కాశీమజిలీకథలు/ఆరవ భాగము/92వ మజిలీ

వికీసోర్స్ నుండి

కాశీ మజిలీ కథలు

ఆఱవ భాగము

తొంబది రెండవ మజిలి

యతీంద్రా ! ఇన్నగరంబు విఫణిమార్గంబు నే నరుగుచుండ గొండొకచోట గొందరు బ్రాహ్మణులు‌ కూర్చుండి భోజుఁడను నరేంద్రుని కథలు చెప్పుకొనుచుండిరి. కొంచెము సేపు నేనందు నిలువంబడి వింటిని. అయ్యారే ! ఎంత చోద్యముగా నున్నది. మీ రెప్పుడు నమ్మహారాజు చర్మిత్రమునాకుఁ జెప్పితిరికారేమి? నేడు సుదినము. అప్పుణ్యాత్ముని వృత్తాంత మెరిగించి నన్నుఁ కృతార్ధుం జేయుఁడని ప్రార్థించుటయు మణిసిద్ధుండు క్రమక్రమ ప్రవర్థమానంబగు శిష్యుని వివేకమున కానందించుచు రత్న మహిమఁ దదుదంతమంతయుం దెలిసికొని యిట్లుచెప్ప దొడంగెను.

ముంజుని కథ

ధరణీ తలంబున కలంకారభూతంబగు ధారారాజ్యంబును సింధుఁడను రాజు పాలించుచుండెను. అతని మంత్రి బుద్ధిసాగరుండు. బుద్ధిసాగరుండై సకల రాజతంత్రంబుల స్వతంత్రముగాఁ జక్క పెట్టుచు ఱేనితలపూవు వాడకుండఁగాపాడు చుండెను. అతనికిఁ బెద్దకాలమున సంతతి లేకపోయినది. బుద్దిసాగరుండు వృద్ద పండితుల రప్పించి వారితో వితర్కింపుచుం దదనుమతి నృపతిచే బృహస్పతిసవనంబను సవనంబు యధావిధి నాచరింపఁ జేసెను.

అయ్యజ్ఞంబున ననంతమణి కనకవిశేంబున శేషభూదేవదేవతా నికరంబులఁ దృప్తి పరచిన యతని విఖ్యాతి యనంత మంతయుఁ బెద్దగా వ్యాపించినది అయ్యిష్టి వలన నతని యభీష్టము వడువున సకళాప్రస్ఫీరతేజుడంగు భోజుండను కుమారుం డుదయించెను. అబాలుని యాకారచిహ్నములఁ బరిశీలించి కంతు వసంతజయంతాదులలో నెప్వఁడో యిట్లవతరించెనని విద్వాంసులు కొనియాడుచుండిరి,

ఆ డింభకుండై దేడుల ప్రాయమువాడై యున్నతరి నిరతిశయ జరాబంధు నుంచగు సింధులుండు వెద్ధికాగరుం బీరి యే;:*౦ఠిముగా నిట్లనియె. సుమతీ: నీ సు సవీయుంమిన స్రభత జరాప౦భూతుండనయ్యునింతదీనుక నీ రాజ్యభారంబు చుచుంటిని. ఇప్ప డిర్మదియ పటుత్వం బొత్తిగ సురిగినడి. ఇంక నీ ౫ పాలింపనోప మదీయసోవరుండు ముం౨ండు రాజ్యంమ్మీ లారద్ధారం న ఎయన్నవాయం.. అట్టి.ని విడిచి ప్పుతు నకే రాజ్యమిత్తునేని.. లోకులు లోరంబునంకజేసి ము౦జుండు న మానడు. గాలన బ్యుతనోనయు వెలలంలస. ఏానిరు. మరయు ఢి వాల ఉం ఏలన జాలుంగసు భోజుని ఐంపి రాజ్యనాశనముఁ గూడఁ గాగలదు. లోభము సకలపాపములకు నెలవు. లోభా విష్టుఁడగు నరుఁడు దల్లిదండ్రులనైన వధించును. లోభమునఁ గ్రోధమును గ్రోధమున ద్రోహమును గలుగుచుండును. కావున నిప్పుడు కర్తవ్య మేమియని యడిగిన బుద్దిసాగరుం డిట్లనియె.

