కాశీమజిలీకథలు/ఆరవ భాగము/95వ మజిలీ

వికీసోర్స్ నుండి

యొక సన్యాసి మా తల్లితోఁ జెప్పుచుండ వింటిని. అట్టి లక్షణములన్నియు మీ యందుఁ గలిగి యన్నవని లోకులవలన నెరింగి మీరు నాకు భర్త లగుదురని నిశ్చయముతో మా తండ్రి నిశ్చయించిన వరుని నిరసించి యిల్లు వెడలి వచ్చితిని. మంత్రులు మిమ్మెట్లో దాటింతురని‌ నాకు ధృడమైన నమ్మకము గలిగియున్నది. అందులకే భువనేశ్వరీదేవి యరణ్యమున కరుగుటకు. నిశ్చయించుకొంటి. నేటికి నా నోములు పూర్తి యయినవి. తపంబు పలియించినది. మిమ్ము విడచి యిక యరనిమిషము మరియొకచోట వసియింపను. నన్నుఁగూడ మీ తోడ దీసికొనిపొండు. అని కోరికొనుటయు నతం డంగీకరించెను. ఇరువురు చెరియొక గుఱ్ఱమెక్కి. పరిజనులతో గూడ నలకాపురాధిముఖులై యరిగిరి.

అని మణిసిద్ధుండు వెండియు నిట్లు చెప్పఁ దొడంగెను.

తొంబది యైదవ మజిలీ

చంద్రముఖి కథ

అమ్మా ! అదికలకాదు. నిక్కువమె. నా కన్నులార నా సన్యాసిం గంటి. వాఁడు నాఁడు మనయింటికి భిక్షకు‌ వచ్చి నన్నుఁ బెండ్లి యాడుమని కోరిన నీచుఁడే. నేను భటులచేఁ ద్రోయించితి‌నని యప్పు డుగ్గడించెను. ఆ పాపుఁడు నన్ను నిర్భందించుచుండ నెప్వఁడో పుణ్యాత్ముఁ డొకఁడు విగ్రహము చాటుననుండి వచ్చి క‌త్తిచే వాని కుత్తిక నరికివైచెను. ఆ సుందరుని మోము చందమామ యనియె భ్రమఁ జెందితిని. అప్పు డెవ్వఁడో వేల్పువచ్చి నీ కేమి కావలయునని యడిగిన నా సేమముకోరి మీకన్నెమిన్న నింటికిఁ బంపుమని యతండు ప్రార్థించెను. కన్ను దెఱచిచూడ మనయింటిలో నుంటి. ఇంతయు రెండు గడియలలో జరిగినది. నన్ను రక్షించువాని మొగము చిత్త రువు వ్రాయఁగలను. వాని‌ పోలిక యంతయు మనంబునం బట్టియున్నది. అని కేయూరపురంబునఁ జిత్రాంగదుని కూఁతురు చంద్రముఖి యను చిన్నది ముచ్చటించుటయు దల్లి యిట్ల నియె‌ పుత్రీ ! నీ వింత ----దాన వేమే ? కొన్ని కలలు యదార్దముగా జరిగి‌నట్లే యుండును. కలలోఁ జూచిన వారిని చిత్రపటంబున వ్రాయవచ్చును. అదియొక' యక్కజముకాదు. స్వప్నఫలమును గురించి విచారింపవలసియున్నది. కలలోఁ బరివ్రాజకుండు కనంబడ రాదండ్రు. ఎట్ల యిన నెవ్వరోవచ్చి విడిపించిరని చెప్పితివి కావునఁ జివురకు మంచదియే అని చెప్పి‌నఁ దల్లి నాక్షేపించుచు జంద్రముఖి అమ్మా ! నిజముగా జరిగినదని చెప్పుచుండ ఫలము‌ లాలోచించెద వేమిటికి ? నే నా గుడిలోఁ జూచిన వాని వెదకి తెప్పించెదవేని వానిఁ బెండ్లి యాడెద. లేకున్న నిట్లెయుండెదనని పలికినది.

