున్నఁదో వెదకిరమ్మని యాదేశింత నానక్తంచరవీరుం డతిరయంబున నంతర్హి తుండయ్యెను. వాఁ డరిగిన పిదపఁ బుండరీకుండును మాయాబలుండు తప్పక యా వేదండయానను గనుంగొనిరాఁగలఁడను నాశతో నాదినమును గడపెను. మఱియు నుదయసుందరియందలి గాఢానురాగంబుకతంబున నతం డంతరంగమున దశవిధ విరహాస్థలపాలగుచు నిట్లని వితర్నించుకొనెను.


మ. చలియో వేడియో భూమిదాటునెడ విస్తారంబుగాఁబుట్టి పెన్‌
     గలతన్‌ బెట్టఁగ నూత్నబందిగమునన్‌ గాడాంబుగా నాయెడన్‌
     గల మోహమందున మన్మధాస్త్రవిహతిన్‌ గాయంబునుగాంచి, గా
     సిలి యాకాంత లతాంగమక్కటకటా! జేటందెనేమోగదా ?

అయ్యో ! అశేషశుభసంపదల కాస్పందబగు నా నారిశిరోరత్నము నశించె నని సంశయించుట ప్రమాదముగదా ?


మ. సతిపై కోర్కెఁజరించు నాహృదయా మాశ్యామాతితారుణ్యసం
     భృతసర్వాంగయుతాంగజోత్సవలసద్రీతిన్‌ నితంబోదరా


    యత వక్షోజముఖాదిసంపదలచే నాతిథ్యమున్‌ బొంది యం
    చితలీలన్‌ సుఖియించుచుండ నింక హానింగాంచు టెట్లొప్పెడిన్‌.

గీ. అట్లు చిరకాల మాకోమలాంగియందుఁ
   దవిలి సుఖియించు నాదు చిత్తంబదెల్లఁ
   దద్వశంబయ్యె నింకెట్లు తరలఁగలదు ?
   ఉవిద విడనాడివచ్చుట‌ యొదవుటెట్లు ?

కావున

గీ. అరయ బ్రహ్మండమను వార్ధి నధిమధింప
   గలుగు శ్రీదేవివోలె నాకలికిమిన్నఁ
   బడిసి యురమందుదాల్చి నే వసుధయందు
   నచ్యుతుఁడనై చెలంగెడ నహరహంబు.

మఱియు నాదృష్టి యనంగతాప దుస్థితింబడు విరహిణివిధంబునఁ జరణ పల్ల వాస్తరణంబున నెప్పుడు పొర్లాడును ? ఎప్పుడు చిగిర్చిన లతవలె జంఘోరు దండము నూతగొని మహానందంబునఁ బ్రసరించును ? విలాసవతియగు వేశ్యలాగున నెప్పుడు జఘనాంగణంబున నిలచియుండును ? భయాకులయైన భుజగిపోల్కె నాభీ రంధ్రంబున నెప్పుడు బ్రవేశించును? విస్మయప్రచారంబున నలసటంబడిన పడతిగతి నెపుడు త్రివళిమండపము నాశ్రయించి యుండును ? యౌవనవిడంవితయగు స్వైరిణి లీలఁ గురులాంధకారంబున నెపుడు సంచరించును ? రాగిణియను సిందూర లేఖచాడ్పున సీమంతసీమ నెపుడుజేరును ? హర్షోద్రేకంబునఁ ద్రుళ్ళిపడు శహాచందమున నెపుడు లావణ్యపయోధి నెల్లెడల విహరించును ? హృదయమునకు సుఖమొనఁగూర్చు నామె మంజులాలాపములు మదీయకర్ణ వివరంబున నెన్నదఁబడును ? పర్యంత తీక్ష్ణ‌మగు తూలికకరణి నామెదృష్టి యెప్పుడు నాయంగభిత్తికపైఁ బరిభ్రమించును? కళ్యాణవతి యగు నామెనిధానకలశముభాతి మత్కర మందెపుడుబడును? రత్నమాలపోలిక నవరుచిస్థానమగు మదీయకంఠము నెన్నఁ డామె యాలింగన మొనర్చుకొనును? అని యీ రీతి ననేక విధంబులఁ దద్రూపభావనా విశేషంబున ననుక్షణము హృదయంబునఁ బుట్టు కోర్కెలచేత విశ్రాంతి నెఱుంగక మన్మధపరితాపంబున నాఁడు గడపెను.

338 వ మజిలీ

మఱునాఁడు ప్రాతఃకాలమునఁ గృపావతియను విశ్వభూతి శిష్యురాలు రాజుసమక్షమున కేతెంచి జయజయధ్వానంబున వాని నాశీర్వదించుచుఁ బద్మదామం బుపాయనముగ నొసంగి యుచిత గౌరవమంది రాజున కిట్లనియె. రాజచూడామణీ ! నీవు మఠమునఁ దారావళిని విడచివచ్చినపిమ్మట మా నిర్బంధంబున నామె యాహ్ని విధుల నెట్లో నిర్వర్తించి యుదయసుందరికొఱకు బెంగఁగొని సంతతము గన్నీరు