దేవా ! నయకళావిశారదుండగు మీ సోదరుండు మీ యందు బద్ధాధరుండై యున్నవాఁడు. ఇంతదనుక దర్మబుద్ధియనియే పొగడ్త కెక్కెను. అట్టివాఁడు‌ పాపకృత్యములఁ జేయ నొల్లడు రాజ్యభారం బాయనమీదనే యుంచుడు. నేనునుఁ జూచుకొని కాచుచుండెద నని యుపదేశించెను. అతని యాలోచన సమీచీనమని తలంచి సింధులుం డప్పుడ ముంజుని రప్పించి తమ్ముడా ? వీడు నీకునుం గుమారుండే సుమా ? వీనిం బెంచి పెద్దవానిం జేసి విద్యాబుద్దులు చెప్పించి రాజ్యపట్టభద్రుఁ జేయుము. అంతదనుక పూజ్యంబగు నీ రాజ్యంబు నీవుపాలింపుము. ధర్మం బేమరకుమని పలుకుచు భోజకుమారునితోఁగూడి రాజ్యంబతని యాధీనముఁ గావించెను.

కాలక్రమంబున సింధులుండు స్వర్గస్థుండైనంత ముంజుండు సింహాసన మెక్కి తన కుమారుండు జయంతుడను వానితో భోజకుమారుం గూర్చి చదివింపుచు నన్న పోలిక ధర్మంబునఁ గొంతకాలము రాజ్యమును గావించెను.

ఒక నా డా యొడయునియోలగంబునకు జ్యోతిశ్శాస్త్రపారంగతుండగు నొక పండితుఁ గురుదెంచి యాశీర్వాదపురస్సరముగా నరేంద్రా ! నాకు సమస్తవిద్యలు కంఠస్థములై యున్నవి. నీవు నన్నుఁ బరీక్షింపుము అన్నియుం జెప్పఁగలనని సావలేపముగాఁ బలికిన నాలించి ముంజుండు మందహాసముఁ గావించుచుఁ బాఱుఁడా! నేను జన్మించినది మొదలు నేటి తుదదనుక జరిగిన చర్యలన్నియుఁ జెప్పితినేని నిన్ను సర్వజ్ఞుండవని యొప్పుకొనియెదనని బలికెను.

ఆ మాట విని దైవజ్ఞుండు కాలము గణించి యంకెల గుణించి లగ్నముఁగట్టి యంశలం బట్టి యతని వృత్తాంతమంతయుం బూసగ్రుచ్చినట్లు వ్రాసి యిచ్చెను. గూఢాభిజ్ఞానములనుసైతము వ్రాసియిచ్చిన యా కాలజ్ఞుని సామర్థ్యమునకు మిక్కిలి సంతసించుచు ముంజుండు లేచి యెదురువోయి యతని పాదంబులకు సాష్టాంగ మొఱగి నవరత్నఖచిత సింహాసనమునఁగూర్చుండఁ బెట్టి యిట్లనియె. ఆహా ! నిన్నుఁ జూచి సామాన్యుండవని యుపేక్షఁ జేసితిని. నీ విద్య యనవద్యయైయున్నది. నీవు త్రిలోక పూజనీయుండవని కొనియాడుచు నుచ్చైశ్శవంబునుబోలు పదియశ్వముల నిచ్చి సంతోషపరచెను.

అట్టి సమయంబున బుద్ధిసాగరుండు దేవా ! భోజకుమారుని జన్మపత్రిక నీ విప్రునికిం జూపి ఫలముల నడుగరాదా? యని పలికిన విని ముంజుండు సంతసించుచు నతనిజాతకముఁ దెప్పించి చూపించెను. దైవజ్ఞుండా పత్రికం జూచి యా రాజపుత్రు నిటకు రప్పింపుడని కోరిన నతండు పరిజనుల నంపి విద్యామందిరమునుండి భోజు నచ్చటికిఁ బిలిపించెను.