ఆమె నవ్వుచు నీ మాట వినినంత బాణునికూఁతురు ఉషాకన్య జ్ఞాపకము వచ్చుచున్నది. చిత్రలేఖవంటి సఖురాలు గలిగియున్న నీవు సూచిన వానిందీసికొని రాఁ గలదు. అని పరిహాసముఁ జేయుచు రెండు గడియలలో నెక్కడికో పోయివచ్చితి నని చెప్పిన నెవ్వరు విశ్వసింతురు. కలగాదు నిజమనిన నీ మాట వెఱ్రి కుదిరినది‌. రోకలి తలకుఁ జుట్టుము. అని నిట్లున్నది. నీ తండ్రి నీ నిమిత్తమై స్వయంవరము చాటించిరి. పేరు నొందిన రాజపుత్రులలో నెవ్వఁ డెక్కుడు బంగారముఁ దీసికొనివచ్చునో వానికి నిన్ను బెండ్లి చేయదురట. సంపదలతో నన్ని లక్షణములు గలియుండును అని చెప్పినది. చంద్రముఖి తల్లి కేమియు సమాధానము జెప్పక యప్పుడే తండ్రికొక యుత్త రమిట్లు వ్రాసినది. జనకా ? కనకమున కాసఁ జెందిన వరునివిద్యా గుణంబులు పరీక్షింపక యెట్టి నీచునకైన నన్నిచ్చుటకు బ్రయత్నించు చుంటివట. ఇది యాభిజాత్య లక్షణముగాదు. స్వయంవరమున కిది యాచారము గాదు. ఉత్తములైన రాజపుత్రుల రప్పించుము. నేనొక ప్రశ్నము నడిగెదను. నా మాట కుత్తర మిచ్చిన వానినే పెండ్లి యాడెద నిదియే నా శపధమని వ్రాసిన క్రమ్మం జదివికొని చిత్రాంగదుడు సంతసించి క్రమ్మర నిట్లు వ్రాసెను.

తల్లీ ! నే నంత యెరుఁగనివాడను కాను. ఊరక స్వయంవరము చాటించితినేని గొఱమాలిన వారందరువచ్చి సభలో జోటులేకుండ జేయుదురు. పది శకటముల బంగారమునకు దక్కు_వ తెచ్చినవాని నా సభకు రానీయను, అట్లు తెచ్చిన వానినే నీ ప్రశ్ననడుగుము. నీ యిష్టము వచ్చినవాని నేరికొనుము. కన్నెకలు కేవలము రూపమున‌ కాసపడి సిరిలేనివారిని వరించి పిమ్మట నిడుమలం గుడువగలరు. కావున నీ విందులకు జింతింప వలసినపని లేదని |పత్యుత్తరము వ్రాసెను.

అందుల కా సుందరియు సంతోషించి దానియ్య దలచికొన్న ప్రశ్నము శ్లోకరూపముగా రచియించి సమయమున కెదురు చూచుచుండెను. ఇంతలో నా చంద్రముఖిని వరంచియున్న రాజపుత్రులందరు తమతమసామర్ద్యము ననుసరించి బండ్లపై బంగారము వైచికొని యా పష్టణమున కరుదెంచియుండిరి. సామాన్యముగా నా రాజపుత్రులలో నూరుబండ్ల బంగారము దెచ్చినవా డరుదుగ నున్నారు. ప్రధానులు వారు తెచ్చినబంగార మంతయు లెక్కలు వ్రాసి‌ యప్పగించుకొని విలాసములతో గోశాగారంబుల బడవైచి వారి వారి నామములు వ్రాసి చిత్రాంగదునియొద్డ కనుపుచుండిరి.

బోజకుమారుండును లీలావతియు నలకాపురమున కరుగుచు మార్గవశంబున నా పురంబున కరిగిరి. బోజుం డా వార్తవిని లీలావతితో బ్రేయసీ ! ఎల్లుం 4 బం ంముంయవ రాజప్ప తికకు స్వ యంవర మహోత్సవము "జరుగునట, ననా టు వెంఆత యు రాజప్పుతులు పేక్యందుం వచ్చుచున్నాడు, ఆ వింతచు వింటా! తున యషగిన నప్పవత చిన ;పతో. దేపర కిష్టమే వ చూడవలసినదె. అచ్చేడియ మిమ్ము వరింపవలసినదే. సందియము లేదని పలికినది.