భూమి కరుదెంచిన మహేంద్రుడోయన రూపుఁ గైకొనిన మన్మధునిచందమున మూర్తీభవించిన సౌభాగ్యంబుకరణిఁ బ్రకాశించుచు భోజకుమారుఁ డా సభామండలి కరుదెంచి రాజకుమారవర్గంబు సిగ్గుపడి చూచుచుండ రెండవ తండ్రివలె నొప్పుచున్న ముంజుని పాదంబులకు నమస్కరింపుచు నుచితాసనాసీనుం డయ్యె నట్టి యెడ నా బ్రాహ్మణుఁడు తల్లక్షణంబు లన్నియు పరీక్షించి దేవా ఈ కుమారుని భాగ్యోదయ మెరింగింప విరించియుం జాలడననాబోటి కుక్షింభరి‌ యేమి చెప్పఁగలడు? అయినను నా బుద్దికిఁదోచినరీతి నివేదించెద. నీ కుమారశేఖర నధ్యయనశాల కనువుఁడని చెప్పుటయు నన్నరపతి యట్లుఁ గావించెను.

రాజా ! బోజకుమారుం డవతారపురుషుండు నా జీవితములో నిట్టి యద్భుత భాగ్యోదయముగల జాతకముఁజూచిఁ యెరుంగ. వినుండు. ఏబదియైదుసంవత్సరముల యేడుమాసముల మూడుదినము లీగౌడదేశ మంతయు నేకచ్ఛత్రముగా నీ కుమారుండు పాలింపగలడు. అరువదినాలుగువిద్యలు వీనికిఁ గరతలామలకముగా నుండును. శిబికర్ణదధీచుల మించిన దాతృత్వముఁగలిగి భూమండలమునఁ గలిగిన పండితుల నెల్లనాదరించుచు విజయశోవిసరంబుల దిగంతముల విరజిమ్మఁ గలఁడని యక్కజముగా వక్కాణించెను. ఆ కథవిని ముంజుండు చాతుర్యంబున సంతసించు చున్నట్టభినయించినను విచ్చాయవదనుండై యప్పటికిఁ దగిన కానుకలిచ్చి యాబాడబు ననిపి యేకాంతగృహంబున కరిగి యిట్లు విచారించెను.

అయ్యో ? ఈ రాజ్యలక్ష్మి భోజకుమారు నాశ్రయింపఁ గలదు. అప్పుడు నేను బ్రతికియున్నను జచ్చినవానితో సముండ నగుదును. ఇంద్రియములు బుద్దియు నామము మాటలు వెనుకటివేయైనను సిరి విడిచినవాఁడు మఱియొకఁడైపోవును. పూర్వము వాఁడు సంభాషించుటయే పండుగగాఁ దలంచువా రిప్పుడు పిలిచినను దాపునకు రారు. మగ్నింపరు నీ కొన్నిదినంబు లైశ్వర్య మనుభవించి దరిద్రుడైనవాని జీవనముకన్న మృతియే శ్రేష్ఠము. కావున నిందుల కొక యోచన చేయవలసి యున్నది రాబోవు ననర్థమునకు ముందుగనే ప్రతీకారము సేయవలయును. అదిదాక్షిణ్యము గలిగి పరాపవాదములకు వెఱచుచుఁ జేయఁదగిన కార్యంబులఁ జేయని వానికి సంపదలు దూరములై పోవును. చేయఁదగిన పనులవిషయమై జాగుచేయువాని సంపదలను గాలము మ్రింగివేయఁగలదు. అభిమానముఁ వెనుకకుద్రోచి


ఆటం బసిలోర్యి! ప్ర

ఫ్‌ ఈల? "స్టైలు “మంచే మూర్థత. నుతిసుంరు ఏస్‌? నసయము; గ్‌ జి గ

భగ టీకాను. స్వల్పకార్యం. ఎన నధ కార్యం, నా రషచకొనదటే పాండిత్యము. శత్రువుని వ్యాధిని బుట్టినవెంటనే నాశనము నొందింపవలయును. లేనిచో వానివలననే వీనికి నాశనముఁ గలుగును.

ఆ ఫలములును దురంతమును సమవ్యయఫలములును నశక్యములునగు కార్యంబులు చేయుటయు విద్వాంసుఁడెన్నఁడునుబూనికొనడు. అని యాలోచించుచు నా రాత్రియెల్ల నిద్రఁబోక ముంజుండు వంగ దేశాధీశ్వరుండైన వత్సరాజును దీసికొని రమ్మని యంగరక్షకు నొకని నియమించెను. వాడు వోయి యా వృత్తాంత మెరింగించుటయు నా దండనాధుండు రథ మెక్కి పరి పరిగతులఁ దలంచుచు వచ్చి హజారమున నరదము దిగి యొక్కరుఁడ లోనికిఁ బోయి రాజదర్శనముఁ గావించి నమస్కరించెను.

ముంజుఁ డాసదనంబుఁ విజనంబు గావించి యనునయించి వత్చ రాజా ! భృత్యులు ప్రభువులకుఁ బ్రాణము లర్పింతురు. ప్రభువులు భృత్యులు చేసినకార్యములకు సంతసించుచుఁ దగునట్లు గౌరవింతురు. రాజ్యములు భృత్యుమూలములై యున్నవి. ఇప్పుడు నీ వలన జేయదగిన కార్య మొండు కలదు. వినుము. నీవు భోజకుమారుని దీసికొనిపోయి యడవిలో నున్న భువనేశ్వరీదేవి యాలయము మ్రోలఁ బరిమార్చి తస్మస్తకంబుఁ దీసికొని రావలయును. ఇందులకే నిన్ను రప్పించితినని చెప్పిన విని యతండు తెల తెల్ల పోవుచు లేచి నిలువంబడి యిట్లనియె.

దేవా ! మీ యాదేశముఁ గావించుటకు బద్ధులమైయుంటిమి మీలాలనావిశేషంబున నించుక చెప్పుచుంటి, నా మాటలు తప్పైనను మన్నింప వేడెదను.. బోజకుమారుఁ డిప్పుడు చదువుకొనుచున్నాఁడు. మిక్కిలి గుణవంతుఁడు. ద్రవ్యముగాని సేనలుగాని వాని యాధీనములో లేవు. మిమ్ముఁదండ్రికంటె నెక్కుడుభక్తితోఁ జూచుచుండును. పరుషము లాడినవారి నించుకయు నిందింపక మృదుపూర్వముగా సంభాషించును. అపకారశతమైనను స్మరింపక యుపకార మొక్కటియైనను బెద్దగాఁ జెప్పుకొనుచుండును. జ్ఞానతపశ్శీలవృద్దులగు సజ్జనులతో ముచ్చటించు చుండును. గుప్తమంత్రుఁడు ధన్మార్దకామంబుల నెరింగిన ప్రోఢ. సమస్తసద్గుణములకు నెలవగు నట్టికుమారుఁ జంపించుటకుఁ దగినకారణ మేమియని యడిగిన ముంజుండు ప్రొద్దుట సభయందు భోజునిగురించి దైవజ్ఞుండు చెప్పిన వృత్తాంత మంతయు నెరింగించెను.

ఆ మాటవిని పక్కు.న నవ్వుచు వత్సరాజు దేవా ! ఉదరఫోషణకై తిరిగెడు నొక పేదపారుని మాట నమ్మి మన్మధాకారుండగు కుమారునేలఁ జంపించెదవు? తొల్లి బ్రహ్మ పుత్రుండగు వశిష్టుండు శ్రీరాముని పట్టాభిషేకము నిమిత్తము ముహూర్త ----- ఆ ముహూర్తముననే కాదా ------------ సీతతో నడవికిఁ బంపబడెను. అరణ్యమందైనను సుఖముగ నుండిరా? సీతాపహరణమై శ్రీరాముఁడు పెక్కుబాములు పడియెను. వశిష్టునిదైవజ్ఞత్వ మెట్లయినది. అంతకన్న నీ విప్రుండు ఘనుఁడా! అదియునుంగాక దెవజ్ఞులు గత మెరింగిన ట్లాగతముం జెప్పఁజాలరు. అది యట్లుండె. ప్రాజ్ఞుండేపని చేసినచో నిట్టి యుపకార మగును. చేయనిచో నిట్టి యపకార మగునని యాలోచించి చేయుంగదా ? ఉచితానుచిత కార్యంబు లాచరించునప్పుడు పండితునిచే దత్పలం బెంతయో యవధరింపవలయును. తొందరచేఁ గావించిన పనులయొక్క పరిపాకము హృదయశల్యమై చివురకు బాధింపక మానదు.