అతండు సంతోషించుచు యోషామణీ ! మంచివేషము వైచికొని యచ్చట గూర్చుండుట గాదు. పలుబారువుల కాంచనమునకు దక్కువ తీసికొని వచ్చిన వాని నా సభకు రానీయరు. పోనీ, ఎక్కడయిన నెరవు దీసికొని పోవుదమన్నను మనల నెరిగినవారులేరు. తీసికొని వెళ్ళినను నేదియో బ్రశ్న మడుగునట. అందులకు సదుత్తర మి‌చ్చిన వాని వరించునట. ఎన్ని నిబంధన లున్నవియో చూచితివా? స్త్రీల ప్రభావ మింత యద్భుతముగా నున్నదని చెప్పిన నా యుప్పులకుప్ప అయ్యో ? ఇది యెక్కడి స్వయంవరము? బంగార మేమిటికని పరిహసించి నది పోనిండు. మా పుట్టినింటికరిగి బంగారము తీసికొని రావచ్చును. మితి యిమ్మని కోరుడు ప్రశ్నమున కుత్తరము మీరు చెప్పకపోలేరు. నేను గూడ సభకు రావచ్చునా ? యని యడిగిన బోజుండు వికసిత ---- బోజుండై అంబోజముఖీ! నీ చిత్తమరయు తలంపుతో నడిగితిని. నీ సావాసగుణమునకు సంతసించితిని. కావలిసినంత కాంచనము దెప్పించెచ జూడుమని చెప్పి యప్పుడే యినుపకొట్ల యొద్దకరిగి నిలువయున్న లోహ మంతయు బట్టికి దీసికొని యొకచోట రాసిగా వేయించి సర్పటి యిచ్చిన ధూమవేది ‌ప్రభావంబున నాలోహవస్తువులన్నియు గనకవికారములు గావించెను.

పిమ్మట నా వీటనున్న శకటములన్నిటిని దెప్పించికోశాగారము నొద్ద కా బంగారమంతయు దోలించె. గుణపములు గొడ్డళ్ళు పారలు లోనగు వస్తువులన్నియు గాంచన వికారములై వచ్చుచుండుట దిలకించి మంత్రులు వెఱగుపడుచు నీ రాజకుమారు డెవ్వడో యైంద్రజాలికుడువలె గనంబడుచున్నాడు ఈ వస్తువులు కోశాగారములలో బట్టవు. ఈ బళ్ళ కంతము గనంబడదు. కోట యంతయు నిండుచున్న ట్లున్నది. వీని కేమి లెక్కలు వ్రాయగలము. అని యాలోచించుకొని యా కథ జిత్రాంగదున కెరింగించిరి. అతండును ఆ బంగారవస్తువుల జూచి విస్మయముఁ జెందుచు నీ ధర్మము బంపువాఁ డెవ్వడో చూడవలయునని తలంచి తెలిసికొని బోజకుమారుని యవసధంబున కరిగెను. ఆ రాజపుత్రు --------- విని‌ యెదు రేగి తగురీతి సత్కరించెను.

చిత్రాంగదుఁ డా బోజునిఁ జూచి తదీయరూపవైభవమున కక్కజము జెందుచు నోహో? ఈతండు భేదరుఁడు కాని భూసురుఁడు కాడు. ఈ స్వయంవర మేమిటికి ? ఇతఁడు కోరినఁ చంద్రముఖినిఁ బెండ్లి జేయ కుందునా ? అని తలంచుచు స్వాగత మడిగి సాదరముగా రాజపుత్రా ! మీరు పాలించు ధాత్రి‌ యెద్ది? మిమ్ముఁ గన్న దల్లిదండ్రు లెవ్వరు? మీ యభిథ్యా వర్ణంబు లెట్టివి? నను ధన్యుం జేయ నరుదెంచిన దివ్యుడవని దలంచుచుంటిని. మనుష్యమాత్రున కింత బంగారముఁ జేర సామర్థ్యముండునా ? యని స్తుతిపూర్వకముగా నడిగిన బోజుండు దేవా ! బంగా రము భూమినే జనించుచున్నది. ఖనిజమగుట దేవతలు నిక్కడనుండియే కనకమును దీసికొని పోవుచుందురు. మేరుగిరిని గనకాద్రి యండ్రుగాని యందలి పుత్తడి యిత్తడివంటిది. ఖనిజమే శ్రేష్టమైనది. మా దేశములో గనులు పెక్కులు గలవు. అందుమూలమున నింతగాఁ దీసికొని వచ్చితినని యతనిమాటల కేవియో ప్రత్యుత్తరములు చెప్పి సగౌరవముగా ననిపెను. బోజునికి బండ్లు దొరకక నొక చోటను జోటు జాలక యొకచోటను బంగారము రాసులుగాఁ బడి యున్నది. అంతట స్వయంవర ముహూర్త మాసన్నమైనంత బోజుండు లీలావతితోగూడ నా సభకరిగెను. లీలావతి వెనుకటి రీతిని స్త్రీ పుం వివక్షత తెలియని వేషముతో బోజుని పజ్జఁ గూర్చుండెను.