ఈ భోజకుమారుం జంపించిన వృద్దరాజునం డభిమానముగల సైన్యంబులు తిరుగఁబడి అల్లకల్లోలముగాఁ బట్టణమును‌ వ్యాకులము చేయక మానవు. నీవీ రాజ్యముఁ బాలించుచున్నను బ్రజలు భోజకుమారునే భర్తగాఁ దలంచుచుండిరి. మరియుఁ బుణ్యకార్యము లెన్నియో చేయుచున్నను దుర్ణయకార్యకరణం బొందు చమురెంత యన్నను పెనుగాలి దీపశిఖ నార్పునట్టు సంపదల నశింపఁ జేయక మానదు. దేవా! పుత్రవధ యెన్నటికి హితమైనదికాదు. దేవర నా మాట మన్నించి యీ నియోగము మరలించుకొనుఁడని పలికిన నలుకమెయిం గన్ను లెఱ్ఱఁజేయుచు ముంజుం డిట్లనియె.

సేవకుఁడు తనయధికారమునకుఁ దగినమాటలే చెప్పవలయును. ఇంచుక చనువిచ్చిన భృత్యులు నెత్తియెక్కు.దురుగదా? ఇప్పని కార్యాకార్యములగురించి నిన్న డిది నప్పుడీ గొడవ య౦తయుం జెప్పవలసినది. నా విధించిన శాసనమున కెదురాడుట ప్రభు తిరస్కారము కాదా? చెప్పినపని చేయని భృత్యుని పోషించుట జాగళకుచపోషణము వోలె నిరర్దకము సుమీ? అని కోపోద్దీపిత మానసుండై పలికిన విని వత్సరాజు కాలోచిత మాలోచింపపలయునని తలంచి మారుమాట పలుకక మహా ప్రసాదమవి యప్పని కొప్పుకొని యప్పుడే బయలువెడలెను.

ఉత్తుంగసౌధోత్సంగమునుండి వడి వడి దిగుచున్న యతనిగమనవేగముఁ జూచి సభాసదులు భయపడుచు నేవియో నెపములు పన్ని తమ నెలవులకుంబోయిరి. అప్పుడు వత్సరాజెవ్వరితో మాటాడక తన యరదమెక్కి పాకశాలయొద్ద కరగి వీధి నిలువంబడి యుపాధ్యాయుఁ దీసికొనిరమ్మని యొకభటు ననిపెను. సేవకుఁడు వోయి వత్సరాజు నిర్దేశ మెరింగించుటయు జడియుచు నా యొజ్జ లతిజపంబుల నచ్చటి కరుదెంచెను. వత్సరాజు నమస్కరించుచు తాతా ! పండితప్రవర ! ఇందు గూర్చుండుము జయంతకుమారుఁ డేమిచేయుచున్నవాడు. అని యడిగిన భోజకుమారునితోఁ గలసి యేదియో చదువుచున్నాఁడని చెప్పెను.

ఒక్కసారి యిచ్చటికి రప్పింపుమని చెప్పిననతండు తన శిష్యునంపి పిలిపించెను. అట్లు వచ్చిన జయంతకుమారుని జూచి వత్సరాజు ఏదియో యడిగి పంపి భోజకుమారునిగూడ రప్పింపుమని చెప్పెను. అత్తెరంగు విని బోజుఁడు మిక్కిలి యలుకతో ----------గన్ను లెర్రజేయుచు నోరీ దుర్మతీ ! నన్నిక్కడకు రప్పించు టకు నీ వెవ్వఁడవు రాజపుత్రుడనని యెరుగవా? యని పలుకుచు వామచరణపాదుకం గైగొని తాలుదేశంబునం గొట్టెను.

అప్పు డాదండనాధుండు రాజపుత్రా ! నే నిట్లు పిలిపించలేదు. రాజశాసన మిదిగోచూడుము. భర్తృదారకుఁడవనియే గౌరవించితినని పలుకుటయు భోజుండు శాసనముఁజూచి ముకుళితనయనాం భోజుండై యొక్కింత తడవుధ్యానించి మంచిదిపోవుదము. పదమని యానతిచ్చి యప్పుడే యా రధమెక్కెను. వత్సరాజు చేత ఖడ్గంబు ధరియించి యతనితోఁగూడ రధమెక్కి భువనేశ్వరీ విపినాభిముఖముగా రథముఁ దోలించెను. అప్పుడు ప్రజలు రాజ్యలోభంబునఁ జేసి పినతండ్రి భోజకుమారుఁ జంపింపఁ బంపుచున్నాఁడని కోలాహలముగా వీధులఁ జెప్పుకొన మొదలు పెట్టిరి. మరియు రాజమార్గముల బౌరులు గుమిగూడి యేమి యేమని యడుగు వారును ముంజున కింతదుర్ణయము కూడదనువారును ఉత్తమ గుణసంపన్నుండైన బోజకుమారుజంపించి ముంజుండు వెండియు రాజ్యముఁ జేయఁగలఁ డాయనువారును, ఇట్టిఘోరకృత్యము రాజు చేయుచుండఁ బ్రజ లూరకొన రాదనువారును, హుం కారములు చేయువారును, బ్రతాపములు పలుకువారునునై నలుదెసలకుఁ బరుగిడుచుండిరి. వీరభటులు గజశాలలకు వాణిశాలలకుంబోయి యల్లరి చేయుచుండిరి. సింధునిపై నభిమానముగల దాసదాసిజనంబు లూరక దుఃఖింపుచుండిరి.

భోజకుమారునితల్లి సావిత్రి దాసీముఖముగా నా వార్తవిని యురముఁ బాదుకొనుచుఁ దండ్రీ ! నీవు నీ పినతండ్రి కేమి యపకారము జేసితివి ? నిష్కారణము నిన్నతం డేమిటికిఁజంపఁ బంపెను. నీ సుగుణంబు లతనికి విపరీతము లయ్యెనా ? అయ్యో ? నే నోచిననోము లన్నియు నిష్పలములగునని యెరుంగను గదా? నీ వెప్పుడో పట్టాభిషిక్తుండ వగుదువని దినములు లెక్క పెట్టుచుంటి. పుత్రా ! నీయాయు వింతలో నంతమైనదియా ? నీకుఁ జక్కనికన్య నరయు చుంటినిగదా ! నాతోఁ జెప్పియైన పోయితివి కావేమి? నన్నును శత్రురాలిగాఁ దలంచితివా? పట్టీ ! నీ తండి నీపైఁ బ్రాణములు వెట్టికొనియే మృతి నొందిరిగదా ? నీ కిట్టిరట్టు గలుగునని కలలోనైనా దలంచనైతినని యనేక ప్రకారముల గురయుంబోలె వా పోవుచుండ వారించుచు నొకదాది అమ్మా ! ఆ మాట సత్యమో యసత్యమో యింకను విచారింపవలయును. ఊరక వీధులవెంబడి చెప్పుకొనుటయే కాని చూచినవారు లేరు. సత్య మెఱింగిన వారొక్కరును జెప్పరని పలుకుచు నూరడించినది. అప్పు డా యిల్లాలు తల్లీ ! చల్లనిమాటలు పలికితివి. నీ మాట సత్యమైనచో మంచికానుక లిప్పింతునుగదా! నీవు వోయి యందలి నిజానిజంబులం దెలిసికొనిరమ్ము. పొమ్ము. నీ రాక వేచియుందునని యాపరిచారికనంపి దైవమున కనేక నమస్కారములు చేయుచున్నది.

అని యెఱింగించి యప్పటికథ ముగించి పై మజిలీయందు మరియు నతండిట్లని చెప్పెను.