బోజకుమారుని జూచి యందున్న రాజపుత్రు లందరు జంద్రముఖి యతనినే వరించునని నిశ్చయించుకొని యుండిరి. సఖీపరివృతయై చంద్రముఖి పుష్పదామంబు చేతంబూని సింహాసన శ్రేణుల నడుమఁ దిరుగుచు నీ క్రిందిశ్లోకము ప పత్రికపై వ్రాయించి వారికి జూపుచుండునది.

శ్లో॥ యది జనాసి బ్రూహి త్వం కి మాసీ ద్భైరవాలయే.

భైరవాలయమున నేమి జరిగినదియో నీ వెరింగి యుంటివేని చెప్పుము - అని యున్న శ్లోకమును జదివికొని యేమి జరి‌గినదియో యెరుగని వారగుట రాజపుత్రు తెల్ల తెల్లపోవుచు నూరకుండిరి. కొందరు తమకుఁ దోచిన విషయము లేదియో వ్రాసి యిచ్చిరి. అట్లు రాజపుత్రులఁ బరీక్షించుకొనుచు వచ్చి వచ్చి యచ్చిగురుబోణి తటాలున బోజకుమారుం జూచినది. మోహావేశముతో అయ్యో ? నే నీ నియమ మేటికిఁ బట్టితినోకదా ? ఈ యంకిలి లేనిచో‌ నిప్పుడే యిప్పూదండ వీని మెడలోనే వేయుభాగ్యము పట్టును. అయ్యారే ? ఈ రాజపుత్రులలో నితఁ డొక్కడే నా మదికి నచ్చియున్నవాడు. సౌందర్య మన నిట్లుండవలయును. వీని యవయవము లన్నియు మొలచినట్లు పోసినట్లు దిద్దినట్లున్న వికదా ? ప్రాయమునకుఁదగిన రూపము రూపమునకుఁ దగిన తేజము వీనియం దొప్పుచున్నవి. ఈతఁడే వల్లభు డైనచో రతివల్లభుని దాసుఁగా నేలక పోవుదునా ? అట్టియోగము నాకుఁబట్టదు. నా ప్రశ్న మీతని కెట్లు తెలియగలదు ? ఇప్పుడు మార్చికొనిన లోకాపవాదము పొందుదునని తలంచుచు జేటికచే దనప్రశ్న శ్లోకమతని కిప్పించినది.

భోజుం డా పద్యముఁ జదివికొని నవ్వుచు మున్ను లీలావతివలన యా కథ వినియున్నవాడు కావున నిట్లు ప్రత్యుత్తరము వ్రాసెను

శ్లో॥ లీలావత్యా వధూరత్న చోరః కాపొలికో హతః

లీలావతియను చిన్నదానిచే స్త్రీ రత్నమును దొంగిలించుకొని వచ్చిన కాపాలికుడు చంపబడెను. అని వ్రాసి యతం డాచీటి చేటిక కందిచ్చునంతలో జంద్రముఖి యా ప్రాంతమందున్న లీలావతి జూచి గురుతుపట్టి యట్టెఁ బోయి యొహో? నా ప్రాణరక్షకు డిక్కడ నున్నాడు. చూడక పోయితినిగదా ? ఎవ్వని నిమిత్తంబిట్టి ప్రశ్నయని కట్టడి చేసితినో యట్టి మహాత్మునకు బూవుదండ వేయఁ బోయినంత బోజుండు నిలునిలు మని వారించుచు నిట్లనియె

పూబోణీ ? నీవు నాకుఁ బ్రశ్న యిచ్చితివి. నా యుత్తరము చూడక వేరొకరి మెడలో దామము వైచుచుంటివేమిటికి? ఇది యెక్కడి ధర్మమో సమాధానము జెప్పుమని యడిగెను. అప్పుడు చంద్రముఖి కొందల మందుచు వారిచ్చిన యుత్తర మేదియని చేటిక నడిగి పుచ్చుకొని చదివి నివ్వరపాటుతో నేమిందోచక యిట్లు తలంచెను.

ఆహా ? దైవకారము కడువిపరీతమైనవిగదా ? నేను మొదటనే యాతనిం జూచితినయేని యీ సందియములు కలుగకపోవును. ఇతండు నా ప్రశ్నమునకు సదుత్తరమిచ్చెను. ఆతనిమున్నే భర్తయని నిరూపించి కొనియుంటిని. ఇప్పుడెవ్వని భర్తగావరింపవలయునో తెలియకున్నది. ధర్మసూక్ష్మము తెలియక వరించితినేని వ్యభిచారిణినగుదు. ఉభయలోకములకునుం జెడుదునని డోలాయిత మనస్కయై యాలోచించుచుండెను.

భోజుఁ డామె యిచ్చిన ప్రశ్నమునకుఁ దగినయుత్తర మిచ్చెనని యెల్లరకుం దెలిసినది? ఆమె యుల్లము లీలావతియందుఁ దగులుకొన్నదని స్పష్టపడినది. ఆమె యందీసుఁ జెందియున్న రాజపుత్రు లందరావిషయముఁ దెలిసికొని యెక్కసక్కెము లాడుటకు సన్నద్ధులైయుండిరి.

అప్పుడు చంద్రముఖి వినయవినమితోత్తమాంగయై కరములు ముకుళించి భోజ్యునుద్దేశించి మహాత్మ ! నీవు దివ్యరూప సంపన్నుడఁవు. నిన్ను వరించుట కంటె భాగ్యములేదు. ఆతండు మున్నొక నాటి రేయి భైరవాలయములోఁ గాపాలికుం బరిమార్చి నా ప్రాణములు గాపాడెను. అప్పటినుండియు నతఁడే భర్తయని తలంచియుంటిని. అందులకే యీ ప్రశ్నము వైచితిని. ఇది మీ రెట్లు గ్రహించి తిరో చింత్యమైయున్నది. దమయంతి దేవతల యనుజ్ఞఁ గైకొని నలుని వరించినట్లు మీ యానతి నే నాయనను వరించెద ననుజ్ఞయిండని కోరుకొనినది.

రాజపుత్రు లెల్లరులేచి యట్లు చేయరాదు. ధర్మవిరుద్ధము ధర్మవిరుద్ధమని యల్లరిఁ జేయదొడంగిరి. భోజుండు వారి సందడి వారించుచు లేచి నిలువంబడి యా రాచపట్టిని దృఢవ్రత యని చెప్పనోపు. సత్యసంపన్నుల వ్రతములు దైవమే కాపాడుచుండును. ఇపుడు ధర్మవిరుద్దమేమియు జరుగలేదు. అది పురుషుఁ డనుకొని భ్రాంతి పడుచున్నది. కళత్రోపార్జితంబైన విత్తంబు ననుభవించుటకు భర్తకధికారము గలదు. కావున నీ చిన్నది యెట్లయినను నాకుఁ గళత్రమైనదని యుక్తి గా నుపన్యసించి రాజపుత్రుల నెల్ల నిరుత్తరులం గావించెను.

ఆ కథ విని చంద్రముఖి పరమసంతోషముతో బోజుని మెడలో దామంబు వైచినది. మంగళగీతములు మ్రోగించిరి. చితాంగదుఁడు ప్రహర్షుజలరాశి మునుఁగుచు వారి నందలముపై నెక్కించి యూరేగించుచుఁ గోటలోనికిఁ దీసికొని పోయెను.

అప్పుడు రాజపుత్రులందరు నేకమై బోజుని పరాక్రమముఁ. దెలియక సేనలం గూర్చుకొని యల్లునితోఁ గూడుకొని సంగరమునకు రమ్మని చిత్రాంగదునకు రాయబారముపంపిరి అప్పుడు చిత్రాంగదుడు బోజుని కెఱింగించి యతని ననుమతిఁ దనదళముల నెల్ల నా యితము సేయించి శత్రువుల నెదుర్కొనియెను. అప్పుడు రెండు సైన్యములకు సంకులయుద్ధము జరిగినది. అంగరాజు బలము లల్పము లగుట రిపుభటతాడనముల కోడి పారఁ దొడంగినవి. అప్పుడుబోజుండు తురగారూఢుండై పెక్కు సాధనంబుల ధరించి యాయోధనగరంబున కేగి విచిత్ర గమన ప్రహారంబుల సంగరపాటవంబు తేటపడ రెండుగడియలలోఁ జతురంగబలములతోఁ గూడ రాజపుత్రుల నెల్లఁ గాందశీకులం గావించెను.

అవక్రవిక్రమంబున ముహూర్తమాత్రములో శత్రువుల నెల్లఁ బారదోలిన యాభూపాలునందనుని గాంచి చిత్రాంగదుండు కౌగలించుకొని తనపూర్వపుణ్యఫలం బపారమైనదని యగ్గించుకొనుచు నప్పుడే వివాహప్రయత్నముఁ గావించెను. బోజుండు శుభముహూర్తమునఁ జంద్రముఖిం పెండ్లి యాడి యిరువురి తరుణులతోఁ గొన్ని దినంబులందువసించి పిమ్మట గదలి లీలావతి వెంటరా నలకాపురంబున కరిగెను. అంతకుమున్నే బోజునితల్లి సావిత్రి బుద్ధిసాగరునిచేఁ బుట్టినింటి కనుపఁబడి‌ బోజునిరాక కెదురుచూచుచుండెను. బోజుండు నగరికరిగి తొలుతనే తల్లియొద్ద కరిగి నమస్కరించెను. పుత్రుం గౌగలించుకొని కన్నీటిధారచే శిరంబుఁ దడుపుచు వియోగదుఃఖము వెల్లడించెను.

బోజుండు తల్లి నూరడించుచు దాను బయలుదేరినది మొదలు జరిగిన కథ యంతయుఁ జెప్పి లీలావతిం జూపి యిదియే నీ పెద్దకోడలని చెప్పెను. సావిత్రి నమస్కరించుచున్న లీలావతిం దీవించుచుఁ గ్రుచ్చియెత్తి తండ్రీ ! నీ మేనమామకూతురు పద్మావతియు రూపవతియు యౌవనవతియునై యున్నది. మాసోదరుఁడు నీ నిమిత్త మెదురు చూచుచున్నాఁడు. నలుమూలలకు దూతలఁ బంపెను. పద్మావతియు అత్తా! నీ కొడుకెప్పుడిక్కడికి వచ్చును. చెప్పుము చెప్పుమని నిత్యము నన్ను నిర్భంధించుచున్నది. నీ వప్పుడే యిద్దరిం బెండ్లియాడి వచ్చితివి. పద్మావతిని గూడ బెండ్లి యాడక తీరదని చెప్పిన విని తల్లిమాట మన్నించుచు బోజుండు పద్మావతిం గూడ బెండ్లిఁ జేసికొనియెను. అంతలో బుద్ధిసాగరునిచేఁ బంపబడిన ధూతలు కొంద రక్కడికి వచ్చి యేదియో పత్రికయిచ్చిరి.

బోజకుమారా ! నీ పినతండ్రి నీవు వ్రాసిన శ్లోకమును విని పశ్చాత్తాపముఁ జెంది మరణకృతనిశ్చయు డైనంత మే మొక బైరాగినిరప్పించి చచ్చినవానిం బ్రతికించెదనని వానిచేఁ జెప్పిచింతిమి. ముంజుండు నిన్ను బ్రతికింపుమని వాని ప్రార్థించుటయు నతండు హోమములు చేయుచు నారు మాసములలో రప్పింతునని చెప్పె. ఆ యాసతో నతండు మరణోద్యోగము మానుకొనియెను. ఆ మితి కావచ్చినది. కావున స్యందనారూఢుండవై విశ్చేయుమని నా పత్రికలో నున్నది.

బుద్ధిసాగరుని మతి కౌశల్యమునకును స్వామికార్యభక్తికిని మెచ్చుకొనుచు బోజుండుఁ మువ్వురు భార్యలతోఁ దల్లితోఁ జతురంగబలములతో వెండియు ధారానగరమును బ్రవేశించెను.

అని మరియు దక్కథాశేషవిశేషం బాశేముషీవంతుఁ డవ్వలి నివాసదేశంబున నిట్లు చెప్పుచుండెను.